E-Rickshaw
-
ఈ–టూవీలర్లపై 10 వేలు
న్యూఢిల్లీ: త్వరలో అమల్లోకి రానున్న పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులు తొలి ఏడాదిలో గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీని పొందవచ్చని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఈ స్కీమ్ ప్రకారం ఎలక్ట్రిక్ టూ–వీలర్ల విషయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యూహెచ్) సబ్సిడీని రూ. 5,000గా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, తొలి ఏడాది ఇది మొత్తమ్మీద రూ. 10,000కు మించదు. రెండో ఏడాది ఇది కిలోవాట్ అవర్‌కు సగానికి తగ్గి రూ. 2,500కు పరిమితమవుతుంది. మొత్తమ్మీద సబ్సిడీ రూ. 5,000కు మించదు. ఇక, ఈ–రిక్షా కొనుగోలుదారులు తొలి ఏడాది రూ. 25,000 వరకు, రెండో ఏడాది రూ. 12,500 వరకు సబ్సిడీ ప్రయోజనాలు పొందవచ్చని కుమారస్వామి చెప్పారు. కార్గో త్రీ వీలర్లకు తొలి ఏడాది రూ. 50,000, రెండో ఏడాది రూ. 25,000 సబ్సిడీ లభిస్తుంది. స్కీమ్ ప్రకారం పీఎం ఈ–డ్రైవ్ పోర్టల్‌లో ఆధార్ ఆధారిత ఈ–వోచర్ జారీ అవుతుంది. కొనుగోలుదారు, వినియోగదారు దానిపై సంతకం చేసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ప్రోత్సాహకాన్ని పొందేందుకు కొనుగోలుదారు సెల్ఫీని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 25 లక్షల టూ–వీలర్లకు.. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రూ. 3,679 కోట్ల మేర సబ్సిడీలు/ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. మొత్తం మీద 24.79 లక్షల ఈ–టూవీలర్లు, 3.16 లక్షల ఈ–త్రీ వీలర్లు, 14,028 ఈ–బస్సులకు స్కీముపరమైన తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఓలా, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, హీరో విడా, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల శ్రేణి రూ. 90,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు ఉంది. ఈవీల వినియోగానికి ప్రోత్సాహం.. పీఎం ఈ–డ్రైవ్ స్కీమును ఆటోమొబైల్ దిగ్గజాలు స్వాగతించాయి. ఈవీల వినియోగం జోరందుకుంటుందని, ఫాస్ట్ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం కూడా ఈవీలపై వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందిస్తుందని మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. ఉద్గారాల విషయంలో వేగంగా తటస్థ స్థాయిని సాధించేందుకు స్కీమ్ ఉపయోగపడుతుందని టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వాఘ్ చెప్పారు. ఈవీ రంగం వేగంగా విస్తరించేందుకు పథకం తోడ్పడుతుందని ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్ తెలిపారు. -
రిక్షానే ఆసరాగా.. 'చినాబ్ లోయలోనే' తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా..
'జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా, పరిమళాలు వెదజల్లే పూలపాన్పులా ఉండదు. తమకున్న వనరులను ఉపయోగించుకుని పైగి ఎదగడానికి ప్రయత్నించి పెద్దవాళ్లు అయిన వాళ్లే ఎక్కువ. వీరు ఎంతోమందికి ప్రేరణగా కూడా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే మీనాక్షి దేవి. జీవితాన్ని కష్టాల సుడిగుండంలో కొట్టుకుపోనివ్వకుండా.. ఈ–రిక్షా లాగుతూ కుటుంబానికి జీవనాధారంగా మారింది. ఇలా తనకెదురైన కష్టాలకు ఎదురీదుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి దేవి.' జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లా భదర్వా టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మీనాక్షి జీవితం ఏడాది క్రితం వరకు ఆనందంగా సాగింది. భర్త పమ్మి శర్మ, ఇద్దరు పిల్లలతో ఎంతో చక్కగా సాగిపోతున్న వీరి సంసారంలో అనుకోని ఉపద్రవం ఏర్పడింది. మీనాక్షి భర్తకు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్సకోసం అనేక ఆసుపత్రులు తిరిగారు. మెడికల్ బిల్లులు పెరిగాయి కానీ సమస్య తీరలేదు. ఈ క్రమంలో వారు దాచుకున్న డబ్బులు మొత్తం ఆవిరైపోయాయి. ఉన్న కారు అమ్మేసి, వ్యాపారాన్ని మూసేసి అప్పులు తీర్చినా ఇంకా కొన్ని అప్పుల భారం అలానే ఉండిపోయింది. ఏ దారీ దొరక్క.. భర్త సంపాదించే స్థితిలో లేకపోవడంతో మీనాక్షి దేవి కుటుంబ పోషణ కోసం పని వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ తను చేయగలిగింది దొరకలేదు. ఈఎమ్ఐ ద్వారా కొన్న ఆటో ఒకటి ఇంట్లో ఉండడంతో అప్పుడప్పుడు పమ్మిశర్మ మీనాక్షికి సరదాగా ఆటో నేర్పించేవాడు. అప్పటి డ్రైవింగ్ స్కిల్స్‌ను మరింత మెరుగు పరుచుకుని ఆటో నడపాలనుకుంది మీనాక్షి. ఆమె కోరిక మేరకు ఆటో నడపడాన్ని పూర్తిస్థాయిలో నేర్పించాడు ఆమె భర్త. ఆ తరువాత సబ్సిడీలో ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోని, దాన్ని నడపడం ప్రారంభించింది మీనాక్షి. దానిమీద వచ్చిన డబ్బులతో భర్త మెడికల్ బిల్స్ కట్టడంతోపాటు, కొడుకులిద్దరి బాగోగులను చూసుకుంటోంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో ఆటో డ్రైవర్‌గా మారిన మీనాక్షి దేవి చినాబ్ లోయలోనే తొలి ఈ–రిక్షా మహిళా డ్రైవర్‌గా నిలవడం విశేషం. మరో ఆప్షన్ లేక.. "ప్రారంభంలో ఆటో నడుపుతానన్న నమ్మకం మీనాక్షికి లేదు. రద్దీగా ఉండే భదర్వా టౌన్లో ఆటో నడపడానికి చాలా భయపడేది. కుటుంబం గడవడానికి మరో గత్యంతరం లేదు. అందుకే ఎంతో కష్టపడి, ధైర్యంగా ఆటో నడపడం నేర్చుకుని అండగా నిలుస్తోంది. మీనాక్షిని చూస్తే నాకు తృప్తిగానే గాక, గర్వంగానూ ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న మెడికల్ బిల్స్ నన్ను తీవ్రంగా కుంగతీసేవి. ఒక దశలో తీవ్ర నిరాశకు లోనై.. పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళన పడేవాడిని. నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. ఎంతకాలం ఉంటానో కూడా తెలియని పరిస్థితుల్లో నా భార్య ఆటో నడుపుతూ నాకు మానసిక ప్రశాంతతను కల్పిస్తోంది" అని మీనాక్షి భర్త ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ‘‘నాలుగు నెలల క్రితం తొలిసారి ఆటోతో ఆటోస్టాండ్‌లో అడుగు పెట్టాను. అక్కడ ఉన్న మిగతా డ్రైవర్లంతా నన్ను ఒక ఏలియన్లా చూశారు. కొంతమంది అయితే ఈమె కస్టమర్లను భద్రంగా ఇంటికి తీసుకెళుతుందో లేదో అంటూ చెవులు కొరుక్కునేవారు. లేదు. ఇరుగు పొరుగు, బంధువులు ఆటో నడపవద్దు అని నిరుత్సాహ పరిచారు. కానీ ఇది నా కుటుంబ జీవనాధారం. అందుకే నేను ఎవరి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగాను. రోజురోజుకీ నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నాను’’ అని మీనాక్షి సగర్వంగా చెబుతోంది మీనాక్షి దేవి. ఇవి చదవండి: Invest the Change: ఆ అ అలా మొదలైంది ఆర్థిక అక్షరాస్యత -
నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు!
ఆమె భర్త ఏ పనిచేస్తాడో? అసలు పనిచేస్తాడో లేదో కూడా తెలియదు. ఆమె మాత్రం బతుకుదెరువు కోసం ఇ–రిక్షా నడుపుతుంది. ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో పిల్లాడిని ఒళ్లో పడుకోబెట్టుకొని ఇ–రిక్షా నడుపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమె వీడియో క్లిప్ 2.8 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులను భావోద్వేగానికి గురి చేసింది. ‘ఈ వీడియో చూసి నా గుండె చెరువు అయింది’ ‘ఆమె చాలా రిస్క్ తీసుకుంటోంది. పిల్లాడిని బేబీ కేర్ సెంటర్లో చేరిస్తే మంచిది’ ‘దగ్గర్లో ఉన్న దాతలు ఎవరైనా ఆమెకు బేబీ క్యారియర్ ఇప్పిస్తే బాగుంటుంది’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు. -
బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు!
లండన్: నేరాల కట్టడికి ప్రపంచమంతటా పోలీసులు గాలితో పందెం వేస్తూ దూసుకెళ్లే అత్యాధునిక వాహనాలను వాడుతున్నారు. కానీ బ్రిటన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా టుక్‌టుక్ (ఈ–రిక్షా)లను రంగంలోకి దించుతోంది. వేల్స్‌లోని గ్వెంట్ కౌంటీ పోలీసులు ఇప్పటికే నాలుగు టుక్‌టుక్‌లు కొనుగోలు చేశారు. స్థానిక న్యూపోర్ట్, అబెర్గ్రావెనీ ప్రాంతాల్లో ర్రాతి వేళల్లో పార్కులు, వాక్‌వేలు, బహిరంగ స్థలాల్లో గస్తీకి వాటిని వాడుతున్నారు. నేరాలు జరిగితే సమీపంలోని ఏ టుక్టుక్నైనా సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. వీటిపై ప్రజల నుంచి విపరీతమైన సానుకూల స్పందన వస్తోందట! అయితే ఈ టుక్‌టుక్‌ల గరిష్ట వేగాన్ని గంటలకు 55 కిలోమీటర్లకు పరిమితం చేయడం మరో విశేషం. ఈ–రిక్షాల సేకరణకు మహీంద్రా ఎలక్ట్రిక్‌తో గ్వెంట్ పోలీసు విభాగం భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: ఫోటో వైరల్
భర్త నిరాధరణకు గురైతే ఆ స్త్రీ పరిస్థితి వర్ణానాతీతం. అందులోనూ పిల్లల తల్లి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక్కడొక ఒక మహిళ కూడా అలానే ఏడాది చిన్నారితో జీవన పోరాటం సాగిస్తోంది. వివరాల్లోకెళ్తే...చంచల్ శర్మ అనే మహిళ ఏడాది వయసు ఉన్న కొడుకుని నడుంకి కట్టుకుని మరీ ఈ రిక్షాని నడుపుతోంది. ఐతే ఒక మహిళ ఇలా డ్రైవింగ్ చేయడాన్ని స్థానిక ఈ రిక్షా డ్రైవర్లు నిరాకరించారు. అంతేగాదు ఆమె నోయిడాలోని ఒక నిర్ధిష్ట రహదారిలో డ్రైవ్ చేసేందుకు కూడా ససేమిరా అంటూ గొడవ చేశారు. ఐతే ఆమె ట్రాఫిక్ పోలీసులు, ఏ1బీ అవుట్ పోస్ట్ సిబ్బంది మద్దతుతో సమస్యలను అధిగమించింది. సదరు మహిళ భర్త ఆమెను వేధింపులకు గరిచేయడంతో అతన్ని వదిలేసి వచ్చి తన కాళ్లపై తాను గౌరవప్రదంగా జీవించేందుకు తాపత్రయ పడుతోంది. ఆ క్రమంలోనే ఆమె ఈ రిక్షా డ్రైవర్‌గా జీవనోపాధిని ఎంచుకుంది. లాల్ కువాన్‌కి చెందిన చంచల్ శర్మ కొన్ని రోజులు తన తల్లి లేదా చెల్లితో కలిసి ఉంటానని వెల్లడించింది. ఈ మేరకు చంచల్ శర్మ మాట్లాడుతూ...మూడేళ్ల క్రితం 2019లో దాద్రీలోని ఛయాన్సా గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత నుంచి చిత్రహింసలకు గురి చేసి వేధించడంతో పుట్టింటికి వచ్చేసినట్లు తెలిపింది. తన భర్త పేరు చెప్పేందుకు కూడా ఇష్టపడలేదు. కోర్టులో కేసు నడుస్తోందని కూడా చెప్పింది. తన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయాడని, తనకు నలుగు చెల్లెళ్లు ఉన్నారని చెప్పింది. ఆమె తల్లి కూరగాయాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటుందని తెలిపింది. (చదవండి: నాకు 30 ఆమెకు 12 అంటూ... షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బైడెన్) -
రిక్షా డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ: వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్: చిన్నప్రమాదానికి పెద్ద రాద్ధాంతం చేసింది నోయిడాలోని ఒక మహిళ. నోయిడాలోని ఒక రిక్షా డ్రైవర్ ఆమె కారు పైకి పొరపాటున తన రిక్షాని పోనిచ్చాడు. అంతే ఒక్కసారిగా ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. సదరు రిక్షా డ్రైవర్ కాలర్ పట్టుకుని లాక్కెళ్లుతూ దుర్భాషలాడింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని పదేపదే చెంపదెబ్బలు కొట్టడం ప్రారంభించింది. అతని జేబులోంచి డబ్బులు కూడా లాక్కొని అదేపనిగా చెంపదెబ్బలు కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు రికార్డు చేయడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు సదరు మహిళని కిరణ్ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. Incident from NOIDA: A WOMAN slapped a poor e-rickshaw driver. 17 slaps in less than 90 seconds, she constantly kept abusing the poor e-rickshaw wala. #PurushAayog demands strict action against the woman for taking law in her hand !!@noidapolice#DomesticViolenceOnMen pic.twitter.com/u2VbarbNW9 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) August 13, 2022 (చదవండి: కారుపై 'హర్ ఘర్ తిరంగ' థీమ్‌తో హల్చల్ చేస్తున్న యువకుడు) -
జనరల్నాలెడ్జ్ ఉంటే చాలు!... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోవచ్చు!!
Bengal E-Rickshaw Driver Gives Free Rides: కొన్ని కొన్ని విషయాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అనిపించక మానదు. అచ్చం అలానే ఇక్కడొక ఆటోవాలా తన వింతైన తీరుతో అందరి మనసులు దోచుకున్నాడు. (చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్) అసలు విషయంలోకెళ్లితే...బెంగాల్‌లోని లిలుహ్ (హౌరా జిల్లా)లోని ఈ రిక్షా డ్రైవర్ సురంజన్ కర్మాకర్ ప్రయాణికులను తాను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే ఉచితంగా డ్రాప్ చేస్తానంటూ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఒక జంట సంకలన్ సర్కార్ అతని భార్య ఇద్దరూ సురంజన్ ఆటో ఎక్కుతారు. సురంజన్ వెంటనే తానడిగే 15 జీకే ప్రశ్నలకు జవాబు చెబితే మిమ్మల్ని ఉచితంగా తీసుకువెళ్తానంటాడు. దీంతో ఆ జంట ఆ డ్రైవర్ సురంజన్ తీరు చూసి ఒక్కసారిగా షాక్‌కి గురువుతారు. అయితే ఆ జంట అతని ప్రశ్నలేంటో తెలుసుకుందామనే ఆసక్తితో అతని ఆటో ఎక్కుతారు. ఆ తర్వాత సురంజన్ ప్రశ్నల పరంపర చాలా రసవత్తరంగా సాగుతుంటుంది. అతను జీకేలో అన్నింటిని టచ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే ప్రయాణికుడు సంకలన్ మొదటగా ఈ డ్రైవర్ తన సంపాదనతో సంతృప్తి చెందక ఇలా ప్రయాణికులను ప్రశ్నలడిగి ఒకవేళ వాళ్లు సరైన సమాధానం చెప్పకపోతే అధిక చార్జీలు వసూలు చేద్దాం అని ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు. అయితే ఈ క్విజ్ అయిపోయిన వెంటనే డ్రైవర్ సురంజన్ మాట్లాడుతూ... "ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను ఆరవ తరగతి వరకు చదువుకున్నాను. అయితే నాకు ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉంది. అంతేకాదు లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్‌లో సభ్యునిగా ఉన్నాను. మీరు నన్ను గూగుల్‌లో 'అద్భుత్ తోటివాలా'గా కూడా చూడవచ్చు" అని అన్నాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..) -
గ్రేట్ జర్నీ స్టీరింగ్ ఉమన్
ఆమె ఆటో రిక్షా నడుపుతుంటే ఆ పట్టణంలోని పిల్లలు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు... ఇలా కూడా ఉంటుందా? అన్నంత విచిత్రంగా చూస్తారు. నిజమే... వాహనం స్టీరింగ్ ఆడవాళ్ల చేతిలో ఉండడం అంటే వాళ్లకు ప్రపంచంలో ఎనిమిదో వింతను చూడడమే. నడివయసు మగవాళ్లైతే ఆ దృశ్యాన్ని కళ్లెర్రచేసి చూస్తారు. ఆమె తల్లిదండ్రులను, భర్తను తలుచుకుని ఆడపిల్లను ఎలా పెంచాలో, స్త్రీ పట్ల ఎంతటి కట్టుబాట్లు పాటించాలో తెలియని మూర్ఖులు అన్నట్లు ఓ చూపు చూసి, తమ ఇంటి ఆడవాళ్లను గూంగట్ చాటున దాచిన తమ ఘనతను తలుచుకుని మీసం మీద చెయ్యేసుకుంటారిప్పటికీ. ఈ సంప్రదాయ సంకెళ్లను ఛేదించింది నలభై ఏళ్ల మాయా రాథోడ్. ఒక్క సంప్రదాయ సంకెళ్లను మాత్రమే కాదు, పోలియో బారిన పడిన అమ్మాయి జీవితం అక్కడితో ఆగిపోదని, సంకల్పం, పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే బతుకుపథంలో అడుగులు చక్కగా వేయవచ్చని కూడా నిరూపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం కూడా ప్రముఖం గా గుర్తించాల్సిందే ఉంది. కాలుష్య రహిత సమాజ స్థాపనలో భాగంగా కాలుష్యాన్ని విడుదల చేసే ఆటోరిక్షాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టినప్పుడు మగవాళ్లు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ పట్టుకోవడానికి సాహసించలేదు. అలాంటప్పుడు మాయా రాథోడ్ వేసిన ఓ ముందడుగు ఇప్పుడు రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో పలువురికి స్ఫూర్తినిస్తోంది. అక్కడి మహిళలకు మాయా రాథోడ్ ఓ రోల్ మోడల్ అయింది. బహుముఖ పోరాటం మాయా రాథోడ్ ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడింది. అసలే ఆడపిల్లలు బతికి బట్టకట్టడం కష్టమైన రాజస్థాన్ రాష్ట్రం. ఆడపిల్లలను బడికి పంపించమని ప్రభుత్వాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం. అలాంటి చోట మాయా రాథోడ్ బతుకు పోరాటం చేసింది. ఏకకాలం లో పోలియోతోనూ సమాజంతోనూ పోరాడింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ జీతంతో బతుకు కుదుట పడడం కుదిరే పని కాదని కూడా త్వరలోనే అర్థమైందామెకు. భర్త సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే తప్ప పిల్లల భవిష్యత్తుకు మంచి దారి వేయలేమని కూడా అనుకుంది. అదే సమయంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను సబ్సిడీ ధరలో ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ క్షణంలో మాయా రాథోడ్ తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. బ్యాంకు లోన్ తీసుకుని ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా తీసుకున్నది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆ క్షణం నుంచి ఆమెను సంప్రదాయ సమాజం విమర్శన దృక్కులతో వేధించింది. అభివృద్ధి పథం లో నడవాలనుకున్న సమాజం ఆమెను ఆదర్శంగా తీసుకుంది. ఆమె మాత్రం... ‘మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్న రోజులివి. ఆటో రిక్షా నడపడాన్ని కూడా ఆక్షేపించే రోజులు కావివి. ఆటో నడపడం నాకు వచ్చో రాదో అనే సందేహాలు వద్దు. నా ఆటోలో ప్రయాణించి చూడండి’ అని సవాల్ విసురుతోంది. ఈ మూడేళ్లలో బిల్వారాలో మంచి మార్పే వచ్చింది. చిల్లర దొంగతనాలు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో రాత్రిళ్లు మగవాళ్ల ఆటోలో ప్రయాణించడం కంటే మాయ ఆటోలో ప్రయాణించడానికి ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా ఇష్టపడుతున్నారు. -
పీకల దాకా మద్యం.. ఇద్దరి ప్రాణాలు తీశాడు
ఢిల్లీ: డ్రైవరు పీకలదాకా మద్యం తాగి కారు నడపడం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని డిలైట్ సినిమా హాలు వద్ద డ్రైవరు మద్యం తాగి కారును వేగంగా నడుపుతూ ఓ కుటుంబం ప్రయాణిస్తున్న ఈ-రిక్షాను ఢీకొట్టాడు. ఈ రోడ్డు ప్రమాదంలో ఈ-రిక్షా డ్రైవర్‌తోపాటు ఓ మహిళ మరణించారు. ప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ-రిక్షాలో ఉన్న భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు పారిపోతుండగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. మద్యం తాగి కారును వేగంగా నడపటం వల్లనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం; 10 మంది మృతి వీడియో వైరల్: వేలు చూపిస్తూ వార్నింగ్, అంతలోనే తుపాకీతో.. -
హెచ్‌సీయూలో రిక్షాల లొల్లి
గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ క్యాంపస్‌లో మొదటిసారిగా ఈ రిక్షాల రవాణా ప్రారంభమైంది. విద్యార్థులు నిర్ణీత చార్జీలు చెల్లించి క్యాంపస్‌లో రాకపోకలు సాగించాలి. ఇప్పటి వరకు క్యాంపస్‌లో ఉచిత బస్సు సౌకర్యం ఉంది. బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూనే ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. సాక్షి, రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ప్రస్తుతం విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది కలిపితే 6 వేలకుపైగా ఉంటారు. రవాణా సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు ప్రైవేటు సంస్థకు అనుమతించారు. ఈ–రిక్షాలను బెంగుళూరుకు చెందిన మెజర్స్ ట్రాన్స్వాహన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘ఓన్, ఆపరేట్ అండ్ మెయింటెన్’ పద్ధతిన నిర్వహిస్తారు. అయితే రవాణాను ప్రైవేట్‌పరం చేసి విద్యార్థులపై భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఏఏ మార్గాల్లో... ఈ రిక్షాలు హెచ్‌సీయూ క్యాంపస్‌లో రెండు ప్రాంతాలలో అందుబాటులో ఉంటాయి. మెయిన్‌గేటు నుంచి సౌత్ గేటు వరకు, సౌత్ క్యాంపస్ గేటు నుంచి మసీదుబండగేటు (స్మాల్ గేట్) వరకు ఉంటాయి. అక్కడి నుంచి తిరిగి అదేమార్గాల్లో అందుబాటులో ఉంటాయి. వేళలు... సోమవారం నుంచి శనివారం వరకు తిరుగుతాయి. ఆయా రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. డిజిటల్ మోడ్‌లోనే చెల్లించాలి... ఈ రిక్షాలకు డబ్బుల చెల్లింపులన్నీ డిజిటల్ మోడ్‌లోనే ఉంటాయి. ఒక ట్రిప్పునకు రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విద్యార్థులు, ఫ్యాకల్టీ, స్టాఫ్, సందర్శకులు కూడా వినియోగించుకొనే అవకాశం కల్పించారు. దివ్యాంగులకు ఉచితం ఈ రిక్షాలలో దివ్యాంగ విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. వారు యూనివర్శిటీ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ రిక్షాలను తిరగనివ్వం క్యాంపస్‌లో విద్యార్థులకు ఈ–రిక్షాలలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. ఇతరులకు చార్జీలు వసూలు చేసినా అభ్యంతరం లేదు. విద్యార్థులపై భారం వేసే ఎలాంటి చర్యలనూ అంగీకరించం. ఇప్పటికే రిజిష్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రాలను సమర్పించాం. త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. లేదంటే ఈ–రిక్షాలను వర్సిటీలో తిరగనివ్వం. – ఎం.శ్రీచరణ్, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు విద్యార్థులపై భారం తగదు క్యాంపస్‌లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఆర్థిక భారం మోపేలా ఈ రిక్షాలను ప్రైవేశపెట్టారు. స్కాలర్షిప్ రూ. 750 మాత్రమే ఇస్తూ ఇలాంటి భారం మోపడం తగదు. ఒక్కో విద్యార్థి కనీసం నాలుగు సార్లు హాస్టల్ నుంచి బయట తిరిగితే రోజుకు రూ. 50 మేర రవాణా చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇక మెస్, ఇతర ఖర్చులను ఎలా భరిస్తారు? ఈ చర్యను వెంటనే ఉపసంహరించాలి. లేదంటే గత్యంతరం లేక ఉద్యమించాల్సి ఉంటుంది. – పి సందీప్, డీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి, హెచ్‌సీయూ -
ఎలక్ట్రిక్ త్రీవీలర్లు.. ‘ఫేమ్’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల పైచిలుకు త్రీవీలర్లు తయారవుతున్నాయి. ఇందులో సుమారు 65 శాతం వాహనాలు దేశీయంగా అమ్ముడవుతున్నాయి. ఫేమ్–2 కింద ఇప్పుడు 5,00,000 ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం ఇవ్వనుండడంతో ఈ రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయని కంపెనీలు అంటున్నాయి. ఒక్కో వాహనానికి బ్యాటరీ రకాన్నిబట్టి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఉండడంతో ఈ ఏడాది నుంచి అమ్మకాలు జోరుమీదుంటాయని చెబుతున్నాయి. 2020 నుంచి ఏటా అమ్ముడయ్యే త్రీవీలర్లలో 25% ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని పరిశ్రమ ధీమాగా ఉంది. ఫేమ్–టూ జోష్‌తో కొత్త మోడళ్ల రూపకల్పన, తయారీ సామర్థ్యం పెంపు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కంపెనీలు దృష్టిసారించాయి. పట్టణాల్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఎలక్ట్రిక్ త్రీవీలర్లే ఉత్తమ పరిష్కారమని డెలాయిట్ తన నివేదికలో వెల్లడించింది. ఇదీ భారతీయ పరిశ్రమ.. సంప్రదాయ సైకిల్ రిక్షాల స్థానంలో క్రమంగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ రిక్షాలు వచ్చి చేరుతున్నాయి. భారత్‌కు ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా, అమ్మకాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దేశంలో 15 లక్షల పైచిలుకు ఎలక్ట్రిక్ త్రీవీలర్లు పరుగెడుతున్నాయి. 2017–18లో కొత్తగా 3.5 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి. మహీంద్రా, గోయెంకా, ట్రినిటీ క్లీన్టెక్, కినెటిక్ ఇంజనీరింగ్ వంటి 15–20 కంపెనీలు దీర్ఘకాలిక లక్ష్యంతో రంగంలోకి దిగాయి. వచ్చే ఏడాదికల్లా బజాజ్ ఆటో, పియాజియో ఈ విపణిలోకి అడుగుపెట్టనున్నాయి. చెనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని విక్రయించే కంపెనీలు సుమారు 200 దాకా ఉంటాయి. ఉత్తర, తూర్పు భారత్‌లో ఈ–రిక్షా, ఈ–ఆటోలకు డిమాండ్ ఎక్కువ. ఫేమ్–2తో దక్షిణాదిలోనూ వీటి అమ్మకాలు పెరగనున్నాయి. ఓలా 10,000 ఈ–రిక్షాలను రంగంలోకి దింపుతోంది. కిలోమీటరుకు రూ.1.50.. త్రిచక్ర వాహనం కిలోమీటరు తిరిగినందుకు అయ్యే వ్యయం పెట్రోల్ వేరియంట్ అయితే రూ.4, డీజిల్ రూ.3.50 అవుతోంది. అదే ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌కు వ్యయం కిలోమీటరుకు రూ.1.50 మాత్రమేనని గోయెంకా ఎలక్ట్రిక్ మోటార్ వెహికిల్స్ సీఈవో జాఫర్ ఇక్బాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే బ్యాటరీ ఖరీదు ఇప్పుడు 20–25%కి వచ్చి చేరిందని చెప్పారు. హైదరాబాద్‌లో తమ కంపెనీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోం దని వెల్లడించారు. వాహన యజమానులు తమ వాహనానికి బ్యాటరీ వినియోగించినందుకు నెలవారీ చందా చెల్లిస్తే చాలని వివరించారు. ఈ–త్రీవీలర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిసారిస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ ఈడీ నాగ సత్యం తెలిపారు. రిజిస్ట్రేషన్ల విషయంలో అడ్డంకులు తొలగించాలని కోరారు. డీజిల్ ఆటోల కొత్త అనుమతులకు బదులు ఎలక్ట్రిక్ త్రీవీలర్ ఉండాలన్న నిబంధన రావాలన్నారు. ఈ–రిక్షాలకూ అనుమతి..! గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వేళ్లే ఈ–రిక్షాలకు ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన రహదారుల్లో అనుమతి లేదు. 25 కిలోమీటర్ల కంటే అధిక వేగం ఉన్న ఈ–ఆటోలకే అనుమతి ఉంది. ఢిల్లీ మెట్రోలో రోజూ 30 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఇందులో 50–60 శాతం మంది 3 లక్షల పైచిలుకు ఈ–త్రీవీలర్లలో గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇక హైదరాబాద్ మెట్రోలో రోజూ 2 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఇంతే సంఖ్యలో ఎంఎంటీఎస్‌లో వెళ్తున్నారు. ప్రధాన రహదారులు మినహా ఇతర ప్రాంతాలకు ఈ స్టేషన్ల నుంచి వెళ్లే మార్గాల్లో ఈ–రిక్షాలకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు కోరుతున్నాయి. చిన్న రోడ్లలో వెళ్లేందుకు పెద్ద వేగం అక్కర లేదన్నది కంపెనీల వాదన. ట్రినిటీ క్లీన్టెక్ ఈటో బ్రాండ్ ఈ–ఆటోలను మెట్రో స్టేషన్ల నుంచి త్వరలో నడుపనుంది. -
ఈ–రిక్షా మేడిన్ జనగామ
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో కాలుష్య రహిత ఈ–రిక్షాలను తయారు చేస్తున్నారు. ఢిల్లీ, వారణాసి తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ ఈ–రిక్షాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. జనగామకు చెందిన పెద్ది రవీందర్ పెంబర్తి రోడ్డులో ఈ–రిక్షా తయారీ కేంద్రాన్ని ప్రారంభిం చారు. చెనా, ఢిల్లీ, చైన్నై ప్రాంతాల నుంచి ముడిసరుకులను తీసుకువచ్చి ఇక్కడే ఈ– రిక్షాలను తయారు చేయిస్తున్నారు. ఫ్రేమ్స్, డూమ్‌లు, మోటార్లు, చార్జర్లు, కంట్రోల్ ప్యానెల్, బ్యాటరీ, వైరింగ్, ఎల్ఈడీ లైట్లను దిగుమతి చేసుకొని సొంతంగా తయారీని ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 ఈ–రిక్షాలను తయారు చేశారు. ప్యాసింజర్, గూడ్స్ రిక్షాలు.. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఈ–రిక్షాల్లో ప్రయాణికులను తరలించడానికి ఈ–రిక్షా, వస్తువులను రవాణా చేయడానికి ఈ–కార్ట్ రిక్షాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు. ప్యాసింజర్ రిక్షాలో ఐదుగురు కూర్చోవడా నికి వీలుగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ–కార్డ్ రిక్షాలో 4 క్వింటాళ్ల బరువు వరకు రవాణా చేయడం వీలవుతుంది. కాగా, ప్యాసింజర్ ఆటోను రూ. 1.10 లక్షలకు విక్రయిస్తే, గూడ్స్ ఆటోను లక్ష రూపాయలకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపారు. 4 గంటలు చార్జింగ్.. ప్రయాణం 80 కిలోమీటర్లు.... ఈ–రిక్షాకు 4 గంటల పాటు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలు ఉంటుంది. అంతేకాకుండా రేర్మిర్రర్, స్పీడో మీటర్, ఇండికేటర్, సౌండ్ సెట్టింగ్ వంటి సదుపాయాలన్నీ ఇందులో పొందుపరిచారు. అనుమతులు అక్కర్లేదు.. ఈ–రిక్షాలను నడపడం కోసం ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. గేర్లు లేకుండానే వాహనం నడిపే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ కూడా లేదు. -
'వారి కోసం పనిచేస్తే ఎంతో ఆనందం'
వారణాసి: పేదల ప్రజల సాధికారతకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం తన నియోజకవర్గం వారణాసిలో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఈ-రిక్షాలు, ఈ-పడవలు అందజేశారు. సంక్షేమ పథకాలతో నిరుపేదలు బలోపేతం కావాలని, ఓటు బ్యాంకు కాదని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. పేదలకు చేయూతనిస్తే పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన'తో బ్యాంకులు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. పేద ప్రజల అభ్యన్నతి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. వారణాసిలో ఈ- రిక్షా, ఈ-పడవల్లో మోదీ ప్రయాణించారు. అంతకుముందు బాలియాలో 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు పంపిణీ చేశారు. 5 కోట్ల మంది పేదలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. -
ఈ-ఆటో రిక్షాలను ఎక్కుదామా?
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దోహదపడడమే కాకుండా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే ఈ-ఆటోరిక్షాల ఉత్పత్తిని ‘ఓకే ప్లే ఇండియా’ కంపెనీ ప్రారంభించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఈ-ఆటోరిక్షాను తయారు చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు చైనా నుంచి దిగుమతి చేసుకునే పరికరాలతోనే ఈ-ఆటో రిక్షాలను తయారు చేస్తున్నారు. ఆట బొమ్మలను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన ఓకే ప్లే ఇండియా, ఆటో మొబైల్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్న విషయం తెల్సిందే. పరిశ్రమలో రెండేళ్లపాటు పరిశోధనలు చేసి దీన్ని తయారు చేసినట్టు కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ రాజన్ హండా మీడియాకు తెలిపారు. ఆటోరిక్షాకు అనుసంధానించే మోటార్ బైక్ మినహా మిగతా బాడీ అంతా ప్లాస్టిక్‌తోనే తయారు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సామాగ్రిని పెట్టుకోవడంగానీ, డ్రైవర్ కూడా తనకు అవసరమైన సామాగ్రిని చక్కగా అమర్చుకోవడానికి వీలుగా బాడీని తీర్చిదిద్దామని ఆయన వివరించారు. హర్యానాలోని సొహ్నా వద్ద, తమిళనాడులోని రాణిపేట్‌లో ఏర్పాటు చేసిన తమ ప్లాంటులకు ఏడాదికి మూడు లక్షల ఆటోరిక్షాలను ఉత్పత్తిచేసే సామర్థ్యం ఉందని చెప్పారు. 320 కిలోల బరువుండే ఈ ఆటోరిక్షాలు 700 కిలోల బరువును లాక్కెళ్లగలవు. ఒక్కసారి బ్యాటరీ చార్జిచేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రిక్షాలు గంటకు 24 కిలీమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తాయి. ఎల్ఈడీ హెడ్లైట్లను ఉపయోగించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముందుకు, వెనక్కి వెళ్లేందుకు వీలుగా స్విచ్‌లు ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ వ్యవస్థలు గల రెండు రకాలు లభిస్తాయి. లక్షా పదిహేను వేల రూపాయల నుంచి లక్షా పాతిక వేల రూపాయల మధ్యలో లభించే ఈ రిక్షాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు కంపెనీ ‘ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) ఆమోదం కూడా పొందింది. ఈ రిక్షాలకు కంపెనీ ‘ఇ-రాజా’ అని పేరు పెట్టింది. -
లోహియా ఈ-రిక్షాలు వస్తున్నాయ్...
ఒకసారి చార్జింగ్‌తో 80 కి.మీ. * వాహనం ధర రూ. 1.20 లక్షలు * లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న లోహియా ఆటో ఇండస్ట్రీస్ హమ్రాహి పేరుతో రూపొందించిన ఈ-రిక్షాలు జూన్‌కల్లా రోడ్లపై పరుగుతీయనున్నాయి. వీటి విక్రయానికై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్ ప్రభుత్వాల నుంచి కంపెనీ ఆమోదం పొందింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దరఖాస్తు చేసుకున్నామని లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఔత్సాహిక యువకులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఫైనాన్స్ సౌకర్యాన్ని తొలుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఆ కంపెనీ ఉత్సాహంగా ఉందని వివరించారు. పశ్చిమ, దక్షిణ భారత్‌లో వాహనాలను మార్కెట్ చేసేందుకు హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 50 డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అయిదుగురు ప్రయాణించొచ్చు..: బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలో డ్రైవర్‌తోసహా అయిదుగురు ప్రయాణించొచ్చు. వాహన వేగం గంటకు 20 కిలోమీటర్లు. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 80 కి.మీ. వరకు వెళ్లొచ్చు. వాహనం ధర రూ.1.20 లక్షలు. అదనపు బ్యాటరీకి రూ.25 వేలు అవుతుంది. బ్యాటరీ జీవిత కాలం 15 వేల కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. వాహనానికి ఆటోమోటివ్ రిసర్చ్ అసోసియేషన్(ఏఆర్ఏఐ) ధ్రువీకరణ ఉందని ఆయుష్ లోహియా వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ ప్లాంటులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, రిక్షాలతోపాటు డీజిల్ త్రీ వీలర్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. 2014-15లో ఇ-స్కూటర్లు 12 వేల యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది 20 వేల యూనిట్లు అంచనా వేస్తోంది. 2014-15లో దేశం లో ఈ-స్కూటర్లు సుమారు 35,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ-స్కూటర్‌కు రూ.9,400 వరకు కేంద్రం సబ్సిడీ ఇస్త్తోంది. -
ఈ రిక్షా చోదకుల లెసైన్సు నిబంధనలు సడలించిన ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: ఇ-రిక్షా డ్రైవర్ల డ్రైవింగ్ లెసైన్స్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీనితో ఢిల్లీ రోడ్లపై ఇ-రిక్షాలు తిరగడానికి మార్గం సుగమమైంది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ హైకోర్టు ఈ రిక్షాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే . ఇ-రిక్షా చోదకుల డ్రైవింగ్ లెసైన్స్ నిబంధనలను సడలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్ కనీసం ఏడాదిగా కలిగినవారికే వాణిజ్య వాహనం నడిపేందుకు లర్నర్స్ లెసైన్స్ ఇవ్వాలన్న నిబంధనను కొట్టివేశారని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇ-రిక్షా చట్టబద్దమైన వాహనమని, డ్రైవింగ్ టెస్ట్ పాసైన డ్రైవర్‌కు డ్రైవింగ్ లెసైన్స్ జారీచేస్తారని ఆయన తెలిపారు. ఇ-రిక్షాలు నడపడానికి డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి చేస్తూ వాటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మించరాదని ప్రభుత్వం అక్టోబర్‌లో ఇ-రిక్షాల నియమాలను నోటిఫై చేసింది. స్పెషల్ పర్పస్ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్స్ నడవడానికి వీలుగా ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నిబంధలు- 2014 (16వ సవరణ )ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇ-రిక్షాలలో నలుగురు ప్రయాణికులకు మించి ప్రయాణించరాదని, 40 కిలోల బరువు సామగ్రికి మించి తీసుకెళ్లరాదని ఈ నియమాలు పేర్కొన్నాయి. ఇ-రిక్షాలు ఇతర వాహనాలకు, పౌరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు జులై 31న నగరంలో వాటిపై నిషేధం విధించింది. -
ఈ-రిక్షాపై నిషేధం ఎత్తివేయండి:ఆప్
న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆప్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఒకవేళ బీజేపీ ఇచ్చిన సమయానికి ఈ -రిక్షాలపై నిషేధం ఎత్తివేయకపోతే ఆందోళనకు దిగుతామని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం గడ్కరీతో సమావేశమైంది. ఈ-రిక్షాలు నడుపుకునేవారి ఉపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉత్తమమైన విధివిధానాలను రూపొందించాలని వారు గడ్కరీని కోరారు. ఈ-రిక్షాల విధివిధానాల రూపకల్పనకు సంబంధించి సూచనలు, సలహాలు పదిరోజుల్లోగా ఇవ్వాల్సిందిగా కోరుతూ రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తాము నిషేధాన్ని రద్దు చేయాలని కోరామని, రిక్షాలు నడుపుకునేవారికి ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించినట్లు చెప్పామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ తెలిపారు. -
ఈ -రిక్షాల అంశంపై పార్టీ నేతలతో గడ్కారీ భేటీ
న్యూఢిల్లీ: పదిరోజుల్లో ఈ రిక్షాలను రోడ్లపైకి తెస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో ఢిల్లీ బీజేపీ నేతలు మంగళవారం సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఆయన పార్టీ నేతలతో ఈ రిక్షాలపై అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ రిక్షాలపై నిషేధంతో వేలాదిమంది జీవనాన్నికోల్పోయారని సమావేశం అనంతరం ఢిల్లీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుని నిర్ణయం ఆ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసిన సందర్భంగా నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జాతీయ రాజధానిలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయని ఆరోపిస్తూ గత జూలై 31వ తేదీన ఈ రిక్షాలు రోడ్లపై సంచరించడాన్ని హైకోర్టు నిషేధించిన విషయం తెలిసిందే. రోడ్లపై ఈ రిక్షాల సంచారం వల్ల ఏర్పడుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనలను తయారు చేయడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇదిలా ఉండగా, ఈ రిక్షాలపై అంశంపై ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటనను చెప్పిన సమయానికి అమలు చేయకపోతే ఆందోళన చేపడతామన్నారు. -
నిషేధమున్నా యథేచ్ఛగా!
సాక్షి, న్యూఢిల్లీ:హైకోర్టు విధించిన నిషేధాన్ని ఈ-రిక్షావాలాలు పట్టించుకోవడం లేదు. అవి నగర రహదార్లపై జోరుగా తిరుగుతున్నాయి. చివరి నిమిషంలో గమ్యం చేరుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడుతుండడంతో ప్రయాణికులు వాటిని విడిచిపెట్టడం లేదు. నిషేధం విధించేముందు ప్రభుత్వం తమకు మరో ప్రత్యామ్నాయాన్ని చూపాలని వారంటున్నారు. గురుగోవింద్ సింగ్ ఇంద్ర ప్రస్థ యూనివర్సిటీ, ద్వారకా సెక్టర్ 14 మెట్రో స్టేషన్, పాలం, రఘునగర్, కరోల్ బాగ్, శక్తినగర్ తదితర ప్రాంతాల్లో ఈ రిక్షాలు ఇప్పటికీ తిరుగుతున్నాయి. హైకోర్టు నిషేధాన్ని ఈ-రిక్షా చోదకులు గానీ, ప్రయాణికులు గానీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆటో రిక్షాల కన్నా ఇవే చౌక అని, అలాగే మామూలు రిక్షా కంటే త్వరగా గమ్యస్థానాలకు చేరుకుంటామని ప్రయానికులు అంటున్నారు. ప్రజారవాణా సదుపాయం లేని మార్గాల్లో వీటి సేవలను ఉపయోగించడం తప్ప తమకు మరో మార్గంలేదని వారంటున్నారు. తమకు ఉపాధికి ఇదే మార్గమని, అందువల్ల దానిపై నిషేధం విధించినా ఖాతరు చేయడం లేదని ఈ-రిక్షా చోదకులు అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది ఎక్కడ పట్టుకుంటారోననే భయం వెన్నాడుతున్నప్పటికీ కుటుంబ పోషణకకోసం రిసు తీసుకోకతప్పడం లేదని వారంటున్నారు. ఈ భయం కారణంగానే ప్రధాన రహదారుల్లో కాకుండా వీధులకే పరిమితమవుతున్నామనని వారు చెప్పారు. ఈ రిక్షాలవల్ల ఒక దుర్ఘటన జరిగినంత మాత్రాన వాటిపై నిషేధం విధించడం సబబు కాదని వాదిస్తున్నారు. బస్సులు, ఆటోలు, కార్ల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, మరికి వాటిపై విధించని వీటిపైనే ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.ఇదిలాఉండగా ఈ రిక్షాలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ వాటి చోదకులు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిషేధం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిక్షా చోదకులు నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పశ్చిమ ఢిల్లీ మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా కూడా పాల్గొన్నారు. -
ఈ-రిక్షాలపై 14 వరకూ నిషేధం
న్యూఢిల్లీ: రాజధాని నగర వీధుల్లో ఈ-రిక్షాలు తిరగకుండా విధించిన నిషేధం 14వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడానికి ఢిల్లీ హైకోర్టు సోమవారం నిరాకరించింది. తదుపరి విచారణ జరిగే రోజున కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తామని జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ-రిక్షాలను అక్టోబర్ 15వ తేదీ వరకూ అనుమతించేందుకు ఢిల్లీ రాష్ట్ర రవాణా విభాగం గుర్తింపు కార్డులను, తాత్కాలిక అనుమతిని మంజూరు చేస్తుందని కేంద్రం హైకోర్టుకు ప్రతిపాదించింది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ తన వాదనలు వినిపిస్తూ, ఈ అంశం చాలా సున్నితమైందని, ఈ-రిక్షాలపై నిషేధం కారణంగా లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. అయితే నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరించిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం తన ప్రతిపాదనను ఒక అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ధర్మాసనం సూచనల మేరకు కేంద్రం ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ‘‘ఈ-రిక్షా ఆపరేటర్లకు అవసరమైన వాణిజ్య డ్రైవింగ్ లెసైన్సులు మంజూరు చేసేందుకు గాను నగరమంతటా కేంద్రాలు ప్రారంభించి, అదనపు గంటలు కూడా పని చేసేందుకు రాష్ట్ర రవాణా విభాగం అంగీకరించింది’’ అని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. ‘‘ఈ-రిక్షా అసోసియేషన్లు తీవ్రమైన గాయాలు, లేదా మరణాల సందర్భంగా పొందేందుకు రూ.10 లక్షల వరకు బీమా సంచయను కూడా తయారు చేసుకోవచ్చు’’ అని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ-రిక్షాల కారణంగా తీవ్రమైన గాయాలైన వారికి రూ.25 వేలు, మరణాలు సంభవిస్తే మృతుని కుటుంబానికి లక్ష వరకు పరిహారం చెల్లించవచ్చునంది. డ్రైవర్లకు లెసైన్సులు లేకుండా ఈ-రిక్షాలకు రిజిస్ట్రేషన్, బీమా సదుపాయం లేకుండా వాటిని తిరిగేందుకు అనుమతించబోమని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెల్సిందే. -
చైనా ఈ-రిక్షాలతో చిక్కులు
సాక్షి, న్యూఢిల్లీ: లక్షల సంఖ్యలో నగర రహదారులపై తిరిగే ఈ-రిక్షాలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం మాయమయ్యాయి. కోర్టు నిషేధం విధించడంతో ఈ రిక్షాను ఇంట్లోనే ఉంచి కూలీకి బయల్దేరినట్లు మయూర్‌విహార్ మెట్రో స్టేషన్ వద్ద ఈ- రిక్షా నడిపే మహ్మద్ ఖాన్ చెప్పాడు. వీటి నిషేధం వల్ల తామే కాకుండా ప్రయాణికులు సైతం ఇబ్బంది పడుతున్నారన్నాడు. ప్రభుత్వం ఈ-రిక్షాలను నియంత్రించలేకపోయినప్పటికీ కోర్టు ఆ పని చేయగలిగిందని ఈ-రిక్షాలను వ్యతిరేకించే నగరవాసి విజయేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంచితే చైనా నుంచి అడ్డూఅదుపులేకుండా దిగుమతి అవుతున్న ఈ రిక్షాలను ఏవిధంగా నియంత్రించాలనే విషయం అర్థం కాక ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ-రిక్షాలను నడపడం చట్టవిరుద్ధమైనప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాలవారు వీటిని దిగుమతి చేసుకుంటున్నారు, ఈ నేపథ్యంలో వాటి దిగుమతిపై ఆంక్షలు విధించనట్లయితే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే బ్యాటరీతో నడిచే ఈ రిక్షాలు క్లాసిఫైడ్స్ జాబితాలో లేనందువల్ల వాటి దిగుమతిపై నిషేధం విధించలేమని అధికారులు అంటున్నారు. ఈ-రిక్షా విడిభాగాల అక్రమ దిగుమతిపై చర్య తీసుకోవాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ.... వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. ఈ రిక్షా విడిభాగాలు అత్యధిక శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. చైనా నుంచి దిగుమతి అయిన విడిభాగాలతో నగరంలో ఈ రిక్షాలను రూపొందిస్తున్నారు. బాడీ, టైర్ కంట్రోలర్లు, మోటర్ వంటి విడిబాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుని బ్యాటరీలు, చార్జర్లు, టైర్ ట్యూబుల వంటి స్థానికంగా లభించే విడిభాగాలతో వీటిని రూపొందిస్తున్నారని అధికారులు అంటున్నారు. అయితే వాణిజ్య మంత్రిత్వశాఖ క్లాసిఫైడ్స్ జాబి తాలో ఈ రిక్షాలు లేకపోవడం వల్ల వాటిని, వాటి విడిభాగాల దిగుమతులను నిషేధించలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఈ రిక్షాలను నియంత్రించడం కోసం వాటి ఎలక్ట్రిక్ మోటార్లు, గేర్లపై నిషేధం విధించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందని అంటున్నారు. నిషేధం తగదు : బీజేపీ న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై హైకోర్టు నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జం గ్‌కు శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ-రిక్షాలను మళ్లీ రహదారులపైకి తీసుకొచ్చేందుకు యత్నించాలని ఈ సందర్భంగా విన్నవించింది. నగర రవాణా అవసరాలను తీర్చడంలో ఇవి కీలకపాత్ర పోషించాయని పేర్కొంది. ఎల్జీతో భేటీ అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ మీడియా తో మాట్లాడారు. ‘కోర్టు ఆదేశాలను శిరసావహిస్తాం. అయితే ఈ-రిక్షాలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇదొక అసంఘటిత రంగం. ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేయాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీ బ్ జంగ్‌ను కోరాం. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతాం. ఇవి నగరవాసుల అవసరాలను తీరుస్తున్నాయి. ఈ-రిక్షాల క్రమబద్ధీకరణకు సం బంధించి పదిరోజుల్లోగా కేంద్ర ప్రభుత్వం ఓ విధాననిర్ణయం తీసుకుంటుంది. దీనిపై త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో కేంద్రం చర్చిస్తుంది’ అని అన్నారు. -
ఈ-రిక్షాలతో ఇబ్బందులు
న్యూఢిల్లీ: పర్యావరణ సంరక్షణ మాటేమో గానీ ఎలక్ట్రానిక్ రిక్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతోంది. ఇవి తమ పరిధిలోకి రావు కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేకపోతున్నారు. ఈ-రిక్షాలు 250 వాట్ల మోటార్లతో నడుస్తున్నందున ఇవి ఢిల్లీ మోటారు వాహనాల చట్టం పరిధిలోకి రాబోవు. నిజానికి చాలా ఈ-రిక్షాలకు 250 కంటే అధిక వాట్ల మోటా ర్లు బిగించారు. ప్రభుత్వం మాత్రం 250 వాట్లకు పైబడిన ఈ-రిక్షాలను నిషేధించింది. ఇవి మెల్లిగా ప్రయాణించడం వల్ల రోడ్డుపై మరింత రద్దీ కనిపిస్తోంది. ఈ వాహనాలు నిబంధనలను ఉల్లంఘించి ప్రధాన రహదారిపైనే సంచరిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే వాదనలు ఉన్నా యి. ఇవి ఏయే ప్రాంతంలో తిరగాలి..ఎన్ని ఉండాలనే దానికి తగిన నిబంధనలు రూపొందించినప్పుడే ఈ-రిక్షాలను నియంత్రించడం సాధ్యపడుతుందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. పహార్గంజ్, ఆర్కే ఆశ్రమ్‌మార్గ్, పార్లమెంటువీధి, ఉత్తమ్‌నగర్, కైలాష్‌కాలనీ, ఢిల్లీ యూనివర్సిటీ మార్గాల్లో ఈ-రిక్షాలు ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇవి గంటకు 25 కిలోమీటర్ల వేగా న్ని మించడం లేదని, చాలా రిక్షాలకు 250 కంటే అధిక వాట్ల మోటార్లు బిగించారని ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ అనిల్ శుక్లా అన్నారు. వీటిని కూడా ప్రజారవాణా వాహనాలుగా గుర్తించి ఆపరేటర్లకు లెసైన్సులు ఇవ్వాలని ట్రాఫిక్ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అధిక సామర్థ్యం కలిగి న మోటారును బిగించుకున్నా ఫర్వాలేదు కానీ, అన్ని ఈ-రిక్షాలకు రవాణాశాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఉండాలని ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయితే నిబంధనల ప్రకా రం డ్రైవర్లు వీటిని సరిగ్గా పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది డ్రైవర్లు పార్కింగ్ నియమాలను పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధమే అయినా అధిక సామర్థ్యం గల మోటార్లు వినియోగించడం సర్వసాధారణమేనని డ్రైవర్లు అంటున్నారు. ఐదుగురు ప్రయాణికులను ఎక్కించుకునేవాళ్లు దాదాపు 650 వాట్ల మోటార్లను బిగించుకుంటున్నారు. ఇప్పుడు అంతా దాదాపు 850 హెచ్‌పీ సామర్థ్యం గల చైనా తయారీ ఇంజన్లు వాడుతున్నారని, తక్కువస్థాయి సామర్థ్యమున్న ఇంజన్లు అసలు దొరకడమే లేదని డీలర్లు అంటున్నారు. రోజువారీ సంపాదన ఎలా ఉంటుం దన్న ప్రశ్నకు ఓ డ్రైవర్ స్పందిస్తూ తాను రూ.700 సంపాదిస్తానని, ఇందులో రిక్షా యజమానికి రూ.400 వరకు చెల్లిస్తానని చెప్పాడు. దీని నిర్వహ ణ వ్యయం తక్కువగా ఉంటుంది. ఒకరాత్రి మొత్తం రీచార్జి చేస్తే దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని డీలర్లు చెబుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నాయంటూ ఈ-రిక్షాలను గతంలోనే స్థానిక కోర్టు ఒకటి నిషేధించింది. ఈ నిర్ణయాన్ని డ్రైవర్లు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దాని ఆదేశాల మేరకు వీటి నిర్మాణాత్మక పటిష్టతపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.