ఈ–రిక్షా మేడిన్ జనగామ
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో కాలుష్య రహిత ఈ–రిక్షాలను తయారు చేస్తున్నారు. ఢిల్లీ, వారణాసి తదితర ప్రాంతాలకే పరిమితమైన ఈ ఈ–రిక్షాలను ఇక్కడే తయారు చేస్తున్నారు. జనగామకు చెందిన పెద్ది రవీందర్ పెంబర్తి రోడ్డులో ఈ–రిక్షా తయారీ కేంద్రాన్ని ప్రారంభిం చారు. చెనా, ఢిల్లీ, చైన్నై ప్రాంతాల నుంచి ముడిసరుకులను తీసుకువచ్చి ఇక్కడే ఈ– రిక్షాలను తయారు చేయిస్తున్నారు. ఫ్రేమ్స్, డూమ్‌లు, మోటార్లు, చార్జర్లు, కంట్రోల్ ప్యానెల్, బ్యాటరీ, వైరింగ్, ఎల్‌ఈడీ లైట్లను దిగుమతి చేసుకొని సొంతంగా తయారీని ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 ఈ–రిక్షాలను తయారు చేశారు.
ప్యాసింజర్, గూడ్స్ రిక్షాలు..
కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ఈ–రిక్షాల్లో ప్రయాణికులను తరలించడానికి ఈ–రిక్షా, వస్తువులను రవాణా చేయడానికి ఈ–కార్ట్ రిక్షాలను వేర్వేరుగా తయారు చేస్తున్నారు. ప్యాసింజర్ రిక్షాలో ఐదుగురు కూర్చోవడా నికి వీలుగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ–కార్డ్ రిక్షాలో 4 క్వింటాళ్ల బరువు వరకు రవాణా చేయడం వీలవుతుంది. కాగా, ప్యాసింజర్ ఆటోను రూ. 1.10 లక్షలకు విక్రయిస్తే, గూడ్స్ ఆటోను లక్ష రూపాయలకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపారు.
4 గంటలు చార్జింగ్.. ప్రయాణం 80 కిలోమీటర్లు....
ఈ–రిక్షాకు 4 గంటల పాటు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలు ఉంటుంది. అంతేకాకుండా రేర్‌మిర్రర్, స్పీడో మీటర్, ఇండికేటర్, సౌండ్ సెట్టింగ్ వంటి సదుపాయాలన్నీ ఇందులో పొందుపరిచారు.
అనుమతులు అక్కర్లేదు..
ఈ–రిక్షాలను నడపడం కోసం ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. గేర్లు లేకుండానే వాహనం నడిపే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ కూడా లేదు.