
తండ్రి అంత్యక్రియలకు కులస్తుల దూరం
లింగాలఘణపురం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని, ఆయన తండ్రి అంత్యక్రియలకు కుల స్తులు దూరంగా ఉన్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురంలో గురువారం జరిగింది. విష యం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దయ్యాల భిక్షపతి (60) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.
అతడి కొడుకు అనిల్ ఆరు నెలలక్రితం నెల్లుట్లకు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకొని జన గామలో ఉంటున్నాడు. కొంతమంది పాలి వారు, కుల పెద్దలు కొడుకు తలకొరివి పెట్టవద్దని, మృతుడి భార్య పెడితేనే వస్తామని చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించలేదు. విషయం తెలుసు కున్న ఎస్సై వారి వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వగా కొంతమంది మాత్రం అంత్యక్రియలకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment