Caste elders
-
పెళ్లి విందు పెట్టలేదని..
సాక్షి, నల్గొండ: పెళ్లి భోజనం పెట్టనందుకు కుల పెద్దలు ఓ కుటుంబానికి రూ. లక్ష జరిమానా విధించి, కులం నుంచి బహిష్కరించారు. జరిమానా చెల్లిస్తేనే కులదైవం గంగదేవమ్మ పండుగలో తమతో కలిసి పాల్గొనే అర్హత ఉంటుందంటూ ఆదేశించడంతో బాధితులు పోలీసులను, మీడియాను ఆశ్రయించారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఏపీ లింగోటంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాదవ కులస్థులు ఉగ్గేపల్లి లక్ష్మయ్య, రాములమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్ వివాహాన్ని గ్రామంలోనే ఏప్రిల్ 27న జరిపించారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో బంధువులను పెళ్లికి ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న కుల పేద్దలు కులస్థులను, గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేయనందుకు ఆగ్రహించారు. గ్రామంలో జరగనున్న కులదైవం గంగదేవమ్మ పండుగకు ఆనవాయితీ ప్రకారం లక్ష్మయ్య కుటుంబం ఇచ్చిన నగదును(పట్టి) నిర్వాహకులు తిరిగి ఇచ్చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. కుమారుడి పెళ్లికి విందు ఏర్పాటు చేయనందుకు కుల బహిష్కరణ విధిస్తున్నట్లు చెప్పారు. తమను అవమానించిన కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, డీజీపీ, నల్లగొండ కలెక్టర్, ఎస్పీలకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి ఆధునిక యుగంలో కూడా కుటుంబాలను వేలేస్తూ, విధించిన జరిమానా కట్టాలని వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీంతో స్థానిక నార్కట్ పల్లి పోలీసులు, తహశీల్దార్ దీనిపై గ్రామంలోకి వెళ్లి విచారణ చేపట్టారు. -
మరి కొద్ది క్షణాల్లో పెళ్లి.. అంతలోనే..
► పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులతో తగాదాకు దిగిన కుల పెద్దలు ►పోలీసులు నచ్చజెప్పిన ఫలితం శూన్యం ►రోలు వద్ద జరిగిన వివాహం ► టెక్కలి గొల్లవీధిలో ఘటన టెక్కలి(శ్రీకాకుళం): డివిజన్ కేంద్రమైన టెక్కలి గొల్లవీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంతో పెళ్లి వేడుక వివాదాస్పదంగా మారింది. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా ఇబ్బందులు పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు గొల్లవీధికి చెందిన యువకునికి, విశాఖపట్నానికి చెందిన యువతితో వివాహాం చేసేందుకు కుటుంబ సభ్యులు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ముహూర్తం కావడంతో మరి కొద్ది క్షణాల్లో మూడు ముళ్లు పడతాయనుకునే సమయంలో అదే వీధికి చెందిన కొంతమంది కుల పెద్దలు మండపం వద్దకు వచ్చి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులతో తగాదాకు దిగారు. పాత కుటుంబ కలహాలు నేపథ్యంలో వివాహం జరుగుతున్న చోట రచ్చ రచ్చ చేశారు. తగాదా తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఆదివారం ఉదయం అంతా ఎటువంటి తగాదా లేకుండా సరిగ్గా ముహూర్తం సమయానికే కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంపై అసలు కారణాలు తెలియకపోవడంతో అంతా బిత్తరపోయారు. తగాదా ఎప్పటికీ సద్దుమణగకపోవడంతో నవ దంపతులను మరో చోటకు తీసుకువెళ్లి రోలు సమక్షంలో వివాహం చేసినట్టు తెలిసింది.