Janagama District
-
జనగాంలో భారీ అగ్ని ప్రమాదం.. 20 కోట్ల ఆస్తి నష్టం (ఫొటోలు)
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదైంది . గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
జనగామ/ తుంగతుర్తి/ సూర్యాపేట రూరల్: ‘‘పంట ఎండిపోయిందని అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అధికారులు వచ్చినప్పుడు నష్టం వివరాల ను రాయించుకోండి. మేం అండగా ఉంటాం’’అని రైతులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఎండిన పంట పొలాల పరిశీలనలో భాగంగా.. ఆదివారం జనగా మ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారంతండా, మొండికుంట తండా, సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎంత పెట్టుబడి పెట్టారు. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది. కాలువల ద్వారా నీళ్లొస్తున్నాయా. బోర్లలో నీళ్లు ఉన్నాయా.. రైతుబంధు వచ్చిందా..’’ అని అడిగి తెలుసుకున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ.. కేసీఆర్‌కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొట్టదశకు వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనగామ జిల్లా ధరావత్ తండాలో మహిళా రైతు అముగోతు సత్తెమ్మ మాట్లాడుతూ.. ‘‘సారూ.. ఎనిమిది ఎకరా ల్లో వరి వేసినం. రూ.3 లక్షలకుపైగా పెట్టుబడులు అయినయి. కాలువ నీళ్లు రాక.. రూ.1.80 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోర్లు వేయించినం. వాటిలోనూ నీళ్లు సరిగా పడలేదు. పంటంతా ఎండిపోతోంది. ఇక మాకు దిక్కెవరు..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుమారుడి పెళ్లి పెట్టుకున్నామని, అప్పులు కూడా పుట్టట్లేదని వాపోయింది. దీంతో ‘‘బిడ్డా బాధపడకు.. మళ్లీ వచ్చేది మనమే. బాధలన్నీ తీరుతయి. అందాక రూ.5లక్షల చెక్కు పంపిస్తా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెచ్చిస్తరు’’ అని భరోసా ఇచ్చారు. సాగు నీళ్లు రావడం లేదంటూ.. తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలోని సింగారం, మొండికుంట తండాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులు దయ్యాల వెంకటనారాయ ణ, ధరావత్ సురేశ్, భూక్యా శ్రీను, ఆంగోతు హర్జా, గుగులోతు సుశీలతో మాట్లాడారు. ఈ రెండు తండాల్లో 250 ఎకరాల వరకు వరి వేయగా.. పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గత ఐదారేళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలా లు రావడంతో.. పంటలు బాగా పండాయన్నారు. ఈ యాసంగి సీజన్ మొదట్లో కాల్వల ద్వారా నీళ్లు వదలడంతో.. వరి వేశామని, కానీ ఇప్పుడు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోయాయని వాపోయారు. రోజులో 16 గంటలే కరెంట్ వస్తోందని.. అదికూడా 16 సార్లు ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. ప్రభు త్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ సూర్యాపేట మండలం ఎర్కారం చేరుకున్నారు. మళ్లీ అప్పుల పాలవుతున్నాం.. ఎర్కారం గ్రామంలో రైతు కొదమగుండ్ల వెంకటయ్య, సరోజనమ్మ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో సరోజనమ్మ కేసీఆర్ వద్దకు వచ్చి విలపించింది. ‘‘మీరు సీఎంగా ఉన్నప్పుడు సాగునీళ్లు వచ్చేవి. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కాలువ నీళ్లు రావట్లేదు. ఐదెకరాల్లో వరి ఎండింది. మళ్లీ అప్పుల పాలు అవుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతా రైతుల గోడు ఆలకించిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ఏ రైతును పలకరించినా కన్నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని.. ఎండిన వరి పొలాలకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా మళ్లీ 24 గంటల కరెంట్‌ను సాధించుకుందామన్నారు. -
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
జనగామ జిల్లా: బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్‌రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్(34) అమెరికాలో గుండె పోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్‌లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేష్ డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మహేష్‌కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
భూమి రికార్డుల్లో నమోదు కాలేదని..
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌కు చెందిన కొమ్మాట రఘుపతి (45) అనే రైతు శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రఘుపతికి కొన్నె గ్రామ శివారులో 75, 76 సర్వేనంబర్లలో కలిపి మూడు ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 76 సర్వే నంబర్లోని ఎకరం 20 గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం భూమిని కొలవడానికి ఫీజు చెల్లించగా.. సర్వేయర్ కె.రవీందర్ భూమిని కొలతవేసి.. ఈ భూమి నీదేనని రికార్డులో ఎక్కించడానికి రూ.6 లక్షలు అవుతాయని చెప్పి, సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్‌ను కలవాలని సలహా ఇచ్చాడు. ఆ మేరకు రఘుపతి.. సుమన్ వద్దకు వెళ్లి రూ.4.50 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.2.50 లక్షలు సర్వేయర్ రవీందర్ ద్వారా చెల్లించాడు. అయితే భూమి నమోదుకోసం రఘుపతి 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ‘ఆ భూమి వేరే వ్యక్తుల పేరున రికార్డు అయింది.. నీ పేరు మీదకు రావడం కష్టం’అని సుమన్, రఘుపతికి చెప్పాడు. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అడగ్గా పై అధి కారులకు ముట్టాయంటూ నిర్లక్ష్యంగా సమా ధానం చెప్పాడు. వారం రోజుల క్రితం మళ్లీ వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆర్థిక ఇబ్బందులతో.. రఘుపతి గత ఏడాది కూతురు వివాహం చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు తీసుకున్నాడు. వాళ్లు డబ్బులు అడగడంతో పది రోజుల క్రితం తనకున్న రూ.3 లక్షల విలువైన మూడు పాడి ఆవులు, గేదెలను రూ.1.10 లక్షలకు విక్రయించాడు. దీనికితోడు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావన్న మనస్తాపంతో శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రఘుపతి మృతదేహాన్ని తీసుకువచ్చి గ్రామస్తులతో కలసి రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. -
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్‌రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
పండించిన కూరగాయలను మార్కెట్ చేసుకోవడం సులభమే
-
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. కిడ్నాప్‌నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్‌ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. -
వెయ్యేళ్ల లక్ష్మీదేవి ఆలయం
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ శివారులోని పురాతన నాగులమ్మ దేవాలయంలో దాదాపు వెయ్యేళ్లనాటి లక్ష్మీదేవి ఆలయం వెలుగుచూసింది. ఈ మేరకు తను గుర్తించిన పలు విషయాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి శుక్రవారం వివరించారు. ‘కాకతీయుల కాలంలో నిర్మించిన నాగులమ్మ గుడిలో ద్వికూటాలయానికి మరమ్మతులు చేస్తున్నారు. గుడిచుట్టూ మట్టిని తొలగిస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం బయటపడ్డాయి. ఆ శాసన పాఠం అచ్చుతీసి శాసన పరిష్కర్త కె.మునిరత్నంనాయుడు, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్‌కు పంపించగా పూర్తి వివరాలు తెలిశాయి. సుమారు ఐదడుగుల ఎత్తైన ఏకశిలపై రాసిన శాసనంలో.. కాకతీయుల కాలంలోని మహాప్రధాని లక్ష్మీదేవికి రంగ¿ోగాలకు భూమిని దానం చేసినట్లు తెలిసింది. ఆ శాసనంపై ‘తుసము, దునెనిమిదిసమ, గూతి శ్రీలక్ష్మీ, రంగ¿ోగలకు, విచ్చితి, మహాప్ర«దాని, క్రయమాత, ముక్య, నానకు’ అనే పదాలు ఉన్నాయని తెలిపారు. ఇటుకల తయారీలో ఇంజనీరింగ్ నైపుణ్యం ఇక్కడి ఇటుకల్లో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని, మట్టి, డంగు సున్నం లేకుండా తయారు చేశారని తెలిపారు. ఆలయం ముందున్న పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి రుబ్బు రోలు లభించిందని, అక్కడే కాకతీయుల కాలం నాటి శిథిల దేవాలయం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. -
శ్రీకాంత్ చనిపోయిన విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం వస్తారా...
వరంగల్: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్ (30) బుధవారం తెల్లవారు జామున నెల్లుట్ల శివారు ఆర్టీసీ కాలనీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. నెల్లుట్లకు చెందిన తాండ్ర శ్రీకాంత్‌కు పాలకుర్తి మండలం బమ్మెరకు చెందిన నందిని అలియాస్ అక్షరతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. శ్రీకాంత్‌కు నలుగురు అన్నదమ్ములు కావడంతో ఇల్లు సరిపోక కొద్ది రోజులు అద్దె ఇళ్లలో ఉన్నాడు. భార్యభర్తలు ఇద్దరు తరచుగా గొడవ పడడంతో అక్షర మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్ అంబర్‌పేటకు వెళ్లింది. అక్కడే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భార్యభర్తలు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. 15 రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన అక్షర నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీలో భర్తతో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త శ్రీకాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్షర అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా బంధువులు, అన్నదమ్ములు అక్కడికి వెళ్లగా మంచం సమీపంలో నేలపై పడుకొని చనిపోయి ఉన్నాడు. ఉరి వేసుకున్నాడని చెబుతున్నప్పటికీ, మృతదేహం నేలమీద ఎందుకు ఉందని బంధువులు ప్రశ్నించగా నేనే ఉరితాడు కోసేశానని చెప్పుతూ ఇంట్లో టీవీ చూస్తూ పాటలు వింటుండడంతో మరింత అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతుడి భార్య అక్షరను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్షర తల్లి, బంధువులు కారులో సాయంత్రం నాలుగున్నర గంటలకు నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకోగానే అక్కడే ఉన్న బంధువులు.. శ్రీకాంత్ చనిపోయిన విషయం ఉదయం ఏడుగంటలకు తెలిస్తే సాయంత్రం నాలుగు గంటలకు వస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో బంధువులతో వాగ్వాదం నెలకొంది. అప్పుడే పోలీసేస్టేషన్‌కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్ అందరిని స్టేషన్ బయటకు పంపించి మృతుడు శ్రీకాంత్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
పాఠశాలల్లో కరోనా కలకలం
తుంగతుర్తి/దేవరకొండ/కట్టంగూర్/నాగర్‌కర్నూల్ క్రైం/లింగాలఘణపురం: రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా సూర్యాపేట, నల్లగొం డ, నాగర్‌కర్నూల్, జనగామ జిల్లాల్లోని పాఠశాలల్లో తొమ్మి ది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం జెడ్పీ ఉన్న త పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి బుధవా రం కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పాజిటివ్‌గా తేలింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. నాగర్‌కర్నూల్‌లో నలుగురు విద్యార్థినులకు.. తరగతులు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ (బాలికల)లో చేసిన పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థినులకు పాజిటివ్‌గా తేలింది. మిగతా విద్యార్థులకు గురువారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన వారికి మెడికల్ కిట్లు అందించి, పాఠశాలలను శానిటైజ్ చేశారు. -
పశువుల కొట్టంగా పాఠశాల
జనగామ: జనగామ జిల్లా నర్మెట మండలం ఏనెతండాలో పదేళ్ల క్రితం రాజీవ్ విద్యామిషన్ నిధులతో నిర్మించిన నూతన పాఠశాల భవనం ప్రస్తుతం పశువుల కొట్టంగా మారిపోయింది. విద్యార్థులు లేరనే సాకుతో అధికారులు పాఠశాలను మూసివేయడంతో నిర్మించిన నాటి నుంచి ఒక్కరోజు కూడా ఈ బడి తెరుచుకోలేదు. దీంతో ఈ బడి కాస్తా పశువుల కొట్టంగా మారిపోయింది. దీనిపై మండల విద్యాధికారి (ఎంఈఓ) భగవాన్ ను వివరణ కోరగా..ఏనెతండాలో పిల్లలు, టీచర్లు లేకపోవడంతోనే బడి మూసి వేశారని తెలిపారు. -
లింగంపల్లిలో అరుదైన ఆత్మార్పణ శిల వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: దేవుడికి తనను తాను నైవేద్యంగా సమర్పించుకుంటే ఆ భక్తిని ఏమనాలి?.. గతంలో ఈ తరహా వీరభక్తి ఉండేదన్న గాథలు అడపాదడపా వింటూనే ఉన్నాం. భక్తితో దేవుడికి తనను తాను ఆత్మార్పణ ద్వారా సమర్పించుకున్న వారి శిల్పాలు అప్పట్లో వేయించారు. అలాంటి ఓ అరుదైన ఆత్మార్పణ శిల తాజాగా వెలుగుచూసింది. అది మహిళది కావడం మరో విశేషం. జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లిలో కొత్త తెలంగాణ బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఈ ‘ఆత్మార్పణ’శిల్పాన్ని గుర్తించినట్లు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతంలో వీటిని సిడితల వీరగల్లుగా పేర్కొంటారని తెలిపారు. ఈ శిల్పంలోని దృశ్యం రెండంతస్తులుగా ఉంది. దిగువ భాగంలో.. ఓ మహిళ కూర్చుని ఆత్మత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉంది. చేతిలో శివలింగం పట్టుకుని ఉంది. తల భాగాన్ని ఎదురు కర్రకు కట్టినట్టు ఉంది. ఓ వెదురుకర్రను వంచి చివరి భాగాన్ని తలకు జుట్టుకు కడతారు. ఆ తర్వాత కత్తితో మెడ నరుక్కోగానే, వెదురు కర్ర తలను వేరు చేస్తూ పైకి లేస్తుంది. ఈ మహిళ ఆ పద్ధతిలో ఆత్మత్యాగం చేసినట్టు శిల్ప దృశ్యం చెబుతోంది. పైఅంతస్తులో చనిపోయిన మహిళ ఆత్మను తోడుకుని ఇద్దరు చామరధారిణులైన అమరాంగనలు దేవలోకానికి వెళ్తున్న దృశ్యం చిత్రించి ఉంది. శిల్పశైలినిబట్టి కాకతీయుల కాలానంతరం చెక్కినట్లుగా ఉందని హరగోపాల్ పేర్కొన్నారు. వీరశైవ భక్తులెక్కువగా ఇలా ఆత్మార్పణ చేసుకునేవారని పేర్కొన్నారు. ఈ శిల్పం ఓ పొలం వద్ద వెలుగుచూసినట్టు వెల్లడించారు. -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
9 అడుగుల కేసీఆర్ విగ్రహం
జనగామ జిల్లా చిల్పూరు పల్లె ప్రకృతివనం లోని బర్రెంకల చెరువు కట్టపై గ్రామ సర్పంచ్ ఉద్దెమారి రాజ్‌కుమార్ సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. రూ.5 లక్షలు వెచ్చించి 9 అడుగుల విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని బుధవారం ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజుతో కలిసి సర్పంచ్ ఆవిష్కరించారు. – చిల్పూరు ఇక్కడ చదవండి: సమస్యలపై కేటీఆర్‌కు ట్వీట్లు.. స్పందించిన మంత్రి -
యాదాద్రి: కరోనాతో భర్త.. గుండెపోటుతో భార్య
యాదగిరిగుట్ట: కరోనాతో బాధపడుతూ భర్త.. గుండెపోటుతో భార్య మృతి చెందింది. ఈ సంఘటన భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన డి.యాదగిరిరెడ్డి (76) కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. అతని భార్య భారతమ్మ (66)కు గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో భర్త మరణించిన విషయం తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఒక్కరోజు వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో విషాదం నెలకొంది. దంపతులను కాటేసిన కరోనా హసన్‌పర్తి/పాలకుర్తి: రెండు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనాతో మృత్యువాత పడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా హసనపర్తిలో గ్రామానికి చెందిన అట్ల కొమురమ్మ (58) కు కరోనా వైరస్ సోకింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఇంతలోనే కొమురమ్మ భర్త రాజయ్య (65)కు కూడా కరోనా సోకినట్లు తేలగా ఎంజీఎం ఆస్పత్రిలోనే చేరి్పంచారు. ఆయన కూడా బుధవారం తుది శ్వాస విడిచాడు. మూడు రోజుల వ్యవధిలో... జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భార్యాభర్తలు కరోనా కాటుకు బలయ్యారు. మండల కేంద్రానికి చెందిన నారసింహుల అన్నపూర్ణ కరోనా బారిన పడి మృతి చెందింది. అయితే, ఆమె భర్త దశరథం (70)కు కూడా కరోనా సోకినట్లు తేలగా.. ఆయన బుధవారం మృతి చెందారు. -
ఉపాధి పనికి ఆలయ అర్చకుడు
కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని పురాతన శివాలయం అర్చకుడు పిండిప్రోలు నాగదక్షిణామూర్తి ఉపాధిహామీ పథకం పనుల్లో పాల్గొన్నాడు. ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పీఆర్సీ ఫిట్మెంట్ 30% కల్పిస్తూ వేతనాలు పెంచిన తెలంగాణ సర్కారు అర్చకులను విస్మరించడాన్ని నిరసిస్తూ ఉపాధి పనులకు వెళ్లినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల గౌరవవేతనంలో రూ. 2 వేల వరకు సామగ్రికి వెచ్చిస్తున్నామని, అదికూడా రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. -
పాపన్న కోటను పునరుద్ధరించాలి
సాక్షి, రఘునాథపల్లి(జనగామ): శతాబ్దాల చరిత్ర కలిగిన సర్ధార్ సర్వాయి పాపన్న కోటలోని కొంత భాగం నేలకొరగడం విచారకరమని సినీ హీరో పంజాల జైహింద్‌గౌడ్ అన్నారు. బహుజనుల రాజ్యాన్ని స్థాపించి వీరోచిత పోరాటంతో మొగలుల ఆగడాలను ఎదిరించిన వీరుడైన పాపన్న కోటను పునరుద్ధరించి భావితరాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌లో సర్వాయి పాపన్న కోటలోని ఓ వైపు రాతి గోడ కుప్పకూలిన నేపథ్యంలో మంగళవారం ఆయన గౌడ సంఘం నేతలతో కలిసి కోటను పరిశీలించారు. ఈ సందర్భంగా జైహింద్‌గౌడ్ మాట్లాడుతూ కోట పునర్నిర్మాణానికి సర్వాయి పాపన్న ట్రస్ట్ తరపున రూ.కోటి విరాళం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కోట పునరుద్ధరణ కోసం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ప్రభుత్వ అధికారులతో చర్చించి త్వరగా పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. అలాగే, గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని పాపన్న కోటలో నిర్మిస్తామని తెలిపారు. కోట రాతి గోడ కూలడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమార్‌గౌడ్‌తో పాటు పరీదుల శ్రీను, మర్కాల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం
సాక్షి, నిజామాబాద్: తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలేదనే కోపంతో అబ్దుల్లాపూర్మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే....నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అనే రైతు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరెట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. బోధన్: ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగ్గెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ పట్టా పాస్‌బుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. జనగామ జిల్లా: అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్‌కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. -
జనగామ నుంచే మొదటి యాత్ర
జనగామ: జనగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేని లోటును తీరుస్తూ ఎంపీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని భువనగిరి లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత శనివారం జనగామకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. వేలాది మందికి ఉపాధిని కల్పించేందుకు ఐటీఐఆర్ ఇండస్ట్రీస్‌ను జనగామకు తీసుకువచ్చేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు. జనగామ నియోజకవర్గం నుంచి మొదటి యాత్రను త్వరలోనే ప్రారంభిస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలు గడవక ముందే కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా టీఆర్ఎస్ను ప్రజలు నమ్మలేదన్నారు. ఎలక్షన్లో యంత్రాలను మాయచేసి టీఆర్ఎస్, బీజేపీ అధికారంలోకి వచ్చాయని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ రెండోసారి సీఎంగా గెలుపొందిన తర్వాత 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఎంపీ ఎలక్షన్లో తాము ముగ్గురం గెలుపొందామన్నారు. నిజామాబాద్‌లో కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు గెలుపొంది నెలలు గడిచిపోతున్నా వారికి చెక్‌పవర్ లేదని, వారం రోజుల్లో వారికి చెక్‌పవర్ ఇవ్వని పక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. -
జనగామ జిల్లాను అన్ని విధాలుగా అదుకుంటాం
-
వరంగలో ఓట్ల లెక్కింపు ఇలా..
సాక్షి, జనగామ: ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక లెక్కింపే మిగిలింది. ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకోసం ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థుల తరపున ఏజెంట్లను అనుమతిస్తారు. దీంతో ఆయా అభ్యర్థులు, వారు ఎంచుకున్న ఏజెంట్లకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. సూచనలు... కౌంటింగ్ ఏజెంట్లుగా అనుభవం ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలి. దాని వలన అభ్యర్థి ప్రయోజనాలు సరిగ్గా పరిరక్షించబడుతాయి. ఎన్నికల సంఘం శాశ్వత ఆదేశాల ప్రకారం సెక్యూరిటీ ఉన్న వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్లుగా అంగీకరించరు. ఎందుకంటే భద్రత సిబ్బందిని ఆయన వెంట లోనికి అనుమతించరు. భద్రత లేకుండా తాను వెళతానని లిఖిత పూర్వకంగా రాసిచ్చినా అంగీకరించరు. ప్రభుత్వ ఉద్యోగులు ఏజెంట్లుగా పనిచేస్తే సదరు వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ప్రతి అభ్యర్థి ఎన్ని లెక్కింపు టేబుళ్లు ఉంటే అంతమందిని గరిష్టంగా 15 మందిని ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. సాధారణంగా 12 నుంచి 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఒకటి రిటర్నింగ్ అధికారి టేబుల్ ఉంటుంది. కౌంటింగ్ ఏజెంటును ఫొటోలో ఉన్న అభ్యర్థి కానీ అతని ఎన్నికల ప్రతినిధి గానీ ఫారం 18లో వివరాలు అందజేసి, ఏజెంటు ఫొటోగ్రాఫ్, సంతకాలు చేసిన రెండు ఫారాలు రిటర్నింగ్ అధికారికి అందజేయాలి. అభ్యర్థి తనకు సౌలభ్యంగా ఉంచేందుకు ఫారం 18లోనే తన తరుపు పాల్గొనే ఏజెంట్ల పేర్లు కూడా రాసి ఇవ్వొచ్చు. కౌంటింగ్‌కు మూడు రోజుల ముందుగా సాయంత్రం 5 గంటల లోగా ఏజెంట్ల జాబితా, ఫొటోలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తే వారు అనుమతి పత్రాలను జారీ చేస్తారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపునకు గంట ముందుగా కౌంటింగ్ హాలుకు అనుమతి పత్రంతో హాజరుకావాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం.. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 17 సీ ఫారంలో ఈవీఎంల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి ( పోలింగ్ పూర్తయ్యాక నమోదు చేస్తారు). పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం ఈవీఎం ల సీల్ ను తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు. వెంటనే అభ్యర్థుల వారీగా... వారికి పోలైన ఓట్లు వెలువడతాయి. అనివార్య కారణాల చేత నియమించిన వ్యక్తి నచ్చక పోయినా.. లేదా అతను హాజరు కాలేకపోయినా.. ఫారం 19 పూర్తి చేసి ఓట్ల లెక్కింపునకు ముందుగా మరో ఏజెంటును నియమించుకోవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైతే ఎట్టి పరిస్థితుల్లోను ఏజెంటును నియమించుకోవడానికి వీలు లేదు. ఏ టేబుల్ వద్ద నియమించిన ఏజెంటు అక్కడే ఉండాలి. అన్ని టేబుళ్ల వద్ద తిరగడానికి వీలు లేదు. హాలులో ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించాలి. నియమాలు పాటించక పోతే ఏ ఏజెంటునైనా బయటకు పంపించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. లెక్కింపు పూర్తయి ఫలితాలు వెలువడే వరకు హాలు నుంచి ఏజెంటును బయటకు వెళ్లడానికి అనుమతించరు. కౌంటింగ్ హాలు దగ్గర తాగునీరు, అల్పాహారం, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. లెక్కింపు కేంద్రంలో దూమపానం నిషేధం. వరుస క్రమంలో లెక్కింపు కొనసాగుతుంది. ప్రతి వరుసలో ఉన్న టేబుళ్లకు సీరియల్ నెంబర్ ఇవ్వబడుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్,అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలు, నమోదైన గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్లకు కుర్చీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎంల ఫలితాలు వెల్లడవుతాయి.. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్ల లెక్కింపు ఉంటుంది. -
వరంగల్: ఓట్ల గల్లంతు ఆవేదన
కొత్తగా ఓటు నమోదు, సవరణలు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే 20 ఏళ్లుగా ఓటు వేస్తున్న వారి ఓట్లు గల్లంతు కావడంతో నిరాశే ఎదురైంది. శుక్రవాం ఓటు స్లిప్పులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు అధికారుల వద్ద ఉన్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వెనుతిరిగారు. ఒకరి బదులు మరొకరు ఓటు వేసిన ఘటనలు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల జరిగాయి. పరకాల: పట్టణంలోని 59, 60 పోలింగ్ బూత్‌ల్లో రెండువందలకుపైగా ఓట్లు గల్లంతయ్యాయి. ములుగు: నియోజకవర్గం గోవిందరావుపేటలో 200 మంది ఓట్లు గల్లంతయినట్లు తెలుస్తోంది. గ్రామంలో చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండగా బతికున్న తమ పేర్లు తొలగించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొంగులూరి సంజీవ అనే వ్యక్తి ఓటు తొలగించి, చనిపోయిన ఆయన కుమారుడు విజయ్‌కుమార్ పేరు మాత్రం రావడంతో ఆయన నిరసన వ్యక్తం చేశారు. దంతాలపల్లి: మండలం రేపోణి గ్రామ 101, 102 బూత్‌ల్లో 40 మంది ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. అలాగే వేములపల్లి గ్రామ 100వ పోలింగ్ బూత్‌లో గుమ్మడవెల్లి వెంకన్న బదులు సమీప బంధువు అయిన అదే గ్రామానికి చెందిన గుమ్మడవెల్లి వెంకన్న ఓటు వేశాడు. వారిద్దరి తండ్రుల పేరు కూడా వెంకటయ్య కావడం కొసమెరుపు. తనకు ఓటు లేకపోయినా గుమ్మడివెల్లి వెంకన్న హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేసి పోగా, ఊళ్లో ఉన్న మరో వెంకన్న ఓటు వేయకపోవడంతో స్థానికుల్లో చర్చనీయాంశమైంది. ఖిలావరంగల్: వరంగల్ 20వ డివిజన్ ఏకశిలనగర్ వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన 115 బూత్‌లో కందిమల్ల ప్రభాకర్ ఓటును మరో వ్యక్తి వేశాడు. దీంతో తన ఓటు మరొకరు ఎలా వేస్తారని ఆందోళనకు దిగాడు. స్పందించి పోలింగ్ అధికారులు తనకు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్‌కు అనుమతించారు. పొరపాట్లు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. స్టేషన్‌ఘన్‌పూర్:డివిజన్ కేంద్రంలో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. దాదాపు 100 మందికి పైగా ఓట్లు గల్లంతు కావడంతో బాధితులు ఆవేదన చెందారు. బుడిగజంగాల కాలనీ, మాడల్ కాలనీ, ఎరుకలవాడ తదితర కాలనీలకు చెందిన వారు ఫొటో ఓటరు స్లిప్పులతో పోలింగ్ బూత్‌లకు వెళ్లగా ఓటరు లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. బాధితులు దేవరాజుల సమ్మయ్య, స్వరూప, మంగమ్మ, ప్రసాద్, నీరటి దయాకర్, కరుణాకర్ తదితరులు విలేకరులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ:జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ కళాశాల, పాఠశాలలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు గల్లంతు చేశారని ఆరోపిస్తూ.. బాధిత ఓటర్లు ఆందోళనకు దిగారు. 6, 7 వార్డులకు చెందిన సుమారు 150 మందికి పైగా ఓటర్లు ఓటు వేసేందుకు ఐడీ కార్డులతో పోలింగ్ బూత్ వద్దకు చేరు కున్నారు. ఓటరు జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. వరంగల్–హైదరాబాద్ హైవేపై రాస్తారోకో చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ తరలివచ్చి ఓటర్లను నచ్చ చెప్పడంతో ఆవేనదతో వెనుదిరిగారు. నిరాశగా.. లింగాలఘనపురం: మండలంలోని పటేల్‌గూడెంకు చెందిన పెంతల గాలయ్య, పెండ్లి గోపాల్‌కు ఫొటో ఓటరు స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. ఈ విషయంపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అదే విధంగా నెల్లుట్ల వడ్డెర కాలనీకి చెందిన కొమ్మరాజుల ఎల్లమ్మ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వరకు వచ్చి జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశతో వెళ్లిపోయింది. దొంగతనానికి గురైందని.. ములుగు: న ఓటును మరొకరు వేశారని ములుగు మండలకేంద్రానికి చెందిన గట్ల కోటిరెడ్డి గందరగోళానికి లోనుకావడంతో పాటు అధికారులను ప్రశ్నించారు. రికార్డుల ప్రకారం ఇప్పటికే ఓటు వేసినట్లు నమోదు అయిందని ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు చెప్పడంతో కోటిరెడ్డి షాక్ అయ్యాడు. చేసేదేమి లేక నిరాశక పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చారు. -
జనగామలో రైలు నుంచి జారిపడి వృద్ధుడు..
సాక్షి, జనగామ అర్బన్: జనగామ పెంబర్తి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైల్లో నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. కాజీపేట జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం పోసాన్పల్లి గ్రామానికి చెందిన గంధారి లక్ష్మయ్య (70) హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో కుమారుల వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో నవంబర్ 27న పోసాన్‌పల్లికి వచ్చిన లక్ష్మయ్య గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్తున్న క్రమంలో రైల్లో నుంచి జారిపడి మృతి చెందినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పెంబర్తి రైల్వేస్టేషన్ మాస్టర్ బి. గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన బంధువులకు అప్పగించామని తెలిపారు. -
జనగామ: ఓటర్లకు కళాకారులతో చైతన్యం
సాక్షి, జనగామ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం), ఓటరు వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) వినియోగంపై అధికారులు ఓటర్లకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మారిన ఓటింగ్ విధానంపై చైతన్యం చేస్తున్నారు. ఎవరికి ఓటేసినా ఒక్కరికే పడుతుందనే అపోహ తొలగించడంతో పాటు ఎవరికి ఓటేశామనే అంశాన్ని నిర్ధారించుకునే విధంగా ప్రింట్ కాపీని సైతం తీసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఓటర్లకు కల్పించింది. తాజాగా అమలులోకి వచ్చిన ఓటింగ్ విధానాన్ని ఓటర్లకు తెలియపర్చడం కోసం విస్త్రత ప్రచార కార్యక్రమాలకు జిల్లా ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాకేంద్రం నుంచి బూత్‌లెవల్ వరకు.. నూతన ఓటింగ్ పద్ధతులపై జిల్లానుంచి గ్రామీణ ప్రాంతంలోని బూత్‌లెవల్ వరకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలుశాఖల అధికారులతో పాటు దివ్యాంగులకు, మహిళ సంఘాలకు, వివిధ వర్గాల ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాలు, పంచాయతీలు, బూత్‌లెవల్ వరకు ఓటేసే విధానం, ఓటు వినియోగంపై సవివరంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో కొత్త విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కళాకారులతో ప్రచారం.. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో ఓటు హక్కు వినియోగంపై చైతన్యవంతం చేస్తున్నారు. గణేష్ నేతృత్వంలోని సంజీవ, శంకర్, చిరంజీవి, కనుకరాజు, సోమయ్య బృందం జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధిలో కళాకారులు నూతన ఓటింగ్ విధానం, సందేహాలు, అనుమానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జనగామ మునిసిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లో గ్రామాల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డమ్మీ ఈవీఎం, వీవీప్యాట్లను ఏర్పాటుచేసి ఓటు వేయించి చూపిస్తున్నారు. ఇటు కళాకారులతో పాటు మరోవైపు ఓటింగ్ విధానం తెలియచేస్తూ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ముఖ్యకూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నాటికి మూడు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కళాకారుల అవగాహన కార్యక్రమాలకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్‌లోకి ఓటరు ఎలా వెళ్లాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై చైతన్యవంతం చేస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజతో ఓటు విలువపై అవగాహన.. ఓటుహక్కు వినియోగంపై ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరుతూ అశోక్‌తేజతో ప్రచారం చేయిస్తున్నారు. విలువైన ఓటును దుర్వినియోగం చేయొద్దని కోరుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటు వినియోగంపై ప్రచారం సాగిస్తున్నారు.