-
సీఎం నిర్ణయంతో పెరిగిన పరిధి
-
కొత్తగా నాలుగు ఏసీపీ కార్యాలయాలు
వరంగల్ :
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పెరిగింది. నూతనంగా ఏర్పడే జనగామ జిల్లాను కమిషనరేట్ పరిధిలో చేర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు పోలీస్‌శాఖ అధికారులు తాజాగా కసర త్తు ప్రారంభించారు. కొత్తగా ఏర్పడే వరంగల్, వరంగల్ (రూరల్), జనగామ జిల్లాలను వరంగల్ కమిషనరేట్ పరిధిలోకి తేవాలని తాజాగా నిర్ణయించారు. పరిపాలన పరంగా ఏ పోలీస్‌స్టేన్ ఏ డివిజన్ పరిధిలో ఉండాలనే విషయంపై ప్రతిపాదనలు పూర్తయ్యాయి. కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమయ్యే దసరా రోజు నుంచి కమిషనరేట్ పరిధిలోని కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తు తం వరంగల్, హన్మకొండ, కాజీపేట, మాము నూరు, క్రైం, ట్రాఫిక్, స్పెషల్‌బ్రాంచ్, ఏఆర్ ఏసీపీ పోస్టులు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం నర్సంపేట, హుజూరాబాద్, జనగామలోని డీఎస్పీ కార్యాలయాలు ఏసీపీ ఆఫీసులుగా మారనున్నాయి. కొత్తగా కేయూసీ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్, జనగామ ఏసీసీ పోస్టులు ఏర్పడుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో కమిషనరేట్ పరిధిలోకి వస్తున్న పరకాల డీఎస్పీ పోస్టు రద్దు చేసి కేయూసీ ఏసీపీ పోస్టుగా, జనగామ డీఎస్పీ పోస్టు రద్దై ఏసీపీ పోస్టుగా మారనుంది.
వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ప్రస్తుతం 19 సాధారణ పోలీస్‌స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌స్టేషన్, ఒక క్రైం పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాల ఘన్‌పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట, రఘునాథపల్లి, గుండాల, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్‌స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. కొత్త మండలాలుగా ఏర్పడే తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంట ఏర్పడే పోలీస్‌స్టేషన్లు కమిషరేట్ పరిధిలోనే ఉంటాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఐదు పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కాను న్న జనగామ జిల్లాలలోని పోలీస్‌స్టేషన్లు కమిషనరేట్ పరిధిలోకి వస్తే మొత్తం 55 పోలీస్‌స్టేషన్ల తో కమిషనరేట్ పరిధి భారీగా పెరగనుంది.
వరంగల్ : మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతె జార్‌గంజ్, లేబర్‌కాలనీ, ఏనుమాముల
హన్మకొండ : హన్మకొండ, సుబేదారి, వడ్డెపల్లి, న్యూశాయంపేట
కాజీపేట : కాజీపేట, మడికొండ, ధర్మసాగర్
నర్సంపేట : నర్సంపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ
మామునూరు : మామునూరు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ
హుజూరాబాద్ : కమలాపూర్, ఇల్లంతకుంట, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి
కేయూసీ : కేయూసీ, హసన్‌పర్తి, ఆరెపల్లి, ఆత్మకూరు, పరకాల, శాయంపేట
వర్ధన్నపేట : వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్‌గఢ్, ఐనవోలు, పాలకుర్తి, కొడకండ్ల
స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట, చిల్పూరు, వేలేరు
జనగామ : జనగామ టౌన్, జనగామ రూరల్, లింగాలఘనపూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, తరిగొప్పుల, గుండాల