
జనగామ జిల్లా: బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్‌రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్(34) అమెరికాలో గుండె పోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్‌లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేష్ డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మహేష్‌కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment