అమెరికాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి | AP Software Engineer dies in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Published Mon, Aug 19 2024 5:53 AM | Last Updated on Mon, Aug 19 2024 6:35 AM

AP Software Engineer dies in US

సముద్రస్నానానికి వెళ్లి నీటిలో మునక

18 నెలల కిందటే కాలిఫోర్నియాకు..

ముండ్లమూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దొద్దాల బుచ్చిబాబు (40) సముద్రంలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటే­శ్వ­రరావు, కోటేశ్వరమ్మలకు కుమారుడు బుచ్చి­బా­బు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవ­సాయ పనులు చేసుకుంటూ ఇద్దరినీ చదివించారు. కుమారుడు బుచ్చిబాబు ఎనిమిదేళ్లు హైదరా­బాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాడు.

కంపెనీ ఆదేశాల మేరకు 18 నెలల కిందట భార్య కిరణ్మ­యితో కలిసి కాలిఫోర్నియా వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్‌ సెలవులు కావడంతో ఆది­వారం కుటుంబ సభ్యులతో సరదాగా సముద్ర స్నా­నానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమా­దవశాత్తు కొట్టుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విని తల్లి కోటేశ్వ­రమ్మ  సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభు­త్వం చొరవ చూపాలని  వేడుకొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement