
కుత్బుల్లాపూర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్ కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు.
ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment