American Indians
-
అమెరికా పొమ్మంటోంది.. ఖర్చులు రమ్మంటున్నాయ్..
హైదరాబాద్‌లోని మీర్జాలగూడ (Mirjalguda) నివాసితులైన దంపతుల కుమారుడు ప్రస్తుతం కాలిఫోర్నియాలో పీజీ చేస్తున్నాడు.. ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండాలని, అక్కడే ఒక హోటల్లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. అది కూడా వారానికి రెండు రోజులు మాత్రమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజూ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉద్యోగం మానేయాలా వద్దా? లేక అమెరికా(United States of America) నుంచి తిరిగి వచ్చేయాలా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. నగరంలో నివసించే దంపతుల ఇద్దరు కుమారులూ అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. అక్కడ పంజాబ్‌కు చెందిన ఆభరణాల వ్యాపారుల దగ్గర మంచి వేతనానికి పనిచేస్తున్నారు. వీరు ఇంకా ఉద్యోగం మానమని చెప్పినా వినకపోవడంతో తల్లిదండ్రులు వీరి గురించి ఆందోళన చెందుతున్నారు. ⇒ కొన్నేళ్లుగా అటు చదువు.. ఇటు పార్ట్ టైమ్ ఉద్యోగాలతో(Part time Job) అటు చదువు కోసం చేసిన అప్పుల్ని అమెరికాలో జీవన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పలువురు నగర విద్యార్థుల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో బహిష్కరణ భయాల మధ్య యునైటెడ్ స్టేట్స్(యూఎస్)లోని మన విద్యార్థులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్నా మొన్నటి దాకా.. మధ్యతరగతికి చెందినప్పటికీ స్థోమతకు మించి విదేశీ విద్యను ఎంచుకున్న మన విద్యార్థుల్లో అత్యధికులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదువు కోసం చేసిన భారీ రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు అక్కడి జీవన వ్యయాలను భరించడానికి పార్ట్ టైమ్ ఉద్యోగాలపై ఆధారపడుతూ వచ్చిన విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది తదుపరి ఉన్నత చదువులకు అడ్మిషన్లపై ప్రభావం చూపక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నిన్నా మొన్నటి దాకా అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపిన మన రాష్ట్రం నుంచి భవిష్యత్తులో అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నవారిని ఈ పరిస్థితులు పునరాలోచనలో పడేస్తున్నాయి.ఉద్యోగాలకు అనుమతి ఉన్నా..హెచ్–1 వీసాలపై అమెరికాలో ఉన్న విద్యార్థులు తాము చదువుతున్న క్యాంపస్‌లోనే వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తారు. అయితే కాలేజీ క్యాంపస్‌లలో పనిచేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ అక్కడ తగినన్ని ఉద్యోగావకాశాలు లేకపోవడం లేదా అక్కడ ఆశించిన ఆదాయం రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఖర్చుల్ని భరించడం కోసం క్యాంపస్ వెలుపల రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లలో అనధికారికంగా పనిచేస్తున్నారు.⇒ కాలేజీ సమయం ముగిసిన తర్వాత ఒక చిన్నకేఫ్లో ప్రతిరోజూ 6 గంటలు పని చేసేవాడిని. గంటకు 7 డాలర్లు చొప్పున లభించేవి. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ అధికారుల కఠిన వైఖరితో వారం రోజుల క్రితం పని వదిలేశా.. ఇది ఇబ్బంది పెట్టే సంగతే.. అయినా ఇక్కడ చదువుకోవడానికి 50,000 డాలర్లు(సుమారు రూ.43.5 లక్షలు) రుణం తీసుకున్నా. జాబ్ కోసం చదువును పణంగా పెట్టే పరిస్థితిలో లేను’ అని ఇల్లినాయిస్లో గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థి ధ్రువన్ చెప్పాడు.⇒ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా చెల్లుబాటయ్యే వర్క్ వీసాలు కలిగిన వ్యక్తులను మాత్రమే నియమించుకోవడం ప్రారంభించాయి. గతంలో స్థానిక వ్యాపారాలు, ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు మన విద్యార్థులపై ఆధారపడేవి. ఇప్పుడు, వారు విద్యార్థులను తొలగించి, చెల్లుబాటు అయ్యే జాబ్ వీసాలో ఉన్నవారిని నియమించుకుంటున్నారు. న్యూయార్క్‌లో మాస్టర్స్ చదువుతున్న ఓ విద్యార్థిని నేహా మాట్లాడుతూ ‘పని ప్రదేశాలలో తనిఖీలు చేస్తున్నారు.. దాంతో నన్ను నా ఫ్రెండ్స్‌ను పార్ట్‌టైమ్ ఉద్యోగాలు మానేయాలని మాకు జాబ్స్ ఇచ్చినవారు వెళ్లగొట్టారు. ఇది చాలా కష్టం, కానీ పూర్తి బహిష్కరణకు గురికావడం లేదా మా విద్యార్థి వీసా స్థితిని కోల్పోవడం మరింత నష్టం. నన్ను ఇక్కడికి పంపించడానికి నా తల్లిదండ్రులు ఇప్పటికే చాలా రకాల త్యాగాలు చేశారు’ అని చెప్పింది. ఈ పరిస్థితులపై ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఒకరు మాట్లాడుతూ ‘విద్యార్థులు క్యాంపస్ వెలుపల పనిచేయడం అక్కడ చట్టవిరుద్ధం. మునుపటి పాలకుల్లా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో హెచ్1బీ, గ్రీన్కార్డ్లతో పాటు తమ భవిష్యత్ ఇమ్మిగ్రేషన్ అవకాశాల గురించి విద్యార్థులు భయపడుతుండటం సహజమే’ అని చెప్పారు. -
సర్పంచ్‌గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వగ్రామానికి తరలివచ్చాడు. మెదక్ జిల్లా (Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ అమెరికాలో పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా (Software Engineer) పనిచేస్తున్నారు. గతంలో 25 ఏళ్లు చిన్నశంకరంపేట సర్పంచ్‌గా పనిచేసిన తన తాత శంకరప్ప స్ఫూర్తితో.. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పించారు. దీంతో చంద్రశేఖర్ దంపతులు అమెరికా నుంచి బుధవారం చిన్నశంకరంపేట (Chinna Shankarampeta) చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు అనంత పద్మనాభస్వామి గుట్ట నుంచి సోమేశ్వరాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వారికి స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తాత స్ఫూర్తితో గ్రామానికి సేవ చేసేందుకు స్వగ్రామానికి వచ్చానని చంద్రశేఖర్ తెలిపారు.చదవండి: లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు -
అమెరికా అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ధూంధాంగా పెళ్లి!
మోత్కూర్, నల్గొండ జిల్లా: అమెరికాకు చెందిన యువతితో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన యువకుడికి వివాహం(Marriage) జరిగింది. దాచారం గ్రామానికి చెందిన జినుకల లలిత, ధర్మయ్య దంపతుల ప్రథమ కుమారుడు సందీప్‌కుమార్(Sandeep Kumar) ఉన్నత చదువుల కోసం పదేళ్ల క్రితం అమెరికాకు(America) వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్ రాష్ట్రంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా(Software Engineer) పనిచేస్తున్నాడు. అమెరికా దేశానికి చెందిన మరీయా డిలారోసా, అర్మాండో హెర్నాండేజ్ దంపతుల కుమార్తె అవని ఏలేనా ఎంబీఏ పూర్తిచేసి సందీప్‌కుమార్ పనిచేసే కంపెనీలోనే మేనేజర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సందీప్‌కుమార్, ఏలేనా మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని రాక్ ఎన్క్లేవ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. -
భారతీయ విద్యార్థులకు షాకే..
నిజామాబాద్: భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన వారు ట్రంప్ Donald Trump నిర్ణయాలతో ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఉద్యోగులు చేస్తున్న, మాస్టర్స్ పూర్తి చేసిన వారు తమ పరిస్థితి ఏమిటని అంటున్నారు. తమ పిల్లలు అమెరికా వెళ్లేందుకు అప్పులు చేశామని, బ్యాంక్ లోన్లు తీసుకున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు ఊహించని దెబ్బ అని, కేంద్ర ప్రభుత్వం స్పందించి భారతీయులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దేశాలు అంగీకరించవునా కుమారుడు అమెరికాలో మాస్టర్స్ చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. మేథస్సు ఎవరి సొత్తు కాదు. భారతీయ విద్యార్థులను ఆపడం ఎవరితరం కాదు. ఈ గ్లోబలైజేషన్లో ఎవరు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకోవచ్చు. బలవంతపు నిరాకరణ సరికాదు. ప్రపంచ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని అంగీకరించవు. – గంగాధర్, విశ్రాంత అధ్యాపకుడు, కంఠేశ్వర్ట్రంప్ నిర్ణయం కోర్టుల్లో చెల్లదునా కుమార్తె లాస్‌ఎంజెల్స్‌లో ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్లుగా సాఫ్ట్వేర్ డెవలర్గా టీమ్‌ను లీడ్ చేస్తోంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసింది. అయినా ఆయన నిర్ణయం కోర్టుల్లో చెల్లదు. అమెరికాలోని బిజినెస్మెన్లే ముందుగా వ్యతిరేకిస్తారు. అమెరికేతర సాఫ్టువేర్ నిపుణులతోనే అక్కడి కంపెనీలు నడుస్తున్నాయి. – రాజేంద్రకుమార్, డిప్యూటీ కమిషనర్ఇబ్బందులు తప్పవుప్రస్తుత గ్లోబలైజేషన్ యుగంలో ఎవరు ఎక్కడైనా వెళ్లొచ్చు, ఏ దేశంలోనైనా పని చేసుకోవచ్చు. ఒకే దేశంలో పని చేయాలని ఏం లేదు. ఆసియా దేశాల కారణంగా అమెరికా ఎకనామీ పెరుగుతుంది. చాలా మంది స్టూడెంట్ వీసా, ఎస్బీ – 1 వీసాపై వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. కొంతమంది లీగల్‌గా ఉన్నా వారికి కూడా భవష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. – జలగం తిరుపతిరావు, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్విద్యార్థులకు న్యాయం చేయాలిమన విదేశాంగశాఖ మంత్రి, ప్రధాని మోడీ దౌత్యపరమైన నిర్ణయాలతో అమెరికాలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా న్యాయం చేయాలి. మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని దేశ ఆర్థికాభివృద్దిలో విద్యార్థులు భాగస్వాములయ్యేలా ఆలోచన చేయాలి. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికీ నష్టం జరుగుతుంది.– కెంపుల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ట్రంప్ నిర్ణయాలు సరైనవి కావు..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు సరైనవి కావు. భారతీయులకు ఇబ్బందికరమైనవి. విద్యార్థులకు గతంలో కొనసాగిన విధానాలనే కొనసాగించాలి. ట్రంప్ తన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి. అమెరికాలో భారతీయులకు గతంలో ఉన్న విధివిధానాలనే కొనసాగిస్తూ నిర్ణయాలు అమలు చేయాలి. – లాల్‌సింగ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదికప్రభుత్వం స్పందించాలిభారత ప్రభుత్వం అమెరికా నుంచి తిరిగివచ్చినవారికి న్యాయం చేయాలి. అలాగే అమెరికా అమలు చేస్తున్న నూతన విధివిధానాలపై ఆ దేశంతో మాట్లాడాలి. భారతీయులకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రంప్ నిర్ణయాలు సరైనవికావు.– రఘురాం, ఏఐఎస్ఎఫ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
ఓ.. పరదేశి!
తమిళనాడు: యుద్ధంతో అట్టుడుకున్న ఉక్రెయిన్(Ukraine) దేశ యువతిని విల్లుపురం యువకుడు ప్రేమించి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివరాలు.. విల్లుపురానికి చెందిన జయకుమార్ కుమారుడు ఉదయకుమార్ (30). ఇతను కోవైలో బీఈ చదువు పూర్తి చేసి ఆరు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం స్లోవేకియా దేశానికి వెళ్లారు. అక్కడ రెండేళ్లు చదువు పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ తనతో పాటూ ఉద్యోగం చేస్తున్న ఉక్రెయిన్ దేశానికి చెందిన అనస్టాసియా (25)ను ప్రేమించాడు. తర్వాత వారు పెళ్లి చేసుకోవాలని భావించగా, ఇరు కుటుంబీకులు అందుకు అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో ఆ దేశం నుంచి సొంత ఊరికి వచ్చిన ప్రేమ జంటకు సోమవారం విల్లుపురం సమీపంలో కంబియంపులియూర్ పెరుమాల్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అమెరికా అమ్మాయితో..అదేవిధంగా తిరువన్నామలై జిల్లా చెయ్యారు తాలూకా అనక్కావూరుకు చెందిన భాస్కరన్ అమెరికాలోని ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. భార్య ఆదిరై, ఇద్దరు కుమారులతో టెక్సాస్‌లో నివసిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు అవి నాష్ నాసాలో సైంటిస్ట్‌గా ఉన్నారు. ఈయన ఆ ప్రాంతానికి చెందిన కేథరిన్ ఓసేవి అనే యువతిని ప్రేమించారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబీకులు సమ్మతించడంతో విల్లుపురం జిల్లా సెంజిలో ఉన్న కులదేవత ఏకాంభరేశ్వరర్ ఆలయంలో, తమిళ సాంప్రదాయం ప్రకారం కనులపండువగా వీరి వివాహ వేడుక మంగళవారం సాగింది. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ యువకుడు మృతి
ఖైరతాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ వాజిద్ దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో నివసించే మహ్మద్ అజీజ్ జలమండలి ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు మహ్మద్ వాజిద్ (28) 2021లో ఎంఎస్ చేసేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. వాజిద్ తమ్ముడు మహ్మద్ మాజిద్ కూడా అక్కడే ఎంఎస్ చేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు మాజిద్ అనారోగ్యం బారిన పడటంతో మందులు తీసుకువచ్చేందుకు వాజిద్ కారులో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కారును ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి చేసే యోచనలో ఉండగానే.. మహ్మద్ వాజిద్‌కు ఈ ఏడాది డిసెంబర్లో వివాహం చేసే ప్రయత్నాల్లో ఉండగానే.. అతని మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను అమెరికా రావాలంటూ వాజిద్ వారం రోజుల క్రితం వీసా కూడా పంపించినట్లు సమాచారం. వారు రెండు మూడు రోజుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగానే కుమారుడి మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికాలోనే వాజిద్ అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మహ్మద్ వాజిద్ గతంలో ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ లీడర్‌గా పని చేశాడని, ప్రస్తుతం అమెరికాలో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. ఎంఎస్ మక్తాలోని వాజిద్ కుటుంబ సభ్యులను ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పరామర్శించారు. -
ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!
అగ్రరాజ్యం అధ్యక్షుడి(47)గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానమైన ఉత్తర్వులు జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం రద్దు, ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు. వాటిలో ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అయితే జన్మతః వచ్చే అమెరికా పౌరసత్వం (US Citizenship) రద్దు కార్యానిర్వాహక ఉత్తర్వు అమల్లోకి రాకమునుపే అమెరికా కోర్టు (US Court) తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి సమస్య లేకపోయినా.. ట్రంప్ మాత్రం ఈ ఉత్తర్వు ఎలాగైనా అమలు చేయాలనే పంతంతో ఉన్నారు. మరి అలాంటప్పుడు అక్కడే ఉన్న మన భారతీయ అమెరికన్లకు, చదువుకుంటున్న విద్యార్థులకు ఇక తిప్పలు తప్పవా అంటే..తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఇది వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ చట్టాన్నే రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. అయితే ట్రంప్ సహా మరే ఇతర యూఎస్ అధ్యక్షుడు ఈ రాజ్యంగ హక్కును రద్దు చేయడం అనేది అంత సులభం కాదు. ముందు అమలు చేయనున్న ఈ బిల్లుకి అమోదం లభించాలంటే హౌస్(దిగువ సభ), సెనెట్(ఎగువ సభ) రెండింటిలోనూ మూడింట రెండో వంతు ఓట్లు అవసరం. ఆ తర్వాత మూడు వంతుల అమెరికా రాష్ట్రాలు అమోదం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అమలు అవ్వడం అనేది అంత సులభం కాదనేది విశ్లేషకులు అభిప్రాయం. నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాల విషయంలో మాత్రం కఠినంగా నిబంధనలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావంతో.. F1 (స్టూడెంట్ వీసాలు), H1 (వర్క్ వీసాలు), L1 (ఇంట్రా-కంపెనీ బదిలీలు), B1/B2 (టూరిస్ట్/బిజినెస్ వీసాలు)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే అధికారులు మాత్రం పాలసీ మార్పులు ఏవైనా అమల్లోకి తెచ్చే ముందు.. రెండువైపులా అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెబుతోంది. ఇక.. టైర్ 1, టైర్-2లకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే..విశ్వవిద్యాలయానికి, చేసే కోర్సులతో సంబంధం లేని ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదని F1 వీసాదారులకు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే F1 నిబంధనలకు లోబడిన పనులే చేసుకోవాలని, ఆ పరిధి దాటి పనులు చేసే విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. చదవండి: ట్రంప్ దూకుడు.. వారి గుండెల్లో రైళ్లుఇక.. హెచ్1, ఎల్1 వీసాల విషయంలో కొన్ని చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీలు దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. దీంతో ఆ పాలసీలకు సమీక్షలు జరిగే అవకాశం లేకపోలేదు. మొత్తంగా చూసుకుంటే.. ఉద్యోగార్థం నిజాయితీగా ప్రయత్నాలు చేసేవాళ్లకు మార్పులన్నీ ప్రయోజనకారిగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో వీసాల విశ్వసనీయతను బలోపేతం చేసే ప్రయత్నంగానూ నిపుణులు అభిప్రాయపడున్నారు. చివరిగా.. మెరిట్ ఆధారిత గ్రీన్ కార్డ్ వ్యవస్థ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఇది గనుక అమలైతే.. కొత్త దరఖాస్తులుదారులు 10-15 ఏళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోతుంది. ప్రత్యేకించి ఇది భారతీయ కమ్యూనిటీకి మేలు చేసేదిగానే ఉంటుంది కూడా.-వేణు చిట్వేల్గమనిక: భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? ఎన్నారైలూ.. అభిప్రాయాలను సాక్షి ఎన్ఆర్ఐలో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.(చదవండి: ట్రంప్‌కు షాక్, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట) -
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. మీరేమంటారు?
అందరూ ఊహించినట్టుగానే అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంచలన నిర్ణయాలతో, అమెరికా పౌరసత్వం(US Citizenship) కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి ఆయన స్వస్తి పలికారు. దీంతో అగ్రరాజ్యంలో నివసిస్తున్న వలసదారులు అయోమయంలో పడిపోయారు.అమెరికాలో ప్రస్తుతం 1.40 కోట్ల మంది చట్టవిరుద్ధమైన వలసదార్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 7.25 లక్షల మంది భారతీయులు (Indians) ఉన్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో వీరి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. అక్రమ వలసదార్లను బయటకు పంపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వలసదార్లను ఏరివేసే కార్యక్రమంలో త్వరలో ప్రారంభం కానుంది.ట్రంప్ పట్టుదల2024లో జో బైడెన్ ప్రభుత్వం 1,529 మంది భారతీయులను వెనక్కి పంపించింది. ఇండియా సహా మొత్తం 192 దేశాలకు చెందిన 2.70 లక్షల మంది వెనక్కి వెళ్లిపోయారు. 2014 తర్వాత ఈ స్థాయిలో అక్రమ వలసదార్లను వెనక్కి పంపడం ఇదే మొదటిసారి. అక్రమంగా వలసవచ్చినవారు ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో ఉంటున్నారు. చిన్నాచితక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తక్కువ వేతనానికే కూలీలు లభిస్తుండడంతో గత ప్రభుత్వాలు వీరిని చూసీచూడనట్లు వదిలేశాయి. ట్రంప్ మాత్రం వీరిని బయటకు నెట్టేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.చదవండి: ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసల వర్షంఅమెరికాలో 2.50 కోట్ల మంది అక్రమ వలసదార్లు ఉంటారని ట్రంప్ చెబుతున్నారు. నేర చరిత్ర ఉన్న 6.55 లక్షల మందితోపాటు 10.4 లక్షల మందికి ఇప్పటికే డిపోర్టేషన్ ఉత్తర్వులు అందాయి. త్వరలో వీరంతా వెనక్కి వెళ్లిపోవాల్సిందే. ట్రంప్ బారి నుంచి చట్టపరమైన రక్షణ కోసం అక్రమ వలసదార్లు ప్రయత్నిస్తున్నారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.మీరేమంటారు?కాగా, ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ఏమనుకుంటున్నారు? ఎలాంటి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు, మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? ఎన్నారైలూ.. మీ అభిప్రాయాలను nri@sakshi.comకు పంపించండి. మీ పేరు, ఫొటో సహా sakshi.comలో ప్రచురిస్తాం. -
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ.. మాస్టర్స్ చదివేందుకు 2022లో అమెరికాకు వెళ్లాడు. వాషింగ్టన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొడుకు మృతిచెందాడన్న వార్త తల్లిదండ్రులను కలచివేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెంకు చెందిన కొయ్యడ చంద్రమౌళి–సువర్ణ దంపతులు కొంతకాలం నుంచి ఆర్కే పురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు రవితేజ (26), ఒక కుమార్తె ఉన్నారు. రవితేజ ప్రస్తుతం కనెక్టికట్‌లో ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కారు అద్దెకు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికి వెళ్లారు. అయితే, దుండగులు అప్పటికే చోరీకి పాల్పడి.. పారిపోయే క్రమంలో రవితేజ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. రవితేజ ఎంతసేపటికీ తిరిగి రెస్టారెంట్‌కు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టిన లొకేషన్‌కు వెళ్లి చూడగా రవితేజ మృతదేహం కనిపించింది. ఈ సమాచారాన్ని సోమవారం తెల్లవారుజామున రవితేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవితేజ సోదరి ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రీన్‌హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మాస్టర్ డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమానికి రావాలని రవితేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్‌పోర్ట్, వీసా తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడంతో వారు విషాదంలో మునిగిపోయారని బంధువులు చెప్పారు. డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడుతాను గత శనివారం కొడుకుతో మాట్లాడానని చంద్రమౌళి చెప్పారు. తనకు త్వరలోనే మంచి జాబ్ వస్తుందని... మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడన్నారు. త్వరలోనే నీకు మంచి గిఫ్టు ఇస్తానన్నాడని, అయితే అది ఇదేనా అంటూ ఆయన భోరున విలపించారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు వచ్చేలా చూడాలని చంద్రమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. రవితేజ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి సహాయం చేస్తానని చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. -
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
-
అమెరికన్లు పిల్లల్ని తప్పుడు మార్గంలో పెంచుతున్నారు: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వేదిక మళ్లీ డిమాండ్ చేస్తున్న వేళ.. భారతీయ అమెరికన్ వ్యాపార వేత్త, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్ వెంచర్ కేపిటలిస్ట్ శ్రీరాం కృష్ణన్‌ను కృత్రిమ మేథ సీనియర్ విధాన సలహాదారుగా ఇటీవల నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై మాగా వేదిక విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని అంటోంది. ఇమిగ్రేషన్ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, వివేక్ రామస్వామి మరో కోణంలో చేస్తున్న వాదించారు. అసలు సమస్య ఇమిగ్రేషన్ విధానాల్లో లేదని, అమెరికా సంస్కృతిలో పిల్లల పెంపకంలో లోపమే కారణమంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అమెరికన్ యువతలో సహజంగానే నైపుణ్యం ఉందని, అయితే దానిని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందన్నారు. గణిత మేధావులు, ఉన్నత విద్యావంతులను వదిలేసి అలంకార పదవుల్లో ఉన్న వారిని పొగుడుతుండటమనే సంస్కృతే ఇందుకు కారణమన్నారు. అదే సమయంలో, వలసదారుల కుటుంబాలు తమ పిల్లలను విద్యారంగంలో నిష్ణాతులుగా మార్చి, క్రమశిక్షణతో పెంచుతున్నాయని తెలిపారు. సామాజిక కార్యక్రమాలు, టీవీ వీక్షణం వంటివాటిపైనా ఆంక్షలు పెడుతుంటాయన్నారు. ఫలితంగా ఈ కుటుంబాల నుంచి నాయకులు తయారవడం మామూలేనన్నారు. ఈ వ్యాఖ్యలపై మాగా వేదిక భగ్గుమంది. వలసదారులకు, హెచ్–1బీ వీసాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ వివేక్ రామస్వామిపై ఎదురుదాడికి దిగింది. -
అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన విద్యార్థి బండి వంశీ(25) శనివారం రాత్రి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాదన్నపేటలో కల్లుగీత వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే బండి రాజయ్య–లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి చిన్న కుమారుడు వంశీ సుమారు రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల(ఎంఎస్) కోసం అమెరికాకు వెళ్లాడు. కాంకోర్డియా సెయింట్ పాల్ విశ్వవిద్యాలయం చదువుతూ.. 8580 మాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రెయిరీ అపార్ట్మెంట్, రూం నంబర్ 206, మిన్నెసోటా 55344లో ఉంటున్నాడు. శనివారం రాత్రి అపార్ట్మెంట్ కింద ఉన్న సెల్లార్లో పార్కుచేసి కారులో వంశీ ఉరి వేయబడి అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో.. పక్క అపార్ట్మెంట్లో ఉంటున్న కంఠాత్మకూర్ వాసి విషయాన్ని ఫోన్ ద్వారా తన తల్లిదండ్రులకు తెలుపగా వారు వంశీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వంశీ మృతితో మాదన్నపేటలో విషాదం అలుముకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వంశీ మృతదేహాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెప్పించాలని, మృతికి కారకులను చట్టపరంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఇదిలా ఉండగా.. వంశీ మృతి విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు.మృతదేహాన్ని తెప్పించేందుకు కృషి చేస్తా : ప్రణవ్అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వంశీ మృతదేహాన్ని ప్రభుత్వ పరంగా వీలైనంత త్వరితగతిన స్వగ్రామానికి తెప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ తెలిపారు. ఆయన మాదన్నపేటకు వెళ్లి వంశీ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష: Donald Trump
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాది మృతి
కుత్బుల్లాపూర్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..ఉషా ఫ్యాన్స్ కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి రామ్‌ఆశిష్‌సింగ్ కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేజ్–2లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు సందీప్ కుమార్ యాదవ్ (21) రెండేళ్ల క్రితం ఎమ్మెస్ చేయడానికి అమెరికాలోని ఒహియా వెళ్లాడు.అయితే.. తాజాగా అక్కడ రోడ్డు ప్రమాదంలో సందీప్ మృతి చెందాడు. ఈ నెల 17న (భారత కాలమానం ప్రకారం) రాత్రి తన స్నేహితుడితో కలిసి మరో స్నేహితుడిని కలిసేందుకు కారులో బయల్దేరారు. మౌంట్ గిలిడ్ వద్ద మరో కారు వేగంగా ఎదురు వచ్చి ఢీకొట్టడంతో సందీప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా రామ్‌ఆశిష్ సింగ్ వేడుకుంటున్నారు. -
విద్యార్థిని దివ్యకు కన్నీటి వీడ్కోలు
విజయవాడరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి గత నెల 29వ తేదీన గుండెనొప్పితో హఠాన్మరణం చెందిన అవుతు దివ్య మృతదేహం శనివారం రాత్రి కార్గో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. అక్కడ నుంచి ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం నున్న తీసుకొచ్చి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తుందనుకున్న దివ్యను విగతజీవిలా చూడాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు అవుతు సురేంద్రరెడ్డి, స్వప్న, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దివ్యతోపాటు చదువుకున్న విద్యార్థినులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లగా గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉప సర్పంచ్ కలకోటి బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎంపీపీ యర్కారెడ్డి నాగిరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోలారెడ్డి చంద్రారెడ్డి, బుజ్జి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సోదరుడు సతీష్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా. -
హాలీవుడ్లో మనోడి సినిమా
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్లో సినిమా నిర్మించి, ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు. 11 ఏళ్ల క్రితం అమెరికాకు..వెంకట్‌సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్‌సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్‌లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్‌సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అనేక అవార్డులు పొందాడు. 14 రోజుల్లోనే సినిమా తీశాడు..తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్‌సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్‌సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డానుది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్లో ఎన్నైనా టేక్‌లు తీసుకోవచ్చు. హాలీవుడ్లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్‌వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్లో నటిస్తా. – గుండ వెంకట్‌సాయి ప్రపంచస్థాయిలో గుర్తింపునా కొడుకు వెంకట్సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్‌రా సాయి. – గుండ శ్రీనివాస్, వెంకట్‌సాయి తండ్రి -
గోల్ఫర్ సాహిత్ రెడ్డికి నిరాశ
కాలిఫోర్నియా: ప్రొకోర్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత సంతతి అమెరికా గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఈసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో సాహిత్ 12 అండర్ 276 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. ప్యాటన్ కిజైర్ (అమెరికా) 20 అండర్ 268 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. డేవిడ్ లిప్స్కీ (అమెరికా) రెండో స్థానంలో, ప్యాట్రిక్ ఫిష్‌బర్న్ (అమెరికా) మూడో స్థానంలో నిలిచారు.విజేతగా నిలిచిన ప్యాటర్ కిజైర్కు 10,80,000 డాలర్లు (రూ. 9 కోట్ల 5 లక్షలు), రన్నరప్ లిప్‌స్కీకి 6,54,000 డాలర్లు (రూ. 5 కోట్ల 48 లక్షలు), సెకండ్ రన్నరప్ ఫిష్బర్న్కు 4,14,000 డాలర్లు (రూ. 3 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచిన తీగల సాహిత్ 1,76,100 డాలర్ల (రూ. 1 కోటి 47 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన తీగల సాహిత్ తల్లిదండ్రులు 1980 దశకంలో అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్ అమెరికాలోనే పుట్టి పెరిగి గోల్ఫర్గా రాణిస్తున్నాడు. -
అమెరికాలో ఇచ్ఛాపురం యువకుడు మృతి
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) అమెరికాలోని జార్జ్ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. డెలావర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం (ఆగస్టు 27) న్యూయార్క్‌లోని జార్జ్ లేక్‌కు భారతదేశానికి చెందిన ఐదుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సరస్సు మధ్యలో పెద్ద రాయి కనిపించడంతో దానిపై నిలుచుని ఫొటోలు తీసుకునేందుకు ఎక్కారు. ఈ క్రమంలో రూపక్‌రెడ్డి, అతని స్నేహితుడు రాజీవ్ ప్రమాదవశాత్తు నీటిలో జారిపడ్డారు. మిగిలిన స్నేహితులు రాజీవ్‌ను కాపాడగా, రూపక్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ టీం వచ్చి గాలించిం రూపక్‌రెడ్డి మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతులు, వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
భార్యాభర్తల చీటింగ్
సాక్షి, హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని మోసం చేసిన భార్యభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మాదాపూర్‌కు చెందిన పాలడుగు రఘురాం, పాలడుగు సునీత భార్యభర్తలు. వీరికి సైబరాబాద్‌కు చెందిన చాట్ల సంజీవ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంజీవ్ కుమారుడికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు ఇప్పిస్తామని పాలడుగు దంపతులు సంజీవ్‌ను నమ్మించారు. అమెరికాలోని వైట్ హౌస్‌లో పనిచేసే సుమంత్ అనే వ్యక్తి తమకు బాగా పరిచయమని, ఇతను అడ్మిషన్ ఇప్పిండంలో మనకు సహాయం చేస్తాడని మాయమాటలు చెప్పారు. అడ్మిషన్‌కు కొంత ఖర్చు అవుతుందని చెప్పి, రూ.3.25 కోట్లను వసూలు చేశారు. అడ్మిషన్ కోసం అమెరికా వెళ్లి సుమంత్‌ను కలిసి వస్తామని చెప్పి డబ్బు తీసుకొని భార్యభర్తలిద్దరూ కలిసి అమెరికాకు కాకుండా మైసూర్‌కు చెక్కేశారు. కొత్త సిమ్ కార్డును తీసుకొని యూఎస్‌లో ఉన్నామని బాధితుడిని నమ్మించి వాట్సాప్ చాట్‌లో మాత్రమే సంభాంచేవారు. నకిలీ అడ్మిషన్ పత్రాలను సృష్టించి, సంజీవ్‌కు పంపించారు. తీరా అవి నకిలీ పత్రాలను తేలిపోవడంతో డబ్బు వెనక్కి ఇవ్వాలని రఘురాంను సంప్రదించగా తప్పించుకొని తిరిగే వాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు రఘురాం, సునీతలను అరెస్టు చేశారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
దేవరపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన గద్దే సాయిసూర్య అవినాష్ (26) సోమవారం వాటర్‌ఫాల్స్‌లో పడి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిట్యాలకు చెందిన గద్దే శ్రీనివాస్, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అమెరికాలో ఉంటుండగా, 2023 జనవరిలో ఆమె సోదరుడు సాయి సూర్య అవినాష్ ఉన్నత చదువు (ఎంఎస్)కు అమెరికా వెళ్లాడు. అక్క ఇంటి వద్ద ఉంటూ ఉన్నత చదువుకుంటున్నాడు. ఆదివారం అక్క కుటుంబ సభ్యులతో కలసి ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి రెండు కుటుంబాలూ వాటర్‌ఫాల్స్‌కు వెళ్లాయి. అక్కడ సాయిసూర్య అవినాష్ ప్రమాదవశాత్తూ వాటర్‌ఫాల్స్‌లో పడి నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. అవినాష్ మృతదేహాన్ని స్వగ్రామం తీసుకు వచ్చేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్‌గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్‌లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) మెగా కన్వెన్షన్ సియాటెల్ కన్వెన్షన్ సెంటర్లో మే 24 నుంచి 3 రోజులపాటు మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభలో భాగంగా వైఎస్సార్సీపీ మీట్ అండ్ గ్రీట్తో పాటు డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సభలకు వైఎస్సార్సీపీ నేతలు, రాజన్న అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.వైఎస్సార్ ప్రజలందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని ప్రవాసాంధ్రులు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు.పొలిటికల్ సెషన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ వైఎస్సార్ అభిమానులు. సీఎం జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రసంగాల మధ్యలో జోహార్ వైయస్ఆర్ నినాదాలతో, హొరెత్తించారు. -
అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు. కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అటారీ్నగా, గవర్నర్ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్)గా పనిచేశారు. గర్వకారణంగా ఉంది నాతో పాటు మా కుటుంబ సభ్యులందరికీ గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా తెలుగువారందరు గర్వపడేలా నా కుమార్తె జయ ఘనకీర్తి సాధించటం ఎంతో సంతోషంగా ఉంది. ఆమె ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. తెలుగువారందరు గరి్వంచే విధంగా పనిచేస్తానని జయ చెప్పింది. – బాడిగ రామకృష్ణ, మాజీ ఎంపీ -
అమెరికాలో భూకంపం!
న్యూయార్క్: యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. అమెరికాలో పలు రాష్ట్రాల్లో భూకంపం సంభించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభించింది. పొరుగున ఉన్న న్యూజెర్సీ సైతం భూకంపం భారీన పడిందని పలు వెలుగులోకి రాగా..భూకంపం ప్రభావం ఏ మేరకు చూపందనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. బ్రూక్లిన్‌లోని భవనాలు కంపించాయని ఏఎఫ్‌పీ మీడియా ప్రతినిధి నివేదించారు. భూకంపం వచ్చిన సమయంలో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో గాజాలో పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తుంది. ప్రకంపనలతో సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. Notable quake, preliminary info: M 4.8 - 7 km N of Whitehouse Station, New Jersey https://t.co/DuTYZ1kb4X — USGS Earthquakes (@USGS_Quakes) April 5, 2024 ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్ వరకు తూర్పు వైపు లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం సంభవించినట్లు నెటిజన్లు ట్వీట్లు,పోస్ట్‌లు పెడుతున్నారు. #WATCH : Streamer captures moment earthquake hit New Jersey and felt in New York City#NewYorkCity #NewYork #earthquake #JUSTIN #LatestNews #USNews #USA #NewJersey pic.twitter.com/spo8RcHI17 — upuknews (@upuknews1) April 5, 2024 https://t.co/pf77R31SX6 — SkyQueen (@Triquetra331) April 5, 2024 -
US: క్రూయిజ్ ఎక్కే అదృష్టం కూడా ఉండాలేమో.!
రోడ్డు, రైలు, వాయు రవాణాలు ఎన్నున్నా తెలంగాణా సముద్ర తీరంలేని రాష్ట్రం కావడం వల్ల జల రవాణాకు ఉపయోగించే ఓషన్ లైనర్స్, విహార యాత్రలకు వాడే క్రూయిజ్ షిప్‌లు ఇక్కడి వాళ్లకు కొత్త. అయితే మన దేశంలో విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ముఖ్యంగా ముంబై , గోవా, విశాఖ, లక్ష్యదీప్, కేరళ, అండమాన్, కొచ్చి, మాల్ దీవ్ జలాల్లో క్రూయిజ్‌లు సందర్శకులతో రౌండ్ ట్రిప్‌లు చేస్తూ మన పర్యాటక పరిశ్రమలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. క్రూయిజ్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ‘ టైటానిక్ ’ . 1912 నాటి ఈ అతిపెద్ద ప్రయాణికుల నౌక తన మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14 న ప్రమాదవశాత్తు ఒక మంచుకొండను ఢీకొని సముద్రంలో మునిగిపోవడం, అందులోనున్న 1500కు పైగా ప్రయాణికులు, సిబ్బంది చనిపోవడం అదో పెద్ద చరిత్ర. ఈ నేపథ్యంతో జేమ్స్ కామెరాన్ రూపొందించిన హాలీవుడ్ ప్రేమ కథా చిత్రం టైటానిక్ ( 1997 ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి సినీ ప్రపంచంలోనే మరో చరిత్ర సృష్టించింది. సముద్ర మార్గాల్లో తిరిగే ఈ క్రూయిజ్లలో పర్యాటకులు బస చేయడానికి కావలసిన అన్ని సౌకర్యాలు, విలాసాలు ఉంటాయని వినడమే కానీ వీటిలో విహరించే అవకాశం మాకు 2016 అక్టోబర్‌లో అమెరికా వెళ్ళినప్పుడు మాత్రమే వచ్చింది. అప్పుడే అమెరికాలో హాలోవిన్ దయ్యాల పండగ నడుస్తోంది. మన దగ్గర పీర్ల పండగ కోలల్లాగ పిల్లలు ఇంటింటికి వెళ్లి క్యాండీలు సేకరిస్తూ ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్నారు. మా అమ్మాయి ఎంబీఏ పట్టా ప్రదానం చేసిన సందర్భంగా కోజుమల్ మెక్సికో క్రూయిజ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. డల్లాస్ నుం కారులో బయలుదేరి, ఆ రోజంతా ప్రయాణం తర్వాత ,రాత్రి 12 గంటలకు కుబాసియానా ఒక హోటల్లో బస చేసి మరునాడు ఉదయమే పోర్ట్‌కు చేరుకున్నాము. మేము క్రూయిజ్ అనబడే కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టింది డిసెంబర్ 15 నాడు, ఎయిర్పోర్ట్ లాగే సెక్యూరిటీ, పాస్‌పోర్ట్, వీసా వగైరా చెకింగ్లు చేశారు. అదో బహుళ అంతస్తుల భవనంలా ఉంది, అందులో అన్ని వసతులున్న ఏసి గదులున్నాయి. బాల్కనీ నుంచి కరీబియన్ సముద్రాన్ని చూస్తుంటే చుట్టు పక్కల ఏమీ కనబడలేదు పెద్ద పెద్ద అలలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్న జలాలు తప్ప. లంచ్ అయినా డిన్నర్ అయినా షిప్‌లోని పెద్దపెద్ద హోటళ్లలోనే. డిసెంబర్ 16 నాడు క్రిస్మస్ ప్రోగ్రాము కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పక్కకే క్యాసినోలు, క్యాబరేలు.. డబ్బులుంటే వినోదాలకు కొరత లేదు. డిసెంబర్ 17 నాడు కొజు మల్ మెక్సికో ఐలాండ్ మీద అడుగు పెట్టాం. అక్కడి బీచ్ సన్ బాత్ చేసేవాళ్లతో కళకళలాడిపోతుంది. నదీ స్నానాన్ని మించిన ఆనందమేదో సముద్రంలో ఉన్నట్టుంది. అక్కడే డాల్ఫిన్లను చూశాం, ఆ సరదా కూడా తీర్చుకున్నాం. అక్కడ ఎన్ని సౌకర్యాలున్నాయంటే.. అప్పటికప్పుడు మన ఫోటోలు తీసిపెట్టేవాళ్లకు కొదువ లేదు. అక్కడ లభించే బఫె భోజనాల్లో రకరకాల సీఫుడ్ జీర్ణించుకునే శక్తి ఉంటే ఎంతైనా తినవచ్చు. ఆ ద్వీపాన్ని వదిలి మళ్ళీ క్రూయిజ్‌లోకి ప్రవేశించే సరికి సొంత ఇంట్లోకి వచ్చిన భావన కలిగింది. ఆ రోజు రాత్రంతా సముద్రం మీద ప్రయాణం, డిసెంబర్ 19 నాడు క్రూయిజ్ మళ్లీ మేము బయలుదేరిన పోర్ట్‌కు చేర్చింది. ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ పెట్టి మరీ క్రూయిజ్ సిబ్బంది మాకు వీడ్కోలు పలికారు, మళ్ళీ మళ్ళీ రావాలని చెబుతూ ! వేముల ప్రభాకర్ (చదవండి: యూఎస్‌లోనే అత్యంత సంపన్న మహిళగా..ఏకంగా రూ. 75 వేల కోట్లు..!) -
హిందూ ఆలయాలపై దాడులు.. నివేదిక కోరిన యూఎస్ కాంగ్రెస్ సభ్యులు!
అమెరికాలో ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై పెరిగిన దాడులపై జరిగిన విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఐదుగురు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు అమెరికా న్యాయ శాఖకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ప్రార్ధన స్థలాల వద్ద విధ్వంసకర చర్యల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీతానేదార్, అమీ బేరాలు రాశారు. దేవాలయాలపై దాడుల ఘటనలు హిందూ అమెరికన్ల ఆవేదనకు కారణమవుతున్నాయని, న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వరకు పలు మందిరాలపై జరుగుతున్న దాడులపై విచారణ ఏ స్థితిలో ఉందో తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న అనుమానితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విచారకరమన్నారు. దాడుల నేపథ్యంలో చాలామంది హిందువులు భయం, బెదిరింపుల మధ్య జీవించాల్సి వస్తోందని వారు వివరించారు. చట్ట ప్రకారం అందరికీ సమాన రక్షణను కల్పించడానికి తగిన ఫెడరల్ పర్యవేక్షణ ఉందా? అని వారు ఆ లేఖలో ప్రశ్నించారు. జనవరిలో కాలిఫోర్నియాలోని హేవార్డ్లోని ఒక ఆలయంపై దాడులకు పాల్పడిన దుండగులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారన్నారు. ఇలాంటి ఉదంతమే నెవార్క్‌లోని మరొక దేవాలయంలో కూడా జరిగిందన్నారు. యునైటెడ్ స్టేట్స్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్వేషపూరిత దాడుల నివారణకు ప్రభుత్వం ఏమిచేస్తున్నదని వారు ప్రశ్నించారు. దీనిపై సంబంధిత విభాగం తమకు గురువారంలోగా నివేదిక అందించాలని యూఎస్ కాంగ్రెస్ సభ్యులు ఆ లేఖలో కోరారు. -
‘అయ్యో గీతాంజలి’.. అమెరికాలో రెండ్రోజుల వ్యవధిలో తల్లీకూతుళ్ల మృతి
కొణకంచి(పెనుగంచిప్రోలు): అమెరికాలోని పోర్టుల్యాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గీతాంజలి పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఈ ఘటనలో భర్త నరేష్, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం అలముకుంది. వారి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
అమెరికాలో కాజీపేట విద్యార్థి దుర్మరణం
కాజీపేట: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశానికి వెళ్లిన ఓ విద్యార్థి వాటర్ గేమ్స్ ఆడుతుండగా జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణానికి చెందిన పిట్టల రాజగణేష్ కుమారుడు వెంకటరమణ (27) ఉన్నత విద్య కోసం గత ఏడాది ఆగస్టు 22న అమెరికా వెళ్లాడు. ఇండియానా యూని వర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫార్మటిక్స్ కోర్సు చదువుతున్నాడు. ఈనెల 9న మిత్రులతో కలిసి వెస్ట్ఫ్లోరిడాకు వెళ్లి వాటర్ గేమ్స్ ఆడు తుండగా, వేరే వ్యక్తి వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో వెంకటరమణ నీటిలో పడి మృతిచెందాడు. వెంకటరమణ మృతి విషయాన్ని భారత ఎంబసీ అధికారులు కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి తెలిపారు. మృతదేహం ఈనెల 18 లేదా 19న భారత్‌కు వస్తుందని సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. -
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
పలమనేరు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. స్థానిక సాయినగర్‌కు చెందిన భాస్కర్, సుమలతరెడ్డి కుమార్తె రేవూరి మీనా నాలుగేళ్లుగా అమెరికాలోని మిచిగాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న అదే రాష్ట్రం వాటర్‌పోర్ట్ టౌన్‌కు చెందిన బ్రాడ్లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు తెలుపడంతో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఇక్కడి కళ్యాణ మండపంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం మేరకు ఘనంగా జరిగింది. బంధువులు హాజరై నూతన జంటను ఆశీర్వాదించారు. -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్‌గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్‌తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్‌గా.. అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్‌గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
అమెరికాలో ‘గ్రాడా’ ఆవిర్భావం..
అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వారి కోసం మరో కొత్త సంస్థ పురుడుపోసుకొంది. ‘గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా- గ్రాడా’ పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఇటీవల జరిగిన ‘గ్రాడా’ గ్రాండ్ లాంచ్‌లో రాయలసీమ వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టారు. నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్‌లో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌లో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సాయం చేశారు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు సంస్థ చేపడుతుందని నిర్వహకులు తెలిపారు. ‘గ్రాడా’ అసోసియేషన్ గురించి వివరించారు. ఇన్స్పిరేషన్, ఇంటరాక్షన్ , ఇన్‌క్లూజన్ అనే మూడు ఫండమెంటల్స్‌పై ‘గ్రాడా’ పనిచేస్తుందని తెలిపారు. అలాగే సంస్థ తరుపున చేపట్టే కార్యక్రమాలను వివరించారు. -
అమెరికా నుంచి వచ్చి.. యువతిని వేధించిన సీఈఓ
హైదరాబాద్: తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్‌పేట సంస్థ)లో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్లో ఇండియాకు వచి్చన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సరీ్వసెస్ డ్యూస్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని వనస్థలిపురానికి చెందిన కరుణాకర్‌రెడ్డిగా గుర్తించారు. స్విమ్మింగ్ పూల్‌లో మృతదేహంగా కనిపించాడాయన. కరుణాకర్ స్థానికంగా ఓ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లో పని చేస్తున్నట్లు సమాచారం. కరుణాకర్ మృతిపై ఆస్టిన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
అమెరికాలో మృతి చెందిన తెలుగు విద్యార్థి.. స్వగ్రామం చేరిన మృతదేహం
పార్వతీపురం మన్యం: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన పాలకొండకు చెందిన ఓ విద్యార్థి విగతజీవిగా సొంతూరుకు శనివారం చేరాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో పాలకొండ శోకసంద్రమైంది. చదువే లోకంగా జీవించిన ఆ విద్యార్థి కలలు కల్లలయ్యాయి. తమ బిడ్డపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... పాలకొండలోని బట్టి మఠం కాలనీలో రాకోటి వెంకటరమణ, ఆదిలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమారుడు రాకోటి సాయినికేష్(21), కుమార్తె లేఖ ఉన్నారు. సాయినికేష్ ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ కోసం గత నెల డిసెంబర్ ఆఖరులో అమెరికా వెళ్లాడు. హర్ట్‌పోర్టు సిటీలో సీక్రెడ్ యూనివర్సిటీలో సీటు రావడంతో అక్కడ ఎంఎస్‌లో చేరాడు. అమెరికా వెళ్లిన 15 రోజుల్లోనే ఈ నెల 12న శుక్రవారం తాను ఉంటున్న గదిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. సాయినికేష్‌తో పాటు అదే గదిలో ఉంటున్న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన మరో తెలుగు విద్యార్థి కూడా మృతి చెందాడు. విష వాయువు పీల్చడంతోనే వీరిద్దరు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. శనివారం సాయినికేష్ మృతదేహం ఇక్కడకు రాగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ బిడ్డ మృతికి పూర్తి కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయినికేష్ మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన సహచర విద్యార్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో పాలకొండ పట్టణంలో విషాదం అలముకుంది. -
దౌత్య కార్యాలయాలపై దాడులు.. 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ
ఢిల్లీ: అమెరికా, యూకే, కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై ఇటీవల జరిగిన దాడుల్లో 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గుర్తించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు ఈ ఏడాది అమెరికా, యూకే, కెనడాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడుల కేసును జూన్‌లో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది మార్చి 19న లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్తానీ వర్గాలు రెండు వేర్వేరు దాడులకు పాల్పడ్డాయి. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఏడాది ఆగష్టులో శాన్ ఫ్రాన్సిస్కోను ఎన్ఐఏ బృందం సందర్శించింది. మార్చి 2023లో కెనడా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. ఈ కేసులో భారతదేశంలో ఇప్పటివరకు 50 చోట్ల దాడులు నిర్వహించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దాడులకు సంబంధించి సుమారు 80 మందిని విచారించారని సమాచారం. ఇదీ చదవండి: రామ మందిర విరాళాల పేరిట నకిలీ క్యూఆర్ కోడ్.. వీహెచ్‌పీ అలర్ట్ -
భారత్, యూఎస్.. ఓటర్ల శక్తిని పెంచే కొత్త సంవత్సరం 2024
ప్రపంచంలో అతిపెద్ద జనతంత్ర రాజ్యం ఇండియాలో, అత్యంత ఉత్కృష్ట ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో 2024లో కేంద్ర ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటర్లు అప్పుడే సిద్ధమౌతున్నారు. ఈ జాతీయ ఎన్నికల్లో ఏయే అంశాల ఆధారంగా తాము ఓటేయాలో ఆలోచించడం మొదలుబెట్టారు. ఎన్నెన్నో వ్యత్యాసాలున్న ఈ రెండు విశాల దేశాలనూ కలిపే అంశం ఎన్నికల ద్వారా నడిచే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే. నిజానికి అమెరికా జనాభా 33 కోట్ల 49 లక్షలని, భారతదేశం జనసంఖ్య 142 కోట్లు దాటిందని ఈ ఏడాది తెలిసింది. ఇక భూభాగం విషయానికి వస్తే–ఇండియా కన్నా అమెరికా వైశాల్యం మూడు రెడ్లు ఎక్కువ. ఇతర దేశాల ప్రజలు లక్షల సంఖ్యలో వలసొచ్చి అమెరికాలో స్థిరపడడానికి అవసరమైన చోటు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలు, ఇతర వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో ఓటర్ల సంఖ్య విషయంలో ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. అన్ని పార్లమెంట్లకు మాతృక అని వర్ణించే బ్రిటిష్ పార్లమెంటు ఉన్న యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ఆ దేశ సంపర్కంతో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో. ‘కొత్త ప్రపంచం’గా అభివర్ణించే అట్లాంటిక్ మహాసముద్రం ఆవల ఉన్న ఈ సువిశాల అమెరికాలో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 12 సంవత్సరాలకు ఆరంభమైంది. అక్కడ మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788 డిసెంబర్ 15న మొదలై 1789 జనవరి 7న ముగిశాయి. ప్రథమ అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సేనాని జార్జి వాషింగ్టన్ ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ 2020 ఎన్నికల వరకూ ఈ అత్యంత సంపన్న దేశంలో (ప్రతి నాలుగేళ్లకూ) 59 సార్లు జరిగాయి. వచ్చే ఏడాది నవంబర్ 5న 60వ అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇండియాతో పోల్చితే 163 ఏళ్ల ముందే ఎన్నికల ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన కారణంగా మనకు వింతగా కనిపించే ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అమెరికాలో కనిపిస్తాయి. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ తేదీ కూడా ఇలాంటిదే. 18వ శతాబ్దం చివరిలో అమెరికాలోని వ్యవసాయ పనులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నవంబర్ మాసంలో తొలి సోమవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారంనాడు ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతిసారీ నవంబర్ 7 లోపే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగడం చూస్తున్నాం. ఇండియాలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రెండేళ్లకే ఎన్నిక ప్రజాస్వామ్యం.. అమెరికాలో రాజ్యాంగ రచన పూర్తయి, మొదటి సాధారణ ఎన్నికలు జరిపించడానికి పుష్కర కాలం పట్టింది. కానీ, ఇండియాలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి) నాటి నుంచి రెండేళ్లలోపే అంటే 1951 అక్టోబర్ 25న తొలి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 1952 ఫిబ్రవరి 21న ముగిసింది. నాటి పరిస్థితులు, విస్తృతమైన ఎన్నికల నిర్వహణ అనుభవం లేకపోవడంతో ప్రథమ సాధారణ ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల కాలం అవసరమైంది. ఇప్పుడేమో ఎన్నికలు ప్రశాంతంగా, సాఫీగా జరగడం కోసం నెల రోజుల సమయం పడుతోంది. 2019 పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయడానికి నెలపైన వారం రోజుల సమయం అవసరమైంది. ఈ రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం విషయం ఓటర్ల నమోదు ప్రక్రియ. ఇండియాతో పోల్చితే పోలింగ్ శాతం బాగా తక్కువ ఉండే అమెరికాలో పోలింగ్ రోజు కూడా పొద్దున్నే ఓటరుగా నమోదు చేయించుకుని, తర్వాత ఓటు వేసే వెసులుబాటు అక్కడి పౌరులకు కల్పించారు. భారత్‌లో నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాగే, అమెరికాను దాదాపు 525 ఏళ్ల క్రితం క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టినప్పటి నుంచీ అక్కడికి ఏటా లక్షలాది ప్రపంచదేశాల ప్రజలు వచ్చి స్థిరపడుతూనే ఉన్నారు. ఇలా ఉన్నత విద్య, ఉపాధి కోసం వచ్చిన వారందరికీ వెంటనే పౌరసత్వం రాదు. కోరుకోకపోతే కొందరికి ఎప్పటికీ రాకపోవచ్చు కూడా. ప్రధానంగా పని, నివాసం, ఇతర అంశాల వల్ల పౌరసత్వం వచ్చిన (నేచురలైజేషన్) వ్యక్తులు మొదట చేసే పని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడాన్ని– తమ కృషిని గుర్తించి తమకు పౌరసత్వం ఇచ్చిన అమెరికా రుణం తీర్చుకోవడంలో భాగంగా ఈ పూర్వ వలసదారులు భావిస్తారు. ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారికి అత్యధిక సంఖ్యలో 2022లో అమెరికా పౌరసత్వం లభించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కిందటేడాది నేచురలైజేషన్ ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో దాదాపు పది లక్షల మంది అమెరికా పౌరసత్వం పొందారు. ఈ నూతన పౌరులందరికీ 2024 నవంబర్ 5 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లభించింది. ఓటు వేయడాన్ని తమ శక్తిగా, దేశం రుణం తీర్చుకునే క్రియలో భాగంగా పరిగణించడం నిజంగా మంచి భావనే. ఈ సూత్రం ఇండియాకు కూడా వర్తిస్తుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
అమెరికాలో వైద్య విద్యార్థిని మృతి
మహబూబాబాద్: అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్యవిద్యార్థిని మృతి చెందగా ఆదివారం సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వడ్డేపల్లి పుల్లయ్య కుమార్తె నీరజ(28) ఖ మ్మం జిల్లా కేంద్రంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసింది. అమెరికాలోని మెస్సోరీ రా ష్ట్రంలోని లూయిస్ యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కాగా శనివారం రాత్రి ఆమెరికా నుంచి మృతదేహం వరంగల్‌కు చేరుకోగా ఆదివారం స్వ గ్రామానికి తీసుకొచ్చారు. ఉన్నత విద్యకోసం వెళ్లిన నీరజ విగతజీవిగా స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జిల్లేడు చెట్టుకు వివాహం జరిపించి అంత్యక్రియలు జరిపించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కాంపల్లికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఇవి కూడా చదవండి: కళ్లెదుటే ఇద్దరు కుమారులు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి -
ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్‌కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా ఆమె పనిచేశారు. 1991లో ఫారిన్ సర్వీస్‌లో చేరిన లఖ్దీర్.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్‌కు డిప్యూటీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్ఎస్ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు -
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్‌లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్‌లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్‌కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్‌కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
అమెరికా చదువు సంస్కృతులు
అమెరికా విద్యారంగంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు, రాజకీయులు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకు పాఠశాలల నిర్వహణ అద్భుతంగా ఉండేది. యువ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో చనువుగా ప్రవర్తించే వారు. పిల్లల విషయాలను చర్చించడానికి ఒక రోజయినా వారితో గడిపేవారు. నేటి విద్యార్థులు, యువత అతి తక్కువ సమయంలో ఊహించని, తీవ్రమయిన మార్పులకు గురవుతున్నారు. యుక్త వయసులోకి ప్రవేశిస్తున్న వీరు జ్ఞానాన్ని గ్రహించటానికి పెనుగు లాడుతున్నారు. పాఠశాలలకూ సమస్యలున్నాయి. విపరీతంగా సాగదీయ బడిన ప్రతిష్ఠాత్మక పునర్నిర్మాణ పథకం, ఆశించిన స్థాయిని అందు కోలేని దూరవిద్య, కరోన మహమ్మారి కాలపు అలవాట్ల నుండి బయటపడలేని దుఃస్థితి అందులో కొన్ని. విద్యాలయాల వద్ద మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు మరో తీవ్ర సమస్య. బాంబుల, తుపాకుల ఉపయోగ సంస్కృతి సకారాత్మక నిర్ణయా లకు అడ్డుతగులుతున్నాయి. మహమ్మారి కాలంలో కోల్పోయిన పాఠ్యాంశాలను విద్యా ర్థులు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. రెండేళ్లలో తప్పిన సాంఘికీకరణ, పరిపక్వతలను సంపాదిస్తున్నారు. సామాజిక అభివృద్ధిలో విద్యార్థులు రెండేళ్ళు వెనుకబడ్డారని మానసికశాస్త్ర ఉపాధ్యాయుల అభిప్రాయం. అందుకే బళ్ళలో అంతా బాగుందనేవాళ్ళ సంఖ్య తగ్గింది. విద్యారంగం పిచ్చివాళ్ళ, తీవ్రవాదుల హస్తాల్లో చిక్కుకుందని కొన్ని పత్రికలు ప్రచారం కూడా చేస్తున్నాయి. అమెరికాలో విడాకులు పెరిగాయి. పిల్లలకు ఇద్దరు తల్లిదండ్రుల పెంపక అవకాశం లేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరో ఒకరే పిల్లలను పెంచవలసి వస్తోంది. 25 శాతం పిల్లలు ఇలాంటి వారే. ఏ దేశంలోనూ ఈ స్థితి ఈ స్థాయిలో లేదు. ఈ చేదునిజం అమెరికాలో సింగిల్ పేరెంట్ సంరక్షణ శిశువులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనితో సమాజం నష్టపోతోంది. ఈ పిల్లలు ప్రవ ర్తనా సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలల్లో వీరి సంఖ్య తక్కువ. వారిలో అవగాహన, బోధనాంశాలను అర్థం చేసుకోవడంలో తేడా ఉంటోంది. పిల్లల చదువు, భావిపౌరుల శ్రేయస్సుకు... అమెరికాలో పతనమయిన కుటుంబ, సామాజిక సంబంధాలను మెరుగుపర్చడమే మార్గం. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
అమెరికాలో ఘనంగా శ్రావణమాస మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో శ్రావణమాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పండుగలను వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా తమ ప్రాంత వైభోగాన్ని, పండుగలను అందరితో కలిసి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఏఏఏ డెలావేర్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమపూజను ఘనంగా నిర్వహించారు. డెలావేర్‌లోని మిడిల్ టౌన్‌లోని జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పూజ కార్యక్రమాలతో పాటు పాటలు, డ్యాన్స్‌లు అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్‌లు, సంగీత విభావరులు, ఆట పాటలతో కార్యక్రమం ఉత్సహంగా సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రముఖ సింగర్స్ హిట్టయిన పాటలను పాడి అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసులు ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ పిండివంటలతో తయారు చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పసందైన విందు భోజనం అందించారు. వరలక్ష్మీ వ్రతాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయుల చేత ఘనంగా జరిపేందుకు వీలుగా శ్రావణ మహోత్సవాలు పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల ఏఏఏ డెలావేర్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ) -
ఊరుకాని ఊరిలో ఏం కష్టం వచ్చిందో ఏమో!
కర్ణాటక: ఆమెరికాలో నివాసం ఉంటున్న దావణగెరెకి చెందిన దంపతులు, కొడుకు అనుమాస్పదంగా మృతి చెందారు. దావణగెరె జిల్లా జగళూరు తాలూకా హలేకల్లు గ్రామానికి చెందిన యోగేశ్ హొన్నాళ (37), ప్రతిభా (35), వారి కొడుకు యశ్ (6) అమెరికాలోని మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ నగరంలో నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల నుంచి యోగేశ్ దంపతులు అమెరికాలోనే ఐటీ ఇంజినీర్లుగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి బంధుమిత్రులను కలిసేవారు. గురువారమే యోగేశ్ దావణగెరెలోని తల్లి శోభతో ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందో కానీ శనివారం కుటుంబసభ్యులకు ముగ్గురి మరణవార్త చేరింది. వారు ఆత్మహత్య చేసుకున్నారని బాల్టిమోర్ పోలీసులు ప్రకటించారు. ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను త్వరగా తరలించి సాయం చేయాలని ఇరువురి కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరాయి. -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
వరంగల్‌లో అమెరికా దంపతుల దత్తత వివాదం.. ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంతో
సాక్షి, వరంగల్: అమెరికా దంపతులు.. వరంగల్‌కు చెందిన ఓ ఆరేళ్ల శిశువును దతత్త తీసుకునే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆ పాపకు జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఏకంగా వీసా తీసుకుని అమెరికాకు తీసుకెళ్లేందుకు మూడు నెలల క్రితం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించారు. ఆ తర్వాత జరిగిన దత్తత విధానమే ఇప్పుడూ అనుమానాలకు తావిస్తోంది. ఆ పాపను దత్తత ఇచ్చే విధానాన్ని వేగిరం చేయాలని కొందరు స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఆథారిటీ(సారా) అధికారులతో పాటు శిశు గృహ సందర్శన నివేదికను సమర్పించాలంటూ హనుమకొండ జిల్లా సంక్షేమ శాఖలోని ఓ విభాగాధికారి ఒకరు అత్యుత్సాహం చూపారనే విమర్శలున్నాయి. వాస్తవానికి ఆ పాప వరంగల్ సిటీకి చెందినట్లు జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్నా.. ఆ శిశువును దత్తత తీసుకునేందుకు ఆన్లైన్ ద్వారా హనుమకొండలోని బాలల సంరక్షణ విభాగానికి దరఖాస్తు వచ్చింది. దీంతో వరంగల్ జిల్లాలో దత్తత కార్యక్రమాలను పర్యవేక్షించే వారిని గృహ సందర్శన చేసి నివేదిక సమర్పించాలంటూ అడిగినట్లు తెలిసింది. అక్కడా కుదరదనే...ఇక్కడకు వచ్చి.. అమెరికాకు చెందిన దంపతులు కరీం విరాణి, అశామా విరాణి అమెరికా నుంచి వచ్చి కొంపల్లిలో తాత్కాలిక నివాసం ఉంటున్నారు. వాస్తవానికి ఇంటర్ కంట్రీ అడాప్షన్ (ఓఏఎస్) చిల్డ్రన్ కోసం ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీ(ఏఎఫ్ఏ) నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) సంబంధిత దేశం ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీవివిధ దేశాల్లో ఉన్న ఎంబసీలోని ఫారెన్ అథరైజ్డ్ ఏజెన్సీ (ఆపా) వద్ద పిల్లలు దత్తత కావాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడా వారి స్థితిగతులను అధ్యయనం చేశాకే ఆ దంపతులను కారాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆపా కోరుతుంది. అయితే కరీం, అశామీ విరాణి విషయంలో ఆపాను సంప్రదిస్తే అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం బతికున్న తల్లిదండ్రుల నుంచి పిల్లలను దత్తత తీసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అందుకే హైదరాబాద్‌కు వచ్చిన వీరు ఇన్నర్ కంట్రీ అడాప్షన్ అనే ఆప్షన్ ద్వారా కారాలో దరఖాస్తు చేసుకున్నారు. కరీం విరాణి కొంపల్లిలో తాత్కాలిక నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి..తన సోదరి, వరంగల్‌కు చెందిన రషీదాబాను భోజని శిశువును దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అమ్యన్ అలీ భోజని, రషీదాబాను భోజని దంపతులకు 10, 8 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గతేడాది ఆమె గర్భవతి కాలేదని సమాచారం. దీంతో ఆ పాప ఎక్కడి నుంచి వచ్చింది...ఎవరి పాప...కొనుగోలు చేశారా అనే దిశగా అనుమానాలు వస్తున్నాయి. వీరు రారు.. వారు రారు.. వరంగల్‌కు చెందిన అడ్వకేట్ కృష్ణ ద్వారా ఈ దంపతులకు సంబంధించి దత్తత ఆదేశాలు ఇవ్వాలంటూ కలెక్టర్ ద్వారా జిల్లా సంక్షేమ అధికారికి కొద్దిరోజుల క్రితం పిటిషన్ వచ్చింది. దీనిని పరిశీలించిన జిల్లా బాలల సంరక్షణ విభాగం.. ఇంటర్ కంట్రీ అడాప్షన్ పేరేంట్స్ (పాప్స్) కిందకు వస్తుందంటూ చెబుతూనే..అథరైజ్డ్ ఫారెన్ అడప్షన్ ఏజెన్సీ(ఏఎఫ్ఏ) నుంచి నిరంభ్యంతర పత్రం సమర్పించాలన్నారు. దీని ఆధారంగానే దత్తతను ముందకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే పాప కోసం దరఖాస్తు చేసుకున్న విరాణి దంపతులు, ఆ పాప బయోలాజికల్ పేరెంట్స్ అయిన భోజని దంపతులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరు కాలేదు. ఇంకోవైపు శ్రీహోమ్ స్టడీ రిపోర్ట్శ్రీ ఇవ్వాలని లోకల్ రాజకీయ నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వరంగల్ చార్బౌలీకి చెందిన ఫిజియో థెరపీ షర్మిలా.. దత్తత విషయంలో పలుమార్లు అధికారులను కలిశారు. వరంగల్ ఎంపీ పసనూరి దయాకర్ అనుచరుడినంటూ శ్రీనివాస్ గౌడ్ కూడా ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. అయితే రషీదాబాను గర్భవతి కాకపోతే ఆ పాప ఎవరనే అనుమానం కలుగుతోంది. దీన్ని నిగ్గు తేల్చే దిశగా అధికారులు దృష్టి సారించాలి. -
జార్జియాలో క్లర్క్ గా పనిచేస్తోన్న భారతీయుడి హత్య..
న్యూయార్క్: జార్జియాలోని రెన్స్ ఫుడ్ మార్ట్ లో గుమాస్తాగా పనిచేస్తోన్న భారతీయుడు మణిందర్ సింగ్ ను ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపారు. 36 ఏళ్ల మణిందర్ సింగ్ అనే భారతీయుడు అగస్టాలోని రైసర్ రోడ్డులో ఉన్న రెన్స్ ఫుడ్ మార్ట్ లో పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితమే మణిందర్ ఇక్కడ క్లర్క్ గా చేరాడు. అతడి భార్య, తల్లితో కలిసి అక్కడ దగ్గర్లోనే నివాసముంటున్నాడు. జూన్ 28న మణిందర్ యధావిధిగా ఫుడ్ మార్ట్ లో విధులు నిర్వర్తిస్తుండగా 15 ఏళ్ల వయసుండే ఇద్దరు టీనేజర్లు స్టోర్ లోకి తుపాకులతో వచ్చి మణిందర్ ను మొదట బెదిరించి దోచుకోవాలనుకున్నారు. కానీ మణిందర్ వారిని అడ్డుకోబోవడంతో వారిద్దరూ కాల్పులు జరిపారు. దీంతో మణిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రెన్స్ పోలీసులు మాట్లాడుడుతూ.. హంతకులిద్దరి వయసు 15 ఏళ్ళు ఉంటుంది, పరిపక్వత లేని కారణంగా వారు మాస్కులు ధరించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని చాలా తేలిగ్గా గుర్తించాము. ఒకతన్ని కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రెండో వ్యక్తిని ఎనిమిది గంటల్లో పట్టుకుని జువైనల్ కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మణిందర్ సింగ్ మృతికి సంబంధించిన వార్త అమెరికాలోని భారతీయులకు దావానలంలా విస్తరించింది. మణిందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు వారు "గో ఫండ్ మి" ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు.. -
NATA Convention : అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
డల్లాస్, అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి జూన్ 30 నుంచి జులై 2 వరకు డల్లాస్‌లో జరిగిన నాటా తెలుగు మహాసభల్లో భాగంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసగించారు. పెద్దసంఖ్యలో హాజరైన రాజన్న అభిమానులు, నేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. (నాటా పూర్వ అధ్యక్షులు రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి) ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ & ట్రైనింగ్ చల్లా మధుసూధన్ రెడ్డి, నాటా పాస్ట్ ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గోసల, వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి, నాటా సభ్యులు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల, ఏపీ ఎన్ఆర్టీ మేడపాటి వెంకట్, అమెరికా వైస్సార్సీపీ కన్వీనర్ రమేష్ రెడ్డి, వైస్సార్సీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ చేసిన సేవల్ని, ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవ వైపు అడుగులు వైఎస్సార్ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. గుల్బర్గాలో ఎం.ఆర్.మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లోనూ హౌస్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. (నాటా వేదికగా జరిగిన వైఎస్సార్ జయంతికి హాజరైన ప్రముఖులు) ఓటమి ఎరుగని నేత 1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు. ఉత్తాన పతనాలు వైఎస్సార్ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లోనూ వైఎస్సార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. వైఎస్సార్ సిపి @ నాటా వేడుకల కన్వెన్షన్ నాటా వేడుకల సందర్భంగా విచ్చేసిన అతిథులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. డాలస్ లోని కన్వెన్షన్ సెంటర్ వద్ద తోరణాలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ పరిపాలన ముఖ్యాంశాలను ప్రదర్శించింది. (అమెరికా డాలస్ లోని నాటా వేదిక) అమెరికాతో డా.YSRకు అనుబంధం మే 6, 2007న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారిక కార్యక్రమం కోసం అమెరికాలో అడుగుపెట్టారు. ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముఖ్య అతిథిగా డా.వైఎస్సార్‌ను ఆహ్వానించింది అమెరికా ప్రభుత్వం. మే 8న మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం ఎలా వెన్నెముకగా నిలవాలన్న విషయాన్ని చర్చించారు. షికాగో వేదికగా ఎన్నారైలను ఉద్దేశించి వైఎస్సార్ చేసిన ప్రసంగం.. ఇప్పటికీ చాలామంది ఎన్నారైల మదిలోనే ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా రాజసమైన పంచెకట్టులో ఎన్నారైలపై చెరగని ముద్ర వేశారు రాజశేఖరరెడ్డి. తన చిరకాల మిత్రుడు ప్రైమ్ హాస్పిటల్స్ అధినేత ప్రేమ్‌సాగర్ రెడ్డితో కలిసి వివిధ వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించారు. (చదవండి: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం: నాటా తెలుగు మహా సభలనుద్దేశించి సీఎం జగన్) -
విదేశాల్లో ఉన్న తెలుగువారు ఐక్యత చాటడం సంతోషంగా ఉంది :సీఎం జగన్
-
NATA Convention 2023: మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. సీఎం జగన్
అమెరికాలోని డాల్లస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీడియో త్వారా తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్ వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుందన్నారు. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం ‘వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు. గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్నల్ని అందరినీ ఒకసారి తల్చుకుంటే.. అక్కడ పెద్ద, పెద్ద కంపెనీలలో సీఈఓలుగా ఐటీ నిపుణులుగా, నాసా వంటి సంస్ధల్లో కూడా సైంటిస్టులగానూ, అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో కూడా ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తీరుకు మిమ్నల్ని చూసి మేమంతా ఇక్కడ గర్వపడుతున్నాం. మీలో అనేకమంది మూలాలు.. మన గ్రామాల్లోనే కాకుండా మన మట్టిలో ఉన్నాయి. మీలో అనేకమంది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా.. అక్కడకి వెళ్లి ఇలా రాణించడానికి.. మీ కఠోరమైన కమిట్మెంట్, ఫోకస్ ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. నిజంగా మిమ్నల్ని చూసినప్పుడు ఆ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరికీ వస్తుంది. అలాం కమిట్మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలోని మన పిల్లల్లో ఎంతగానో ఉండటం నేను నా కళ్లారా చూశాను. ఆకాశమే హద్దుగా.. ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. చదువే సాధనం గ్లోబల్ సిటిజన్‌గా మనం ఎదగాలంటే.. చదువన్నది ఒక పెద్ద అవసరమైన సాధనం. అందుకనే రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మ మార్పులు గమనించినట్లైతే.. మన గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. నాడు-నేడు అనే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. స్కూళ్లలో ఉన్న మౌలికసదుపాయాల రూపురేఖలన్నీ మారుస్తున్నాం. 8వ తరగతిలోకి రాగానే మన ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు.. ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ విద్యను అందించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. 6వతరగతి ఆపైన అన్ని తరగతి గదుల్లోనూ ఈ డిసెంబరు నాటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు పూర్తి అవుతుంది. ప్రభుత్వ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్ ప్రిన్స్టన్తో ఒప్పందం చేసుకున్నాం. 3వతరగతి నుంచే టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ ఇలా పదోతరగతి వరకూ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో టోఫెల్ సీనియర్‌ను కూడా వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం. విద్యావ్యవస్థలో మార్పులు అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా ఏపీలో గొప్పగా అమలు చేస్తున్నాం. ఇవన్నీ చదువుకుంటున్న పిల్లల కోసం విద్యావ్యవస్ధలో తెస్తున్న మార్పులు. చదువు అనే ఒక ఆయుధం ఎంత అవసరమో చెప్పడానికే ఇవన్నీ ఇంతగా చెప్పాల్సి వస్తుంది. దీని గురించి సుదీర్ఘంగా వివరించే సమయం లేకపోయినా.. మన రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచనలు చేస్తున్నామో మీ అందరికీ క్లుప్తంగా వివరించగలిగాను. విద్యారంగం ఒక్కటే కాదు... ఏ రంగాన్ని తీసుకున్నా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. మీ గ్రామంలో ఎప్పడూ చూడని విధంగా విలేజ్ సెక్రెటేరియట్ మీ కళ్లెదుటనే కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది పిల్లలు మన ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి దాదాపు 600 రకాల సేవలు ప్రతి 2000 మందికి ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి వాటి ద్వారా మన గ్రామంలోనే సేవలందుతున్న గొప్ప పరిస్థితి ఉంది. మన గ్రామంలోనే ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒక వాలంటీర్.. పౌర సేవల్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నాడు. పెన్షన్, రేషన్.. అన్నీ మన ఇంటి ముంగటికే వచ్చే గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. పంట విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి రైతును చేయిపట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తుంది. ఇంకా నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ మీద ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్ వంటి ఎన్సీడీ డిసీజస్ పెద్ద పెద్ద రోగాలకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన టైంలో ట్రీట్మెంట్ చేయలేకపోతే బ్లడ్ ప్రెజర్ కార్డియాక్ అరెస్టుకు, షుగర్ కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి. రాబోయే రోజుల్లో మెడికల్ బిల్స్‌ను కట్టడి చేయాలంటే.. ప్రివెంటివ్ కేర్ అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. ఇవాళ ప్రివెంటివ్ కేర్‌లో ఎక్కడా చూడని విధంగా మన గ్రామంలోనే అడుగులు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ క్లినిక్.. దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌ను తీసుకునివచ్చాం. ఎప్పుడూ చూడని విధంగా టెర్షిరీ కేర్‌లో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఒక్క వైద్య రంగంలోనే 48వేల పోస్టులను భర్తీ చేశాం. నాడు నేడుతో ప్రతి ఆసుపత్రిని.. విలేజ్ క్లినిక్ నుంచి మొదలుకుని పీహె చ్‌సీలు, సీహెచ్‌లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ నాడు నేడు ద్వారా రూపురేఖలు మార్చే కార్యక్రమం కనిపిస్తోంది. ప్రతి గామంలోనూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రతి గ్రామంలోనూ మరో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లీష్‌మీడియం బడులు కనిపిస్తాయి. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను మన స్కూలు పిల్లలు చదువుతున్నారు. ఇంగ్లీష్అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం. గ్లోబల్ సిటిజన్‌గా మన పిల్లలు ఎదగటానికి ఇంగ్లీష్ ఒక సాధనం. ఏది కావాలన్నా.. సైన్సెస్‌లో ఏది చదువుకోవాలన్నా, ఆర్ట్స్‌లో ఏది చదువుకోవాలన్నా, ఇంజనీరింగ్‌లో ఏది చదువుకోవాలన్నా.. చివరికి పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్ మీద అయినా అవగాహన పెంచుకోవాలన్నా.. ముందు వారికి ఇంగ్లీష్ మీద పూర్తిస్ధాయిలో పట్టు రావాలి. వారికి కావాల్సినంత కంటెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు మనకు ఇంటర్నెట్లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. అది కూడా ఉచితంగా తీసుకొచ్చాయి. మన ఫోన్లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. అది కేవలం ఇంగ్లిష్ ద్వారా మాత్రమే వీలవుతుంది. కాబట్టే, ప్రపంచంలోకి వెళ్ళేందుకు కావాల్సిన ఇంగ్లీష్ భాష పునాదిని మనం గట్టి పరుస్తున్నాం. మీ అందరితో పంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నేడు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే.. రాష్ట్రంలో కనీవినీ మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రూరల్ ఎకానమీ సస్టైనబులిటీని పరిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ కూడా కన్జూమెన్స్ అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోతే.. రేపు ఉత్పత్తిదారులగా ఎవరూ ఉండని పరిస్థితి కనిపిస్తుంది. రూరల్ ఎకానమీని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే.. వినియోగం పెరిగిపోయి, ఉత్పత్తి చేసేవాళ్లు ఎవరూ లేకుండా పోతారు. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. అలా జరిగితే మనం ఆహార ధాన్యాలను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. బయట దేశాల నుంచి ఎప్పుడైతే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడే ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆహార ధాన్యాలను పండించిన తర్వాత మనం వాటిని లాభాలకే అమ్ముతాం. ఆ తర్వాత ఏ దేశమైనా వాటిని దిగుమతి చేసుకోవాలంటే.. వాటి మీద లాజిస్టిక్స్ కాస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత వాళ్లు మరలా రీటైల్ మార్జిన్స్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ పెట్టుకుంటారు. అన్నీ కలుపుకుంటే.. ఏ దేశమైనా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెడితే.. ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్టే. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే రూరల్ ఎకానమీ బలపడాలి. అలా జరగాలంటే ప్రతి గ్రామంలోనూ నివసిస్తున్న వాళ్ల ఆకాంక్షలను నెరవేర్చాలి. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఈ రోజు రాష్ట్రంలో మనం చేస్తున్న ఈ పనులన్నీ రాబోయే రోజుల్లో ఒక దిక్సూచి అవుతాయి. మనం వాళ్ల ప్రతి ఆకాంక్షను చేరుకోగలగుతాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకుంటారు. చదువుకుంటున్న పిల్లలకు ఇంగ్లీష్ రావాలని, ఇంగ్లీష్ మీడియం బడులు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం బడులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఆ గ్రామంలో ఉన్నవాళ్లకు విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ఈ రెండింటినీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఇవి కాక వ్యవసాయరంగంలో ప్రిసిసెన్ అగ్రికల్చర్ అన్నది రాబోయే రోజుల్లో, రాబోయే తరంలో గొప్ప మార్పు. దీనికి బీజం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడింది. ఇవన్నీ గమనిస్తే.. రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామంలోకి వస్తుంది. అక్కడే డిజిటల్ లైబ్రరీ కూడా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో మన కళ్లెదుటనే జరుగుతున్న గొప్ప మార్పులివి. ఇవే కాకుండా మౌలిక వసతుల మీద రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న పురోగతిని కూడా గమనించినట్లయితే... పోర్టులు, హార్బర్లు, ఎయిర్‌పోర్టులు మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడుతున్నాయి. మరో 4 పోర్టుల నిర్మాణం స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మనకు 6 పోర్టులు నాలుగు లొకేషన్స్‌లో ఉంటే.. ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణమూ వేగంగా జరుగుతుంది. తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకూ ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్భర్‌లో ఏదో ఒక నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. విశాఖపట్టణం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా శంకుస్ధాపన చేసుకున్నాం. ఆ పనులు పనులు వేగంగా జరుగుతున్నాయి.ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా.. ఇవాల దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు పనులు జరుగుతుంటే.. అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. టెర్షరీ కేర్‌కు మెడికల్ కాలేజీలు మనకు చాలా అవసరం. మెడికల్ కాలేజీ వస్తే.. పీజీ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే టెర్షరీ కేర్‌లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తయారవుతాయి. అలాంటిది మనకు స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఇప్పటి వరకు కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు మరో 17 మెడికల్ కాలేజీ పనులు నిర్మాణ పనులు మన కళ్లెదుటనే వేగంగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా తొలిస్థానంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడు సంవత్సరాలు నుంచి దేశంలోనే మొదటి స్ధానంలో ఆంధ్రరాష్ట్రమే కనిపిస్తోంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌లో కూడా రాష్ట్రం ఇవాళ టాప్ 4,5 స్ధానాల్లో కనిపిస్తుంది. మన గడ్డ మీద మనందరి ప్రభుతం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ళ నిర్మాణం, రాబోయే తరం పిల్లల అభివృద్ధి, మహిళా సంక్షేమం, వృద్ధులు–వితంతువులు–దివ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు లేకుంగా జరుగుతున్న పరిపాలనా సంస్కరణల పరంగా చూసినా, వికేంద్రీకరణపరంగా చూసినా, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు పరంగా.. ఇలా ప్రతి ఒక్క విషయంలో దేశంలోనే ఒక గొప్ప మార్పు.. ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వగలుగుతున్నాం. మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి ఇవన్నీ ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే కారణం.. అక్కడ ఉన్న మీ సహాయ, సహకారాలు కూడా ఎంతో అవసరం అని చెప్పడానికే ఇవన్నీ మీ దృష్టికి తీసుకువస్తున్నాను. చివరిగా మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి. అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ మీకు ఉంది. ఆంధ్రరాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోపడండి. ఆర్ధికంగా అన్న మాటలు కాస్తా కూస్తో.. ఉపయోగకరంగా ఉంటాయి కానీ దాన్ని పక్కనపెడితే.. అంతకంటే ఎక్కువగా మీ అనుభవం అవసరం. ఇప్పటికే అభివృద్ది చెందిన వెస్ట్రన్ వరల్డ్‌లో మీరు ఇన్నేళ్లు అక్కడ ఉన్నారు కాబట్టి మీ అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువగా ఏపీ మీద, మన గ్రామాల మీద ధ్యాస పెట్టగలిగితే మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. ఈ సందర్భంగా నాటా కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న మీ అందరికీ మంచి జరగాలని, అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు’ అని సీఎం తన సందేశం వినిపించారు. -
అమెరికాలో ఏలూరు వాసి మృతి.. స్వదేశం రప్పించేందుకు సన్నాహాలు
అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మరణించిన ఏలూరు జిల్లాకు చెందిన 'వీర సాయేష్' అకాల మరణంపై APNRTS సోషల్ మీడియా ద్వారా సాయేష్ కుటుంబ సభ్యుల వివరాలను కనుగొంది. వారు అందించిన ఫోన్ నంబర్లకు APNRTS 24/7 హెల్ప్ లైన్ టీమ్ ఫోన్ చేసి సంబంధిత వివరాలన్నింటినీ సేకరించింది. అమెరికా నుంచి సాయేష్ భౌతిక కాయాన్నిరాష్ట్రప్రభుత్వం ద్వారా స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. అయితే, సాయేష్ కుటుంబ సభ్యులు.. మృతదేహాన్ని భారతదేశం తీసుకురావడానికి తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ద్వారా సహాయం అందుతోందని తెలియజేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం కావాలంటే APNRTS ద్వారా తీసుకుంటామన్నారు. APNRTS బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. గమ్యస్థాన విమానాశ్రయం నుండి సాయేష్ పార్థివదేహాన్ని వారి కుటుంబానికి చేర్చడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. సాయేష్ భౌతికకాయం ఒహియో రాష్ట్రంలో స్థానిక లాంఛనాలు పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో స్వదేశం చేరుకునే అవకాశం ఉంది మేడపాటి పేర్కొన్నారు. -
కల్యంపూడి రాధాకృష్ణారావుకు అంతర్జాతీయ స్టాటిస్టిక్స్ పురస్కారం
వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102)ను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్టాటిస్టిక్స్‌లో 75 ఏళ్ల క్రితం ఆయన చేసిన కృషి సైన్స్‌పై ఇప్పటికీ అమిత ప్రభావం చూపిస్తోందని ప్రశంసించింది. కెనడాలోని ఒట్టావాలో ఈ ఏడాది జూలైలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ బహుమతి కింద 80,000 డాలర్లు అందజేస్తారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ను ప్రతి రెండేళ్లకోసారి ప్రదానం చేస్తారు. 2017లో తొలిసారిగా ఈ అవార్డును డేవిర్ ఆర్ కాక్స్ అందుకున్నారు. 2019లో బ్రాడ్జీ ఎఫ్రాన్, 2021లో నాన్ లాయిర్డ్ స్వీకరించారు. ఏపీలో విద్యాభ్యాసం కల్యంపూడి రాధాకృష్ణారావు కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్రా విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. ఇంగ్ల్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో పీహెచ్డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ అందుకున్నారు. -
అమెరికాలో ఘంటసాల వర్ధంతి.. నివాళులర్పించిన ప్రవాసులు
ఘంటసాల గాయకుడే కాదు మానవతా వాది, స్వాతంత్య్ర సమరయోథులని ఎన్ఆర్ఐలు కొనియాడారు. ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ (GSKI) న్యూజెర్సీ ఆధ్వర్యంలో అన్నా మధుసూదనరావు అద్యక్షతన ఫిభ్రవరి 11న స్థానిక సంగం చెట్టినాడ్ రెష్టారెంట్లో ఈ కార్యక్రమం జరిగింది. సాయిదత్తపీఠం శివ విష్ను టెంపుల్ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి వేదమంత్రాల ఉచ్ఛారణ తో జ్యోతి వెలిగించి ప్రార్థనాగీతాలతో సభను ప్రారంభించారు. అనంతరం రవి మరింగంటి, రాజ రాజేశ్వరి కలగా, కృష్ణ కీర్తి ,హర్ష శిష్టా, దీప్తి,లాస్య, శ్రీకన్, జీఎస్కే సభ్యులు భక్తిగీతాలాపనలతో ఘంటసాలపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. జీఎస్‌కేఐ న్యూ జెర్సీ అడ్వైజర్స్ రఘు శర్మ శంకరమంచి, న్యూజెర్సీ మాజీ అసెంబ్లీ సభ్యులు ఉపేంద్ర చివుకుల ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొని సభికులకు తమ సంస్థ గురించి తెలియజేశారు. GSKI హ్యూస్టన్ సభ్యుడు రవి మరింగంటి ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన తెలుగు భవనం శ్రీరాజ్ పసల, తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్యక్షులు నారాయణ్ రెడ్డి, ఆశా జ్యోతి దేవకి, రాంబాబు కట్టా తదితరులు GSKI చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఘంటసాల వర్ధంతిని శ్రద్దతో నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ GSKI ప్రెసిడెంట్ అన్నా మధు, రవి మరింగంటి కృతఙ్ఞతలు తెలియజేశారు. ‘తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం’ అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా అందించడమే తమ లక్ష్యమని GSKI సభ్యులు తెలియజేశారు. -
USA: బైడెన్ ప్రభుత్వంలో ఎన్నారైల పట్టు
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇండియన్ అమెరికన్లకి ప్రాధాన్యత పెరుగుతోంది. కాంగ్రెస్ సభ్యులైన నలుగురు ఇండియన్ అమెరికన్లను అత్యంత ముఖ్యమైన హౌస్ పానెల్స్ సభ్యులుగా నియమించారు. ఇమిగ్రేషన్ శాఖలో అత్యంత శక్తిమంతమైన హౌస్ జుడీషియరీ కమిటీ ప్యానెల్ సభ్యురాలిగా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీల జయపాల్ నియమితులయ్యారు. అమెరికాలో ఛిన్నాభిన్నంగా మారిన ఇమిగ్రేషన్ వ్యవస్థని గాడిలో పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు జయపాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వ్యవహారాలను నడిపే కమిటీ సభ్యుడిగా అమిబేరాని నియమించారు. అమెరికా జాతీయ భద్రత అంశంలో ఇంటెలిజెన్స్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలిఫోర్నియా నుంచి ఆరు సార్లు కాంగ్రెస్‌కు ఎన్నికైన బేరా జాతి భద్రతకు సంబంధించిన కమిటీలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. అమెరికా సహా ప్రపంచదేశాలకు ముప్పుగా మారిన చైనా వ్యవహారాలపై కొత్తగా ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజా కృష్ణమూర్తిని నియమించారు. మరొక ఇండియన్ అమెరికన్ ప్రజాప్రతినిధి రో ఖన్నాకి అమెరికా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీకి సంబంధించిన కమిటీలో సభ్యుడిగా చోటు కల్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆర్థికంగా, భద్రతా పరంగా అమెరికా సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. -
చితి మంటల్లోనూ ఒక్కటిగా..
సాక్షి, ప్రత్తిపాడు: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో పరాయి దేశం వెళ్లారు. పగలూ రాత్రీ కష్టపడ్డారు. ఇద్దరు పిల్లాపాపలతో జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతున్న వేళ విధికి కన్నుకుట్టినట్లుంది. వారిపై విషం చిమ్మింది. మంచు గడ్డల రూపంలో మృత్యువు కాపు కాసి భార్యాభర్తలిద్దరినీ కానరాని లోకాలకు తీసుకువెళ్లి, వారి ఇద్దరి కుమార్తెలను ఒంటరులను చేసింది. అమెరికాలో దుర్మరణం పాలైన తెలుగు దంపతుల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26న సెలవు కావడంతో పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో దంపతులు సరస్సులో గల్లంతై, చివరకు మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలు అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నాయి. టీసీఎస్ కంపెనీ సహకారంతో సోమవారం ఉదయం అమెరికాలోని డల్లాస్ నుంచి మృతదేహాలను హైదరాబాద్‌కు విమానంలో తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో పాలపర్రులోని స్వగ్రామానికి తీసుకువచ్చారు. వారి పిల్లలను రెండు రోజుల కిందటనే తీసుకువచ్చారు. నారాయణ, హరిత దంపతుల మృతదేహాలను చూడగానే రోదనలు మిన్నంటాయి. బిడ్డా.. ఇక నుంచి మాకు ఫోన్లు ఎవ్వరు చేస్తారు.. అంటూ నారాయణ తల్లి వెంటరత్నం విలపించింది. హరిత తల్లిదండ్రులూ కన్నీరుమున్నీరయ్యారు. నారాయణ, హరిత పిల్లలు పూజిత, హర్షిత నిర్జీవంగా ఉన్న తల్లిదండ్రులను చూసి దిగాలుగా ఉండిపోయారు. నారాయణ, హరిత దంపతుల చితిలను ఒక్కచోటే పేర్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. వారిని ఆఖరి చూపు చూసేందుకు ఊరంతా కదిలివచ్చింది. భౌతికకాయాల వద్ద ఎమ్మెల్సీ లక్ష్మణరావు నివాళులరి్పంచారు. (చదవండి: రాజమండ్రి: తక్షణ సాయం.. సీఎం జగన్ సాయం జీవితాంతం మరువలేనిది) -
బే ఏరియాలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భారీగా పెరిగిన విమానయాన చార్జీలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకుంటున్న వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విమాన చార్జీలు పెరిగాయి. 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో అమెరికా, ఇతర దేశాలకు చదువు కోసం వెళ్లేవారు లబోదిబోమంటున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎక్కువ రేట్లు నమోదయ్యాయి. కోవిడ్‌కు ముందు అమెరికాకు విమాన చార్జీ రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకూ మాత్రమే ఉండేది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లే వారు కనీసం రూ.1.60 లక్షలు విమాన టికెట్‌కే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి ఈ ఏడాది 280 మంది దాకా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళుతున్నారు. బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాలకూ వెళుతున్న వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. రెండు మాసాల ముందు బుక్ చేసుకుంటేనే... అమెరికాలో సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీంతో ఆగస్ట్ 25 నాటికే అక్కడికి చేరుకుంటారు. ఇందుకోసం జూన్‌లో విమాన టికెట్ బుక్ చేసుకున్న వారికి రమారమి రూ.1.55 లక్షలు అయ్యింది. ఇక అప్పటికప్పుడు అంటే రూ.2 లక్షల దాకా వెచ్చించాల్సి వస్తోందని శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన ప్రసాద్‌కుమార్ అనే విద్యార్థి చెప్పారు. రోజు రోజుకూ చార్జీలు పెరుగుతున్నాయని, గత రెండు నెలల్లో పెరగడమే గానీ ఎప్పుడూ తగ్గలేదని పలువురు విద్యార్థులు తెలిపారు. డాలర్ విలువ పెరగడంతో.. తాజాగా డాలర్‌తో రూపాయి మారకం విలువ సుమారు రూ.80కు పెరిగింది. దీనివల్ల అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థులపై పెనుభారం పడుతోంది. అమెరికాలో క్యూఎస్ ర్యాంకింగ్ 200 పైన ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా కనీసం 40 వేల డాలర్ల ఫీజు ఉంటుంది. అదే వందలోపు ర్యాంకింగ్స్ ఉన్న వాటిలో 60 వేల నుంచి 70వేల డాలర్లు అవుతుంది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ అదనపు భారం పడుతోంది. విమాన చార్జీలు ఎక్కువగా ఉన్నాయి నేను ఈ ఏడాది అమెరికాలోని బోస్టన్‌కు ఫార్మసీలో మాస్టర్స్ కోసం వెళుతున్నా. సాధారణంగా విద్యార్థులంతా ఆగస్టులోనే అమెరికాకు పయనమవుతారు. దీనివల్ల విమాన చార్జీలు ఎక్కువగా పెంచారు. సెప్టెంబర్ మాసంలో మళ్లీ తగ్గుతాయి. –నితీష్ కుమార్‌రెడ్డి, అనంతపురం డాలర్ రేటు పెరగడంతోనే.. నేను డల్లాస్‌లో మాస్టర్స్ చేయడానికి ఆగస్ట్ 23వ తేదీ వెళుతున్నా. విమాన టికెట్ రూ.1.55 లక్షలు అయ్యింది. దీంతో పాటు ఇటీవలే డాలర్ రేటు పెరగడంతో ఫీజుల్లోనూ తేడా వస్తోంది. దీనివల్ల మధ్యతరగతి వారికి ఆర్థిక భారం పడుతోంది. –శ్రీచరణ్, అనంతపురం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది కరోనా తర్వాత విదేశాల్లో చదువులు, సందర్శన కోసం వెళ్లే వారి సంఖ్య బాగా పెరిగింది. ఫలితంగా పాస్‌పోర్టుల నమోదు కూడా పెరిగింది. ఒక్క హిందూపురం కేంద్రంలోనే ప్రస్తుతం రోజూ 50 వరకు నమోదు అవుతున్నాయి. – రవిశంకర్, పాస్‌పోర్టు ఆఫీసర్, హిందూపురం -
రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా
విజయనగరం (రాజాం సిటీ): ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పెడుతూ కుంగదీసినప్పటికీ వెనక్కు తగ్గకుండా చదువుపై శ్రద్ధ కనబరిచాడు. డిగ్రీ చదువుకునే రోజుల్లో కుటుంబ బాధ్యత తీసుకుని, పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ నెట్టుకొచ్చాడు. పట్టుదలే ఆయుధంగా చేసుకుని జీవితం అయిపోయిందనుకునే స్థాయి నుంచి అమెరికా దేశం గుర్తించేలా నిలిచి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించి 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరుగా సీఈఓ పబ్లికేషన్ ఆయనను గుర్తించింది. ఆయనే రాజాం పట్టణానికి చెందిన గ్రంధి అనిల్. బాల్యంలోని ఆయన చదువు నుంచి అంతర్జాతీయ గుర్తింపు పొందినంత వరకు ఆయన ప్రస్థానం ఆయన మాటల్లోనే.. రాజాంలో ప్రాథమిక విద్య చదువుతున్న నేను నాలుగో తరగతి నుంచే వ్యాపారంపై మక్కువ పెంచుకున్నాను. రాజాంలోని భారతీయ విద్యాభవన్‌లో 5వ తరగతి, 6వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు ఏజేసీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్లో ఎంపీసీ చదివి ఇంజనీర్ కావాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు సలహాలు ఇచ్చినప్పటికీ డాక్టర్ కావాలనే బలమైన కోరికతో బైపీసీలో జాయిన్ అయ్యాను. ఇంటర్ మొదటి సంవత్సరం గరివిడి శ్రీరామ్ జూనియర్ కళాశాలలో, ద్వితీయ సంవత్సరం దాకమర్రిలోని రఘు కళాశాలలో పూర్తిచేశాను. అంతే ఉత్సాహంతో ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించాను. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్ చదవలేకపోయాను. అదే సమయంలో కుటుంబాన్ని చూసుకుంటూ చదువు కొనసాగించాలనే కృతనిశ్చయంతో జీసీఎస్ఆర్ కళాశాలలో బీకాం డిగ్రీలో చేరాను. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఎదురీది డిగ్రీ పూర్తిచేసి బీకాంలో సిల్వర్ మెడల్ పొందాను. పార్ట్ టైం జాబ్‌తో ఊరట ఓ వైపు డిగ్రీ చదువుతుండగానే మరో వైపు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుండేవాడిని. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఒడిదొడుకుల మధ్య డిగ్రీ పూర్తిచేశాను. తరువాత ఎంబీఏ చేయాలనుకున్నప్పటికీ అధ్యాపకుల సలహాతో సీఏ చేశాను. ఉద్యోగం ప్రస్థానం 2008లో ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్) చెన్నై క్యాంపస్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంచి జీతంతో ఎంపికయ్యాను. అక్కడి నుంచి శివ గ్రూపులో ఫైనాన్స్ కంట్రోలర్‌గా మూడేళ్లు పనిచేశాను. తరువాత తారస్ క్వస్ట్ కంపెనీలో ఫైనాన్స్ హెడ్‌గా ఉద్యోగం, యూఎస్ఏకు చెందిన సన్ ఎడిషన్ ఫైనాన్స్ కంట్రోలర్‌గా రెండేళ్లు పనిచేశాను. అక్కడ నా ప్రతిభ ఆధారంగా యూఎస్ హెడ్ఆఫీస్ నుంచి పిలుపురావడంతో వెళ్లి ట్రెజరీ ఆపరేషన్స్ దిగి్వజయంగా పూర్తిచేయగలిగాను. ఆ తరువాత అమెజాన్‌లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం లభించింది. దీంతో నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోగలిగాను. తరువాత స్టార్‌బక్స్ కంపెనీలో చేరి ఖాళీ సమయంలో ట్యాక్స్ బిజినెస్ డెవలప్ చేసుకోగలిగాను. కరోనా సమయంలో సహాయం కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న కంపెనీలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రుణ సౌకర్యం కలి్పంచింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని బిజినెస్ యజమానులకు హెల్ప్ చేయగలిగాను. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ హెల్పింగ్ నేచరే అమెరికాలో గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తరువాత ఏజీ ఫిన్ టాక్స్ అనే ట్యాక్స్ ప్లానింగ్ సరీ్వస్ ప్రారంభించాను. ట్యాక్స్ ప్లానింగ్ అండ్ సీఈఓ సేవలపై వ్యాపార యజమానులకు అందించిన వినూత్న సేవలను గుర్తించిన సీఈఓ పబ్లికేషన్ 2022లో టాప్ 20 సీఈఓలలో ఒకరిగా గుర్తించిందని గ్రంధి అనిల్ వివరించారు. -
తగ్గేదేలే.. చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తూర్పు లఢక్ విషయంలో చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఈ మేరకు డ్రాగన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అమెరికన్లు ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత సైనికుల వీరోచిత సేవలను ప్రశంసించారు. లఢక్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న భారత సైనికుల ధైర్యాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కొనియాడారు. భారత ప్రభుత్వం, ఆర్మీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో తాను బహిరంగంగా చెప్పలేనని అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భారత్’ ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్‌ను నిలువరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కొన్ని విషయాల్లో రష్యాకు భారత్ అనుకూలంగా నిలిచింది. ఈ వ్యవహారంలో భారత్‌పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికాను కూడా పరోక్షంగా రాజ్‌నాథ్ హెచ్చరించారు. ‘జీరో-సమ్ గేమ్’ దౌత్యాన్ని భారత్ విశ్వసించదని పేర్కొన్నారు. ఇలాంటి దౌత్యాన్ని భారత్ ఎప్పటికీ ఎంచుకోదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్‌పై మాకు నమ్మకం లేదని.. విన్-విన్ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటుందని వెల్లడించారు. -
ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృతోత్సవ్
అట్లాంటా: ఆగస్ట్ 15న ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అట్లాంటాలో భారతీయ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. అజాదీ కా అమృతోత్సవ్ పేరిట జరిగిన ఈ వేడుకలకు నాట్స్ ను కూడా భారతీయ దౌత్య కార్యాలయం ఆహ్వానించింది.. నాట్స్ తరపున నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని అజాదీ కా అమృతోత్సవ్‌లో పాల్గొన్నారు. అట్లాంటాలో నాట్స్ తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. భారతీయుల వీసా, ఇమిగ్రేషన్‌తో పాటు అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాట్స్ ను భారతీయ కాన్సులేట్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది. భారతీయ కాన్సులేట్ అట్లాంటాలో నాట్స్ ను గౌరవించడం.. నాట్స్ విన్నపాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మద్దతు ఇవ్వడం పట్ల నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని కాన్సులేట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాన్ని ట్విటర్లో కూడా షేర్ చేసి ప్రవాస భారతీయులంతా దేశభక్తిని చాటుతున్నారనే విషయాన్ని కాన్సులేట్ స్పష్టం చేసింది. -
ప్రాణ ప్రదాతలకు 'ప్రెసిడెంట్ సర్వీస్ అవార్డ్'ల ప్రదానం
గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన దేవకి శంకర్ రావు కుమార్తె ఆశాజ్యోతి దేవకి కరోనా ఆపత్కాలంలో తాను చేసిన సేవకు గాను 'ప్రెసిడెంట్ సర్వీస్ అవార్డు' దక్కింది. ఈ అవార్డ్ ను అమెరికాలోని 'విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్' ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరిలు పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందించారు. కోరోనా సమయంలో ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారని కొనియాడారు.ఇలా ఎన్నో రకాలుగా అందరికి సహాయం చేస్తూ, సేవలు అందిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పోతిరెడ్డి వాసుదేవ రెడ్డి కుమార్తె యామిని పోతిరెడ్డి అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. కోవిడ్ క్రైసిస్ లో వివిధ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తెలుగు రాష్ట్రల ప్రజల కోసం చేసిన సేవని గుర్తించి విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారి అద్వర్యంలో "సూపర్ వుమన్ ఇన్ సర్వీస్ అవార్డు" పురస్కారాన్ని అందించారు. కరోనా సమయంలో మెడికల్ కిట్ డ్రైవ్ స్టార్ట్ చేసి వివిధ మండలంలో ఆక్సిమేటర్స్, కాంటాక్ట్ లెస్ థెర్మోమేటర్స్ అందించారు. అంతే కాకుండా రేణిగుంట కి చెందిన 'అభయ క్షేత్రం' సంస్థకు ఒక నెలకు సరిపడా సరుకుల్ని అందించారు. ఈ అవకాశం అందించి సేవల్ని గుర్తించిన 'వెట' కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థలో పని చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉందని యామిని రెడ్డి అన్నారు. -
తెలుగు సాహితి సదస్సు.. వక్తలకి ఆహ్వానం
కెనడాలో సెప్టెంబరులో నిర్వహించనున్న తెలుగు సాహితీ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జులై 31లోగా తమ ఎంట్రీలను పంపివ్వాల్సిందిగా పలు కెనడా తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి. కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి పెద్ద ఎత్తున టొరాంటో వేదికగా 2021 సెప్టెంబరు 25, 26 తేదీల్లో తెలుగు సాహితీ సదస్సును నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10:00 (EST) నుంచి సాయంత్రం 6:00 (EST) వరకు ఈ సదస్సు జరుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండేందుకు వీలుగా ఈ సదస్సును వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా దేశాల వక్తల ప్రసంగ ఎంట్రీలను 2021 జులై 31 లోగా ఈ కింది ఈమెయిట్స్కి పంపాల్సి ఉంటుంది. sadassulu@gmail.com , vangurifoundation@gmail.com . ఈ సదస్సు నిర్వహాణలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక (కెనడా), టొరంటో తెలుగు టైమ్స్ పత్రిక, ఆటవా తెలుగు సంఘం, తెలుగు వాహిని (సాహిత్య వేదిక, టొరంటో), అంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు కల్చురల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, కేల్గరీ తెలంగాణా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సదస్సు ఈ సందర్భంగా అమెరికా, కెనడా దేశాల నుంచి ఎంపిక అయిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకి జీవన సాఫల్య పురస్కారం అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
అభివృద్ధికి పరుగులు,పెట్టుబడులకు ఆకర్షణీయ దేశం భారత్
న్యూఢిల్లీ: అభివృద్ధికి పరుగులు విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్ ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశం చేపట్టిన విస్తృత స్థాయి సంస్కరణలు దీనికి కారణమని అన్నారు. అమెరికా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. దేశం కోవిడ్–19 సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా పేర్కొన్న ఆర్థికమంత్రి, కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్‌లు, వ్యాక్సినేషన్ కార్యక్రమం పురోగతి వంటి అంశాలను చర్చించారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌బీఐసీ) నిర్వహించిన ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో జనరల్ ఎలక్ట్రిక్, బాక్స్టర్ హెల్త్‌కేర్ యూఎస్ఏ, బ్రాంబుల్స్, మార్ష్ అండ్ మెక్లెనన్, పెప్సికో తదితర ప్రముఖ విదేశీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్–19 సెకండ్‌వేవ్ సమయంలో భారత్‌కు వనరుల కోసం ఒక గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కృషి చేసిన 40 అమెరికా టాప్ కంపెనీల సీఈఓలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌కు శాశ్వత స్థానం
హ్యూస్టన్ (టెక్సాస్) : ప్రజల హృదయాల్లో శాశ్వతంగా జీవించాలి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ టెక్సాస్‌కి చెందిన ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. మహానేత ప్రియతమ నాయకుడు డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలను వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఎంతో వైభవంగా హ్యూస్టన్ మహా నగరం లో జరిపారు. ఈ కార్య క్రమానికి వైఎస్సార్ అభిమానులు , డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ మెంబెర్స్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మహానేత రాజన్న ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చేసిన గొప్ప సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ , ఫీజు రేయింబర్సుమెంట్ , 108 , ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఉచిత విద్యుత్, పేదలకు ఇల్లు వంటి అనేక కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరీష్ రామిరెడ్డి, డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి, బ్రహ్మ రెడ్డి, మారుతీ రెడ్డి, వేణు దాసరి, రామ్ చెరువు, పుల్లా రెడ్డి, వీరా రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, హనుమంత రెడ్డి, రామ్, సుధీర్ , సురేష్ పగడాల, రామ్ మోహన్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, రాఘవ రెడ్డి కే, సన్నప్పరెడ్డి విశ్వ, అరవింద్ రెడ్డి ,వంశీ అరిమండ, సుధీర్ సూరా, సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డమాస్కస్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
మేరిల్యాండ్: అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన అధ్యాయం లిఖించారని అమెరికాలోని మేరిల్యాండ్‌లో ఉన్న ప్రవాస భారతీయులు అభిప్రాయ పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని డమాస్కస్ నగరంలో జులై 11న ఘనంగా జరిగాయి.వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్, ఏపీఎన్ఆర్టీఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థసారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, పవన్ ధనిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని ప్రవాస భారతీయులు గుర్తుచేసుకున్నారు. - వైఎస్సార్ సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలను వైఎస్సార్ ప్రవేశపెట్టి, ప్రతీ పేదవాడికి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా వైఎస్సార్ జయంతి, వర్ధంతిలతో పాటు బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వైఎస్సార్ పేరు మీదుగా మేరిల్యాండ్‌లో జరుపుతున్నామని తెలిపారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే నవరత్నాలకు సీఎం జగన్ రూపకల్పన చేశారని తెలిపారు. - వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది ఈ వేడుకల్లో భాగం కావడం చూస్తుంటే రాజశేఖరరెడ్డి ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. - మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్ మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ సారధిరెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలతో లబ్ధి పొందారని చెప్పారు. మాట తప్పని..మడమ తిప్పని నేతగా ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. - వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు పవన్ ధనిరెడ్డి మాట్లాడుతూ... అందరికీ మంచి చేయాలనే తపనతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు డాక్టర్ వైఎస్సార్ అమలు చేశారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ తపన ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ... కులమతాలు, పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌కు అభిమానులు ఉన్నారని చెప్పారు. పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి మరియు ఏపిఎన్ఆర్టిఎస్ రీజినల్ కోఆర్డినేటర్ పార్థ సారధిరెడ్డి బైరెడ్డి, వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు భాస్కర బొమ్మారెడ్డి, రామ్మోహన్ రెడ్డి కొండా, వెంకట్ యర్రం, పవన్ ధనిరెడ్డి, కోట్ల తిప్పారెడ్డి, రాజశేఖర్ రెడ్డి యరమల, రవి బారెడ్డి, మురళి బచ్చు, రాంగోపాల్ దేవపట్ల, శ్రీనివాస్ పూసపాటి, రామకృష్ణ, వాసుదేవ రెడ్డి తల్లా, గిరిధర్ బండి, సతీష్ బోబ్బా, పూర్ణశేఖర్ జొన్నల, శ్రీనాథ్, వెంకట్ కీసర, శ్రీనివాస్ పూతన, రామచంద్ర యారుబండి, నాగిరెడ్డి, లక్ష్మి నారాయణ, కరుణాకర్ వణుకూరి, అనంత్ పూసపాటి, శివ పిట్టు, శ్రీనివాస్, రాజు గొనె, రవి ముత్తోజు, రరాజు బచ్చు, నవీన్ చింతలపూడి లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఫుడ్‌డ్రైవ్ వైఎస్సార్ జయంతి సందర్భంగా పిక్నిక్ , ఫుడ్ డ్రైవ్ కూడా నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దలు వరకు రెండు వందల మందికి పైగా కుటుంబం తో వచ్చి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఫుడ్ డ్రైవ్ లో ఐదు వందల పౌండ్స్ కి పైగా ఫుడ్ ను మన్నా ఫుడ్ సెంటర్‌కి డొనేట్ చేశారు. -
ఇంటర్నెట్ సౌకర్యం.. సముద్ర భూగర్బంలో కేబుల్స్!
వాషింగ్టన్: కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ వినియోగం పెరిగింది. అయితే ఆయా దేశాలకు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేకపోవడంతో తమకు ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో గూగుల్ సంస్థ భూగర్బంలో కేబుల్స్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూఎస్, బ్రెజిల్, ఉరుగ్వే మరియు అర్జెంటీనాలను అనుసంధానించే ఒక సముద్రగర్భ కేబుల్స్ నిర్మిస్తున్నట్లు గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ తూర్పు తీరం నుండి అర్జెంటీనాలోని లాస్ టోనినాస్ వరకు ..అలాగే బ్రెజిల్‌లోని ప్రియా గ్రాండే, పుంటా డెల్ ఎస్టే, ఉరుగ్వే ప్రాంతాల్లో అదనంగా ఈ కేబుల్స్‌ను ఏర్పాట్లు చేయనుంది. ఫిర్మినా అని పిలువబడే ఈ కేబుల్‌ను సముద్ర భూగర్భంలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర భూగర్బంలోని కేబుల్ అవుతుందని గూగుల్ పేర్కొంది. ఫిర్మినా కేబుల్స్ అందుబాటులోకి వస్తే దక్షిణ అమెరికాలో గూగుల్ సేవలు మెరుగుపడతాయని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 12 ఫైబర్ జతలతో కేబుల్ ఉత్తర మరియు దక్షిణ అమెరికా మధ్య సముద్ర భూగర్భానా ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ సేవలకు అంతరాయం తొలగినట్లేనని వెల్లడించింది. సముద్ర భూభాగంలో కేబుల్ ఏర్పాటు కోసం గూగుల్ ఇతర కేబుల్ సంస్థల నుంచి ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. వీటిలో డునాంట్, ఈక్వియానో మరియు గ్రేస్ హాప్పర్ కేబుల్స్,అలాగే ఎకో, జెజిఎ, ఇండిగో మరియు హావ్ఫ్రూ వంటి కేబుల్ సంస్థలు ఉన్నాయి. చదవండి : ఈ గూగుల్ ఇయర్ బడ్స్ స్పెషల్ ఏంటో తెలుసా? -
షాకింగ్: ఇంట్లో పాములు.. అద్దెకే దిక్కులేదన్న ఓనర్!
టిబిలిసి: సాధారణంగా ఇంట్లో బల్లులో, బొద్దింకలో కనిపిస్తేనే భయపడిపోతాం. అలాంటిది.. ఇంటి సీలింగ్‌పై నుంచి పాములు వేలాడుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది?. గుండె జల్లుమంటుంది. జార్జీయాకు చెందిన హ్యారీ పగ్లీస్ అనే వ్యక్తి ఓ అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. అయితే వర్షం పడిన ప్రతిసారి వాన నీరు ఇంట్లో కురిసేది. అదే విషయాన్ని ఇంటి యజమానికి చెప్పాడు. కానీ ఇంటి యజమానురాలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో హ్యారీ ఇంట్లో ఉండగా వర్షం పడి ఇంటి పెచ్చులూడి కిందపడిపోయాయి. పెచ్చులూడిన ప్రాంతం నుంచి ఎలుకలో, బల్లులో కనిపిస్తే పట్టించుకోనే వాడు కాదేమో. కానీ పాములు వేలాడుతూ కనిపించడంతో ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ ఆ ఇంటి ఓనర్‌తో మొరపెట్టుకున్నాడు. ‘మేడమ్ ఇంటి సీలింగ్ ఊడింది. ఇంట్లో పాములు వేలాడుతున్నాయి. వెంటనే ఆ పాముల్ని తీయించండి’ అని కోరాడు. అందుకు ఆ ఇంటి యజమానురాలు.. ఆ పాముల్ని అక్కడి నుంచి తీయాలంటే సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పింది. దీంతో హ్యారీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు బాధితుడి ఇంట్లో పాముల్ని తీసేందుకు సిద్దమయ్యారు. అందుకు ఆ ఇంటి యజమానురాలు ఒప్పుకోలేదు. ‘హ్యారీ ఇంటి అద్దెకే దిక్కులేదు నీకు. రెండు నెలల నుంచి అద్దె కట్టడం లేదు. ఇంటి అద్దె కడితే పాముల్ని అక్కడి నుంచి తీయించేస్తా’ అని ఆమె తెగేసి చెప్పింది. అలాగే రెండు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా గడిపాడు. చివరికి ఇంటి యజమానురాలి తీరుతో ఏం చేయాలో పాలుపోని బాధితుడు హ్యారీ తనకు జరిగిన అన్యాయాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి : లక్షలతో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో కరోనా పేషెంట్లను బ్రతికిస్తున్నాడు SNAKES IN THE ROOF! A LaFayette man says there are snakes in his rental home. Harry Pugliese says problems have persisted at this house on East Villanow Street since February, but the landlord won't fix them. pic.twitter.com/ukVUOStzUm — Bliss ZechmanNC9 (@BlissZechman) May 25, 2021 -
లవర్ ఆహ్వానంపై అసంతృప్తి, ఆరుగురిని చంపిన ప్రియుడు
వాషింగ్టన్: తన కుటుంబంలో జరగాల్సిన బర్త్‌డే వేడుకుల్లో పాల్గొనాలంటూ పంపిన ప్రియురాలి ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు బాధితురాలి కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. అమెరికా కొలరాడో పోలీసులు కథనం ప్రకారం.. మే 9న కొలరాడోలో సాండ్రా అనే యువతి ఇంట్లో బర్త్‌డే పార్టీ జరగాల్సి ఉంది. అయితే ఆ బర్త్‌డే పార్టీకి ఆమె ప్రియుడు మాకియాస్ను ఆహ్వానించింది. కానీ, ప్రియురాలు అందించిన ఆహ్వానంపై అసహనం వ్యక్తం చేసిన మాకియాస్ బాధితురాలి బంధువులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సాండ్రాతో పాటు మెల్విన్ పెరెజ్(30) పెరెజ్ (33) జోనా క్రజ్(52),జోస్ గుటిరెజ్(21) జోస్ ఇబ్రారా(26) దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలరాడో పోలీస్ అధికారి నిస్కి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో యువతి సాండ్రా, ప్రియుడు మాకియాస్లు సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సాండ్రా ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు పంపిన ఆహ్వానంపై నిందితుడు కోపానికి గురై కాల్పులు జరిపినట్లు తేలింది. గతంలో నిందితుడిపై ఎలాంటి నేర చరిత్రలేదు. నిందితుడు మాకియాస్ ఈ కాల్పులు ఎందుకు జరిపాడు? నిందితుడు వద్ద ఉన్న 15 రౌండ్ల మ్యాగజైన్ ఎక్కడిది? ప్రియురాలి ఆహ్వానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కాల్పులు జరిపాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు నిస్కి మీడియా సమావేశంలో వెల్లడించారు. -
ఆసియన్ అమెరికన్లకి బైడెన్ అండ
అట్లాంటా: ఆసియన్ అమెరికన్లపై జరుగుతున్న హింసాత్మక దాడులు మనసుని కలిచి వేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులపై అమెరికన్లు అందరూ మౌనం వీడాలని పిలుపునిచ్చారు. అట్లాంటాలోని ఆసియా మసాజ్ పార్లర్లపై శ్వేతజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మరణించడంతో అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు అట్లాంటా పర్యటనకు వచ్చారు. ఎమొరి యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడన్ జాతి వివక్ష దాడులైనా, విదేశీయులంటే భయంతో కూడిన దాడులైనా ప్రజలందరూ మాట్లాడాలని, ప్రతిస్పందించాలని అన్నారు. ‘‘మౌనం వహించడం అన్నది అత్యంత సంక్లిష్టమైనది. మనం అలా ఉండకూడదు’’అని హితవు పలికారు. అంతకు ముందు ఆసియన్ అమెరికన్ ప్రజాప్రతినిధులతో బైడెన్, కమలా హ్యారిస్‌లు సమావేశమై చర్చించారు. ఆసియన్ అమెరికన్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆసియన్ అమెరికన్లలో నెలకొన్న భయభ్రాంతుల్ని చూస్తుంటే గుండె కరిగి నీరైపోతోందన్న బైడెన్ అమెరికా పౌరులందరూ విద్వేషాలు వీడాలని అన్నారు. కరోనా సంక్షోభం వచ్చాక ఆసియన్లపై ఓ విధమైన కసితో అమెరికా వ్యాప్తంగా దాడులు అధికమైపోతున్న విషయం తెలిసిందే. ‘‘ఆసియన్లపై దాడి చేస్తున్నారు. నిందిస్తున్నారు. వేధిస్తున్నారు. బలిపశువుల్ని చేస్తున్నారు. మాటలతో తూట్లు పొడుస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. వాళ్లని ఏకంగా చంపేస్తున్నారు’’అని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తీసుకురానున్న కోవిడ్–19 హేట్ క్రైమ్స్ యాక్ట్‌కి తాను మద్దతునిస్తున్నట్టుగా బైడెన్ ప్రకటించారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే విద్వేషపూరిత నేరాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మరింత చురుగ్గా పనిచేసే వీలు కలుగుతుందని వివరించారు. చూస్తూ ఊరుకోం: కమలా హ్యారిస్ అట్లాంటాలో కాల్పుల ఘటనపై విచారణ కొనసాగుతోందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తెలిపారు. జాతి వివక్ష, విదేశీయులంటే భయం అమెరికాలో ఎప్పట్నుంచో ఉన్నాయని అన్నారు. తాను, అధ్యక్షుడు ఈ దాడుల్ని చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. విద్వేషపూరిత నేరాలు, హింసాత్మక దాడులు, వివక్ష ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ అమెరికన్లుగానే గుర్తించాలని, మనలో ఒకరిగా చూడాలని కమలా హ్యారిస్ హితవు పలికారు. -
ఎక్కువ ఫీజులు, ఆన్లైన్ చదువులు.. నో జాబ్స్!
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సంవత్సరానికి దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవచ్చని. అక్కడ చదువుకుంటే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయన్నది వారందరి ఆశ. కోవిడ్–19 వైరస్ విజృంభన వల్ల వారంతా ఇప్పుడేమయ్యారు? ఎలా చదువుకుంటున్నారు ?ఫీజుల కింద లక్షలాది రూపాయలు చెల్లించిన వారంతా ఇప్పుడు కళాశాలలకు వెళ్ల కుండా ఇళ్లకే పరిమితమై ఆన్లైన్లో చదువుకుంటున్నారు. ఇళ్లలో కూర్చొని చదవుకోవడం అంటే తమను అవమానిస్తున్నట్లుగా ఉందని వారిలో ఎక్కువ మంది వాపోతున్నారు. 2019 సవంత్సరంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం 2,02,014 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ మంది అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారికి అది సాధ్యపడలేదు. గత ఏడాది అక్కడికి వెళ్లిన వారు ఇళ్లకు పరిమితమై ఆన్లైన్లో చదవుకుంటున్నా ఫీజులు తగ్గించక పోవడం పట్ల వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఈ పాపులర్ యాప్స్ అన్నీ చైనావే) ‘నేను 2019, ఆగస్టు నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాకు ఉన్నత చదవు కోసం వెళ్లాను. అప్పుడంతా సవ్యంగానే ఉంది. 2020, జనవరి నెలలో నా రెండవ సెమిస్టర్ పూర్తయింది. ఆ వెంటనే ఉద్యోగం వచ్చింది, మార్చి నెలలో యూనివర్శిటీ మూత పడింది. దాంతో ఆన్లైన్ చదవులు మొదలయ్యాయి. అంతలోనే కరోనా కారణంగా నా ఉద్యోగం కూడా ఊడింది. దాంతో శాన్ఫ్రాన్సిస్కోలోని నా సోదరుడి అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆశ్రయం తీసుకున్నాను. అయినప్పటికీ కాలిఫోర్నియాలో నేను రెంట్‌కు తీసుకున్న ఇంటికి అద్దె చెల్లించాల్సి వస్తోంది’ అంటూ రితికా అనే ఎంఎస్ విద్యార్థిని వాపోయారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ చేయడానికి రోష్నీ నెడుంగడి అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో అడ్మిషన్ రావడంతో భారత్‌లో లాక్డౌన్ విధించడానికి ముందే అక్కడికి వెళ్లారు. అడ్మిషన్ తీసుకున్న కొంత కాలానికే క్యాంపస్‌ను మూసివేసి ఆన్లైన్ చదవులు చేపట్టారని ఆమె చెప్పారు. ‘ఆన్లైన్లో చదువు కోవడానికి అమెరికా దాకా రావాలా? భారత్‌లోనే ఉండి చదవుకోవచ్చుగదా?’ అని ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. కొన్ని రోజులు ఆన్లైన్ ద్వారా, మరికొన్ని రోజులు కాలేజీ క్యాంపస్‌కు రావడం ద్వారా పాఠాలు చెబుతామని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారని ఆమె చెప్పారు. అయితే ఆ విషయంలో వారిని తాను నమ్మలేక పోతున్నానని, దానికి సంబంధించి వారివద్ద ఎలాంటి ప్రణాళిక లేకపోవడమే కారణమని ఆమె వాపోయారు. వారిద్దరిదే కాదు, అలా వెళ్లిన విద్యార్థులంతా ఇలాగే ఆందోళన చెందుతున్నారు. (72 గంటల్లోనే గల్వాన్ నదిపై బ్రిడ్జి నిర్మాణం) -
అమెరికాలో భారతీయుల అవస్థలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలోని భారత జాతీయులు కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జంకుతున్నారు. విధిలేని పరిస్థితిలో నిత్యావసర వస్తువులకు బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒకరు కరోనా బారిన పడుతున్నారు. కచ్చితమైన లెక్కలు లేకపోయినా దాదాపు 100 మంది దాకా భారత జాతీయులు ఈ వ్యాధి బారిన పడి మరణించి ఉంటారని అమెరికాలో భారత సంఘాలు చెబుతున్నాయి. న్యూయార్క్‌లో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం తీసుకున్న వారే అందులో ఎక్కువగా ఉన్నారని, న్యూజెర్సీకి చెందిన ఓ పాతిక మంది దాకా ప్రాణాలు విడిచారని తెలుస్తోంది. అమెరికాలో సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్న బ్రహ్మ కూచిబొట్ల రెండు రోజుల క్రితం న్యూయార్క్ ఆస్పత్రిలో చనిపోయారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులు ఎదుర్కొం టున్న సమస్యలపై కనీస శ్రద్ధ పెట్టడం లేదని భారతీయులు వాపోతున్నారు. న్యూజెర్సీలో ఓ కుటుంబానికి చెందిన (కర్ణాటక) తండ్రి, కొడుకు కరోనా బారిన పడి చనిపోవడంతో ఇంట్లో ఉన్న అత్తా కోడలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. కరోనా భయంతో వారిని పరామర్శిం చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. వారం సరుకులు నెల వరకూ.. న్యూజెర్సీలో భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారం రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను నెల రోజులు వాడకునేందుకు వీలుగా పొదుపు చేసుకుంటున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు కమ్యూనిటీలుగా ఏర్పడి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ‘రోజూ నలుగురో ఐదుగురో కరోనా బారిన పడుతున్నారు. వారికి సహాయం చేసే స్థితిలో లేకపోవడం మాకు శోకాన్నే మిగులుస్తోంది. పిల్లలు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధిని నియంత్రించడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఈ దేశానికి ఎందుకు వచ్చాం దేవుడా అని రోజుకు పది సార్లు అనుకోవాల్సి వస్తోంది’అని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న కంచరకుంట్ల సుధీర్‌రెడ్డి ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూజెర్సీలోని హడ్సన్ కౌంటీలో దాదాపు 50 వేల మంది భారతీయులు ఉండగా వారిలోనూ 25 నుంచి 30 వేల మంది తెలుగు వారేనని సుధీర్ అన్నారు. ఏఏపీఐ మాజీ అధ్యక్షుడు సైతం.. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు ఇప్పుడు కరోనా బారిన పడి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లిన ప్రతి ఇద్దరిలో ఒక్కరు కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. ‘గత శుక్రవారం నేనూ, మా కమ్యూనిటీలోఉండే మరో నలుగురం వేర్వేరు కార్లలో కాస్ట్‌కోకు వెళ్లాం. అక్కడి నుంచే మరో ఇండియన్ స్టోర్‌కు కూడా వెళ్లాం. మేమంతా ఇప్పుడు కరోనా లక్షణాలతో బాధపడుతున్నాం. మా ఐదుగురిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. మిగిలిన ఇద్దరం ఇప్పుడు క్వారం టైన్లో ఉన్నాము’ అని విశాఖపట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ.. భారతీయులు ఎక్కువగా నివ సించే టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోనూ వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ‘మా కళ్ల ముందే అనేక మంది కరోనా బారిన పడుతున్నారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము’అని రాజేంద్ర డిచ్పల్లి అన్నారు. భారతీయ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేటర్ వాషింగ్టన్, న్యూయార్క్ మెట్రోపాలిటన్, మేరీల్యాండ్‌కు చెందిన అనేక మంది కమ్యూనిటీ లీడర్లు కరోనా బారినపడ్డారు. వీరిలో మెజారిటీ వారి ఇళ్లలోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. హూస్టన్‌కు చెందిన భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహన్ బవదేకర్ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఆయన చికిత్స కోసం స్నేహితులు 2.04 లక్షల డాలర్లను సేకరించారు. మియామీలోని కార్డియాక్ ప్రివెంటివ్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ముకుల్ ఎస్.చంద్ర వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఆయన మృత్యువు నుంచి బయటపడేందుకు ప్లాస్మా దోనర్ కోసం వాట్సాప్ గ్రూపుల్లో వినతులు చేస్తున్నారు. -
రవిరెడ్డి.. అమెరికా టు హైదరాబాద్
బంజారాహిల్స్: సినిమాల మీద మక్కువతో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడో ఔత్సాహిక యువకుడు. గతంలో అమెరికానుంచి టాలీవుడ్‌కు వచ్చి హ్యాపీ డేస్ సినిమాతో అందరినీ అలరించిన వరుణ్ సందేశ్ దారిలోనే ఇప్పుడు అమెరికా రిటర్న్డ్ బిజినెస్‌మన్ రవిరెడ్డి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. సినిమాలపై ఇష్టంతో టాలీవుడ్‌కు వచ్చిన రవిరెడ్డి చూడగానే ఆకట్టుకునే రూపం, అసలు, సిసలు తెలుగుదనం ఉట్టిపడే తీరుతో ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. అమెరికా నుంచి వెండితెరపై వెలిగిపోవాలని ఇటీవల చాలా మంది ఔత్సాహిక నటులు హైదరాబాద్‌కు వస్తున్న తరుణంలో రవిరెడ్డి వచ్చీ రావడంతోనే సరైన అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. మోడలింగ్‌లో తనదైన ముద్ర.. పక్కా తెలంగాణ యువకుడైన రవిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఏదో అల్లాటప్పాగా కాకుండా అమెరికాలో మోడలింగ్ చేసి అంతటితో ఊర్కోకుండా న్యూయార్క్ ఫిలిం అకాడమీలో కోర్సు కూడా పూర్తి చేశాడు. నటించాలనే తపనతో ఆయన శిక్షణ తీసుకున్న తీరు కూడా సినిమాలపై ఆయనకున్న మక్కువ అర్థమవుతుంది. స్వతహాగా ఫిట్నెస్ నిపుణుడు కూడా. ఒకవైపు అమెరికాలో జాబ్ చేస్తూనే చదువుకుంటూ ఆ తర్వాత యాక్టింగ్‌లో కోర్సు చేస్తూ మోడలింగ్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. సినిమాలపై దృష్టి పెట్టిన ఆయన తన దేహాకృతిని అందంగా మలుచుకున్నాడు. నటనలో నిష్ణాతుడై ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌ను తన స్నేహితుడి ద్వారా కలిసిన క్షణమే తనకు టర్నింగ్‌పాయింట్ అయిందని చెబుతున్నాడితను. అప్పటికే ఆయన దర్శకత్వం వహిస్తున్న ఇంటిలిజెంట్ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇక సాఫ్ట్వేర్ సుధీర్, దర్పణం వంటి సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా తనకంటూ అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, జీవిత, రాజశేఖర్ల కూతురు హీరో హీరోయిన్లుగా వచ్చిన దొరసాని లోనూ మంచి చాన్స్ కొట్టేశాడు రవిరెడ్డి. ఇందులో అతని నటనను తిలకించిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన తాజా చిత్రం ‘వి’లో మంచి పాత్రను ఇవ్వడం గమనార్హం. రానా దగ్గుబాటి, సాయి పల్లవిలతో వేణు ఊడుగుల రూపొందిస్తున్న విరాటపర్వంలోనూ రవిరెడ్డి చక్కని పాత్ర దక్కించుకున్నాడు. ఇక నర్సింహ నంది దర్శకత్వంలో రూపొంది ఇటీవలే విడుదలైన డిగ్రీ కాలేజ్‌లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో ఆయన పోషించిన పోలీసు ఆఫీసర్ సురేందర్‌రెడ్డి పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అవకాశాలవెల్లువ 1997లో అమెరికా వెళ్లిన రవిరెడ్డి అక్కడ ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకోవైపు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చదివాడు. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే మోజు పెరిగింది. ఏదో నటించాంలే అని కాకుండా చక్కగా శిక్షణ తీసుకొని తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకొని ముఖ్య పాత్రల్లో రాణిస్తున్నాడు. మంచి ఆఫర్లు వస్తున్నాయని రవిరెడ్డి పేర్కొన్నాడు. చాలా ఇష్టమైన పాత్రల్ని చేస్తున్నానని, వాటివల్ల మంచి గుర్తింపు లభిస్తోందని చెబుతున్నాడు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు అమెరికా నుంచి తిరిగి వచ్చి టాలీవుడ్లోనిలదొక్కుకోవడం విశేషం. -
అమెరికాలో అయ్యప్ప స్వాముల దీక్ష విరమణ
-
గ్రీన్‌కార్డు కోసం 2.27 లక్షల మంది భారతీయులు వెయిటింగ్
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి ఉపయోగపడే గ్రీన్‌కార్డు పొందేందుకు దాదాపు 2.27 లక్షల మంది భారతీయులు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధికార గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డుల కోసం మొత్తంగా 40 లక్షల మంది వేచి చూస్తూంటే.. 15 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో, 2.27 లక్షలతో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు అంచనా. అమెరికా చట్టాల ప్రకారం ఏటా జారీ చేయగల గ్రీన్‌కార్డులు గరిష్టంగా 2.26 లక్షలు మాత్రమే. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రీన్‌కార్డుల వెయిటింగ్ లిస్ట్‌లో 1.80 లక్షలతో చైనా మూడోస్థానంలో ఉంది. అమెరికా పౌరసత్వం ఉన్న వారు తమ కుటుంబ సభ్యులకు (తోబుట్టువులు, తల్లిదండ్రులు, భార్య, కొన్ని పరిమితులకు లోబడి పిల్లలకు) పౌరసత్వం కల్పించేందుకు అవకాశముంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రకమైన అవకాశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డులను పూర్తిగా నిషేధించాలని చూస్తూండగా ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల్లో అత్యధికులు అమెరికన్ పౌరసత్వమున్న వారి తోబుట్టువులని గణాంకాలు చెబుతున్నాయి. వీరి సంఖ్య 1.81 లక్షలు కాగా, పెళ్లయిన సంతానం సంఖ్య 42 వేలుగా ఉంది. భార్య/భర్త, మైనర్ పిల్లలు సుమారు 2500 మంది శాశ్వత నివాసానికి ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్కార్డులుకు అదనంగా మరో 8.27 లక్షల మంది ఇతర రకాల గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. -
అద్భుత స్తూపం... అందులో 'గీత'
మహాభూతాని అహంకారో బుద్ధిహిర్ అవ్యక్తం ఏవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరః శ్రీమద్భగవద్గీతలో చెప్పిన ఈ శ్లోకం పరమార్థాన్ని గ్రహిస్తే ఇలాంటి కార్చిచ్చులే కాదు, మనిషి–మనిషికి మధ్య అభిప్రాయ భేదాలూ పొడచూపవు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, తోటివారూ తనలాంటి వారే అన్న భావనను ఒంటి పట్టించుకుంటే చాలు, ప్రపంచం ఆనందాల పొదరిల్లులా ఆహ్లాదంగా మారిపోవటం ఖాయం. ప్రపంచంలో తొలి మనోవికాస గ్రంథంగా భావించే భగవద్గీత సారాన్ని విశ్వవ్యాప్తం చేయటమే దీనికి మార్గం అంటున్నారు గట్టు వేణుగోపాలచార్యులు. అందుకే ఆయన ఆధ్వర్యంలో తొలి గీతాస్తూపం అమెరికాలో ఏర్పాటైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్కాన్సాస్ రాష్ట్రం లో వాల్‌మార్ట్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న బెంటన్‌విల్‌లోని శ్రీకృష్ణ దేవాలయం ఆవరణలో ఈ అద్భుతస్తూపం భారతకాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఆవిష్కృతమైంది. స్తూపాలు కావాలంటూ 20 దేశాల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయి. ప్రపంచం లోనే తొలి గీతాస్తూపంగా ఏర్పడ్డ ఆ నిర్మాణ రూపకర్త గట్టు వేణుగోపాలాచార్యులు మన తెలంగాణవాసి కావటం విశేషం. ఏముంది అందులో... శంఖుచక్రాలతో ప్రశాంతచిత్తంతో కొలువుదీరిన చతు ర్భుజ శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహంగా ప్రశాంతచిత్తంతో నిలుచున్న రూపం... దాని చుట్టూ ఎత్తయిన భారీ ప్యానల్స్... ఒక్కో ప్యానెల్‌పై గీతలోని అధ్యాయాలు.. వాటిల్లో శ్లోకాలు.. తాత్పర్యాలు. అలా 700 శ్లోకాలు ఆ ప్యానెల్స్‌పై ఆంగ్లం, హిందీల్లో కొలువుదీరాయి. వాటి అర్థం దిగువనే ఉంటుంది. పంచభూతాలమయమైన శరీరం, అదే పంచభూతాలతో నిండిన ప్రకృతితో మసలడం, సౌభ్రాతృత్వం, విశ్వశాంతి, సమానత్వం, ఆనందం... ఇలా మానవ జీవన సౌందర్యాన్ని సాక్షాత్కరించే జీవన విధానానికి మార్గదర్శనం చేస్తుందనేది ఆ స్తూపాన్ని చూసిన వారి భావన. దాని ఎదుట ఉండే కంప్యూటరైజ్ట్ సిస్టం ముందుగా సందర్శకులకు ఓ టోకెన్ జారీ చేస్తుంది. దానిపై భగవద్గీత అధ్యాయం, శ్లోకం సంఖ్య ఉం టాయి. అది తీసుకుని సరిగ్గా ఆ ప్యానెల్‌లోని ఆ శ్లోకం వద్దకు వెళ్లి దాన్ని చదవాలి. ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని– ఆ శ్లోకంలోని నిగూఢార్థాన్ని బేరీజు వేసుకుని అది తనకు మార్గ నిర్దేశనం చేస్తుందో పరిశీలించాలి. రూపకర్త మనవాడే.... జనగామ జిల్లా జీడికల్‌కు చెందిన గట్టు వేణుగోపాలా చార్యులు బెంటన్‌విల్ శ్రీకృష్ణ దేవాలయ ప్రధాన అర్చకులు. ఆయన తండ్రి గట్టు వెంకటాచారి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు దశాబ్దన్నరపాటు సిద్దిపేట జిల్లా అయినాపూర్‌లో పనిచేయటంతో వేణుగోపాలాచార్యులు పాఠశాల విద్య అక్కడేసాగింది. ఉన్నవిద్య పూర్తిచేసి చిన జీయర్‌స్వామి సమక్షంలో వేదాధ్యయనం ముగించి అమెరికాలో ఆధ్యాత్మక భావనలు వ్యాప్తించేందుకు వెళ్లారు. మాతృభూమిపై మమకారంతో.. ఇప్పుడు మాతృభూమిపై మమకారంతో ఇక్కడి గ్రామాల్లో కూడా భగవద్గీత సారాన్ని పంచటం ద్వారా జీవిత గమనంలో ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండే మార్గాన్ని కల్పించాలని నిర్ణయించినట్టు వేణుగోపాలాచార్యులు పేర్కొంటున్నారు. వచ్చే నెల 12– 20 మధ్య సిద్దిపేట జిల్లా చేర్యాల, అయినాపూర్, తిరుమలలో గీతా హోమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. – సాక్షి, హైదరాబాద్ -
భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని
వాషింగ్టన్: అమెరికాలో శనివారం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన తెలుగు కుటుంబం మిస్టరీ వీడింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి తాళి కట్టిన భార్యను, జన్మనిచ్చిన బిడ్డలను కాల్చి చంపి ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అమెరికా పోలీసులు ధ్రువీకరించారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో యాష్‌వర్త్ రోడ్డు– అస్పెన్ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్ (15), సుహాన్ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ నాలుగు మృతదేహాలకు శవపరీక్ష అనంతరం సోమవారం అమెరికాలోని లోవా రాష్ట్ర పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయుధం కలిగి ఉండేందుకు చంద్రశేఖర్‌రెడ్డికి ప్రభుత్వం అనుమతిచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఎక్కడ తుపాకీని కొనుగోలు చేసింది విచారిస్తున్నట్లు వివరించారు. అలాగే ఐటీ నిపుణుడిగా పని చేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి 2018లో 1,05,000 డాలర్లు సంపాదన ఆర్జించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 25న 5,70,000 డాలర్లు వెచ్చించి చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌రెడ్డి ఇలాంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే ఈ మరణాలకు ముడిపెట్టి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమెరికాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. -
మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు
చీరాల/ వాషింగ్టన్: అమెరికాలో శనివారం ఉదయం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన నలుగురు తెలుగు వ్యక్తుల (ఒకే కుటుంబం) మరణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. శవపరీక్ష పూర్తి అయిన తర్వాత వారి మరణానికి గల పూర్తి వివరాలు తెలియవచ్చే అవకాశం ఉందని సోమవారం అమెరికా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని వారు తెలిపారు. అమెరికాలోని తెలుగు వారికి ఎలాంటి ఆందోళన అక్కర్లేదన్నారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో యాష్‌వర్త్ రోడ్డు– అస్పెన్ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్ (15), సుహాన్ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు.. ప్రకాశం, గుంటూరు జిల్లావాసులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయితీకి చెందిన సీతారామిరెడ్డి తన పెద్ద కుమార్తె లావణ్యను గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన సుంకర చంద్రశేఖరరెడ్డికి ఇచ్చి 2003లో చీరాలలో వివాహం చేశారు. చంద్రశేఖరరెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, లావణ్య కూడా అమెరికన్ గవర్నమెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గత మే 29న వారు ఓ ఇంటిని కొనుగోలు చేయగా చంద్రశేఖరరెడ్డి అత్తమామలైన సీతారామిరెడ్డి, హైమావతిలు గృహప్రవేశం నిమిత్తం అమెరికా వెళ్లారు. శనివారం ఇంట్లో తుపాకీ పేలిన శబ్ధం రావడంతో కింద పోర్షన్లో ఉంటున్న లావణ్య చెల్లెలు పిల్లలు ఇద్దరు పైకి వెళ్లి చూశారు. రక్తపుమడుగుల్లో పడి ఉన్న నలుగురిని చూసి బయటకు వచ్చి స్థానికుల సహాయం కోరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రక్తపుమడుగులో నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన ఇద్దరు పిల్లలు ప్రభాస్, సుహాన్ చదువులోగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా ఉండేవారని చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబంతో అమెరికాలో పదేళ్లుగా పరిచయం ఉన్న శ్రీకర్ సోమయాజులు తెలిపారు. -
నిలువుటద్దం
జీవన కాలమ్ చివరగా– జెరూసలేమ్ నుంచి జాన్ ముల్లర్ నాకు సందేశం పంపారు. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీయులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీయులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసుకోలేరా? పైవారం కాలమ్ (‘భూత’ ద్దం) చదివి చాలామంది స్పందించారు. ముఖ్యంగా మిత్రులు, అతి తరచుగా అమె రికా వెళ్లివచ్చే మిత్రులు– తన కొడుకూ, కూతురూ సంవత్స రాల తరబడి అక్కడ ఉన్న మిత్రులు– పేరు చెప్పినా పర వాలేదు– యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. ఆయన నిర్మొహమాటి. వాస్తవాన్ని కుండ బద్దలుకొట్టి చెప్పే మనిషి. ‘ఈనాటి అమెరికా అనర్థంలో మనవారి వాటా కూడా ఉంది మారుతీరావుగారూ’ అన్నారు. భారతీయులు– అందునా తెలుగువారు ఎక్కడికి వెళ్లినా తమ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తారు. సామ ర్థ్యంలో, క్రమశిక్షణలో ఒక్కొక్కరూ అరడజను అమెరికన్ల పెట్టు. అలనాడు అమెరికాలో వైద్య రంగానికీ, ఇప్పు డిప్పుడు సాఫ్ట్వేర్ రంగానికి వారు చేస్తున్న సేవలు అనితర సాధ్యం. అపూర్వం. ఒక్క సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చయ్ పేరు ప్రపంచంలో మన సామర్థ్యాన్ని పతాక స్థాయిలో నిలిపారనడానికి ఉదాహరణలు. అయితే– తాము మాతృదేశానికి దూరంగా ఉంటూ నష్టపోయినదేదో ఎరిగిన వీరు– తమ సంపా దనతో, కృషితో అక్కడ నిలుపుకుంటున్నారు. అది అభిలషణీయమే. కాలిఫోర్నియాలో, చికాగోలో, పిట్స్ బర్గ్‌లో, హూస్టన్‌లో– ఇలా ప్రతీచోటా మన దేవాల యాలు వెలిశాయి. ఉత్సవాలు, సంబరాలు, కోకొల్లలు. ఏటేటా ఆటా, తానా, నాటా, పాటా– మీ ఇష్టం. తెలుగు తేజం వెల్లివిరుస్తుంది. ‘పాడుతా తీయగా’లు పల్లవి స్తాయి. క్లీవ్‌లాండ్‌లో ఏటేటా జరిగే కర్ణాటక సంగీ తోత్సవాలు చెన్నై సంగీత సభలకి తీసిపోవు. అమెరి కాలో బాలమురళీకృష్ణ, సంజయ్ సుబ్రహ్మణ్యం, టీఎం కృష్ణ, సుధా రఘునాథన్, కూచిపూడి పరపతి భారత దేశంలో స్థాయికి ఏ విధంగానూ తీసిపోదు. ఇక మరో పార్శ్వం. మనవారు కులాల పేరుతో కోర్టులకు ఎక్కి అమెరికా కోర్టుల్లో నవ్వులపాలయ్యారు. ఇంకా తెలుగు సినిమాల రిలీజుకి అమెరికాలో కార్లలో ర్యాలీలు, తమ కులం కాని హీరోల పోస్టర్లు చింపే అల్లర్లు– ఇవన్నీ మన దేశంలోని వెర్రితలలను అమెరి కాకి దిగుమతి చేసిన వికారాలు. ఈ మధ్య తాజాగా చేరిన మరో రగడ– తెలంగాణ, ఆంధ్ర సోదరుల మధ్య ప్రాంతీయ అసహనం. ఇవన్నీ కడుపునిండినవారి విన్యా సాలు. అందరూ ఉపాధి కోసం మరో దేశానికి వచ్చిన వారే. భారతీయుల సామర్థ్యానికీ, క్రమశిక్షణకీ వచ్చిన ప్రాచుర్యం ఈ ‘అరాచకం’ ముందు నిలవలేదు. నిల వదు. ఉపాధి కోసం తాపత్రయం తలవంచుతుంది. అవసరానికి మించిన ఆదాయం, కుల, ప్రాంత, మత దురభిమానం వీధిన పడేస్తుంది. ఈ పని చైనావారు కానీ, పాకిస్తాన్‌వారు కానీ, బంగ్లాదేశ్వారు, ఫ్రెంచ్‌వారు గానీ చేయలేదు. ఏతావాతా మన భారతీయ సోదరులు మరచి పోయినది ఏమిటంటే– మనమున్నది పరాయిదేశం. మన దేశంలో ఉన్న హక్కులు, వెసులుబాట్లు ఇక్కడ లేవు. ఉండవు. మనకి అంత రక్షణ లేదు. మనవాళ్ల కొందరి జేబుల్లోనయినా పౌరహక్కులున్నాయి. కానీ వారందరి జేబుల్లోనూ తుపాకులున్నాయని మరచి పో కూడదు. పైగా ఇక్కడ ఇప్పుడు చేస్తున్న పనులు భారత దేశంలోనూ నిషిద్ధాలు. మత సమైక్యత, ప్రాంతీయ సమైక్యత, కుల సమైక్యత వీటికి ఎల్లలు లేవు. మనకి పరాయి దేశంలో అన్యాయం జరిగినప్పుడు– భారతీ యులం. అంతా సవ్యంగా ఉన్నప్పుడు తమిళులం, ఫలానా కులం వారం, ఫలానా ప్రాంతం వారం. మన కోసం పొలాలు అమ్మి, పొట్టకట్టుకుని పనిచేసినవారు ఇంకా మనదేశంలో వృద్ధాశ్రమాలలో ఏకాకులుగా ఉన్నారు– అని మరచిపోతున్నాం. మనలాగే పరాయి దేశాల నుంచి వచ్చిన వారికి బాధ్యతారాహిత్యమైన ఈ విశృంఖలత్వం– వెగటుగా కనిపిస్తుంది. ఫలితం ఏమిటి? అక్కడివారిలో వీరి వికారాలపట్ల విసుగు. ఆత్మన్యూనతా భావం. మత్సరం. ఏతావాతా– అమెరికాలో ఉన్న భారతీయులు అమె రికా వారితో ఏకోన్ముఖం కాక, తమదైన సంస్కృతినీ, ఐడెంటిటీని తమ వెర్రితలలతోనూ పెంచుకోవాలని చూస్తున్నారు. గొంతులు చించుకుంటున్నారు. బహు శా– ఇదే ట్రంప్‌గారి ఆలోచనా ధోరణికీ, తత్కారణంగా రెచ్చిన దుష్ప్రభావానికీ పెట్టుబడి కావచ్చు. చివరగా– నాకు ఎవరో ఈ సందేశాన్ని పంపారు. ఇది జెరూసలేమ్ నుంచి జాన్ ముల్లర్ అనే ఆయన ప్రకటించినది. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీ యులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీ యులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసు కోలేరా? ఇజ్రేల్ దేశస్థుడుగా నేను చాలాసార్లు ఇండియా వచ్చాను. ఇండియాలో ఉన్న అపూర్వమైన శక్తి సామర్థ్యా లను గమనించాను. నిజం చెప్పాలంటే మీ భారతీ యులు తమ స్వదేశం నుంచి పారిపోవడానికి ఉర్రూత లూగుతుంటారు. కారణం–అటువైపు జీవితం ‘పచ్చగా’ ‘గొప్పగా’ కనిపిస్తుంటుంది. భారతదేశాన్ని ఆకాశంలో నిలిపే కృషి నిజంగా భారతీయులు చేయగలి గితే ఈ శతాబ్దం భారతదేశానిది. భారతీయులు ఇప్ప టికైనా ఈ సవాలును తీసుకుంటారా?’’ - గొల్లపూడి మారుతీరావు -
పిల్లల చదువులకే అమెరికన్ భారతీయులు పెద్దపీట
వాషింగ్టన్ : అమెరికాలోని భారతీయులు తమ సంపాదనలో ఎక్కువభాగం పిల్లల చదువులకోసం పొదుపుచేస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. సుమారు 33 శాతం మంది భారతీయ అమెరికన్లు తమ పిల్లల కాలేజీ చదువులకోసం ఆర్నెల్లకుపైగా వేతనాన్ని దాచుకుంటున్నట్లు తెలిపారు. పిల్లల చదువులకు కావాల్సినంత డబ్బు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ తర్వాత కుటుంబం ఆర్థికంగా ఒడిదుడుకులకు లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం .. ఈ రెండూ ఇక్కడి భారతీయ అమెరికన్ల ముఖ్యలక్ష్యాలని అధ్యయనం తెలిపింది. మసాచూసెట్స్ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ముఖ్యమైన ఈ రెండు అవసరాలకోసం తమ సంపాదనలో ఎక్కువమొత్తాన్ని పక్కనపెట్టాల్సి రావడంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నాయని, అంతేకాక కాలేజీల ఫీజులు భారీగా ఉన్న ప్రస్తుత తరుణంలో కుటుంబంలో పిల్లలందరి చదువులను నెట్టుకురావడం కూడా వారికి పెద్ద సవాలుగా మారిందని అధ్యయనం వెల్లడించింది. కాగా, ముసలితనంలో తమ పిల్లలకు భారం కాకూడదని 70 శాతం మంది భావిస్తున్నారు.