అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి | Indian Girl American Boy Love Marriage at Chittoor district | Sakshi
Sakshi News home page

అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి

Published Sun, Mar 3 2024 7:50 AM | Last Updated on Sun, Mar 3 2024 7:50 AM

Indian Girl American Boy Love Marriage at Chittoor district  - Sakshi

హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన జంట 

పలమనేరు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ కళ్యా­ణ మండపంలో అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యా­­రు. స్థానిక సాయినగర్‌కు చెందిన భాస్కర్, సుమలతరెడ్డి కుమార్తె రేవూరి మీనా నాలుగేళ్లుగా అమెరికాలోని మిచిగాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ­ఇంజినీర్‌గా పనిచేస్తోంది.

అదే కంపెనీలో పనిచేస్తున్న అదే రాష్ట్రం వాటర్‌పోర్ట్‌ టౌన్‌కు చెందిన బ్రాడ్‌లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రు­లకు తెలుపడంతో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఇక్కడి కళ్యా­ణ మండపంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం మేరకు ఘనంగా జరిగింది. బంధువులు హాజరై నూతన జంటను ఆశీర్వాదించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement