మామిడిలో దిగుబడులు సాధించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మామిడి సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్‌లో మంగళవారం మామిడి పంటలో సస్యరక్షణ, ప్రత్యామ్నాయ పంటలపై ఆర్‌బీఎస్‌కే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మామిడి రైతులు మేలైన పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపట్టి రైతులు పెట్టుబడులు తగ్గించుకునేలా చూడాలన్నారు. ప్రధానంగా మామిడి కొమ్మల కత్తెరింపులు చేపట్టి తెగుళ్లు, పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చునన్నారు. మామిడి కవర్లను 50 శాతం రాయితీతో అందిస్తున్నామన్నారు. సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. కాయ దశలో మామిడి పంటకు తామర పురుగు ఆశిస్తుందన్నారు. దీనికి జిగురు అట్ట బుట్టలను చెట్టుకు పెట్టుకోవాలన్నారు. మరో సీనియర్ శాస్త్రవేత్త కవిత మాట్లాడుతూ.. మామిడిలో బూడిద తెగుళ్లకు హెక్సాకోనజోల్ వాడాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలైన చింత, నిమ్మ, సీతాఫలం వంటి పంటల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment