90 లీటర్ల నాటు సారా స్వాధీనం
కుప్పం : విక్రయానికి సిద్ధంగా ఉన్న 90 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొహిభిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ సీఐ నాగరాజు తెలిపారు. రామకుప్పం మండలం రామాపురం తండాలో నాటు సారా తయారీ చేసి విక్రయానికి సిద్ధంగా ఉన్న సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. సారా తయారీ చేసిన నిందితుడు విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
20 లీటర్ల్ల్లు..
కార్వేటినగరం : కార్వేటినగరం ఎకై ్సజ్ శాఖ సర్కిల్ పరిఽధిలోని వెదురుకుప్పం మండలంలో దాడులు నిర్వహించి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ , ఎకై ్సజ్‌శాఖ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఎకై ్సజ్ కార్యాలయం వద్ద ఎస్‌ఐ సుబ్రమణ్యం వివరాలను వెల్లడించారు. వెదురుకుప్పం మండలంలోని నక్కలంపల్లిలో దాడులు నిర్వహించగా బాలక్రిష్ణయ్య సారా విక్రయాలు చేస్తుండగా పట్టుకొని అతడి వద్ద ఉన్న 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
90 లీటర్ల నాటు సారా స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment