పాలసముద్రం : నాటుసారా నిర్మూలనలో భాగస్వాములు కావాలని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస ఆచారి తెలిపారు. మంగళవారం నరసింహాపురంలో సాటుసారా నిర్మూలనలో భాగంగా జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, కార్వేటినగరం ఎకై ్సజ్ సీఐ శిరీషాదేవి ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస ఆచారి మాట్లాడుతూ.. నాటుసారా తాగడం వల్ల కలిగే అనర్థాలు, నష్టాలను గ్రామ ప్రజలకు వివరించారు. నాటుసారా రహిత మండలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామస్తులతో కలసి నాటు సారా రహిత గ్రామంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్‌ఐ మోసస్, సాయితేజ, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment