రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● ఒకరికి తీవ్రగాయాలు
కార్వేటినగరం : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొల్లాగుంట చెక్‌పోస్టు వద్ద మంగళవారం చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ మునికృష్ణ కథనం మేరకు వివరాలు.. మండలంలోని ఆళత్తూరు గ్రామానికి చెందిన ఈశ్వర్ ఆచారి , మనెమ్మ కుమారుడు శ్రావణ్ (25) అదే గ్రామానికి చెందిన చెన్నకేశవుల(21)తో కలసి సోమవారం రాత్రి కొల్లాగుంటలోని తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని రాత్రి ఒంటి గంట సమయంలో స్వగ్రామానికి తిరిగీ వస్తుండగా కొల్లాగుంట చెక్‌పోస్టు వద్ద శ్రావణ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మరో బైక్ వేగంగా వచ్చి ఢీ కొనడంతో శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంలో వెనుక ఉన్న చెన్నకేశవులకు తీవ్రగాయాలు కావడంతో అతడిని తిరుపతి రుయాకు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెనుకవైపు నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న వ్యక్తి రంజిత్‌గా గుర్తించామని అతడు వాహనాన్ని ప్రమాద స్థలంలో వదలి పరారీ అయ్యాడని రంజిత్ కోసం గాలిస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. శ్రావణ్‌కు ఆరు నెలల కిందటే వివాహమైంది. ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో భార్య రోహిణి కన్నీమున్నీరుగా విలపించారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment