
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశారు. అడ్డుకున్న మరో ఇద్దరిపైనా కూడా దాడికి పాల్పడ్డాడు. పెద్దల సమక్షంలో రాజీ పంచాయితీ అంటూ పిలిచి నలుగురిపై విచక్షణరహితంగా కత్తితో దాడి చేశారు.
ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కత్తి కడుపులో ఇరుక్కుపోయింది. బాధితులను గుడుపల్లి మండలం అగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్, రమేష్, కౌసల్య, సీతారామప్పగా గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment