సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదని ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశారు. వేముల మండలం కొత్తపల్లిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఇంట్లో వారు రావడంతో ఆ యువకుడు పరారయ్యారు.
పరిస్థితి విషమించడంతో పులివెందులలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 14 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో పాటు రక్తస్రావం ఎక్కువగా అవుతుండడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment