
సాక్షి, నెల్లూరు: కోవూరు దళితవాడలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సురేష్.. ఓ మహిళపై కర్కశంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ షేకున్ (35) కారణమని అనుమానంతో కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుప్రతికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment