Kovuru
-
AP: బడుగుల ‘సాధికార’ ప్రదర్శన
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలన్నీ నార్తురాజుపాళేనికి కదలి వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రదర్శించాయి. మంగళవారం వైఎస్సార్సీపీ రాజుపాళెంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశాయి. వారికి రాజుపాళెంలో వీధివీధినా ఘనస్వాగతం లభించింది. జై జగన్ నినాదాలతో రాజుపాళెం హోరెత్తింది. యాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. పలువురు నేతలు రాష్ట్రానికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలును, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రపథంలో నిలుపుతున్న తీరును వివరించారు. నేతలు సీఎం జగన్ పేరు పలికిన ప్రతిసారీ ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అగ్రస్థానంలో నిలిపిన సీఎం జగన్: డిప్యూటీ సీఎం రాజన్నదొర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమాన్ని అందిస్తున్నారని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర చెప్పారు. లంచాలు, రికమెండేషన్లు లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి పథకాల డబ్బు జమ చేస్తున్నారని, ఇంతటి పారదర్శకమైన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రస్థానంలో నిలుపుతూ ఆ వర్గాలు సాధికారత సాధించేందుకు దోహదపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదని, సీఎం జగన్ ఇద్దరికి మంత్రి పదవులే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవీ ఇచ్చారన్నారు. సీఎం జగన్ 2 లక్షల మంది గిరిజనులకు 3 లక్షల ఎకరాలకుపైగా భూమి ఇచ్చారని వివరించారు. పోడు భూములకు రైతు భరోసా అమలు చేసి 3.45 లక్షల మంది రైతులకు అందిస్తున్నారన్నారు. జగనన్నతోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు నాగార్జున సామాజిక విప్లవం దేశంలో ఒక్క సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమైందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుటుంబాలు బాగుండాలని, మిగిలిన వారితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. పేద పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఇంగ్లిష్ మీడియం తెచ్చారన్నారు. పేదవాళ్ల పిల్లలు బాగు పడటం ఇష్టం లేని చంద్రబాబు కోర్టుకెళ్లాడన్నారు. రామోజీరావు మనవళ్లు, రాధాకృష్ణ చుట్టాలు ఇంగ్లీష్ మీడియం చదవొచ్చు కానీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదవొద్దన్నది వారి భావమన్నారు. సీఎం జగన్ 31 లక్షలమంది పేదలకు ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్నారని తెలిపారు. 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారని, వారిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని అన్నారు. జగనన్న పేదోడి కడుపు చూస్తారు: సినీ నటుడు అలీ సీఎం జగన్ ప్యాలెస్‌లో ఉన్నా పేదవాడి కడుపు చూస్తారని సినీ నటుడు అలీ చెప్పారు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్డుపై పడుకుంటే పక్క బెడ్డుపై పడుకొని పేదవాడు కూడా ఆపరేషన్ చేయించుకుంటున్నాడని, ఇది సీఎం జగన్ వల్లే సాధ్యపడిందని చెప్పారు. 2024లో జగనన్న వన్స్‌మోర్ అంటూ మనమంతా వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారు: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక నేరుగా వలంటీర్లనే ఇంటికి పంపి మనకు కావల్సినవన్నీ అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ వస్తే వలంటీర్లను పీకేస్తామని లోకేశ్, చంద్రబాబు చెబుతున్నారని, ఇలాంటి వారు మనకు అవసరంలేదని చెప్పారు. కోవూరు అభివృద్ధికి సీఎం జగన్ కృషి : ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు నియోజకవర్గం అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. 1.28 లక్షల కుటుంబాలకు రూ.981 కోట్లు నేరుగా ఖాతాల్లో వేశారన్నారు. నాన్ డీబీటీ ద్వారా రూ.394 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇంతటి సంక్షేమం ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రీ అందించలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఎనిమిది మంది ప్రాణాలు పోయినా.. చంద్రబాబు మారలా
సాక్షి, నెల్లూరు/కోవూరు: అసలే ఇరుకు సందులు.. వాటిలో పదడుగుల ఫ్లెక్సీలు.. గట్టిగా వెయ్యిమంది వస్తే రోడ్డు కిక్కిరిసినట్టు కనిపించేలా డ్రోన్‌షూట్.. చివరికి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు కోల్పోవడం.. ఇదీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనల సారాంశం. మూడురోజుల పర్యటనలో టీడీపీ నేతలు ఒకే ఫార్ములా అనుసరించారు. ఫలితంగా బుధవారం కందుకూరులో ఎనిమిదిమంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయినా మార్పురాలేదు. కందుకూరు ఘటనతోనైనా చంద్రబాబు సభలు విశాలమైన ప్రదేశాల్లో పెట్టకుంటారేమోనని అందరూ ఊహించారు. కానీ ఎక్కడా ప్రచారయావ తగ్గించుకునేది లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహారశైలి సాగింది. కావలిలో: కావలిలో గురువారం పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద కూడా ఇరుకురోడ్లను ఎంచుకుని ఇదే ఫార్ములాతో సభ నిర్వహించారు. అక్కడ కూడా రెండు వైపులా 30 అడుగుల రోడ్లు, డ్రైనేజీ కాలువ, పదడుగుల మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచార వాహనాన్ని సెంటర్లో ఉంచి ప్రసంగించారు. కోవూరులో: ఇరుకురోడ్ల ఫార్ములాను అమలు చేస్తున్న చంద్రబాబు అండ్ టీం శుక్రవారం కోవూరులో కూడా అదే తరహా పబ్లిసిటీ కోసం బజార్‌సెంటర్ లాంటి చిన్న జంక్షన్లో సభ నిర్వహించింది. కూడలి అయినప్పటికీ నాలుగు వైపులా రోడ్డు ఇరుగ్గా ఉంటుంది. వందమంది గుమిగూడితే ఇరుకైపోతుంది. అలాంటి ప్రదేశాన్ని టీడీపీ నేతలు ఎంచుకోవడం చూస్తే వారి పబ్లిసిటీ యావ ఎంతదూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సభకు వస్తే ఒక్కొక్కరికి రూ.200 ఇస్తామంటూ నేతలు జనసమీకరణ చేపట్టినా.. కోవూరు బైపాస్ రోడ్డు సాయిబాబా మందిర కూడలి నుంచి బజారు సెంటరు దాకా చంద్రబాబు నిర్వహించిన రోడ్డుషోలో జనం పలుచగానే కనిపించారు. చదవండి: (జనాలు ఛీ కొడుతున్నా చంద్రబాబుకు పట్టింపుల్లేవు.. ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్) -
నెల్లూరు: కోవూరులో చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్
-
కోవూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
బిట్రగుంట (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలో ఉన్న 15 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా సర్వాయపాళెంకు చెందిన తాతా రమణమ్మ (55)ను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మృతి చెందింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కావలి మండలం సర్వాయపాళెం పంచాయతీ కోనేటివారిపాళెంకు చెందిన 15 మంది కూలీలు దగదర్తి మండలం ఉప్పరపాళెంలో మిరప కోతలకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి ఆటోలో వెళుతుండగా చెన్నై నుంచి ఏలూరు వెళుతున్న కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి ముందు వెళుతున్న కూలీల ఆటోను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో రెండుసార్లు బోల్తాకొట్టి రోడ్డు మార్జిన్లో పడిపోయింది. కూలీలంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బిట్రగుంట ఎస్ఐ చినబలరామయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. వారిలో తాతా రమణమ్మ అనే మహిళ మార్గమధ్యంలో మృతిచెందింది. -
చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే..
విడవలూరు (నెల్లూరు): సీఎం వైఎస్ జగన్‌కు తనను దూరం చేయాలని ఏబీఎన్, టీవీ–5 చానల్స్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి పదేపదే ప్రసారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూఈ నెల 26న గృహ నిర్మాణాలపై జరిగిన మంత్రుల సమీక్ష సమావేశంలో సీఎం చేస్తున్న అభివృద్ధి యజ్ఞం గురించి తాను గొప్పగా మాట్లాడితే.. ఆ మాటల్ని తొలగించి, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వక్రీకరించి చూపడం దారుణమన్నారు. ఆ చానళ్లు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
-
మహిళ గొంతు కోసిన కానిస్టేబుల్..
సాక్షి, నెల్లూరు: కోవూరు దళితవాడలో దారుణం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ సురేష్.. ఓ మహిళపై కర్కశంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ షేకున్ (35) కారణమని అనుమానంతో కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులు ఆమెను ఆసుప్రతికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీలు చేసి.. జల్సాగా జీవిస్తూ..
కోవూరు: వివిధ చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న కట్టా రాము అనే వ్యక్తిని కోవూరు ఎస్సై చింతం కృష్ణారెడ్డి శుక్రవారం అరెస్ట్ చేశారని సీఐ జీఎల్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 సంవత్సరం జూలై 23వ తేదీన కోవూరు పట్టణంలో నాలుగు గృహాల్లోకి చొరబడి బంగారు వస్తువులు, నగదు చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో నిందితుడు మండలంలోని స్టౌ బీడీ కాలనీచెందిన కట్టా రాము అని నిర్ధారించారు. అతనిపై నిఘా ఉంచారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయగా రాము తెలంగాణలోని కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఫినాయిల్ విక్రయిస్తూ చెడు వ్యసనాలకు బానిసైయ్యాడు. ఈ నేపథ్యంలో అతను చోరీలకు పాల్పడుతూ జల్సాగా జీవించసాగాడు. ఓ కేసులో జగిత్యాలలోని కోరట్ల పోలీసులు రామును అరెస్ట్ చేశారు. అక్కడినుంచి విడుదలై కోవూరు ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడి నుంచి రూ.2.70 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. రామును పట్టుకునేందుకు కృషిచేసిన ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, జబీవుల్లా, వెంకటేశ్వర్లు, ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్కే అయాజ్‌లను సీఐ అభినందించారు. వారికి ఎస్పీ ద్వారా రివార్డులు అందజేయనున్నట్లుగా వెల్లడించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి పర్యవేక్షణలో నేరస్తుడిని పట్టుకుని సొత్తు రికవరీ చేశామని సీఐ తెలిపారు. -
మాట ఇచ్చారు.. నెరవేర్చారు
టీడీపీ ఐదేళ్ల పాలనలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వ్యర్థాల నీటిని తాగి వ్యాధులబారిన పడ్డారు. దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి హయాం నుంచి నల్లపరెడ్ల వైపే కోవూరు నియోజకవర్గ ప్రజలు నమ్మకముంచారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి తమ గోడును చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సమస్యలను ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.56 లక్షలతో వాటర్ప్లాంట్లు మంజూరు చేయించారు. దీంతో మత్స్యకారులతో పాటు మిగతా ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసినందుకు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదాలకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో వాటర్ప్లాంట్ల ఏర్పాటు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి రూ.56లక్షలు మంజూరు చేశారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వెళ్లిన తనకు ప్రజలు తాగునీటి సమస్యలు వివరించారన్నారు. ఈ విషయాన్ని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పనులకు సంబంధించి త్వరితగతిన ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు కలెక్టర్ శేషగిరిబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నిధుల కేటాయింపు ఇలా.. ►విడవలూరు మండలం కొత్తూరు దగ్గరలోని పాతూరులో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించినట్లు ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ►విడవలూరు మండలంలోని బుసగాడిపాళెం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ►విడవలూరు మండలంలోని రామతీర్థం పంచాయతీ రామలింగాపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇచ్చారు. ►విడవలూరు మండలంలోని దంపూరు పంచాయతీ రామచంద్రాపురం గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చే శారు. ►విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలో పైప్లైన్ల రీప్లేస్‌మెంట్‌కు సంబంధించి రూ.5 లక్షలు కేటాయించారు. ►విడవలూరు మండలం ఊటుకూరు పల్లిపాళెంలోని నివాసగృహాల తాగునీటి కుళాయిల కనెక్షన్ల కోసం రూ.లక్ష ఇచ్చారు. ►కోవూరు పట్టణంలోని నందలగుంట గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ►కోవూరు పట్టణంలోని పెళ్లకూరుకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు నిధులు ఇచ్చారు. ►కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. ►కోవూరు మండలం వేగూరు పంచాయతీ సీతారామపురంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ►కొడవలూరు మండలం ఆలూరుపాడు ఎగువమీద గిరిజనకాలనీలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. ►ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెంలో ఆర్వో వాటర్‌ప్లాంట్ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరుచేశారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. -
కోవూరులో వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
‘వెలుగు’ పేరుతో గోల్మాల్
సాక్షి, కోవూరు(నెల్లూరు) : కోవూరు సంఘమిత్ర కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచింది. రుణాల మంజూరుకు చేతివాటం మొదలు వీఏఓ నిధుల స్వాహా వరకు కుంభకోణాలమయంగా మారింది. ప్రస్తుతానికి పోతిరెడ్డిపాళెం వీఏఓ రూ.6.2 లక్షల నిధుల దుర్వినియోగమయ్యాయని తేలింది. దీనిపై ఏపీఎం సుజాత, సీసీ మమతపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.కోవూరు సంఘమిత్ర కార్యాలయ పరిధిలో మొత్తం 1250 గ్రూపులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఓ ఏపీఎం, నలుగురు సీసీలు, 25 మంది వీఓఏలుంటారు. వీరి పరిధిలో గ్రూపులకు రుణాల మంజూరు కార్యక్రమం జరుగుతుంది. అయితే రుణాలకు సంబంధించి సంఘమిత్ర ఉద్యోగులకు ముడుపులిస్తేనే పనులు జరుగుతాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోతిరెడ్డిపాళెం లీడర్ ఫిర్యాదుతో వెలుగులోకి.. కోవూరు మండలం పోతిరెడ్డిపాళేనికి చెందిన ఒకటో నంబర్ సంఘబంధ నాయకురాలు కాకి రాజమ్మ జనవరి 23న తమ పరిధిలోని సంఘబంధంలో జమైన సబ్‌ప్లాన్ నిధుల విత్‌డ్రా, సంఘ సభ్యుల నుంచి వసూలు చేసిన సబ్‌ప్లాన్, స్త్రీ నిధి రికవరీ నిధులు జమచేయలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన స్త్రీనిధి, డీఆర్డీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమణారెడ్డి ఫిబ్రవరి 18న ప్రాథమిక విచారణ జరిపి నివేదికను సమర్పించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిన అధికారులు చర్యలు తీసుకోవాలని యత్నించగా, టీడీపీ నేతలు, అప్పటి మంత్రుల సిఫార్సులతో ఆగాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వారిపై ఒత్తిళ్లు పెరిగాయి. అనంతరం ఎన్నికలు రావడంతో జాప్యం తలెత్తింది. సంఘబంధం సభ్యుల నుంచి రూ.6,20,216 మేర నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఫిబ్రవరిలో విచారణ అనంతరం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.1,54,000 చెల్లించినట్లు తేల్చారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం పోతిరెడ్డిపాళెంలో నిధుల దుర్వినియోగంపై పలుమార్లు ఫిర్యాదు వచ్చినా ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత పట్టించుకోలేదని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. దుర్వినియోగమైన రూ.6,20,261 నిధులపై ఏసీ కామాక్షి, ఏపీఎం సుజాత, సీసీ మమత, వీఓఏ అనూరాధ బాధ్యత వహించాలని తెలిపారు. నిధులు దుర్వినియోగమైనందుకు, పర్యవేక్షణ లోపానికి సెర్ప్ నిబంధనల మేరకు 2009 సెక్షన్ ఏడు ప్రకారం ఏపీఎం సుజాత, సీసీ మమతను సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాల వరకు పెళ్లికానుక ఏపీఎంగా పనిచేస్తున్న శేషారెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
రీ పోలింగ్.. బీఅలర్ట్!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లెపాళెంలో ఉన్న పోలింగ్ కేంద్రం 41లో, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని సూళ్లూరుపేట మండలంలోని అటకానితిప్పలో ఉన్న బూత్ నంబర్ 197లో ఈ నెల 6వ తేదీన పార్లమెంట్ అభ్యర్థి ఓటుకు సంబంధించి రీ పోలింగ్ జరగనుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ రేవు ముత్యాలరాజు పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కూడా అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేసే తరహాలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు వైఎస్సార్సీపీ, టీడీపీలు బూత్‌లోని ఓటర్లపై దృష్టి సారించారు. అధికార టీడీపీ అయితే మళ్లీ ప్రలోభాల పర్వాన్ని నమ్ముకొని కసరత్తు మొదలు పెట్టింది. ఆయా బూత్‌ల పరిధిలో ఉన్న సామాజిక సమీకరణాలపై దృష్టి నిలిపి ప్రలోభాల కొనసాగించడానికి సన్నద్ధం అయింది. వాస్తవానికి రాజకీయ పార్టీలు జిల్లాలో ఫలితాలపై రకరకాల చర్చలు, లెక్కలు వేసుకొని గెలుపు తమదేనని ఇప్పటికే ప్రకటించకున్నాయి. ఈ క్రమంలో రీపోల్ రావడంతో అందరి దృష్టి దానిపై నెలకొంది. అది కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన ఒక్క ఓటు కావటంతో ఎంపీ అభ్యర్థులు రీపోల్ జరిగే ప్రాంతాల్లో బూత్ ఏజెంట్ల నుంచి అందరితో మాట్లాడుతున్నారు. పల్లెపాళెం బూత్ పరిధిలో 1,084 ఓట్లు, అటకాని తిప్ప బూత్ పరిధిలో 5,53 ఓట్లు ఉన్నాయి. రిజర్వ్‌లోని ఈవీఎంలతో.. జిల్లాలో ఒక్కొక్క పార్లమెంట్ సెక్టార్ పరిధిలో రిజర్వ్‌లో ఈవీఎంలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. వాటిలో ఒక్కొక్క ఈవీఎంను ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఎంపీ ఓటు ఒక్కటే వినియోగించుకోవాల్సి ఉండటంతో రెండు చోట్ల ఒక్కొక్క ఈవీఎంను ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వ్‌లో మరో ఈవీంను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వేసవి కాలం కావడంతో వడగాలులు అధికంగా ఉన్న క్రమంలో రెండు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయటంతో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. శుక్రవారం ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం పోలింగ్ స్టేషన్‌కు సిబ్బంది కేటాయింపుపై సృష్టత ఇచ్చే అవకాశం ఉంది. రీపోలింగ్ జరిగే రెండు చోట్ల అధికారులను సస్పెండ్ చేసిన క్రమంలో వారి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశం ఉంది. ఒక్కొక్క స్టేషన్‌కు పోలింగ్ అధికారితో కలిపి ఆరుగురు సిబ్బందిని నియమిస్తారు. 4వ తేదీన రెండు పోలింగ్ స్టేషన్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ ముత్యాలరాజు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. జనరల్ అబ్జర్వర్‌తో పాటు మరో అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్లు ఈ నెల 4 నుంచి విధుల్లో ఉంటారని వివరించారు. నేడు నగరంలో డీజీపీ సమీక్ష 6న రీపోలింగ్ జరగనున్న రెండు సెంటర్లలో బందోబస్తు వ్యవహారాలపై శుక్రవారం డీజీపీ ఆర్పీ ఠాగూర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటికే నెల్లూరు నగరానికి చేరుకున్నారు. రీపోల్ ఏర్పాటుతో పాటు 23న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించి స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించనున్నారు. బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని ఇస్కపాళెం పంచాయతీ పల్లిపాళెంలోని 41వ పోలింగ్‌స్టేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన 41వ పోలింగ్ స్టేషన్లో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధిం చి రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ స్టేషన్‌లోని వసతులను పరిశీలించేందుకు వచ్చామన్నారు. వసతుల కల్పనపై స్థానిక అధికారులతో మాట్లాడామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ డి.వి.నరసింహారావు, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. అట్టకానితిప్పపైనేఅందరి దృష్టి సూళ్లూరుపేట రూరల్: అందరి దృషి ఈ నెల 6వ తేదీన రీపోలింగ్ జరుగనున్న అట్టకానితిప్పపైనే ఉంది. 197వ బూత్‌లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ ఉత్తర్వులు జారీచేయడంతో రాజకీయనాయకులు కన్నేశారు. గత నెల 11వ తేదీన జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో అటకానితిప్పలో ఎంపీ స్థానానికి చెందిన ఈవీఎం మొరాయించింది. దాని స్థానంలో వేరే ఈవీఎం మిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే మొరాయించిన ఈవీఎం మిషిన్‌లో అప్పటికే దాదాపు 200 ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికలు పూర్తయిన అనంతరం అదనపు ఈవీఎం మిషన్‌ను సీల్‌వేసి స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. అక్కడ ఈవీఎంలు లెక్క తేలలేదు. దీంతో ఈసీ ఈ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వాహించాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ పోలింగ్ కేంద్రంలో దాదాపు 558 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీ నాయకులు నేతలు సంప్రదింపులు జరిపి ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులకు మాత్రం రీ పోలింగ్ సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని చెబుతున్నారు. -
నెరవేరని హామీ.. తీరని దాహార్తి
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మండలంలోని తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వవ్వేరు పైలెట్ ప్రాజెక్ట్‌ను మంజూరు చేశారు. కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టడంతో మూణ్ణాళ్లకే పైపులైన్లు దెబ్బతిని ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. 2015 మార్చి 3న మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి ప్రజాప్రతినిధులు సమస్యను తీసుకెళ్లగా, వారం రోజుల్లోగా మరమ్మతులు చేయించి తాగునీటి సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో ప్రజల దాహార్తి తీరలేదు. మండలంలోని అన్ని పంచాయతీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏడేళ్ల క్రితం రూ.3.75 కోట్లతో జొన్నవాడ వద్ద పెన్నానదిలో పైలెట్ ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయించి నివేదికలు పంపారు. ఆ తరువాత ప్రతిపాదనల్లో మార్పులు చేశారు. వవ్వేరు వద్ద రూ.2.5 కోట్లతో ప్రాజెక్ట్‌ను నిర్మించి కనిగిరి రిజర్వాయర్ నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. కనిగిరి రిజర్వాయర్ నీటిని శుద్ధిచేసి పైప్‌లైన్ ద్వారా ట్యాంకులకు అందించి సరఫరా చేయాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. నాసిరకంగా పైప్‌లైన్ నిర్మాణం పైలెట్ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్మాణ పనులను నాసిరకంగా చేశారు. ప్రాజెక్ట్ నుంచి వాటర్‌ట్యాంకులకు నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు నాసిరకమైనవి వేశారు.దీనికితోడు భూమిలో రెండు అడుగుల లోతులో మాత్రమే పైప్‌లను అమర్చారు. దీంతో పైపులైన్లు తరచూ పగిలిపోతూ పైలెట్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది. దాహం..దాహం వేసవిలో మండల ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మేజర్ పంచాయతీతో పాటు నాగాయగుంట, మునులపూడి, కట్టుబడిపాళెం, పెనుబల్లి, కాళయకాగొల్లు, మినగల్లు, జొన్నవాడ, తదితర గ్రామాల్లో తాగునీరు అందడం కష్టంగా మారుతోంది. దీంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కారం శూన్యం 2015 మార్చి 3న జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి దృష్టికి పైలెట్ ప్రాజెక్టు సమస్యను ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు తీసుకొచ్చారు. వేసవిలో దాహార్తిని తీర్చడమే లక్ష్యమని చెప్పే మీరు, నిరుపయోగంగా ఉన్న పైలెట్ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్పందించిన పోలంరెడ్డి మాట్లాడుతూ వారంలోగా ప్రాజెక్ట్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో పైలెట్ ప్రాజెక్ట్ పూర్తిగా వినియోగంలోకి రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి అల్లాడుతున్నాం పైలెట్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు ట్యాంకులకు అందడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. మెయింట్‌నెన్స్ కింద లక్షలు విడుదలవుతున్నా ప్రజలకు మాత్రం తాగునీరు అందడం లేదు. – ఈదూరు నరేంద్రబాబు, కట్టుబడిపాళెం మాటలు తప్ప చేతలేవీ నేతలు, అధికారులు మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదు. ఐదేళ్లుగా పైలెట్ ప్రాజెక్ట్ నీటిని అందిస్తామని చెబుతూ ఉన్నారు..వింటూనే ఉన్నాం. ప్రతి వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నిసార్లు సమస్యను విన్నవించినా ఫలితం లేదు. – చంద్రగిరి రాజశేఖర్, నాగాయగుంట సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం పైలెట్ ప్రాజెక్టు పరిస్థితిపై సంబంధిత అధికారులతో మాట్లాడుతాం. పైప్లైన్లు మరమ్మతులకు గురైన విషయం నా దృష్టికి వచ్చింది. మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. –డీవీ.నరసింహారావు, ఎంపీడీఓ -
కోవూరు టీడీపీలో తారస్థాయికి టికెట్ కొట్లాట..
కోవూరు టీడీపీలో టికెట్ కొట్లాట తార స్థాయికి చేరింది. రకరకాల సమీకరణలు, ఎత్తుగడలు, హామీలను తెరపైకి తెచ్చి నేతలు టికెట్ డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు మొదలుకొని అవినీతి వరకు సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదు చేస్తూ కోవూరు రాజకీయాన్ని రసకందాయంలోకి నెట్టారు. నిన్నటి వరకు సిటింగ్ ఎమ్మెల్యే కాకుండా ఇద్దరు ఆశావహులు ఉండగా శనివారం మూడో కృష్ణుడు తెరపైకి వచ్చాడు. దీంతో కోవూరు టీడీపీలో గ్రూప్ చీలికలతో పాటు టికెట్ వివాదం తారస్థాయికి చేరడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పాటు తిరుగుబాటు రాజకీయానికి తెరలేచింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోవూరు టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారింది. సొంత పార్టీ నేతలే మండలాల్లో పార్టీ పరిస్థితి బాగా లేదని బాహాటంగా మాట్లాడటం, దీనికి తోడు టికెట్ గందరగోళం గత నెల రోజులుగా సాగుతుండటంతో కోవూరు టీడీపీలో అనిశ్చితి నెలకొంది. శనివారం టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి 25 నిమిషాలు మాట్లాడి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. అదే సమయంలో ఎమ్మెల్యే తీరుపైనా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు యథావిధిగా హామీలు గుప్పించగా ఇచ్చిన మాట ప్రకారం ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీనిపై వచ్చే వారంలో మళ్లీ కలవమని పెళ్లకూరుకు సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేలో ఎమ్మెల్యేతో పాటు పెళ్లకూరు పేరు చేర్చి సర్వే నిర్వహిస్తున్నారు. కొత్త కృష్ణుడు తయ్యారు.. కోవూరు టీడీపీలో రోజుకొక కృష్ణుడు హల్చల్ చేస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన యర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి టికెట్ డిమాండ్ చేశారు. తాను పార్టీలో చాలా సీనియర్ అని ఈ పర్యాయం ఎమ్మెల్యే పోలంరెడ్డి, టికెట్ ఆశిస్తున్న పెళ్లకూరు, చేజర్లకు తనకు సహకరించాలని మండలాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదని తాను మాత్రమే అందర్ని సమన్వయం చేసుకొని పనిచేయగలుగుతానని చెప్పారు. ఇదిలా ఉండే యర్రంరెడ్డి ఆకస్మాత్తుగా తెరపైకి రావడం వెనుక పెద్ద ఎత్తుగడ రాజకీయం నడిచినట్లు సమాచారం. పార్టీ జిల్లా ముఖ్య నేత సూచనలతోనే సమావేశం పెట్టి టికెట్ డిమాండ్ చేశారని, తద్వారా 27న టికెట్ ఖరారు కాకుండా పెండింగ్‌లో ఉంటే తర్వాత అన్ని చూసుకొని లాబీయింగ్ చేసుకొని కావాల్సిన వారికి ఇప్పించుకోవచ్చని యోచనతో ఈ తతంగం నడిపించినట్లు సమాచారం. ఈ క్రమంలో గోవర్ధన్‌రెడ్డి తిరుగుబాటు ఎవరికి మేలు చేస్తుంది.. ఎవరికి టికెట్ ఆశలు గల్లంతు చేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక పార్టీలో మరో నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా టికెట్ కోసం బలంగా యత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే సీఎంను ఒకసారి కలిసి టికెట్ కోరి ఆ మేరకు బలమైన లాబీయింగ్‌కు తెర తీశారు. ఈ నేపథ్యంలో చేజర్ల ముఖ్య అనుచరులతో నియోజకవర్గ స్థాయిలో ఆదివారం సమావేశం నిర్వహించి టికెట్ డిమాండ్‌ను బలంగా వినిపించడానికి హడావుడిగా యత్నాలు సాగిస్తున్నారు. ఈ వరుస పరిణామాలతో ఎమ్మెల్యే వర్గంలో తీవ్ర అలజడి రేగింది. రెండు నెలల క్రితం వరకు టికెట్ నీదే అని చెప్పి అధిష్టానం చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయిస్తే ఏం చేయాలనే తర్జనభర్జల్లో ఉన్నారు. మొత్తం మీద కోవూరు ‘దేశం’లో తిరుగుబాటు వ్యవహారం మరికొద్ది రోజులు కొనసాగనుంది. -
టీడీపీ సర్కారు బీసీ నేతలను చులకనగా చూస్తున్నారు
-
కోవూరు సర్పంచ్ ఉమ అరెస్ట్
కోవూరు: కోవూరు సర్పంచ్ కూట్ల ఉమను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో ఎస్టీగా తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందింది. అయితే పాలకవర్గం ఉమ ఎస్టీ కాదని తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించిందని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు విచారణ జరిపించి ఉమ ఎస్టీ కాదని ధ్రువీకరించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోవూరు తహసీల్దార్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శీలం రామలింగేశ్వరరావు కూట్ల ఉమపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కూట్ల ఉమపై కేసు నమోదు చేయకపోవడంపై సాక్షి దినపత్రికలో వార్త రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. దీంతో పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోవూరు అడిషనల్ జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ పెద ఖాసిమ్ ఉమకు మార్చి ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించారు. -
కడుపులో కాటన్ మరిచిపోయారు..
సాక్షి, కోవూరు: ఆపరేషన్ చేశారు.. పొట్ట లోపల కాటన్ మర్చిపోయారు.. తాపీగా కుట్లు వేశారు.. ఇదీ నెల్లూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల తీరు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ రోగి పడిన అవస్థలు వర్ణనాతీతం. వివరాలు ఇలా ఉన్నాయి. వావిళ్లకు చెందిన ఓ మహిళకు నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో గతంలో గర్భసంచి తొలగించే ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కడుపులోనే ఉండిపోయిన కాటన్‌ను గమనించకుండా వైద్యులు కుట్లు వేశారు. ఆమెకు కొద్దిరోజులుగా కడుపు నొప్పి తీవ్రంగా వస్తుండడంతో కోవూరు ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేసి ఆమె కడుపులోంచి కాటన్‌ను తొలగించడంతో ప్రస్తుతం కోలుకుంటోంది. -
చంద్రబాబు పచ్చిమోసకారి
ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు: హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచిన పచ్చి మోసకారి చంద్రబాబు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం తిప్పగిరిజన కాలనీలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ – పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కోవూరు చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నాలుగు కమిటీలు కర్మాగారాన్ని పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి అందజేశాయని, ఇందులోని అంశాలను అధికార పార్టీ నాయకులు బహిర్గతం చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యోగులకు రూ.20.77 కోట్లను చెల్లించాల్సి ఉందని, అయితే వీటిని అందజేయకుండా కడుపుకొట్టడం తగదని హితవు పలికారు. చంద్రబాబుకు కొడుకుపైన, సీఎం కుర్చీపై ఉన్న ముక్కువ రాష్ట్ర ప్రజలపై లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లను వెనుకేసుకునేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ విజయం సాధించిన వెంటనే పునఃప్రారంభం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మరుక్షణమే రూ.50 కోట్లను కేటాయించి కోవూరు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర కోవూరులో జరిగే సమయంలో చక్కెర కర్మాగారానికి సంబంధించి స్పష్టమైన హామీని ఇవ్వనున్నారన్నారు. యనమల రామకృష్ణుడికి జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. విదేశాల్లో నల్లధనాన్ని దాచిపెట్టారంటూ జగన్మోహన్రెడ్డిపై బాబు, ఆయన కోటరీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి, సిగ్గు ఉన్నా 15 రోజుల్లో ఆరోపణలను రుజువు చేయాలన్నారు. తెలంగాణ నీరుపారుదల శాఖలో యనమల రూ.రెండు వేల కోట్ల పనులు తీసుకున్నారనే రేవంత్‌రెడ్డి విమర్శలను ప్రస్తావించారు. యనమల నీచచరిత్ర ప్రజలకు తెలుసునన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రపై బాబు కోటరీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌బాబురెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, శివుని నరసింహులురెడ్డి, పార్టీ మండల కన్వీనర్ నలబోలు సుబ్బారెడ్డి, గాజుల మల్లికార్జున, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: కోవూరులోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. నెల్లూరు థర్మల్ స్టేషన్ గేట్ సమీపంలోని చిట్టెమ్మ కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం కుటుంబసభ్యులంతా ఇంటికి తాళం వేసి జొన్నవాడ నవరాత్రి ఉత్సవాలకు వెళ్లారు. ఇదే అదనుగా తాళాలు పగులగొట్టిన దుండగులు బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.20 వేల డబ్బును ఎత్తుకుపోయారు. శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న చిట్టెమ్మ విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేపట్టారు. -
జమ్మిపాళెలం ఇసుకరీచ్‌లో ఉద్రిక్తత
కోవూరు : మండలంలోని జమ్మిపాళెం ఇసుకరీచ్‌లో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు.. రీచ్‌లో గత కొంతకాలంగా జమ్మిపాళెంకు చెందిన కూలీలు మాత్రమే ఇసుకను లోడ్ చేస్తున్నారు. సమీప గ్రామాలకు చెందిన వారు మంగళవారం రీచ్ వద్దకు చేరుకుని తమకు కూడా రీచ్‌లో పనికల్పించాలని కోరారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై వెంకట్రావ్ సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. -
డబ్బులిస్తావా.. కిడ్నాప్ చేయమంటావా?
వార్డెన్‌ను బెదిరించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై కోవూరు : ‘మూడు లక్షలు ఇవ్వు.. లేకుంటే హాస్టల్ విద్యార్థులకు జరిగే నష్టానికి నీదే బాధ్యత’ అని తనను ఫోన్ ద్వారా ఓ మహిళ వేధిస్తోందని నెల్లూరు జిల్లా కోవూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ వార్డెన్ టి.మహేశ్వరి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి లీలావతి అనే మహిళ వివిధ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తోంది. నీకు నీ భర్తకు మధ్య సమస్యలు ఉన్న విషయం మాకు తెలుసు అని మాట్లాడుతోంది. అడిగిన నగదు ఇవ్వకపోతే నీ భర్త శంకర్ చేత విద్యార్థులను కిడ్నాప్ చేయిస్తానని, అనంతరం ఉద్యోగం పోవడం ఖాయమని మానసికంగా వేధిస్తోంది. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులుకు సైతం ఫిర్యాదు చేశాను. నా జీతాభత్యాల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ఆ మహిళ సేకరించింది. ఆమె వల్ల వసతి గృహ విద్యార్థులకు హాని జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం తదితరాలపై నిరాకరించారని బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వమన్నా ఎస్సై సుధాకర్‌రెడ్డి ఇవ్వనన్నారని వాపోయింది. ఆరు రోజులే కదా పాఠశాలలు ఉండేది, ఈ లోపు ఏం చేస్తారు? అని ఎస్సై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, ఈలోపు విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని వార్డెన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై జిల్లా ఎస్పీను కలవనున్నామని తెలిపింది. దీనిపై ఎస్సై సుధాకర్‌రెడ్డిని సంప్రదించగా వార్డెన్ స్టేషన్‌కు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. సమస్యను తనతో చెప్పారని, ఫిర్యాదు రాసివ్వమని అడగ్గా మళ్లీ వస్తామని వెళ్లిపోయారని తెలిపారు -
కోవూరు బైపాస్‌పై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా
కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు జాతీయరహదారిపై శనివారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. విజయవాడ విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వైట్ పెట్రోల్‌ను తరలిస్తున్న ట్యాంకరు అదుపుతప్పి నందలగుంట వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీక్లీనర్ మహేష్‌కు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ మల్లేష్ సురక్షితంగా బయటపడ్డాడు. మరోవైపు ట్యాంకర్ బోల్తా పడటంతో స్థానికులు ఆ పెట్రోల్‌ను పట్టుకునేందుకు క్యూ కట్టారు. ఏకంగా బిందెలు, బక్కెట్లు, క్యాన్లతో పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే ఏ మాత్రం చిన్న అగ్గి రవ్వ పడినా పెను ప్రమాదం జరుగుతుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి జనాలు మరీ పెట్రోల్ కోసం బారులు తీరారు. కొద్దిదూరంలో ఒక ఆకతాయి ఈ పెట్రోలు మండుతుందా లేదా ప్రయత్నించగా కొందరు స్థానికులు అతనిని దూరంగా తరిమివేశారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్యాంక్‌లో 20 వేల లీటర్ల పెట్రోల్ ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు. విషయం తెలుసుకొన్న ఎస్ఐ సుధాకర్‌రెడ్డి, ఏఎస్ఐ సుబ్రహ్మణ్యంలు సంఘటనస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాల్ని అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. -
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కోవూరు (నెల్లూరు) : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎన్ఎస్ఆర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కాలనీకి చెందిన కొత్తూరు నరేంద్ర(39) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొన్నిరోజులుగా కుటుంబ కలహాలు ఎక్కువవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు
కోవూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని రైస్ మిల్లులపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రైస్ మిల్లుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 70 లక్షల వరకు ఉంటుందని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు. -
ఐకేపీ అక్రమాల్లో మరో కోణం
కోవూరు(నెల్లూరు) : ఇందిరా క్రాంతిపథంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల మండలంలోని పోతిరెడ్డిపాళెం గ్రామంలో కొందరు పొదుపు మహిళల నుంచి ఓ అధికారిణి దాదాపు 5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసిందని ఆ గ్రామ పొదుపు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. కోవూరు ఐకేపీ కార్యాలయంలో సీసీగా పని చేస్తున్న గాజులపల్లి వెంకటసుబ్బమ్మపై పలు ఆరోపణలు వస్తున్నా ఐకేపీ అధికారులు అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే వెంకటసుబ్బమ్మ చేసే అవినీతి అక్రమాల్లో ఐకేపీ అధికారులు కూడా వాటలు ఉన్నాయోమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై పోతిరెడ్డిపాళెం గ్రామ పొదుపు మహిళలు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్డీఏ పీడీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వున్నారు. పొదుపు మహిళల కథనం మేరకు.. గాజులపల్లి వెంకటసుబ్బమ్మ గతంలో సీతారామపురం, ఉదయగిరి ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 23 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడిందని అప్పటి జిల్లా స్థాయి అధికారులు విధుల నుంచి తొలగించారు. ఎనిమిది మాసాల పాటు విధులకు హాజరు కాకుండా సస్పెన్షన్ లో ఉన్న వెంకటసుబ్బమ్మ అక్క డ నుంచి నేరుగా కోవూరు ఐకేపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కూడా పద్ధతి మార్చుకోకుండా అదే ఒరవడిని కొనసాగిస్తుంది. ఎవరైనా గ్రూపు సభ్యులు బ్యాంకులకు అప్పులు ఉన్నారన్న విషయం తెలిస్తే వెంటనే వారి వద్దకు వెళ్ళి మీ అప్పు మొత్తాన్ని ఒకేసారి రద్దు చేసేందుకు అధికారులతో మాట్లాడుతానని, మొత్తంలో సగం చెల్లిస్తే సరిపోతుందని వారి వద్ద నుంచి సగం మొత్తాన్ని తీసుకొని ఆ నగదును ఎవరకీ చెల్లించకుండా వెంకటసుబ్బమ్మ తినేస్తూ ఉండేదని మహిళలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకులు అండదండలు... పొదుపు మహిళలను మోసం చేస్తూ అక్రమంగా వసూళ్ల దందా చేపడుతున్న వెంకటసుబ్బమ్మను ఐకేపీ అధికారులు ఏమీ అనవద్దని టీడీపీ పార్టీకి చెందిన బడా నాయకులు ఐకేపీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో ఐకేపీలో బదిలీల పర్వం ప్రారంభమవుతుందన్న విషయం తెలుసుకొన్న వెంకటసుబ్బమ్మ కోవూరు నుంచి బదిలీ చేయకుండా చూడాలని పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నుంచి ఐకేపీ అధికారులకు ఫోన్లు చేయించడం జరిగింది. ఐకేపీ అధికారులు కూడా వెంకటసుబ్బమ్మ విషయంలో మీనమేషాలు లెక్కించడం పరిపాటిగా మారింది.