
విడవలూరు (నెల్లూరు): సీఎం వైఎస్ జగన్‌కు తనను దూరం చేయాలని ఏబీఎన్, టీవీ–5 చానల్స్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి పదేపదే ప్రసారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూఈ నెల 26న గృహ నిర్మాణాలపై జరిగిన మంత్రుల సమీక్ష సమావేశంలో సీఎం చేస్తున్న అభివృద్ధి యజ్ఞం గురించి తాను గొప్పగా మాట్లాడితే.. ఆ మాటల్ని తొలగించి, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వక్రీకరించి చూపడం దారుణమన్నారు. ఆ చానళ్లు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment