TV 5
-
జర్నలిజం ముసుగులో రూ. 5 కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మీడియా ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన టీవీ 5 మూర్తి, ఆయన బృందం బండారంపై ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి, ఆయన భార్య వీణాశ్రీవాణి సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు వారు ఇన్‌స్టా్రగామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో టీవీ 5 మూర్తి అనుచరుడు జర్నలిస్టు అమర్, వీణాశ్రీవాణితో జరిగిన ఆడియో సంభాషణను కూడా జత చేశారు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే మీ స్తోమత ఎంత.? ఎంతిస్తారో.? చెప్పండంటూ అమర్ ఆమెను ప్రశ్నించడం స్పష్టంగా రికార్డు అయ్యింది. జ్యోతిషం చెప్పుకునే వేణుస్వామికి అంతమొత్తం ఇవ్వడం సాధ్యంకాదని, ఆయన భార్య వివరిస్తున్నా.. అమర్ వినిపించుకోకుండా రూ. 50 లక్షలు ఇస్తారా? లేక రూ. కోటి ఇస్తారా.. ఏదో ఒకటి చెబితే వారితో సమావేశం ఏర్పాటు చేస్తానంటూ బదులివ్వడం గమనార్హం. రూ. 5 కోట్లలో జర్నలిస్టు ప్రేమ, రాంబాబుతోపాటు మీడియా హెడ్స్‌కు, సంస్థ అధినేత బీఆర్.నాయుడుకు వాటాలు ఉంటాయని అమర్ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. మీడియా ముసుగులో తమని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వేణుగోస్వామి తన సతీమణితో కలిసి ఆరోపించారు. తాము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చారు: వేణుస్వామి ‘టీవీ5 జర్నలిస్ట్ మూర్తి ఒకప్పుడు మహాటివీలో పనిచేసేవారు. అప్పుడు నాపై దాడి చేసేందుకు ఆయన ప్రయతి్నంచాడు. నన్ను నాశనం చేయడానికి ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలు చేశాడు. మూర్తి డిమాండ్ చేసిన డబ్బు నేను ఇవ్వలేదు. అయితే, చాలారోజుల తర్వాత ఇప్పుడు డబ్బు కోసం మూర్తి, ఆయన టీమ్ నన్ను ఇబ్బంది పెడుతోంది. ఒక పథకం ప్రకారం టీవీ5లో నా గురించి డిబెట్లు ఏర్పాటు చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. ఎంతోమంది కష్టాలను తొలగించిన నాకు చివరకు ఆత్మహత్య చేసుకునే స్థితికి మూర్తి వల్ల వెళ్లాను. వారు పెడుతున్న టార్చర్ భరించలేకపోతున్నాను’అంటూ వేణుస్వామి ఆ వీడియోలో పేర్కొన్నారు. ఆపై మూర్తి అనుచరుడు జర్నలిస్ట్ (అమర్) ఫోన్ కాల్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో వేణుస్వామి షేర్ చేశారు. అందులో వారు రూ. 5 కోట్లు డిమాండ్ చేయడం అంత ఇవ్వకపోతే.. ఎంత ఇస్తారో చెప్పండంటూ సంభాషణ ఉంది. ఇలా వచ్చే డబ్బును ఎవరెవరు..? పంచుకుంటారో కూడా చెప్పుకొచ్చారు. చానల్ అధినేత బీఆర్.నాయుడు నుంచి ఆ సంస్థలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారికి, జర్నలిస్టు ప్రేమ, రాంబాబుకు వెళతాయని అమర్ ఆ ఆడియోలో వెల్లడించారు. మమ్మల్ని వారు తప్పకుండా చంపేస్తారు: వీణా శ్రీవాణి వేణుస్వామి సతీమణి వీణాశ్రీవాణి కూడా టీవీ5 సంస్థతోపాటు జర్నలిస్ట్ మూర్తి గురించి మాట్లాడుతూ ‘మమ్మల్ని రూ.5 కోట్లు అడుగుతున్నారు. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురాగలం. నా బంగారంతోపాటు, నా కూతురు బంగారం అమ్మినా ఐదు శాతం డబ్బు రాదు. ఇచ్చే వరకు మమ్మల్ని వదిలేలా లేరు. దీంతో ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాం. కానీ, మేము అలా చేస్తే దానిని కూడా వారు తప్పుగా క్రియేట్ చేస్తారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్పచారాన్ని తట్టుకోలేక చనిపోయారని మళ్లీ వారే వార్తలు ఇస్తారు. ఈ వీడియో బయటకు వచ్చాక మాకు ఎలాగూ ప్రమాదం పొంచి ఉంటుంది. తప్పకుండా మమ్మల్ని వారు చంపేస్తారు. ఈలోపు వారు (టీవీ5 మూర్తి, టీమ్) ఎలాంటి వారో ఇలా ముందే ఈ ప్రపంచానికి తెలుపుతున్నాం. ఆడపిల్ల ప్రేమకు, రోజు నాకు మెసేజ్‌లు చేసే రాంబాబుకు వాటాలున్నాయంటే.. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమైనా పెట్టుకోండి. మా దగ్గర ఇంకా సాక్ష్యాలు ఉన్నాయి. ఒక ఆడపిల్లను అనుకోండి లేదా కుటుంబం అనుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులు, బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేస్తాయా? చదువుకున్న వారు సపోర్ట్ చేస్తారా? పోలీసులు, లాయర్లు, సుమోటోగా తీసుకొని సపోర్ట్ చేస్తారా? జోతిష్యం చెప్పుకుంటే రూ.ఐదు కోట్లు డిమాండ్ చేస్తారా? బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే ..లేనివారిని ఎలా వేధిస్తున్నారు. మమ్మల్ని కాపాడుకుంటే..మరిన్ని వీడియోలు బయటపెడతాం. లేదంటే ఇదే ఆఖరి వీడియో. ఆత్మహత్య చేసుకుంటాం.’అని ఆ వీడియోలో స్పష్టం చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. టీవీ5 సాంబకు రూ.2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. టీవీ5 సాంబశివరావుకు రూ.2 కోట్లు అందాయని ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో పేర్కొన్నాడని హైకోర్టుకు దాఖలు చేసిన కౌంటర్లో పోలీసులు తెలిపారు. సంధ్యశ్రీధర్‌రావుపై కేసులు లేకుండా చేసేందుకు రూ.15 కోట్ల డీల్‌ను సాంబశివరావు కుదిర్చాడు. కమీషన్ కింద రూ.2 కోట్లు సాంబశివరావు తీసుకున్నాడు. పార్టీఫండ్‌గా బీఆర్ఎస్కు రూ.13 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చెల్లించినట్లు పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.కాగా, ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు.శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. -
జస్టిస్ శరత్, రేవంత్‌ల ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ‘ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల మంది జడ్జీలు, మాజీ మంత్రులు, జర్నలిస్టులు, న్యాయవాదులు.. ఇలా ఎంతో మంది ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు, కాల్ రికార్డుల జాబితా అంతా సేకరించారు. వారి ఫోన్లు ట్యాప్ చేసి బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓ వ్యక్తిపై కేసులు లేకుండా చేసేందుకు టీవీ 5 సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారు’ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు బుధ వారం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.సుమోటోగా తీసుకున్న కోర్టు..గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ట్యాప్ అయిందని.. జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నారని పత్రికల్లో వచ్చి కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం బుధవారం మధ్యాహ్న విరామం తర్వాత విచారణ చేపట్టింది.విచారణ 23వ తేదీకి వాయిదా..ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేశామని ధర్మాసనానికి వివరించారు. కేసు ఎప్పుడు నమోదు చేశారు? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? నిందితులెవరు? కేసు పురోగతి ఎంత వరకు వచ్చింది వంటి వివరాలు అందులో పేర్కొన్నామని.. కానీ ఇంకా రికార్డు కాలేదని చెప్పారు. ఈ వివరాలను రికార్డు చేయాలని కోర్టు అధికారులను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను కూడా బాధితుడినేనని, పోలీసు అధికారుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నానని.. తనను ఈ పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన హయతుద్దీన్ వేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని కూడా ధర్మాసనం వాయిదా వేసింది.ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొన్న వివరావీ..‘‘నాయిని భుజంగరావు (ఏ3) వాంగ్మూలం మేరకు.. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు, జర్నలిస్ట్‌లు, జస్టిస్ కాజా శరత్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాదులు, పార్టీ నేతల వ్యక్తిగత జీవితం, చేసే పనులు తెలుసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారు. బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడల్లా అవతలి వారి ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించేవాళ్లు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలకు ఎర కేసులో, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశం సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ‘నేను కీలక వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు సేకరించి ప్రణీత్‌కుమార్‌కు అందజేసేవాడిని. వారి ఫొటోలు, అడ్రస్‌లు సేకరించి చర్యలు తీసుకోవడం కోసం ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు పంపేవాళ్లం’ అని భుజంగరావు చెప్పారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించినట్టు, ఫోన్ నంబర్ చెబితే వారి కాల్లకు సంబంధించి వివరాలు కూడా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినట్టు తెలిసింది. జస్టిస్ కాజా శరత్, ఆయన సతీమణి మాధవి నంబర్లు, కాల్ల వివరాలు, అడ్రస్‌లు జియో ఆఫీస్ నుంచి తెలుసుకున్నారు. కీలక వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్..సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి, విజయ్‌రెడ్డి, కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, శివధర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, రోనాల్డ్ రోస్, ధర్మపురి అర్వింద్, ఎం.రమేశ్‌రెడ్డి, మేఘా శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిశోర్, ఐఏఎస్ దివ్య, తాటినేటి శశాంక్, రాజ్‌న్యూస్ సునీల్‌రెడ్డి, చిలుకా రాజేందర్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న (నవీన్), ఏఎంఆర్ ఇన్ఫ్రా మహేశ్‌రెడ్డి, వీరమళ్ల సత్యం, గాలి అనిల్‌కుమార్, రామసాయం సురేందర్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మేరెడ్డి స్వప్నిక, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లే సరిత, అంజన్న (ఈటల గన్‌మన్), అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, మనాల మోహన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు మరికొందరి ఫోన్లను ట్యాప్ చేశారు.మధ్యవర్తిగా టీవీ 5 సాంబశివరావు..సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు, టీవీ 5 సాంబశివరావులకు సంబంధించిన హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ వివాదం ఉంది. ఈ పంచాయతీని సాంబశివరావు భుజంగరావు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రావుపై చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటి నుంచి బయటపడాలంటే రూ.15 కోట్లు బీఆర్ఎస్కు పార్టీ ఫండ్‌గా ఇవ్వాలని భుజంగరావు ఒత్తిడి తెచ్చారు. శ్రీధర్‌రావు రూ.13 కోట్లు విలువైన బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించిన సాంబశివరావు రూ.2 కోట్లు తీసుకున్నారని భుజంగరావు వాంగ్మూలంలో పేర్కొన్నారు..’’ అని ప్రభుత్వం అఫిడవిట్లో తెలిపింది. వీటితోపాటు మరిన్ని వివరాలనూ వెల్లడించింది. -
CBN Arrest: ఇంత అతి ఏంట్రా బాబూ!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో జైలుకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రక్షించుకోవడానికి, ఈ అరెస్టు సాకుతో సానుభూతి సంపాదించడానికి తెలుగుదేశం పార్టీ కన్నా, ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5 వంటివి తెగ తాపత్రయపడుతున్నాయి. చంద్రబాబు రాజకీయ జీవితానికి కష్టం వస్తే, అది తమ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరమని భయపడుతున్న ఈ మీడియా సంస్థలు ఈ స్కామ్‌లో అసలు అవినీతే జరగలేదని ప్రచారం చేయడానికి నానాపాట్లు పడుతున్నాయి. ఇంట్లో ఉంటానని అడగడం ఆశ్చర్యమే చంద్రబాబు తప్పే చేయలేదని ప్రజలు భ్రమపడాలన్న లక్ష్యంతో వీరే తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టాలని ఎవరూ అనరు. ఏపీ సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తరపు వాదనలు చూస్తుంటే అవి ఎంత డొల్లతనంగా ఉన్నాయో అర్ధం అవుతుంది. కేవలం సాంకేతిక అంశాలే తప్ప, కేసు వివరాలలోకి వెళ్లకుండా జాగ్రత్తపడుతున్నారు. అంత సీనియర్ నేత, ఎన్నో చట్టాలు తెచ్చానని చెప్పే ఆయన తాను జైలులో ఉండనని, ఇంట్లో ఉంటానని అడగమే ఆశ్చర్యం కలిగిస్తుంది. లాయర్లకు ఈ విషయం తెలియదా? చట్టంలో ఎక్కడైనా ఆ సదుపాయం ఉందా? లేదా? అన్నది చూసుకోకుండా, అందులోను ఏసీబీ కోర్టు పరిధిలోకి ఆ విషయం వస్తుందా? రాదా? అన్న సంగతి గమనించకుండా సంబంధిత పిటిషన్ వేయడమే గమ్మత్తుగా ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన అంత పెద్ద లాయర్లు, కోట్లు తీసుకునే ఆ లాయర్లకు ఈ విషయం తెలియదా? తెలిసినా కావాలని ఒక ప్రయత్నం చేసి చూశారా? అన్నది తెలియదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో భద్రత ఉండదని, ఇంటిలో అయితే భద్రత ఉంటుందని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. చదవండి: చంద్రబాబు కేసులో అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థలే ఈ ఇంట్లో ఎలా భద్రత ఉంటుంది? చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీపడకూడదు. అందులో సందేహం లేదు. కానీ నాలుగు ఎత్తైన గోడల మధ్య ఉండే జైలులో భద్రత లేకపోతే, ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయించి, అందులో ఒక ప్రత్యేక రూమ్ కేటాయిస్తేనే భద్రత లేకపోతే, కృష్ణా నది పక్కన కరకట్టపైన ఉండే ఇంటికి ఎలా భద్రత ఉంటుందో అర్ధం కాదు. చివరికి ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు అసలు స్కామే లేదన్న చందంగా ఆయా వ్యక్తులతో మాట్లాడించడం ఆరంభించారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కూడా దీనిపై స్పందించిన తీరులో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. నిధులు దుర్వినియోగం తన నోట్ ఆధారంగానే కేసు పెట్టారని ప్రచారం జరుగుతోందని, అందులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్పడానికి ఆయన యత్నించారు. ఆయన మాటల వైనం చూస్తే ప్లేట్ ఫిరాయించినట్లు అనిపిస్తుంది. ఇక్కడ డబ్బులు విడుదల అన్నది ఒక్క పాయింటే. ప్రతి అంశంలోను ముఖ్యమంత్రి డబ్బులు విడుదల చేయాలని కోరారని నోట్ పైల్స్‌లో రాస్తారా అన్నదానికి ఆయన జవాబు ఇచ్చి ఉండాల్సింది. నిధులు కేటాయించడం, విడుదల చేయడం సాధారణంగా జరిగి సద్వినియోగం అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది అభియోగం. ఎందుకు పారిపోయారు! సీమెన్స్ సంస్థ అసలు ఈ లావాదేవీలతో సంబంధం లేదని చెప్పడం మరో అంశం. అలాగే చంద్రబాబు పీఎస్. శ్రీనివాస్, కన్సల్టెంట్ మనోజ్‌లు ఎందుకు విదేశాలకు పారిపోయారన్నది ఇంకో కోణం. వందల కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లాయన్నది ఆరోపణ. వీటన్నిటి గురించి రమేష్ ఏమీ మాట్లాడినట్లు అనిపించలేదు. అందువల్ల ఆయనది పూర్తి వివరణగా అనిపించలేదు. ఆయన ఏదో కంగారుపడుతూ మాట్లాడారా అన్న అభిప్రాయం వస్తుంది. ఆ తర్వాత డిజిటెక్ ఎండీతో, సీమెన్స్ తొలగించిన మాజీ ఎండీతో మాట్లాడించి అసలు స్కామే లేదని ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. నిజానికి వీరిద్దరు కూడా ఈ కేసులో నిందితులే.అరెస్టు అయినవారే. డిజిటెక్ సంస్థ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. అలాంటి వ్యక్తి ఇంటర్వ్యూలు ఇస్తే జనం నమ్మేస్తారా? అదే టైమ్‌లో సీమెన్స్ సంస్థ సీఐడీ వారికి పంపిన ఈమెయిల్ గురించి మాత్రం ఒక్క ముక్క రాయలేదు. నైపుణ్యాభివృద్ది సంస్థలో అవినీతి జరగలేదని చెప్పడానికి రామోజీరావు తదితరులు పడుతున్నట్లు పాట్లు గమనిస్తే ఈ కేసు ముందుకు వెళితే తమ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని వారు భయపడుతున్నట్లు అనిపిస్తుంది. చదవండి: Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh టీడీపీ కంటే మీడియా పాట్లు ఎక్కువైయ్యాయి అందుకే ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వంపై ఆయా సమస్యలపై ఉన్నవీ, లేనివి రాస్తూ బరద జల్లే ఈ మీడియా ఇప్పుడు వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టి చంద్రబాబు అత్యంత నీతిమంతుడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి విపరీతంగా యత్నిస్తున్నాయి. ఆ కథనాలతోనే మొత్తం వారి పేపర్లను నింపేస్తున్నారు. వారి టీవీలలో గంటల కొద్ది కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కాడర్ కంటే ఎక్కువగా ఈ మీడియా పాటు పడుతోంది. అందులో భాగంగానే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక పలువురు మరణిస్తున్నారంటూ వంటకాలు సాగిస్తున్నారు. తప్పుడు వార్తలని వాళ్లకూ తెలుసు ఈనాడు, జ్యోతి ఎక్కడెక్కడ ఎవరు చనిపోయినా, ఇందుకే అంటూ వార్తలు ఇస్తున్నాయి. నిజంగానే ఆ స్థాయిలో చనిపోయి ఉంటే మొదటి పేజీలో ఎందుకు ఇవ్వడం లేదు?వారికి తెలుసు. వారు తప్పుడు వార్తలు రాస్తున్నట్లు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు కొంతమంది గుండెపోటుతో మరణించారు. ఆ సందర్భం వేరు. ఆ వార్తలను ఈనాడు వంటి పత్రికలే రాశాయి. వాటి ఆధారంగానే జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడం జరిగింది. ఆ యాత్రే ఆయన రాజకీయ ప్రస్తానాన్ని మార్చివేసింది. అది వేరే సంగతి. ఇప్పుడు సందర్భం వేరు. బాబు కుటుంబంలో ఎవరికి ఏం కాలేదు ఎందుకు? అయినా అప్పట్లో కూడా టీడీపీ మీడియా, కాంగ్రెస్ఒలోని క వర్గం కలిసి వైఎస్ కుటుంబంలో ఎవరికీ ఎందుకు ఏమీ కాలేదు. బయటవారికి ఎందుకు అయ్యిందంటూ వ్యతిరేక ప్రచారం చేసేవారు. మరి ఇప్పుడు అదే ధీరి వర్తింప చేస్తే చంద్రబాబు కుటుంబంలో ఎవరికి ఏమీ కాకుండా బయట వారికి ఎందుకు అవుతుందన్న ప్రశ్న వస్తుంది. వాస్తవానికి ఇలాంటి వాటిని ప్రస్తావించకూడదు. కానీ టీడీపీ మీడియా జర్నలిజం విలువలను దారుణంగా మంటకలిపి వ్యవహరిస్తున్నందున ఈ విషయాలను గుర్తు చేయవలసి వస్తోంది. అప్పుడు ప్రకటనలు ఇచ్చారంటేనే అర్థమవుతోంది ఈ మొత్తం విషయాలను పరిశీలిస్తే, టీడీపీ వారు కాని, టీడీపీ మీడియా కాని ఆశించిన మేర సానుభూతి రావడం లేదని తెలిసిపోతుంది. అందుకోసం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలతో చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. చంద్రబాబు పట్ల వారికి నిజమైన సానుకూలత ఉండి ఉంటే, అరెస్టు అయిన వెంటనే సంఘీభావ ప్రకటనలు చేసి ఉండేవారు. కానీ నాలుగు రోజుల తర్వాత వారు ప్రకటనలు ఇచ్చారంటేనే టీడీపీ నేతలు వారి చుట్టూ తిరిగి మాట్లాడించారన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదో అయిపోతోందనుకోవానే తహతహ చంద్రబాబు అటు ఎన్డీయేను ఇటు ఇండియా కూటమిలోని ఆయా పార్టీల వారిని ఇద్దరిని తన అవసరాల కోసం వాడుకుని, ఆ తర్వాత వదలివేశారన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు రాష్ట్రంలో సానుభూతి అంతంతమాత్రంగానే ఉండగా, దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పాలి. కాకపోతే గతంలో ఈనాడు మీడియా కృత్రిమ మద్య నిషేధ ఉద్యమాన్ని సృష్టించినట్లు ఇప్పుడు కూడా రాష్ట్రం అంతా ఏదో అయిపోతోందని అనుకోవాలని తహతహలాడుతోంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బిగ్ క్వశ్చన్ : తప్పుడు ప్రచారం చేసే ఎల్లో గ్యాంగ్ బుద్ధి మారదా ..?
-
ఏబీఎన్, టీవీ5 లకు గట్టి షాక్
-
AP High Court: ఏబీఎన్, టీవీ 5లకు గట్టి షాక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిని, కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు విచారణకు రావాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన ఏబీఎన్ వెంకట కృష్ణ, టీవీ 5 మూర్తిలకు గట్టి షాక్ తగిలింది. దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వారిద్దరూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ నోటీసులు చెల్లవని, వాటిని కొట్టేయాలన్న వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాగే సీఐడీ విచారణ పరిధిపై వారు లేవనెత్తిన అభ్యంతరా లన్నింటినీ కొట్టేసింది. ఏపీ సీఐడీ పరిధిలోకి తెలంగాణ వస్తుందని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాలు ఒకదాని కొకటి పొరుగు పోలీస్స్టేషన్లు అవుతాయని తేల్చిచెప్పింది. అందువల్ల సీఐడీ నోటీసులు చట్ట నిబంధనలకు లోబడే ఉన్నాయని, అవి చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. విచా రణకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులకు సంబంధించి వెంకటకృష్ణ, మూర్తిల వ్యక్తిగత హాజరు నిమిత్తం ఓ తేదీని ఖరారు చేసి ఆ విషయాన్ని రాతపూర్వకంగా వారికి తెలియచేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణ సందర్భంగా వారిపై కఠిన చర్యలేవీ తీసుకోవ ద్దని సూచించింది. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని.. అందుకు విరుద్ధంగా వ్య వహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తీర్పునిచ్చారు. కుట్రలో భాగంగానే వ్యాఖ్యలు.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా సీఎం జగన్, పలు కులాలను అవమాన పరిచేలా, విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్, టీవీ 5 చానెళ్లపై సీఐడీ గతేడాది సుమోటోగా కేసు నమోదు చేసింది. దీనిపై రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించి ఎఫ్ఐఆర్ను కొట్టేయడంతో పాటు దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు ఇందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఏబీఎన్, టీవీ 5 చానెళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు సైతం దర్యాప్తును నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సీఐడీకి రాష్ట్రం మొత్తం ఓ పోలీస్‌స్టేషన్ అవుతుందని, అందువల్ల దానికి పొరుగు పోలీస్‌స్టేషన్ అంటే తెలంగాణ సీఐడీ అవుతుందని తేల్చిచెప్పారు. సెక్షన్ 160(1), సెక్షన్ 2(ఎస్)లను కలిపి చదివితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీస్స్టేషన్లు ఒకదానికొకటి పొరుగు పోలీస్స్టేషన్లు అవుతాయన్నారు. దీని ప్రకారం పిటిషనర్లకు సీఐడీ ఇచ్చిన నోటీసులు చట్ట నిబంధనలకు లోబడి ఉన్నాయని, అందువల్ల అవి చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు. నోటీసులు ఇచ్చే పరిధి సీఐడీకి లేదంటూ పిటిషన్లు.. దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ వెంకటకృష్ణ, మూర్తిలకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ వెంకటకృష్ణ, మూర్తి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించగా, మూర్తి తరఫున పీవీజీ ఉమేశ్, వెంకటకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కేసు ఏపీలో నమోదు చేశారని, పిటిషనర్లు మాత్రం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని, అందువల్ల వారికి ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులు ఎంతమాత్రం చెల్లవని పోసాని, ఉమేశ్ వాదించారు. అయితే ఈ వాదనలను ఏజీ శ్రీరామ్ తోసిపుచ్చారు. ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నిర్దిష్ట భౌగోళిక పరిధులు నిర్ణయించడం జరుగుతుందని, అలాగే సీఐడీకి రాష్ట్రం మొత్తాన్ని ఓ పోలీస్‌స్టేషన్‌గా పరిగణించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తం ఓ పోలీస్‌స్టేషన్ అయినప్పుడు ఏపీ సీఐడీకి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్ అంటే తెలంగాణ అవుతుందని తెలిపారు. -
నిజాలు దాచేందుకు... ఎన్ని కష్టాలో?
భయం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన వాస్తవాలు ఎక్కడ జనంలోకి వెళ్లిపోతాయోనన్న భయం. అప్పులపై ప్రతిరోజూ తాము వండి వారుస్తున్నవి అబద్ధాలని జనానికెక్కడ తెలిసిపోతుందోనన్న భయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బావుందని జనమెక్కడ స్థిమితపడతారోనన్న భయం. అందుకే... ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని ప్రచురిస్తూనే... తన వ్యాఖ్యలతో మరింత పెద్ద కథనాన్ని వండి వార్చేసింది ‘ఈనాడు’. వాస్తవాలంటూ అసత్యాలు, అర్థసత్యాలను అచ్చువేసింది. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని... ఆర్థిక స్థితి బాగుంటే బకాయిలెందుకు చెల్లించటం లేదని తనదైన పైత్యంతో ఆపసోపాలు పడింది. ఏం! చంద్రబాబు నాయుడి హయాంలో ఉద్యోగులకు 5 డీఏలను బకాయి పెట్టింది వాస్తవం కాదా? అప్పుడు ఇలాంటి రాతలెందుకు రాయలేదు రామోజీరావు గారూ? పౌరసరఫరాల శాఖ బిల్లులు, ఇరిగేషన్ బిల్లులు, పంచాయతీరాజ్ బిల్లులు... ఆఖరికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా చంద్రబాబు బకాయిలు పెట్టలేదా? తాను దిగిపోయే నాటికి చంద్రబాబు ఏకంగా రూ.37,689 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం అబద్ధమా? అప్పుడెందుకు రాయలేదు ఇలాంటి రాతలు? ఈ బకాయిల్లో 29,776 కోట్లను ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించింది కదా? ఇలాంటి నిజాలు ఎందుకు చెప్పరు రామోజీ? చంద్రబాబు నాయుడి హయాంలో ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ మామూలుగానే ఉన్నా... అప్పులు మాత్రం అతి దారుణంగా పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది ఆర్థిక మందగమనం కాగా... తరువాతి రెండేళ్లూ కోవిడ్ ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తిగా లాక్డౌన్లతోనే గడిచిపోయింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అప్పుల్ని అదుపులోనే ఉంచుతూ... పాత బకాయిలు చెల్లిస్తూ... జన జీవితాలు ఆగిపోకూడదన్న సంకల్పంతో సంక్షేమాభివృద్ధి పథకాలకు ఎలాంటి లోటూ రాకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కనిపించవా? ఏం.. ఇప్పుడున్న బడ్జెట్టే కదా చంద్రబాబు హయాంలోనూ ఉన్నది! అప్పట్లో ఇప్పటి పథకం ఒక్కటి కూడా లేదెందుకు? ‘దోచుకో–పంచుకో–తినుకో’ అనే డీపీటీ పద్ధతినే ఫాలో అయ్యి మీరంతా వాటాలు వేసుకోవటం వల్లే జనానికి నేరుగా ప్రయోజనం కలిగేలా (డీబీటీ) ఒక్కటి కూడా చేయలేకపోయారన్నది నిజం కాదా? ఇలాంటి పథకాల ఆలోచనలు కూడా చేయని చంద్రబాబును ఇంకెన్నాళ్లు వెనకేసుకొస్తారు? ముఖ్యమంత్రి సభలో చెప్పిన వాస్తవాలకు.. నిపుణుల వ్యాఖ్యలంటూ వక్రభాష్యాలు చెప్పటానికి చంద్రబాబును వెనకేసుకొచ్చే ఆ మూడు మీడియా సంస్థలూ తెగ తాపత్రయపడిపోయాయి. అసలింతకీ ఎవరా నిపుణులు? మార్గదర్శి పేరిట మందిని ముంచేయబోయిన రామోజీరావా? చిన్ననాడే కిరోసిన్‌ను రాష్ట్రం దాటించానని గొప్పలు చెప్పుకున్న రాధాకృష్ణా? లేక తమ న్యూజెన్ కొబ్బరినూనె రాసుకుని చేతులు కడుక్కోపోతే చేతులపైనా వెంట్రుకలు మొలుస్తాయని జనానికి గుండుచేసిన టీవీ5 నాయుడా? ఎవరు నిపుణులు? రాష్ట్రం అప్పుల గురించి, ద్రవ్యలోటు గురించి ముఖ్యమంత్రి ‘కాగ్’ గణాంకాలనూ తప్పు అనేంత నైపుణ్యం ఈ ముగ్గురికి, వీరి బాస్ చంద్రబాబుకు ఉందనుకోవాలా? అసలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నెల తొలి పది రోజుల్లోనే ప్రజలను మభ్య పెట్టడానికి, ఎన్నికల తాయిలాల కోసం ఏకంగా రూ.6000 కోట్లు ఖర్చుచేసింది. అదే నెల్లో ఒకేరోజున 5వేల కోట్లు అప్పు చేసింది. వీటన్నిటినీ తదుపరి ప్రభుత్వం తీర్చాలి కదా? అలాంటి వాస్తవాలు ఎప్పుడైనా రాశారా రామోజీరావు గారూ? ప్రతికూల పరిస్థితుల్లో కూడా గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవంక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరో పక్క కేపిటల్ వ్యయం ఎంత చేసిందీ... తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత వృద్ధి చెందిందో కాగ్ నివేదికలు, బడ్జెట్ అకౌంట్స్ ఆధారంగా ముఖ్యమంత్రి వివరించారు. ఈ వాస్తవాలు జనానికి చేరితే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో నిపుణులు లెక్కలంటూ సిగ్గులేకుండా సొంత అంకెలతో మాయ చేసింది ‘ఈనాడు’. బాబు అప్పులు దాచేస్తే దాగవు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ,2,69,462 కోట్లు అప్పు తెచ్చారని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. అది సరికాదంటూ బాబు హయాంలో అప్పులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. టీటీపీ హయాంలో 2,57,509.87 కోట్ల రుణమే ఉన్నట్లు పేర్కొంది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు ఏప్రిల్ నెల తొలి పది రోజుల్లోనే ప్రజలను మభ్యపెట్టడానికి రూ.6000 కోట్లను వ్యయం చేసింది. అంతేకాక ఏప్రిల్ 9న ఒకే రోజు రూ.5000 కోట్లు అప్పు చేసింది. అంటే ఎన్నికలకు రెండు రోజుల ముందు... ఒకే రోజున ఆ ఆర్దిక సంవత్సరపు రుణ పరిమితిలో 15 శాతాన్ని అప్పు చేసింది. ఒక సంవత్సరంలో చేయాల్సిన అప్పులో 15 శాతాన్ని ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఒకేరోజున చేసేస్తే... ఈ ఎల్లో నిపుణులకు కనిపించనే లేదు. ఒక్కడైనా కలమెత్తలేదు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఏ చిన్న అప్పు చేసినా... దుష్టచతుష్టయం శివాలెత్తిపోతోంది. బాబు చివర్లో చేసిన అప్పులు కలిపితే ఆయన హయాంలో అప్పులు రూ.2,69,462 కోట్లకు చేరాయి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది కూడా ఇదే. ఇవన్నీ బడ్జెట్ డాక్యుమెంట్లలో ఉన్నవే. గంతలు కట్టుకున్న రామోజీకి మాత్రం ఇవి ఎన్నటికీ కనిపించవు. బడ్జెట్ గణాంకాలను కాదంటూ ఎక్కువ అప్పులు ఈ ఏడాది మార్చి నెలాఖరుకు బిల్లుల బకాయిలతో కలిపి మొత్తం అప్పులు రూ.4,13,000 కోట్లు అంటూ ‘ఈనాడు’ సొంత పైత్యం ప్రదర్శించింది. దీనికి పేరులేని నిపుణులను అడ్డుగా పెట్టుకుంది. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,90,670.19 కోట్లు అని స్పష్టంగానే ఉంది. పైపెచ్చు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ద్రవ్యలోటు రూ. 38,224 కోట్లుగా అంచనా వేయగా కాగ్ నివేదిక ప్రకారం ద్రవ్యలోటు 25,194.62 కోట్లుగా ఉంది. దీంతో మొత్తం అప్పులు 3,82,164.62 కోట్లకు తగ్గాయి. ఈ వాస్తవాలను చెప్పని రామోజీరావు... పెండింగ్ బిల్లులతో కలిపితే అప్పులు 4,13,000 కోట్లు ఉండవచ్చంటూ చేతనైనంత బురద చల్లే ప్రయత్నం చేసింది. గ్యారెంటీ అప్పులపైనా తప్పుడు లెక్కలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులపైనా ‘ఈనాడు’ తప్పుడు అంకెలనే ప్రచురించింది. గతేడాది డిసెంబర్‌నాటికి ప్రభుత్వ రంగ çసంస్థ ల ద్వారా గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,17,730 కోట్లుగా ఉన్నట్లు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ‘ఈనాడు’ మాత్రం రూ.1,38,603 కోట్లు అంటూ సొంత గణాంకాలను పల్లెవేయటం... ప్రభుత్వ ఆరి్థక పటిష్టతను దిగజార్చే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు. బాబు పెండింగ్ బిల్లులు రూ. 29,776.42 కోట్లు ఇప్పుడు చెల్లించలేదా? ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంటే బిల్లులు ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారన్నది రామోజీరావు ఎల్లో ముసుగులో అడిగిన ప్రశ్న. ఏం! బిల్లులు పెండింగ్‌లో ఉంచటమనేది ఇప్పుడే మొదలైందా? టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ ఎలాంటి అసాధారణ పరిస్థితులూ లేవు కదా? ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులేవీ లేవు కదా? అయినా అప్పులెందుకు చేశారు? కేపిటల్ వ్యయం తక్కువగా చేశారెందుకు? పైపెచ్చు 37,689 కోట్లకుపైగా బిల్లుల్ని పెండింగ్‌లో ఉంచేశారెందుకు? వీటిపై ఎన్నడూ ఒక్క ప్రశ్నకూడా వేయలేదెందుకు రామోజీ? మూడేళ్లుగా ఆర్థిక మందగమనం, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూనే... ఈ అప్పుల్లో 29,776.42 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించటం నిజం కాదా? ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పౌరసరఫరాలు, ఉపాధి హామీతో పాటు ఇరిగేషన్‌కు చెందిన పెద్ద మొత్తంలో బిల్లులను బాబు బకాయి పెట్టలేదా? ఇవన్నీ దుష్టచతుష్టయానికి కనిపించవెందుకు? -
దుష్టచతుష్టయం అంటే ఎవరంటే..: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని, ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదని ఇంత మంది జరుగుతున్నా కూడా చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని మండిపడ్డారు. ఒంగోలు బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, ఏబీఎన్, రామోజీరావు, టీవీ5 అని అన్నారు. ఉచితంలో ఆర్థిక విధ్వంసం అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఏపీని మరో శ్రీలంకగా మారుస్తున్నారని అంటున్నారని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబులా పక్కన పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారని, పేదలకు మంచి చేయొద్దని అంటున్నారని సీఎం మండిపడ్డారు. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉందని, మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచిందని తెలిపారు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని, మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందని సీఎం అన్నారు. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వమని, టీడీపీ హయాంలో 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని, మన హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. చదవండి: YSR Sunna Vaddi 2022: ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన -
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే
సాక్షి, అమరావతి: వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పోలీసులు హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించ కుండా.. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ పరిధిలోని మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తామంది. అర్నేష్‌కుమార్ కేసులో తీర్పును అమలు చేయని మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అర్నేష్‌కుమార్ తీర్పును మేజిస్ట్రేట్లు పాటించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇస్తామంటూ తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మీడియాకు సంబంధించిన వ్యక్తులతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ను 24 గంటల్లో అప్లోడ్ చేయడం లేదంటూ టీవీ 5 న్యూస్ చానల్ యజమాని బొల్లినేని రాజగోపాల్‌నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది ఉమేశ్‌చంద్ర.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా పోలీసులు నేరుగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్ఐఆర్లను 24 గంటల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనలను ఓసారి గమనించాలంటూ ఏజీ చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. పిటిషనర్ అభ్యర్థనలు అస్పష్టంగా, పసలేకుండా ఉన్నాయని తెలిపింది. పోలీసు అధికారం లేని రాష్ట్రం మనుగడ సాధించలేదని పేర్కొంది. -
ఆ మూడింటితో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: స్వప్రయోజనాలు తప్ప ఏమీ పట్టని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఆ మూడింటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలపై చేస్తున్న దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణం స్పందిస్తున్నప్పటికీ కొంతమంది స్వప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారని, అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక్కోసారి బాధనిపిస్తోందని చెప్పారు. స్పందనలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలు, వాటిపై దుష్ప్రచారాలను ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలపై మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. వారికి సొంత ప్రయోజనాలు తప్ప ఏమీ పట్టవు ఇటీవల రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంలో పోలీసులు, కలెక్టర్లు ఎంత బాగా స్పందించినా కూడా స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై బురద చల్లాలని ఆరాటపడే వ్యవస్థను మనం చూస్తున్నాం. వారి స్వప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక్కోసారి బాధనిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లలు, వారి కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఆ కుటుంబాల గౌరవాన్ని మంటగలుపుతున్నారు. ఒక ఈవ్‌టీజింగ్ కేసులో కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఆ కేసులో అమ్మాయి, ఆ కుటుంబం ఆత్మాభిమానం దెబ్బతినేలా, వారికి కళంకం తెచ్చేలా ఆ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తీరు, మీడియాతో మాట్లాడిన విధానం ఆ కుటుంబ గౌరవాన్ని బజారున పెట్టేలా ఉన్నాయి. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సంఘటనల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్వప్రయోజనాలకోసం ఒక వర్గం మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారంపైన కూడా మనం పోరాటం చేస్తున్నాం. మనం వాస్తవానికి రాజకీయ పార్టీలతో యుద్ధం చేయడం లేదు. మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5తో యుద్ధం చేస్తున్నాం. ఈ వ్యక్తులకి వాళ్ల సొంత ప్రయోజనాలు తప్ప మరే అంశాలు పట్టవు. వాళ్లనుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ఎవరిమీదనైనా వీళ్లు బురద చల్లుతారు. అందుకోసం మిమ్మల్ని కూడా మినహాయించరు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోండి. మన చుట్టూ ఏం జరుగుతుందో చూడాలి. మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న సంఘటన జరిగినా వెంటనే అప్రమత్తం కావాలి. ఎలాంటి వక్రీకరణకు తావివ్వకూడదు. మీరు ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నారు, ఎంత మంచిగా పనిచేస్తున్నారన్నది ఆ వర్గం మీడియాకు అవసరం లేదు. స్వార్థ ప్రయోజనాలే వారి లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా పనిచేయాలి. -
చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే..
విడవలూరు (నెల్లూరు): సీఎం వైఎస్ జగన్‌కు తనను దూరం చేయాలని ఏబీఎన్, టీవీ–5 చానల్స్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి పదేపదే ప్రసారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వైఎస్ జగన్‌తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూఈ నెల 26న గృహ నిర్మాణాలపై జరిగిన మంత్రుల సమీక్ష సమావేశంలో సీఎం చేస్తున్న అభివృద్ధి యజ్ఞం గురించి తాను గొప్పగా మాట్లాడితే.. ఆ మాటల్ని తొలగించి, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వక్రీకరించి చూపడం దారుణమన్నారు. ఆ చానళ్లు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. -
రఘురామరాజుది దుష్ప్రచారమే
సాక్షి, అమరావతి: సమాజంలో విద్వేషాలు రేకెత్తించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించిన కేసులో నిందితునిగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన సెల్‌ఫోన్‌ను అనధికారికంగా జప్తు చేసినట్టు, ఆ ఫోన్ నుంచి వాట్సాప్ సందేశాలు వెళ్తున్నట్టు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఏపీ సీఐడీ విభాగం స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా నిబంధనల ప్రకారమే ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్ చేశామని, ఆ విషయాన్ని సీఐడీ న్యాయస్థానానికి కూడా నివేదించామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో నిందితులైన రఘురామకృష్ణరాజు, టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లపై నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. సెల్‌ఫోన్ జప్తు సమయంలో రఘురామకృష్ణరాజు చెప్పిన వివరాలకు.. ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు పూర్తి విరుద్ధంగా ఉన్న విషయాన్ని కూడా సీఐడీ ప్రముఖంగా ప్రస్తావించింది. అసత్య ఆరోపణలతో రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. సెల్‌ఫోన్ జప్తునకు సంబంధించి సీఐడీ వెల్లడించిన వివరాలివీ.. ► ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశాం. నేరానికి సంబంధించి కీలక ఆధారమైన ఆయన సెల్‌ఫోన్‌ను జప్తు చేసి నిబంధనల ప్రకారం ఇద్దరు సాక్షుల సమక్షంలో మే 15న జప్తు మెమోను జారీ చేశాం. ఆ సమయంలో తనది ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ సెల్‌ఫోన్ అని, 90009 11111 ఎయిర్టెల్ నంబరుతో ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆ సమయంలో ఆ సెల్‌ఫోన్ ఏ నంబరు సిమ్‌తో ఉందనే విషయం దర్యాప్తు అధికారికి తెలియదు కాబట్టి రఘురామకృష్ణరాజు చెప్పిందే నమోదు చేశారు. కాగా ఆయన ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 9000922222 అనే సిమ్ నంబరుతో ఉన్న తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని పేర్కొన్నట్టు పత్రికల్లో ప్రచురితమైంది. సెల్‌ఫోన్ జప్తు సమయంలో సాక్షుల సమక్షంలో చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే వాట్సాప్ సందేశాలు వెళ్లాయని ఆయన చెబుతున్న సిమ్ కార్డు నంబర్‌తో ఉన్న సెల్‌ఫోన్ సీఐడీ పోలీసుల వద్ద లేదని ఆయన ఒప్పుకున్నట్టే. ► సీఐడీ అధికారులు ఆ సెల్‌ఫోన్‌కు సీల్‌వేసి గుంటూరులోని సీఐడీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆ సీల్ కవర్లోని సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం మే 18న ఏపీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. ఆ సెల్‌ఫోన్‌లోని డేటా, ఇమేజ్‌లను పరిశీలించి తుది నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ప్రతి అంశాన్ని న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ఆ ఫోన్‌ను ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించారనే సమాచారాన్ని న్యాయస్థానానికి మే 27న, ప్రోసెస్డ్ డంప్ డేటాను మే 31న న్యాయస్థానానికి సమర్పించాం. ఆయన సెల్‌ఫోన్ మే 18 నుంచి సీల్ వేసి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆధీనంలో ఉంది. ఆ సెల్‌ఫోన్ సీఐడీ అధికారులకు అందుబాటులో లేనే లేదు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకే రఘురామకృష్ణరాజు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆ సెల్ఫోన్లో ఉన్న సిమ్ అసలు నంబరు ఏమిటన్నది సీఐడీ పోలీసులకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉన్న ఆ సెల్‌ఫోన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి నివేదిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి తుది నివేదిక రావాల్సి ఉంది. ఆ తరువాతే ఆ సెల్‌ఫోన్ సిమ్ నంబరు ఏమిటన్నది నిర్ధారించగలం. ► జప్తు చేసిన రఘురామకృష్ణరాజు సెల్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వాస్తవాలను సుప్రీం కోర్టుకు నివేదిస్తాం. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. -
రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ
సాక్షి, గుంటూరు: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేష్టలు ఉన్నాయని తెలిపింది. కుల, మత, వర్గాలను టార్గెట్ చేసుకుని, టీవీ5, ABNతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొంది. టీవీ5, ఏబీఎన్ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషంజిమ్మించాయని సీఐడీ తెలిపింది. పక్కా పథకం ప్రకారమే రఘురామ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పేర్కొంది. ఎఫ్ఐఆర్ 12/2021లో రఘురామ, TV5, ABN కుట్రను సవివరంగా సీఐడీ పేర్కొంది. రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచినందుకు CRPC 124 (A) సెక్షన్, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు 120 (B) IPC సెక్షన్, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ -
నారా లోకేష్‌కు లీగల్ నోటీసు
సాక్షి, ప్రకాశం: తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం లీగల్ నోటిసులు పంపారు. తమిళనాడులో తనకుసంబంధించిన డబ్బు దొరికిందంటూ టీవీ5, న్యూస్18 మీడియాల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని టీడీపీ నాయకులైన నారా లోకేష్, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలతో పాటు టీవీ5, న్యూస్-18 ఛానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదేనని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేశాయి. పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు తమవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించినా పట్టించుకోకుండా పదేపదే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. (ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే) -
శవ రాజకీయాలకు తెరతీసిన టీవీ 5, ఈటీవీ
బాపట్లటౌన్ : మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఇసుక కొరతకు ఆపాదించి టీవీ5, ఈటీవీ ప్రతినిధులు చేసిన శవరాజకీయాన్ని మృతుడి కుటుంబ సభ్యులే బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని భర్తిపూడి గ్రామంలో సోమవారం సాయంత్రం నలుకుర్తి రమేష్ (39) ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన టీవీ5, ఈటీవీ ప్రతినిధులు శవరాజకీయం మొదలు పెట్టారు. ‘ఉరివేసుకొని చనిపోవడానికి కారణం ఇసుక లేకపోవడమేనని చెప్పండి.. మీ ఇంటికి ఎవరొచి్చనా ఇదే విధంగా చెప్పండి.. మేము కూడా ఇదేవిధంగా టీవీల్లో చూపిస్తాం. ఇలా చేస్తే మీకు రూ.5 లక్షలు డబ్బులొస్తాయి. లేకపోతే ఏమీ రావు’ అని చెప్పి ప్రలోభపెట్టారు. అలాగే ప్రచారం చేశారు. అయితే రమేష్ కుటుంబ సభ్యులు మంగళవారం ఆ దుష్ప్రచారాన్ని ఖండించారు. రమేష్‌కు గత కొన్నేళ్లుగా ఫిట్స్ వస్తుండటంతో ఎక్కడపడితే అక్కడ పడిపోతూ ఉండేవాడని అతని సోదరుడు సురేష్ చెప్పారు. దీనికితోడు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడన్నారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అసలు తన తమ్ముడు తాపీ పని ఏమీ చేయడని, బాగున్న సమయంలో పొలం పనులకే వెళ్లేవాడని సురేష్ వివరించారు. ఆ టీవీల ప్రతినిధులు డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో మొదట అలా చెప్పామని, తప్పని తెలిసి ఇప్పుడు వాస్తవం చెబుతున్నామన్నారు. -
‘టీవీ 5’ని నిషేధించిన వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీని భుజానమోస్తూ వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5 చానల్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ చానల్ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు ఆహ్వానించరాదని టీవీ 5కి కూడా సూచించింది. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్మీట్లకు, పార్టీ కార్యక్రమాలకు టీవీ 5ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర మీడియా ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకే వైఎస్సార్ సీపీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. కాగా, గతంలో ఏబీఎన్ చానల్‌పై కూడా వైఎస్సార్ సీపీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
వైభవంగా శివపార్వతుల కల్యాణం