
సాక్షి, ప్రకాశం: తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం లీగల్ నోటిసులు పంపారు. తమిళనాడులో తనకుసంబంధించిన డబ్బు దొరికిందంటూ టీవీ5, న్యూస్18 మీడియాల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని టీడీపీ నాయకులైన నారా లోకేష్, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలతో పాటు టీవీ5, న్యూస్-18 ఛానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.
కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదేనని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేశాయి. పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు తమవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించినా పట్టించుకోకుండా పదేపదే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. (ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే)
Comments
Please login to add a commentAdd a comment