bonda uma
-
'బుడమేరు వరద' సాయం స్వాహా
విజయవాడస్పోర్ట్స్: బుడమేరు ముంపు వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారు. వరద వల్ల ఈ నెల ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు విజయవాడ నగర శివారులోని కొత్త రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, సుందరయ్యనగర్, శాంతినగర్, ప్రశాంతినగర్, కండ్రిక, రాజీవ్‌నగర్, ఉడా కాలనీ తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది ముందుకొచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో ఆహారం, నీళ్లు, దుప్పట్లు, సరుకులు తీసుకొచ్చారు. వాటిపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. చాలావరకు సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలోనే వాటిని ఎగరేసుకుపోయారు. అంతటితో ఆగకుండా తమ పలుకుబడి ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తెచ్చిన సరుకులు, దుప్పట్లు, దుస్తులు వంటివి సింగ్‌నగర్ కృష్ణా హోటల్ సమీపంలోని ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయానికి తరలించారు. వాటిని పసుపు సంచుల్లో వేసి టీడీపీ పంపిణీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈ సరుకుల పంపిణీకి కూడా పలు ప్రాంతాల్లో ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ల కోసం వాంబేకాలనీలోని ఫంక్షన్ హాలు వద్దకు గురువారం అధిక సంఖ్యంలో పేదలు చేరడంతో గందరగోళం నెలకొంది. అక్కడి నుంచి టోకెన్లు తీసుకుని టీడీపీ కార్యాలయానికి వెళితే షట్టర్ మూసి ఉందని పలువురు వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయం చేస్తామని చెప్పి వారం నుంచి టోకెన్లు, సరుకులు అంటూ తిప్పుకుంటున్నారని వాంబేకాలనీకి చెందిన మహిళలు కె.జయలక్ష్మి, ఎస్.కనకదుర్గ, ఎ.నాగమణి, కె.దుర్గాభవాని, వి.లక్ష్మి, బి.నాగరాణి, శాంతి, ఎస్.సన్యాసమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు.మహిళ పేరు బాణావతు మల్లేశ్వరి. టీడీపీ నాయకురాలు. 20 ఏళ్లుగా కొత్త రాజరాజేశ్వరిపేటలో నివసిస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బుడమేరు వరద కారణంగా ఆమె నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరిపేట అంతా మునిగిపోయింది. తమ పేటలోని బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నేతలు స్వాహా చేస్తున్న విషయాన్ని తేల్చుకునేందుకు పలువురు మహిళలతో కలిసి మల్లేశ్వరి గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే కార్యాలయం షట్టర్ మూసి ఉంది. ‘మా ప్రాంతానికి ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎటువంటి సాయం చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చే సాయాన్ని కూడా మా పార్టీకే చెందిన మాజీ కార్పొరేటర్ యరబోతు రమణ పక్కదారి పట్టిస్తున్నాడు. సాయం చేసేందుకు వచ్చేవారిని మా పార్టీ నాయకులు వారి ఇళ్ల వద్దకు పిలిపించుకుని సరుకులు, దుస్తులు కాజేస్తున్నారు’ అని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. వరద నష్టం అంచనాలు కూడా కొందరి ఇళ్లకే పరిమితం చేశారని, సామాజిక పింఛన్లు ఇంకా ఇవ్వలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.నీచమైన బతుకులు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మాకు ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేసేందుకు వచ్చిన వారి నుంచి సరుకులన్నీ టీడీపీ నాయకులే తీసుకుంటున్నారు. వాటిని బయటపెట్టడం లేదు. ఎవరికీ పంచడం లేదు. మాకు అందాలి్సన వాటిని కాజేస్తూ నీచాతినీచమైన బతుకు బతుకుతున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆఫీసుకు వెళ్లి అడిగితే రోడ్డు పక్కన పడేసే చిరిగిన దుస్తులు పంపించారు. వాటనీ్నంటినీ బుధవారం రాత్రి మా వీధిలో పడేసి తీసుకువచ్చిన టీడీపీ నాయకుల ముందే తగలబెట్టేశాం. – రాజులపాటి తిరుపతమ్మ, న్యూఆర్ఆర్పేటసాయం అడిగితే పార్టీలు అంటగడుతున్నారుఇంట్లో సామాన్లు అన్నీ పోయి ఇబ్బందులు పడుతున్నాం. సాయం చేయాలని అడుగుతుంటే టీడీపీ నాయకులు పార్టీలను అంటగడుతున్నారు. మా పార్టీకి ఓటు వేయలేదు... మీకు ఇవ్వం అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగన్ పార్టీ వాళ్లు వచ్చి అందరికీ సాయం అందించారు. టీడీపీ వాళ్లు మాత్రం పార్టీల పేరుతో వేరు చేసి మాట్లాడుతున్నారు. వాళ్లు సాయం చేయకపోగా, సాయం చేసే వాళ్లని మా వరకు రానివ్వడం లేదు. – గుడిసే నాగమణి, న్యూఆర్‌ఆర్‌పేట -
Vijayawada Floods: ముంచింది ప్రభుత్వమే
సర్వం కోల్పోయాంఏడాది కిందటే సింగ్‌నగర్ తోట వారి వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని మారాం. గత ఆదివారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదకు ఇంట్లో సామాన్లు అన్ని పాడయ్యాయి. పదేళ్లుగా సంపాదించిన వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయి. మా అమ్మాయి, అబ్బాయి సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. వరద వస్తుందని ముందుగా చెబితే వీలైనంతవరకు జాగ్రత్త పడేవాళ్లం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్వం కోల్పోయాం.– రాధాకృష్ణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, తోటవారి వీధి, సింగ్నగర్అజిత్సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై రిక్షాలో సామాన్లు తరలిస్తున్న గుండు కృష్ణ ఓ ఆటో డ్రైవర్. మరి ఇంటి సామాన్లు రిక్షాలో ఎందుకు తీసుకువెళుతున్నారనే కదా మీ సందేహం? విజయవాడలోని కండ్రికలో నివసించే కృష్ణ, ఆయన సోదరుడు ఫైనాన్స్‌లో తీసుకున్న రెండు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బుడమేరు వరద ముంచెత్తడంతో రెండు ఆటోలు వరదలో పూర్తిగా మునిగి దెబ్బతిన్నాయి. ఆటోకు నెలకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.20 వేలు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీ చెల్లించాలి. ఆటోలను బాగు చేయించాలంటే ఆటోకు రూ.లక్ష చొప్పున మొత్తం రెండు లక్షలు అవుతుందంటున్నారు. ఇన్సూరెన్స్ రాదని చెప్పారు. ఇంట్లో వంట సామాన్లు, ఫ్రిజ్, గ్యాస్ స్టౌ, పిల్లల పుస్తకాలు, ఫర్నిచర్ అన్నీ దెబ్బతిన్నాయి. మళ్లీ అవి కొనాలంటే రూ.50 వేల దాకా ఖర్చవుతుంది. వంట దినుసులైతే తడిసి ముద్దయి ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఇంట్లో కరెంటు వైరింగ్ దెబ్బతింది. ఇల్లు కూడా మరమ్మతులకు గురైంది. ఇవన్నీ బాగు చేయించుకోవాలంటే కనీసం మరో రూ.లక్ష అవుతుంది. ఆటో నడిపి రోజూ రూ.వెయ్యి దాకా సంపాదించేవారు. ఇప్పుడు సంపాదన లేదు. వరద తగ్గాక ఆటోలు బాగు చేయించుకుని రోడ్డెక్కితేనే మళ్లీ ఉపాధి లభించేది! అదెన్ని రోజులు పడుతుందో తెలియదు. కనీసం నెల రోజుల పాటు ఉపాధికి దూరం కానున్నాడు. మరోవైపు ఫైనాన్స్ కంపెనీకి కిస్తీలు కట్టాలి. ఇలా కృష్ణ కుటుంబానికి దాదాపు రూ.నాలుగు లక్షల దాకా నష్టం వాటిల్లింది. కేవలం వరద వస్తుందని ప్రభుత్వం ముందుగా చెప్పకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా అంత నష్టపోయింది. అదే ప్రభుత్వం అప్రమత్తం చేసి ఉంటే కనీసం ఇంట్లో ముఖ్యమైన సామాన్లు, పిల్లల పుస్తకాలు, మరికొన్ని వస్తువులను రెండు ఆటోల్లో తరలించి ఈ గండం నుంచి గట్టెక్కేవాళ్లమని కృష్ణ ఆక్రోశిస్తున్నాడు. – లబ్బీపేట (విజయవాడ తూర్పు)సింగ్‌నగర్ డాబా కొట్ల జంక్షన్లో రెండంతస్తుల ఇల్లు నిర్మించుకున్న వ్యాపారి కె.నాగేశ్వరరావును పలకరించగానే ఆయన ఆవేదన కట్టలు తెంచుకుంది. ‘ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద నీరు ముంచెత్తడంతో మొదటి అంతస్తుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నాం. ఇంటి ముందున్న మూడు కార్లు వరద నీటిలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంట్లోకి నీళ్లొచ్చి సామాన్లు అన్నీ తడిసిపోయాయి. మా అల్లుడు రూ.5 వేలు డబ్బులిచ్చి సోమవారం ఉదయం పడవ తేవడంతో ప్రాణాలతో బయటపడ్డాం. ఆరు రోజులుగా ఓ హోటల్లో ఉంటున్నాం. మా కుటుంబానికి రూ.25 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాకు ఏం సాయం చేస్తుంది..? వరద వస్తుందని మాకు ముందుగానే చెప్పి ఉంటే ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ప్రభుత్వం ప్రజల పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించలేదు’ అని నిర్వేదం వ్యక్తం చేశాడు. సోమవారం వరద ముంపులోనే విజయవాడలోని కండ్రిక నిర్లక్ష్యం ఖరీదు.. 60 నిండుప్రాణాలువిజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 1.45 లక్షల కుటుంబాల దుస్థితికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏకంగా 7 లక్షల మంది వరద కష్టాలివి! బుడమేరుకు భారీ వరద వస్తోందని తెలిసి కూడా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఫలితం ఇదీ. ఇందుకు సామాన్యులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికి దాదాపు 60 నిండు ప్రాణాలు బలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారమే 1.45 లక్షల కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదలు ముంచెత్తిన వారం రోజుల తరువాత కూడా ఏకంగా 7 లక్షల మంది వరద ముంపులోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఇక 1.45 లక్షల కుటుంబాలకు కలిగిన నష్టం ఎంతన్నది అంచనాలకే అందడం లేదన్నది కఠోర వాస్తవం. లక్షల ఇళ్లు వరదకు దెబ్బతిన్నాయి. వాటిని బాగు చేయించుకునేందుకు భారీగా ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వరదకు ఇళ్లల్లో వంట సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. గ్యాస్ స్టౌ, వంట సామాన్లు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. లక్షలాది ఇళ్లల్లో పిల్లల పుస్తకా>లు, సర్టిఫికెట్లు తడిసిపోయాయి. ఎంతోమంది సర్టిఫికెట్లు, బ్యాంకు పుస్తకాలు, దస్తావేజులు వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, సరుకు రవాణా వాహనాలు, ఇతర వాహనాలు వారం రోజులుగా వరద ముంపులోనే ఉండటంతో బురద పేరుకుపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. ప్రకృతి వైపరీత్యంతో దెబ్బతిన్న ఆ వాహనాలకు బీమా వర్తిందని బీమా కంపెనీలు ఇప్పటికే తేల్చి చెప్పేశాయి. ‘మా పెంకుటిల్లు వరదకు మునిగిపోయింది. వరద తగ్గిన తరువాత కరెంట్ వైరింగ్ పూర్తిగా మార్పించుకోవాలి. లేదంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. వైరింగ్‌కు కనీసం రూ.50 వేలు అవుతుంది’అని రాజీవ్‌నగర్‌కు చెందిన లక్ష్మీ నారాయణ తన కష్టాలను చెప్పుకొచ్చారు. ఇక రోజు కూలీలు, కార్మికులకు ఇప్పటికే వారం రోజులుగా ఉపాధి లేదు. మరో 15 రోజుల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో సంపాదన లేక ...చేతిలో డబ్బులు లేక పేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సగటున ఒక్కో కుటుంబానికి కనీసం రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. సగటు అంచనాల ప్రకారం 1.45 లక్షల కుటుంబాలకు రూ.10 వేల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందన్నది ప్రాథమిక అంచనా.చంద్రబాబుకే పునరావాసంఏకంగా 7 లక్షల మందిని వరదకు వదిలేసిన ప్రభుత్వం సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబానికి మాత్రం పునరావాసం కల్పించింది. నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు కరకట్ట బంగ్లాను వరద ముంచెత్తనుందనే హెచ్చరికలతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ ఇంటిని కాపాడేందుకు కనీసం అప్రమత్తం చేయకుండా వెలగలేరు రెగ్యులేటర్ వద్ద గేట్లు అర్థరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తేశారు. అంతకుముందే చంద్రబాబు కుటుంబం హుటాహుటిన బంగ్లాను ఖాళీ చేసేసింది. చంద్రబాబు స్వయంగా విజయవాడ కలెక్టరేట్‌కు మకాం మార్చారు. అన్ని సౌకర్యాలతో కూడిన తన వాహనాన్ని అక్కడే పార్క్ చేయించుకున్నారు. వారం రోజులుగా అన్ని సౌకర్యాలతో అక్కడే ఉంటున్నారు. ఇక లోకేశ్ కూడా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు షిఫ్ట్ అయ్యారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నివాసానికి తరలి వెళ్లిపోయారు. వరదలతో ఏమాత్రం ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు కుటుంబాన్ని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించిందన్నది స్పష్టమవుతోంది.బొండా ఉమా బిస్కట్ ప్యాకెట్లిచ్చి వెళ్లిపోయారు..‘కండిగ్రలో ఓ అపార్ట్మెంటులో వాచ్‌మేన్‌గా పని చేస్తున్నా. గ్రౌండ్ ఫ్లోర్ చిన్న గదిలో మా కుటుంబం ఉంటోంది. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. ఆదివారం ఉదయం హఠాత్తుగా వరద ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మా గది వరదలో మునిగిపోయింది. ఇంట్లో సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి. కనీసం వంటపాత్రలు కూడా లేవు. మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఆ వీధిలో తెలిసిన వారి డాబా మీద ఉండమని ఆశ్రయం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ తలదాచుకుంటున్నాం. ఎమ్మెల్యే బొండా ఉమా రూ.5 బిస్కట్ ప్యాకెట్లు పంచి వెళ్లిపోయారు. వాటితో కడుపు నింపుకోవాలా? ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం’ – వెంకటరావు, వాచ్‌మేన్, కండ్రిక -
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తమను టార్గెట్ చేశారంటున్న బాధితులు
-
నీ కుంభకోణాల చరిత్ర నాకు తెలుసు ఆధారాలు బయటపెట్టానంటే..
-
‘బొండా’.. నీది అధికార మదం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పాయకాపురం (విజయవాడ రూరల్) : ‘ఉమా.. నీకు అధికార మదం తలకెక్కింది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి అనుకూలంగా పనిచేసిన నన్ను వేధిస్తున్నావు. అక్రమ నిర్మాణం పేరుతో మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి నా ఇంటిని కూలగొట్టించావు. నేను టీడీపీలో ఉండగా నీ చేతుల మీదుగానే భవన నిర్మాణానికి భూమిపూజ, గృహ ప్రవేశం చేశావు. ఈరోజు నేను పార్టీ మారగానే సక్రమ నిర్మాణం కాస్తా అక్రమమైందా? ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా పని చేశానని దళితుడినైన నాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నావు.. ఆరాచకం సృష్టిస్తున్నావు.ఉమా.. నీ పతనం ప్రారంభమైంది’.. అంటూ వైఎస్సార్సీపీ దళిత నేత, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యుడు నందెపు జగదీష్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు పాల్పడడాన్ని నిరసిస్తూ సోమవారం జగదీష్ విజయవాడ ప్రకాష్ నగర్‌లోని తన ఇంటి వద్ద గుండు గీయించుకుని, అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 2012లో నేను ప్రకాష్ నగర్లో కాట్రగడ్డ హరిబాబు అనే వ్యక్తి నుంచి 224 గజాల స్థలాన్ని కొని అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు కట్టుకున్నా. 2014లో టీడీపీలో ఉన్న సమయంలోనే అక్కడ ఇంటి నిర్మాణం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బొండా చేతుల మీదుగానే భూమి పూజ జరిగింది. ఉమా తీరు, ఆయన విధానాలు నచ్చక నేను ఈ మధ్య వైఎస్సార్సీపీలో చేరి ఉమాకు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో పనిచేశా. ఇది మనసులో పెట్టుకుని ఎన్నికల్లో గెలవగానే దళితుడినైన నాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. గతంలో నేను టీడీపీలో ఉన్నా.కార్పొరేటర్‌గా కూడా గెలుపొందా. అప్పుడు బొండా ఉమా ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ఎంతో కృషిచేశా. తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని చెప్పగా ‘నా కింద పనిచేసే దళితుడవు.. ఎమ్మెల్యేగా పోటీచేస్తావా’ అంటూ ఆయన నాపై కక్ష పెంచుకున్నారు. ఇప్పుడు నా ఇల్లు అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి కూలగొట్టించారు. 2014లో భూమిపూజ చేసిన రోజు సక్రమంగా ఉండి ఈరోజు అదెలా అక్రమం అయ్యిందో బొండా సమాధానం చెప్పాలి. నా ఇంటిని క్రమబద్దికరించాలని గతంలోనే దరఖాస్తు చేశా. కానీ, బొండా ఒత్తిడికి మున్సిపల్ అధికారులు తలొగ్గి అది అక్రమ నిర్మాణమంటూ నోటీసులు జారీచేశారు.నోటీసుల్లో 24 గంటల వ్యవధి అంటూ పేర్కొని.. నేనులేనప్పుడు నోటీసిచ్చిన ఎనిమిది గంటల్లోపే కూల్చేశారు. ఎక్కడ అక్రమం జరిగిందో చెబితే నేనే నిర్మాణాన్ని తొలగించేవాడిని. కానీ, బొండా కక్ష సాధింపులకు అధికారులు సహకరిస్తున్నారు. నేను, నా భార్య ఎమ్మెల్యే కాళ్లపై పడితే వదిలేస్తానని చెబుతున్నారు. కానీ, నేను ఏ తప్పూ చేయలేదు.. ఎవరి కాళ్లపై పడాల్సిన అవసరంలేదు. ఇకపై బొండా అరాచకాలను నియోజకవర్గంలో ప్రచారం చేస్తా. కూల్చిన భవనం ఫొటోలు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రచారం చేస్తా. నేను సమరయోధుల భూములు ఆక్రమించుకోలేదు.. ఇక బొండా ఉమా మాదిరిగా నేను స్వాతంత్య్ర సమరయోధుల స్థలాలను ఆక్రమించుకోలేదు. నేను స్థలం కొని ఇల్లు కట్టాను. అప్పట్లో ఎమ్మెల్యే బొండా ఉమా స్వాతంత్య్ర సమరయో«ధుల స్థలాలు ఆక్రమించుకున్నారని, టీడీపీ ప్రభుత్వంలోనే ఆయన భార్యపై కేసు నమోదైంది. ఇక అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామంటున్న మున్సిపల్ అధికారులు భవానీపురం, గొల్లపూడి ప్రాంతాల్లోని బొండా అక్రమ భవనాలను కూల్చగలరా? ఇదే రోడ్డులో వందల అక్రమ నిర్మాణాలు ఉన్నా వాటినెందుకు కూల్చలేదు? నేను వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నానని, దళితుడిని కావడంవల్లే నాపై వేధింపులకు పాల్పడుతున్నారు. అధికారులు తస్మాత్ జాగ్రత్త.. బొండా ఉమాతో మున్సిపల్, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఎంతోమంది అధికారులపై దురుసుగా ప్రవర్తించిన చరిత్ర అతనిది. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు.. అధికారులు చట్టబద్ధంగా నడుచుకోవాలి. ఉమా ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఏ అధికారి పనిచేయలేరు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి బదిలీ చేసుకుని వెళ్లిపోవాలి. బంగారంలాంటి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తా. బొండా అరాచకాలను సీఎం చంద్రబాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్తా. -
బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..
-
Vijayawada: మరెవరికీ ఇలాంటి అన్యాయం జరగొద్దు
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్సార్సీపీ దళిత నేత శిరోముండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో అధికారులను ఉపయోగించి మరీ నందెపు జగదీష్‌కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన జగదీష్.. కూల్చేసిన భవనం ముందే శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా బోండా ఉమాకు నిరసన తెలియజేశారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా. దళిత వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా?. బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. .. నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్‌ను. నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు’’ అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లల్ని అదుపులో పెట్టుకో బోండా ఉమాకి వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్..
-
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
-
బోండా ఉమా ఎన్నికల అఫిడవిట్ మోసాలను బయటపెట్టిన వెల్లంపల్లి శ్రీనివాస్
-
బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని.. ఆయన మోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 2014లో బోండా ఉమా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికారులను తప్పుదారి పట్టించారని దుయ్యబట్టారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బోండాపై మేం మూడు ఫిర్యాదులు చేశాం. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్‌లో ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్‌లోనే ఓట్లు ఉండాలి. మా ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదు. 2014లో అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారు. 2019 అఫిడవిట్లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్‌నే పెట్టారు. 2024 అఫిడవిట్లో సింగ్‌నగర్ పార్టీ ఆఫీస్‌ను ఇల్లుగా చూపించాడు. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారు. పార్టీ ఆఫీస్‌లో ఆయన ఎలా నివాసముంటున్నారు?. పార్టీ ఆఫీస్‌లో ఓట్లు ఎలా నమోదు చేస్తారు?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.‘‘గతంలో వైఎస్సార్సీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించాడు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదు. టీడీపీ పార్టీ ఆఫీస్‌లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయి. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీ చేసేందుకు అనర్హుడు. మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. నేను ఇక్కడితో ఆగను. బోండాపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చాడు. తప్పుడు డాక్యుమెంట్‌తో ఓటు చూపించాడు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడతా’’ అని వెల్లంపల్లి తేల్చి చెప్పారు.‘‘నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా?. ఎమ్మెల్యేగా గెలిచాక.. నేను సెంట్రల్ నియోజకవర్గంలోనే నివాసముంటా.. బోండా ఉమా... అతని సతీమణి.. ఇద్దరు కుమారులు.. కోడలు ఓట్లు చెల్లవు. పార్టీ కార్యాలయాన్ని ఇల్లుగా చూపించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎవరైనా కాపురాలు చేస్తారా?. బోండా ఉమా చెల్లదు.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బోండాను అనర్హుడిగా ప్రకటించే వరకూ పోరాడతా. బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని బెదిరిస్తున్నాడు.2 కోట్ల 54 లక్షల 97వేల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాడు. బోండా ఉమా ఆర్థిక నేరస్తుడు. బోండా ఉమా వంటి ఆర్ధిక నేరస్తుడికి ఓటేయొద్దు. 2019లో పెండింగ్‌లో ఉన్నవి.. 2014లో ఉన్న కేసులు 2024 అఫిడవిట్లో పొందుపరచలేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. బోండా ఉమాపై ఉన్న కేసులపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. వేరే పార్టీలను ప్రచారం చేయనీయకుండా చేస్తున్నారు. వేరే పార్టీలకు అవకాశం లేకుండా పర్మిషన్లు తీసుకుని తిరగకుండా చేస్తున్నారు. మా ప్రచారాన్ని అడ్డుకోవడానికి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘మా హక్కులకు బోండా ఉమా భంగం కలిగిస్తున్నాడు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయం మానుకోవాలి. ఓటు అడగనోడివి నీరెందుకు బోండా ఉమా అనుమతులు. ఓటమి భయంతోనే బోండా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. బోండాను కచ్చితంగా ఓడించి తీరుతాం.. బుద్ధిచెబుతా’’ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. -
బోండా ఉమాపై అనర్హత వేటు ?..ఈసీకి ఫిర్యాదు
-
బోండా ఉమాపై అనర్హత వేటు ?..ఈసీకి ఫిర్యాదు
-
బోండా ఉమా పని అయిపొయింది..వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు ఆదేశాలతోనే..
-
బోండా ఉమాకి డిపాజిట్ కూడా రానివ్వను
-
సీఎంపై హత్యాయత్నానికి సూత్రధారి ‘బొండా’నే
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, తనపై హత్యాయత్నానికి సూత్రదారి టీడీపీ నాయకుడు బొండా ఉమానే అని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే సీఎం జగన్‌పై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని, బొండా ఉమా, ఏ2 దుర్గారావులు దగ్గరుండి మాపై హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. దీనికి సూత్రధారి బొండా ఉమా కాగా, మూలకారకుడు చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ బొండా ఉమా చుట్టూనే తిరుగుతున్నాయని, రాజకీయంగా తమను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఇలా టీడీపీ నాయకులు రౌడీయిజం, గూండాయిజాన్ని పోషించి హత్యాయత్నాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. బొండా ఉమాకు నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఉమా ఘోర ఓటమిని చవిచూడడం తథ్యమన్నారు. నిందితులు ఎందుకు టచ్‌లో ఉన్నట్టు? ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే పోలీసు అధికారులు విచారణ జరపడం తప్పా? అధికారులను బెదిరిస్తే నిజం అబద్దమవదనే విషయాన్ని బొండా ఉమా తెలుసుకోవాలని వెలంపల్లి హితవుపలికారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం తనపని తాను చేసుకువెళుతుంటే బొండా ఉమాకు ఎందుకు వెన్నులో వణుకు పుడుతోందని ప్రశ్నించారు. సీఎం జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతుంటే.. చంద్రబాబు వారిని రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఎవరైనా తమ మీద తామే దాడి చేయించుకుంటారా? దాడి ఘటనలో కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే బొండా ఉమాకు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దు్రష్పచారం చేయడం దుర్మార్గమన్నారు. ‘సీఎంపై హత్యాయత్నం చేసినవారు బొండా ఉమాతో ఎందుకు టచ్‌లో ఉన్నారు? సతీష్ తల్లిదండ్రులు బొండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు?’ అని ప్రశ్నించారు. బొండా ఉమా, ఆయన ఇద్దరు కుమారులు చేస్తున్న రౌడీయిజానికి కచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న దుర్గారావు, బొండా ఉమా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని ఈ దాడి చేయించారని ఆయన ఆరోపించారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు. -
సీఎం జగన్ ను హత్య చేసేందుకే.. బొండా బ్యాచ్ స్కెచ్
-
A2 ఎవరు ...?
-
సీఎం జగన్ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్’పై అనుమానాలెన్నో!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్‌లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్‌ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్‌కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు. ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్‌షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్‌ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి. పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు. ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్‌కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్‌గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం. మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్‌కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ! - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రిమాండ్ రిపోర్ట్..బోండా ఉమా బ్యాచ్ స్కెచ్
-
‘బాబు రియాక్షన్ చూస్తుంటే.. అసలు దొంగ ఆయనే అనిపిస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడు ప్రవర్తన చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిచేయించిన అసలు దొంగ ఆయనే అనిపిస్తుందన్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి. ముందు జాగ్రత్త కోసం దొంగే..దొంగా..దొంగా అని అరుస్తున్నాడేమోనని అన్నారు. నీ వరకూ వస్తుందని భుజాలు తడుముకుంటున్నావా బాబు అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే టీడీపీ అంటే టోటల్‌గా దివాళా తీసే పార్టీ అయిందని, జూన్ 4 నాటికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుందని విమర్శించారు. కనుమూరి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు. పోలీసు అధికారులు వైఎస్సార్సీపీ ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చాడు. చంద్రబాబూ...ఇంత వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు ఇంకా చెప్పలేదు. అలాంటప్పుడు మీకు ఏం సమాచారం ఉండి ఇలాంటి ప్రెస్ రిలీజ్ ఇచ్చారో సమాధానం చెప్పాలి. అధికారికంగా చంద్రబాబు ఇలాంటి ప్రెస్‌నోట్ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్లు అర్థం కావడంలేదా? కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారు. మీరు గుంటూరు దాటిన తర్వాత జగన్ బస్సు యాత్రకు క్రేజ్ తగ్గుతుందని భావించారు. కానీ గుంటూరు నుంచి విజయవాడ వచ్చే సరికి కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు విజయవాడ జనసంద్రంగా మారింది. ఆ జన ప్రవాహాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి జగన్‌పై దాడి చేశారని ఖచ్చితంగా అర్థం అవడం లేదా? మీరే చెప్తున్నట్లు, ఈ దాడి వెనక బోండా ఉమ ఉన్నట్టు మీరు చెప్తున్నారంటే... చివరకు ఈ కేసు మీ వరకూ వస్తుందని భయపడుతున్నారా చంద్రబాబు? వాళ్ల స్పందన చూస్తే అసలు దొంగ చంద్రబాబేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని బాబు భయపడుతున్నాడా అనే సందేహం కలుగుతోంది. అసలు చంద్రబాబుకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? ముందు జాగ్రత్త కోసం దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా అరుస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దాడి చేయించింది చంద్రబాబే అనేది వారి స్పందన చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే వస్తున్న సమాచారం మేరకు బోండా ఉమా ఫోన్ స్విచ్ఆఫ్ చేశారని తెలుస్తోంది. బోండా ఉన్నాడో.. బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు బాబూ?: పోలీసులు ఎవరు అధికారికంగా విచారణపై నోరెత్తకపోతే ఏ బోండా ఉన్నాడో..ఏ బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు చంద్రబాబు? జగన్ యాత్ర గుంటూరు, విజయవాడలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో జన గోదారి అయ్యాయి. దీంతో బెంబెలెత్తిపోయి, ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. మీరు చేస్తున్న యాత్రలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మీరు, పవన్, పురందేశ్వరితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ప్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు. అందుకే మీ ఓర్వలేని తనం అడుగడుగునా కన్పిస్తోంది. బాలకృష్ణ యాత్ర కర్నూలు జిల్లాలో జనం లేక వెలవెల పోయింది. మీ ఉత్త పుత్రుడు నారా లోకేశ్ ఏ సభకూ పనికిరాడని మీరే పక్కన పెట్టారు. మీ దత్తపుత్రుడు ఫ్రస్టేషన్ ఎక్కువై తెనాలిలో పూనకం వచ్చినట్లు ఊగిపోవడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. అతనేమన్నా మత్తు మందుకు బానిస అయ్యాడా, లేక మందు సేవించి అలా ప్రవర్తిస్తున్నాడా అనే అనుమానాలున్నాయి. మీ కూటమి పూర్తిగా విఫలమైందనేది వీటన్నిటిని బట్టి తెలుస్తోంది. మీలో అణువణువునా ఫ్రస్టేషన్ కనిపిస్తోంది: మీకు అణువణువునా టెన్షన్, ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారు. మీ మాయాకూటమిలో ఉన్నది దుష్టచతుష్టయం. కుట్రలే ఎజెండాగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారిపోతుంది. రామోజీ మార్గదర్శి అక్రమాల కేసులలో పీకల్లోతులో మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఉనికి గల్లంతు అవుతుందని భయం. రాధాకృష్ణ, బీఆర్నాయుడులకు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని భయంతో ఉన్నారు. అందుకే, నిత్యం నెగిటివ్ న్యూస్ ద్వారా అధికారం సాధించాలనే ఎత్తుగడ మీది. కానీ జగన్ ముఖ్యమంత్రిగా 99 శాతం హామీలు అమలు చేసి, 2.70 లక్షల కోట్లు దళారీలు లేకుండా డిబిటీ ద్వారా ప్రజలకు అందించారు. జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి, నేను చేసిన మేలు మీకు చేరిఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్న రియల్ హీరో జగన్‌గారు. ప్రతి గడపకూ సేవలందించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. మీరు చెప్పుకునేందుకు ఏమీ లేక చేతులెత్తేసిన మీరు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఓట్లడగడానికి సిగ్గుగా లేదా? జూన్4కి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ: ఇప్పటికే టీడీపీ అంటే టోటల్‌గా దివాళా తీసే పార్టీ అయింది. జూన్4 మధ్యాహ్నానికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుంది. -
ఫోన్ స్విచ్ ఆఫ్.. పరారీలో బోండా ఉమా !
-
సీఎం జగన్ విజయవాడ ఘటన...బోండా ఉమా హస్తం
-
బోండా ఉమా, చంద్రబాబుకు వెల్లంపల్లి అల్లుడు కౌంటర్
-
బొండా ఉమా గో బ్యాక్
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిలవకపోయినా టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా రావడంతో ఉద్రిక్తంగా మారింది. ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. చివరకు కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్లో గల ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వనం మేరకు విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా అక్కడికి వెళ్లారు. వేదికపై వెళ్లి కూర్చోవడంతో ఆర్యవైశ్య కులానికి సంబంధం లేని బొండా ఉమా కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటూ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కొండపల్లి బుజ్జి ప్రశ్నించారు. పిలవకపోయినా అభినందించడానికి వచ్చారని, పిలవకపోయినా వస్తామంటూ బొండా ఉమా అనుచరుడు, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేశ్ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ‘బొండా ఉమా గో బ్యాక్’ అంటూ కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. దీంతో బొండా ఉమా వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ వివాదం విషయం తెలుసుకున్న మాచవరం పోలీసులు ఆ హాల్‌కు వెళ్లి.. రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తామంటేనే అనుమతులు ఇచ్చామని నిర్వాహకులతో చెబుతుండగా.. డూండి రాకేశ్ వచ్చి ఇది తమ అంతర్గత సమావేశమని, పోలీసులు ఎందుకు వచ్చారంటూ వాదనకు దిగారు. కార్యక్రమం నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నామని పోలీసులు నిర్వాహకులతో చెప్పి హాలులో ఉన్న సభ్యులందరినీ బయటకు పంపించేశారు. డూండి రాకేశ్‌ను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా.. డూండి రాకేశ్ అత్యుత్సాహమే వివాదానికి కారణమని విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు చెప్పారు. బొండా ఉమాకు తాము ఆహ్వానం పంపలేదని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య ప్రముఖులకు మాత్రమే ఆహ్వనాలు పంపామని చెప్పారు. బొండా ఉమా కావాలనే తమ కార్యాక్రమానికి వచ్చి వివాదం రాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
బోండా ఉమపై వెల్లంపల్లి తీవ్ర ఆగ్రహం
-
అతనొక కారుడు కట్టిన రాక్షసుడు...బోండా ఉమాపై రెచ్చిపోయిన వెల్లంపల్లి
-
భయపెడితే బయపడేవాడు ఎవడు లేడు .. వెల్లంపల్లి వార్నింగ్
-
టీడీపీ నేత బొండా ఉమాపై కేసు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): తన కుమారుడి మృతిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇటీవల మరణించిన నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన యువకుడు కైకాల శరణ్ తల్లి అంజలీదేవి శనివారం అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గుండెపోటుతో మృతిచెందాడని ఆమె తెలిపారు. తన కుమారుడి మృతికి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వెలంపల్లి శ్రీనివాసరావు ఒత్తిడి చేయటం వల్ల తన కుమారుడు మృతిచెందాడని బొండా ఉమా, ఆయన అనుచరులు స్థానికంగా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ స్వార్థం కోసం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. తన కుమారుడి మృతిపై తప్పుడు ప్రచారం చేయడంతోపాటు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించిన బొండా ఉమా, బేతు రామ్మోహన్రావు, ఆల తారక రామారావు, పైడి శ్రీను, చలమలశెట్టి శ్రీను, హనుమంతరావు, విజయ్‌కుమార్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
బోండా ఉమాకు ఓటమి భయం..బయటపడ్డ బాగోతం..
-
మహిళలపై వికృత చేష్టలు బయటపడ్డ టీడీపీ నేత బాగోతం
-
స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని కబ్జా చేసిన బోండా
-
బోండా ఉమ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు
-
హే ఉమా ఏంటిది ?..ఈ వీడియో బాబు చూస్తే ఏమవుతాడో
-
తాట తీస్తా జాగ్రత్త !..వెల్లంపల్లి వార్నింగ్
-
టీడీపీ నేత బోండా ఉమపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
-
బోండాకు ఆ అర్హత లేదు
-
రాధా Vs ఉమ కోల్డ్ వార్: విజయవాడలో హీట్ పాలిటిక్స్
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్ వార్ గట్టిగానే నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోస్టుల దాడులు చేసుకుంటున్నారు. దీంతో, పచ్చ బ్యాచ్ రాజకీయం రచ్చగా మారింది. తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీలో వార్ మొదలైంది. వివరాల ప్రకారం.. విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో ఇరు వర్గీయుల మధ్య పొలిటికల్ ఆధిపత్య పోరు ముదురుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల కిందటే పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారంటూ రాధా వర్గం సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా బోండా ఉమా వర్గానికి టార్గెట్‌గా కౌంటర్ పోస్టులు పెట్టింది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు సోషల్ మీడియా కనిపించాయి. కాగా, రాధా వర్గమే ఇలా చేసినట్లు బోండా ఉమా వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఇక, ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమా, రాధా వర్గాల కోల్డ్ వార్తో రాజకీయం రసవత్తరంగా మారినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
బోండా ఉమా హద్దు మీరి మాట్లాడితే సహించేది లేదు
-
మల్లాది విష్ణు, నేను వేరు కాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లాది విష్ణు, తాను వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అలాగే, బోండా ఉమా హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వెల్లంపల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. మల్లాది విష్ణు, నేను వేరు కాదు.. ఇద్దరం ఒక్కటే. సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండగా పాటిస్తాం. సీఎం వైఎస్ జగన్ పథకాలు, సంక్షేమ పాలనే వైఎస్సార్సీపీని, మమ్మల్నిని గెలిపిస్తాయి. టీడీపీ నేత బోండా ఉమ హద్దు మీరి మాట్లాడుతున్నాడు. బోండా ఉమ హద్దు మీరితే సహించేది లేదు. ముందు వాళ్ల సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి అని హితవు పలికారు. -
టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. పచ్చ బ్యాచ్‌కు చుక్కలే!
రౌండప్ చేసి ఇబ్బంది పెడితే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను అంటాడు మహేష్ బాబు ఓ సినిమాలో. ఇప్పుడు బెజవాడ ఎంపీ కేశినాని కూడా మహేష్ బాబులా తయారయ్యాడు.. కన్ఫ్యూజన్లో దొరికిన వాళ్ళందర్నీ కెలుక్కుంటూ పోతున్నాడు. అవును బెజవాడ పండుగాడు కేశినేని నానితో అదే పెద్ద తిరకాసు.. ఆయన మానాన ఆయన్ను వదిలేస్తే పర్లేదు. విజయవాడ ఎంపీగా తన పనేదో తాను చేసుకుని పోయే రకం. అందరితో పులిహోరా కలుపుకుని పోయే రకం కాకున్నాపెద్దగా ఎవర్నీ ఇబ్బంది పెట్టే తత్త్వం లేకుండా ఉన్నంతలో అలా సాగిపోయే టైప్ నాయకుడు. అలాంటి మనిషిని కేవలం తనకు అలవిమాలిన చంచాగిరి చేయడం లేదని, సొంతంగా, వ్యక్తిగతంగా ఇమేజి బిల్డప్ చేసుకుని వెళ్తున్నాడు అనే కారణం చూపించి తన అనుయాయులు.. ప్రజల్లో ఇమేజి లేని వాళ్ళను పోగేసి చుట్టూరా రౌండప్ చేసి ఆయన్ను తరచూ డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్నారు. విజయవాడ లోకసభ నియోజకవర్గం పరిధిలోని విజయవాడ వెస్ట్ (జలీల్ ఖాన్- బుద్ధా వెంకన్న) సెంట్రల్ (బోండా ఉమా) విజయవాడ ఈస్ట్ (గద్దె రామ్మోహన్) ఇంకా సిటీ పక్కనున్న నందిగామ (తంగిరాల సౌమ్య) నియోజకవర్గాల్లో నానికి ఇబ్బందులు కలిగించేలా చంద్రబాబు ఏర్పాట్లు చేసేసారు. ఈ నాయకులంతా పనిగట్టుకుని ఓ వర్గంలా ఏర్పడి సిట్టింగ్ ఎంపీకి ఇబ్బందులు కలిగించడమే లక్ష్యంగా పని చేస్తుంటారు. నగరంలో ఉంటున్న కేశినేని నానిని కాదని హైదరాబాద్‌లో బిజినెస్ చేసుకుంటున్న ఆయనను తమ్ముడు చిన్నిని విజయవాడ తీసుకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా.. పోటీగా నాయకుడిగా తయారు చేస్తున్నారు. అయినా లెక్క చేయని నాని తన కుమార్తే శ్వేతను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని చూస్తున్నారు. అసలు తండ్రికే విజయవాడలో చోటులేకుండా చేద్దాం అనుకున్న టీడీపీ పెద్దలు ఇప్పుడు ఆయన కూతుర్ని రానిస్తారా? ఖచ్చితంగా రానివ్వరు.. అలాగని నా రాత ఇంతే.. నా ప్రాప్తం ఇంతే అని ఊరుకునే రకం కాదు నాని. తనను ఇబ్బంది పెడుతున్న ఎవరూ నిద్రపోరాదు అనే కాన్సెప్ట్ మీద ఉంటూ విజయవాడ, చుట్టూ ఉన్న నియోజకవర్గాలను కెలుక్కుంటూ పోతున్నారు. మొన్న నందిగామ వైస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావుతో కబుర్లు, కుశల ప్రశ్నలు అయ్యాక ఆయన్ను మెచ్చుకుంటూ రెండు మాటలు చెప్పేసి నందిగామ టీడీపీలోకి ఓ నిప్పు పుల్ల విసిరేశారు. అదిప్పుడు రాజుకుంది. విజయవాడ తెలుగదేశం రాజకీయాలు రోడ్డున పడ్డాయి.గొట్టం గాళ్ళు అందరూ బయటకు వచ్చారు.@JaiTDP @IamBondaUma @kesineni_nani pic.twitter.com/kH8zKmLv9l— varra Raveendra reddy (@varra1987) June 9, 2023 వాస్తవానికి నందిగామ మొదటి నుంచీ కమ్మల ప్రాబల్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం. దేవినేని వెంకట రమణ , ఆయన సోదరుడు దేవినేని ఉమా (ఇద్దరూ టీడీపీలో మంత్రులుగా చేసారు). కానీ ఆ తరువాత అది ఎస్పీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో అక్కడ గతంలో టీడీపీ నుంచి తంగిరాల ప్రభాకర్ (2014-2019) గెలుపొందారు. ఆయన అకాలమరణంతో ఆయన కుమార్తె సౌమ్యను ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా చేశారు. ఆ తరువాత 2019లో మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా(వైఎస్సార్సీపీ) గెలిచారు. అయితే, ఇప్పుడు నాని అక్కడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేతో రాసుకుపూసుకు తిరగడంతో టీడీపీ ఇంచార్జ్ సౌమ్యకు చిరాకు.. చికాకు కలిగింది. దీంతో ఆమె తన అనుచరులతో పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో నానిని నైతికత లేని నాయకుడిగా పేర్కొంటూ పోస్టులు పెట్టిస్తున్నారు. ఇక నాని వర్గం.. ముదురు టెంకలు ఉన్న విజయవాడనే కెలికేసారు.. సౌమ్యను వదులుతారా..? అదే జోరుతో ఆమెను సైతం ట్రోల్ చేస్తూ పోతున్నారు. మొత్తానికి నాని దెబ్బకు నందిగామ టీడీపీలో నిప్పు రవ్వలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: తొంగి చూసినట్లే ఈనాడు రాతలు!..మరి వాటికీ సమాధానాలు చెప్పొచ్చుగా? -
బోండా ఉమపై దేవినేని అవినాష్ ఫైర్
-
కాలకేయులకు నాయకుడు చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ధ్వజ మెత్తారు. అటువంటి కాలకేయులకు చంద్రబాబు నాయకుడని మండిపడ్డారు. విచారణకు రావాలని మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లపై బొండా ఉమ ఇష్టానుసారం మా ట్లాడటంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పం దించారు. కమిషన్ సభ్యులు జి.వెంకటలక్ష్మి, బూసి వినిత, షేక్ రుఖియాబేగంతో కలిసి సోమవారం విజయవాడలో ఆమె మాట్లాడారు. అత్యాచార ఘటనపై టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కమిషన్‌కు వివరణ ఇచ్చే ధైర్యం చం ద్రబాబు, ఉమకు లేదని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. ఈ నెల 27న చంద్రబాబు, ఉమ వచ్చి కమిషన్‌కు వివరణ ఇవ్వాల్సిందేనని.. లేకుంటే తమ పద్ధతులు తమకుంటాయని హెచ్చరించారు. చైర్‌పర్సన్‌గా తన పదవి పోయే వరకు పోరాడతానని చెబుతున్న చిల్లర రౌడీ ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపాడా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఇష్టానుసారం మాట్లాడితే ఉమ చెప్పు దెబ్బలు తినడం ఖాయమన్నారు. -
‘బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నా.. మరీ చిల్లర రౌడీలా..’
సాక్షి, విజయవాడ: విజయవాడ అత్యాచార బాధితురాలి అంశంలో టీడీపీ రాజకీయాలు చేస్తోందని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ మేరకు మహిళా కమిషన్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, సభ్యురాలు జి లక్ష్మి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాసుపత్రిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. ఓ ఆడపిల్లను అడ్డం పెట్టుకుని టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని, అతనికి మహిళలే బుద్ధి చెబుతారని విమర్శించారు. ‘ఈ కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు. బోండా ఉమ వల్ల చంద్రబాబుకు చెడ్డ పేరొచ్చిందని టీడీపీ వాళ్లే తిడుతున్నారు. టీడీపీ వాళ్లే తిడుతుండటంతో బోండా ఫ్రస్టేషన్లో ఉన్నాడు. బోండా ఆకు రౌడీ అనుకున్నా.. కానీ మరీ చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 27న కమిషన్ ముందుకు రావడానికి చంద్రబాబు, బోండా ఉమాకు భయమేంటి. కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం మీకు లేదా.. మహిళా కమిషన్ పదవి ఊడే వరకూ పోరాడతానని బోండా చెబుతున్నాడు. నేను మహిళా కమిషన్ ఛైర్మన్‌గా దిగిపోవడం బోండా ఉమ ఆశయమా. నా పదవి పోయే వరకూ పోరాడమని చంద్రబాబు బోండాకు చీర కట్టి పంపించాడు. బోండా ఉమ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు. చదవండి: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం సమావేశం ఉత్తమ తెలుగుదేశం పార్టీ నారీ బోండా ఉమ. బోండా ఉమ మహిళల పట్ల సోయిలేకుండా మాట్లాడుతున్నాడు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులకు విద్యార్ధి బలైపోతే ఒక్క టీడీపీ నేత వచ్చాడా. వినోద్ జైన్ కేసులో మూడు నెలలైనా స్పందించని దిక్కుమాలిన పార్టీ మీది. ఇష్టానుసారంగా మహిళల పట్ల మాట్లాడితే మహిళలే బుద్ధి చెప్పడం ఖాయం’ అని మహిళా కమిషన్ సభ్యురాలు జి లక్ష్మి హెచ్చరించారు -
మహిళా కమిషన్ నీలాంటి వారికి సుప్రీమే: వాసిరెడ్డి పద్మ
సాక్షి, విజయవాడ: అత్యాచారానికి గురైన మతిస్థిమితంలేని బాధితురాలిని భయాందోళనలకు గురిచేసేలా.. ఘటన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను అగౌరవపరిచేలా దౌర్జన్యం చేసిన మీ తీరు కు సమన్లు ఇవ్వకుండా చప్పట్లు కొట్టాలా?.. అం టూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. విజయవాడ ఆర్ అండ్‌బీ భవనంలోని మీడియా పాయింట్లో ఆమె శనివారం మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాçస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆ పార్టీ నేతలు శుక్రవారం వ్యవహరిం చిన తీరు దారుణమన్నారు. ఇంకా ఏమన్నారంటే.. యుద్ధానికి వెళ్తున్నట్లు కౌరవమూక మాదిరిగా జనాన్ని వేసుకొచ్చి అలజడి సృష్టిస్తే అది పరామర్శ అవుతుందా? బాధితురాలితో ఎలా వ్యవహరించా లో చంద్రబాబుకు తెలీదని నిన్న అర్థమైంది. మన సు, శరీరం గాయమైన బాధిత యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అక్కడ బల ప్రదర్శన చేయటమేమిటి? అవును.. కమిషన్ సుప్రీమే.. మహిళా కమిషన్ ఏమైనా సుప్రీమా? అని బొండా ఉమా ప్రశ్నించడంపై వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ‘అవును బొండా ఉమా లాంటి ఆకురౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమే. చంద్రబాబు హ యాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా, కంటితుడుపుగా నడిపి ఉండొచ్చేమో.. కా నీ, మహిళా కమిషన్‌కు ఉండే హక్కులు, కమిషన్ శక్తి ఏమిటో అర్థమైన తర్వాత వారికి దిమ్మతిరిగి బొమ్మ కనబడుతోంది. నేను ఇప్పుడు కోట్లాది మం ది మహిళలకు బాధ్యురాలిని. చంద్రబాబు, ఉమా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే కమిషన్ తలవంచుకోదు. ఈ నెల 27న వారిద్దరూ కమిషన్ ఎదుట హాజరుకావాల్సిందే. చేసిన తప్పుకు క్షమాపణలు అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు’. లోకేశ్.. మీ నాన్నను అడుగు ‘బాధిత మహిళలపట్ల ఎలా వ్యవహరించారో మీ నాన్నను అడుగు లోకేశ్.. రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని.. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా లోకేశ్ తన తండ్రిని అడగాలి. బాధితులపట్ల, మహిళా కమిషన్ పట్ల రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలో తెలియజెప్పేందుకే విచారణకు రావాలని చంద్రబాబుకు, ఉమాకు సమన్లు ఇచ్చాం’.. అని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. సమన్లు అందజేత మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు శనివా రం మహిళా కమిషన్ సమన్లు అందజేసింది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి కమిషన్ సిబ్బంది వెళ్లి వాటిని అందజేశారు. అదేవిధంగా విజయవాడలోని బొండా ఉమా ఇంటికి వెళ్లి అందజేశారు. 22వ తేదీ శుక్రవారం ప్రభుత్వాసుపత్రిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను బాధితురాలి తో మాట్లాడనివ్వకపోగా.. ఆమెను బెదిరించేలా వ్యవహరించడంపై ఏపీ మహిళా కమిషన్ యాక్ట్–1998లోని సెక్షన్ 15(1) ప్రకారం ఈ నోటీసులు అందచేస్తున్నామని ఆ సమన్లలో పేర్కొన్నారు. పోలీసు కమిషనర్‌తో భేటీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో వాసిరెడ్డి పద్మ ఆయన కార్యాలయంలో శనివారం భేటీ అయ్యారు. కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. అంతకుముందు.. ప్రభుత్వాసుపత్రిలో బా«ధిత యువతిని పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆస్పత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శనివారం డిశ్చార్జి చేశారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో ఏఆర్ఎంఓ డాక్టర్ శిరీష ఆమెను తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటికి పంపారు. ఆమెపై మేమూ ఫిర్యాదు చేస్తాం : బొండా ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం నా వెంట్రుక కూడా పీకలేదు’ అంటూ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యానించారు. మొగల్రాజపురంలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు, తనకు సమన్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి నోటీసులకు తాము భయపడబోమని, వాసిరెడ్డి పద్మపై తాము కూడా జాతీయ మహిళా కమిషన్‌కు, హైకోర్టుకు, చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. చదవండి: (విశాఖలో జాబ్‌మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి) -
బాబు అండ్ బ్యాచ్ గూండాగిరి: మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పై దాడి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టీడీపీ నేతలు గూండాగిరికి తెగబడ్డారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాక, బాధితురాలిని పరామర్శిస్తున్న సమయంలో ఆమెపై టీడీపీ మహిళలు వీరంగం సృష్టించారు. ఇక మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అయితే చంద్రబాబు సమక్షంలోనే ‘నో ర్ముయ్’ అంటూ పద్మపై తిట్ల పురాణం అందు కున్నారు. టీడీపీ దాష్టీకానికి అత్యాచార బాధితురాలితో పాటు, ఆస్పత్రి సిబ్బంది సైతం భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ నేతల అరుపులు, కేకలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. వివరాలివి.. రెండ్రోజుల కిందట విజయవాడ వాంబే కాలనీకి చెందిన బుద్ధిమాంద్యం యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడగా, ప్రస్తుతం ఆ యువతి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలిని పరామ ర్శించేందుకు శుక్రవారం మ.12 గంటల సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. ఆమెను ఆస్పత్రిలోకి వెళ్లనీయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నేతృత్వంలో మహిళా నాయకురాలు పంచు మర్తి అనురాధ తదితరులు అడ్డుకుని దాడికి యత్నించారు. బాధితురాలిని పరామర్శించి, ఆమెకు అండగా ఉండేందుకు వస్తే అడ్డు కోవడం ఏమిటంటూ వారిని తోసుకుంటూ అతికష్టం మీద వాసిరెడ్డి పద్మ ఆస్పత్రిలోకి వెళ్లారు. బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరా మర్శిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో భయభ్రాంతులకు గురిచేస్తూ దాడిచేశారు. ఇలా దాదాపు అర గంటపాటు పంచుమర్తి అనురాధ, బొండా అనుచర గణం దౌర్జన్యకాండ కొనసాగింది. చంద్రబాబు సమక్షంలోనే వీరంగం ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శిస్తున్న సమయంలోనే చంద్రబాబు అక్కడకు రావడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అప్పటిదాకా ఓ పక్కన నిల్చున్న టీడీపీ కార్యకర్తలను బొండా ఉమా రెచ్చగొట్టారు. బాధితురాలిని పరామర్శించడానికి వస్తే ఆమెతో మాట్లాడే అవకాశం ఇవ్వరా? అంటూ బొండా ఉమా అరిచారు. పక్కకు తొలగాల్సిందిగా ‘ఏయ్.. లే..’ అంటూ వాసిరెడ్డి పద్మను గద్దించారు. చంద్రబాబు సైతం పద్మతో ‘మీరిప్పుడు ఎందుకొచ్చారు’.. అంటూ బెదిరిస్తున్నట్లు మాట్లాడారు. దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో బాధితురాలిని పరామర్శించే బాధ్యతగా వచ్చానని, టీడీపీ నేతల్లా నీచరాజకీయాలు చేయడానికి మందిని వెంటబెట్టుకుని రాలేదని ఆమె చంద్రబాబుకు దీటుగా బదులిచ్చారు. నోరుపారేసుకున్న బాబు, బొండా మీకు ఇది పద్ధతి కాదని, రాజకీయాలు ఏమై నా ఉంటే బయట మాట్లాడుకుందామని, బా ధితురాలి దగ్గర ఇలా ప్రవర్తించవద్దని వాసి రెడ్డి పద్మ చంద్రబాబుకు, వారి నాయకులకు చెప్పారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ‘నువ్వేంటి చెప్పేది’ అంటూ పెద్ద గా అరిచారు. పక్కనే ఉన్న బొండా ఉమా సై తం నోర్ముయ్ అంటూ నోరు పారేసుకోవడం తో మళ్లీ టీడీపీ మహిళలు అరుపులు కేకలతో వీరంగం వేశారు. తన సమక్షంలోనే మహిళపై తమ నాయకులు అలా ప్రవర్తిస్తున్నా, చంద్ర బాబు కనీసం వారించకుండా, రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపట్ల అక్కడ ఉన్న వారంతా విస్మయానికి గురయ్యారు. ఇక చంద్రబాబు పరామర్శించి వెళ్లగానే ‘మేం ఇక్కడ ఉండలేం.. మా ఇంటికి పంపించేయండి’.. అంటూ బాధితురాలు భయంతో వాసిరెడ్డి పద్మను చుట్టేసుకుంది. బాధిత కుటుంబీకులే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో ప్రత్యేకంగా మాట్లాడతామని కోరడంతో చేసేది లేక టీడీపీ శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో తాను వచ్చిన ఉద్దేశం నెరవేరలేదన్న భావన తో చంద్రబాబు పోలీసులపై చిందులేశారు. అక్కడే ఉన్న పోలీసు కమిషనర్ కాంతిరాణా తో మాట్లాడి తనకు బాధితురాలితో మాట్లాడే అవకాశమిస్తే కొద్దిసేపు ఉండి వెళ్లిపోతానని చెప్పారు. మరోవైపు.. అక్కడ వాతావరణాన్ని చూపిస్తూ ఏయ్.. ఓయ్, అంటూ గుడ్లురిమి కేకలేస్తే భయపడతానా? ఇదేనా మీ రాజకీయం? బూతులు తిట్టమని మీ నేత ఉసిగొల్పుతారా? మీరు ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా? అంటూ పద్మ చంద్రబాబుపై మండిపడ్డారు. అనంతరం చంద్రబాబు బాధితురాలితో మాట్లాడి అక్కడ నుంచి నిష్క్రమించారు. టీడీపీ నేతల విధ్వంసం ఇక ప్రభుత్వాస్పత్రిలోని మాత శిశు విభాగం లోపలికి వెళ్లే దారి వద్ద అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. .జఅంతేకాక.. అక్కడున్న గ్రిల్స్‌ను సైతం పీకేసి భయానక వాతావరణం సృష్టించారు. టీడీపీవి నీచ రాజకీయాలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలే కానీ, బాధితురాలి సమక్షంలో అరుపులు, కేకలతో రాజకీయం చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఒక గుంపుగా కొంతమంది అవారా బ్యాచ్ వచ్చి అరాచకం సృష్టించారన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధితురాలికి అండగా ఉండేందుకు, పరామర్శించేందుకు వస్తున్న తనను అడ్డుకుంటే, అతి కష్టమ్మీద లోపలికి రావాల్సి వచ్చిందన్నారు. వెనకే ఒక గుంపులా వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాతైనా, వారిని వారిస్తారనుకుంటే ఆయన కూడా అలాగే ప్రవర్తించడం టీడీపీ నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. బొండా ఉమా బెదిరింపులకు ఎవరూ బెదిరేదిలేదని, ఇది మహిళల ప్రభుత్వమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యాచార ఘటన విషయం తెలియగానే సీరియస్‌గా స్పందించారన్నారు. బాబు నాడు–నేడు 04–5–2018న.. మనుషులకు భయం ఉండాలి. భయం లేకపోతే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో పోలీసును పెట్టలేం. నేను అందుకే హెచ్చరిస్తున్నా.. భవిష్యత్తులో ప్రతిఒక్క పోలీసు, సిటిజన్ గుర్తుపెట్టుకోవాల్సింది. క్రమశిక్షణ, లా అబైడింగ్ (చట్టానికి కట్టుబడి) ఉండాల. 22–4–2022న.. ఆడబిడ్డలకు రక్షణ లేకుండాపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో శాంతిలేకుండా ఉండే పరిస్థితికి వస్తోంది. దీన్ని అందరం కూడా సీరియస్‌గా తీసుకోవాలి్సన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి్సంది.. ఒక పేద బాధితురాలకు న్యాయం చేయాలి. మీకు సిన్సియారిటీ ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే ఒక స్పెషల్ కోర్టు వేయండి. నీతి, నిజాయితీ ఉంటే నిరూపించుకోండి. వెయ్యకపోతే ఏం చేయాలో దీన్ని ఇక్కడ వదిలిపెట్టం. ఎట్టిపరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. బాబు, బొండాకు మహిళా కమిషన్ సమన్లు అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడంపై కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పలువురు నేతలు వాసిరెడ్డి పద్మను ఇష్టానుసారంగా దూషించడం, అత్యాచార బాధితురాలి వద్ద రాజకీయం చేయడం తదితర పరిణామాలను తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా రావాలని వాసిరెడ్డి పద్మ ఆ సమన్లలో ఆదేశించారు. చదవండి👉 మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి -
రోడ్డునపడ్డ బెజవాడ టీడీపీ నేతలు
-
రోడ్డునపడ్డ బెజవాడ టీడీపీ నేతలు
సాక్షి, విజయవాడ: బెజవాడ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటన గురించి మాకు కనీసం సమాచారం ఇవ్వరా?. రూట్ మ్యాప్ మార్చడానికి కేశినేని ఎవరని వారు ప్రశ్నించారు. ‘చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే.. మేం పాల్గొనం. మాకు ఏ గొట్టం గాడు అధిష్టానం కాదంటూ’ వారు నిప్పులు చెరిగారు. ‘‘టీడీపీని కుల సంఘంగా మార్చాలని కేశినేని అనుకుంటున్నారా?. దమ్ముంటే కేశినేని ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలవాలి. కేశినేని చెప్పుచేతల్లో బీసీలు బతకాలా?. కేశినేని నాని చేసేవన్నీ చీకటి రాజకీయాలు. రంగా హత్య కేసు నిందితులందరూ కేశినేని వెంటే ఉన్నారంటూ’’ బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా విమర్శలు గుప్పించారు. కాగా, విజయవాడలోని ముఖ్య నాయకులు రెండు వర్గాలుగా వ్యవహరిస్తున్నారు. కేశినేని శ్రీనివాస్‌కు గద్దె రామ్మోహన్ వెంట ఉంటున్నారు. బొండా, బుద్దా, నాగుల్‌మీరా, పట్టాభి తదితరులు పూర్తిగా దూరమయ్యారు. బీసీ వర్గానికి చెందిన గుండారపు హరిబాబు కుమార్తె పూజితకు ఇచ్చిన టిక్కెట్‌ను కేశినేని నాని మార్చేశారు. ఈ విషయమై బుద్ధా, మీరాలు పట్టుపట్టినా ఎంపీ ససేమిరా అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన కొట్టేటి హనుమంతరావు భార్య టికెట్ విషయంలోనూ అదే జరిగింది. పేదసామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇప్పించుకోలేకపోయినట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు, జాతీయ కార్యదర్శి కూడా అయిన వర్ల రామయ్య తన అనుచరవర్గం వద్ద అంతర్గత చర్చల్లో వాపోయినట్లు సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. చదవండి: ఔను.. మళ్లీ ‘వాళ్ల మాటే’ నెగ్గింది తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ.. -
నారా లోకేష్‌కు లీగల్ నోటీసు
సాక్షి, ప్రకాశం: తనపై తప్పుడు ప్రచారం చేసిన మీడియా చానళ్లు, టీడీపీ నాయకులకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం లీగల్ నోటిసులు పంపారు. తమిళనాడులో తనకుసంబంధించిన డబ్బు దొరికిందంటూ టీవీ5, న్యూస్18 మీడియాల్లో ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనపై లేనిది కల్పించి తప్పుడు వార్తలను ప్రచారం చేయింటారంటూ మంత్రి బాలినేని టీడీపీ నాయకులైన నారా లోకేష్, బొండా ఉమా, కొమ్మరెడ్డి పట్టాభిలతో పాటు టీవీ5, న్యూస్-18 ఛానళ్లకు ఆయన లీగల్ నోటీసులు పంపి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, తమిళనాడులో గత నెలలో పోలీసులకు పట్టుబడ్డ 5 కోట్ల రూపాయల నగదు మంత్రి బాలినేనిదేనని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా చానళ్లు అసత్య ప్రచారం చేశాయి. పట్టుబడ్డ 5 కోట్ల రూపాయాలు తమవేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు ప్రకటించినా పట్టించుకోకుండా పదేపదే టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి బాలినేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. (ఎవరికీ సంబంధం లేదు.. ఆ 5 కోట్లు మావే) -
ఆఫీసు బాయ్ అయినా, మరెవరైనా రెడీ..
సాక్షి, రాయచోటి: మాజీమంత్రి నారా లోకేష్ కంటే టీడీపీ ఆఫీస్ బాయ్‌లకే ఎక్కువ జ్ఞానం ఉంటే వారితోనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో కుప్పం ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ అందిన సంక్షేమ ఫలాల మీద చర్చకు రావాల్సిందిగా చంద్రబాబు, లేదా ఆయన కొడుకుని కుప్పం రావాల్సిందిగా నేను కోరాను. ఇందుకు సమాధానంగా బోండా ఉమ తమ తరఫు నుంచి టీడీపీ ఆఫీసు బాయ్‌లను పంపుతాం అన్నారు. ఆఫీసు బాయ్‌లైనా, రోజు కూలీలైనా మరెవరైనా వారందరి మీదా మాకు గౌరవం ఉంది. (‘చర్చకు బాబు రాకుంటే లోకేష్‌ను పంపండి’) డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను గౌరవించే వ్యక్తులం. నేను మరోసారి చంద్రబాబును అడుగుతున్నాను. ఆయన ఐదేళ్ళ పాలనకన్నా.. మా ఏడాది పాలనలో పేదలకు, రైతులకు, మహిళలకు, అన్ని సామాజిక వర్గాలకు మెరుగైన న్యాయం జరిగిందని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. మీరు కుప్పం రమ్మంటే వస్తా. లేదంటే మీ వాడు ఓడిన మంగళగిరిలో అయినా మీ తనయుడితో చర్చకు వస్తా. ప్రభుత్వ చీఫ్ విప్ని అయినా.. ఒక సామాన్యుడ్ని కాబట్టి ఎమ్మెల్యేగా ఓడిన మీ తనయుడితో కూడా చర్చకు రావటానికి నేను సిద్ధంగా ఉన్నాను. విషయం మీద అవగాహన, నారా లోకేష్ కంటే మీ ఆఫీసు బాయ్‌లకే ఎక్కువ ఉందని మీరు ప్రకటిస్తే.. వారితోనైనా చర్చకు నేను సిద్ధం’ అని స్పష్టం చేశారు. (మై డియర్ పప్పూ అండ్ తుప్పూ!) -
బోండా ఉమ, వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నాం
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఏదో జరిగినట్లు ప్రచారం చేయొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. నిర్దిష్టమైన సమాచారం ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విజయవాడలో శనివారం డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఏపీ పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. (వీడియోలు తీయండి.. గొడవ చేయండి ) ఆమె చుట్టూ ఉన్నది టీడీపీ నేతలే.. అలాగే చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సంఘటనపై డీజీపీ స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలతో పాటు, ఆయన చూపించిన వీడియోపై డీజీపీ వివరణ ఇచ్చారు. మహిళా అభ్యర్థి చుట్టు ఉన్నది టీడీపీ నేతలే అని, నామినేషన్ ఎవరో దౌర్జన్యంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. (ఆడలేక మద్దెల ఓడు) ఎన్నికల నిర్వహణకు మానిటరింగ్ సెల్ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా 35 సంఘటనలు జరిగాయని, జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా 43 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల నామినేషన్లలో 14 ఫిర్యాదులు వచ్చాయని, ఆ ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించారన్నారు. కేవలం ఎనిమిది సంఘటనల్లో మాత్రమే 307 సెక్షన్ కింద కేసులు నమోదు అయినట్లు డీజీపీ తెలిపారు. అలాగే ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని, ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. (కాషాయ పవనం.. సైకిల్‌పై పయనం) రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ పోలీసుల దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటివరకూ పోలీసుల తనిఖీల్లో రూ.కోటి 84 లక్షల నగదు సీజ్ చేశామని, రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 25 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, 701 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిఘా యాప్ ద్వారా విజయవాడలో 12 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. (కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేసిన జేసీ!) రికార్డు స్థాయిలో... ఆపరేషన్ సురా 1,1386 బైండోవర్ కేసులు నమోదు చేశామని, అలాగే 10,980 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోసం 59,549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నామని, జెడ్పీ, ఎంపీపీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వద్ద 27,735 మంది, సమస్యాత్మక ప్రాంతాల్లో 4,399 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సురా పేరుతో రికార్డు స్థాయిలో నాటు సారా స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ జరిగేవని, ఈసారి అలా జరగకుండా చూడబోతున్నామన్నారు. అభ్యర్థులు మద్యం, డబ్బుతో పట్టుబడితే అనర్హలు అవుతారంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. (డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు హైడ్రామా) వాళ్ల కాల్‌డేటా పరిశీలిస్తున్నాం.. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమాచర్ల ఎందుకు వెళ్లారో..అక్కడి నుంచి విజయవాడకు ఎలా వచ్చారో విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మాచర్లలో ఘటన జరిగితే అక్కడి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అన్నారు. వాస్తవాలను పక్కదారి పట్టించి వక్రీకరిస్తున్నారని, మాచర్ల ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారన్నారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్న కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. వాళిద్దరూ ఎందుకు మాచర్ల వెళ్లారు, ఎప్పుడు పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారనే దానిపై స్పష్టత లేదన్నారు. దీనిపై బోండా ఉమ, బుద్ధా వెంకన్న తమకు స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నారు. (అల్లర్లకు పన్నాగం) -
అల్లర్లకు పన్నాగం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇవ్వలేక అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్కడక్కడ చిల్లర గొడవలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వాటినే ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపించి మరింత రాద్ధాంతం సృష్టిస్తుండడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయి తిరిగి పుంజుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో సహజంగా ఉండే రాజకీయ కక్షలను రెచ్చగొడుతున్నట్లు స్పష్టమవుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన చంద్రబాబు.. ప్రజలను ఏమార్చేందుకు, ఓటమికి సాకులు చెప్పుకునేందుకే వ్యూహాత్మకంగా ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆయనన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన సంఘటన కూడా ఇందులో భాగమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన పిన్నెల్లి కారు అనవసర రాద్ధాంతానికే బొండా, బుద్ధా మాచర్లకు.. గుంటూరు జిల్లా పల్నాడులోని వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బోదిలవీడులో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై సోమవారం రాత్రి దాడిచేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్దేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చంద్రబాబు చూశారు. కానీ, మార్గమధ్యంలో మాచర్ల వద్ద టీడీపీ నేతల వాహనం వికలాంగుడ్ని ఢీకొట్టింది. ఈ ఘటనతోనే అక్కడ ఘర్షణ తలెత్తిందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక గ్రామంలో జరిగిన చిన్న గొడవపై విజయవాడ నుంచి భారీఎత్తున నాయకులను పంపాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకు టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని పిన్నెల్లి డిమాండ్ చేశారు. రాద్ధాంతం సృష్టించే వ్యూహంతోనే వారు బయలుదేరినట్లు ఆయన స్పష్టంచేశారు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల గ్రామంలో నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులను టీడీపీ నేతలు వీడియో తీస్తూ ధూషించడంతో ఘర్షణ జరగ్గా దానిపైనా హంగామా సృష్టించారు. మొత్తంగా ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండురోజుల్లో ఐదారుకు మించలేదు. 13 జిల్లాల్లో మిగిలిన చోట్ల ఎక్కడా ఘర్షణ వాతావరణం లేకపోయినా తాను సృష్టించిన ఈ చిన్న ఘటనల్ని ఎల్లో మీడియా ద్వారా భూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు శాంతిభద్రతల సమస్యగా ప్రచారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలపైనే దాడులు : గోపిరెడ్డి టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో తమపై ఇంతకంటే పెద్దఎత్తున దాడులు జరిగాయని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలపైనే దాడులు చేసిన ఉదంతాలున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తుల్ని బలవంతంగా ఎత్తుకెళ్లిన సందర్భాలున్నాయని వివరించారు. కానీ, ఇప్పుడా వాతావరణం రాష్ట్రంలో ఎక్కడాలేదని.. కేవలం టీడీపీ వాళ్లు అక్కడక్కడ సృష్టించిన చిల్లర గొడవలు తప్ప స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ చెబుతోంది. కీలక నేతల గుడ్బైతోనే ఇలా : బొత్స ఇక అన్ని వర్గాల ఆదరణను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి గ్రామాల్లో హీనంగా మారిపోవడంతో ప్రజలను ఏమార్చేందుకు ఇవన్నీ చేస్తున్నట్లు మంత్రి బొత్స స్పష్టంచేశారు. ఎన్నికల వేళ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కీలక నాయకులు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం టీడీపీకి ఏమాత్రం మింగుడుపడడంలేదు. ఉదా.. – డొక్కా మాణిక్యవరప్రసాద్, కదిరి బాబూరావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, సతీష్‌రెడ్డి వంటి ముఖ్య నాయకులు పార్టీకి వరుసగా రాజీనామా చేయడం.. మరికొందరు అదేబాటలో ఉన్నట్లు తెలియడంతో చంద్రబాబుకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. – అనేకచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎంపీటీసీలు,సర్పంచ్ స్థానాల్లో అభ్యర్థుల కోసం వారు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. – సగానికిపైగా జిల్లాల్లో జెడ్పీ ఛైర్మన్ అభ్యర్థులు లేకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దంపడుతోంది. – అనేకచోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ముఖ్య నాయకులు అస్త్ర సన్యాసం చేయడంతో పార్టీని నడిపించే నాథుడే కనిపించడంలేదని చెబుతున్నారు. – క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీని ఎదుర్కొనే బలం కోల్పోయి ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్లు సైతం పోటీచేయలేమని చేతులెత్తేస్తున్నట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. – ఇక పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్కపోతే.. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పోటీచేయడానికి ముందుకొచ్చిన వారికి మద్దతిస్తామని స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రకటించడం.. టీడీపీ పతనావస్థకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎస్ అధికారిపై దాడిచేసిన వారితో స్క్రీన్‌ప్లే విజయవాడలో నడిరోడ్డు మీద ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం (అప్పటి రవాణా కమిషనర్) మీద దాడిచేసిన బొండా ఉమ (అప్పటి ఎమ్మెల్యే), ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను మాచర్లకు పంపించడానికి చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉన్న వారిద్దరూ అనవసరంగా మాచర్లకు బయల్దేరి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. అది చూసి ఆవేశంతో ప్రశ్నించడానికి వచ్చిన స్థానికులతో దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగక.. ఆ ప్రమాదానికి రాజకీయ రంగు పులిమి లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. బొండా, బుద్ధా గత చరిత్ర కూడా వివాదాస్పదం కావడం తెలిసిందే. రాష్ట్రమంతా అదే కుట్ర ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లోనూ స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి టీడీపీ ప్రయత్నించింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం, పెదపూడి, చిత్తూరు జిల్లా పుంగనూరు, చంద్రగిరి, గుంటూరు జిల్లా దాచేపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తదితర చోట్ల కూడా ఇదే తరహాలో కుట్రను అమలుచేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారు. పూర్తిస్థాయి నివేదికకు డీజీపీ ఆదేశం గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం జరిగిన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌రావును ఆదేశించారు. దీంతో ఐజీ మాచర్లకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఐజీ వెంట గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు కూడా ఉన్నారు. జరిగిందిదీ.. ► సోమవారమే టీడీపీ దాడి.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో సోమవారం రాత్రి టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేశారు. ► బెజవాడ నుంచి టీడీపీ నేతలు బోదిలవీడులో జరుగుతున్న గొడవలను పెద్దవి చేసి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఒక పథకం ప్రకారం బుధవారం విజయవాడ నుంచి నాయకులు భారీ సంఖ్యలో వాహనాలలో అక్కడకు బయల్దేరారు. ► మాచర్లలో యాక్సిడెంట్.. విజయవాడ నుంచి వస్తున్న టీడీపీ నాయకుల వాహనాలలో ఒకటి మాచర్లలో ఒక దివ్యాంగుడిని ఢీకొట్టడంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ► దుర్భాషలాడడంతో ఘర్షణ.. దివ్యాంగుడు గాయపడినా ఏ మాత్రం బాధ లేకపోగా.. దుర్భాషలాడడంతో స్థానికులు దాడిచేశారు. కార్లలోని వారు ఏపార్టీ వారనేది కూడా స్థానికులకు తెలియదు. ► బాబు హైడ్రామా.. ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి టీడీపీ విమర్శలు మొదలుపెట్టింది. ఫిర్యాదు చేసే పేరుతో డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ బయటే బాబు బైఠాయించారు. -
ఉమా నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత బోండా ఉమా సవాల్‌పై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీటుగా స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘పల్నాడు ప్రజలను బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు కాదని బోండా ఉమా తెలుసుకోవాలి. విజయవాడ గల్లీలో రౌడీయిజం చేసినట్లు పల్నాడులో చేస్తామంటే కుదరదు. మాచర్ల మళ్లీ వస్తానని సవాల్ చేయడం కాదు, దమ్ముంటే రావాలి. లేదా నన్ను విజయవాడ రమ్మన్నా వస్తా. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నేను భయపడలేదు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తే సహించేది లేదు. ఈ విషయంలో ఎక్కడదాకా వెళ్లడానికి అయినా నేను సిద్ధంగా ఉంటా. ఎవరినీ ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేశారు. (కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి) గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడు గ్రామంలో జరిగిన చిన్న గొడవను పెద్దది చేసి హంగామా సృష్టించేందుకు విజయవాడ నుంచి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరికొందరిని చంద్రబాబు అక్కడికి పంపించినట్లు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. (బోండా ఉమా, బుద్దా వెంకన్నకు మాచర్లలో ఏంటి పని?) కాగా బోదిలవీడులో రెండు వర్గాల కొద్దిరోజులుగా గొడవలు జరుగుతుండగా, టీడీపీ నేతలు సోమవారం రాత్రి వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారు. దానిపై మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించడంతో నామినేషన్లు వేసే సమయంలో గొడవ జరిగింది. దాన్ని మరింత పెద్దది చేసే ఉద్ధేశంతో విజయవాడ నుంచి నాయకులు, కార్యకర్తలను బుధవారం బోదిలవీడుకు పంపి ఉద్రిక్తత సృష్టించాలని చూడగా మార్గమధ్యలో మాచర్ల వద్దే స్థానికంగా జరిగిన ప్రమాదంతో ఘర్షణ జరిగింది. (స్థానిక ఎన్నికల్లో నీ సత్తా చూపించు !) -
టీడీపీ నాయకుల హంగామా!
సాక్షి, విజయవాడ: మూడు రాజధానులు వద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు మంగళవారం విజయవాడలో హంగామా సృష్టించారు. వీరి హడావుడి వల్ల పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వేదిక కళ్యాణమండపంలో చేపట్టిన 24 గంటల దీక్షను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. అనంతరం చినకాకానిలో చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధనంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడులతో కలిసి వారు బయలుదేరారు. బెంజ్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నారా లోకేష్, కొల్లు రవీంద్ర, రామానాయుడులు ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో పోలీసులు లోకేష్‌ను తొట్లవల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధా పోలీసుస్టేషన్ వద్దకొచ్చి ధర్నా చేశారు. పోలీసులను తిట్టిపోసిన బొండా ఉమా చినకాకాని వద్ద హంగామా సృష్టించడానికి బయలుదేరిన ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా బొండా ఉమా ఓ ఎస్ఐతో దురుసుగా వ్యవహరించారు. ‘నోరు మూసుకో.. ఖాకీ చొక్కాను ఎలా విప్పదీయించాలో నాకు తెలుసు’ అంటూ నోరు పారేసుకున్నారు. నిరసన తెలిపేందుకు మాత్రమే అనుమతి తీసుకుని మాజీ మంత్రి దేవినేని ఉమా కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై హైడ్రామా సృష్టించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేపట్టిన 24 గంటల దీక్షకు స్పందన కరువైంది. -
ఆ రూబీ విలువ 50 రూపాయలు: టీటీడీ
సాక్షి, తిరుమల : ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే స్వామి వారి ఆభరణాలు ప్రదర్శిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. స్వామివారి ఆభరణాలు ఒక్కగ్రాము కూడా పక్కదారి పట్టలేదని తెలిపారు. వందల ఏళ్ల క్రితం నాటి ప్రాకారాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందునే మరమత్తులు చేపట్టామని పేర్కొన్నారు. పోటు మరమత్తుల్లో భాగంగా ఫైర్ బ్రిక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. అపవాదు వేయడం మంచిది కాదు: టీటీడీ చైర్మన్ పోటులో తవ్వకాలు జరగడం అవాస్తమని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. బొక్కసానికి సంబంధించి మూడు తాళాలు ఉంటాయని.. ఈ మూడు తాళాలు సంబంధిత మూడు విభాగాల వారి వద్ద ఉంటాయని తెలిపారు. సీక్రెట్ లాక్ వల్ల పూర్తి స్థాయి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఆభరణాలను రికార్డు ప్రకారమే పరిశీలించాం గానీ పూర్తిస్థాయిలో తనిఖీ చేయలేదని ఆయన తెలిపారు. స్వామివారి ఆభరణాల్లోని రూబీ ఒకటి విరిగిపోయిందని.. దాని విలువ 50 రూపాయలుగా నమోదు చేసి ఉందని పేర్కొన్నారు. పూర్వకాలంలో స్టీల్ రాడ్స్ లేనందువల్లే ప్రాకారాలు బలహీన పడ్డాయని అందుకే మరమత్తులు చేపట్టామన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రమణ దీక్షితులు అపవాదు వేయడం మంచిది కాదని, ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. -
కార్పొరేటర్‌పై ఎమ్మెల్యే పీఏ వేధింపులు..
సాక్షి, విజయవాడ: టీడీపీ నీచ రాజకీయాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతున్నాయని వైఎస్సార్ సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ ఓ మహిళా కార్పొరేటర్ పైనే టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా పీఏ వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో మహిళలకు రక్షణ కరువైందనడానికి ఇంతకన్నా నిదర్శమేముందని అన్నారు. కార్పొరేటర్‌ను వేధింపులకు గురి చేయడమే కాకుండా, విషయం బయట పెట్టకుండా ఎంపీ నాని సెటిల్మెంట్కు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆరోపణలు వచ్చిన వ్యక్తిని విధుల నుంచి తొలగించకుండా వారికి వంతపాడుతున్న టీడీపీ నాయకులకు మహిళలే బుద్ధి చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే పీఏపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, వేధింపులను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ తీరును ఎండగడతామన్నారు. -
బోండా ఉమ భూకబ్జా ఎపిసోడులో కీలక మలుపు!
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుటుంబం భూకబ్జా ఎసిసోడులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ భూభాగోతంపై ఫిర్యాదు చేసిన బాధితుడు కేసిరెడ్డి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు ఆర్డీవో విచారణ చేపట్టనున్నారు. ఈ నెల 24న విచారణకు హాజరై బోండా ఉమపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఈ మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. -
సోము వీర్రాజుకు బోండా కౌంటర్
సాక్షి, విజయవాడ : టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కౌంటర్ ఇచ్చారు. ఏపీకి కేంద్రం సాయంపై సోము వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమని, అంతేకాకుండా ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎప్పుడు ఎదగలేదని ఆయన అన్నారు. భవిష్యత్‌లో బీజేపీ ఎదుగుతుందని అనుకోవడం వాళ్ల అత్యాశేనని బోండా ఉమా వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు ఒంటరిగా రాజమండ్రిలో పోటీ చేస్తే కౌన్సిలర్‌గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేస్తే 15 లక్షల ఓట్లకు కేవలం 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయని బోండా ఉమా గుర్తు చేశారు. ఏపీకి అన్ని ఇచ్చాం, ఇన్ని ఇచ్చామని చెబుతున్నారని, 2016లో అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి అన్న రాష్ట్రానికి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిని జిల్లాలకు బుదేల్ ఖండ్, కలహాండి ప్యాకేజీ తరహాలో ఇస్తామన్నారని అవన్నీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రూ.24వేల కోట్లకుగానూ కేంద్రం కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర రాజధానికి రైతులు రూ.50వేల కోట్లు విలువ చేసే భూమి ఇస్తే బీజేపీ రూ.1500కోట్లు ఇచ్చిందని బోండా ఉమా అన్నారు. వాటితో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత ఎజెండాతోనే సోము వీర్రాజు పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ...టీడీపీని మోసం చేసిందని అయిదు కోట్ల ప్రజలు అంటున్నారని, వారికి సోము వీర్రాజు సమాధానం చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. కాగా ఏపీ రాజధాని నిర్మాణం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం..రూ.16వేల కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
‘టీడీపీ భూకబ్జాలపై సీబీఐ దర్యాప్తు జరపాలి’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా సాగుతున్న భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, మంత్రి దేవినేని ఉమ భూకబ్జాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సిట్ల పేరుతో కాలయాపన చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం భూకబ్జాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. -
విజయవాడలో మరో భూ బాగోతం
-
విజయవాడలో మరో భూ బాగోతం
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ భూ కబ్జా బాగోతం మరిచిపోకముందే.. మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్ఆర్ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కబ్జాకు గురైంది. దీంతో భూకబ్జాకు నిరసనగా మంగళవారం కాలేజీ విద్యార్థులు నిరసనకు దిగారు. అక్రమణకు గురైన స్థలంలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆక్రమణకు గురైన స్థలంలో ఉన్న బోర్డులు, జెండాలను విద్యార్థులు పీకేశారు. ప్రోక్లైన్లతో స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. బొండా ఉమ అండతోనే రూ. 300 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలేజీ స్ధలాన్ని అప్రగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో బీఆర్టీఎస్ రోడ్డులో భారీగా పోలీసులు మొహరించారు. -
పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలి
-
పార్టీ మారిన నేతలపై అనర్హత వేటు వేయాలి
-
మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని తెస్తే...
సాక్షి, అమరావతి : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన బుధవారం అమరావతిలో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి గెలిచి హుందాగా సభలోకి రావాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లేకపోతే ఏ పార్టీ గుర్తుపై గెలిచినా... మంత్రులు కావచ్చనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడితే బాగుంటుందని విష్ణుకుమార్‌రాజు చమత్కరించారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమే... మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు.. మంత్రులుగా కొనసాగడం అనైతికం అన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా పరిగణిస్తున్నాం. వాటికి విలువలేదు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే టీడీపీలోకి వచ్చారు. వారి రాజీనామాల అంశం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉంది. శాసనసభ వ్యవస్థలో స్పీకర్‌దే తుది నిర్ణయం. ఉప ఎన్నికలకు ఆ నలుగురు మంత్రులు సిద్ధంగా ఉన్నారు. మిత్రపక్షంగా ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదు. ఇరు పార్టీల రాష్ట్ర, జాతీయ అద్యక్షులు చూసుకుంటారు. వారు స్పందిస్తేనే పార్టీ ప్రకటనగా భావిస్తాం. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు అని అన్నారు. -
బెజవాడలో రౌడీషీటర్ హత్య
విజయవాడ/తెనాలిరూరల్: విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు హత్యా రాజకీయాలకు దారితీశాయి. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడు, పేరుమోసిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బును ప్రత్యర్థులు బుధవారం పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపారు. అతనికి టీడీపీ విజయవాడ తెలుగు యువత అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీనుతోనూ, తెనాలిలో పాత ప్రత్యర్థులతోనూ దీర్ఘకాలంగా విభేదాలున్నాయి. పక్కా పథకంతోనే.. అయ్యప్ప మాలధారణలో ఉన్న రౌడీషీటర్ సుబ్బు టూవీలర్‌పై విజయవాడ మాచవరం డౌన్‌కు బుధవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న బెంచిపై కూర్చుని మాట్లాడుతుండగా.. మూడు బైక్‌లపై ఆరుగురు దూసుకొచ్చారు. వారిలో ముగ్గురు అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. తనపై దాడిని ఊహించిన సుబ్బు పరుగులు తీశాడు. ఆరుగురూ సుబ్బును వెంటాడి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. వందమీటర్ల దూరంలో కింద పడిపోయిన సుబ్బును విచక్షణా రహితంగా కత్తులు, గొడ్డళ్లతో నరికేశారు. దాదాపు 16 చోట్ల నరికేశారు.ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు గుర్తించి వెంటాడి నిందితులను అదుపులోకి సుకున్నారు. టీడీపీలో తీవ్ర విభేదాలు విజయవాడ చేరిన సుబ్బు టీడీపీ నగర తెలుగు యువత అధ్యక్షుడు కాట్రాగడ్డ శ్రీను పంచన చేరి సెటిల్మెంట్లు చేయసాగాడు. కాట్రగడ్డ శ్రీనుతో విభేదాలు వచ్చి 2014 ఎన్నికల ముందు బోండా ఉమా మహేశ్వరరావుకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలోనే కాట్రగడ్డ శ్రీనుతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో అక్రమంగా తుపాకుల కొనుగోలుతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సుబ్రహ్మణ్యం ఇటీవల బెయిల్‌పై వచ్చాడు. తమను టార్గెట్ చేసి తుపాకులు కొనుగోలు చేశాడనే అనుమానంతోనే కాట్రగడ్డ శ్రీను వర్గీయులే సుబ్బును హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
'బోండా ఉమకు బుద్ధి చెబుతాం'
గుంటూరు: ఐవైఆర్ కృష్ణారావుపై విమర్శలు చేసిన బోండా ఉమకు బుద్ధి చెబుతామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్లో లక్షలాది మంది బ్రాహ్మణులతో సభను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'ఫేస్బుక్లో మంత్రి లోకేష్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేశారు. మరి ఐవైఆర్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయరా' అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బోండా ఓ విధి రౌడీలా మాట్లాడుతున్నారని, బోండా ఉమకు బ్రాహ్మణులు కచ్చితంగా బుద్ధి చెబుతారని జగన్మోహన్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. -
కేసులేని నానీలు
-
ఇదేం రాజ్యం ?
-
అధికారులపై టీడీపీ పార్టీ నేతల ప్రవర్తన దారుణం
-
దాడి చేసి సారీ చేబితే సరిపోతుందా
-
రాష్ట్రంలో రౌడీ రాజ్యం
= అధికారులపై తమ్ముళ్ల దౌర్జన్యాలు తగదు = కేశినేని, బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలి = వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ సోమందేపల్లి : రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ అన్నారు. అధికారులపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. ఆదివారం ఆయన పరిగిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం విజయవాడలో ఆర్టీఏ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. అధికారికి రక్షణగా ఉన్న గ¯ŒSమెన్లపై కూడా చేయి చేసుకోవడం టీడీపీ ప్రజాప్రతినిధుల గుండాగిరికి నిదర్శనమని దుయ్యబట్టారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక విషయంలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై చేయి చేసుకున్నప్పుడే మఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేయించి ఉంటే టీడీపీ నాయకుల ఆగడాలు మితివీురేవి కావన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు వారి పనులను స్వేచ్ఛగా చేయలేకపోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేని నానిపై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పరిగి మండల వైఎస్సార్సీపీ నాయకులు జయరాం, రమణ, మారుతీశ్వర్‌రావు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ట్రావెల్స్‌కు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని కోరారు
-
సీఎం పంచాయితీ చేయడం ఏంటి...చట్టం లేదా ?
-
టీడీపీ నాయకులు గుండాల్లా ప్రవర్తిస్తున్నారు
-
టీడీపీ ఎమ్మెల్యే బొండా కబ్జా బాగోతం!
-
'ఆయన్ని చంపవలసిన అవసరం టీడీపీకి లేదు'
విజయవాడ : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై పనికిమాలిన ఆరోపణలు మానుకోవాలని ముద్రగడ పద్మనాభంకు బోండా ఉమ హితవు పలికారు. మంగళవారం విజయవాడలో బోండా ఉమ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ముద్రగడను చంపించాల్సిన అవసరం టీడీపీకి లేదని స్పష్టం చేశారు. స్వగ్రామం కిర్లంపూడిలో కూర్చోని లేఖలు రాయడం సరికాదని ముద్రగడకు ఆయన సూచించారు. కిర్లంపూడి దాటి బయటకొస్తే ఎంతమంది కాపులకు రుణాలు మంజూరు చేశామో చెబుతామన్నారు. కాపుల కోసం రూ. 1000 కోట్లు ఇస్తామని టీడీపీ ఎక్కడా చెప్పలేదని చెప్పారు. కాపుల రిజర్వేషన్ పై ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్‌ను కలిసి రిజర్వేషన్ అంశంపై ఎందుకు ఆయనతో చర్చించలేదని ముద్రగడను బోండా ఉమ సూటిగా ప్రశ్నించారు. -
మహిళా కార్పొరేటర్‌తో బోండా ఉమా దురుసు ప్రవర్తన
విజయవాడ : విజయవాడ నగరంలోని గాంధీనగర్ 59వ డివిజన్ మహిళా కార్పొరేటర్ శైలజ పట్ల టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు దురుసుగా ప్రవర్తించారు. దీంతో కార్పొరేటర్ శైలజా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగవీటి రాధా దృష్టికి తీసుకెళ్లారు. శైలజకు వెంటనే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు క్షమాపణలు చెప్పాలని రాధా డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ఎమ్మెలే బోండా ఉమా.. 59వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భగా శైలజా పట్ల బోండా ఉమా దురుసుగా ప్రవర్తించారు. -
చంద్రన్న పేరు పెడితే తప్పు ఏంటి ?
విజయవాడ : కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టడాన్ని రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమ శుక్రవారం విజయవాడలో ఆరోపించారు. కాపు భవనాలకు చంద్రన్న పేరు పెడితే తప్పు ఏంటి అని ప్రశ్నించారు. కాపునాడు, కాపు సంఘాల కోరిక మేరకే చంద్రన్న పేరు పెట్టామని ఆయన చెప్పారు. కాపు సామాజిక వర్గంలో గొప్ప వ్యక్తులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం మాత్రం కాపు భవనాలకు చంద్రన్న పేరు పెట్టాలని నిర్ణయించిందని బోండ ఉమ అన్నారు. -
మంత్రి మాణిక్యాలరావు, బోండా ఉమా మధ్య వాగ్వివాదం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య శుక్రవారం విజయవాడలో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బెజవాడ దుర్గ గుడి ఈవో నర్సింగరావు వేధింపులతో ఆసుపత్రి పాలై... చికిత్స పొందుతున్న అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావును శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు పరామర్శించారు. అయితే ఈవో నర్సింగరావుపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని దుర్గ గుడి అర్చకులు విజయవాడలో ఆందోళకు దిగారు.ఈవోపై చర్యలు తీసుకుంటాం... ఆందోళన విరమించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు వారికి హామీ ఇచ్చారు. ఈవోపై చర్యలు తీసుకుంటే కానీ తాము ఆందోళన విరమించమని అర్చకులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతలో అక్కడికి మంత్రి మాణిక్యాలరావు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న అర్చకులను ఆయన కలిశారు. ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న బోండా ఉమా జోక్యం చేసుకుని ఈవోపై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని మాణిక్యాలరావును డిమాండ్ చేశారు. అందుకు ఆయన ససేమీరా అన్నారు. నివేదిక రాకుండా ఆయన్ని ఎలా సస్పెండ్ చేస్తామంటూ మాణిక్యాలరావు ఎమ్మెల్యే బోండాను ప్రశ్నించారు. దీంతో బోండా ఉమా ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.