
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా సాగుతున్న భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, మంత్రి దేవినేని ఉమ భూకబ్జాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం సిట్‌ల పేరుతో కాలయాపన చేస్తోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయవాడ ప్రాంతం భూకబ్జాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment