Land scam
-
భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం
-
అమోయ్‌కుమార్ ‘భూ’ కేసుల విచారణలో కొత్త ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల విచారణలో కీలక మలుపు తిరిగింది.నాగారం ల్యాండ్ స్కామ్ ఈడీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంది. అమోయ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై వివరాల కోసం తెలంగాణ డీజీపీకి తాజాగా ఈడీ లేఖ రాసింది.భూ అక్రమాలపై ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయని లేఖలో డీజీపీకి ఈడీ తెలిపింది. ఈడీ లేఖకు తెలంగాణ డీజీపీ స్పందించారు. నాగారం తో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేశారు. ఈడీకి చేరిన శంకరాహిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్, నాగారం,రాయదుర్గం ల్యాండ్ల వివరాలిచ్చారు.పోలీసుల నుంచి వివరాలు రావడంతో ఈడీ విచారణ వేగవంతం చేయనుంది.ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు..? -
TG: అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ‘ఈడీ’
సాక్షి,హైదరాబాద్: భూముల కేటాయింపుల వ్యవహారంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. బుధవారం(అక్టోబర్ 23) ఈడీ కార్యాలయంలో అమోయ్‌కుమార్‌ను సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. రంగారెడ్డిజిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జిల్లాలో భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే అంశంలో తహసిల్దార్ జ్యోతి, ఆర్డీవో ఇతర సిబ్బంది చేసిన అవకతవకలపైనా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. భూదాన్ భూముల్లో జరిగిన అవకతవకలపై మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని అమోయ్‌కుమార్‌ను ఈడీ కోరినట్లు తెలిసింది.కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమోయ్‌కుమార్ రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విచారించేందుకు ఈడీ అమోయ్‌కుమార్‌కు నోటీసులిచ్చి విచారణకు పిలిచింది. -
Nalgonda: రూ.20 కోట్ల భూ కుంభకోణం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ రివేంజ్ కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులను రాజకీయంగా సమాధి చేసేలా ఎత్తులు వేస్తున్నారు. అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం విశేషం. మిర్యాలగూడలో ప్రముఖ ప్రజాప్రతినిధికి ప్రత్యర్థి గ్రూప్‌లో ఆర్థిక విభేదాలు కలిసి వచ్చాయి. దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూడగా సుమారు రూ.20 కోట్ల విలువైన భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.పది గుంటల ప్రభుత్వ భూమి..మిర్యాలగూడ పట్టణంలోని ప్రముఖుల మధ్య భూ వివాదం చినికిచినికి గాలివానలా మారి 65 సంవత్సరాల క్రితం జరిగిన భూ కుంభకోణం బయటపడింది. మిర్యాలగూడ పట్టణంలోని సాగర్‌రోడ్డుపై సర్వే నంబర్ 992లో సుమారు పదిగుంటల భూవివాదం పరాకాష్టకు చేరింది. భూమి అమ్మకాల విషయంలో ఎంపీ ఎన్నికల సమయంలో అధికార పార్టీలో చేరిన పదవిలో ఉన్న ప్రముఖుడు, మరో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. సదరు భూమిలో తన 35శాతం వాటా అమ్ముతా రూ.15 కోట్లు ఇవ్వాలని, లేదా.. మీ చేతిలో ఉన్న 65 శాతం భూమి అమ్మితే రూ.9కోట్లు ఇస్తానని పేచీ పెట్టడంతో విసిగిపోయిన ఇద్దరు.. ప్రధాన ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఆ భూమి గత వివరాలు తెలుసుకునే పనిలో భాగంగా పహాణీ తీయడంతో ఆ భూమి కాస్తా ఆబాది గ్రామ కంఠం భూమిగా తేలింది. 1977–78లో గ్రామ కంఠం భూమిగా నమోదు కావడం, అందులో 8.38 ఎకరాల భూమి ఆబాది (గ్రామకంఠం)లోనిదిగా తేలింది. దీంతో మున్సిపల్ అధికారులు ఈ నెల 19న ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారు.రాజకీయ విభేదాలతో వెలుగులోకి..ఈ భూ కుంభకోణం బయటికి రావడానికి అధికార పార్టీ నేత హస్తం ఉందని, ఇందుకు రాజకీయ విభేదాలు కూడా కారణమని తెలుస్తోంది. చట్టసభలో ఉన్న ప్రతినిధిని బాధితులు ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చిందని సమాచారం. మొత్తం మీద 65 సంవత్సరాల క్రితం ఆ భూమిలో అప్పటి పట్టణ మున్సిపల్ చైర్మన్ నివాసం ఉండి ఆయన మున్సిపాలిటీ తరఫున షాపులు నిర్మించి అద్దెకు ఇచ్చారు. ఆయన మరణించిన అనంతరం ఆ స్థలాన్ని అమ్మేశారు. ఇప్పటివరకు నాలుగైదు చేతులు మారాయి. ప్రస్తుతం పొత్తులో ఉన్న స్థలాన్ని తాత్కాలికంగా అద్దెకిచ్చారు. ఆ అద్దెలను కూడా పట్టణ ప్రజాప్రతినిధి తీసుకోవడంతో వారిలో ఆర్థిక వివాదం మరింత పెరిగింది. ఇప్పుడు ఆ భూమి కొనుగోలుదారుల్లో కలవరం మొదలైంది.డాక్యుమెంట్లను పరిశీలిస్తాంమిర్యాలగూడ సర్వే నంబర్ 992లో సుమారు పది గుంటల భూమి మీకు ఎలా వచ్చిందో చెప్పాలని కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరాం. కొనుగోలుదారులు ఒక్కరోజులోనే సమాధానం ఇచ్చారు. వారిచ్చిన సమాధానం, డాక్యుమెంట్లు, ఆధారాలను ఉన్నతాధికారులకు సమర్పించాం. ఆ డాక్యుమెంట్లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం– వెంకన్న, మున్సిపల్ డీఈ -
Muda Scam: సీఎం సిద్ధరామయ్యపై విచారణ.. ముడా ఛైర్మన్ రాజీనామా
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా మరిగౌడ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడంటూ పేరుంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత నెలలో మరిగౌడ కారులో బెంగళూరుకు వెళ్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మైసూరుకు తరలించారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగానే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ముడా స్కామ్‌లో చిక్కుకున్న సీఎంపై విచారణ కొనసాగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాగా విజయనగర్‌లోని అప్‌మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని తన భార్యకు అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుంభకోణం వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న ‘ముడా’కు చెందిన 14 ప్లాట్లు తిరిగి అదే సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను దర్యాప్తుకు కూడా సహకరిస్తానని తెలిపారు. ఇక ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు.ఇదిలా ఉండగాా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణ జరపాలని లోకాయుక్త పోలీసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. -
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు -
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం
సిరిసిల్ల/సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14 వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎక రం కూడా సేకరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ.. ఫోర్బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.రాజన్నసిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ పిచ్చోడు.. ఆయనకేం తెల్వదు.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు.. 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు. సిరిసిల్ల నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీర ల పథకాన్ని తెస్తే దాన్ని బంద్ చేసిండ్రు.. కేసీఆర్ కిట్లు లేవు.. రంజాన్ తోఫా లేదు.. క్రిస్మస్ కానుక లేదు. సిరిసిల్లకు ఏడేళ్లలో రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చి రూ.200 కోట్ల బకాయిలుంటే.. మేమే ఇస్తున్నామని పోజు లు కొడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే అంచనాతో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి లబి్ధదారులకు అందించలేకపోయాం. 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. తనపై కోపం, పగ ఉంటే.. తనతోనే చూసుకోవాలి.. కానీ సిరిసిల్ల నేతన్నలను గోస పెట్టవద్దని కోరారు. రికవరీ చేస్తాం... రైతుల రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా సీజన్ అయిపోయినా.. అందలేదు.. కాంగ్రెసోళ్లు ఊళ్లలోకి వెళ్తే రైతులు తన్నేటట్లు ఉన్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కొందరు అధికారులు ఆలిండియా సరీ్వస్ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఇష్టారాజ్యంగా పనిచేస్తే.. ఆర్డీ వో అయినా.. కలెక్టర్ అయినా.. వడ్డీతో స హా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రిటైరై వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హె చ్చరించారు.హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని, తన అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, అదే పేదోళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్న సీఎం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ప దవి లేకపోయినా రేషన్ షాపులను అక్రమంగా అనుచరులకు కట్టబెట్టారన్నారు. హైకోర్టునూ మోసం చేస్తున్నారు... ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫార్మా సిటీని రద్దు చేసింది. ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్ వేసింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టును, న్యా యమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి’అని కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని డిమాండ్‌చేశారు. -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను జూన్‌లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ముడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీతో ప్రాసిక్యూషన్‌ను అనుమతించవద్దని గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.ముడా కుంభకోణం ప్రకంపనలు..ఇదిలా ఉండగా సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు. -
సీటుకు నోటు! టీడీపీ నేతల వసూళ్ల పర్వం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే పచ్చముఠాలు ఇసుక దోపిడీ నుంచి భూ దందాలతో బరి తెగిస్తున్నాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ఇది బదిలీల సీజన్ కావడంతో అందులోనూ సొమ్ము చేసుకుంటున్నాయి. వేలం పాటల తరహాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిపోతోంది. బదిలీలలో పైరవీలు నడుస్తుండడంతో అధికారులంతా అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ, మహిళలపై అఘాయిత్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి దారుణంగా ఉండగా మరోపక్క అధికార పార్టీ నేతలు బదిలీలలో అందినకాడికి వసూలు చేసుకుంటున్నారు! ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో బదిలీలను అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఉద్యోగుల బదిలీలు జరుగుతుండటంతో హోదాను బట్టి రేటు నిర్ణయించి వసూళ్లకు దిగారు. తమ్ముడు తమ్ముడే..! పేకాట పేకాటే! అన్నట్లుగా తమకు కొమ్ము కాసే ఖాకీలను నియమించుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్లకు అందే నెలవారీ మామూళ్లపైనా కన్నేశారు. ఇకపై నేరుగా తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. రూ.కోట్లలో బేరసారాలు..కొత్త సర్కారు కొలువుదీరిన వెంటనే బదిలీలపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించాలన్నా, కోరుకున్న చోటకు పోస్టింగ్ ఇవ్వాలన్నా అధికారి స్థాయి, పరిధిని బట్టి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీవోల నుంచి ఎమ్మార్వోల దాకా ఎస్ఐ నుంచి సీఐ దాకా రేట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. తిరుపతి ఆర్డీవో పోస్టు కోసం ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీర్ఘకాలం జిల్లాలో పనిచేసిన ఓ అధికారి రూ.3 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ తహశీల్దార్ తిరుపతి రూరల్ ఎమ్మార్వో పోస్టు కోసం భారీ మొత్తం ఇస్తానంటూ అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. కొమ్ము కాయాల్సిందే...!కూటమి నేతలకు కొమ్ము కాయడంతోపాటు మామూళ్లు అందించే ఖాకీలపై కన్నేసి ఉంచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ సీఐ పోస్టు కోసం స్థానిక ఎమ్మెల్యే రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావటంతో గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించేందుకు సైతం రేట్లు నిర్ణయించడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ⇒ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కోసం ఓ సీఐ రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకోగా ప్రస్తుతం రూ.10 లక్షలు ఇచ్చారు. లెటర్, డీవో (డ్యూటీ ఆర్డర్) రాగానే మిగతాది చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ సర్కిల్‌కు భారీ ఆదాయం ఉంది. కర్నూలు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్‌తో పాటు మట్కా, పేకాట, రేషన్ బియ్యం అక్రమ రవాణా తదితర వ్యవహారాలతో పాటు నిత్యం స్టేషన్లో పంచాయతీలు జరుగుతుంటాయి. దీంతో డబ్బులు కట్టినా ఇక్కడ సంపాదనకు ఢోకా లేదనే భరోసాతో ఆఫర్ ఇచ్చారు. ⇒ ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ కోసం ఓ సీఐ రూ.20 లక్షలు స్థానిక నేతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదోనిలో పని చేసిన ఆయన ప్రస్తుతం లూప్లైన్లో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆయనకు లెటర్ ఇవ్వగా త్రిసభ్య కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇక ఎమ్మిగనూరు టౌన్ సర్కిల్‌కు కూడా రూ.20 లక్షలకు స్థానిక నేతతో బేరం కుదిరినట్లు సమాచారం. ⇒ నంద్యాలలో ఆర్డీవో, తహసీల్దార్ కుర్చీ కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. నంద్యాల లోని రెవెన్యూ శాఖ అధికారి కుర్చీ కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పని చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో డివిజన్ స్థాయి పోస్టు కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లించేందుకు పలువురు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో డీఎస్పీ పోస్టు కోసం రూ.10 లక్షలు, చాగలమర్రి ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షల చొప్పున స్థానిక ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ⇒ కాకినాడ జిల్లాలో కాకినాడ సహా ప్రధాన సర్కిళ్లలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ డివిజన్లోని సర్కిల్స్‌లో నియోజక వర్గ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉండగా పిఠాపురం సమీప సర్కిల్స్‌లో స్థానిక నేతల అనుచరుల హవా రాజ్యమేలుతోంది. గతంలో పలు వివాదాలు మూటగట్టుకుని బదిలీపై పొరుగు సర్కిల్స్‌కు వెళ్లిన ఇన్స్పెక్టర్లు డబ్బు కట్టలతో నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం కాకినాడ టూ టౌన్ నుంచి బదిలీపై వెళ్లిన ఓ సీఐ లక్షలు సమర్పించైనా తిరిగి వచ్చేయాలనే పట్టుదలతో నియోజకవర్గ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రూ.30 నుంచి రూ.40 లక్షలు ఇచ్చుకునేలా బేరసారాలు జరుగుతున్నాయి. పలువురు పంచాయతీ సెక్రటరీలు ప్రస్తుతం ఉన్న మండలంలోనే కొనసాగేందుకు మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి కాకినాడ జిల్లాలో అదే పోస్టులో కొనసాగేందుకు ఓ ప్రజాప్రతినిధికి రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌లో ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పని చేసిన ఒక అధికారి తిరిగి అదే పోస్టు కోసం రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు!⇒ అనంతపురంలో ఆదాయం బాగున్న ఓ పోలీస్‌స్టేషన్‌కు సీఐగా వచ్చేందుకు ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రూ.5 లక్షల దాకా ఇస్తానని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాకే చెందిన ఓ అధికారి పుట్టపర్తి బదిలీ అయ్యేందుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. పరిటాల కుటుంబానికి సన్నిహితుడైన ఆయన పుట్టపర్తిలో ఓ జిల్లా శాఖ ఇన్‌చార్జీగా వచ్చేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. రూ.15 లక్షలు ఇస్తానని పరిటాల కుటుంబం ద్వారా ఓ మంత్రిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల సునీతకు తొత్తుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కదిరి లేదా ధర్మవరం సబ్ డివిజన్లో సీఐ పోస్టు కోసం రూ.10 లక్షలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు.⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తమకు కావాల్సిన ఎమ్మార్వో, ఎస్ఐ, సీఐల జాబితా తయారు చేసుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం!⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో తమ వద్దకు వచ్చిన అధికారుల పేర్లు నమోదు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా వారి గురించి ఆరా తీస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తమకు అనుకూలంగా పనిచేసిన అధికారులను తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నారు. చేపల చెరువులతోపాటు పందాలు, పేకాట ఎక్కువగా జరిగే భీమవరం, ఉండి, ఆచంటలో పోస్టింగ్‌కు భారీగా డిమాండ్ ఉంది. అమలాపురం రూరల్ సీఐ బదిలీ వ్యవహారం టీడీపీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీయటంతో ఈ పంచాయతీ టీడీపీ అధిష్టానం, డీజీపీ వద్దకు వెళ్లింది. ⇒ ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరంలో ఎస్ఈ పోస్టు కోసం ఐదుగురు పోటీ పడుతుండగా మాజీ మంత్రి జవహర్ బావమరిది కూడా లైన్లో ఉన్నారు. పోస్టు కోసం రూ.50 లక్షల ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. ⇒ అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రెండు జాబితాలు సిద్ధం చేశారు.⇒ విశాఖ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడలో తహశీల్దారు, ఎస్ఐ, సీఐ పోస్టులకు గిరాకీ ఉంది. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జీ రెండు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. భీమిలిలోనూ అధికార పార్టీకి చెందిన కీలక నేత బేరాలు కుదుర్చుకున్నారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభంలో చేరేవారి జాబితా సిద్ధమైంది.⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు, గుడ్లూరు, కావలి రూరల్, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు, పొదలకూరు, నెల్లూరు వేదాయపాలెం, నవాబుపేట, నెల్లూరు రూరల్, వెంకటాచలం అర్బన్ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్ ఉంది. ⇒ ప్రకాశం జిల్లాలో టీడీపీ పెద్దల సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించాలని కొన్ని సర్కిళ్ల పరిధిలో తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. తహసీల్దార్లు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ⇒ విజయనగరం జిల్లాలో ఏ పదవిలోనూ లేకపోయినా టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తన బంగ్లా నుంచే యంత్రాంగాన్ని శాసిస్తున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో అధికారులు ఆమె అనుచరుల చుట్టూ తిరుగుతున్నారు. కీలక స్థానాల కోసం అదితి కొన్ని పేర్లు కలెక్టరుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో దాదాపుగా తమ కులం వారికే పోస్టింగ్‌లు ఇచ్చేలా ఆయన తండ్రి కొండలరావు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల (జనసేన) ఎమ్మెల్యే లోకం మాధవి కూడా తమకు అనుకూలమైన తహసీల్దార్ల పేర్లను కలెక్టరేట్‌కు పంపినట్లు సమాచారం. కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి సైతం ఇప్పటికే సిఫారసు లేఖలను కలెక్టరేట్‌కు పంపించారు. ⇒ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొత్తపేట, లాలాపేట పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. కొత్తపేటకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐని, లాలాపేటకు కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐని నియమించండంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాత గుంటూరు స్టేషన్‌కు మాత్రమే సీఐ నియామకాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు అప్పగించినట్లు చెబుతున్నారు. -
100 కోట్ల భూమి స్వాహా.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత
-
తిరుపతిలో కూటమి నేత అరాచకం 22 రోజులుగా రోడ్డుపై కుటుంబం ధర్నా
-
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్‌ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్‌తో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక. రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్‌ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్ఆర్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు. ఇదేం పని నారాయణ! సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు. ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. హెరిటేజ్‌కు భూ సంతర్పణ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు సమకూరాయి. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్‌కు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఐఆర్ఆర్లో అవినీతి విశ్వరూపం ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్‌తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది. -
బాబు మింగిన భూములు కక్కించిన తెలంగాణ హై కోర్టు
-
సాహితీ ఇన్ఫ్రాకు షాక్.. రూ.200 కోట్ల ఆస్తులు సీజ్
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రాకు సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న కొందరి నాయకులపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేసు విచారణ ముమ్మరం చేయడంతో లక్ష్మీనారాయణ కుటుంబం అజ్ఞాతవాసంలోకి వెళ్లింది. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా (ఎస్ఐవీఐపీఎల్) ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాహితీ ఇన్ఫ్రా సుమారు 2,728 మంది బాధితుల నుంచి రూ.1,110 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. టీఎస్–రెరా నిబంధనల ప్రకారం ఒక ప్రాజెక్టులో కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు మాత్రమే వాటిని వినియోగించాలి. కానీ లక్ష్మీనారాయణ శార్వాణి ప్రాజెక్టులో ప్రీలాంచ్ విక్రయాల కింద జనాల నుంచి వసూలు చేసిన రూ.504 కోట్ల సొమ్మును ఇతర ప్రాజెక్టులకు మళ్లించాడు. ఈ ప్రాజెక్టుల నుంచి కూడా రూ.కోట్లలో డబ్బు వసూలు చేసిన నారాయణ.. ఒక్కటంటే ఒక్కప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. శార్వాణి ఎలైట్ ప్రాజెక్టు కంటే ముందు సాహితీ సంస్థ మూడు ప్రాజెక్టులను ప్రారంభించింది. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటలో కార్తికేయ పనోరమ, మాదాపూర్‌లో కృతి బ్లోసమ్, మోకిలాలో సుధీక్ష ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ఎలైట్ ప్రాజెక్ట్ పేరుతో డిపాజిట్లను సేకరించాడు. -
అధికారులతో కుమ్మకై మభ్యపెట్టి మా పత్రాలు కాజేసి..
-
ఆడవాళ్ళని చూడకుండా పోలీసులతో.. రామోజీ రావు అకృత్యాలపై మహిళలు
-
ఫిలింసిటీ నిర్మాణం కోసం రామోజీ వేసిన అడుగులు..స్టెప్ బై స్టెప్
-
'దొరికారు దొంగలు' ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన కుంభకోణాలపై సీఐడీ దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. లింగమనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ క్విడ్ ప్రో కో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన నారా లోకేశ్‌ను ఏ–14గా, లింగమనేని రమేశ్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. తద్వారా ఈ భారీ భూ కుంభకోణంపై న్యాయ విచారణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన చంద్రబాబు ముఠా అవినీతి బాగోతం విభ్రాంతి పరుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు. ఈ తతంగంలో నారా లోకేష్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం గమనార్హం. సింగపూర్ కన్సల్టెన్సీ ముసుగు సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు ముఠా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. సీఆర్డీయే ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం భ్రమింపజేసింది. కానీ ఆ పేరుతో సింగపూర్‌లోని ప్రైవేట్ కన్సల్టెన్సీ సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని తీసుకువచ్చి పక్కాగా అవినీతి కథ నడిపించింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్ ప్లాన్‌లో పొందు పరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఇదిగో అడ్డగోలు దోపిడీ ఇలా.. ► ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు ముఠా లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు తమ హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ► 2014 జూన్ – సెప్టెంబర్ మధ్య ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. ► క్విడ్ ప్రో కో లో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. ► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి ప్రభుత్వం నుంచి చంద్రబాబు హెచ్ఆర్ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి ఆయన వద్ద నుంచి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది. మ్యాప్‌ను చుట్టూ తిప్పేశారు.. ► లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో ద్వారా పొంగూరు నారాయణ.. తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారు. చంద్రబాబు, నారాయణ కుటుంబాలు అక్రమంగా దక్కించుకున్న భూముల సమీపంలోనే ప్రభుత్వ నిధులతో సీడ్ క్యాపిటల్ ఏరియా, స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రణాళికను ఆమోదించింది. అందుకోసం ఏకంగా ప్రభుత్వ నిధులు రూ.5,500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. తద్వారా తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా చేసేందుకు కుట్ర పన్నింది. ► సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దాంతో నారాయణ ఆదేశాలతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ► ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. పవన్ కల్యాణ్‌కూ 2.40 ఎకరాల ప్యాకేజీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. ► ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ► ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. ► క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. లోకేశ్ అరెస్ట్‌కు ప్రతిబంధకం కాదు ఐఆర్ఆర్ కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు ఇప్పటికే విచారణలో ఉన్న ‘రెడ్‌బుక్’ కేసును ప్రభావితం చేయదని నిపుణులు చెబుతున్నారు. రెడ్‌బుక్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఈ చార్జ్‌సీట్ ప్రతిబంధకం కాదు. ఐఆర్ఆర్ కేసులో అధికారులు, సాక్షులను బెదిరిస్తూ కేసు విచారణను ప్రభావితం చేసే రీతిలో రెడ్‌బుక్ పేరిట ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో గతంలో ఇచ్చిన నోటీసులకు విరుద్ధంగా వ్యవహరించిన లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 13కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఐఆర్ఆర్ కుంభకోణం కేసు, రెడ్‌బుక్ బెదిరింపులు వేర్వేరు కేసులు. కాబట్టి ఐఆర్ఆర్ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ రెడ్‌బుక్ పేరిట బెదిరింపు కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదని నిపుణులు స్పష్టం చేశారు. -
గేటులోపలికి పట్టాదారుణ్ని అనుమతిస్తాం, మీడియాకి అనుమతి లేదు
-
బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు
రాంచీ: జార్ఖండ్‌లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరిచింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. -
రాబందు రామోజీ..సంచలన నిజాలు బయటపెట్టిన బాధితులు..
-
కొన్నారు.. తిన్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది. ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు. కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా 2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..! ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం. కురి్మద్ద, తాడిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్‌లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్ఖాన్పేటలోని హెచ్ఎండీఏ వెంచర్లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి. భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్‌బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు. ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్ఖాన్పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్‌గా పని చేశారు) ఉన్నారు. సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్‌పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. – పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి -
ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించాల్సిన వేళ హైకోర్టు అసలు ముందస్తు బెయిల్ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 438 కింద ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టుకున్న అధికారం అసాధారణమైనదని తేల్చి చెప్పింది. ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే.. నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేకరించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే. ఇంటరాగేషన్ దశలో నిందితుడు, అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే, అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్‌ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢీ అయిన న్యాయ సూత్రం. ముందస్తు బెయిల్ వంటి అసాధారణ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. 65 ఏళ్ల వృద్ధుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో భారీ భూ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వరకట్న వేధింపుల కేసులో.. ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్‌తోపాటు అతని తండ్రి రామయ్య (65), మరికొందరిపై నెల్లూరు దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్‌కు కింది కోర్టు ముందస్తు బెయిల్, అతని తండ్రి రామయ్యకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాగా.. బెయిల్‌పై విడుదలయ్యే సమయంలో చంద్రశేఖర్, అతని తండ్రి రామయ్య నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ చంద్రశేఖర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ బెయిల్ రద్దు చేయాలంటూ కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు చంద్రశేఖర్ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అంతకు ముందే నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు చిన్నబజార్ పోలీసులు చంద్రశేఖర్, రామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలంటూ చంద్రశేఖర్ సతీమణి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రశేఖర్, అతని తండ్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. కింది కోర్టు చంద్రశేఖర్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోగా.. అతని తండ్రి రామయ్య వ్యాజ్యాన్ని మాత్రం కొనసాగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత చంద్రశేఖర్ భార్య దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ప్రధాన నిందితునిగా ఉన్న చంద్రశేఖర్‌కు కింది కోర్టు ఇప్పటికే పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిందని, అందువల్ల అతని తండ్రి రామయ్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాక.. సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే సమయంలో వరకట్న వేధింపు కేసులో రామయ్య జైలులో ఉన్నారని, అందువల్ల ఆయన నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ల సమర్పణకు అతన్ని బాధ్యుడిగా చేయడం తగదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అటు పోలీసులు, ఇటు చంద్రశేఖర్ భార్య కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు పిటిషనర్ రామయ్య వాదనను తోసిపుచ్చారు. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ రామయ్య ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ.. ముందస్తు బెయిల్ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలో న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. చంద్రబాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్‌కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్‌కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్‌ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్‌రావు, అసైన్డ్ రైతు, కురగల్లు