
సాక్షి, విజయవాడ: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ స్పందించారు.
ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు, రాజేశ్‌పై ఫిర్యాదు వచ్చింది. రెండు సెంట్ల భూమి ఆక్రమించారని ఆరోపణ ఉంది. ఎన్‌వోసీపై సంతకం ఏఈది కాదు. ఫేక్ ఎన్‌వోసీతో 0.26 సెంట్ల భూమి కబ్జా చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశాము. ఏ-1 అయ్యన్నపాత్రుడు, ఏ-2 విజయ్, ఏ-3 రాజేశ్‌గా ఉన్నారు. 464, 467, 471, 474 R/w 120-B, 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఏ-1, ఏ-3ని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశాము. కుట్ర చేసి భూమి ఆక్రమించారనేది ఆరోపణలు ఉన్నాయి. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment