Ayyanna pathrudu
-
పెన్షన్‌దారులు దొంగలతో సమానం.. అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్లను తొలగించే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్‌దారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్‌దారులను దొంగలతో పోల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర లేపింది. పెన్షన్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్‌దారులను దొంగలతో పోల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 20 వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు చూపించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. వారంతా దొంగలతోనే సమానం అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో పెన్షన్‌దారుల కారణంగానే ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నారు. పెన్షన్ల వలన నెలకు రూ.120 కోట్ల నష్టం వస్తోంది. సంవత్సరానికి రూ.1440 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. ఎవరు.. ఏం అనుకున్నా నాకు అనవసరం. ఈ పెన్షన్లను తొలగించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అయ్యన్నపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మితిమీరిన టీడీపీ ఇసుక దందా..ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
ఏపీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యన్నపాత్రుడు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం, ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సభ్యులు అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒక్కరు. ఆయన ఏకగ్రీవంగా ఎన్ని కావడం సంతోషం. స్పీకర్ స్థానంలో అయ్యన్న తన పాత్ర పోషిస్తారు అంటూ కామెంట్స్ చేశారు. -
ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రేసులో పలువురు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు అయ్యన్న వైపే అధిష్టానం మొగ్గుచూపించినట్లు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకే వెళ్లే అవకాశాలున్నాయి. జనసేన నుంచి నెల్లిమర్ల(విజయనగరం) శాసనసభ సభ్యురాలు మాధవి లోకం పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చీఫ్‌విప్‌గా ధూళిపాళ నరేంద్రకు అవకాశం దక్కవచ్చని టాక్. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. -
అయ్యన్న ఎన్ని కుయుక్తులు పన్నినా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే ఉమాశంకర్
-
‘టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా..’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలందిస్తున్న తనను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ పదవీరానీయడం లేదని టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థి(టీడీపీ రెబల్)గా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్నపాత్రుడు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలూ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, ఆర్టీఐ కమిషనర్‌గా పదవులిచ్చే సమయంలో అయ్యన్నపాత్రుడు అడ్డుతగిలాడని చెప్పారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తనను చంద్రబాబు పిలిచి.. నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్టు గుర్తుచేశారు. చివరి ప్రయత్నంలో బీసీ కులానికి చెందిన మహిళకు కేటాయించారని, అప్పుడు కూడా తాను బాధపడలేదని, కానీ తాజాగా ఆమెను కూడా తప్పించి తన నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించడంపై ఆవేదనకు గురై.. తానే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నానని శ్రీరామమూర్తి వివరించారు. -
ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన అయ్యన్న
-
అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ, భూకబ్జాదారుడు : ఎమ్మెల్సీ దువ్వాడ
-
చంద్రబాబు టీడీపీ నేతలకు సొంత రాజ్యాంగం రాశాడు : మంత్రి జోగి రమేష్
-
చెరువు కాల్వను ఆక్రమించి అయ్యన్న ప్రహరీ గోడ నిర్మించాడు : ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్
-
అయ్యన్నపాత్రుడు, రాజేశ్ అరెస్ట్‌పై స్పందించిన సీఐడీ డీఐజీ సునీల్
సాక్షి, విజయవాడ: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు, రాజేశ్‌పై ఫిర్యాదు వచ్చింది. రెండు సెంట్ల భూమి ఆక్రమించారని ఆరోపణ ఉంది. ఎన్వోసీపై సంతకం ఏఈది కాదు. ఫేక్ ఎన్వోసీతో 0.26 సెంట్ల భూమి కబ్జా చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశాము. ఏ-1 అయ్యన్నపాత్రుడు, ఏ-2 విజయ్, ఏ-3 రాజేశ్‌గా ఉన్నారు. 464, 467, 471, 474 R/w 120-B, 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఏ-1, ఏ-3ని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశాము. కుట్ర చేసి భూమి ఆక్రమించారనేది ఆరోపణలు ఉన్నాయి. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు. -
బీసీల గురుంచి మాట్లాడే అర్హత చంద్రబాబు కు లేదు : మంత్రి కారుమూరి
-
చట్టప్రకారమే అయ్యన్నపాత్రుడు ని అరెస్ట్ చేశాం : ఏపీ సీఐడీ
-
అయ్యన్నపాత్రుడు అడ్డంగా దొరికిపోయారు : బూడి ముత్యాల నాయుడు
-
రెండు రోజులుగా కనిపించని అయ్యన్న పాత్రుడు
-
మాజీ మంత్రి అయ్యన్న కుటుంబం అక్రమ నిర్మాణం గుర్తించాం : ఎమ్మార్వో జయ
-
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
జనతంత్రం : గొప్ప కార్యక్రమం జరిగినప్పుడల్లా టీడీపీది ఇదే తీరు
-
అయ్యన్నకు బుద్ధి చెప్పిన ప్రజలు
-
అయ్యన్న పాత్రుడు వ్యవహరించిన తీరు దురదృష్టకరం
-
అయ్యన్న పాత్రుడిపై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం
-
అయ్యన్నపై ఆగ్రహం
-
మంత్రులు, మహిళలపై అయ్యన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు
-
అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారు : కొండా రాజీవ్ గాంధీ
-
విశాఖ జిల్లాలో టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వేములపూడి జగనన్న కాలనీలో భూమి చదును చేస్తున్న టిప్పర్ డ్రైవర్‌పై విచక్షణరహితంగా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారి దాడి భయంతో టిప్పర్ దిగి పారిపోతున్న డ్రైవర్‌ను వెంటాడి రాళ్లతో కొట్టారు. అనంతరం టిప్పర్ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. స్థానికంగా పనులు పర్యవేక్షిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడిని చితకబాదారు.ఈ దాడికి పాల్పడింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అనుచరులని తేలింది. కాగా తనపై దాడికి పాల్పడ్డవారిపై టిప్పర్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా