
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వేములపూడి జగనన్న కాలనీలో భూమి చదును చేస్తున్న టిప్పర్ డ్రైవర్‌పై విచక్షణరహితంగా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారి దాడి భయంతో టిప్పర్ దిగి పారిపోతున్న డ్రైవర్‌ను వెంటాడి రాళ్లతో కొట్టారు. అనంతరం టిప్పర్ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. స్థానికంగా పనులు పర్యవేక్షిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడిని చితకబాదారు.ఈ దాడికి పాల్పడింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అనుచరులని తేలింది. కాగా తనపై దాడికి పాల్పడ్డవారిపై టిప్పర్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా
Comments
Please login to add a commentAdd a comment