tipper driver
-
బాధ పడుతున్న టిప్పర్ డ్రైవర్
-
టిప్పర్ డ్రైవర్ కు సీటు ఇచ్చారంటూ ఎగతాళిగా మాట్లాడిన చంద్రబాబు
-
శింగనమలలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు వైఎస్సార్ సీపీ టికెట్
-
Hyd: ఎమ్మెల్యే లాస్య మృతి కేసులో కీలక ముందడుగు
సాక్షి,హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. లాస్య నందిత కారు అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) రెయిలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయే ముందు తొలుత ఢీకొన్న టిప్పర్ లారీని పోలీసులు గుర్తించారు. లాస్య నందిత కారు ఓఆర్ఆర్పైకి ఎంట్రీ అయిన సమయంలో ముందు వెళ్తున్న లారీని సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో గుర్తించారు. టిప్పర్ డ్రైవర్‌ను పటాన్చెరు పోలీసులు కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. టిప్పర్‌ను ఢీకొట్టడొంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ వెల్లడించాడు. వెనక నుంచి లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్‌ను డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. తొలుత టిప్పర్‌ను ఢీ కొట్టిన తర్వాత అదుపుతప్పిన కారు 100 మీటర్ల దూరం వెళ్లి రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న లాస్య నందిత పీఏ ఆకాష్ నిద్ర మత్తులోకి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గత నెలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. ఇదీ చదవండి.. పరీక్షకు ఆలస్యం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య -
ఘోరం: డ్రైవర్ సజీవ దహనం
మండ్య(బెంగళూరు): జల్లిలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వంతెన పిల్లర్‌ను ఢీకొన్న ఘటనలో మంటలు ఏర్పడి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. మృతుడిని హాసన్ జిల్లాకు చెందిన దినేశ్ (44)గా గుర్తించారు. వివరాలు... రామనగర జిల్లా బిదడి కెంపెనహళ్లి నుంచి జల్లి లోడు తీసుకుని డ్రైవర్ దినేశ్ బయలుదేరాడు. ( చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్‌కి పిలిచి.. ) గురువారం తెల్లవారుజామున టిప్పర్ లారీ అదుపుతప్పి నిర్మాణ దశలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొంది. లారీ ఇంజిన్ నుంచి మంటలు లేచి అంటుకున్నాయి. డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
విశాఖ జిల్లాలో టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వేములపూడి జగనన్న కాలనీలో భూమి చదును చేస్తున్న టిప్పర్ డ్రైవర్‌పై విచక్షణరహితంగా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారి దాడి భయంతో టిప్పర్ దిగి పారిపోతున్న డ్రైవర్‌ను వెంటాడి రాళ్లతో కొట్టారు. అనంతరం టిప్పర్ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. స్థానికంగా పనులు పర్యవేక్షిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడిని చితకబాదారు.ఈ దాడికి పాల్పడింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అనుచరులని తేలింది. కాగా తనపై దాడికి పాల్పడ్డవారిపై టిప్పర్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా -
రియల్ మోడల్
చేస్తున్నది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అన్నది ముఖ్యం కాదు, గౌరవంగా జీవించడం ప్రధానం అని నిరూపిస్తున్న ఓ యువతి తనకు తాను వేసుకున్న బతుకు బాట ఇది. టెన్త్, ట్వల్త్ క్లాసులతోపాటు బీటెక్‌లో కూడా మంచి గ్రేడ్ తెచ్చుకుని ఇప్పుడు సివిల్స్‌కు ప్రిపేరవుతున్న ఇరవై నాలుగేళ్ల శ్రీష్మ టిప్పర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తోంది! రోజుకు ఆరు లోడ్లు దింపి తిరిగి తన సివిల్స్ పరీక్షల కోసం ప్రిపేరవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ పనులు చేస్తున్నారా అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘మా నాన్నకు సహాయం చేయడం కోసమే’ అని చెప్తోంది. ఇలాంటి రోల్ మోడల్ పాత్రలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. శ్రీష్మ మాత్రం రియల్ మోడల్. శ్రీష్మ తండ్రి పురుషోత్తమన్ సిమెంట్ వ్యాపారి. వాళ్లది కేరళలోని కున్నూరు. కరోనా కారణంగా ఆయన వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. తల్లి శ్రీజ ప్రైవేట్ స్కూల్ టీచర్. కరోనా సమయంలో పాఠశాలలు తెరవకపోవడంతో ఆమెకు కూడా జీతాలు సరిగా రావడం లేదు. కరోనా కష్టకాలాన్ని దాటడానికి శ్రీష్మ టిప్పర్ స్టీరింగ్ పట్టుకుంది. చిన్నప్పుడు ఇష్టంగా నేర్చుకున్న డ్రైవింగ్ ఇప్పుడు తమ కుటుంబాన్ని సరైన దారిలో నడిపిస్తోందని చెబుతోంది శ్రీష్మ. ‘‘అప్పుడు నేను ఐదవ తరగతి. అమ్మకు డ్రైవింగ్ నేర్పించాడు నాన్న. నేను కూడా నేర్చుకుంటానని మొండికేశాను. డ్రైవింగ్ నేర్పించాడు కానీ ఇప్పుడే లైసెన్స్ ఇవ్వరు కాబట్టి నడపడానికి వీల్లేదని గట్టిగా చెప్పేశారు అమ్మానాన్న. నాకు డ్రైవింగ్ వచ్చినా సరే నడపడానికి వాహనం ఇచ్చేవాళ్లు కాదు. దాంతో పద్దెనిమిదేళ్లు వచ్చిన తర్వాత నా కల నెరవేర్చుకున్నాను. టూవీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ పరీక్షలు పాసయ్యి లైసెన్స్‌లు తెచ్చుకున్నాను. అంతటితో సంతృప్తి చెందలేదు. హెవీ వెహికల్ లైసెన్స్ కోసం బస్సు, లారీ కూడా నడిపాను. హెవీ వెహికల్ పరీక్షకు హాజరైన వాళ్లలో అమ్మాయిని నేనొక్కర్తినే. మగవాళ్లు నన్ను విచిత్రంగా చూశారు. అప్పుడు నా వయసు 21. నాకు చదువు రాలేదేమోనని, పెద్ద ఉద్యోగాలకు అవకాశం లేకపోవడంతో డ్రైవింగ్‌కి వచ్చానని కూడా అనుకున్నారు వాళ్లు. బస్సులు, లారీలు నడపడం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు నవ్వారు, బీటెక్ చదువుతూ ఉద్యోగాల గురించి ఆలోచించకుండా లారీలు నడపడమేంటని బాగా ఎగతాళి చేశారు. నేర్చుకునేటప్పుడే కాదు, ఆరు నెలల కిందట నేను గ్రావెల్ రవాణా టిప్పర్ లారీ తోలుతున్నప్పుడు కూడా అలాగే చూశారు. ఇప్పుడు మాత్రం ఈ పని వెనుక ఉన్నది ఉద్యోగం రాక కాదు, నాన్నకు సహాయం చేయడానికని వాళ్లకు అర్థమైంది. వాళ్లకు అర్థం కాకపోయినా నేనేమీ పట్టించుకోను. నాన్నకు ఆర్థిక కష్టం వచ్చినప్పుడు నేను సహాయంగా నిలిచానా లేదా అన్నదే నాకు ముఖ్యం. నేను హెవీ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ మాత్రం చాలా సంతోషపడ్డారు. అమ్మాయిలు చేయలేని పని చేస్తున్నందుకు ప్రశంసించేవాళ్లు. కొంతమంది తమకూ నేర్పించమని అడిగి మరీ డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ గ్రేట్ అంటూ ప్రోత్సహిస్తున్నారు. రేపటి రోజున నా చదువుకు తగిన మరో ఉద్యోగం సంపాదించుకోగలను. అలాగని నా చదువుకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఈ రోజును నిర్వీర్యంగా గడిపేయడం నచ్చదు. ప్రతిదీ గౌరవప్రదమైన ఉద్యోగమే. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. నాకు డ్రైవింగ్ ఇష్టం కాబట్టి ఈ పని చేస్తున్నాను’’ అన్నది శ్రీష్మ. అవును.. మా అమ్మాయే శ్రీష్మలో పరిస్థితిని తనకు తానుగా చక్కదిద్దుకోగలిగిన నైపుణ్యం ఉందని, తండ్రిగా సంతోషపడుతున్నానని చెప్పాడు పురుషోత్తమ్. టిప్పర్ తోలే అమ్మాయి మా అమ్మాయేనని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ‘‘ఒకసారి టిప్పర్ లారీ చిత్తడి నేలలో కూరుకుపోయింది, తాను బెంబేలు పడకుండా స్థానికుల సహాయంతో బండిని బయటకు తీసి లోడు గమ్యాన్ని చేర్చింది. డ్రైవింగ్ చేస్తున్న కారణంగా తన ప్రిపరేషన్‌కు అంతరాయం కలగనివ్వడం లేదు. ప్రిపరేషన్ కొనసాగిస్తోంది. చదువుకున్న అమ్మాయి కుటుంబం కోసం తండ్రికి సహాయం చేయాలనే మంచి ఆలోచనతో టిప్పర్ నడుపుతోందని తోటి మగ డ్రైవర్లు కూడా శ్రీష్మను అభిమానంగా, గౌరవంగా చూస్తున్నారు’’ అని చెప్పారాయన. -
టిప్పర్ ఢీకొని విద్యార్థి మృతి
మెదక్ : వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా టిప్పర్ రివర్స్ చేస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా వర్గల్ మండలం నెమ్టూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుతారి సురేష్(9) స్థానిక పాఠశాలలో నాలుగో తరగది చదువుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ తండ్రితో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. ఆ క్రమంలో రివర్స్‌లో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి సురేష్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే సతీష్ (14), మహేశ్వరి (6) కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.