
మండ్య(బెంగళూరు): జల్లిలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వంతెన పిల్లర్‌ను ఢీకొన్న ఘటనలో మంటలు ఏర్పడి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. మృతుడిని హాసన్ జిల్లాకు చెందిన దినేశ్ (44)గా గుర్తించారు. వివరాలు... రామనగర జిల్లా బిదడి కెంపెనహళ్లి నుంచి జల్లి లోడు తీసుకుని డ్రైవర్ దినేశ్ బయలుదేరాడు. ( చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్‌కి పిలిచి.. )
గురువారం తెల్లవారుజామున టిప్పర్ లారీ అదుపుతప్పి నిర్మాణ దశలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొంది. లారీ ఇంజిన్ నుంచి మంటలు లేచి అంటుకున్నాయి. డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment