
బెంగళూరు: బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నటి, ప్రస్తుత మండ్య ఎంపీ సుమలత అంబరీష్.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మండ్య సీటును బీజేపీ తనకే ఇస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు ఇచ్చింది.
ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రతో సుమారు గంటసేపు చర్చించిన అనంతరం సుమలత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘విజయేంద్ర తన అభిప్రాయాన్ని, అంచనాలను తెలిపారు. నేనూ నా పరిస్థితుల గురించి చెప్పాను. నేను బీజేపీతోనే ఉండాలని కోరుకుంటున్న ఆయన పార్టీలో చేరాలని కోరారు’ అని ఆమె పేర్కొన్నారు.
“రేపు నా మద్దతుదారులు వస్తున్నారు. వారితో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయనకు (విజయేంద్ర) చెప్పాను. నేను వారి అంచనాలను, అభిప్రాయాలను వినాలి. మండ్యలో నా వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పాను' అని సుమలత అన్నారు. మరో వైపు ఆమె తమతోనే నిలబడుతుందన్న నమ్మకం ఉందని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర తెలిపారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుమలత.. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. కాగా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ మండ్య సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఈసారి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు.
ಮಂಡ್ಯ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಸಂಸದರಾದ ಶ್ರೀಮತಿ ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ ಅವರನ್ನು ಇಂದು ಭೇಟಿಯಾಗಿ ಪ್ರಸ್ತುತ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ದೇಶದ ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಿಯನ್ನಾಗಿಸುವುದು ನಮ್ಮೆಲ್ಲರ ಗುರಿಯಾಗಿದ್ದು ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಮ್ಮ ಸ್ವಾಭಿಮಾನದ ಬೆಂಬಲವನ್ನು ಮಾನ್ಯ ಮೋದಿ ಅವರಿಗಾಗಿ… pic.twitter.com/kMEQauL0RH
— Vijayendra Yediyurappa (Modi Ka Parivar) (@BYVijayendra) March 29, 2024