Mandya
-
ఈసారికి త్యాగమే.. బీజేపీలోకి సుమలత అంబరీష్
తన తదుపరి రాజకీయ ఎత్తుగడపై ఊహాగానాలకు తెరదించుతూ కర్ణాటకలోని మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ తాను భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి తాను మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదన్నారు. మండ్యాలో తన మద్దతుదారులను ఉద్దేశించి సుమలత ప్రసంగిస్తూ.. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ మండ్యా పట్ల నా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. టికెట్ దక్కనప్పుడు కొంతమంది తమ పార్టీని వీడుతారు. కానీ నేను నా సీటును వదులుకుని బీజేపీతోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాను’ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈసారి ఎన్నికల్లో మండ్యా సీటును మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామికి కేటాయించారు. 2019 ఎన్నికల్లో నిఖిల్‌పై సుమలత విజయం సాధించి జేడీఎస్ కంచుకోటగా భావించే మండ్యాలో రాజకీయ మార్పును తీసుకొచ్చారు. 2018లో తన భర్త అంబరీష్ మరణానంతరం, సుమలత ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి మండ్య నుంచి పోటీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి సుమారు రూ. 4,000 కోట్ల గ్రాంట్లు అందించినట్లు సుమలత గుర్తు చేశారు. మండ్యాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు తనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందుకు బీజేపీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “బీజేపీకి నా అవసరం ఉందని, పార్టీని వీడవద్దని ప్రధాని (మోదీ) అభ్యర్థించినప్పుడు నేను ఆయనను గౌరవించాలి” అన్నారు. ఇదే సందర్భంగా సుమలత మండ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తనను తాను జిల్లా 'కోడలు'గా పేర్కొంటూ తనకు ఇతర చోట్ల నుండి పోటీ చేసేందుకు బీజేపీ నుండి ప్రతిపాదనలు వచ్చినా తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని కొంతమంది కోరినప్పటికీ ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పార్టీలో చేరరని ఆమె చెప్పుకొచ్చారు. -
సోదరీ సహకరించు.. సుమలత ఇంటికి కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జేడీఎస్ రాష్ట్ర చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్‌ను కలిశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తనకు సహకరించాలని కోరారు. 'సోదరి' సహకారం వచ్చా.. బెంగళూరులోని సుమలత అంబరీష్ నివాసంలో ఆమెతో సమావేశం అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని వెల్లడించారు. “అంబరీష్ ఇల్లు నాకు కొత్త కాదు. మేము చాలా సంవత్సరాలు కలిసి నడిచాం. నేను మాండ్య లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 3న నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇందులో భాగంగా సోదరి (సుమలత) సహకారం కోసం ఇక్కడికి వచ్చాను" అన్నారు. తమ అనుచరులు మద్దతుదారులతో సమావేశమైన తర్వాత ఏప్రిల్ 3న మండ్యలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుమలత తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. సమావేశం అనంతరం సుమలత అంబరీష్ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. పాత విభేదాలను మనసులో పెట్టుకోవద్దని ఆయన (కుమారస్వామి) కోరారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించాం" అని ఆమె వివరించారు. మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీకి మద్దతుగా నిలుస్తారా లేక మళ్లీ స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమలతకు కేంద్రంలో మంచి పదవి, హోదా కల్పిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలలో మండ్య నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత, సుమలత అంబరీష్ బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఇంకా అధికారికంగా కాషాయ పార్టీలో చేరలేదు. -
సీటు దక్కని సుమలత.. ఏం చేయబోతున్నారు?
బెంగళూరు: బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నటి, ప్రస్తుత మండ్య ఎంపీ సుమలత అంబరీష్.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మండ్య సీటును బీజేపీ తనకే ఇస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు ఇచ్చింది. ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రతో సుమారు గంటసేపు చర్చించిన అనంతరం సుమలత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘విజయేంద్ర తన అభిప్రాయాన్ని, అంచనాలను తెలిపారు. నేనూ నా పరిస్థితుల గురించి చెప్పాను. నేను బీజేపీతోనే ఉండాలని కోరుకుంటున్న ఆయన పార్టీలో చేరాలని కోరారు’ అని ఆమె పేర్కొన్నారు. “రేపు నా మద్దతుదారులు వస్తున్నారు. వారితో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయనకు (విజయేంద్ర) చెప్పాను. నేను వారి అంచనాలను, అభిప్రాయాలను వినాలి. మండ్యలో నా వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పాను' అని సుమలత అన్నారు. మరో వైపు ఆమె తమతోనే నిలబడుతుందన్న నమ్మకం ఉందని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుమలత.. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. కాగా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ మండ్య సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఈసారి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ಮಂಡ್ಯ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಸಂಸದರಾದ ಶ್ರೀಮತಿ ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ ಅವರನ್ನು ಇಂದು ಭೇಟಿಯಾಗಿ ಪ್ರಸ್ತುತ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ದೇಶದ ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಿಯನ್ನಾಗಿಸುವುದು ನಮ್ಮೆಲ್ಲರ ಗುರಿಯಾಗಿದ್ದು ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಮ್ಮ ಸ್ವಾಭಿಮಾನದ ಬೆಂಬಲವನ್ನು ಮಾನ್ಯ ಮೋದಿ ಅವರಿಗಾಗಿ… pic.twitter.com/kMEQauL0RH — Vijayendra Yediyurappa (Modi Ka Parivar) (@BYVijayendra) March 29, 2024 -
మాజీ సీఎం ఫ్యామిలీ సీట్లు కన్ఫమ్!
లోక్‌సభ ఎన్నికలకు తమ అభ్యర్థులపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికిన జేడీఎస్ కర్ణాటకలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మండ్య నుంచి హెచ్డీ కుమారస్వామి, కోలారు నుంచి మల్లేష్‌బాబు, హాసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణల పేర్లు వెల్లడించింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన చన్నపట్టణ నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామి పదేళ్ల విరామం తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన చిక్కబల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా ప్రస్తుత ఎంపీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ మనవడు, కుమారస్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణవరుసగా రెండవసారి హాసన్ నుండి పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఈయన ఇదే స్థానం నుండి 2019 లోక్‌సభ ఎన్నికలలో అరంగేట్రం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎం. మల్లేష్ బాబు నిలిచారు. 2023 ఎన్నికల్లో బంగారుపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎన్ నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు. -
మహిళపై కారు ఎక్కించి హత్య
సాక్షి, మండ్య: రెండు కుటుంబాల మధ్య ఉన్న వ్యవసాయ భూమి గొడవలో మహిళ పైన కారు ఎక్కించి హత్య చేశారు. ఈ దారుణం మండ్య జిల్లాలోని నాగమంగళ తాలుకాలోని బెళ్ళూరు సమీపంలో ఉన్న గాణసంద్ర గ్రామంలో జరిగింది. బెంగళూరులో నివసించే గాణసంద్రవాసి రామకృష్ణయ్య భార్య జయలక్ష్మి (50) హతురాలు. పొలం పనులు చేయిస్తుండగా వివరాలు.. జయలక్ష్మీకి గత 10 సంవత్సరాల క్రితం గాణసంద్ర గ్రామంలో సర్వే నంబర్ 84లో బంజరు భూమిని ప్రభుత్వం ఇవ్వగా ఆమె సాగు చేస్తోంది. అయితే భూమి తమదని గౌడయ్య అతని కుటుంబ సభ్యులు అనేకసార్లు జయలక్షి్మతో గొడవ పెట్టుకున్నారు. బోర్లను కూడా ధ్వంసం చేశారు. మంగళవారం జయలక్ష్మి బెంగళూరు నుంచి వచ్చి ట్రాక్టర్‌తో పొలం పనులు చేయిస్తుండగా గౌడయ్య, కుమారుడు అనిల్ సహా 8 మంది దాడి చేశారు. జయలక్ష్మి మీదకు అనిల్ కారుతో దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ట్రాక్టర్ డ్రైవర్, కూలీలను కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..
సాక్షి, బెంగళూరు(మండ్య): పచ్చని సంసారంలో అక్రమ సంబంధం వ్యవహారం చిచ్చు పెట్టింది. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భార్య తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసుకుంది. ఈఘటన మండ్య జిల్లా మద్దూరులో జరిగింది. మద్దూరు పట్టణ పోలీసుల కథనం మేరకు హోళె వీధిలో అఖిల్ ఆహ్మద్, కౌసర్(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు హ్యారిస్ అహ్మద్(8), కుమార్తెలు అలిసా(4), ఆనం ఫాతిమా(2) ఉన్నారు. ఉస్నాకౌసర్ స్థానిక ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. అఖిల్ ఆహ్మద్ రామనగర జిల్లా చెన్నపట్టణలో కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అఖిల్ అహ్మద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై కుటుంబలో గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీ కూడా చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో గురువారం సాయంత్రం ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది. అనంతరం ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఖిల్ అహ్మద్, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన) -
విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. ఏమీ తెలియనట్లు నటన.. చివరికి!
సాక్షి, బెంగళూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని ఒక కామాంధుడు హత్యాచారం చేశాడు. మండ్య జిల్లా మళవళ్లి పట్టణంలో ఈ దారుణం జరిగింది. కాంతరాజు (52) అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాలు.. మంగళవారం ఉదయం 11 గంటలకు ట్యూషన్‌కు వెళ్లిన నాలుగో తరగతి చదువుతున్న బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురి అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్యూషన్ చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. సమీపంలో ఒక బేకరీ వద్ద నాగరాజు అనే వ్యక్తికి చెందిన నిర్మాణంలోని ఇంటి సంపులో బాలిక మృతదేహం ఉన్నట్లు తెలిసి అక్కడకు పరుగులు తీశారు. అది తమ కూతురిదేనని తెలిసి విలపించారు. ఏమీ తెలియనట్లు నటన ట్యూషన్లో పనిచేసే కాంతరాజు అనే వ్యక్తి పోలీసులతో పాటు తిరుగుతూ బాలిక ఆచూకీ కోసం వెతుకులాడినట్లు నటించాడు. బాలిక తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ట్యూషన్ వద్ద ఎవరో ముగ్గురు యువకులు ఉంటారని, వారిపై అనుమానం ఉందని చెప్పాడు. కాల్ రికార్డుతో దొరికిన కాంతరాజు కాంతరాజు చెప్పిన విషయాలు అబద్ధమని పోలీసులకు తెలిసింది. దీంతో అతనిపై అనుమానంతో ప్రశ్నించగా తనకేమి తెలియదని నమ్మబలికాడు. అతని మొబైల్‌ను పరిశీలించగా బాధిత బాలికతో మాట్లాడిన కాల్ రికార్డు దొరికింది. స్కూల్ సెలవు కావడంతో ఉదయం 11 గంటలకు ట్యూషన్‌కు రావాలని అతడు బాలికకు చెప్పాడు. తరువాత బాలికను నిర్మాణంలోని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో చంపి సంపులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. -
Bharat Jodo Yatra: అడుగులో అడుగేస్తూ..
పాండవపుర: కర్ణాటకలో కొనసాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడోయాత్రలో గురువారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పాలుపంచుకున్నారు. కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగారు. అనారోగ్యంలో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన సోనియా చాలారోజుల తర్వాత ప్రజలకు దర్శనమిచ్చారు. ఆమె గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ తర్వాత ప్రజల మధ్యకు రావడం ఇదే తొలిసారి. ఆమె చివరిసారిగా 2016 ఆగస్టులో వారణాసిలో ఓ రోడ్డుషోలో పాల్గొన్నారు. పార్టీ అధినేత్రి ఆగమనం పట్ల పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినదాలు చేశారు. వారిలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. మాండ్యా జిల్లాలోని జక్కనహళ్లి, కరాడ్యా పట్టణాల మధ్య రాహుల్ వెంట కొన్ని కిలోమీటర్ల మేర సోనియా వడివడిగా అడుగులు వేశారు. ఈ అరుదైన ఘట్టానికి ప్రధాన స్రవంతి మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ మంచి స్పందన లభించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రాహుల్, సోనియాతో పాదయాత్రలో పాల్గొన్నారు. గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, పెనుగాలులకు ఎదురొడ్డి నిలిచామని, సవాళ్లకు ఉన్న పరిమితులను బద్దలు కొడతామని రాహుల్ పేర్కొన్నారు. అందరం కలిసి దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ఆశయమని ట్వీట్ చేశారు. అన్ని సవాళ్లను అధిగమించి, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తామని వివరించారు. పాదయాత్రలో తన తల్లి సోనియా గాంధీ భుజాలపై తాను చేతులు వేసిన చిత్రాన్ని పోస్టు చేశారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. వారికి ప్రేమే రక్షణ కవచమని పేర్కొంది. తల్లి పూజ్యనీయురాలు భారత్ జోడో యాత్రలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సోనియా భుజాలపై చేతులు వేసి రాహుల్ నడవడం అందరి దృష్టిని ఆకర్శించింది. పాదయాత్రలో నడుస్తుండగా సోనియా బూట్ల లేసులు ఊడిపోయాయి. రాహుల్ వెంటనే కిందకు వంగి వాటిని గట్టిగా బిగించికట్టారు. ఈ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అమ్మంటే అమ్మే అని పేర్కొన్నారు. తల్లి పూజ్యనీయురాలు అంటూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు కామెంట్లు చేశారు. యాత్రలో సోనియాను చూసేందుకు జనం బారులుతీరారు. ఆమె వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రాహుల్ సైతం ప్రజలతో కరచాలనం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సోనియా కేవలం 30 నిమిషాలపాటు యాత్రలో పాల్గొనాలి. కానీ, రెండు గంటలకుపైగానే భాగస్వాములు కావడం విశేషం. భారత్ జోడో యాత్రతో సోనియా మమేకమయ్యారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌చేశారు. యాత్ర ముగిశాక సోనియాగాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. -
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
మాండ్య(కర్ణాటక): కాంగ్రెస్ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ గురువారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలాకాలంగా ఆమె పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ఆమె తనయుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె కలిశారు. అంతకు ముందు సోనియా గాంధీ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. మాండ్యలో చేపట్టిన యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా.. తనయుడి వెంట హుషారుగా ఆమె యాత్రలో పాల్గొన్నారు. బళ్లారి ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్రలో పాల్గొనడం కోసం సోమవారం సాయంత్రమే మైసూర్ చేరుకున్నారు ఆమె. ఇదిలా ఉంటే.. ఆయుధ పూజ, విజయ దశమి నేపథ్యంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు రెండు రోజులు బ్రేక్ పడింది. #WATCH | Karnataka: Congress interim president Sonia Gandhi joins Congress MP Rahul Gandhi and other party leaders and workers during 'Bharat Jodo Yatra' in Mandya district pic.twitter.com/iSXNW8zciV — ANI (@ANI) October 6, 2022 ఇదీ చదవండి: ఆరోపణలు మాని మీ పని మీరు చూసుకోండి -
కన్నతల్లీ కర్కోటకురాలు
మండ్య: మానవత్వం లేని మహిళ అప్పుడే పుట్టిన నవజాత శిశువు (మగ)ను 30 అడుగుల లోతులో ఉన్న పాడుబడిన బావిలో పారవేసిన దారుణ ఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చంద్రె గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని శిశువును సంరక్షించారు. అనంతరం పాండవపుర పట్టణ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఉన్న ఓ మహిళ చనుబాలు ఇచ్చి అమ్మతనం చాటుకుంది. శిశువును చీమలు కరవడంతో మెరుగైన చికిత్స కోసం మండ్య మిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి గోపాలయ్య మిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శిశువును పరిశీలించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ వైద్యం అందివ్వాలని జిల్లా అధికారి అశ్వతికి సూచించారు. (చదవండి: ఆడపిల్లను కన్నావు... అదనపు కట్నం తెస్తేనే సంసారం) -
అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు డ్రామా.. చివరికి
సాక్షి, బెంగళూరు: అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తాను చనిపోయినట్లు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మాండ్య శ్రీరంగపట్టణ తాలూకా బొట్టనహళ్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మను అనే వ్యక్తి ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బయట వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. బాకీ తీర్చాలని ఆసాములు ఒత్తిడి చేయడంతో గత నెల 12 నుంచి కనిపించకుండా పోయాడు. తాను ధరించిన విగ్‌కు కోడి రక్తం పూసి, చెప్పులను కాలువ వద్ద వదిలేసి గోవా వెళ్లాడు. వాటిని గమనించిన తల్లిదండ్రులు మనుని ఎవరో హత్య చేశారని భావించారు. ఇదిలా ఉండగా సుప్రియ అనే యువతికి రూ. 8 లక్షలు ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలని, లేదంటే సినిమా తరహాలో చంపేస్తానని ఓ వ్యక్తి మనును బెదిరించినట్లు ఒక ఆడియో వైరల్ అయింది. దీంతో మను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మను బతికే ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పుల బాధతోనే డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. చదవండి: బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని -
నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్
మండ్య: మండ్యకు చెందిన బంగారం వ్యాపారి హనీట్రాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గతనెల ఓ లాడ్జీలో యువతితో ఉన్న జగన్నాథశెట్టిని ఇద్దరు యువకులు, ఓ మహిళ లాడ్జికి వచ్చి బెదిరించారు. ఆ సమయంలో జగన్నాథ శెట్టి తాను ఓ కళాశాల ప్రిన్సిపల్ అని చెప్పుకుని ట్యూషన్ కోసం యవతిని పిలుచుకుని వచ్చానని వారికి చెప్పాడు. ఆయన మాటలను వారు విశ్వసించకపోవడంతో పాటు తీవ్రంగా కొట్టారు. కొట్టొద్దని వేడుకున్నా వదలలేదు. తాజాగా ఈ వీడియో మొత్తం ఇప్పుడు వైరల్‌గా మారింది. వైరల్‌గా జగన్నాథశెట్టి ఆడియో.. మైసూరులో ఓ లాడ్జిలో రెండు రోజులు ఉందామని జగన్నాథశెట్టి ఓ యువతికి ఫోన్ చేశాడు. సదరు యువతి పుస్తకాలు ఏమైనా తీసుకురావాలా అన్ని ప్రశ్నిస్తే నీకు ఏ పుస్తకం కావాలో నేనే తీసుకువస్తానని ఆ ఆడియో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే జగన్నాథ శెట్టి మండ్య బస్టాండ్‌లో మంగళూరు వెళ్లడానికి వేచి ఉండగా ముగ్గురు వ్యక్తులు మైసూరుకు డ్రాప్ ఇస్తామని చెప్పి ఓ వాహనంలో ఎక్కించుకుని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిని గదిలోకి పంపించి హనీట్రాప్‌నకు పాల్పడ్డారని, ఆ ముఠా డబ్బులు డిమాండ్ చేశారని జగన్నాథశెట్టి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..) అయితే తాజాగా జగన్నాథశెట్టి సదరు యువతితో మాట్లాడిన ఆడియో, ఆయనపై ముఠా దాడిచేసే వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. నిజంగా హనీట్రాప్ జరిగిందా లేదా, ఇది సల్మా ఆమె గ్యాంగ్ డబ్బులు వసూలు చేసుకుని ఈ వీడియో వైరల్ చేశారా అనేది ఇప్పుడు చర్చనీయంశమైంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఘోర ప్రమాదం.. గోడ కూలి పాప, మహిళ మృతి
సాక్షి, బెంగళూరు: డెంకణీకోట పట్టణంలోని ఉరుసు జాతరలో ఘోరం సంభవించింది. గోడ కూలడంతో ఓ పాప, మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పట్టణంలోని యారబ్ దర్గాలో కొన్నిరోజులుగా ఉరుసు జరుగుతోంది. ఇందులో అసోం రాష్ట్రానికి చెందిన వారు అంగళ్లను ఏర్పాటు చేసుకొన్నారు. బుధవారం ఉరుసు ముగింపు సందర్భంగా అంగళ్లను ఖాళీ చేస్తుండగా పాత రాతి గోడ కూలిపోయింది. రాళ్ల కింద చిక్కి అసోం రాష్ట్రానికి చెందిన హామియాబేగం (35), రబికుల్ ఇస్లాం (22), సాధ్ ఆలీ (35), డెంకణీకోట జైవీధికి చెందిన బాలాజీ కూతురు సహన (11), వెంకటేష్ కూతురు హేమావతి(12)లు చిక్కుకొన్నారు. వెంటనే స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా హామియాబేగం, సహన మృతి చెందారు. మిగతా ముగ్గురికి డెంకణీకోట ప్రభుత్వ ఆస్ఫత్రిలో చికిత్సలందజేస్తున్నారు. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బెంగళూరులో ఏకధాటిగా వర్షాలు.. 1989 తరువాత ఇదే తొలిసారి -
నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..
సాక్షి, మండ్య (బెంగళూరు): కొన్నాళ్లుగా నిలిచిపోయిన హనీట్రాప్ దందా మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. మండ్యలో ఒక నగల వ్యాపారిపై వలపు వల విసిరి భారీగా కొల్లగొట్టిన వైనం వెలుగుచూసింది. మండ్య మహావీర్ సర్కిల్లో ఉన్న శ్రీనిధి నగల షాపు యజమాని ఎస్.జగన్నాథ్ శెట్టి హనీ ట్రాప్‌కు గురై రూ. 48 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండులో ఉండగా కారులో పికప్ వివరాలు... ఈ ఏడాది ఫిబ్రవరి నెల 22వ తేదీ రాత్రి సుమారు 8 గంటలకు పని మీద మంగళూరుకు వెళ్లాలని మండ్య బస్టాండుకు వచ్చాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది, అందులోనివారు మీరు ఎక్కడ వెళుతున్నారు అని అడిగారు. మేము మైసూరు వరకు డ్రాప్ చేస్తామని ఆయనను ఎక్కించుకున్నారు. మా వద్ద కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయి, వాటి విలువ చెప్పాలని ఆయన వద్దు వద్దంటున్నా మైసూరులోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అందులో నిందితులు సల్మా బాను, జయంత్ ఉన్నారు, మరో యువతి కూడా గదిలోకి వచ్చింది. కెమెరాతో అంతా వీడియో తీసి, మా చెల్లెళ్లతో నీకేం పని అని జయంత్ ఆ వ్యాపారిని బెదిరించాడు. అతన్ని కొట్టి రూ. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. దీంతో దిక్కుతోచని బాధితుడు ఒక ఎల్ఐసి ఉద్యోగి నుంచి, మరో జువెలరీ షాప్ యజమాని నుంచి మొత్తం రూ.48 లక్షలు వారికి ఇప్పించాడు. అయితే మరింత డబ్బు తేవాలని దుండగులు పీడిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు) -
భయానక వీడియో: కాలనాగు నుంచి బిడ్డను కాపాడుకుంది
వైరల్: కర్ణాటక మాండ్య నుంచి భయానక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విష సర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగి ఉంటుందని స్పష్టం అవుతోంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అంతలో.. ఆ తల్లి చూపించిన తెగువ, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. ఎంతైనా అమ్మ కదా! View this post on Instagram A post shared by India Today (@indiatoday) -
తల లేదు.. మొండెం మాత్రమే: క్లూ చెప్పండి, రూ.లక్షలు గెలవండి
మండ్య: జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల మృతదేహాల మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. హతులెవరు, హంతకులెవరు అనేది పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఈ మరణాలపై సమాచారం ఇస్తే బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన మండ్య జిల్లాలోని పాండవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బేబి గ్రామంలో ఉన్న చెరువులో సుమారు 30 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. మృతదేహానికి తల లేదు. మొండెం మాత్రమే ఉంది. ఇప్పటివరకు హతురాలు ఎవరో నిర్ధారణ కాలేదు. వివరాలను తెలిపిన వారికి రూ.లక్ష బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదేరోజు శ్రీరంగ పట్టణం తాలూకా అరికెరె పోలీస్ స్టేషన్ పరిధిలో సీడీఎస్ కాలువ వద్ద నీటి గుంతలో 40 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. ఆమెకు కూడా తల లేదు. ఇద్దరి దేహాలపై బట్టలు లేవు. ఈ మహిళ వివరాలు చెప్పినవారికి రూ.లక్ష నజరానాను ప్రకటించారు. చదవండి: (భర్త దగ్గరకు వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి..) -
ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
ఓ కాలేజీ ప్రిన్స్‌పాల్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడో ఎమ్మెల్యే. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా.. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ సరైన సమాధానం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్స్‌పాల్.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో, సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శ్రీనివాస్.. అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone This happens when power goes to head Shame😈 pic.twitter.com/8RTCCud8Mo — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022 ఇది కూడా చదవండి: సింప్లిసిటీ చాటుకున్న ద్రౌపది ముర్ము.. పలువురి ప్రశంసలు -
యువతిపై మాజీ ప్రియుడు హత్యాయత్నం
మండ్య: ఓ యువకుడు యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన మండ్య నగరంలోని మండ్య వైద్య కళాశాల ఆవరణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... మండ్య తాలూకా వై యరహళ్లి గ్రామానికి చెందిన నవ్య (20) మండ్య మిమ్స్ ఎంఆర్డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేశ్, నవ్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నవ్య పరమేశ్‌కు దూరంగా ఉంటోంది. దీన్ని సహించలేని పరమేశ్ ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. గురువారం మధ్యాహ్నం నుంచి నవ్య కోసం అక్కడే వేచి ఉన్నాడు. 4.30 గంటల సమయంలో నవ్య కళాశాల నుంచి బయటకు రాగా తను వెంట తెచ్చుకున్న బలమైన కట్టెతో దాడి చేశాడు. దీంతో నవ్య తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడే ఉన్న విద్యార్థులు పరమేశ్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్ర రక్తస్రావమైన నవ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఎస్ఐ వివాహేతర సంబంధం.. గుట్టురట్టు చేసిన భార్య) -
ఘోరం: డ్రైవర్ సజీవ దహనం
మండ్య(బెంగళూరు): జల్లిలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వంతెన పిల్లర్‌ను ఢీకొన్న ఘటనలో మంటలు ఏర్పడి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. మృతుడిని హాసన్ జిల్లాకు చెందిన దినేశ్ (44)గా గుర్తించారు. వివరాలు... రామనగర జిల్లా బిదడి కెంపెనహళ్లి నుంచి జల్లి లోడు తీసుకుని డ్రైవర్ దినేశ్ బయలుదేరాడు. ( చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్‌కి పిలిచి.. ) గురువారం తెల్లవారుజామున టిప్పర్ లారీ అదుపుతప్పి నిర్మాణ దశలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొంది. లారీ ఇంజిన్ నుంచి మంటలు లేచి అంటుకున్నాయి. డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఛీ... సొంత అన్న కూతురినే...
మండ్య/కర్ణాటక: మైసూరు దుస్సంఘటనను ప్రజలు మరువక ముందే మండ్య నగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. సల్మాన్ (32) అనే కామాంధుడు సొంత అన్న కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. గురువారం బాలికను పాఠశాలకు తీసుకెళ్లిన నిందితుడు మధ్యలో నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ముఖంపై గాయాలు చేశాడు. సాయంత్రం బాలికను చూసిన తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా బాబాయ్ ఘాతుకాన్ని వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సల్మాన్‌ను అరెస్టు చేశారు. అత్యాచారాల్ని ఆపండి కోలారు: మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతి పర మహిళా సంçఘాల కార్యకర్తలు రోడ్డెక్కారు. గురువారం మెక్కె సర్కిల్లో బ్యాడ్జీలు ధరించి ప్రతిఘటన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ విఆర్ సుదర్శన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు. దుండగులకు కఠిన శిక్షలు విధించి గట్టి సందేశం పంపాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. చదవండి: మైసూరు అత్యాచార ఘటన: కీలక విషయాలు! -
విమర్శలు చేసేందుకు చనిపోయిన నా భర్త పేరెందుకు?
సాక్షి, బెంగళూరు: నటి, ఎంపీ సుమలత అంబరీష్, జేడీఎస్ నేత కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాండ్య జిల్లాలో అక్రమ మైనింగ్ ద్వారా కుమార స్వామి, ఇతర జేడీఎస్ నేతలు లబ్ధి పొందారని ఆమె ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి తనను వెళ్లనివ్వలేదన్నారు. దీనిపై త్వరలో సీఎం యెడియూరప్ప, గనుల మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై విమర్శలు చేసేందుకు చనిపోయిన తన భర్త అంబరీష్ పేరును తరచూ ప్రస్తావించడంపై ఆమె మండిపడ్డారు. ఆయనకు వ్యక్తిత్వమే లేదు దొడ్డబళ్లాపురం: కుమారస్వామి ఏనాడో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని, కొత్తగా సుమలతపై చేసిన వ్యాఖ్యల వల్ల పోగొట్టుకుంది కాదని ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ అన్నారు. శుక్రవారం రామనగర శివారులో మీడియాతో మాట్లాడిన ఆయన కేఆర్ఎస్ డ్యామ్ పరిసరాల్లో ఎన్నో ఏళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఇదే విషయాన్ని సుమలత చెప్పి ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. -
ముద్దొచ్చే చిన్నారులు.. ఎందుకిలా చేశావమ్మా?
మండ్య/కర్ణాటక: కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లల సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని నాగమంగళ తాలూకా హుళ్లెనహళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... తాలూకాలోని కెరెగోడు సమీపంలో ఉన్న గౌడగెరె గ్రామానికి చెందిన గిరీశ్ భార్య సించన (32), పిల్లలు డింపన (4), మహేంద్ర (6) ఉన్నారు. కుటుంబంలో వచ్చిన గొడవలతో సించన పుట్టినిల్లు హుళ్లెణహళ్లి గ్రామానికి వచ్చింది. గురువారం ఉదయం తన పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. ముద్దొచ్చే చిన్నారులను చూసైనా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. వివాహిత దారుణహత్య తుమకూరు: గొర్రెలను మేత కోసం తీసుకెళ్తున్న మహిళపై దుండగులు వేటకొడవలితో నరికి హత్య చేశారు.ఈ ఘటన తుమకూరు తాలూకా కోడి తిమ్మనహళ్లిలో గురువారం చోటు చేసుకుంది. కోరా పోలీసుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాగరాజు భార్య సిద్దగంగమ్మ(40) రోజులాగే గురువారం ఉదయం గొర్రెలను మేత కోసం పొలానికి తీసుకెళ్తుండగా గ్రామ సమీపంలో కాపుగాసిన దుండగులు ఆమెపై దాడి చేశారు. వేడకొడవలితో మెడపై, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా నరికి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తనకు, అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో గొడవలు ఉన్నాయని, తన భార్యను వారే హత్య చేసి ఉంటారని హతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
పులి ముందు ఎలుకలా నిల్చున్నది ఎవరు?
సాక్షి, బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్ ముందు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పందిస్తూ నేను ప్రజల ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతాను, ఈ విషయానికి అంత ప్రాధాన్యం అవసరం లేదు అన్నారు. ఆడపిల్లపై ప్రస్తుతం చర్చ వద్దని, ఎన్నికల సమయంలో మాట్లాడతానని ఎంపీ సుమలతను ఉద్దేశించి అన్నారు. కాగా ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్ గురించి కుమారస్వామి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇందుకు సుమలత ఘాటుగానే స్పందించారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని చురకలు అంటించారు. అదే విధంగా కేఆర్ఎస్ డ్యామ్ విషయం గురించి మాట్లాడుతూ.. కుమారస్వామి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, మండ్యా జిల్లాలోని శ్రీరంగ పట్టణ తాలుకాలో అక్రమ గనుల తవ్వకాలు తాను ఆపేయాలని ఆదేశించినట్లు సుమలత పేర్కొన్నారు. ఈ విషయంలో కుమారస్వామి అవినీతి వైపు నిలబడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కుమారస్వామి వర్సెస్ సుమలత అన్నట్లుగా అనుచర వర్గాలు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో సుమలత- అంబరీష్ ఫ్యాన్స్ కుమార- అంబి పాత ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘పులి ముందు ఎవరు ఎలుకలా నిలబడ్డది ఎవరు? ఇప్పుడు ఆయన మహిళల గురించి ఏం మాట్లాడుతున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. -
కవలల ఉసురు తీసిన పెళ్లి సంబంధాలు.. కలిసి ఉండలేమని..
సాక్షి బెంగళూరు: ఆ ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. వారిద్దరూ కలిసి మెలిసి, ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఒకే చోట పెరిగిన వీరు.. జీవితాంతం ఇంతే ప్రేమగా కలిసి ఉండాలని భావించారు. కానీ ఇంతలో వీరికి పెళ్లి వయస్సు రావడంతో తల్లిదండ్రలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. దీంతో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే, పెళ్లి జరిగితే తాము విడిపోతామనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కన్నీరు పెట్టిస్తోంది. వివరాలు.. కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, హనసనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, యశోద దంపతులకు దీపిక, దివ్య అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. వారికి పెళ్లి వయస్సు రావడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. అయితే, ఒకే కుటుంబానికి చెందిన సంబంధాలు లభించలేదు. ఈక్రమంలో వేర్వేరు కుటుంబాలను చెందిన వారికి ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వివాహమైతే తామిద్దరం ఒకేచోట ఉండలేం, విడిపోతామని మనస్తాపానికి గురైన దీపిక, దివ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తమ గదుల్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చివరికి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. కళకళలాడే తమ బిడ్డలు ఇల్లు చీకటి చేశారని మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై అరికేర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు.