
ప్రతీకాత్మకచిత్రం
బెంగళూరు : ఆన్‌లైన్ క్లాసెస్ విధానం ఓ వ్యక్తి బాగోతాన్ని బట్టబయలు చేసింది. క్లాసులు వినేందుకు కూతురు ఫోన్ తీసుకోగా.. అతడి వివాహేతర సంబంధం గురించి బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగ మంగళంలో నివాసముంటున్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసుల కోసమని వారి పెద్ద కూతురు తండ్రి ఫోన్ తీసుకుంది. ఈ క్రమంలో మొబైల్ ఓపెన్ చేయగానే.. తన తండ్రి వేరొక మహిళతో ఏకాంతంగా గడిపిన వీడియో ఆమె కంటపడింది. వెంటనే ఈ విషయాన్ని తల్లికి చెప్పింది.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తల్లి.. భర్తతో కలసి కాపురం చేయలేనని తేల్చిచెప్పింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సదరు భర్త మాత్రం తనకు భార్యాపిల్లలు కావాలని, వాళ్లతో ఉంటానని చెప్పడం గమనార్హం. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరేలా పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. కాగా వీడియోలో అతడితో ఉన్న మహిళ వారికి దగ్గరి బంధువని సమాచారం. ఈ విషయమై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహిళ అంగీకారంతో వీడియో చిత్రీకరించాడా లేదా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఐటీ చట్టం-2000 కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment