24-Year-old Woman Commits Suicide In Karnataka - Sakshi
Sakshi News home page

భార్యతో గొడవలు.. వివాహేతర సంబంధం.. ఫోన్‌ చేసి పెళ్లైంది, గర్భవతిని అని చెప్పడంతో..

Published Tue, May 16 2023 7:32 AM | Last Updated on Tue, May 16 2023 11:38 AM

- - Sakshi

కర్ణాటక: భర్త వివాహేతర సంబందంతో విసిగిపోయిన వివాహిత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా ఒండికుప్పం గ్రామానికి చెందిన ప్రసాద్‌(28)కు పడపై ప్రాంతానికి చెందిన సమీప బంధువైన భవాని(24)తో 2019లో పెళ్లి అయింది. వీరికి ఏడాదిన్నర బాలుడు వున్నాడు. ప్రసాద్‌ శ్రీపెరంబదూరులోని ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి అదే కంపెనీలో పనిచేసే యువతితో వివాహేతర సంబందం వుంది.

ఈ విషయమై భార్యాభర్తలు గొడవపడి సంవత్సరం నుంచి వేరుగా వుంటున్నారు. రెండు వారాల క్రితం భవానీకి ఫోన్‌ చేసిన కవిత, తనకు ప్రసాద్‌కు మూడు నెలల క్రితం వివాహమైందని, తాను ప్రస్తుతం మూడు నెలల గర్భవతినని చెప్పింది. భవానీ ఈ విషయంపై భర్తతో గొడవ పడగా భర్త నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన భవాని సోమవారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై భవాని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేశారు. భవాని మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement