చిక్కమ్మదేవీ.... ఆశీర్వదించమ్మా...
మాండ్య : మండ్య ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి రమ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాలూకాలోని పుట్టకొప్పలు గ్రామంలో జరిగిన చిక్కమ్మదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తాను గతంలో ఎంపీగా ఎన్నికైనా ఆరు నెలలు మాత్రమే పదవీ కాలం ఉండటంతో ప్రజల సమస్యలను పరిష్కారానికి సమయం లేకపోయిందన్నారు. ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు ఈ సందర్భంగా రమ్యను కోరారు.