
హైదరాబాద్: ‘ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటు వేయండి.. పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యండి’ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఈ మేరకు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో జత చేసింది కాంగ్రెస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టే విధంగా బండి సంజయ్ కామెంట్స్ ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ ను పాకిస్తాన్ పోలుస్తూ కామెంట్స్ చేయడాన్ని ప్రధానంగా పేర్కొంది. బండి సంజయ్ పై , బీజేపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది కాంగ్రెస్.
కాగా, ఈరోజు(మంగళవారం) కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గా అభివర్ణించారు బండి సంజయ్, ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయ్యాలని, పాకిస్తాన్ గెలవాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇంకా బండి సంజయ్ ఏమన్నారంటే..
బీఆర్ఎస్ కులగణనకు అనుకూలం. బీఆర్ఎస్ 51 శాతం బీసీ జనాభా, కాంగ్రెస్ చేస్తే 46 శాతం లెక్క.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు..?. 12 శాతం ముస్లిం జనాభాకు, 10 శాతం రిజర్వేషన్ ఇస్తే.. 80 శాతం లాభం వారికే జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్, కారు రేస్ కేసుల్లో సీబీఐ విచారణ ఎందుకు కోరట్లేదు. సీబీఐ విచారణ కోరండి, మేము అరెస్టు చేస్తాం. ప్రభాకర్ రావు పారిపోయేందుకు సహకరించింది కాంగ్రెస్ పార్టీనే. కారు రేస్‌లో కేటీఆర్ హస్తం ఉందని కేబినెట్ మంత్రులు అన్నారు. మరి కేటీఆర్ కు ఎందుకు నోటీసు ఎందుకు ఇస్తలేరు?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలు విచారణ ఎందుకు బయట పెట్టడం లేదు..?. కేసీఆర్‌కు నోటీసు ఇచ్చే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎందుకు కూల్చట్లేదు?. సీఎం రేవంత్ అరెస్టు అయింది.. జైల్లో ఉంది.. జన్వాడ కేసులోనే.. బీఅర్ఎస్, కాంగ్రెస్‌ది చీకటి ఒప్పందం. 15 వేల కోట్ల రూపాయలే మూసీ ప్రక్షాళన అంచనా. రాబర్ట్ వాద్రా కళ్లలో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి తాపత్రయం. అధి నాయకురాలు అల్లుడి ఆనందం కోసం మూసీ ప్రక్షాళన అంచనా లక్ష కోట్లకు పెంచింది సీఎం రేవంతే. నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 20 వేల ఉద్యోగాల కోసమైతే.. 51 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు ఎలా చెబుతున్నారు..?’’ అని బండి సంజయ్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment