భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ | Bharat Jodo Yatra: Sonia Gandhi Joins Rahul At Mandya | Sakshi
Sakshi News home page

తనయుడి వెంట.. భారత్‌ జోడో యాత్రలో సోనియా గాంధీ

Published Thu, Oct 6 2022 9:54 AM | Last Updated on Thu, Oct 6 2022 9:54 AM

Bharat Jodo Yatra: Sonia Gandhi Joins Rahul At Mandya - Sakshi

చాలాకాలంగా పబ్లిక్‌ ఈవెంట్‌లకు దూరంగా ఉన్న సోనియా గాంధీ భారత్‌ జోడో యాత్రలో.. 

మాండ్య(కర్ణాటక): కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ గురువారం ఉదయం ‘భారత్‌ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలాకాలంగా ఆమె పబ్లిక్‌ ఈవెంట్‌లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. 

బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఆమె కలిశారు. అంతకు ముందు సోనియా గాంధీ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. మాండ్యలో చేపట్టిన యాత్రలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా.. తనయుడి వెంట హుషారుగా ఆమె యాత్రలో పాల్గొన్నారు. బళ్లారి ర్యాలీలో కాంగ్రెస్‌ అధినేత్రి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడం కోసం సోమవారం సాయంత్రమే మైసూర్‌ చేరుకున్నారు ఆమె. ఇదిలా ఉంటే.. ఆయుధ పూజ, విజయ దశమి నేపథ్యంలో కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రకు రెండు రోజులు బ్రేక్‌ పడింది.

ఇదీ చదవండి: ఆరోపణలు మాని మీ పని మీరు చూసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement