
శ్మశానంలో దొళ్లయ్య భౌతికకాయం
మండ్య : వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో పది మందికి పైగా గాయపడ్డ ఘటన శుక్రవారం శ్రీరంగపట్టణతాలూకా పీ.హళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన దొళ్లయ్య వయోభారంతో మృతి చెందడంతో భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గ్రామ శివార్లలోని స్మశానికి చేరుకున్నారు.
ఈ సమయంలో అక్కడి చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో దొళ్లయ్య భౌతిక కాయాన్ని అక్కడే వదిలేసి కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు దూరంగా పారిపోయారు. అయినప్పటికీ వెంటబడ్డ తేనెటీగలు దాడి చేయడంతో పది మందికి గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన మండ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment