bees attack
-
తేనెటీగలదాడి.. తల్లీ ముగ్గురు కూతుళ్లు మృతి
రాంచీ:తేనేటీగల దాడిలో తల్లి ముగ్గురు కుమార్తెలు మృతిచెందిన విషాద ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది.జ్యోతిగడి అనే మహిళ తన ముగ్గురు కుమార్తెలను తీసుకుని వీకెండ్ సరదాగా గడిపేందుకు తన పుట్టింటికి వెళ్లింది. వీరంతా కలిసి శనివారం(సెప్టెంబర్21)అకడున్న ఒక బావిలో స్నానం చేసేందుకు దిగారు.ఇంతలో ఎక్కడినుంచో వచ్చిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా వారిపై దాడి చేసింది.దీంతో తల్లీకూతుళ్లు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయారు తేనెటీగల దాడికి తట్టుకోలేక నలుగురూ బావిలోనే ప్రాణాలు విడిచారు.పోలీసులు నలుగురి మృతదేహాలను బావి నుంచి వెలికితీసి పోస్టమార్టంకు పంపారు. ఇదీ చదవండి: కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు -
తేనెటీగల దాడి.. టాంజానియాలో వరంగల్ కౌలు రైతు మృతి
సాక్షి,వరంగల్: పొట్టకూటి కోసం దేశంకాని దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. టాంజానియాలో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతు పడకంటి బ్రహ్మచారి తేనేటీగలు దాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ బ్రహ్మచారి ప్రాణాలు విడిచాడని వైద్యులు తెలిపారు. మృతుని స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మరావుపేట. ఉన్న ఊరిలో బతుకుభారమై పరాయి దేశానికి వెళ్లిన బ్రహ్మచారి ఈ లోకాన్నే విడిచి వెళ్లాడని స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. -
అధికారులపై తేనెటీగల దాడి
రామచంద్రపురం రూరల్: మండలంలోని ద్రాక్షారామలో ఆదివారం శుభ్రం చేసిన మంచినీటి ట్యాంకును కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మండల ఈఓపీఆర్డీ ఎన్.షెలత్రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాహుల్, ద్రాక్షారామ పంచాయతీ కార్యదర్శి వలివేటి సూర్యసుబ్రహ్మణ్యం గాయపడ్డారు. వీరిలో ఈఓపీఆర్డీపై అధిక సంఖ్యలో తేనెటీగలు దాడి చేయడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు ద్రాక్షారామ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. -
జింబాబ్వేతో తొలి వన్డే.. ఇషాన్ కిషన్‌కు తప్పిన ప్రమాదం!
టీమిండియా యువ ఆటగాడు ఇషన్ కిషన్‌పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతోన్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు భారత జట్టు జాతీయ గీతం ఆలపిస్తుండగా కిషన్‌పై తేనేటీగలు దాడి చేశాయి. దీంతో ఒక్క సారిగా కిషన్ ఉలిక్కిపడ్డాడు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో అతడికి ఎటువంటి హాని జరగలేదు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని సిరీస్‌ల నుంచి కేవలం బెంచ్‌కే పరిమితవుతున్న కిషన్‌కు ఈ మ్యచ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. కాగా ఇటీవల కాలంలో స్టేడియాల్లో ఆటగాళ్లపై తేనెటీగ దాడులు సర్వసాధారణం అయిపోయాయి. తాజగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి వన్డేలో పాక్ బ్యాటర్ ఫఖర్ జమన్ కూడా తేనేటీగల దాడికి గురయ్యాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 189 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) అద్భుతమైన ఆటతీరుతో అకట్టుకున్నారు. pic.twitter.com/qVVVEs9E70 — Bleh (@rishabh2209420) August 18, 2022 చదవండి: IND vs ZIM: ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్! -
షర్మిల పాదయాత్రలో తేనెటీగల దాడి
సాక్షి, యాదాద్రి భువనగిరి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లాలోని దుర్గసానిపల్లి గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగల దాడి జరిగింది. షర్మిల, కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో షర్మిల సెక్యూరిటీ అప్రమత్తంగా ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. -
అంతా కలిసి ఎన్నాళ్లయిందో..! అంతలోనే విషాదం
మామునూరు: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో పలువురుకి తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. వరంగల్ టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ పాఠశాలలో 2000 –01 పదో తరగతి బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వంట చేస్తుండగా చెట్లపై ఉన్న తేనెటీగలు పూర్వ విద్యార్థులపై దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఖిలావరంగల్ పడమరకోటకు చెందిన మైదం దయాకర్ (34) ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు సీఐ రమేశ్ తెలిపారు. ( చదవండి: అనాథకు తలకొరివి పెట్టిన ముస్లిం మహిళ ) -
దెబ్బకు శవాన్ని శ్మశానంలోనే వదిలి పారిపోయారు!
మండ్య : వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో పది మందికి పైగా గాయపడ్డ ఘటన శుక్రవారం శ్రీరంగపట్టణతాలూకా పీ.హళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన దొళ్లయ్య వయోభారంతో మృతి చెందడంతో భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గ్రామ శివార్లలోని స్మశానికి చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడి చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో దొళ్లయ్య భౌతిక కాయాన్ని అక్కడే వదిలేసి కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు దూరంగా పారిపోయారు. అయినప్పటికీ వెంటబడ్డ తేనెటీగలు దాడి చేయడంతో పది మందికి గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన మండ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వలస కుటుంబంలో తీరని విషాదం
పెద్దకడబూరు: ఉపాధి కోసం వలసెళ్లిన ఆ దంపతులు కన్న కొడుకును పోగొట్టుకున్నారు. తేనెటీగలు దాడి చేయడంతో వారి నాలుగేళ్ల కుమారుడు మృత్యువాత పడ్డాడు. దీంతో వారు పుట్టెడు దుఃఖంతో స్వగ్రామానికి తిరిగొచ్చారు. వివరాలిలా ఉన్నాయి. చిన్నకడబూరు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి వ్యవసాయ కూలీ. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం భార్య ఈరమ్మ, నాలుగేళ్ల కుమారుడు ఆనంద్‌ను తీసుకుని మహారాష్ట్రకు వలస వెళ్లాడు. మంగళవారం అక్కడ ఓ పొలంలో ఆనంద్‌ను చెట్టు కింద వదలి భార్యాభర్త పనుల్లో నిమగ్నమయ్యారు. ఆనంద్‌తో పాటు అక్కడ ఒక పాప ఉండగా.. ఇద్దరూ ఆడుకుంటున్నారు. ఇంతలోనే తేనెటీగలు వచ్చి దాడి చేశాయి. పాప పారిపోగా.. చిన్నారి ఆనంద్ శరీరం మొత్తం తేనెటీగలు కుట్టేశాయి. తల్లిదండ్రులు అక్కడికి చేరుకొనేలోపే నోటినుంచి నురుగు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి మృతదేహన్ని తీసుకొని తల్లిదండ్రులు బుధవారం స్వగ్రామం వచ్చి.. ఖననం చేశారు. కాగా.. వీరు వారం రోజుల క్రితం గ్రామ దేవరను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. దేవర ముగిసిన తర్వాత ఊళ్లో ఉపాధి లేకపోవడంతో మహారాష్ట్రకు వలసెళ్లారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. -
తేనెటీగల దాడి: ఐదుగురికి గాయాలు
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం జామ్‌లో తేనెటీగల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
'ఎమ్మెల్యేను పరుగుపెట్టించాయి'
చందంపేట: అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేతో పాటు నాయకులు, కార్యకర్తలను తేనెటీగలు పరుగులు పెట్టించాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాచరాజుపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆకుపచ్చ గుహలను పరిశీలించేందుకు వెళ్లారు. గుహలను పరిశీలిస్తుండగా అలికిడితో తేనెటీగలు ఒక్కసారిగా వారందరి వెంట పడ్డాయి. దీంతో వారు తలోదిక్కుకు పరుగులు తీశారు. ఎమ్మెల్యేతోపాటు కొందరు దగ్గరలోనే ఉన్న వాహనాల్లోకి వెళ్లి అద్దాలు బిగించుకున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కు స్వల్ప గాయాలయ్యాయి. -
తేనెటీగల దాడి: 11 మందికి గాయాలు
యాడికి : మండలంలోని కోనలో తేనెటీగల దాడిలో 11 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యాడికిలోని ఓంశాంతి కాలనీకి చెందిన వెంకటలకు్ష్మమ్మ కుటుంబ సభ్యులు తాడిపత్రికి చెందిన తమ బంధువులతో కలసి విహార యాత్ర నిమిత్తం కోనకు వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. అక్కడ మధ్యాహ్నం భోజనానంతరం పిల్లలు ఆడుకుంటూ తుట్టపై రాళ్లు రువ్వడంతో తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేసినట్లు వివరించారు. గాయపడ్డ వారిలో వెంకటలక్షు్మమ్మ(65) పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ఆమెను తాడిపత్రికి తరలించినట్లు వివరించారు. -
తేనెటీగల దాడిలో ఉపాధి కూలి మృతి
గడివేముల(కర్నూలు): ఉపాధి పనులకు వెళ్లిన వ్యక్తిపై తేనెటీగలు దాడి చేయడంతో.. అతను మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలం చెస్రవాయిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొరస్వామి ఉపాధి పనుల్లో భాగంగా జేసీ కెనాల్లో పూడిక తీయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పనులు చేస్తుండగా.. తేనె టీగలు దాడి చేశాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన తోటి కూలీలు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
ట్రెక్కింగ్ బృందంపై తేనెటీగల దాడి
నలుగురికి తీవ్ర గాయాలు కొండపైనే ప్రాథమిక చికిత్స {పాణాలతో బయటపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాకళి కొండపై ఘటన దొడ్డబళ్లాపురం : తాలూకాలోని మాకళి కొండపై ట్రక్కింగ్ వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం బెంగళూరుకు చెందిన 13 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాకళి కొండకు ట్రెక్కింగ్ వెళ్లారు. సగభాగం వెళ్లగానే ఉద్యోగుల అలజడికి సమీపంలోనే ఉన్న కొండ తేనేటీగలు మూకుమ్మడిగా దాడిచేశాయి. దీంతో బెంబెలెత్తి పోయిన ఉద్యోగులు పరుగులు తీస్తూ కొండకిందకు వచ్చి స్థానికుల సాయంతో బయటపడ్డారు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్ర అస్వస్థులైన వారికి కొండ మీదే సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ఇక్కడి నంది ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. గాయపడిన వారిని హర్షిత్, మహేశ్, విశ్వనాథ్, చౌడప్పలుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి ఘాటీ పీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ... బెంగళూరు నుంచి వచ్చే విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కనీసం ముందస్తు అనుమతి లేకుండా కొండపైకి వెళ్తున్నారని, దీంతో కొండపై అసంఖ్యాంగా ఉన్న తేనెటీగల స్వల్ప అలజడి ఏర్పడినా తట్టుకోలేవని అన్నారు. అదే విధంగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారు, మరికొంత మంది ఆకతాయిలు అడవికి నిప్పటించి వెళ్తున్నారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూంబింగ్ చేస్తుండగా తేనెటీగల దాడి
మున్సింగిముత్తు (విశాఖపట్నం) : కూంబింగ్‌కు వెళ్లిన సాయుధ బలగాలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన విశాఖపట్టణం జిల్లా మున్సింగిముత్తు మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 13 మంది జవానులు గాయపడ్డారు. వీరిని పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఈటెల, కేటీఆర్ లపై తేనెటీగల దాడి
-
ఈటెల, కేటీఆర్ లపై తేనెటీగల దాడి
జగిత్యాల: రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ లపై తేనెటీకలు దాడిచేశాయి. కరీంనగర్ జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు ఇతరులపై తేనెటీగలు దాడి చేశాయి. బుధవారం ఉదయం జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చేరుకున్నమంత్రులు వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలసి పరిశీలించారు. అది పూర్తయి వెనుదిరుగుతున్న సమయంలో... కొన్ని తేనెటీగలు ఒక్కసారిగా వారిపైకి దూసుకువచ్చాయి. దీంతో మంత్రులు వెంటనే తమ కార్లలోకి వెళ్లి డోర్లు వేసుకోగా, ఇతర నేతలు, అధికారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. -
సీఎం హెలీప్యాడ్ వద్ద తేనెటీగల దాడి
-
గజ్వేల్‌లో సీఎం హెలీప్యాడ్ వద్ద తేనెటీగల దాడి
గజ్వేల్: మెదక్ జిల్లాలోని గజ్వేల్‌లో సీఎం హెలీప్యాడ్ ప్రాంగణం వద్ద గురువారం తేనెటీగలు దాడిచేశాయి. ఈ తేనెటీగల దాడిలో ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాతో సహా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పోలీసులకు గాయాలుయినట్టు తెలిసింది. గజ్వేల్ నియోజకవర్గంలో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి సీఎం హెలీప్యాడ్ వద్ద అధికారులంతా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులంతా హెలీప్యాడ్ వద్ద సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేసినట్టు తెలుస్తోంది. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధులంతా పరుగులు పెట్టారు. తేనెటీగల బారినుంచి తప్పుంచుకునేందుకు ప్రయత్నాల్లో గోనె సంచుల్లోనూ, కూర్చీలను అడ్డుపెట్టుకున్నారు. తేనెటీగల దాడితో అధికారులంతా సీఎం హెలీప్యాడ్ ప్రాంగణాన్ని వదిలివెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎర్రబెల్లిపై తేనెటీగల దాడి, స్వల్పగాయాలు
వరంగల్ : టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఎర్రబెల్లి స్వల్పంగా గాయపడ్డారు. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం రాయపర్తి మండలం రాగన్నగూడెంలో పర్యటించారు. అయితే ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయటంతో ప్రచారంలో ఉన్న నేతలు పరుగు అందుకున్నారు. ఈ సందర్భంగా కొందరు తేనెటీగల బారిన పడ్డారు.