'ఎమ్మెల్యేను పరుగుపెట్టించాయి'
చందంపేట: అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఎమ్మెల్యేతో పాటు నాయకులు, కార్యకర్తలను తేనెటీగలు పరుగులు పెట్టించాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాచరాజుపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రమావత్ రవీంద్రనాయక్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు అక్కడి ఆకుపచ్చ గుహలను పరిశీలించేందుకు వెళ్లారు. గుహలను పరిశీలిస్తుండగా అలికిడితో తేనెటీగలు ఒక్కసారిగా వారందరి వెంట పడ్డాయి. దీంతో వారు తలోదిక్కుకు పరుగులు తీశారు. ఎమ్మెల్యేతోపాటు కొందరు దగ్గరలోనే ఉన్న వాహనాల్లోకి వెళ్లి అద్దాలు బిగించుకున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కు స్వల‍్ప గాయాలయ్యాయి.