
రామచంద్రపురం రూరల్: మండలంలోని ద్రాక్షారామలో ఆదివారం శుభ్రం చేసిన మంచినీటి ట్యాంకును కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం పరిశీలించేందుకు వచ్చిన అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో మండల ఈఓపీఆర్డీ ఎన్.షెలత్‌రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాహుల్, ద్రాక్షారామ పంచాయతీ కార్యదర్శి వలివేటి సూర్యసుబ్రహ్మణ్యం గాయపడ్డారు. వీరిలో ఈఓపీఆర్డీపై అధిక సంఖ్యలో తేనెటీగలు దాడి చేయడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు ద్రాక్షారామ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు.