breaking news
East Godavari District Latest News
-
పీ–ఫోర్.. శ్రీమంతులు పరార్
మార్గదర్శకులు ముందుకు రావాలి పి–4 కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించే దిశగా సమష్టి కృషి జరుగుతోంది. జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారు, విద్యా వంతులు, పారిశ్రామిక వేత్తలు మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకురావాలి. ఒక వ్యక్తి అనేక కుటుంబాలకు దరఖాస్తు చేస్తే ఆ కుటుంబాలకు దీర్ఘకాలిక మద్దతుదారుగా నిలుస్తారు. ఉపాధి, విద్య, ఆరోగ్య పరిస్థితులపై స్వావలంబన దిశగా అడుగులు పడతాయి. జిల్లాలో 489 గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వే ద్వారా గుర్తించాం. ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి, సమాజంలో మెరుగైన ఆర్థికస్థితిలో ఉన్న వ్యక్తులు ఒకరిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. సామాజిక చైతన్యం, స్పృహ కలిగి ఉండే కార్యక్రమం ఇది. – పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు సంపన్నుల వెంట పడుతున్నారు. జీరో పేదరికమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తామని కూటమి సర్కార్ గొప్ప గా ప్రకటించింది. ఇందుకోసం విజయవాడలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల నుంచి బంగారు కుటుంబాల పేరుతో పెద్ద ఎత్తున జనాన్ని బస్సుల్లో తరలించి హడావిడి చేసింది. అలా అని ఆ బాధ్యతను ప్రభుత్వం మీద వేసుకోవడం లేదు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువచ్చే బాధ్యతను సంపన్నులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారికి మార్గదర్శులనే నామకరణం చేసింది. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగి ఎన్జీఓలకు అప్పగించడమేనని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ముందుకురాని మార్గదర్శకులు పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కార్ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాల ఎంపిక చేశారు. తీరా చూస్తే ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతటితో ఆగకుండా సంపన్నుల్లో స్ఫూర్తి నింపేందుకు జిల్లా కలెక్టర్లు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అయినా ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ తప్పడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 ‘ఆదిలోనే హంసపాదు’ అన్న సామెత చందంగా తయారై ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం లేకనో మరేమిటో కారణం తెలియదు కానీ చంద్రబాబు చెబుతున్నట్టుగా ఆశించిన స్థాయిలో సంపన్నులు (మార్గదర్శులు) ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల అన్వేషణలో పడ్డారు. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తుది జాబితా కోసం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సర్వేలలో తలమునకలై ఉన్నారు. ఉదాహరణకు కాకినాడ జిల్లా యంత్రాంగం పారిశ్రామిక సంస్థలు, విభిన్న సంపన్న వర్గాలను మార్గదర్శకులుగా అభ్యర్థిస్తూ 80 లేఖలు రాశారని సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లోను కొద్ది అటు, ఇటుగా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఈ సరికే చారిటీలతో పేదలకు సేవలందిస్తున్నామని కొందరు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌తో సేవలు చేస్తున్నామని మరి కొందరు, నిరుపేదలను ఆదుకుంటున్నామని ఇంకొందరు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులకు గుదిబండ పేదల్లో నిరుపేదల ఎంపిక పేరుతో బంగారు కుటుంబాల సంఖ్య కుదించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రవాస భారతీయులు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్.. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ పథకాల నుంచి పేదలు లబ్ధి పొందితే ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉండదు. పీ–4లో సంపన్నుల నుంచి సాయం అందితే పేదలను వారి చెప్పుచేతల్లో పెట్టడమేనని అ భిప్రాయపడుతున్నారు. పీ–4 కోసం సంపన్నుల గుర్తింపు పెద్ద ప్రహసనంగా తయారై మండల స్థాయిలో అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది. 57 వేల బంగారు కుటుంబాల గుర్తింపు తూర్పుగోదావరి జిల్లాలో 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వేలో గుర్తించారు. ఇందులో 1,226 మార్గదర్శకులకు 12,500 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం రాత్రి సీఎం నిర్వహించిన వీడియోకాన్ఫ్రెన్స్లో నివేదించారు. కలెక్టర్ మలకపల్లి గ్రామానికి చెందిన సనమండ్ర పోసిబాబు కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు వీసీలో వివరించారు. -
నైతిక స్థైర్యంపై దాడులు
బదిలీ చేశారు సరే... కారణం ఏదైనా నార్త్,సౌత్ స్టేషన్ల సిబ్బందిని బదిలీ అయితే చేసేశారు. కొత్తగా ఇక్కడకు సిబ్బందిని తీసుకురానున్నారు. అయితే పూర్తిస్థాయిలో సిబ్బందిని తీసుకువస్తారా..ఇప్పుడున్న అరకొర సిబ్బందితోనే ఎకై ్సజ్ స్టేషన్లను నడిపిస్తారా అన్నది వేచి చూడాలి.● కూటమి నేతల మాట కాదన్నందుకు బదిలీలు ● రెండు ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బంది ఒకేసారి మార్పు రాజమహేంద్రవరం రూరల్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోమని ఆదేశించేది వారే...తీరా చట్టాన్ని అమలు చేస్తే కక్ష సాధింపు చర్యలకు దిగేది వారే అన్నట్టుగా తయారైంది కూటమి నాయకుల తీరు. రాజ్యాంగ వ్యవస్థలు, పాలనా పరిస్థితులు, ప్రజాప్రయోజనాలు వంటివి పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అన్నరీతిలో అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఉద్యోగులు నైతిక స్థైరాన్ని దెబ్బతీసే రీతిలో వీరు పేట్రేగుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రెండు ఎకై ్సజ్ స్టేషన్లలో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేసి తాము అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్నే పాటించాలని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కూటమి నాయకుల అధికార దుర్వినియోగానికి బలైన రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సౌత్, నార్త్ స్టేషన్ల సిబ్బంది మౌనంగా ఇబ్బంది పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కఠినంగా వ్యవహరించినందుకేనా? రాజమహేంద్రవరం ఎకై ్సజ్ నార్త్, సౌత్ స్టేషన్లలో సిబ్బంది మొత్తాన్ని గురువారం బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. నవోదయ 2.0 కింద సారాను అరికట్టడంలో రెండు స్టేషన్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ బదిలీకి కారణంగా చూపారు. అయితే వాస్తవ కారణం ఈ సిబ్బంది టీడీపీ, జనసేన నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించడమేనని చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల నార్ట్ స్టేషన్ పరిధిలో ఒక టీడీపీ నాయకుడి సోదరుడిని అరెస్టు చేయడంతో అతను స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. దీనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సౌత్ స్టేషన్ పరిధిలో శ్రీరామపురం గ్రామానికి చెందిన జనసేన నాయకుడిని సారా కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు స్టేషన్ల సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయించినట్లుగా ఉద్యోగ వర్గాల్లో ముమ్మరంగా చర్చ నడుస్తోంది. నిజాయితీగా పనిచేసినా.. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం నార్త్, సౌత్స్టేషన్ల పరిధిలో 52 మద్యం షాపులు ఉన్నాయి. రెండు స్టేషన్ల పరిధిలో 400 మందికి పైగా విఽవిధ కేసులలో ముద్దాయిలు ఉన్నారు. ఈ రెండు స్టేషన్లలోనూ కలిపి 15 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. మద్యం షాపులపై పర్యవేక్షణ, కోర్టు పనులు, సారా నియంత్రణ చర్యలు, మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం తదితర విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా సర్వీసు రిజిస్టరు నిబంధనల ప్రకారం రెండు స్టేషన్లలో 30మందికి పైగా సిబ్బంది ఉండాలి. కానీ ఏళ్ల తరబడి సగం మందితోనే ఇక్కడ కథ నడిపిస్తున్నారు. ఇవి కాకుండా గోదావరిలంకలు, రాజానగరం తదితర ప్రాంతాల్లో రెండువందలకు పైగా సారాబట్టీలు ఉన్నట్లు సమాచారం. ప్రతిరోజూ చేయాల్సిన పనులు చేస్తూనే అటు సారా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. వాస్తవంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా చిట్టడవులను తలపించే తోటల మధ్యలోకి వెళ్లి సారాబట్టీలను నిర్మూలించడం ఈ అరకొర సిబ్బందితో సాధ్యం కాదన్నది ఉద్యోగ వర్గాల మాట. అందుకే సారా తయారీ నియంత్రణలో విఫలమయ్యారనే కారణంతో వీరిపై బదిలీ వేటు వేయడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. అయితే ఏళ్లతరబడి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడే బదిలీ వేటు చేయడం వెనుక టీడీపీ, జనసేన నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. -
అతివృష్టి.. వరికి నష్టి
ఆక్రమణలు తొలగించాలి కొవ్వాడ కాలువ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైంది. దీనికితోడు క్లోజర్ పనులు సక్రమంగా చేపట్టలేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. కాలువల్లో గుర్రపుడెక్క తొలగించకపోవడం, పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కాలువ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు ముంపునకు గురువుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి పంట పొలాలు కాపాడండి దారవరం స్లూయిజ్ నుంచి నీటి ప్రవాహం ముందుకు సాగకపోవడంతో పేమల కాలువ, దారవరం మడుగు పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. పంట పొలాలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – మద్దుకూరి రవిప్రసాద్, దారవరం సర్పంచ్సాక్షి, రాజమహేంద్రవరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వ్యవసాయాన్ని కకావికలం చేస్తోంది. వర్షం నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. స్వేదం చిందించి చేపట్టిన నాట్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో కాలువలు పొంగిపొర్లుతుండగా.. పలు ప్రాంతాల్లో వరి పొలాలు నీటి మునుగుతున్నాయి. మరోవైపు కొవ్వాడ, అప్పారావు చానల్ నీరు దిగువకు వెళ్లకపోవడంతో ఆ కాలువల పరిధిలో పంట పొలాల్లోకి నీరు చేసి వరినాట్లు నేలకొరుగుతున్నాయి. వెరసి రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇప్పటికే పంట సాగుకు అప్పులు చేశామని.. పొలాలను నీరు ముంచెత్తుతుండటంతో మరోమారు నాట్లు వేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 2వేల ఎకరాల్లో నీట మునిగిన వరి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,941 హెక్టార్లు కాగా.. ఈ నెల 21వ తేదీ నాటికి 55,021 హెక్టార్లలో నాట్లు పడ్డాయి. మిగిలిన విస్తీర్ణంలో నాట్ల వేయడానికి వర్షం కాస్త తెరపిస్తే అనువుగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 1,236 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుమారు 2 వేల ఎకరాలకు పైగా నీట మునిగినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 28వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉంది. ఎకరానికి రూ.15 వేల చొప్పున నష్టం రైతులు అప్పులు చేసి మరీ వరి సాగు చేపట్టారు. నారుమళ్ల దశ దాటి నాట్ల వరకు వచ్చింది. ఎకరం పొలానికి నాట్లు వేయాలంటే సుమారు రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రెండు వేల ఎకరాల్లో నాట్లు మునిగిపోవడంతో రైతులకు ఇప్పటికే సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాట్లు దెబ్బతిన్న స్థానంలో తిరిగి వేయాలంటే మరో రూ.5 వేలు వెచ్చించాల్సి ఉంది. దీనికిగాను మరో రూ.కోటి వెచ్చించాలి. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక.. అన్నదాత సుఖీభవ నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ముంపు పరిణామం ఆర్థిక అవస్థలు తెచ్చిపెడుతోంది. నామమాత్రపు పూడికతీతతో ముంపు విజ్జేశ్వరం బ్యారేజీ నుంచి నీరు రిజర్వ్ చేసి అప్పారావు చానల్ ద్వారా ఏలూరు కెనాల్‌కు పంపుతారు. 5,000 క్యూసెక్కుల నీటి సరఫరా సామర్థ్యం ఉన్న కెనాల్ నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని పంపడంతో తమ పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏలూరు కెనాల్ గట్లు 5వేల క్యూసెక్కుల నీటిని పంపేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 8 వేల క్యూసెక్కులు పంపాలంటే గట్లకు మరమ్మతులు చేపట్టాలి. కాలువలో పూడికతీత, గుర్రపు డెక్క తొలగించాలి. క్లోజర్ పనులు దక్కించుకున్న ఓ టీడీపీ నేత తూతూ మంత్రంగా పనులు కానిచ్చేసి చేతులు దులుపుకున్నారు. గుర్రపుడెక్క అలాగే ఉండిపోయింది. పూడికతీత పనులు సైతం నామమాత్రంగా చేపట్టడంతో ముంపు సమస్య తలెత్తిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డెక్కిన రైతులు ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ ఇటీవల కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం దారవరం, బ్రాహ్మణగూడెం, గరప్పాడు, మార్కొండపాడు, సమిశ్రగూడెం, ఎస్.ముప్పవరం గ్రామ రైతులు శెట్టిపేట ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అప్పారావు చానల్‌ను ఆనుకొని ఉన్న భూములు నారుమడి దశ నుంచి ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు తమ పంట పొలాల్లో ఉండిపోవడంతో తాము పంట నష్టపోతున్నామని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు అంటున్నారు. దారవరం మడుగు నుంచి నేరుగా నీటి ప్రవాహం తూరలు లేదా, ప్రత్యేక డ్రెయిన్ ఏర్పాటు చేసి నిడదవోలు మండలం శెట్టిపేట లాకుల వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో కలిసేలా ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభ్యమవుతుందని రైతులు అంటున్నారు. లేకపోతే దారవరం లాకుల వద్ద లిఫ్ట్ పద్ధతిలో నీటిని అప్పారావు చానెల్‌కు తరలించాలని కోరుతున్నారు. పంట పొలాలను ముంచెత్తిన వరద కొవ్వాడ, అప్పారావు చానల్ నుంచి నీటి విడుదల తూర్పుగోదావరి జిల్లాలో 2వేలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన వరి ఎకరానికి రూ.15 వేల వరకు నష్టం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రభావం లబోదిబోమంటున్న రైతులు.. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళనముంపులోనే పంట పొలాలు కొవ్వాడ, అప్పారావు కాలువల వరద నీరు పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో కలవాల్సి ఉంది. డెల్టా కాలువకు నీరు విడుదల చేస్తుండటంతో ఈ రెండు కాలువల నుంచి వచ్చే నీరు పశ్చిమ డెల్టా కాలువలో కలవడం లేదు. దీంతో వరద నీరు వెనక్కి పోటెత్తి వందలాది ఎకరాలను ముంచెత్తుతోంది. ఈ ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల రైతులపై పడుతోంది. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. పంట పొలాలు ముంపులో ఉండటంతో కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. దారవరం, బ్రాహ్మణగూడెం, మార్కొండపాడు, మల్లవరం, గౌరిపల్లి, చంద్రవరం గ్రామాల పరిధిలో పొలాలకు నీటి ముప్పు తప్పడం లేదు. నిడదవోలు మండలం శెట్టిపేట, సింగవరం ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల భూముల్లోకి నీరు చేరింది. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పంటలు నీట మునిగాయి. కొవ్వూరు మండలం ఆరికరేవుల, నందమూరు, దొమ్మేరు, పసివేదల, ధర్మవరం తదితర లోతట్టు ప్రాంత భూములు ముంపు బారిన పడ్డాయి. అధికారుల లెక్కల ప్రకారం కొవ్వూరు మండలంలో 113 ఎకరాలు, నిడదవోలు మండలంలో 197 ఎకరాలు, పెరవలిలో 25 ఎకరాలు ముంపు బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇదిలా ఉంటే.. కానూరు అగ్రహారంలో 150, ఊసులుమర్రు 150 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు రైతులు వెల్లడిస్తున్నారు. -
భూగర్భ జలాల సంరక్షణపై ముగిసిన శిక్షణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన భూగర్భ జల స్థిరత్వ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో సీజీడబ్ల్యూబీ రీజినల్ డైరెక్టర్ ఎన్.జ్యోతి కుమార్ మాట్లాడుతూ గోదావరి రీజియన్‌లో వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, భూగర్భ జలాలను పెంపొందించే మార్గాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో వాటర్ లెవెల్ మానటరింగ్ విధానాలు, నీరు కాలుష్యం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. మాజీ అధికారి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ వాతావరణ, భూగర్భ జలాల మార్పులను వివరించారు. జియోసైన్సెస్ హెచ్ఓడీ డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీగ్రౌండ్ వాటర్ సస్టైనబుల్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఈస్ట్ గోదావరిశ్రీ అనే అంశంపై చర్చించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. విజయనిర్మల, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
● సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ ● రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాపూజీ ముమ్మిడివరం: ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. ముమ్మిడివరం డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన జిల్లా ఉద్యోగుల సంఘ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఉద్యోగులను ఐక్యం చేసి ముందుకు సాగుతామన్నారు. జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాలలో సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని బాపూజీ వాపోయారు. సెలవు దినాలలో కూడా ఉద్యోగులతో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. ఫీల్డ్ వర్కు పేరుతో నిర్బంధించి పని చేయించడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మల్లిబాబు మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలో జరిగే ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి పిలుపు ఇస్తామన్నారు. జిల్లా అఽసోసియేట్ అధ్యక్షుడు కె.వీరబాబు, జిల్లా కోశాధికారి ఎస్.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముమ్మిడివరం తాలూకా కమిటీ నియామకం జరిగింది. తాలూకా అధ్యక్షుడిగా జీఎస్వీడీ ప్రసాద్, కార్యదర్శిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.నూకరత్నం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పూజ, టి.సుజాత, డి.సువర్ణరాజు, ఎం.స్టీవెన్, కోశాధికారి డి.మహేష్, సహయ కార్యదర్శులుగా ఎం.రమేష్, సీహెచ్ లలిత, నియమితులయ్యారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లలోకి వెళితే.. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్యకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం కొంతమూరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై గల నయరా పెట్రోల్ బంక్ సమీపంలో ఎకై ్సజ్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో 220 కేజీల గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన నాగరాజు, సుబ్రహ్మణ్యం, జైసల్వాలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.హనుశ్రీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఎస్సై సీహెచ్ రాజేష్, ఎం.శ్రీనివాసరావు, ఏ.రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
28 నుంచి ఎంపీడీఓలకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 28 నుంచి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన 89 మందికి శిక్షణ ఇస్తున్నట్లు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మొదటి బ్యాచ్‌లో 46 మంది ఎంపీడీఓలు హాజరవుతారన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తియిన తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ఉంటుందన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 24,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
శిశువులకు అమృతమే..
జిల్లాలో పరిస్థితి అంగన్వాడీ కేంద్రాలు 1,726 బాలింతలు 5,846 గర్భిణులు 7,725 ఆరు నెలల లోపు చిన్నారులు 901 6 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 7,017 3–6 ఏళ్ల వయస్సున్న చిన్నారులు 8,041 ● తల్లిపాలలో పోషకాలు ● బిడ్డలకు తాగిస్తే ఎన్నో ప్రయోజనాలు ● తల్లులకూ ఉపయోగమే ● వచ్చే నెల ఒకటి నుంచి తల్లిపాల వారోత్సవాలు రాయవరం: శిశువుకు అత్యంత బలం, రోగనిరోధక శక్తిని అందించేవి తల్లిపాలే. అవి దాదాపు అమృతంతో సమానం. అందుకే పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతారు. తల్లి పాలు తాగిన పిల్లలకు రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. అయితే పిల్లలకు తల్లి పాలు ఎప్పటి వరకూ పట్టించాలి, ముర్రుపాలు అంటే ఏమిటి అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్బిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తారు. తల్లిపాల గొప్పదనం తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి. బిడ్డ పుట్టిన వెంటనే అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టాలి. ఎందుకంటే ఆ పాలలో బిడ్డను వ్యాధుల నుంచి రక్షించే ఖనిజాలు, మాంసకృతులు, విటమిన్–ఏ సమృద్ధిగా ఉంటాయి. ముర్రుపాలు బిడ్డకు వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది. తల్లిపాలు శిశువులకు ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం అని చెప్పవచ్చు. వీటి వల్ల పిల్లలకు మలవిసర్జన సులభంగా అవుతుంది. తల్లితో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. బిడ్డ కోరుకున్న ప్రతి సారి ఎంతసేపు తాగితే అంతసేపు తల్లి పాలు పట్టించాలి. ఆరోగ్యకర సమాజం సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో తల్లుల వైఖరిలో కూడా మార్పు వస్తోంది. బిడ్డకు పాలిస్తే తమ అందం పాడవుతుందని ఆలోచించే తల్లులు కూడా నేటి సమాజంలో దర్శనమిస్తున్నారు. తల్లి పాలు పట్టడం వలన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వరల్డ్ అలైన్స్ ఫర్ బెస్ట్ ఫీడింగ్ ఏక్షన్(వాబా) అనే సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యూహెచ్‌వో, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ, బీపీఏఐ వంటి జాతీయ సంస్థల అనుబంధంగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. తల్లిపాలను ముఖ్యంగా బిడ్డ పుట్టిన గంట లోపే ముర్రుపాలు ఎందుకు పట్టించాలనే అంశంపై ఏటా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖలు సంయుక్తంగా తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ రక్షణ అవసరం బాలింతలకు వైద్యఆరోగ్యశాఖ రక్షణ అవసరం. వారికి అవసరమైన మందులు అందించాలి. ముఖ్యంగా రక్తహీనత రాకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైన సమయంలో గర్భిణుల రక్తశాతాన్ని పరిశీలించాలి. ప్రసవం తర్వాత కాల్షియం, ఐరన్ మాత్రలను ఆరు నెలల పాటు అందించాలి. అధిక పోషకాలు చిన్నారులను దృష్టిలో ఉంచుకుని తల్లి పాలు మాత్రమే పట్టించాలి. తల్లి పాలలోనే పోషకాలు ఉంటాయి. ఆకలితో ఉన్న బిడ్డకు డబ్బా పాలు ఇవ్వడం వల్ల శక్తిని కోల్పోతారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే అందించాలి. డబ్బా పాల ద్వారా పౌష్టికాహారం అందదు. – డాక్టర్ రమ్య, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరం వ్యాధులు దూరం దేవుడు సృష్టించిన తల్లి పాలు ఒక టీకా కంటే గొప్పవి. తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు వైరల్ ఇన్పెక్షన్లు రాకుండా ఉంటాయి. తల్లి పాలలో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు, శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి. – డాక్టర్ పి.ప్రశాంతి, గైనకాలజిస్ట్, మండపేట సీహెచ్‌సీ తల్లికీ ప్రయోజనాలు బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల ఆరు నెలల్లోపు గర్భం దాల్చే అవకాశం ఉండదు. ఇది సహజ కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లులకు రొమ్ము, గర్భసంచి, అండాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని కొన్ని రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వస్థితికి వచ్చి రక్తస్రావం తగ్గుతుంది. తల్లిపాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అవి పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తినాలి. -
మహిళను రక్షించిన పోలీసులు
తాళ్లపూడి (కొవ్వూరు): స్థానిక రోడ్ కం రైల్వే వంతెన పైనుండి గోదావరిలో దూకబోయిన మహిళను పట్టణ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే. కొయ్యలగూడెం మండలానికి చెందిన సుమారు 30 ఏళ్ల మహిళ తన కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం కొవ్వూరులోని రోడ్ కం రైల్వే వంతెన పైకి వచ్చింది. అటుగా ఆటోలో వెళ్తున్న శ్రీనివాస్ అను వ్యక్తి ఆ మహిళను గమనించి, 112 ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం వెంటనే కొవ్వూరు టౌన్ సిబ్బంది ఎంవీవీ సత్యనారాయణను స్థలానికి పంపారు. దీంతో ఆ మహిళను గుర్తించి, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని, పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె బంధువులకు అప్పగించారు. -
పరామర్శకు వెళుతూ మృత్యుఒడికి..
● ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ● తల్లీ కుమార్తెలు, ఆటోడ్రైవర్ మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు ● పటవల వద్ద ప్రమాదం తాళ్లరేవు: ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, కోరంగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు పోతాబత్తుల దుర్గ, లంకే భవానితో పాటు దుర్గ చెల్లెలు ఓలేటి లక్ష్మి శుక్రవారం గాడిమొగ పంచాయతీ చినవలసల గ్రామానికి సంగాడి గంగరాజును పరామర్శించేందుకు ఆటోలో బయలు దేరారు. గంగరాజు ఇటీవల కంటికి ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోకి వచ్చే సరికి వీరి ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో పోతాబత్తుల దుర్గ (55), లంకే భవాని (35)తో పాటు యానాం కురసాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కూరాకుల కుమార్ రాజు (30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఓలేటి లక్ష్మిని అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సందర్శించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్షనర్లను విభజించడం తగదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పెన్షనర్లను రెండు విభాగాలుగా విభజించడం తగదని పెన్షనర్ల అసోసియేషన్ కన్వీనర్ భాస్కరరావు అన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం మానవహారంగా ఏర్పాడ్డారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్‌ను మార్చిందన్నారు. దీనివల్ల పెన్షనర్ల కమిషన్ అమలుకు ముందు రిటైరైన వారు, అమలు తరువాత రిటైరైన వారు అనే రెండు వర్గాలుగా విభజిస్తారని తెలిపారు. ఫలితంగా పే కమిషన్‌కు ముందు రిటైర్ అయ్యిన ఉద్యోగులు గతంలో మాదిరిగా పెన్షన్ రివిజన్ అడిగే హక్కు కోల్పోతారన్నారు. పాత పెన్షన్‌పైనే శేషజీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఎప్పటికీ వారి పెన్షన్‌లో డీఏలు తప్ప ఇతరత్రా పెరుగుదల ఉండదన్నారు. పెన్షనర్లను రెండు వర్గాలుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎన్ మూర్తి, కె.సన్యాసిరావు, ఏవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్లకు పరీక్ష రేపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఎస్తేరు ఏగ్జిన్ రెసిడెన్షియల్ ఎయి డెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ పరీక్షకు హాజరుకావాలన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వర కు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కాకినాడలోని అయాన్ డిజిటల్ జోన్, అచ్యుతాపురంలో 486 మంది అభ్యర్థులకు మొదటి సెషన్లో స్కూలు అసిస్టెంట్, 500 అభ్యర్థులకు రెండో సెషన్లో ఎస్జీటీ వారికి పరీక్షలు జరుగుతాయన్నా రు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, లూథర్గిరిలోని అయాన్ డిజిటల్ జోన్లో 263 మంది అభ్యర్థులకు రెండో సెషన్లో ఎస్జీటీలకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డుతో పరీక్షకు ఒక గంటముందు హాజరుకావాలన్నారు. సందేహాలున్న వారు ఫోన్ నంబర్ 98485 74622, 83091 77952లో సంప్రదించాలన్నారు. ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ ఐవీఎఫ్ డే సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఐవీఎఫ్ సెంటర్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు జీజీహెచ్‌కు చెందిన రెండు బృందాలు పలు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్బంగా నోవా ఐవీఎఫ్ సెంటర్లో అసిస్టెవ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ లెవెల్ 2 ఇన్స్పెక్షన్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఐవీఎఫ్ కేంద్రంలో సదుపాయాలు, పరికరాలు పరిశీలించారు. కేంద్రాలు ఏఆర్టీ చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. తనిఖీ బృందంలో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో పి.సరిత, గైనకాలజిస్ట్ డాక్టర్ అక్కమాంబ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాసవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పెథాలజీ డాక్టర్ పరాంకుశ, రేడియాలజిస్ట్ డాక్టర్ రామచంద్ర, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ శామ్యూల్ ఉన్నారు. -
ఖరీఫ్‌కు రిలీఫ్
పెరవలి: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌కు ఊపిరులూదాయి. రైతులు వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు 76,941 హెక్టార్లలో చేపట్టడానికి రైతులు సిద్ధంగా ఉండగా ఇప్పటి వరకు 55,021 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. జూలై 15 నాటికి పూర్తి అవ్వవలసిన వరి నాట్లు ఆలస్యంతో దీని ప్రభావం దిగుబడులపై పడుతుందని, ప్రకృతి వైపరీత్యాలకు పంటలు బలవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడటంతో ఖరీఫ్ సాగు కష్టాలతో మొదలైంది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటంతో ఖరీఫ్ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ముందస్తు సాగుకి రైతులను సన్నద్ధం చేయవలసిన అధికారులు రబీ ధాన్యం సొమ్ము ఇవ్వకపోవటంతో ఖరీఫ్ పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుత వర్షాలకు పుడమి పులకరించటంతో ఖరీప్ సాగు ఊపిరి పోసుకుంది. అయితే రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధంగా లేవు. జిల్లాలో ఖరీఫ్ సాగుకి అన్ని రకాల ఎరువులు కలిపి 61,692 మెట్రిక్ టన్నులు అవసరం కాగా జూలై నెల 21వ తేదీకి 27,275 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. అయితే అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు చెబుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు 20 వేల హెక్టార్లలో వరినాట్లు వేశారు. నెలాఖరుకు వరినాట్లు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యానికి కారణాలు జూన్ 1వ తేదీనే కాలువలకు నీరు వదలినా, ఖరీఫ్ పనులు చేపట్టలేదు. చిన్న కాలువల ఆధునీకరణ పనులు మే నేలాఖరులో చేపట్టటం వల్ల నీరు చిన్న, పిల్ల కాల్వలకు వదలలేదు. దీంతో జూలై నెలలో వరి నాడుమడులు వేయటం ప్రారంభించారు. పెట్టుబడికి ప్రభుత్వం ఎటువంటి సాయం అందించకపోవడం, రబీ ధాన్యం సొమ్ము నేటీకీ ఇవ్వకపోవటంతో రైతులు అఽధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఖరీఫ్ పనులు చేపట్టారు. దీనితో ఖరీఫ్ సాగు ఆలస్యం అయింది. పెరవలిలో వరినాట్లు వేస్తున్న కూలీలు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముమ్మరంగా నాట్లు జిల్లాలో 76,941 హెక్టార్లలో వరి సాగు ఇప్పటి వరకు నాట్లు 55,021 హెక్టార్లలో నాట్లు 61,692 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 27,275 టన్నులే లభ్యం ఎరువుల కొరత ఉన్నా లేదంటున్న అధికారులు జిల్లాలో ఎరువుల నిల్వలు ఇలా.. వివరం ఖరీఫ్ ప్రస్తుతం అంచనా ఉన్నవి (మెట్రిక్ టన్నులు) యూరియా 26,465 9,416 డీఏపీ 6,420 2,461 ఎంఓపీ 4,806 2,758 ఎన్పీకే 18,607 8,365 ఎస్ఎస్పీ 5,394 4,275 61,692 27,275నానా పాట్లూ పడుతున్నాం ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. పెట్టుబడి కోసం నానా పాట్లు పడుతున్నాం. సమయానికి ఎరువులు దొరకటం లేదు, ఒక్కోటి ఒక్కోచోట తెచ్చుకుంటున్నాం. దిడ్ల సంపతిరావు, రైతు, ఖండవల్లి ప్రభుత్వం ధాన్యం సొమ్ము ఇస్తే చాలు రబీ ధాన్యం సొమ్ము అందక ఖరీఫ్ పనులు చేపట్టలేదు. అప్పులు చేసి ఖరీఫ్ పంట పనులు చేపట్టాం. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోయినా కనీసం పండించిన పంట కొనుగోలు చేసి సమయానికి సొమ్ము ఇస్తే చాలు. జుత్తుగ రంగయ్య, రైతు, ముక్కామల -
అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?
● పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం ● వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీ మిథున్‌రెడ్డిని మద్యం కేసులో ఇరికించి జైలుకు పంపడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పార్లమెంటులో ప్రశ్నించకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాటి బ్రిటిష్ పాలనను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తలపిస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగం స్థానంలో బ్రిటిష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎన్నో కీలకమైన బిల్లులు చర్చకు రానున్నాయని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలన్న సంకల్పంతో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఉన్నారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెచ్చే ధైర్యం లేని కూటమి ఎంపీలు తమ చేతకాని తనాన్ని పార్లమెంటులో ఎవరూ ప్రశ్నించకుండా వ్యూహాత్మకంగా మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని మిథున్‌రెడ్డి లోక్‌సభలో బలంగా వినిపించారని, ఆయనకు ముస్లిం సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల తిరుగుబాటుతో కూటమి సర్కారు కూలిపోవడం ఖాయమని అన్నారు. -
15 మంది ప్రొబేషనరీ ఎస్సైల నియామకం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నూతనంగా జిల్లాలో నియమించిన 15 మంది ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్లకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో దిశానిర్దేశం జరిగింది. ఈ సందర్భంగా వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీలు ఎంబీఎన్.మురళీకృష్ణ, ఏవీ.సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎల్.చెంచిరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. వీరిలో అయిదుగురు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. వీరు ఐదు నెలలు పాటు వివిధ విభాగాలలో శిక్షణ తీసుకోనున్నారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏఎస్పీలు వారికి సూచించారు. క్షేత్ర స్తాయిలో ప్రజలతో ఎలా మెలగాలి, పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితుల సమస్యల పరిష్కారంలో శాస్త్ర, సాంకేతిక పద్దతులను ఎలా ఉపయోగించాలో వివరించారు. ప్రజలలో పోలీసు శాఖపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా నేర నియంత్రణ, పరిశోధన ఉండాలని, చార్జీషీట్లో సాంకేతికమైన ఆధారాలను జోడించి ఎక్కువ శాతం శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. మహిళలు, చిన్నారులకు చెందిన కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం చూపించవద్దన్నారు. డీఎస్పీలు బి.రామకృష్ణ, టీవీఆర్‌కే.కుమార్, కృష్ణంరాజు, పవన్‌కుమార్‌రెడ్డి, ఆలీఖాన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని సర్వమత ప్రార్థనలు
తాళ్లపూడి: కుట్ర పూరితంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్‌రెడ్డికి దేవుడి దయతో త్వరగా బెయిల్ రావాలని వైఎస్సార్ సీపీ నియోజక వర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. కొవ్వూరులో గురువారం ఎంపీ మిథున్‌రెడ్డికి త్వరగా బెయిన్ రావాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 12వ వార్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. మసీదులో ముస్లింలతో కలిసి నమాజు చేశారు. తలారి వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు బెయిల్‌పైనే బయట ఉన్నారని, ఆయన చేసిన అక్రమాలు బయట పడకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మిథున్‌రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించి రిమాండ్‌కు పంపిందని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు కంఠమణి రమేష్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, జిల్లా అధికార ప్రతినిధి గంధం సాయి, మున్సిపల్ కౌన్సిలర్లు గీత, విల్లి పద్మ, నాయకులు ఉప్పులూరి సూరిబాబు, జుట్టా ఏడు కొండలు, సురేంద్ర, సుంకర సత్యానారాయణ, పద్మ, లక్ష్మణరావు, హనుమంతరావు, గంగాధర నాగేశ్వరావు, దక్షిణామూర్తి పాల్గొన్నారు. మొదటి విడత డీసెట్ కౌన్సెలింగ్ పూర్తి 99 సీట్లకు 56 మంది మాత్రమే హాజరు నల్లజర్ల: దూబచర్లలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఈ నెల 17 నుంచి 24 వరకు జరిగిన మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ముగిసినట్టు ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. డైట్‌కు కేటాయించిన 99సీట్లకు కేవలం 56మంది అభ్యర్థులు మాత్రమే హాజరై సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ప్రవేశ పత్రాలు తీసుకున్నారు. సీనియర్ అధ్యాపకులు ఎన్.రామసుబ్రహ్మణ్యం, కెఎస్బీకే రాజ్‌కుమార్, కె.సరోజని, ఏఎస్ఆర్ ఆర్ గుప్తా ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొన్నారు. డీఎడ్‌కు తగ్గుతున్న ఆదరణ దూబచర్ల డైట్ కళాశాలకు 99సీట్లు కేటాయిస్తే కేవలం 56మంది మాత్రమే కౌన్సిలింగ్‌కు హాజరవడం చూస్తుంటే డీఎడ్‌కు ఆదరణ తగ్గుతున్నట్టు కనపడుతోంది. తరుచూ డీఎస్సీ నిర్వహించక పోవడం, డీఎడ్ శిక్షణ పూర్తయి ప్రైవేటు పాఠశాలల్లో రూ.7వేలు, రూ.8వేలకు పనిచేయడం ఇష్టం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీకి అనుమతులు రద్దు! డీఎడ్ ప్రవేశాలకు సంబంధించి భీమవరం సీఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీకి ఎన్.సీ.డి.ఈ. ఈ ఏడాది అనుమతులు రద్దు చేసింది. తొలుత ఆ కళాశాలకు చెందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా దూబచర్ల డైట్ కళాశాలలోనే ఏర్పాటు చేశారు. ఆ కళాశాలకు 71 సీట్లు కేటాయించారు. 17 నుంచి 24వ తేదీ వరకు జరిగిన మొదటి దఫా కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు ఎవరూ హాజరు కాలేదు. ఆ కళాశాలకు చెందిన 9మంది విద్యార్థులు దూబచర్ల డైట్ కళాశాలలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కన్వీనర్‌కు తెలియజేసి వారిని చేర్చుకోనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. -
యాప్‌లతో యాతన..
పనిభారం.. నరకం సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకే అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వలంటీర్లను విధులకు దూరం పెట్టి, వారి పనిభారాన్ని సచివాలయ ఉద్యోగులపై మోపింది. బ్యాంకు సిబ్బంది చేయాల్సిన ఖాతాకు ఆధార్ లింక్, ఈకేవైసీ వంటి పనులను, ఐటీ శాఖ చేయాల్సిన వర్క్ ఫ్రం హోం సిటిజన్స్ గుర్తింపు సర్వేను, పరిశ్రమల శాఖ నిర్వహించాల్సిన ఎంఎస్ఎంఈ సంస్థల గుర్తింపు సర్వేలను, సహకార సంఘాల రికార్డుల కంప్యూటీకరణలో భాగంగా సహకార సంఘాల సిబ్బంది రైతులకు ఈకేవైసీ చేయాల్సిన పనులను సైతం సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. కపిలేశ్వరపురం: ఉన్నది ఊడపీకేలా.. పథకాలన్నీ అటకెక్కించేలా.. ఉద్యోగులను హింసించేలా.. పలు యాప్‌లతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం యాప్‌ల నిర్వహణ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకో, ఇస్తున్న లబ్ధిని ఎగ్గొట్టేందుకో అన్నట్టు ఉంది. అంతేకాకుండా యాప్‌ల నిర్వహణతో ప్రభుత్వ, స్కీమ్ ఉద్యోగులు, సిబ్బందికి నరకం కనిపిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొబైల్ యాప్ తెరిచి ఎవరింటికి వెళ్లినా ప్రభుత్వం తమకేమి మేలు చేస్తుందమ్మా అని అడగడంతో ఉద్యోగులు సంతోష పడేవారు. ఇప్పుడు యాప్ తెరిచి ఇంటికెళ్తే సదరు ఉద్యోగి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొంటుంది. తమపై యాప్‌ల భారాన్ని తొలగించాలంటూ అంగన్వాడీ తదితర చిరు ఉద్యోగులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళనలను సైతం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 18,32,332, కాకినాడ జిల్లాలో 20,92,374, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 17,19,013 మంది జనాభా ఉన్నారు. కాగా వారిలో అత్యధికులు కూటమి ప్రభుత్వం యాప్‌ల నిర్వహణలో బాధితులే. ఏదో రూపంలో వారి నుంచి సర్వేల ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరిస్తుండటంతో ఎప్పుడు ఏ లబ్ధి ఎగిరిపోతుందోనంటూ ఆందోళనలో ఉన్నారు. ఇక స్కీమ్ ఉద్యోగులు పనిభారంతో అల్లాడుతున్నారు. కాకినాడ జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,986 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 1,05,996 మంది ప్రీస్కూల్ పిల్లలు, 11,610 మంది బాలింతలు, 10,573 మంది గర్భిణులకు సేవలందిస్తున్న అంగన్వాడీలు పలుమార్లు యాప్‌లను రద్దు చేయాలని ధర్నా చేశారు. కోనసీమ జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,726 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలుండగా 86,296 మంది చిన్నారులు, 15,743 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,536 మెయిన్, 26 మినీ మొత్తం 1,562 అంగన్వాడీ కేంద్రాల ద్వారా వేల సంఖ్యలో అంగన్వాడీలు యాప్‌లతో యాతన పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 135 పీహెచ్‌సీలు, 22 సీహెచ్‌సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడలో జీజీహెచ్, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, గ్రామీణ, అర్బన్ సీహెచ్‌సీల్లో 1,445 మంది హెల్త్ సెక్రటరీలు ఉన్నారు. 200 మంది ఏఎన్ఎంలు, 473 మంది స్టాఫ్ నర్సులు, 1232 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,396 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఆయా సంస్థల్లో ఆరోగ్యపరమైన యాప్‌ల నిర్వహణతో సిబ్బంది పనిభారాన్ని మోస్తున్నారు. ఆన్లైన్.. పరేషాన్ సామాన్య ప్రజలకు సేవలందించేందుకు అంగన్వాడీ, ఆశ, తదితర చిరు ఉద్యోగులు ఎప్పుడూ ముందుంటారన్నది కరోనా లాంటి విపత్కర కాలంలోనే నిరూపితమైంది. వారిని గౌరవంగా చూసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం యాప్‌ల పేరుతో వేధిస్తుండటంతో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు 2.0 వెర్షన్ బాల సంజీవని యాప్‌లో కొత్త వర్షన్‌ను సవరించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కంపల్సరీ వర్కర్, హెల్పర్ ఫొటో తీసి, సబ్మిట్ చేసి, ప్రీ స్కూల్ పిల్లల ఫొటోలను కూడా ఇన్‌టైమ్‌లో తీసి సబ్మిట్ చేయాలంటున్నారు. వారికి సంబంధించిన మెనూ కూడా ఇన్‌టైమ్‌లో ఆన్లైన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం సరకులను ఎప్పుడు పంపిస్తుందో తెలియని పరిస్థితుల్లో పీకపై కత్తిపెట్టినట్టు వెంటనే యాప్‌లో వివరాలను నమోదు చేయాలని చెప్పడాన్ని ఆయా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎగ్గొట్టేందుకు పావులు కదుపుతూ.. పెన్షన్స్ ఎగవేతకు పెన్షన్స్ పేమెంట్ యాప్‌ను పావుగా ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అర్హులకే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందించేందుకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నట్టు పైకి చెబుతుంది. ఈ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను జియో ట్యాగింగ్ చేయడం ద్వారా 300 మీటర్ల దూరం దాటి సొమ్ము తీసుకుంటున్న వారిని గుర్తించి మరికొన్ని ఆప్షన్స్‌ను పూర్తి చేసేలా చేస్తుంది. తర్వాత వారిని విచారించి పింఛన్‌కు అర్హులా కాదా అనే దానిపై దృష్టి సారిస్తుందన్న వాదన ఉంది. సాంకేతిక దన్ను లేకుండా.. ఐసీడీఎస్ పరిధిలోని యాప్‌ల పట్ల లబ్ధిదారుల్లో సైతం వ్యతిరేకత వస్తుంది. యాప్‌లను రద్దు చేయాలంటూ తాము చేసిన ఆందోళనల్లో లబ్ధిదారులు సైతం పాల్గొన్నారు. సరైన సాంకేతిక దన్ను సమకూర్చుకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ సిస్టం నిర్వహణ సాధ్యం కాదు. సమస్యలపై రాష్ట్రపతికి లేఖ కూడా రాశాం. – కె.కృష్ణవేణి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, మండపేట ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)తో యాతనఅంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు గుడ్లు, పాలతో పాటు మరికొన్ని పౌష్టికాహార పదార్థాలను అందజేస్తున్నారు. ఆయా వివరాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని బాల సంజీవిని యాప్‌లో, కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పోషణ ట్రాకర్‌లో ఫేస్ రికగ్నిషన్ సిస్టిం యాప్ ద్వారా నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. లబ్ధిదారుల మొబైల్ నుంచి వచ్చే ఓటీపీతో వివరాలు ఖరారు చేయాలి. ఆ ప్రక్రియను సాగించేందుకు తగిన సాంకేతిక పరికరాలను కానీ, సమయాన్ని కానీ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముందుగా ఫీడ్ చేసిన లబ్ధిదారుల ఫొటో ఎలా ఉండేదో వర్తమానంలో కూడా అచ్చుగుద్దినట్టు ఉంటేనే యాప్‌లో వివరాలు నమోదవుతున్నాయి. వివాహమైనప్పుడు యాప్‌లో ఫీడ్ చేసిన ఫొటోతో పిల్లలను కనివారిని పెంచుతున్న క్రమంలో ముఖంలో వచ్చిన మార్పులను యాప్ అంగీకరించకపోవడంతో యాతన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీలకు ప్రభుత్వం తరఫున అప్డేటెడ్ సెల్ఫోన్లను ఇవ్వకపోవడంతో వారి సొంత ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని యాప్‌లను వాడాల్సి వస్తుంది. ప్రభుత్వం నామమాత్రంగా ఇస్తున్న 2 జీబీ డేటా సరిపోకపోవడం, నెట్ సిగ్నల్స్ 5జీ కాకపోవడం లబ్ధిదారులను, అంగన్వాడీలను ఇబ్బంది పెడుతుంది. చిరుద్యోగులకు సంకటంలా నిర్వహణ కూటమి పాలనలో సంక్షేమానికి తూట్లు తిరకాసు పెట్టేందుకే ముందుకు.. -
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ స్కాంలో అక్రమ అరెస్టుకు గురై, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ములాఖత్ అయ్యారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరిన ఆయన రాజమహేంద్రవరం నగరంలో తాను తీసుకున్న ఇంట్లో కాసేపు కూర్చుని నేతలతో సమాలోచనలు చేశారు. అంతకు ముందు కొవ్వూరు టోల్గేట్ వద్దకు చేరుకోగానే.. అప్పటికే భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రీజనల్ కో–ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వరకు భారీ కాన్వాయ్‌గా వచ్చారు. మంత్రి కారుమూరి, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పెద్దాపురం ఇన్చార్జి దవులూరి దొరబాబు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్, మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులు సెంట్రల్ జైల్ వద్దకు చేరుకున్నారు. పెద్దిరెడ్డి, వనిత, భరత్ ములాఖత్ అయ్యే వరకు అక్కడే కూర్చున్నారు. అనంతరం పెద్దిరెడ్డికి వీడ్కోలు పలికారు. పోలీసుల ఆంక్షలు పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేశారు. మిథున్‌రెడ్డిని కలిసేందుకు వచ్చిన జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, మాజీ మంత్రి కారుమూరి, నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జైల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని నానా హంగామా చేశారు. మిథున్‌రెడ్డికి ఆహారం, దిండు, దుప్పట్లను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు న్యాయవాది కలుగజేసుకుని తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. హైదరాబాద్‌కు పయనం మధురపూడి: బుధవారం మధురపూడి విమానాశ్రయం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ అనంతరం ఆయన ఇండిగో విమానంలో బయలుదేరారు. టోల్గేట్ వద్దకు భారీగా చేరుకున్న నేతలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్ -
కూటమి ప్రభుత్వ రెండు నాల్కల ధోరణి దుర్మార్గం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా రెండు నాల్కలతో మాట్లాడుతున్న కూటమి నాయకుల ధోరణి దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడం దారుణమైన విషయం. గత ప్రభుత్వ అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్చి.. రూ.15 వేలకు రూ.11 వేలు మహిళల ఖాతాల్లో వేసి మోసం చేయడం సరైన విధానం కాదు. కూటమి పాలనలో మహిళలకు ఇస్తానన్న ఏ హామీ అమలు కాలేదు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వడంపై మాట్లాడుతూ రాష్ట్రాన్ని అమ్మేయాల్సి ఉంటుందనడం అత్యంత హేయమైన చర్య. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఏడాది దాటినా ఇది అమలు కాలేదు. ఇలా మహిళలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. – జరీనా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం -
శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ
పశ్చిమ రాజగోపురం వద్ద.. కాగా, విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణ పనులు కూడా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో వంద అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పున టెన్సిల్ షెడ్డు నిర్మించేందుకు లారెస్ కంపెనీ సంసిద్ధత తెలిపిందని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. అన్నవరం: శ్రావణ మాసం సందర్భంగా రత్నగిరిపై పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ నిధులతో సత్యదేవుని నిత్య అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్‌లు తదితర నిర్మాణాలకు టూరిజం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫ్మార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్నంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం టెండర్ గత వారం ఖరారైన సంగతి తెలిసిందే. రూ.18.98 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ నిర్మాణ పనులకు మూడో విడతగా మే నెలలో పిలిచిన నోటిఫికేషన్‌కు ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా, రాజమహేంద్రవరానికి చెందిన గాలి సుబ్బరాజు అండ్ కంపెనీ 3.69 శాతం తక్కువకు టెండర్ దక్కించుకుంది. దీంతో ‘ప్రసాద్’ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణ మాసంలో ఈ పనులు ప్రారంభించనున్నారు. టెండర్ ఖరారుకు ముందే టూరిజం శాఖ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య అన్నవరం దేవస్థానానికి విచ్చేసి, ప్రసాద్ నిర్మాణాల స్థలాలకు జియో ట్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రసాద్ స్కీం నిర్మాణాలివీ.. ● రూ.11.09 కోట్ల వ్యయంతో పాత టీటీడీ భవనం పక్కనే రెండంతస్తుల అన్నదాన భవనం ● ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.5.9 కోట్ల వ్యయంతో క్యూ కాంప్లెక్స్ ● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా రూ.61.78 లక్షల వ్యయంతో నిర్మించనున్న టాయిలెట్స్ బ్లాక్‌లు ● రూ.1.08 కోట్ల వ్యయంతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ ● రూ.91.96 లక్షల వ్యయంతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ ఇవే కాకుండా ప్రసాద్ నిధులతో దేవస్థానానికి రూ.కోటి వ్యయంతో రెండు బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. వీటిని దేవస్థానంలో సత్రాల నుంచి స్వామివారి ఆలయం, వ్రత మంటపాల మధ్య భక్తులను తరలించేందుకు ఉపయోగించనున్నారు. శంకుస్థాపనకు ఏర్పాట్లు అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ నిధులతో వివిధ నిర్మాణాలకు శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనంతరం నిర్మాణాలు వేగంగా కొనసాగించి, రెండేళ్లలోపు పూర్తి చేస్తాం. – ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, టూరిజం శాఖ పట్టాలెక్కనున్న ‘ప్రసాద్’ నిర్మాణాలు అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణాలకు త్వరలో శంకుస్థాపన -
డిమాండ్లు నెరవేర్చాలి
మత్స్యకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తాం. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పాలక యంత్రాంగం పెడచెవిన పెడుతోంది. ఇది చాలా దారుణం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే తినడానికి తిండి లేక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటమి పాలకులు వెంటనే స్పందించి మత్స్యకారుల డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. – సంగాడి ఈశ్వరరావు, మత్స్య కార్మిక సంఘం నాయకుడు, కాకినాడ ● -
రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం
జెడ్పీ చైర్మన్ విప్పర్తి సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పాలన గాడితప్పి ఎమెర్జెన్సీ నడుస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ విమర్శించారు. కక్ష సాధింపులతో కూటమి పాలన సాగుతోందన్నారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకై ్సజ్ శాఖకు ఎటువంటి సంబంధం లేకున్నా అన్యాయంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదుచేయడం కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతోందన్నారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తప్పుడు కేసులో ఇరికించి ఇరుకున పెట్టడం చాలా బాధాకరమన్నారు. 2014–19లో మద్యం మాఫియా నడిచిందని, ఇప్పుడు కూడా అదే సాగుతోందని రాష్ట్రం కోడైకూస్తోందన్నారు. రాష్ట్రంలో 4,380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్‌షాపులు, పర్మిట్ రూమ్‌లు ప్రైవేటు మాఫియాకు అప్పగించారన్నారు. ఇటువంటి వాస్తవాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికై నా కూటమి సర్కార్ స్వస్తి పలికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విప్పర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీకి మరో అవార్డు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీకి ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.సుబ్బకృష్ణ స్మారక అవార్డు–2025 లభించింది. యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో 19 గిరిజన భాషలకు లిపి అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మణిపూర్‌లోని ఇంఫాల్(నార్త్)లోని క్లాసిక్ హోటల్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ఖ పాపులేషన్ ఎడ్యుకేషన్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి నారీ శక్తి అవార్డును, 2025కు నెల్సన్ మండేలా ఇన్స్పైర్ అవార్డును ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసన్నశ్రీని పలువురు అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. అదనపు సిబ్బందిని నియమిస్తాం రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్ సంబంధిత ఇబ్బందులు పరిష్కరించేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. పారిశ్రామిక, వ్యాపార సంబంధ సమస్యలపై వెంటనే తనిఖీలు చేసి, పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. బుధవారం రాజమ హేంద్రవరంలో ఆయన విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పనులు, ఆర్డీఎస్ఎస్ పను లపై ఆరా తీశారు. దరఖాస్తు చేసిన రైతులందరికీ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గోదా వరి పుష్కరాలకు విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ వ్యవ స్థపై కొందరు అపోహలు, గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 75 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్‌కుమార్, ఈఈ నక్కపల్లి శ్యామ్యూల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మిథున్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాసలామ్ సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబాసలామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అబద్ధపు వాగ్దానాలు చేసిందన్నారు. వాటిని నిలబెట్టుకోలేక, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు భయపడేది లేదని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. రాములోరి సాక్షిగా ‘బెల్టు’కు వేలం చినవలసలలో రూ.7 లక్షలకు ఖరారు! తాళ్లరేవు: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామ స్థాయిలో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అనధికారికంగా నిర్వహిస్తున్న వేలం పాటలకు సాక్షాత్తు రాములోరి ఆలయాన్ని వేదికగా చేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. శివారు మత్స్యకార గ్రామం గాడిమొగ పంచాయతీ చినవలసలలోని రామాలయంలో నిర్వహించిన వేలం పాటలో రికార్డు స్థాయిలో సుమారు రూ.7 లక్షలకు పాట ఖరారైనట్టు తెలిసింది. నూతనంగా ఎన్నికై న గ్రామ పెద్దల సమక్షంలో గంగాధరరావు అనే వ్యక్తి ఏడాది పాటు మద్యాన్ని విక్రయించుకునేందుకు ఈ పాట దక్కించుకున్నట్టు చెబుతున్నారు. మద్యం విక్రయాలకు పాట పెడుతున్నారని, పాడుకునేవారు రావాలంటూ చాటింపు వేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అటు పోలీసులు కానీ, ఇటు ఎకై ్సజ్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం నిర్వహించిన వేలం విషయాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బయటపెట్టడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
క్రీడలతో శారీరక, మానసిక వికాసం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, క్రీడల తో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని ఎల్ఐసీ రాజమండ్రి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహూ అన్నారు. రాజమహేంద్రవరం సూర్య గార్డెన్స్‌లో బుధవారం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి సత్యనారా యణ సాహూ మాట్లాడుతూ, విధి నిర్వహణలో బిజీగా ఉండే ఎల్ఐసీ ఉద్యోగులు ఇలాంటి పోటీలతో మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యం పొందవచ్చన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 82 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్టు తెలిపారు. క్యారమ్స్ ప్రపంచ, జాతీయ చాంపియన్లు అపూర్వ, పి.నిర్మల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ అని నిర్వాహకులు చెప్పారు. క్యారమ్స్ అంతర్జాతీయ రిఫరీ షేక్ జలీల్, చెస్ అంతర్జాతీయ రిఫరీ జీవీ కుమార్ పర్యవేక్షణలో పోటీలు కొనసాగాయి. ఎల్ఐసీ పీఅండ్ఐఆర్ మేనేజర్ ఎం.పూర్ణచంద్రరావు, స్పోర్ట్స్ బోర్డు మెంబర్లు సురేష్, శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసీ ఎస్డీఎం సాహూ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ పోటీలు ప్రారంభం -
స్థిర భూగర్భ జల నిర్వహణపై శిక్షణ
రాజానగరం: స్థిరమైన భూగర్భ జల నిర్వహణను నిర్థారించడానికి యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థల మధ్య శాసీ్త్రయ, సమాజ ఆధారిత సహకారం ఉండాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ సెమినార్ హాలులో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సదరన్ రీజియన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో స్థిర భూగర్భ జల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని యూనివర్సిటీలో బుధవారం ప్రారంభించారు. ‘గ్రౌండ్ వాటర్ సబ్స్టైనబుల్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఈస్ట్ గోదావరి’ అనే అంశంపై మూడు రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ బోర్డు రీజినల్ డైరెక్టర్ జ్యోతికుమార్, డిప్యూటీ డైరెక్టర్ వై.శ్రీనివాస్ భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాన్వేషణ, రీచార్జ్ పద్ధతులపై పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. -
ఆటోలో తిప్పి.. తీవ్రంగా కొట్టి..
అమలాపురం టౌన్: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షల వసూలు చేశారన్న వివాదంలో దళిత యువకుడితో పాటు, మున్సిపల్ మాజీ ఉద్యోగిని ఆరుగురు తీవ్రంగా హింసించిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బు వసూలు చేశారనే వివాదంలో అయినవిల్లి మండలం వెలవెలపల్లికి చెందిన అధ్యాపకుడు దోనిపాటి మహేష్, మున్సిపల్ మాజీ ఉద్యోగి సిరసపల్లి ఉదయశంకర్‌ను తమ డబ్బులు ఎప్పుడిస్తారంటూ ఆరుగురు నిందితులు ఆటోలో పలుచోట్ల తిప్పి, తీవ్రంగా కొట్టారు. అమలాపురం పట్టణం శ్రీరామపురానికి చెందిన యల్లమెల్లి విజయ్ రవిశంకర్, అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లికి చెందిన ఉరదల బాలరాజు, విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన యర్రా కృష్ణను ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పెద్ద సార్ మాట్లాడుతున్నారని.. మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏడుగురు నిరుద్యోగుల నుంచి మున్సిపల్ మాజీ ఉద్యోగి సిరసపల్లి ఉదయశంకర్ రూ.లక్షల్లో వసూలు చేశాడు. అదిగో ఇదిగో ఉద్యోగమంటూ నిరుద్యోగులను మభ్య పెట్టాడు. వారిని నమ్మించేందుకు ఉదయ్శఽంకర్ ‘పెద్ద సార్ మాట్లాతున్నార’ని దోనిపాటి మహేష్‌తో ఫోన్ మాట్లాడించాడు. పలుమార్లు ఫోన్ కాన్పరెన్స్‌ను నిర్వహించి, నిరుద్యోగులతో పాటు, నిందితులతో మాట్లాడించేవాడు. అప్పటికే మహేష్‌కు ఉదయ్‌శంకర్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా, ఇలా పెద్ద సార్‌గా మాట్లాడితే వచ్చిన డబ్బుతో బాకీ ఇచ్చేస్తానని మహేష్‌ను నమ్మించాడు. ఇందులో భాగంగా నిందితులు యల్లమెల్లి విజయ్ రవిశంకర్ తదితరులు మహేష్‌కు ఫోన్ చేసి తాము చెప్పిన చోటికి రాకపోతే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడి మహేష్.. అప్పటికే బందీగా ఉన్న ఉదయ్‌శంకర్‌ను డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విజయ్ రవిశంకర్ బ్యాచ్ వద్దకు వచ్చారు. పేరూరు వై.జంక్షన్‌కు వచ్చిన మహేష్‌తో పాటు, ఉదయ్‌శంకర్‌ను బోడసకుర్రు గోదావరి గట్టు వద్దకు తీసుకెళ్లి, పగులగొట్టిన బీరు బాటిళ్లతో చంపేస్తామని బెదిరించారు. రబ్బరు ట్యూబ్, కర్ర, కొబ్బరి మట్టతో తీవ్రంగా కొట్టారు. అక్కడి నుంచి మరో రెండు చోట్లకు ఆటోలో తీసుకెళ్లి, ఇద్దరినీ చిత్రహింసలు పెట్టారు. అయితే ఉదయ్‌శంకర్ తప్పించుకోవడంతో, తీవ్ర గాయాలతో ఉన్న మహేష్‌ను వారు వదిలిపెట్టారు. కులం పేరుతో మహేష్‌ను నిందితులు దూషించారు. మహేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ బృందం బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల నుంచి ఆటో, దాడికి వాడిన రబ్బరు ట్యూబ్, కొబ్బరి మట్టను స్వాఽధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఆరుగురిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ముగ్గురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్సీ ప్రసాద్ -
రిగ్గులతో మత్స్యకారులకు నష్టం
సముద్రంలో రిలయన్స్, ఓఎన్జీసీ రిగ్గుల వల్ల కాకినాడ జిల్లాలో అద్దరిపేట నుంచి గాడిమొగ వరకున్న తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవితాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సముద్రంలో కాలుష్యం పెరిగి, మత్స్య సంపద తగ్గి మత్స్యకారులు చేపల వేట సాగక తీవ్రంగా నష్టపోతున్నారు. తీరం వెంబడి ఉన్న వివిధ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగి, చేపలు దొరక్క మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఇదే విషయమై గత ఎన్నికల్లో మా సమస్యలను కూటమి నేతల దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటిచ్చారు. ఎన్నికలయ్యాక వాటిని విస్మరించారు. దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. మూడు రోజుల క్రితం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులో లేకపోగా, ఆయన ఇన్చార్జి కూడా అందుబాటులో లేక పోవడంతో మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. చివరకు మా వినతిపత్రం జనసేన నేతలు తీసుకున్నారు. వారు స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. మా డిమాండ్లు అమలు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదు. – సీహెచ్ రమణి, ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం, ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కాకినాడ ● -
నిర్బంధంతో పోరాటాలు అణచలేరు
సాక్షి, రాజమహేంద్రవరం: నిర్బంధాలతో పోరాటాలను అణచలేరని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రా పేపరు మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. మిల్లు కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండుతో మంగళవారం నుంచి ఆయన చేపట్టాలనుకున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు సోమవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. రాజాను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్‌లోని తన నివాసం వద్ద రాజా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో చెప్పి, వారి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని, ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించానని, అయితే మిల్లు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాం. సమస్య పరిష్కారమపోతుందని కూటమి నేతలు చెప్పడంతో దీక్షను వాయిదా వేశానని వివరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, కానీ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న వారిని అణచివేస్తున్నారని అన్నారు. పేపరు మిల్లులో సుమారు 2,500 మంది కార్మికులున్నారని, వారి వేతన సవరణ, ఇతర సౌకర్యాల కల్పనలో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ విధానాలకు తావు లేదన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఇవే విధానాలను అవలంబిస్తే కూటమి నేతలను ప్రజలు బయట తిరగనివ్వబోరని చెప్పారు. పేపరు మిల్లు కార్మికుల సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి పోరాడతామని వెల్లడించారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. పేపరు మిల్లు యాజమాన్యం కొమ్ములు వంచైనా కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి హౌస్ అరెస్టు పేపరు మిల్లు కార్మికుల సమస్యలపై జక్కంపూడి రాజా తొమ్మిది రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారు. మిల్లు కార్మికులకు వేతన సవరణ చేయాలని, చట్టపరంగా అన్ని సౌకర్యాలూ కల్పించాలనే డిమాండ్లతో మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో రాజా ఉంటున్న కృష్ణసాయి కల్యాణ మండపం వద్దకు దాదాపు 150 మంది పోలీసులు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడ నానా హంగామా చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజాను ఆయన ఇంటికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించగా.. పేపరు మిల్లుకు 500 మీటర్ల దూరంలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదని చెప్పారు. రాజాతో పాటు మరో 50 మందిని ముందస్తుగా అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుచరులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, తెల్లవారుజామున ఇళ్లకు పంపడం దారుణమని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతల మద్దతు పోలీసుల నిర్బంధంలో ఉన్న రాజాను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, యువజన విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, కాకినాడ సిటీ అధ్యక్షుడు రోకళ్ల సత్య, నేతలు కర్రి పాపారాయుడు, రామలింగం, శ్రీనివాస్, దీపక్, స్థానిక నాయకులు గేడి అన్నపూర్ణరాజు, దుంగ సురేష్, ఆశోక్‌కుమార్ జైన్, పసుపులేటి కృష్ణతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలసి మద్దతు తెలిపారు. ఫ పేపరు మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదు ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫ ఆమరణ దీక్షను అడ్డుకున్న పోలీసులు ఫ అర్ధరాత్రి హంగామా.. హౌస్ అరెస్టు ఫ రాజాకు పలువురి పరామర్శ -
ఇవేం రోడ్లురా బాబూ!
గోపాలపురం: గోపాలపురం మండలంలో పలు రహదారులు ఛిద్రమయ్యాయి. గజానికో గొయ్యి అన్నట్టుగా మారడంతో ప్రయాణికులు నానా యాతనలూ పడుతున్నారు. సంక్రాంతి నాటికే రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూటమి సర్కారు గొప్పగా చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రోడ్ల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా వెచ్చించ లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ఆర్అండ్బీ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న దాఖలాల్లేవని వాపోతున్నారు. ఫ దేవరపల్లి – తల్లాడ జాతీయ రహదారిపై గోపాలపురం – కొయ్యలగూడెం మధ్య మాతంగమ్మ ఆలయం సమీపాన ఉన్న కల్వర్టుకు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. రాత్రి వేళల్లో వాహనదారులు ఆ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. గోతుల్లో పడిన భారీ వాహనాలు కమాన్ కట్టలు విరిగిపోయి రోజుల తరబడి రోడ్డు పక్కనే నిలిచిపోతున్నాయి. ఫ గోపాలపురం – దేవరపల్లి పొగాకు బోర్డు సమీపాన రోడ్డు దెబ్బతింది. ఇక్కడ ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని రీతిలో మలుపులుండటంతో వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఫ గోపాలపురం – గుడ్డిగూడెం రోడ్డులో పిచ్చుక గండి సమీపాన పెద్ద గుంత పడింది. ఫ గోపాలపురం – భీమోలు రోడ్డు కల్వర్టుకు ఇరువైపులా పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ఆ గోతులు కనిపించకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిత్యం ప్రమాదాలు జరుగుతున్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
రుణాలివ్వకపోవడం అన్యాయం
కార్పొరేషన్ రుణాల పేరు చెప్పి, కాపులను ప్రభుత్వం దగా చేసింది. అందరికీ రుణాలని ఆశలు కల్పించి, తీరా యూనిట్ల మంజూరు సమయం వచ్చేసరికి చేతులెత్తేయడం చంద్రబాబు సర్కార్‌కు కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ జనాన్ని ఇలానే నమ్మించి మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సబ్సిడీ సొమ్ము విడుదల చేయలేనప్పుడు అంత హడావుడిగా రుణ ప్రణాళిక ప్రకటించడమెందుకు? రుణాల మంజూరు ప్రక్రియ మొదలై ఐదు నెలలైనా ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరికై నా రుణం మంజూరు చేసి ఉంటే చెప్పాలి. – రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం కార్యదర్శి, కాకినాడ వెంటనే మంజూరు చేయాలి కుటుంబ పోషణ కోసం వస్త్ర, కిరాణా దుకాణాలు పెట్టుకుందామని బీసీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఆ రుణం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఐదు నెలలు గడచినా ఇప్పటి వరకూ రుణం మంజూరు కాలేదు. అధికారులను అడిగితే లబ్ధిదారుల లిస్టు పంపామంటున్నారు. రుణాలు మంజూరైన జాబితాయే రాలేదనీ చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన బీసీ రుణాలు మంజూరు చేయాలి. – గుబ్బల వీర వెంకట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, రాజోలు అసలు ఇస్తారా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కార్పొరేషన్ రుణాలు వస్తాయని దరఖాస్తుదారులు మూడు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రుణాలు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. రుణాలు వెంటనే మంజూరు చేయాలి. స్వయం ఉపాధికి అవకాశాలు మరింత పెంచాలి. రుణాలకు సంబంధించి సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేయకుంటే బ్యాంకులు మాత్రం ఎలా రుణాలు ఇస్తాయి? – దుర్వాసుల సత్యనారాయణ, బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు, రాజమహేంద్రవరం ఆశలు ఆవిరి ప్రభుత్వం రాయితీ రుణాలిస్తుందని ఆశపడి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మండల స్థాయిలో జాబితాలపై పరిశీలన జరిపి, బ్యాంకుకు వెళ్లేసరికి ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయలేదని సమాధానం చెబుతున్నారు. సర్కారు ఉదాసీనత కారణంగా ఐదు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుతున్నా ఫలితం ఉండటం లేదు. అసలు రుణాలిస్తారో ఇవ్వరో అర్థం కావడం లేదు. – వేట్ల నాగేశ్వరరావు, మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు, రామచంద్రపురం -
దారుణ మోసం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాయితీ రుణాలతో స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని కూటమి సర్కార్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు రుణాలిస్తామని, సగం సబ్సిడీ అని, మిగిలిన సగం బ్యాంక్ రుణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గొప్పగా డప్పేశారు. బీసీ, ఎస్సీ, కాపు సామాజికవర్గాలకు రుణాలో రుణాలంటూ దండోరా వేసి మరీ ప్రచారం చేశారు. మంత్రుల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి అందరికీ సబ్సిడీ రుణాలంటూ ఊదరగొట్టారు. మాయ మాటలతో జనాన్ని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కారు. తరువాత ఎప్పటి మాదిరిగానే నిలువునా ముంచేశారు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలు రాకపోవడంతో.. స్వయం ఉపాధి పొందవచ్చని ఆశపడిన వారు హతాశులవుతున్నారు. అంతన్నారింతన్నారే చంద్రబాబు.. నట్టేట్లో ముంచేశారే.. అని మండిపడుతున్నారు. లక్ష్యం మూరెడు.. దరఖాస్తులు బారెడు బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన వారికి రాయితీ రుణాలిస్తామని సర్కారు ఊరూవాడా ఊదరగొట్టింది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి రుణ లక్ష్యాలు వందల్లోనే ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో అన్ని కార్పొరేషన్లు కలిపి సుమారు 100 యూనిట్లు కేటాయిస్తే అంతకు పది రెట్లు దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం మార్చి 11న ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఆ నెలంతా స్వీకరించడంతో వేలాదిగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వాటిని ఏప్రిల్ నెలలో మండల స్థాయిలో వడబోసిన ఎంపీడీఓలు.. ఆయా బ్యాంకులకు పంపించారు. బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. బ్యాంకుల నుంచి ఆమోదం లభించిన వారంతా శ్రావణమాసం మంచి రోజుల్లో యూనిట్లు ప్రారంభిద్దామని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కానీ, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. మంజూరు చేసిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు ఎక్కడా లంగరు అందకపోవడంతో ప్రభుత్వం మార్జిన్ మనీ విడుదల చేయకుండానే కార్పొరేషన్ రుణ ప్రక్రియను అప్పటికప్పుడు నిలిపివేసింది. ఈ రుణాలపై ముందుకు వెళ్లవద్దని మే 8న ఆదేశాలిచ్చింది. ఫలితంగా కార్పొరేషన్ రుణాల ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క యూనిట్ కూడా ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. ఒక యూనిట్ విలువ రూ.2 లక్షలనుకుంటే అందులో 50 శాతం అంటే రూ.లక్ష ప్రభుత్వ సబ్సిడీ. మిగిలిన రూ.లక్ష బ్యాంకు రుణం. ఇస్తానన్న 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేయకుండా మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోంది. రుణాల పేరిట దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఎందుకు.. ఇప్పుడు తమ ఆశలను అడియాశలు చేయడం ఎందుకని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినా ప్రభుత్వం కావాలనే సబ్సిడీ విడుదల చేయకుండా చివరి నిమిషంలో అర్ధాంతరంగా ఈ ప్రక్రియను నిలిపివేసిందని మండిపడుతున్నారు. పెద్దాపురంలో కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూలకు హాజరైన అర్జీదారులు (ఫైల్) మూడు జిల్లాల్లో ఆయా కార్పొరేషన్ల వారీగా రుణాల వివరాలురుణాల కేటగిరీ యూనిట్ల రుణాల లక్ష్యం దరఖాస్తు మంజూరు మొత్తం లక్ష్యం (రూ.లక్షలు) దార్లు చేసిన (రూ.కోట్లు) యూనిట్లు కాకినాడ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,914 3,952.00 31,859 562 1,283.55 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 2,449 41 84.42 కాపు కార్పొరేషన్ 763 2,824.00 21,454 238 5.93 తూర్పుగోదావరి జిల్లా బీసీ కార్పొరేషన్ 1,374 2,887.00 16,408 234 5.22 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 203 540.00 2,211 20 0.54 కాపు కార్పొరేషన్ 757 2,715.00 8,193 174 4.53 కోనసీమ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,394 2,954.00 15,147 246 5.87 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 1,657 12 0.24 కాపు కార్పొరేషన్ 757 2,714.00 15,644 158 4.62 ఒక్క యూనిట్ అయినా ఇస్తే ఒట్టు! ఊదరగొట్టి ఉసూరుమనిపించారు మూడు నెలలైనా దిక్కూమొక్కూ లేదు సబ్సిడీపై చేతులెత్తేసిన సర్కార్ -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిపై మడికి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వెంపల చంద్రశేఖర్ (50) మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం అయినవిల్లి మండలంలోని ముక్కామల సమీపంలోని ఇరుసుమండకు చెందిన చంద్రశేఖర్ తన వ్యాన్‌పై సమీపంలోని కొత్తపేట నుంచి లోడు వేసుకుని రాజమహేంద్రవరం బయలుదేరాడు. రావులపాలెం వచ్చేసరికి ఒక ప్రయాణికుడిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. స్థానిక అంతర్రాష్ట కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి వ్యాన్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడిని బయటకు తీసేందుకు పోలీసు, హైవే సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఎన్‌హెచ్ అంబులెన్స్‌పై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై జి.నరేష్ కేసును నమోదు చేయగా రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇరుసుమండలో విషాద ఛాయలు అంబాజీపేట: చంద్రశేఖర్ మృత్యువాత పడటంతో ఇరుసుమండలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రామలక్ష్మి, కుమారులు పవన్, చందు ఉన్నారు. అందరితో కలిసి ఉండే చంద్రశేఖర్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని స్వగ్రామం తాడేపల్లిగూ డెం మండలంలోని మిలటరి మాధవరం. అయి తే 30 ఏళ్ల క్రితం వివాహనంతరం ఇరుసుమండ వచ్చి ఇక్కడే ఉంటున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక వైఎస్సార్ జంక్షన్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన చవల శ్రీనివాస్ (38) రాగితో తయారు చేసిన ఉంగరాలు, కడియాలను తీర్థాలలోను, గ్రామ గ్రామం తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అవివాహితుడైన అతను తల్లితో కలిసి కొంతమూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలో పెద్దాపురంలోని మరిడమ్మ తీర్థంలో రాగి వస్తువులను అమ్ముకునేందుకు తన యాక్టివా స్కూటర్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అతనిని ఢీ కొని, కొద్దిదూరం బైకుతో సహా ఊడ్చుకుంటూ పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అదే లారీ డ్రైవర్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా యాక్టివా స్కూటర్‌పై ప్రయాణిస్తూ తలకు హెల్మెట్ ధరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కొడుకే ఆధారంగా ఉన్న ఆ వృద్ధ తల్లి అనాథగా మిగిలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
● చెరువులో దూకిన వారిని కాపాడిన స్థానికులు ● పురుగులు మందుకూడా తాగినట్లు పోలీసుల వెల్లడి ● సంతానం పట్టించుకోకపోవడమే కారణం? జగ్గంపేట: జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనం సాగించవలిసిన వృద్ధ దంపతులు జీవితంపై విరక్తితో పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చోటు చేసుకుంది. అయితే స్థానికులు ఘటన జరిగిన వెంటనే స్పందించి వృద్ధ దంపతులను కాపాడి జగ్గంపేటలోని సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం తొండంగి మండలం ఏవీ నగరం గ్రామానికి చెందిన 70 ఏళ్ల సక్కుల సత్యనారాయణ, 65 ఏళ్ల సక్కుల మంగతాయారు దంపతులు. సత్యనారాయణ పెద్దాపురంలో శ్రీ చక్ర హాస్పిటల్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. సంతానం ఈ దంపతుల మంచి చెడ్డలు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందినట్టు భావిస్తున్నామన్నారు. దీంతో మంగళవారం జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చెరువు వద్దకు చేరుకుని పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకారు. అయితే అక్కడ వున్న స్థానికులు దీన్ని గమనించి వారిని రక్షించి చెరువు గట్టుపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని జగ్గంపేట సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. -
నిడదవోలులో చోరీ
నిడదవోలు: పట్టణంలోని సంజీవయ్యనగర్‌లో సోమవారం రాత్రి దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. గొట్టుముక్కల నాగేశ్వరరావు తన కుటంబ సభ్యులతో ఈ నెల 19న హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు ముందుగా ప్రధాన ద్వారానికి వేసిన తాళం పెకిలించి ఇంట్లోకి ప్రవేశించారు. గదిలో బీరువా తెరచి లాకర్లో దాచుకున్న రెండు కాసుల బంగారు వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించారు. ఇంటి యజమాని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి గురైన నగదు, నగలు స్వాధీనం
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో ఇటీవల పేంటి మరియమ్మ ఇంట్లో చోరీకి గురైన రూ.30 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు రౌతులపూడి ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన రౌతులపూడికి చెందిన పేంటి మరియమ్మ ఇంట్లో చోరీ జరిగిందని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు. ఈ నేపథ్యంలో రౌతులపూడి శివారు మరిడమ్మతల్లి గుడి వద్ద ఇద్దరు బాలుర నుంచి రూ.30వేలు నగదు, 30గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. బాలురను జిల్లా ప్రొహిబిషన్ అధికారి వద్ద హాజరు పరచామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ డీవీ రమణ, కానిస్టేబుళ్లు బోస్, నూకరాజు, ఉదయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలి
అరుణోదయ విమలక్క డిమాండ్ పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంత మత్స్యకారులను రోడ్డున పడేసే కాలుష్య కారక పరిశ్రమలు నిలిపివేయాలని అరు ణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ విమలక్క విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఐఎఫ్టీయూ 34వ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ మంగళవారం స్థానిక సూర్యరాయ గ్రంథాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సభాస్థలి వరకు కార్మికులు ఎరజ్రెండాల చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి విమలక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. తీర ప్రాంతంలో పలు విషతుల్యమైన పరిశ్రమల వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందన్నారు. దీనివల్ల తీర ప్రాంతంలో హేచరీస్ కనుమరుగైపోతాయని, అనేకమంది ఉపాధి దెబ్బతింటుందన్నారు. ప్రధాన వక్త ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని విమర్శించారు. అదానీకి లబ్ధి చేకూర్చడం కోసం స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమరుస్తున్నారని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరీం బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కరోనా కాలంలో 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదిస్తూ చట్టం చేసిందని, దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గొల్ల అంజయ్య, ఏపీ ఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏపీఆర్సీఎస్ సీనియర్ నాయకులు కొండ దుర్గారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి సుధాకర్, తెలంగాణ అధ్యక్షుడు మల్సూర్, ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) కన్వీనర్ డొక్కులూరి సంగీత పాల్గొన్నారు. -
మిథున్‌రెడ్డిది ముమ్మాటికీ అక్రమ అరెస్టే
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎంపీ మిథున్‌రెడ్డిని ముమ్మాటికీ అక్రమంగానే అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. సెంట్రల్ జైలు వద్ద మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగిందని మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించా రు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మద్యంపై రూ.16,500 కోట్ల వార్షిక ఆదాయం వస్తే, అది జగన్ ప్రభుత్వ హయాంలో రూ.25 వేల కోట్లకు పెరిగిందన్నారు. పైగా ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. జగన్ హయాంలో కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదని, గతంలో చంద్రబాబు హయాంలోనే ఇచ్చారని చెప్పారు. లిక్క ర్ స్కామ్ అనడమే తప్ప 13 నెలల కూటమి పాలనలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో తేల్చారా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నందున అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు రోజే వైఎస్సార్ సీపీ ఎంపీ, ఫ్లోర్‌లీడర్‌ను అరెస్టు చేయడం ద్వారా సంచలనం సృష్టించాలన్నది ప్రభుత్వ దురుద్దేశమని విమర్శించారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ముడిపెడుతు న్నారని మండిపడ్డారు. ఏవో రెండు డిస్టిలరీలను సీజ్ చేసి, వాళ్ల ఆస్తుల జప్తు చేశామని చెప్తే సరిపోదన్నారు. కేవలం ఒత్తిడితోనే సిట్ పని చేస్తోందని అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు 300 పేజీల చార్జిషీటు తయారు చేసేస్తే నిజం కాబోదని, మిథున్‌రెడ్డి క్లీన్ చిట్‌తో బయటకు వస్తారని చెప్పా రు. కోర్టు సూచనల ప్రకారం జైలులో ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించకపోవడం అధికారులకు తగదని భరత్‌రామ్ అన్నారు.ఫ జగన్ హయాంలో మద్యం ఆదాయం పెరిగింది ఫ ప్రభుత్వమే విక్రయిస్తే అవినీతి ఎక్కడ? ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ -
మందుల దుకాణాల్లో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో మత్తు, వయాగ్రా మందుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 80 మందుల దుకాణాలకు పైగా తనిఖీ చేసినట్లు డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. దుళ్లలోని శ్రీశ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, శ్రీ మెడికల్స్‌లో డ్రగ్స్ అధికారులు దాడులు చేయగా అక్కడ ఫార్మాసిస్ట్ లేకపోవడం, బిల్లులు లేకుండా అమ్మకాలు చేయడం, షెడ్యూల్ రిజిస్టర్ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మందులు లభించడం కనుగొన్నామన్నారు. వీటితో పాటు మరికొన్ని దుకాణాలు ఇదే విధంగా ఉన్నాయని, వాటన్నింటిపై కేసులు నమోదు చేశామన్నారు. -
ముద్రగడ క్షేమంగానే ఉన్నారు
ముద్రగడ పెద్ద కుమారుడు వీర్రాఘవరావు కిర్లంపూడి: మాజీ మంత్రి, రాష్ట్ర వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులు ముద్రగడ పద్మనాభం క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు (బాలు)తెలిపారు. ముద్రగడ ఇటీవల అస్వస్థతకు గురికాగా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికేమి ఢోకా లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉండడంతో తన తండ్రి వద్దకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని దయచేసి ఎవరూ ఆసుపత్రికి వెళ్లొద్దని వీర్రాఘవరావు కోరారు. విద్యతోపాటు క్రీడలూ అవసరమే రాజానగరం: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, వాటికి కూడా తగిన సమయాన్ని కేటాయించి, క్రీడలలోనూ మంచి ప్రతిభను చాటాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో యూనివర్సిటీ స్థాయిలో మూడు రోజులపాటు జరిగే 25 వ వుమెన్ స్పోర్ట్సు మీట్‌ని మంగళవారం గాలిలోకి బెలూన్స్‌ని వదిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 24 మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల నుంచి 567 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని యూనివర్సిటీ స్పోర్ట్సు క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఈ. త్రిమూర్తి తెలిపారు. వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, చెస్ వంటి ఆటలలో ఈ పోటీలు జరుగుతున్నాయని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పీడీ శ్రీనివాసరావు చెప్పారు. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ఎస్ మిశ్రా, సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్పీ మూర్తి పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన పోలిన వెంకట్రావు (70) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావు అనారో గ్యం బారిన పడ్డారు. ఆ బాధ తట్టుకోలేక సోమ వారం రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యు లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకట్రావు మంగళవారం ఉదయం 9 గంటలకు మరణించారు. ఆసుపత్రి సమాచారం, మృతుని కుమారుడు పోలిన వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు -
బ్రాండ్ బాజా!
జిల్లా పేరు మద్యం గీత కార్మికుల మొత్తం దుకాణాలు షాపులు కోనసీమ 133 13 146 తూర్పు గోదావరి 125 12 137 కాకినాడ 155 15 170● బ్రూవరీస్ కార్పొరేషన్ నిర్వాకం ● బ్రాండు ఒకటే.. ధరలే వేరు ● మద్యం వ్యాపారుల సరికొత్త దోపిడీ ● అందుబాటులో లేని రూ.99 మద్యం ఆలమూరు: బ్రూవరీస్ కార్పొరేషన్ చేస్తున్న మద్యం సరఫరా, ధరల నిర్ధారణ ఒక ప్రహసనంలా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అండతో మద్యం సిండికేట్లు కుమ్మకై ్క మద్యం ప్రియుల బలహీనతలను ఆసరాగా తీసుకుని వారిని అనేక రూపాల్లో దోచుకుంటున్నారు. ఒకే మద్యం బ్రాండును ఒకే ధరకు విక్రయించవలసి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. బ్రాండు ఒకటే అయినా ధర మాత్రం వేర్వేరుగా ముద్రించి వసూలు చేయడం ద్వారా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోంది. దీంతో మద్యం కొనుగోలుదారుల్లో మద్యం ధరలపై అయోమయం నెలకొంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనున్న 453 మద్యం దుకాణాలకు అమలాపురం, రాజమహేంద్రవరం, సామర్లకోట బ్రూవరీస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరా జరుగుతుంది. మద్యం షాపుల స్థాయిని బట్టి 20 నుంచి 30 రకాల చీప్ లిక్కర్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకూ అందుబాటులో ఉంటున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చీప్ లిక్కర్ బ్రాండు అయిన 9 సీ హార్స్ కంపెనీ క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే గత ఏడాది నవంబర్‌లో తయారు చేసిన 179 బ్యాచ్ బాటిళ్లలో మూడు ఎంఆర్పీ ధరలు ఉండటం వినియోగదారులను నివ్వెర పరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.99 ధర కలిగిన మద్యం బాటిళ్లు ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ చీప్ లిక్కర్‌ను ఐదు కంపెనీలు సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో మద్యం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండటం లేదు. ఇదో రకం దోపిడీ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల వద్ద ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ముద్రించి దోచుకుంటున్నారని మద్యం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. 9సీ హార్స్ బ్రాండుకు చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ఒక్కొక్క చోట ఒక్కొ విధంగా రూ.120. రూ.130, రూ.140 ధరలు ముద్రించి ఉన్నట్లు బాటిళ్లను చూస్తే తెలుస్తోంది. ఈ ధరలు మద్యం విక్రయదారులు ముద్రించారా లేదా బ్రూవరీస్ కార్పొరేషన్ ముద్రించి అమ్మకాలు కొనసాగిస్తోందా అనే సందేహం కలుగుతోంది. ఈ ధరల తేడా వల్ల మద్యం కొనుగోలుదారులు సుమారు రూ.ఐదు లక్షల వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చీప్ లిక్కర్ ధరలను ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయించి ప్రజలతో చెలగాటం ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం దుకాణాల వద్ద విధిగా ఏర్పాటు చేయాల్సిన మద్యం ధరల పట్టిక కాని, స్టాకు వివరాలు కాని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఎంఆర్పీలో తేడా ప్రస్తుతం ఒక బ్రాండు కేనా మిగిలిన బ్రాండులపై కూడా తేడాగా ముద్రిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. కనిపించని రూ.99 మద్యం మద్యం షాపుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన మద్యాన్ని రూ.99 కే విక్రయిస్తామన్న కూటమి నాయకుల ఎన్నికల హామీ బుట్టదాఖలైంది. బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి రేషన్ పద్ధతిలో వారానికి దుకాణానికి మూడు మద్యం కేసులకు మించి సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. అలాగే రూ.99 మద్యం బాటిల్‌కు కమీషన్‌ను పూర్తిగా తగ్గించడంతో విక్రయదారులు కూడా ఆ బ్రాండ్లను అమ్మడానికి ఇష్టపడటం లేదని మద్యం ప్రియులు చెబుతున్నారు. -
పాలెం సర్పంచ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కడియం: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జేగురుపాడు ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు సాకా కిరణ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు బళ్ల అన్నవరం, మద్దుకూరి సూరిబాబు, మోటిక మునియ్య మంగళవారం కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను కిరణ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. 1977లో జేగురుపాడు గ్రామానికి చెందిన దళితులకు సర్వే నం.10లో 5.58 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. సర్వే నం.84, 86లో సుమారు పది ఎకరాల భూమిని మాధవరాయుడుపాలెం దళితులకు కూడా ఇచ్చిందన్నారు. ఆ భూమిలో దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి దళితుల భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో తన అనుచరులతో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 52 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేస్తారన్న భయంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శిలా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు, చేపల చెరువును కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తన రాజకీయ పలుకుబడితో రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని, దిమ్మెను దౌర్జన్యంగా తొలగించారన్నారు. అందువల్ల చంటిపైనా, అతనికి సహకరించిన వారిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేయాలని కోరారు. -
ఇదేం భోజనం.. ఇవేం సౌకర్యాలు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి స్థానిక ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలురు, బాలికల హాస్టల్‌ను, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను మంగళవారం సందర్శించారు. హాస్టళ్లలో వసతులు, ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడారు. గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో వసతులు, శుభ్రత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ కిటికీలకు దోమ తెరలు లేవని, బాత్ రూములకు డోర్లు లేవని, భోజనం చేసే స్థలం శుభ్రంగా లేదని, భోజనం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని వెంటనే మెరుగు పరచాలని సూచించారు. విద్యార్థులకు సురక్షిత తాగునీరు, మంచి ఆహారం అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి చెప్పారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏకి తెలియజేయాలని శ్రీలక్ష్మి సూచించారు.స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంత వరకూ పోరాటం ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకువచ్చిన స్మార్ట్ మీటర్లను రద్దు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. ఆ పార్టీ జిల్లా మహాసభల పోస్టర్‌ను స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్రంలో నాలుగుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా సామాన్యుడిపై మరింత భారం పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు అరకొరగా ఉందని విమర్శించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారంటూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆ ప్రాజెక్ట్‌కు సమాధి కడుతున్నారని వనజ ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ఆగస్టు 6, 7 తేదీల్లో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 17 మండలాలకు చెందిన ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతారన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
‘మా ఆకలి కేకలు పట్టవా?’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): సుపరిపాలన తొలి అడుగు అంటూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు చేపట్టామని గొప్పలు చెబుతున్న సీఎం, డిప్యూటీ సీఎంకు తమ ఆకలి కేకలు పట్టవా అని సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద వాటర్ ప్రాజెక్టు కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టి, కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీను, ఇసాక్ మాట్లాడుతూ, 19 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో.. కుటుంబ పోషణ కష్టమై సమ్మె బాట పట్టామన్నారు. 25 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ కట్టడం లేదని ఆరోపించారు. సుపరిపాలన అని చెప్పుకొంటూ తిరిగే నేతలకు తమ ఆకలి బాధ అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఈ సమ్మె కారణంగా సుమారు 85 గ్రామాల్లో దాదాపు మూడు లక్షల మంది మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తమ వేతనాల విషయమై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సమ్మె చేపట్టగా.. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చినప్పటికీ, అది ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం 52 మంది కార్మికుల కుటుంబాల ఆకలికేకలను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కె.రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంపై కార్మికుల మండిపాటు కళ్లకు గంతలతో సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు సిబ్బంది నిరసన -
జవహర్‌ను పదవి నుంచి తొలగించండి
● టీడీపీ దళిత నాయకుల డిమాండ్ ● కొవ్వూరులో ఎమ్మెల్యేని చుట్టుముట్టి ఆందోళన ● ‘పచ్చ’ పార్టీలో మరోసారి బయటపడిన విభేదాలు తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో పార్టీలోని రెండు వర్గాల్లో ఉన్న దళిత నాయకులు పరస్పర ఆరోపణలకు దిగారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. దీంతో వర్గపోరు రచ్చకెక్కింది. వివరాలివీ.. ఎంఆర్పీఎస్, దళిత సంఘాల నాయకులు ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. పశివేదల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఫ్లెక్సీలను కొంత మంది చించివేశారని ఆ సందర్భంగా ఆరోపణలు చేశారు. ఈ నెల 23లోగా నిందితులను గుర్తించి, అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని, లేకుంటే 24న ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు టీడీపీ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకులు సోమవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జవహర్ ఫ్లెక్సీలు చించివేయడానికి, తమకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. జవహర్ వర్గం కావాలనే టీడీపీ పరువు తీయడానికి చూస్తోందని ఆరోపించారు. అచ్చిబాబు వర్గంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు చించిన వారిపై తక్షణం కేసులు పెట్టాలంటూ కొవ్వూరు పోలీస్ స్టేషన్లో జవహర్ వర్గీయులు కొందరు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం, కొవ్వూరు ప్రెస్‌క్లబ్‌లో దళిత నాయకులు మాట్లాడుతూ, జవహర్‌పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. నియోజకవర్గం అంటేనే అచ్చిబాబు అని, ఆయనను ఏమైనా అంటే సహించేది లేదని అన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని పార్టీ పరువును జవహర్ బజారున పడేస్తానంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం పెట్టినవారు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన వారు కాదని, వారందరూ జవహర్ వర్గీయులేనని, కావాలనే కేసులు పెట్టి కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. వారిని వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోవాలని, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జనసేన నేత టీవీ రామారావు కూటమిలో తమకు ప్రాధాన్యం లేదని, సొసైటీ పదవుల్లో అన్యాయం జరిగిందని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా జవహర్ వర్గం మీడియా సమావేశం.. దానికి కౌంటర్‌గా కొవ్వూరు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ దళిత నాయకులు చేసిన ఆందోళనతో కూటమి పార్టీల పరువు బజారున పడింది. -
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దుర్మార్గం
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకు అద్దం పడుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మిథున్‌రెడ్డి అరెస్ట్ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అణచివేత ధోరణులను వైఎస్సార్ సీపీ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతుందని, దానిని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజా క్షేత్రం నుంచి జైళ్లలో వేయడం ద్వారా కూటమి నేతలు తమ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని చూస్తున్నారని, వాస్తవానికి ఏ ఒక్క వైఎస్సార్ సీపీ నాయకుడు, కార్యకర్త అణచివేతలకు భయపడరన్నారు. లిక్కర్ స్కాంలో తొలుత రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయితే సిట్ రిపోర్టులో కేవలం రూ.3,500 కోట్లుగా చూపించడం ప్రభుత్వ అసంబద్ద వైఖరికి నిదర్శనమన్నారు. మిథున్‌రెడ్డిపై ఆరోపణలు ఏమాత్రం నిలబడవన్నది వాస్తవమన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను బయటపెట్టాలన్నారు. సమావేశంలో పార్టీ మండపేట నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, దూలం వెంకన్నబాబు పాల్గొన్నారు. కక్ష సాధింపుతోనే మిథున్‌రెడ్డి అరెస్ట్ ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపుతోనే కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా, కేవలం వైఎస్సార్ సీపీ నేతలపై ఎలా తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెడదామనే దుర్మార్గపు ఆలోచనలతోనే పాలన చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ కూడా ఇలాంటి అక్రమ కేసుల కోసమే సమయాన్ని పూర్తిగా కేటాయించి, లా అండ్ ఆర్డర్‌కు పనిచేయడం లేదని విమర్శించారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలపై కోర్టులు అక్షింతలు వేస్తున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఎంపీగా, పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్‌గా మిథున్‌రెడ్డి పోలీసు దర్యాప్తునకు సహకరిస్తున్నా, సాక్ష్యాలను తారుమారు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని ఖండించారు. కుట్రలకు, అక్రమ కేసులకు తెరవెనుక సూత్రధారులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని పుత్రుడు, మంత్రి లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్‌సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నవోదయం ఏదీ..?
రాయవరం: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి కృషి చేస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టం కట్టి, వారికి ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఆలయంగా నవోదయ విద్యాలయం భాసిల్లుతోంది. అటువంటి నవోదయ విద్యాలయంలో సీటు వస్తే తమ పిల్ల భవిష్యత్తుకు ఢోకా ఉండదని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. అందుకే తమ పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కారణాలేమైనా ఈ ఏడాది దరఖాస్తుల ప్రక్రియ మందగించడంతో.. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నవోదయలో ఆరో తరగతిలో చేరాలంటే ప్రవేశ పరీక్షే ఆధారం. ఇందులో ప్రతిభ చూపితే సీటు ఖాయం. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఐదో తరగతిలో చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య నిరాశాజనకంగా ఉంది. ఈ నెల 29తో దరఖాస్తుల గడువూ ముగియనుంది. కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని విద్యార్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేయాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు, అధునాతన వసతుల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల్లో ప్రత్యేకత. అవగాహన లేక..? ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షకు మూడు జిల్లాల నుంచి కేవలం 668 దరఖాస్తు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లా నుంచి అతి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. 2023–24లో 8,506 దరఖాస్తులు రాగా, గతేడాది మూడు జిల్లాల పరిధిలో 8,971 దరఖాస్తులు వచ్చాయి. ఇలాఉంటే, ఈ ఏడాది 9 వేల వరకు దరఖాస్తులు వస్తాయనే అంచనాతో అధికారులు ఉన్నారు. గడువు సమీపిస్తున్నా తక్కువగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూసి అధికారులు విస్తుపోతున్నారు. దీనికి కారణం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించక పోవడమా, లేక వారిలో ఆసక్తి సన్నగిల్లడమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు వచ్చినా, రాకున్నా విద్యార్థులతో దరఖాస్తు చేయిస్తే, ఐదో తరగతిలోనే విద్యార్థులకు పోటీతత్వాన్ని అలవాటు చేయడం, ఆన్లైన్ పరీక్షను పరిచయం చేసినట్టవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లో ఈ ఏడాది ఐదో తరగతిలో సుమారు 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3, 4 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించి, ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. గతేడాది ప్రవేశ పరీక్షకు హాజరైన వారు అనర్హులు. జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన నేటి వరకు దరఖాస్తులు దరఖాస్తులు (గతేడాది) (ఈ ఏడాది) కోనసీమ 3,869 201 తూర్పు గోదావరి 1,741 107 కాకినాడ 3,361 360 జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు గణనీయంగా తగ్గిన దరఖాస్తులు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి అంతంతమాత్రం ఈ నెల 29తో ముగుస్తున్న గడువు గతేడాది వచ్చినవి 8,971 ఈ ఏడాది ఇంత వరకు 668 మాత్రమే.. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష పరీక్షా విధానమిలా.. నవోదయ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జిల్లాలో నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను(తెలుగు/ఇంగ్లిష్) ఎంచుకుని పరీక్ష రాయవచ్చు. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధా శక్తి(మెంటల్ ఎబిలిటీ)పై 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితం(అర్థమెటిక్), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షా పత్రాల రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, ప్రవేశానికి ఎంపికై న వారికి తొలి రెండేళ్లు తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో బోధిస్తారు. పోటీ పరీక్షలపై అవగాహన జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో సీటు పొందడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకు ఏటా దరఖాస్తు చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతారు. జిల్లాలో ఉన్న ఐదో తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఐదో తరగతి నుంచే పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచన చేసి, అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేయించాలి విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేసేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు ప్రతి విద్యార్థి దరఖాస్తు చేయడం ప్రధానమైన విషయంగా భావించాలి. ఈ నెల 29వ తేదీ దరఖాస్తుకు తుది గడువు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులను మూడు జిల్లాల విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పంపించాం. పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి, పెద్దాపురం డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి జవహర్ నవోదయలో గ్రామీణ పాంత విద్యార్థులకు అధిక శాతం సీట్లు కేటాయించడంతో వారికి ప్రయోజనం కలుగుతుంది. జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రవేశ పరీక్షను విద్యార్థులతో రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ -
నేటి నుంచి ఆమరణ దీక్ష
● పేపరు మిల్లు కార్మికుల సమస్యలపై ఇక తాడోపేడో ● వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా వెల్లడిరాజమహేంద్రవరం సిటీ: కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యను కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తారేమోనని వేచి చూశామన్నారు. సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో మిల్లు యాజమాన్యంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమని, మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. పేపరు మిల్లు మెయిన్ గేటు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణసాయి కల్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పేపరు మిల్లు ఎదురుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పాదాల చెంత ఆమరణ దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. దీనికి ఏపీ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషుబాబు సంఘీభావం తెలపనున్నారని చెప్పారు. మిల్లు కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాలు కల్పనలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక రూపాల్లో ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిందని, సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ యాజమాన్యంతో జరుగుతున్న చర్చలు సఫలం కావడం లేదని రాజా అన్నారు. యాజమాన్యం తీరు చూస్తూంటే సమస్యను పరిష్కరించకుండా వాయిదాలు వేస్తూ కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన కార్మిక యూనియన్ నాయకులు తనను విమర్శించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. గతంలో పేపర్ మిల్లులో ప్రభుత్వానికి 27 శాతం వాటా ఉండేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాటాను విక్రయించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి షేర్లు ఉండేటప్పుడు మిల్లుపై నియంత్రణ ఉండేదని, కార్మికులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం పరిష్కరించేదని అన్నారు. ప్రభుత్వం తన వాటా వదులుకున్న తర్వాత యాజమాన్యం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని చెప్పారు. యాజమాన్యం ఇంత అన్యాయం చేస్తోందంటే గుర్తింపు యూనియన్‌గా ఎవరున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. కాార్మికులకు వేతన ఒప్పందం విషయంలో ఇప్పుడు జరిగినంత జాప్యం గత 30 ఏళ్లలో ఎన్నడూ జరగలేదన్నారు. తాను చేస్తున్న ఉద్యమానికి పార్టీలోని ముఖ్య నాయకులు శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నందెపు శ్రీనివాస్, ఇతర నేతలందరూ మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. అవసరమైతే పేపరు మిల్లు సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకు వెళ్తామన్నారు. వాస్తవానికి ఈ నెల 9 నుంచే ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించామని, చర్చలు జరుపుతున్నామని, సమస్య పరిష్కారమవుతుందని కూటమి నాయకులు అనడం, కొద్ది రోజులు వేచి చూద్దామని కార్మిక నాయకులు చెప్పడంతో తన దీక్షను రెండుసార్లు వాయిదా వేసుకున్నానని రాజా చెప్పారు. విలేకర్ల సమావేశంలో నందెపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు బొంత శ్రీహరి, మానె దొరబాబు, మాసా రామ్‌జోగ్, బురిడి త్రిమూర్తులు, అడపా అనిల్, కోడి కోట, నాళం రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి సన్నిధికి వెంకన్న సారె
● మందపల్లి పార్వతీదేవికి వాడపల్లి నుంచి ఆషాఢ సారె సమర్పణ ● దేవస్థాన ముఖద్వారంలో ఘన స్వాగతం ● శాకంబరిగా పార్వతీదేవి దర్శనం కొత్తపేట: శనిదోష నివారణకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మందపల్లిలోని ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారి క్షేత్రంలో ఆషాఢ మాసం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. పార్వతీదేవి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి, సారె, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు అయిలూరి శ్రీరామమూర్తి, అర్చకులు, వేద పండితులు పార్వతీదేవి అమ్మవారితో పాటు, శనైశ్చర స్వామి, ఇదే క్షేత్రంలో వేంచేసిన బ్రహ్మేశ్వర, నాగేశ్వర స్వామివార్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషాలంకరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. కొనసాగుతున్న సంప్రదాయం కొన్నేళ్లుగా వస్తున్న ఆషాఢ మాస సంప్రదాయం ప్రకారం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి మందపల్లి పార్వతీదేవి అమ్మవారికి సారె పంపించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ రాంబాబు, దేవస్థానం సిబ్బంది, పండితులు సారె తీసుకురాగా.. రావులపాలెం–అమలాపురం ప్రధాన రహదారిలో శనైశ్చరస్వామి దేవస్థాన ముఖద్వారం వద్ద ఈఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, బాణసంచా కాల్పులతో భారీ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. మందపల్లి, ఏనుగుల మహల్, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. -
అరెస్టును ఖండిస్తూ మోకాళ్లపై నిరసన
అమలాపురం రూరల్: ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఆరోపణలు తప్ప, ఆధారాల్లేకుండా కూటమి ప్రభుత్వం మిథున్‌రెడ్డిపై కేసులు పెట్టిందని రమేష్ ఆరోపించారు. విద్యార్థి విభాగం నాయకులు పెయ్యాల సాయి, బడుగు మోహన్, వరసల సుజిత్, విన్సీ, సాగర్, ఆనంద్, రవికుమార్, సల్మాన్‌రాజ్ పాల్గొన్నారు. -
ప్రతిపక్షంపై కక్షపూరితంగా కేసులు
● మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ● మిథున్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా కొవ్వూరులో కొవ్వొత్తుల ర్యాలీతాళ్లపూడి (కొవ్వూరు): వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని, చట్టాలను పక్కన పెట్టి రౌడీ రాజ్యం చెలాయిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోపించారు. ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొవ్వూరు బస్టాండ్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి పార్టీ శ్రేణులతో కలసి ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. న్యాయం గెలుస్తుందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన ఎంతోకాలం సాగదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వెంకట్రావు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమణి రమేష్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, చాగల్లు ఎంపీపీ మట్టా వీరాస్వామి, పార్టీ కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల కన్వీనర్లు చిట్టూరి అన్నవరం, కొలిశెట్టి నాగేశ్వరరావు, మట్టా వెంకట్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, రాజమహేంద్రవరం: విద్యుత్ శాఖలో స్మార్ట్ మీటర్లు కలకలం రేపుతున్నాయి. వీటిని తమ నెత్తిన బలవంతంగా పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ వినియోగం నమోదు చేసే మీటర్ రీడర్లకు సైతం ఈ ‘స్మార్ట్’ షాక్ తగులుతోంది. దశల వారీగా అన్ని రకాల విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 10 వేలకు పైగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఒక్క నవ్య తూర్పు గోదావరి జిల్లాలోనే 6 వేలకు పైగా బిగించారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియ పూర్తయితే మొబైల్ ఫోన్ల మాదిరిగానే విద్యుత్‌కు కూడా రీచార్జ్ పాలసీ అమలులోకి వస్తుంది. అంటే, కరెంటు కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలన్న (ప్రీపెయిడ్) మాట. ఇది వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుండగా.. మరోవైపు ఉపాధి కోల్పోయి మీటర్ రీడర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది. తొలి దశలో 5 లక్షల మీటర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్ కనెక్షన్లు సుమారు 16.70 లక్షలున్నాయి. అలాగే, వాణిజ్యం 1,93,613, వ్యవసాయం 63,751, పారిశ్రామికం 6,314, హెచ్‌టీ 11 కేవీ 1,292 చొప్పున కనెక్షన్లు ఉన్నాయి. తొలి దశలో సుమారు 5 లక్షల మీటర్లు బిగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నవ్య తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 6.70 లక్షల విద్యుత్ సర్వీసులుండగా.. తొలి విడతగా 2 లక్షల వరకూ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియకు నాంది పలికారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు వీటిని బిగిస్తున్నారు. రోడ్డున పడనున్న మీటర్ రీడర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా మీటర్ రీడర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారే. ప్రతి నెలా 1 నుంచి 11వ తేదీ లోపు వీరు మీటర్ రీడింగ్ తీస్తారు. ఒక మీటర్ రీడింగ్ తీసినందుకు గాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.6 నుంచి రూ.7 చెల్లిస్తుంది. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ మినహాయింపులు పోనూ ఒక్కో రీడర్‌కు చేతికి మీటర్‌కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్కో రీడర్ నెలకు 3 వేల మీటర్ల వరకూ రీడింగ్ తీస్తారు. దీని ప్రకారం వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేలలోపే ఉంటుంది. ప్రాంతం, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొంతమంది సిబ్బందితో పాటు మీటర్ రీడర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు విద్యుత్ రీచార్జ్‌పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. ముందుగా రీచార్జి చేయించుకోని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనివలన నేరుగా లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పొట్టకూటి కోసం పోరుబాట చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్ మీటర్ రీడర్లు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ నిర్వహించారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని నినదించారు. ఈ ఆందోళనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం అయిన తరువాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగులగొట్టాలంటూ అప్పట్లో పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్.. ప్రస్తుతం వీటిని వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు. మీటర్ రీడర్ల డిమాండ్లివీ.. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకువస్తున్నందున ఇప్పటికే కొనసాగుతున్న తమకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, విద్యార్హతను బట్టి రీడర్లకు విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా.. మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్లుగా నియమించాలని కోరుతున్నారు. అలాగే, ఎస్క్రో ఖాతా వెంటనే తెరవాలని, కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు విద్యుత్ శాఖనే నమ్ముకుని ఇరవయ్యేళ్లుగా బతుకుబండి లాగుతున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండి కొట్టడం తగదు. అసలు మొత్తం స్మార్ట్ మీటర్ల ప్రక్రియనే విరమించుకోవాలి. ఇది అనైతికం. ప్రజల వద్ద పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేసేందుకు అమలు చేస్తున్న కుట్ర. ఒకవేళ తప్పనిసరిగా అమలు చేస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి లో10 స్మార్ట్ విద్యుత్ మీటర్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇకపై బిల్లు తీసే ప్రక్రియకు మంగళం ఉమ్మడి జిల్లాలో 500 మందికి పైగా మీటర్ రీడర్ల ఉపాధికి గండి -
కక్ష సాధింపులో భాగమే మిథున్‌రెడ్డి అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశా రని, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబుల్లా ఖాన్ ఆరోపించారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే లేని లిక్కర్ కేసును సృష్టించి, అక్రమంగా అరెస్టు చే యడం దారుణమని మండిపడ్డారు. కూటమి పాలనలో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూండటంతో వైఎస్సార్ సీపీలోని కీలక నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నందుకే ప్రజ లు కూటమికి ఓట్లేశారని, కానీ నేడు వారి ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. కూటమి సర్కారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని దుయ్యబట్టారు. పీజీఆర్ఎస్కు 234 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 234 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి తదితరులు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 101, పంచాయతీరాజ్ 39, పోలీస్ 22, విద్యుత్ 12, ఇతర శాఖలకు చెందినవి 58 చొప్పున అర్జీలు వచ్చాయి. పోలీస్ పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 27 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఏఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు స్వయంగా మాట్లాడి, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.23న ఐటీఐలలో రెండో విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు దీనికి హాజరు కావాలని సూచించారు. పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జత జిరాక్స్ కాపీలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని వివరించారు. 27న జిల్లా స్థాయి యోగా పోటీలురాజమహేంద్రవరం సిటీ: యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యాన ఈ నెల 27న జిల్లా స్థాయి యోగాసన పోటీలు స్థానిక గౌతమ ఘాట్‌లోని శ్రీ జగద్గురు పీఠం(వరల్డ్ టీచర్స్ ట్రస్ట్)లో నిర్వహించనున్నారు. యోగా గురువు శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 10 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు సబ్ జూనియర్, 14 నుంచి 18 సంవత్సరాల వారికి జూనియర్, 18 నుంచి 28 సంవత్సరాల వారికి సీనియర్, 28 నుంచి 35 సంవత్సరాల వారికి సీనియర్–ఎ, 35 నుంచి 45 సంవత్సరాల వారికి సీనియర్–బి, 45 నుంచి 55 సంవత్సరాల వారికి సీనియర్–సి కేటగిరీల్లో 10 ఈవెంట్లలో ఈ పోటీలు నిర్వహిస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 7396 00 3444 నంబరులో సంప్రదించాలన్నారు.జక్కంపూడికి అనపర్తి మాజీ ఎమ్మెల్యే సంఘీభావం అనపర్తి: పేపర్ మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారం రోజులుగా పోరాడుతున్న రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. రాజాను సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన కలిశారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజా.. కార్మికుల సమస్యలపై చేస్తున్న పోరాటానికి తామెప్పుడూ తోడుగా ఉంటామని చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించరెందుకు!
ఎమ్మెల్సీ వీర్రాజుపై ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ధ్వజం అమలాపురం టౌన్: కూట మి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న మీరు రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న అరాచకాలు, కక్ష సాధింపు చర్యలపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎమ్మెల్సీ వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయిల్ ఖండించారు. అమలాపురంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి సోము వీర్రాజుకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దుర్భాషలాడినప్పుడు ఇదే వీర్రాజు ఏమైపోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుపోతుంటే మీరు చోద్యం చేస్తున్నారా...? అని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాపులు, మద్యం అధిక ధరలకు విక్రయం, సారాను ఏరులై పారిస్తున్నా వాస్తవాలు ఆయనకు కనిపించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయ కుండా, ఏ విధంగా ఆ నిధులు ఖర్చు చేశారో లెక్కలు అడిగే దమ్ము వీర్రాజుకు ఉందా...? అని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మరోసారి ప్రశ్నించారు. -
బాంబు పేలుళ్లు
ఫ ఎగిరిపడిన బండరాళ్లు ఫ ఇద్దరు మహిళలకు గాయాలు తుని: పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనుల్లో భాగంగా వినియోగిస్తున్న బాంబు పేలుళ్లకు బండరాళ్లు ఎగిరిపడి తుని పట్టణం ఒకటో వార్డు డ్రైవర్స్ కాలనీలోని ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కట్రాళ్లకొండ తవ్వకానికి కాంట్రాక్టు సిబ్బంది బాంబులు పేల్చారు. దీంతో బండరాయి ఎగిరి గృహాల మధ్య పడింది. ఈ సంఘటనలో ఓ ఇంటి ప్రహరీ ధ్వంసం కావడంతో పాటు శాంతి, వీరమ్మ అనే ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వీరిని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి పగలు బాంబుల పేలుళ్లతో ఇళ్ల మధ్య కంపనాలు రావడంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు స్పందించి జన జీవనానికి అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నరసన్న దేవస్థానానికి వెలుగులు
కోరుకొండ: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెలుగులు వచ్చాయి. కొంతకాలంగా స్వామివారి కొండపై వెలుగులు దూరమయ్యాయి. రాత్రిళ్లు దర్శన భాగ్యం కలగక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల సాక్షి దినపత్రికలో నిశీధిలో నరసన్న అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి అన్నవరం దేవస్థానం అధికారులు స్పందించి కోరుకొండ స్వామివారి ఆలయానికి విద్యుత్ వెలుగు లు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. నారసింహుని దేవస్థానంలో కింద నుంచి కొండపైకి లైట్లు ఏర్పాటు చేయడంతో స్వామివారి గోపుర దర్శనం భక్తులకు ప్రాప్తించింది. దీనితో భక్తులు సంతోషిస్తున్నారు. -
తండ్రిపై దాడి చేసిన తనయుడి అరెస్ట్
రాయవరం: స్థానిక రాజరాజేశ్వరి కాలనీలో తండ్రిపై సుత్తితో దాడి చేసిన తనయుడిని శనివారం అరెస్ట్ చేసినట్లు రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు విలేకరులకు తెలిపారు. ప్రతి రోజు తండ్రి గంటా శ్రీనివాస్ తిడుతున్నాడని, కోపం పెంచుకున్న కొడుకు పవన్‌కళ్యాణ్ ఈ నెల 17వ తేదీ రాత్రి దాడి చేశాడు. మండపేట సీఐ పి.దొరరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టి, నిందితుడు పవన్‌కళ్యాణ్‌ను అరెస్ట్ చేసి అనపర్తి జేఎఫ్‌సీఎం ముందు హాజరు పర్చగా నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. -
ప్రతిభకు పరీక్ష..
రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారిలా.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గాను మొత్తం 150 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి అర్హత పొందుతారు. రాష్ట్ర స్థాయి పరీక్ష డిసెంబర్ 21 లేదా 28 లేదా జనవరి 4 తేదీల్లో ఏదో ఒకరోజు పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు. ● 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం ● విద్యార్థి విజ్ఞాన్మంథ్కు దరఖాస్తుల ఆహ్వానం ● సెప్టెంబర్ 30 ఆన్లైన్ రిజిస్ట్రేషన్్కు తుది గడువు రాయవరం: విద్యార్థుల్లో సృజనాత్మకతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు బాట పడుతుంది. పరిశోధన, ప్రయోగాల్లో వారు రాణించేలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన మంథన్(వీవీఎం) పేరుతో జాతీయ స్థాయి ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఏసీఈఆర్‌టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం మరియు విజ్ఞాన భారతిలు సంయుక్తంగా జరుపుతున్నాయి. దేశంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న వారికి ఈ పరీక్ష ఉంటుంది. ప్రతిభ చాటిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్, స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంది. విద్యార్థి విజ్ఞాన మంథన్ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఆన్లైనన్్ రిజిస్ట్రేషన్న ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 30 వరకూ గడువు ఉంది. ఈ ప్రవేశ పరీక్షను ఆన్లైన్ విధానంలో పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్, మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, డిజిటల్ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. విభాగాలు.. మార్కులు ఈ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 11 తరగతులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లిషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష జరుపుతారు. ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 తేదీల వరకూ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవిల్ 2, ద్వితీయ పరీక్ష ఆన్లైన్లో ప్రోక్టరింగ్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19న ఉంటుంది. పై రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య కాలంలో 90 నిమిషాల పాటు (గంటన్నర) రాయాల్సి ఉంటుంది. లెవిల్ –1 ప్రధాన పరీక్షలో ప్రతి తరగతికి సంబంధించిన 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు వంతున 100 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్‌న్ –ఏలో విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి 20 ప్రశ్నలు (20 మార్కులు), సత్యేంద్రనాథ్ బోస్ జీవిత చరిత్ర నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), సెక్షనన్ బీలో 6 నుంచి 11 తరగతులకు సంబంధించి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు), లాజిక్, రీజనింగ్ 10 ప్రశ్నలు (10 మార్కులు) ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవిల్– 2 ద్వితీయ పరీక్షలో 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. జాతీయ స్థాయి పోటీలకు ఇలా.. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల చొప్పున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని జాతీయ స్థాయి విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరం పాటు భాస్కర ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్మంథన్2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో 1–3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి.. పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్జీ.ఇన్ వెబ్సైట్లో లాగిన్న కావచ్చు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది. –డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ -
నలుగురు యువకుల అరెస్ట్
950 గ్రాముల గంజాయి స్వాధీనం మామిడికుదురు: నగరం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం దాడి చేసి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 950 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కథనం మేరకు... నగరం గ్రామంలోని ఈదరాడ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే నీతిపూడి గణపతిరావు సమాధి వద్ద గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్లగా అనుమానాస్పదంగా కనిపించిన యానాంకు చెందిన కనపర్తి వెంకటదుర్గ, పెద్దిరెడ్డి గోవిందరాజు, పల్లం గ్రామానికి చెందిన పెమ్మాడి నాగూర్, పుచ్చల్లంక గ్రామానికి చెందిన యన్నాబత్తుల వెంకట్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 950 గ్రాముల గంజాయి దొరికింది. నలుగురిని అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేశామని ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. వారిని రిమాండు నిమిత్తం రాజోలు కోర్టుకు తరలించామని చెప్పారు. -
స్థానచలనం లేని వేతనం
●● బదిలీలు, పదోన్నతులు సరే ● ఉపాధ్యాయులకు అందని జీతాలు ● పొజిషన్ ఐడీలు రాక అగచాట్లు ● ఉమ్మడి జిల్లాలో 1,500 మందిపై ప్రభావం రాయవరం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ముగిశాయి.. ఇందులో పలువురికి పొజిషన్ ఐడీలు రాకపోవడంతో జీతభత్యాలు నిలిచిపోయాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాధారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నప్పటికీ వీరి స్థానం మారడంతో ఏ స్థానానికి బదిలీ అయ్యారో ఆ స్థానానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అది జరిగితేనే సీఎఫ్ఎంఎస్లో వారి వివరాలు డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే వేతనాలు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ /ఒకేషనల్ ఉపాధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. జూన్ 15వ తేదీ నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యింది. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్స్‌కు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ఏర్పడడంతో ఇక్కడకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి నెల కావొస్తున్నా నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలైలో తీసుకోవాల్సిన జూన్ నెల జీతాలు వీరికి మంజూరు కాలేదు. వేతనాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీ లోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. ఈ నెల 25వ తేదీ లోపు పొజిషన్ ఐడీలు రాకుంటే జూలై జీతం కూడా వీరు పొందలేని పరిస్థితి నెలకొంటుంది. పలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పొజిషన్ ఐడీలు క్రియేట్ కాలేదు. సమస్యలు ఎక్కడెక్కడంటే.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117కు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం జీవో 21ను తీసుకువచ్చింది. ఆరు రకాల పాఠశాలల స్థానంలో ఇప్పుడు తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పడ్డాయి. ఇందులో ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్‌గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్‌లో కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ఈ పాఠశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు కావడంతో ఆ స్థానాలకు బదిలీ పొందిన వారికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో అప్పటి వరకూ అదే స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్పటికే పొజిషన్ ఐడీలు ఉండడంతో వారికి వేతనాలు చెల్లించారు. ఇదే పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పాజిషన్ ఐడీలు రాకపోవడంతో వేతనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ అయిన పాఠశాలల్లో డీడీఓ మారడంతో అక్కడ ఏ ఒక్కరికీ జీతభత్యాలు రాని పరిస్థితి ఉంది. సాధారణంగా జూన్ నెలలో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కోసం రూ.వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాలు తీసుకున్న వారు నెలవారీ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలి పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించక పోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో కొందరు జీతాలు పొందలేకపోయారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు, కుటుంబ ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. – మేడిచర్ల త్రివెంకట ఆది సత్య సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, కోనసీమ ఈ నెల జీతాలైనా వస్తాయా! రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది ఉపాధ్యాయులు పొజిషన్ ఐడీలు రాక జూన్ నెల లేక జీతాలు పొందలేకపోయారు. జూలై నెల జీతాల బిల్లు సబ్మిట్ చేసే సమయం ఆసన్నమవడంతో ఈ నెల జీతాలు వస్తాయా? రావా? అన్న మీమాంసలో ఉన్నారు. పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. – ఎస్ఎస్ పల్లంరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ, కోనసీమ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి పొజిషన్ ఐడీలు రాక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇప్పటికే ఒక నెల వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలి. – చింతాడ ప్రదీప్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ, కాకినాడ జిల్లా -
ఆ కాంట్రాక్టర్‌పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాలి
● తక్షణం కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకోవాలి ● అన్నవరం దేవస్థానానికి న్యాయవాది సలహా! అన్నవరం: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లు నకిలీ చలానాలు ఇచ్చిన విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్‌పవర్ సర్వీసెస్ శానిటేషన్ కాంట్రాక్టర్‌పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాల్సి ఉంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. నకిలీ పీఎఫ్ చలానాల బాగో తంపై తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, శానిటేషన్ విభాగం అధికారులు న్యాయవాదిని సలహా అడిగారు. మార్చిలోనే సిబ్బంది ఖాతాలో పీఎఫ్ జమ చేయకపోతే అప్పట్లోనే సిబ్బంది కాంట్రాక్టర్‌కు ఆ విషయం తెలియజేయాలి. అతడి నుంచి ఎటువంటి సమాధానమూ రాకపోతే దేవస్థానానికి ఆ విషయం లిఖితపూర్వకంగా తెలపాలి. అప్పుడు దేవస్థానం ఆధికారులకు చర్య తీసుకునే అధికారం ఉండేది. అలా జరగలేదు కాబట్టి ఆ కాంట్రాక్టర్‌పై దేవస్థానం క్రిమినల్ చర్య తీసుకోవడం అంత సులువు కాదని న్యాయవాది చెప్పినట్లు సమాచారం. కాకపోతే నకిలీ పీఎఫ్ చలానాలు సృష్టించి, మోసం చేశారంటూ పీఎఫ్ అధికారులకు దేవస్థానం ఫిర్యాదు చేసి వారితో ఆ కాంట్రాక్టర్‌పై కేసు పెట్టవచ్చని సమాచారం. అదే సమయంలో ఆ కాంట్రాక్టర్‌ను తొలగించాలని న్యాయవాది సూచించినట్లు తెలుస్తోంది. షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలని చెప్పినట్టు చెబుతున్నారు. టెండర్ పిలవకుండానా? దేవస్థానంలో చెత్త ట్రాక్టర్ నిర్వహణకు టెండర్ పిలిచారు. అదే విధంగా సత్రాల్లో దుప్పట్లు, కర్టెన్ల వంటివి ఉతికి, ఇసీ్త్ర చేయడానికి కూడా టెండర్ పిలిచారు. చిన్నచిన్న వాటికే టెండర్లు పిలుస్తున్నప్పుడు ప్రతి నెలా 350 మంది సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్ట్‌కు టెండర్ పిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో ఎటువంటి డిపాజిట్ లేకుండా, టెండర్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో కనకదుర్గా మ్యాన్‌పవర్ సర్వీసెస్‌కు శానిటేషన్ కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఈ నకిలీ వ్యవహారానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 350 మంది పారిశుధ్య సిబ్బందికి కార్మిక చట్టాల ప్రకారం జీతాలిచ్చేందుకు దేవస్థానం నెలకు రూ.59 లక్షలు చెల్లించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. ప్రతి నెలా దేవస్థానం 13 శాతం, సిబ్బంది వాటా 12 శాతం వసూలు చేసి పీఎఫ్ చెల్లించి, ఆ రసీదులు జమ చేస్తే దేవస్థానం బిల్లు ఇవ్వాలి. కానీ మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆ సంస్థ ఫేక్ రసీదులు ఇచ్చి, సుమారు రూ.1.77 కోట్ల మేర బిల్లులు పొందింది. సిబ్బంది ఖాతాల్లో పీఎఫ్ జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు నిలదీయడంతో మూడు నెలలకు కలిపి పీఎఫ్‌కు సుమారు రూ.30 లక్షలు జమ చేసి కొత్త రశీదులు అందజేశారు. కొత్త కాంట్రాక్ట్‌కు మరింత సమయం! మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలన్నింటికీ కలిపి ఒకే శానిటేషన్ కాంట్రాక్ట్‌కు పిలిచిన టెండర్ ఖరారుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణను షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రసీదుల తనిఖీపై సూచనలు పీఎఫ్ రసీదులు ఒరిజనల్ లేక ఫేక్ అనే విషయం తెలుసుకోవాలనే అంశంపై దేవస్థానం సిబ్బందికి పీఎఫ్ అధికారులు శనివారం అవగాహన కల్పించా రు. ఈఓ సుబ్బారావు కోరిక మేరకు కాకినాడ పీఎఫ్ ఆఫీసుకు చెందిన ఇద్దరు అధికారులు రసీదుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, గూగుల్‌లో పీఎఫ్ వెబ్సైట్లో తనిఖీ చేయడం వంటివి వివరించారు. -
పొగాకు నారుమడులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
దేవరపల్లి: పొగాకు నారుమడులు వేయడానికి సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా టుబాకో బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని రసీదు పొందాలని రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ సూచించారు. వారికి మాత్రమే సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థలు విత్తనాలు సరఫరా చేస్తాయని తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పంట నియంత్రణలో భాగంగా నర్సరీ దశ నుంచే నిబంధనలు కఠినతరం చేస్తున్నామని తెలిపారు. వాణిజ్య రైతులు రెండు హెక్టార్ల వరకూ విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. నర్సరీలను ప్రత్యేక అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఆ సమయంలో రైతులు రసీదు చూపించాలని చెప్పారు. పొగాకు సాగు చేసే రైతులు విధిగా రిజిస్ట్రేషన్ ఉన్న నర్సరీల నుంచి నారు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. పొగాకు నాట్ల సమయంలో బోర్డు అందిస్తున్న ఫారం–2తో పాటు నారు అమ్మిన నర్సరీ యజమాని ఇచ్చిన రసీదును జత చేసి, అధికారులకు అందజేయాలన్నారు. బోర్డు రిజిస్ట్రేషన్ లేకుండా నర్సరీలు వేసే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రసాద్ చెప్పారు. నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల జాబితాను బోర్డు వద్ద ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయంగా వర్జీని యా పొగాకు విలువ పెరగాలంటే ఉత్పత్తి తక్కువగా ఉండాలన్నారు. రైతులు ఎక్కువగా ఎల్వీ–7, ఎ–3 వంగడాలు సాగు చేస్తున్నారని, కొత్తగా సీటీఆర్ఐ ఎఫ్సీజే–11 వంగడం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని నర్సరీల నుంచి నారు కొనుగోలు చేసి, పొగాకు సాగు చేస్తే బ్యారన్ రిజిస్ట్రేషన్ నిలుపు చేస్తామని ప్రసాద్ చెప్పారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులుఅన్నవరం: రత్నగిరికి శనివారం భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సుమారు 20 వేల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచీ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంత మండపాలు రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. -
అపర సంజీవనికి.. తీస్తున్నారా ఊపిరి!
8లోసాక్షి, రాజమహేంద్రవరం: అపర సంజీవనిగా పేరొంది.. లక్షలాది మంది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి.. వారికి కొత్త ఊపిరి అందించిన అపూర్వ పథకం ఆరోగ్యశ్రీ. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఈ పథకం.. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించింది. ఆ మహానేత తదనంతరం ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని దాదాపు నిర్వీర్యం చేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయానికి 938 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవి. వాటిని ఏడాది కాలంలోనే 2,436కు పెంచారు. అనంతరం వాటిని మరింత పెంచి 3,275 చికిత్సలకు విస్తరించారు. అంతే కాకుండా, వార్షిక చికిత్స వ్యయాన్ని తొలుత రూ.5 లక్షలకు.. ఆ తరువాత ఏకంగా రూ.25 లక్షలకు పెంచి, ప్రజలకు ఆరోగ్య భరోసాను అందించారు. అవసరాన్ని బట్టి ఇతర రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో సైతం చికిత్స పొందే అవకాశం కల్పించారు. ఇటువంటి మహత్తర పథకాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని వెనుక డాక్టర్ వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేసిన మంచిని మరుగున పెట్టే కుట్ర ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే.. ఆరోగ్యశ్రీ పథకం పేరును కూటమి సర్కారు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. అయినప్పటికీ జనం ఇప్పటికీ ఆరోగ్యశ్రీ గానే ఈ పథకాన్ని పిలుస్తున్నారు. దీనిని సహించలేని ప్రభుత్వం ఏకంగా ఈ పథకానికి మంగళం పాడేందుకు దాదాపు రంగం సిద్ధం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ స్థానంలో ప్రభుత్వం ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) తీసుకుని వస్తోంది. దీనిని ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి వయో వందన యోజన’ పేరుతో ప్రత్యేక కార్డుల రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే 85 శాతం పూర్తయింది. ఆయుష్మాన్ భారత్ అమలుపై ఉద్యోగులకు శిక్షణ సైతం పూర్తి చేశారు. త్వరలోనే ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం ఇటు ప్రజల్లో.. అటు ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది. కొత్త విధానం అమలులోకి వస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారే అవకాశం ఉందన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. చికిత్సల సంఖ్య కుదింపు! ఆరోగ్యశ్రీలో ఏకంగా 3,275కు పైగా చికిత్సలు అందిస్తూండగా.. ఆయుష్మాన్ భారత్ పథకంలో ఈ సంఖ్య 1,900 లోపే ఉంటుంది. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులు ఈ నూతన పథకంపై ఆసక్తి చూపడం లేదు. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి, దీని పరిధిలోకి రాని చికిత్సలను బీమా పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇదే కనుక జరిగితే ఇప్పటి వరకూ నయాపైసా కూడా చెల్లించకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుంది. పైగా, ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదలవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అమలులోకి వస్తే చికిత్స క్లెయిమ్‌కు అప్రూవల్ వచ్చాక కలెక్టర్ ద్వారా నిధులు విడుదల కానున్నట్లు సమాచారం. ఇది కూడా రోగులకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే యత్నాల్లో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నిలిపివేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.150 కోట్ల మేర బిల్లులను సర్కారు నిలిపివేసింది.వైఎస్సార్ సీపీ పాలనలో.. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 2023 వరకూ జిల్లా వ్యాప్తంగా రూ.508,49,95,571 వెచ్చించారు. ● 2,48,805 మందికి చికిత్స అందించారు. ● ఏటా రూ.50 కోట్లకు పైనే నిధులు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేశారు. ● గుండె, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ● బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్‌కు రూ.11.97 లక్షలు, అల్లోజెనిక్ బోన్‌మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (14 ఏళ్లు పైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షల చొప్పున వెచ్చించారు. ఇటువంటి వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీలో నయా పైసా కూడా చెల్లించనవసరం లేకుండానే చికిత్స చేయించుకునే అవకాశాన్ని పేదలకు కల్పించారు.ఆరోగ్యశ్రీ చికిత్సల వివరాలు సంవత్సరం చికిత్స వెచ్చించిన పొందిన (రూ.కోట్లు) వారు 2019-20 25,750 62.71 2020-21 29,602 62.15 2021-22 47,039 89.48 2022-23 1,46,414 294.15ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025 ఆరోగ్యశ్రీని నీరుగార్చే దిశగా కూటమి సర్కారు అడుగులు ఆయుష్మాన్ భారత్‌గా మార్చేందుకు రంగం సిద్ధం ఇప్పటికే ఉద్యోగులకు ముగిసిన శిక్షణ కార్డుల రూపకల్పనకు శ్రీకారం 85 శాతం పూర్తి త్వరలో అమలుకు ప్రణాళికలుజిల్లాలో ఆరోగ్యశ్రీ వివరాలు నెట్వర్క్ ఆస్పత్రులు 78 వీటిలో ప్రైవేటు 43 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5 ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28 జీజీహెచ్ 1 ఏరియా ఆస్పత్రి 1 దంత వైద్య శాలలు (ఈహెచ్ఎస్) 16 ఆరోగ్యశ్రీ కార్డుదారులు 5,12,000 ‘మిత్ర’ ద్రోహం ఆరోగ్యశ్రీ పథకం ఎత్తివేత యత్నాలపై ఆ విభాగంలోని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో తీసుకుని వచ్చే నూతన పథకంలోకి వారిని తీసుకుంటారా లేక బీమా కంపెనీ ఉద్యోగులే నూతన పథకాన్ని అమలు చేస్తారా అనే విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. దీంతో, తమకు ఉద్యోత భద్రత కరువైందని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రల భవితవ్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుష్మాన్ భారత్ అమలు లాగిన్‌ను సంబంధిత నెట్వర్క్ ఆస్పత్రిలోని మెడికో ద్వారా చేపడతారు. దీంతో ఆరోగ్య మిత్రల ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా 67 మంది ఆరోగ్య మిత్రలు ఆందోళన చెందుతున్నారు. -
రోజాపై వ్యక్తిగత దూషణలు సరికాదు
నల్లజర్ల: మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, భానుప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంటి పేరు గాలి కదా అని మహిళలపై గాలి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. రోజాపై ఈవిధమైన దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళతామని వనిత హెచ్చరించారు. మహిళలంటే టీడీపీకి అసలు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి ఘటన మరువక ముందే రోజాపై అసహ్యకరంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మహిళలను అవమానించడం, కించపర్చడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తడమే రోజా చేసిన నేరమా అని ప్రశ్నించారు. మహిళలపై దాడి జరిగితే తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని, ఎమ్మెల్యే భానుప్రకాష్ తాట ఎందుకు తీయలేదని నిలదీశారు. భానుప్రకాష్‌ను తక్షణం అరెస్ట్ చేయాలని వనిత డిమాండ్ చేశారు. గాలి భానుప్రకాష్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు మాజీ హోం మంత్రి తానేటి వనిత -
40 మీటర్లు ఉన్నాయంటూ..
సామర్లకోట పట్టణం కిర్లంపూడి రోడ్డులోని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో కటకం నాగసత్య గంగాభవాని అద్దెకు ఉంటున్నారు. భర్త శ్రీను ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లికి వందనం కింద ఇద్దరికీ రూ.30 వేలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు. ఆ డబ్బులు రాకపోయేసరికి సచివాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి ఆ దంపతులు కంగు తిన్నారు. కూటమి సర్కారు వచ్చాక ఒక మీటరుకు వస్తున్న బిల్లు చెల్లించడమే కష్టంగా ఉంది. అటువంటి గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు రికార్డు చేశారు. దీంతో, ఆ దంపతులు సామర్లకోట సబ్ స్టేషన్‌కు వెళ్లి తమ పేరిట ఉన్న విద్యుత్ మీటర్లను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మీటరుకు రూ.35 చొప్పున చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు. ఇందులో తమ తప్పేమీ లేనప్పటికీ గంగాభవాని దంపతులు 40 మీటర్లకు రూ.1,400 చెల్లించుకున్నారు. అయినప్పటికీ, మీటర్లు తొలగించడానికి ఈపీడీసీఎల్ సిబ్బంది నెల రోజులు చేశారు. అప్పటికే తల్లికి వందనం గడువు కూడా పూర్తయిపోయింది. ఆ డబ్బులు రాకపోగా, తమకు చేతి చమురు వదిలిపోయిందని గంగాభవాని దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఆమె పేరిట ఏకంగా 180 మీటర్లు ఈపీడీసీఎల్ నిర్వాకాలు పరాకాష్టకు చేరాయనడానికి ఇది మరో ఉదాహరణ. సామర్లకోట నాలుగో వార్డుకు చెందిన సీకోలు శ్రీదేవి కుటుంబం ఒక రేకుల షెడ్లో నివాసం ఉంటోంది. ఆమె రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటోంది. ఆమె భర్త వ్యవసాయ కూలీ. వీరికి కుమారుడు (4వ తరగతి), కుమార్తె (3వ తరగతి) ఉన్నారు. తమ బిడ్డలకు తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆ దంపతులు గంపెడాశతో ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనిపై సచివాలయంలో సంప్రదిస్తే ఏకంగా 17,758 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు రికార్డుల్లో ఉందనే కబురు చల్లగా చెప్పారు. వాస్తవానికి ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డుకు ఏనాడూ 60 యూనిట్లకు మించి కరెంటు బిల్లు రాలేదు. దీనిపై ఈపీడీసీఎల్ అధికారులను సంప్రదిస్తే శ్రీదేవి ఆధార్ నంబర్ 4329 0153 9009తో ఏకంగా 180 విద్యుత్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని తెలిసింది. దీంతో, ఆ దంపతులకు గుండె ఆగిపోయినంత పనైంది. కూలీ పని చేసుకునే తమకు 180 మీటర్లు ఏమిటని నిలదీస్తే ఫిర్యాదు తీసుకుని, 179 మీటర్లు తొలగించారు. కానీ, ఆమె పేరిట వచ్చిన 17,758 యూనిట్ల బిల్లును సవరించలేదు. చివరకు కరెంటోళ్ల పుణ్యమా అని ఆ కుటుంబం తల్లికి వందనానికి దూరమైంది. వీరికి కోత కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 2వ వార్డు సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న యల్ల గంగాభవాని, శ్రీను దంపతులు పది మందికి న్యాయం చేసే న్యాయవాద వృత్తిలో ఉన్నారు. వీరి పిల్లలు సత్యకిరణ్ వర్ధన్, హర్షవర్ధన్ ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. ఇద్దరికీ కలిపి తల్లికి వందనం డబ్బులు రూ.30 వేలు వస్తాయని ఆ దంపతులు భావించారు. తీరా చూస్తే కిరణ్వర్ధన్కు రూ.9 వేలు, హర్షవర్ధన్‌కు రూ.10,900 మాత్రమే గంగాభవాని ఖాతాలో జమయ్యాయి. ఇంత తక్కువగా ఎందుకు పడ్డాయని సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది నుంచి తెలియదనే సమాధానమే వస్తోంది. అందరి మాదిరిగా రూ.13 వేల చొప్పున పడినట్లు చెబుతున్నారు. కానీ ఖాతాలకు జమయ్యింది మాత్రం తక్కువగా ఉంది. అందరికీ న్యాయం చేసే వృత్తిలో ఉన్న ఆ దంపతులు తమకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. -
వారి పాపం.. తల్లులకు శాపం
● ఒక్కొక్కరి పేరిట పదులు, వందల్లో విద్యుత్ మీటర్లు ● కరెంటోళ్ల నిర్వాకంతో సంక్షేమానికి దూరమవుతున్న పేదలు ● రెవెన్యూ శాఖదీ అదే తంతు ● మండిపడుతున్న అర్హులు ● ఇదేం పాలనంటూ ఆగ్రహంసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ సహాయంతో తమ పిల్లలను బాగా చదివించుకుందామని ఆశ పడిన వారికి ఆ ప్రభుత్వమే జెల్ల కొడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న తప్పిదాలు అర్హులైన ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. అందులోనూ ఈమధ్య కరెంటోళ్ల బాగోతాలు అందరినీ నిర్ఘాంతపరుస్తున్నాయి. ఎంతటి స్థితిమంతులకై నా మహా అయితే ఆరేడు వరకూ విద్యుత్ మీటర్లు ఉంటాయి. కానీ, నిన్న కాక మొన్న సామర్లకోటకు చెందిన ఓ మహిళ పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయని వెల్లడి కావడం చూసి అందరూ నివ్వెరపోయారు. తాజాగా, అదే పట్టణంలో మరో మహిళ పేరిట ఏకంగా 180 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ కరెంటోళ్లు షాక్ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అసలు ఒకే ఆధార్‌పై పదులు, వందల సంఖ్యలో మీటర్లు ఏవిధంగా ఉంటాయనే ఆలోచన కూడా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) అధికారులకు, సిబ్బందికి రాకపోవడం వింతల్లోకెల్లా వింత. ఈపీడీసీఎల్ తీరు ఇలా ఉండగా.. తామేం తక్కువ కాదని రెవెన్యూ శాఖ కూడా అక్కడక్కడ నిరూపించుకుంటోంది. సెంటు భూమి కూడా లేని నిరుపేద తల్లుల పేరిట ఏకంగా 10, 11 ఎకరాల భూములు చూపించింది. ఇటువంటి అనేక కారణాలతో వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వేలాది మంది.. ఆ సంక్షేమాన్ని అందుకోలేక కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి సర్కార్ ఎంతో ఘనంగా ప్రకటించుకున్న తల్లికి వందనం పథకం డబ్బులు రాక పలువురు తల్లులు గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నానా అవస్థలూ పడుతున్నారు. కొందరి సమస్య పరిష్కారమైనా, ఇప్పటికే గడువు ముగిసిపోవడంతో తామేమీ చేయలేమంటూ మరి కొంత మందిని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంపై ఆయా సంక్షేమ పథకాలకు అర్హులైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పులకు తమను బలి చేయడమేమిటని, ఇదేం పరిపాలనని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం అర్హుల వివరాలు ● కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో 2.80 లక్షల మంది, జూనియర్ కళాశాలల్లో 48,690 మంది విద్యార్థులున్నారు. తొలి విడతలో 1,49,403 మందిని మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులు మాటేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలో 1.88 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.23 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 65 వేల మందికీ అర్హత ఉన్నా వివిధ కారణాలతో తల్లికి వందనం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.80 లక్షల మంది అర్హులుగా తేల్చారు. మిగిలిన 30 వేల మంది విద్యార్థులూ తల్లికి వందనానికి దూరమయ్యారు. గుత్తుల రాజేశ్వరికార్పొరేట్ పాఠశాలలో సీటు వచ్చిందంటూ.. కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గుత్తుల రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు దుర్గా చంద్రశేఖర్ 3, కుమార్తె శ్రీవల్లి 2 తరగతులు చదువుతున్నారు. అయినప్పటికీ వారికి తల్లికి వందనం జమ కాలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో రాజేశ్వరి కుమార్తెకు సీటు వచ్చిందన్న కారణంతో ఇద్దరు పిల్లలకూ తల్లికి వందనం రాలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. సచివాలయాన్ని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది తనిఖీ చేసి, ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని బదులిస్తున్నారు. వేరే వారి భూమి లింక్ చేయడంతో... కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన పాలపు పోచమ్మ, సత్తిబాబు దంపతులకు కుమార్తె మానస (పదో తరగతి), కుమారుడు ప్రవీణ్ కుమార్ (7వ తరగతి) ఉన్నారు. కూటమి పాలకులు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వస్తాయనుకున్నారు. ఇద్దరికీ కలిపి రూ.30 వేలు వస్తాయని, ఆ డబ్బులు బిడ్డల చదువుకు ఉపయోగపడతాయని ఆశించారు. అయితే, ఎక్కడో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉంటున్న వారికి చెందిన భూమి పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్‌తో లింక్ అయ్యింది. మూడెకరాలు మానస ఆధార్‌కు, మరో నాలుగెకరాలు పోచమ్మ ఆధార్‌కు లింక్ అయ్యాయి. దీనిని కారణంగా చూపించి, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం ఇవ్వలేదు. నిజానికి పోచమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం తప్ప అదనంగా సెంటు భూమి కూడా లేదు. కానీ, రెవెన్యూ సిబ్బంది నిర్వాకంతో ఎన్ఆర్ఐల భూమి వీరి ఆధార్‌తో లింక్ అయ్యింది. ఆ ఎన్ఆర్ఐలు రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వగ్రామం వచ్చి వేలిముద్ర వేసి, పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్‌కు లింక్ అయిన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తొలగిస్తేనే కానీ వీరికి తల్లికి వందనం రాదని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని పోచమ్మ దంపతులు అమలాపురం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. -
‘తల్లికి వందనం’లో ఎస్సీ పిల్లల పట్ల వివక్ష
కడియం: తల్లికి వందనం పథకంలో ఎస్సీ విద్యార్థులకు తక్కువ డబ్బులు వేసి, కూటమి ప్రభుత్వం వివక్ష చూపిందని వైఎస్సార్ సీపీ కడియం మండల అధ్యక్షుడు, జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 9, 10 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రూ.10,900, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు రూ.8,200 చొప్పున మాత్రమే వారి తల్లుల ఖాతాలకు జమయ్యాయని తెలిపారు. తోటి వారి కంటే తమకు తక్కువగా రావడంతో వారందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. జేగురుపాడు గ్రామంలో పదో తరగతి విద్యార్థిని తొర్లపాటి నమ్రత తల్లి ఖాతాకు రూ.8,800, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి బడుగు జగన్ తల్లి ఖాతాకు రూ.8,200 మాత్రమే ప్రభుత్వం జమ చేసిందన్నారు. మండలంలో దాదాపు 1,500 మంది దళిత విద్యార్థులున్నారని, వీరికి ఈ పథకం పూర్తి స్థాయిలో అందలేదని స్టాలిన్ తెలిపారు. వీరికి న్యాయం చేయకపోతే కడియంలో దళిత విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. టీచర్లకు బోధనేతర పనులు రద్దు చేయాలినల్లజర్ల: ఉపాధ్యాయలను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని, లేకుంటే ఆ పనులు బహిష్కరించాల్సి వస్తుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అన్నారు. సభ్యత్వ నమోదు నిమిత్తం శుక్రవారం నల్లజర్ల వచ్చిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యోగా దినోత్సవం, మెగా పేరెంట్స్ – టీచర్స్ డే, మొక్కల పంపిణీ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం వంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులకు అప్పగించడం ఎంత మాత్రమూ తగదన్నారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ల పంపిణీ, ఒక్క రోజులో బయోమెట్రిక్ పూర్తి చేయాలని ఆదేశించడం కేవలం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమేనని దుయ్యబట్టారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బంది లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని జయకర్ చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మనోహర కుమార్, ఎన్.భవాని, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ఎఫ్ ఆలీ అహమ్మద్, బి.కిశోర్, టి.నాగేశ్వరావు పాల్గొన్నారు. అష్టదేవతల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అష్ట దేవతల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు నడిపామని ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. రెండు బస్సులలో సుమారు 100 మంది భక్తులు శుక్రవారం అష్ట దేవతల దర్శనానికి బయలుదేరి, రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకున్నారని తెలిపారు. ఈ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహి మాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట గ్రామాల్లో వెలసిన దేవతలను దర్శిస్తారని వివరించారు. ఎరువుల కొరత లేదు దేవరపల్లి: ఖరీఫ్ పంటలకు అవసరమైన అన్ని రకాల ఎరువులూ రైతులకు అందుబాటులో ఉంచామని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్లోని 10 మండలాల్లో 9,915 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డివిజన్లోని 9 మండలాల్లో 10,336 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డీఏపీ 1,455 మెట్రిక్ టన్నులు, ఎఫ్ఓఎం 1,199 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,027 మెట్రిక్ టన్నులు, ఎన్పీకేఎస్ 6,377 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,474 మెట్రిక్ టన్నులు, యూరియా 6,397 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 20,272 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని వివరించారు. సొసైటీలు, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. -
కార్మిక చట్టాలు విస్మరిస్తున్న పేపర్‌మిల్లు
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక చట్టాలను కాలరాస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మిల్లు ఎదురుగా ఉన్న కల్యాణ మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కార్మికులకు సంఘాలు పెట్టుకోవడం, కనీస వేతనాలు తదితర అనేక హక్కులు ఉన్నాయని చెప్పారు. వాటిని పేపర్‌మిల్లు యాజమాన్యం తుంగలో తొక్కుతోందని దుయ్యబట్టారు. మిల్లు ఆదాయం అమాంతం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని కార్మికులు పలుమార్లు డిమాండ్ చేసినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. రూ.కోట్ల లాభాలు గడిస్తున్నా.. కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాల్సి ఉన్నా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారన్నారు. రూ.కోట్లలో లాభాలు.. కార్మికులకు పస్తులు ఆంధ్రా పేపర్ మిల్లును 1924లో స్థాపించారని, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని మొండి వైఖరిని యాజమాన్యం ప్రదర్శించడం దారుణమని రాజా మండిపడ్డారు. యాజమాన్యానికి పదేళ్లుగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయన్నారు. మిల్లు ఆదాయం 2014లో రూ.61 కోట్లు ఉంటే.. 2024 నాటికి రూ.430 కోట్లకు పెరిగిందన్నారు. 2014లో రూ.1,314.84 కోట్లుగా ఉన్న ఆస్తులు.. 2024కు రూ.2,450.95 కోట్లకు పెరిగాయన్నారు. మిగులు నిధులు రూ.1,853.43 కోట్లు ఉన్నా.. కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడం లేదని ఆవేదన చెందారు. 35 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుడికి రూ.13,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలు తీసుకుంటున్న సంస్థ వారి సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదని రాజా స్పష్టం చేశారు. పేపర్ మిల్లు ఈడీ ముఖేష్ జైన్ నెలకు రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షల జీతం తీసుకుంటున్నారన్నారు. యాజమాన్యం, అధికారులు లేనిపోని ఈగోకు పోవద్దని.. కార్మికులకు న్యాయం జరుగుతుందంటే ఎవరి బూట్లు తుడవడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ఈ నెల 9 నుంచి కార్మికుల పక్షాన పోరాడుతున్నామని, ప్రభుత్వం వద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకూ సమయం ఇచ్చామని అన్నారు. అప్పటిలోగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 22వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జక్కంపూడి రాజా అల్టిమేటం జారీ చేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజాకు పోలీసుల నోటీసులు ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో శాంతియుత ఆందోళన చేస్తున్న జక్కంపూడి రాజాకు పోలీసులు శుక్రవారం రాత్రి నోటీసులు అందించారు. పేపర్ మిల్లు సమీపంలో ఉండకూడదని, కల్యాణ మండపాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పేపర్ మిల్లుకు 500 మీటర్ల లోపు ధర్నాలు, ఆందోళనలు చేపట్టకూడదని తెలిపారు. తాను ఎటువంటి ధర్నా చేయకపోయినా నోటీసులు ఇచ్చి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని రాజా అన్నారు. ఆదాయం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు పెరగడం లేదు సమస్యల పరిష్కారానికి 21 వరకూ గడువు లేకుంటే 22 నుంచి ఆందోళన ఉధృతం వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా -
విజిలెన్స్ దాడులు
ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిలోని ఎరువుల దుకాణంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. నిల్వల్లో తేడాలను గుర్తించి, ఓ ఫారమ్ లేకపోవడం నిర్ధారించి రూ.15,62,200 విలువ గల 66.5 మెట్రిక్ టన్నుల స్టాకు తదుపరి అదేశాలు ఇచ్చే వరకు అమ్మకాలు సాగించరాదని తెలిపారు. అనంతరం దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షాంసి, విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
సెంటు భూమి కూడా లేకపోయినా..
రాయుడు గిరిజ, శివప్రసాద్ దంపతులది కరప మండలం వేళంగి. వీరికిద్దరు పిల్లలు. వారికి తల్లికి వందనం కింద ఒకేసారి రూ.30 వేలు వస్తుందని ఆ దంపతులు సంబరపడ్డారు. కానీ, వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఉండటానికి ఇల్లు తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా లేని ఈ కుటుంబానికి యండమూరులో సర్వే నంబర్ 509/2లో 1.4850, 505/1లో 9.810తో కలిపి మొత్తం 11.295 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా ఈ కుటుంబం తల్లికి వందనానికి దూరమూంది. దీనిపై యండమూరు వీఆర్ఓ, కరప తహసీల్దార్లను కలిసినా ఫలితం లేకపోవడంతో చివరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రెండుసార్లు అర్జీలు పెట్టుకున్నారు. సమస్య ఇప్పటికీ పరిష్కారమవలేదు. తమ పేరున ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి తల్లికి వందనమైనా ఇవ్వాలని, లేదంటే ఆ భూములైనా ఇప్పించాలని వారు అడగటంలో తప్పేముందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. -
కంద రైతు కుదేలు
● గతేడాది పుట్టు కందఽ ధర రూ.11 వేలు, నేడు రూ.7 వేలు ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు– నేడు నష్టాల పాట్లు ● ఎకారానికి రూ.35వేల నుంచి రూ.1.75 లక్షల నష్టం ● జిల్లాలో కంద సాగు విస్తీర్ణం 1,450 హెక్టార్లు పెరవలి: జిల్లాలో కంద సాగుచేస్తున్న రైతులు కొన్నేళ్లుగా లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభించకపోవడంతోపాటు, దిగుబడి తగ్గడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు కంద ధర రూ.7వేలు పలకడంతో ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కంద ధరలు చరిత్ర సృష్టిస్తే.. నేడు ధరలు పతనం అవ్వడంతో రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగున్నా మార్కెట్లో ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టులు (పుట్టు– 232 కిలోలు) దిగుబడి వస్తోంది. సరైన ధర లేక రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు నష్టం రావటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. జిల్లాలో కందసాగు విస్తీర్ణం ఇలా .. జిల్లాలో కంద పంట గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేపట్టారు. గతేడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు మండలాల్లో గతేడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటం వల్ల ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచటంతో నేడు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆందోళన కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.7, వేలు వద్ద స్థిరంగా ఉంది. తవ్వకాలు చేపట్టిన మొదటిలోనే ఇలా ఉంటే, పంటంతా చేతికి అందే సమయంలో ధరలు మరింత పతనమవుతాయోనని తవ్వకాలు చేపట్టని రైతులు ఆందోళన చెందుతున్నారు. లాభాల నుంచి నష్టాలకు.. కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.11 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.7వేలు ఉండటం, దీనికితోడు దిగుబడి తగ్గటంతో రైతులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్టులకు రూ.3.50 లక్షలు, 60 పుట్టులకు రూ.4.20 లక్షలు, 70 పుట్టులకురూ.4.90 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.5.60 లక్షలు ఒక ఎకరానికి అయ్యేది. దీంతో దిగుబడిని బట్టి ఒక ఎకరానికి రూ.35 వేలు నుంచి రూ.1.75 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. నష్టాలు ఇలా.. పెట్టుబడి ఎకరానికి రూ.5.25 లక్షలు అవుతుంటే ఎకరానికి 50 పుట్టులు, దిగుబడి బాగుంటే మార్కెట్ ధర ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.7 వేలు చొప్పున 50 పుట్టులకు రూ.3.50 లక్షలు వస్తుందని, అదే 60 పుట్టుల దిగుబడి ఉంటే రూ. 4.20 లక్షలు, 70 పుట్టుల దిగుబడి ఉంటే రూ.4.90 లక్షలు రైతులకు వస్తుంది. దీని ప్రకారం ఒక ఎకరానికి 70 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులకు రూ.35 వేలు, 60 పుట్టులు, వచ్చిన వారికి రూ.1.05 లక్షలు, 50 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులు రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నేడు నష్టాల పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తుందనుకుంటే నేడు ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం. –వేండ్ర ఏసు, కంద రైతు, ముక్కామల ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలి గత ఐదేళ్లూ కంద రైతులు లాభాలు అందుకోగా నేడు తీవ్రంగా నష్టపోయాం. గతంలో పెట్టుబడి సొమ్ము వచ్చేది. నేడు రాని పరిస్థితి. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియటం లేదు. –బొలిశెట్టి వెంకటేశ్వరరావు, కంద రైతు, అన్నవరప్పాడు మార్కెట్లో వినియోగం తగ్గింది ఉభయ గోదావరి జిల్లాల్లో పండించిన కంద పంటకు చైన్నె, ముంబయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్లో వినియోగం తగ్గటంతో ధరలు తగ్గాయి. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద దిగుబడి బాగుండటం ధరలు తగ్గటానికి కారణమైంది. –గడుగోయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి దిగుబడి ఉన్నా.. గతేడాదిలాగే ఈ ఏడాది దిగుబడి ఉన్నా గతంలో ఉన్న ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. గతేడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తే ఈ ఏడాది 50 నుంచి 70 పుట్టులు వచ్చింది. పెట్టుబడి.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా ల్సి ఉంది. ఎకరం కంద వేయాలంటే 30 పుట్టుల విత్త నం వేయాలి. గతేడాది విత్తనం ధర పుట్టు రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్ష లు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ. లక్ష ఖర్చు అయింది. పెంట వేయటానికి రూ.30 వే లు, ఎరువులు, పురుగు మందులకి రూ.40వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25వేలు .. మొత్తం ఖర్చు రూ.5.25 లక్షలు అవుతుండగా.. నేడు మార్కె ట్ ధరల ప్రకారం ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
అంబాజీపేట: పుల్లేటికుర్రు మలుపు వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారును ఏపీఎస్ఆర్టీసీ బస్ బలంగా ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కామల నుంచి కె.పెదపూడి వైపు వెళుతున్న కారును అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కె.పెదపూడికి చెందిన సత్తిరాజాకు తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అంబాజీపేట పోలీసులు పరిశీలించి ఆర్టీసీ బస్‌ను స్టేషన్‌కు తీసువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసం మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు నల్లి దాసు ఇంట్లో వస్తువులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ మీటర్లతో పాటు మంచం, పరుపు కూడా కాలిపోయినట్లు దాసు తెలిపారు. ఈదురు గాలులుకు తోడు పిడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అదృశ్యమైన కుటుంబాన్ని పట్టుకున్న పోలీసులు కిర్లంపూడి: అదృశ్యమైన కుటుంబాన్ని గాలించి పట్టుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధి బూరుగుపూడి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, బాలిక, బాలుడు గత ఏడాది నవంబర్ 9వ తేదీ అర్ధరాత్రి తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గ్రామం విడిచి వెళ్లారు. సోదరుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మహారాష్ట్రంలోని షోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం రావడంతో స్థానిక ఎస్సై జి.సతీష్ పోలీస్ సిబ్బందితో మాటువేసి శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది డబ్ల్యూహెచ్‌సీ గురుశ్రీ, పీసీ శివప్రసాద్ ఉన్నారు. చాకచక్యంగా పట్టుకుని ఎస్సై సతీష్‌ను, సిబ్బందిని పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నూతన విద్యావిధానంతో ప్రపంచీకరణపై అవగాహన
జేఎన్‌యూ ప్రథమ మహిళా వీసీ శాంతిశ్రీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నూతన విద్యావిధానం 36 ఏళ్ల తరువాత రూపొందించారని, దీని ద్వారా ప్రపంచీకరణపై అవగాహన కలుగుతుందని జేఎన్‌యూ ప్రథమ మహిళా వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో నిర్వహిస్తున్న ఓక్ ట్రీ ఉత్సవాల్లో భాగంగా రోల్‌ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర వికసత్ భారత్ – 2047 అంశంపై శుక్రవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శాంతశ్రీ మాట్లాడుతూ పరిశ్రమకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందన్నారు. టర్కీ, చైనా దేశాలు ఎయిర్‌ఫోర్స్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ చేస్తున్న విధంగా భారతదేశం ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జేఎన్‌యూ వంటి విశ్వవిద్యాలయాలు నోబుల్ అవార్డు గ్రహీతలను అందిస్తున్నాయన్నారు. పరిశ్రమలకు, విద్యావ్యవస్థలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులకు సాంకేతిక విద్యానైపుణ్యాలను నేర్పించాలన్నారు. జేఎన్టీయూకే వంటి ప్రముఖ వర్సిటీల నుంచి ఏరోస్పేస్ సర్వీస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్‌క్రాప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒకేషనల్ సిస్టమ్, పబ్లిక్ డిజైన్ వంటి కోర్సులను అందించి ఆధునికతకు పెద్దపీట వేయాలన్నారు. రాబోయే యుద్ధాలను ఎదుర్కొనేలా భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు అన్వేషణలు సాగించి సన్నద్ధమవ్వాలన్నారు. హైదరాబాద్ ఇప్లూ వీసీ ప్రొఫెసర్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్‌కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్‌కు వెయ్యిమంది ఉన్నారని, భారతదేశం పరిశోధనపై కేవలం 0.64 శాతం మాత్రమే నిధులు వెచ్చిస్తోందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ వీసీ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ అన్వేషణ, సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం, తయారీ వంటి రంగాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనించేలా చేయాలన్నారు. నాన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టి సోషల్ సైన్స్, టెక్నికల్ కోర్సులను కలిపి నేర్పించాలని, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, రెక్టార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ మోహనరావు, మాజీ వీసీలు డాక్టర్ ప్రసాదరాజు, శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పద్మరాజు పాల్గొన్నారు. -
అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు
● పాఠశాలకు తగ్గిన విద్యార్థుల హాజరు ● స్కూల్‌ను సందర్శించిన మండల అఽధికారులు జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు శుక్రువారం వారి ఇంటి వద్ద వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గురువారం ఘటన అనంతరం విద్యార్థినులకు చికిత్స చేసి జగ్గంపేట సీహెచ్‌సీ నుంచి, ఒక ప్రయివేట్ ఆసుపత్రి నుంచి వారి ఇళ్లకు పంపారు. స్థానిక వైద్య సిబ్బంది శుక్రువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నట్లు మండల అధికారులకు తెలిపారు. పాఠశాలలో పరిస్థితిని జగ్గంపేట మండల పరిషత్ అధికారి చంద్రశేఖర్, మండల విద్యాశాఖాధికారి ఆర్.స్వామి సమీక్షించారు. పాఠశాలలో క్లాస్ రూమ్‌లు, వెంటిలేషన్, తాగునీటి శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థను వారు క్షుణంగా పరిశీలించారు. విద్యార్థులతో అధికారులు మాట్లాడారు. పాఠశాలకు శుక్రవారం విద్యార్థుల హాజరు తగ్గిందని పాఠశాల హెచ్.ఎం మారిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. 217మంది విద్యార్థులకు కేవలం 5 తరగతి గదులు కాండ్రేగులలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలిపి నిర్వహిస్తున్నారు. మొత్తం 217 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో 165మంది హైస్కూల్ విద్యార్థులు కాగా 52 మంది ప్రాథమిక పాఠశాలకు చెందినవారు. హైస్కూల్ విద్యార్థులకు 5క్లాస్‌లకు కేవలం మూడే తరగతి గదులు వున్నాయి. రెండు క్లాస్‌లు వరండాలలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు రెండు తరగతి గదులు వున్నాయి. వీరిని సర్దుబాటు చేసి విద్యను అందిస్తున్నారు. –పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించాలి–విద్యార్దులకు జాగ్రత్తలు చెప్పాలి కాండ్రేగుల పాఠశాలలో గురువారం విద్యార్థుల అస్వస్థతకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వేసవిని మించి ఎండలు కాస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపేందుకు అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసివుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై మండల అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● కూలి పనికి వచ్చి అనంత లోకాలకు ● సామాజిక ఆరోగ్య కేంద్ర వద్ద ధర్నా సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేయడానికి వచ్చిన ఒక కాంట్రాక్టు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గణేష్ కాలనీకి చెందిన నులక బేతాలుడు (30) పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేసే పనిలో భాగంగా స్తంభం ఎక్కిన సమయంలో 11కెవీ వైర్ల నుంచి విద్యుత్తు రావడంతో ఒకసారిగా కింద పడిపొయాడు. వెంటనే తోటి సిబ్బంది సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బేతాలుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైస్‌చైర్మన్ ఉబా జాన్‌మోజెస్, సీఐ ఎ కృష్ణ భగవాన్, కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, రాష్ట్ర మాలమహానాడు నాయకుడు లింగం శివకుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పిఠాపురం రోడ్డు కాంట్రాక్టరుతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.8.50 లక్షల నష్ట పరిహరం ఇచ్చేలా ఒప్పించారు. ఆస్పత్రి వద్ద భార్య, కుమార్తె రోదన స్థానికుల హృదయాలను కలచి వేసింది. కుమార్తె నాన్న కావాలని ఏడుస్తూ ఉంటే ఆ బాలికను సముదాయించడం స్థానికులకు సాధ్యం కాలేదు. సామర్లకోట–పిఠాపురం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్తు స్తంభాలను వెనుకకు మార్పు చేశారు. మార్పు చేసిన స్తంభాలకు వైర్లు ఏర్పాటు చేయడానికి శుక్రవారం విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయినా విద్యుత్తు వైర్లకు కరెంటు సరఫరా కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని పోర్టుమార్టమ్కు తరలించి కేసు నమోదు చేసి సీఐ ఎ కృష్ణభగవాన్ దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులపై వివక్ష.. ఎంఈఓ విచారణ
నిడదవోలు: పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో విద్యార్థులపై వివక్ష చూపుతున్న ఘటనపై జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు స్పందించారు. స్కూల్లో 6, 7 తరగతుల విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడటం లేదనే పేరుతో వారి యూనిఫాంకు ‘ఇంగ్లిష్ డిఫాల్టర్’ అనే ట్యాగ్ తగిలించడంపై ‘విద్యార్థుల పట్ల వివక్ష’ అనే శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి విద్యాశాఖాధికారులు స్పందించారు. జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు ఆదేశాల మేరకు ఎంఈఓ పి.గురుమూర్తి స్కూల్లో శుక్రవారం విచారణ చేపట్టారు. సదరు విద్యార్థులతో ట్యాగ్ తగిలించడంపై వివరణ కోరగా, విద్యార్థులు విషయాన్ని ఎంఈఓకు స్పష్టంగా చెప్పారు. అనంతరం మరికొన్ని తరగతుల విద్యార్థులను విచారించారు. ఈ మేరకు హెచ్ఎం మేరీ సమక్షంలో సంబంధిత పాఠశాలకు చెందిన సుమారు 25 మంది ఉపాధ్యాయులకు ఎంఈఓ విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులపై ఇలాంటి చర్యలు సరైనవి కావని హితవు పలికారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని స్కూల్ కరస్పాండెంట్ పుష్ప, విద్యార్థులకు ట్యాగ్లు తగిలించిన టీచర్ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. విద్యార్థులకు భయం ఉంటుందనే ఉద్దేశంతోనే ట్యాగ్లు తగిలించానని, దీనికి యాజమాన్యంతో ఎలాంటి సంబంధం లేదని సదరు టీచర్ ఎంఈఓకు వివరణ ఇచ్చారు. కరస్పాండెంట్ పుష్ప, ట్యాగ్లు తగిలించిన టీచర్ స్టేట్మెంట్లను జిల్లా విద్యాశాఖాధికారికి పంపిచినట్లు ఎంఈఓ తెలిపారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
సీతానగరం: రఘుదేవపురం రవీంద్ర కాలనీ సురవరపు మణికంఠ ఇంటిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశామని నార్త్‌జోన్ డీఎస్సీ వై శ్రీకాంత్ తెలిపారు. గురువారం సీతానగరం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరుకొండ సీఐ సత్యకిషోర్, సీతానగరం ఎస్సై డి.రామ్‌కుమార్ సిబ్బందితో కలిసి ముగ్గళ్ళ గోదావరి మాత విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు నీలంశెట్టి వెంకటవాసు (రవీంద్రకాలనీ), రాజానగరానికి చెందిన గొడ్డు భాను శివశంకర్లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మణికంఠ అక్క శివ కుమారి నిడదవోలులో ఉంటున్నారు. తల్లితో కలిసి మణికంఠ అక్క ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 12న ఇంటికి వచ్చాడు. తలుపులు తెరచి ఉండటంతో లోపలకి వెళ్లి చూడగా బీరువా లాకర్ బద్దలుకొట్టి ఉంది. అందులోని నాలుగు కాసుల బంగారు, 70 తులాల వెండి, పూజా గదిలో దాచిన రూ.1.50 లక్షల నగదు పోయిందని గుర్తించి ఫిర్యాదు చేశారు. ముద్దాయిల నుంచి మూడు గ్రాముల విలువ ఉన్న ఉంగరం, 750 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.50 లక్షల నగదు రికవరీ చేశామని తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన మోటారు సైకిల్ సీజ్ చేశామన్నారు. ముద్దాయిలను రాజమహేంద్రవరం సెవంత్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ (ఏజేఎఫ్సీఎమ్) కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. -
ప్రియురాలిని హత్య చేసి పరారీ
రాజోలు: చెడు వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చాకుతో పొడిచి హత్య చేశాడు. బుధవారం రాత్రి బి.సావరం సిద్ధార్థనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె నిరాకరించింది. దీంతో వారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ప్రియురాలు ఓలేటి పుష్ప(22)ను ప్రియుడు రాజోలు కోళ్ల వారి వీధికి చెందిన షేక్ షమ్మా చాకుతో గుండెల్లో పొడవడంతో ఒక్కసారిగా పుష్ప ప్రాణాలు కోల్పోయింది. కూతురిని కాపాడుకునేందుకు పుష్ప తల్లి గంగ, పుష్ప అన్న వినయ్ అడ్డువెళ్లగా వారిద్దరిపై కూడా షేక్ షమ్మా చాకుతో దాడి చేసి గాయపర్చాడు. వారి కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు షమ్మా అక్కడి నుంచి పారిపోయాడు. సిద్ధార్థనగర్‌లో జరిగిన హత్య విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజోలు సీఐ నరేష్కుమార్, ఎస్సై రాజేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు దాడిలో గాయపడ్డ తల్లి గంగ, అన్న వినయ్‌లను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం యెనుముల్లంక గ్రామానికి చెందిన ఓలేటి పుష్పకు ఐదేళ్ల క్రితం రాజోలు మేకలపాలానికి చెందిన ఓలేటి సతీష్‌తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భార్యాభర్తల మద్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన నాలుగేళ్ల కుమారుడితో పుష్ప, ఆమె తల్లి అంగాని గంగతో కలసి బి.సావరం సిద్ధార్థనగర్‌లో నివాసం ఉంటోంది. రెండేళ్లు క్రితం నుంచి రాజోలు కోళ్లవారి వీధికి చెందిన షమ్మాతో పుష్పకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు సహజీవనం చేస్తున్నారు. మద్యానికి బానిసైన షమ్మా తన అవసరాల కోసం పుష్పను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, డబ్బు కోసం వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని పుష్ప తన తల్లి గంగ, అన్న వినయ్‌కు మొర పెట్టుకుంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పావంటూ పుష్పతో గొడవపడి ఆమెను చాకుతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పారిపోయిన షమ్మాను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. అడ్డు వచ్చిన ఆమె తల్లి, అన్నపై దాడి -
అమ్మవార్లకు 1400 కిలోల భారీగా సారెలు
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని మదుగులమ్మ, నూకాలమ్మ అమ్మవార్లకు గురువారం భక్తులు 1400 కిలోల భారీ సారెలు సమర్పించారు. బిక్కవోలు తాళ్ళవారి ఆడపడుచు మదుగులమ్మ తల్లికి స్థానిక మహిళలు ఇంటి వద్ద చేసిన పలు రకాల 800 కిలోల పిండివంటలు సమర్పించారు. అలాగే పసుపు, కుంకుమ, గాజులు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, చీరలు, పండ్లు కూడా అందజేశారు. తొలుత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి, సారె సమర్పించారు. అలాగే, నూకాలమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గాజులు, అరటి తదితర పండ్లతో పాటు 600 కిలోల స్వీట్లు సమర్పించారు. రెండు ఆలయాల వద్ద అమ్మవార్లకు సమర్పించిన సారెలను భక్తులకు పంపిణీ చేశారు. – బిక్కవోలు -
అక్రమంగా ర్యాంపు ఏర్పాటు
కొత్తపేట: ఆత్రేయపురం లంక భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి, తరలించేందుకు టీడీపీ మట్టి మాఫియా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. దానిలో భాగంగా భారీ ర్యాంపు ఏర్పాటు చేసింది. ఆత్రేయపురంలో అధికారిక ఇసుక ర్యాంపు ఉంది. కాగా చినపేట సమీపాన సొసైటీ భూములు, శ్మశాన దిబ్బలు ఉన్నాయి. వాటి పక్క నుంచి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆత్రేయపురంలో టీడీపీ నేత ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. అధికార యంత్రాంగం కూడా వారి ఆగడాలకు కొమ్ము కాస్తూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ అక్రమ వ్యవహారాల్లో భాగంగానే తాజాగా ఆ నాయకుడు ప్రస్తుతం అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారించారు. గురువారం యుద్ధప్రాతిపదికన పొక్లెయినర్‌తో పనులు చేపట్టి లంకభూముల్లోకి ర్యాంపును ఏర్పాటు చేస్తూ వెళ్లారు. ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలింపునకు అనువుగా, అవి దిగబడిపోకుండా కొబ్బరి ఆకులను కూడా ట్రాక్టరుపై తరలించారు. అక్రమంగా ర్యాంపు ఏర్పాటుపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు స్పందించలేదని పలువురు గ్రామస్తులు తెలిపారు. దాంతో గ్రామస్తులే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ర్యాంపు పనులు నిలిపివేసి యంత్రాలను ఎక్కడివి అక్కడే నిలిపివేశారు. రాత్రి సమయంలో మట్టి రవాణాకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిపై గ్రామస్తులు ఆందోళనకు సిద్ధం కావడంతో ఎట్టకేలకు సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి యంత్రాలను, ట్రాక్టర్లను లంక భూముల్లోంచి బయటకు తీసుకువచ్చారు. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారుల వివరణకు ఫోన్లో ప్రయత్నించగా వారు స్పందించలేదు. ఆత్రేయపురంలో భారీగా మట్టి తవ్వకాలకు ప్రయత్నాలు అడ్డుకున్న గ్రామస్తులు -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో లోకారపు చిన్న అప్పలనాయుడు (79) ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రౌతులపూడి గ్రామానికి చెందిన మృతుడు లోకారపు చిన్న అప్పలనాయుడుకు గత 20 ఏళ్లుగా ఆయాసం, కడుపునొప్పి, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. రెండురోజుల క్రితం ఆయాసంగా వుందని చెప్పగా అన్న కొడుకు అయిన లోకారపు దేవుడు స్థానికంగావున్న సీహెచ్‌సీకి తీసుకువెళ్లి జాయిన్ చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం ఆరు గంటలకు సిబ్బంది లేచి చూసేసరికి ఆసుపత్రి ఆవరణలోవున్న మామిడి చెట్టుకు ఆతని లుంగీ, టవల్‌తో ఉరి వేసుకుని చెట్టుకింద పడిపోయి మృతిచెందినట్లు గుర్తించారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలసి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. డొక్కా సీతమ్మ ఐదో తరం వారసుడు భీముడు మృతి పి.గన్నవరం: నిరతాన్నధాత్రిగా పేరొందిన డొక్కా సీతమ్మ వారి ఐదోతరం వారసుడు, ఎల్.గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా భీమ వెంకట సత్య కామేశ్వరరావు (భీముడు) (59) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన ఎల్.గన్నవరంలో బ్రాంచి పోస్టు మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా భీముడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన పార్థివదేహానికి గురువారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. న్యాయం గెలిచింది తమపై కేసు కొట్టి వేయడంతో వైఎస్సార్ సీపీ నేతల హర్షం అనపర్తి : అధికారుల విధులకు ఆటంకం కల్పించారంటూ వైఎస్సార్ సీపీ నేతలపై పెట్టిన కేసును కొట్టివేస్తూ అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మజ్జి వంశీకృష్ణ గురువారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు పట్ల వైఎస్సార్ సీపీ శ్రేణులు స్పందిస్తూ న్యాయం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే 2018లో మహేంద్రవాడ గ్రామంలో స్థానిక గుడిమెట్ల వారి గుడి వీధిలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు సంకల్పించి సిమెంటు దిమ్మెను నిర్మించామని పోతంశెట్టి శ్రీను తెలిపారు. ఆ దిమ్మెను అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకు పంచాయతీ అధికారులు తొలగిస్తుంటే అడ్డుకున్న తనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కొవ్వూరి ధర్మారెడ్డి, కొవ్వూరి జగ్గారెడ్డి, పడాల ధర్మారెడ్డి, మల్లిడి గంగరాజులపై విధులకు ఆటంకం కలిగించారంటూ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందన్నారు. విచారణ అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్టు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ పై అన్యాయంగా మోపిన కేసులో స్థానిక న్యాయవాది మన్మోహన్ శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా నిందితుల్లో ఒకరైన కొవ్వూరి ధర్మారెడ్డి కేసు నడుస్తుండగానే మృతిచెందారని ఆయన తెలిపారు. -
స్వల్పంగా వచ్చే వరద మంచిదే!
ఐ.పోలవరం: గోదావరికి వరద అంటే ఎవరైనా భయపడతారు. మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లావాసులకు నిద్రాహారాలు ఉండవు. ఉప్పెనలా వచ్చిపడే వరద లంక గ్రామాలను, పంట భూములను ముంచెత్తుతోంది. వందల మంది రైతులకు నష్టాలను మిగులుస్తోంది. వరదల వల్ల లంకవాసులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే స్వల్పంగా వచ్చే వరదకు రైతులు, లంక గ్రామాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేవారు, మత్స్యకారులు సంబర పడతారంటే అతిశయోక్తి కాదు. గోదావరికి వరద వచ్చి తగ్గుముఖం పట్టింది. అత్యధికంగా ఈ నెల 13వ తేదీన 7.29 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేశారు. తరువాత నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో 1,76,676 క్యూసెక్కులకు తగ్గింది. వరద వచ్చి తగ్గుముఖం పట్టడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. మేలు చేసే ఒండ్రు మట్టి గోదావరి వరదల సమయంలో ఎగువ నుంచి వచ్చే ఎర్రనీరుతోపాటు ఒండ్రుమట్టి కొట్టుకు వస్తుంది. ఇది కాలువల ద్వారా పంట చేలు, తోటలకు చేరుతుంది. ఎగువ కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే నీరు పలు రకాలుగా మంచిది. కొండల మీద పడే వర్షాల నుంచి వచ్చే నీటిలో మినరల్స్, న్యూట్రినైట్స్ ఉంటాయి. అటవీ ప్రాంతాల నుంచి వచ్చే నీటిలో కూడా వనమూలికలు, హ్యూమస్ (జంతు కళేబరాల అవశేషాల నుంచి వచ్చే కర్బనం), సూక్ష్మ పోషకాలు అధికం. పంట పొలాలు, తోటల్లో నీరు చేరిన తరువాత దానిలో ఉన్న ఒండ్రు అర అడుగు మేర భూమిపై పేరుకుపోతుంది. గోదావరి లంకల్లో అయితే అడుగు మేర ఒండ్రు మట్టి చేరుతుంది. డెల్టా కాలువల నుంచి చేలకు నేరుగా వరద వస్తుంది. గోదావరి నదీపాయల నుంచి విడిపోయే కౌశికలు, అప్పర కౌశికలు, తొగరపాయ, తుల్యభాగ వంటి డ్రెయిన్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కొబ్బరి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు, డెల్టాలో పంటలకు ఈ నీటిని పెద్ద ఎత్తున తోడడం ద్వారా రైతులు తమ చేలు, తోటలకు ప్రకృతి సిద్ధమైన సూక్ష్మ పోషకాలు, మినరల్స్, న్యూట్రినైట్స్ అందిస్తున్నారు. పులసలొచ్చేది ఇప్పుడే మాంసాహార ప్రియులకు నోరూరించే గోదావరి జలపుష్పం పులస చేప దొరికేది కూడా గోదావరికి ఎర్రనీరు వచ్చినప్పుడే. బంగ్లాదేశ్, కోల్‌కతా, ఒడిశా వంటి ప్రాంతాల్లో సముద్రంలో హిల్స్ (విలస) నిత్యం దొరుకుతుంది. ఇటీవల కాలంలో గోదావరి జిల్లాతోపాటు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఈ చేప దొరుకుతూనే ఉంటోంది. స్థానికంగా కూడా సముద్ర వేట సమయంలో విలసలు పెద్ద ఎత్తున దొరుకుతుంటాయి. కాని అసలైన పులస దొరికేది మాత్రం గోదావరికి ఎర్రనీరు తాకినప్పుడే. సాధారణ రోజుల్లో దొరికే విలస చేప కేజీ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు మాత్రమే ఉంటుంది. అదే గోదావరికి ఎర్రనీరు తాకిన తరువాత దొరికే పులస ఖరీదు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ధర ఉంటుంది. అందుకే గోదావరికి ఎర్రనీరు తగిలి పులస దొరికితే చాలని మత్స్యకారులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. నీటికి ఎదురీదుతూ ఒక్కసారి గోదావరి నీటిలోకి వచ్చిన తరువాత దీని రుచి మారిపోతుంది. ఎర్రనీటిలో వీటిని పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతుంటారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, టాంజానియా వంటి ప్రాంతాల్లో జీవించే ఈ చేపలు సంతానోత్పత్తి కోసం ఖండాలు దాటి ప్రయాణిస్తాయి. హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అంతర్వేది గుండా గోదావరి నది నీటిలోకి చేరతాయి. గోదావరి నది చాలా వేగంగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకోవడమే కాకుండా దానికి ఎదురీదుకుంటూ రావడం పులస చేప ప్రత్యేకత. వీటి వలసలు జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉంటాయి. గుడ్లు పెట్టి అవి పిల్లలు అయిన తర్వాత అక్టోబర్ మాసానికి చేపలన్నీ తిరిగి సముద్రంలోకి చేరుకుంటాయి. ఇలా గుడ్లను పొదగడానికి వచ్చిన సమయంలో మత్స్యకారుల వలలో పడతాయి ఈ చేపలు. వలలో పడిన వెంటనే పులస చనిపోతుంది. గోదావరి వరద నీటిలోకి వచ్చిన తరువాత దీని రంగు మారుతుంది. దాంతో పాటు గోదావరి తీపి నీటి కారణంగానే వాటి రుచి కూడా మారి పులసగా అవతరిస్తుంది. అయితే గోదావరి అంతటా పులసలు దొరుకుతాయని అనుకోవడం భ్రమే. కేవలం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి గోదావరి కలిసే ప్రాంతంలో మాత్రమే ఇవి లభిస్తాయి. వీటికి ఇంతటి డిమాండ్ ఉండటానికి ఇది కూడా కారణం. పంట చేలు, లంక తోటలకు ఎర్ర నీరు పొలాలు, ఉద్యానాలకు మేలు -
పరిశోధనలతో సమాజానికి మేలు
కాకినాడ సిటీ: జేఎన్టీయూకే ప్రాంగణంలో ఓక్ ఉత్సవాల్లో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించనున్న రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్–2047 అనే అంశంపై నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ చైర్మన్ అనిల్ సహస్ర బుద్ధే ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. భారతదేశంలో పూర్వకాలంలో నిర్వహించిన తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల సంస్కృతిని కొనియాడారు. వర్గీస్ కురియన్, స్వామినాథన్, ఎఫ్‌సీ కొహ్లీ వంటి ప్రముఖుల పరిశోధనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని విశదీకరించారు. వికసిత్ భారత్–2047కు విద్యా వ్యవస్థ పటిష్టం కావాలని, స్టార్టప్, స్కిల్, మేకిన్, డిజిటల్, క్లీన్ ఇండియా, క్లీన్ ఆంధ్ర, డిజిటల్ లావాదేవీలు మెరుగుపడాలన్నారు. సౌత్ ఏషియన్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ కేకే అగర్వాల్, యూజీసీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ వేద్ ప్రకాష్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, యూనివర్శిటీ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జానకీరామ్ మాట్లాడారు. రోల్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ టూ కొలాబొరేట్ విత్ అకడమిక్ ఇనిస్టిట్యూషన్, టు రియలైజ్ ద అబ్జక్టివ్ ఆఫ్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్–2047 అనే అంశంపై ప్యానల్ చర్చలు నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, యూనివర్శిటీ ఉపకులపతి సీఎస్ఆర్కే ప్రసాద్, ఓక్ ఉత్సవ కమిటీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం వవన్‌కు కార్మికుల ఆకలి బాధలు పట్టవా?
రాజమహేంద్రవరం రూరల్: శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి కార్యికులు పదిరోజులుగా సమ్మె చేస్తున్నా సంబంధితశాఖలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు కార్మికులు ఆకలిబాధలు పట్టవా అంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీఎన్ పూర్ణిమరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ కార్యనిర్వహక ఇంజినీర్ కార్యాలయం వద్ద సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఉన్న శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికుల తమ న్యాయమైన డిమాండ్ల అమలు కోసం చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూర్ణిమరాజు మాట్లాడుతూ కార్మికులు 19 నెలలుగా జీతాలు, 26 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలని పదిరోజుల నుంచి సత్యసాయి కార్మికులు సమ్మె చేస్తున్న కాంట్రాక్టర్, అధికారులు, పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఏం తిని బతకాలని, కుటుంబాలను ఎలా పోషించాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని కోరారు. చీపురుపల్లి మాజీ సర్పంచ్ ములగ చినబాబు సంఘీభావం తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు పీ.శ్రీను, ప్రధాన కార్యదర్శి ఇసాక్ పాల్గొన్నారు. -
సీఎస్‌ఈకే క్రేజ్..!
కొత్త కోర్సులు ఇంజినీరింగ్‌లో ప్రస్తుతం కొత్త కోర్సులు పరిచయం అయ్యాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, ఆడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చర్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇంజినీరింగ్ విద్యార్థులుసాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్ల నమోదులో తలమునకలవుతున్నారు. ఏపీఈఏపీసెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకు జరగనుంది. 22వ తేదీన సీట్ల అలాట్మెంట్ 23వ తేదీ కళాశాలలో చేరిక, వచ్చే నెల 4వ తేదీన క్లాసులు ప్రారంభం కానున్నాయి. సెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్‌నకే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. రెండవ ప్రాధాన్యంగా ఈసీఈ, ఏఐ కోర్సును ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. కనీసం ఈ బ్రాంచ్‌లను పది శాతం మంది కూడా ఎంచుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఈ నెల 19వ తేదీన జరిగే వెబ్ ఆప్షన్ల మార్పుల్లో సైతం ఇదే పంథా కొనసాగనుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కాగా లభించే అవకాశం ఉంది. యథేచ్ఛగా దోపిడీ సీఎస్ఈకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు దోపిడీకి తెర తీశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ ఇలా అన్ని ప్రైవేటు కళాశాలల్లో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే విక్రయించేశారు. ఏఐసీటీఈ గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ ఎత్తివేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలలో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ఆధారంగా ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. అదేమని ప్రశ్నిస్తే సీటు ఇవ్వడమే గగనం.. తిరిగి ప్రశ్నిస్తారా? అంటూ ఎదురుదాడికి దిగుతున్నట్లు తెలిసింది. ఏదైనా మాట్లాడితే సీటు ఇవ్వకుండా తిరస్కరిస్తారేమోనన్న భయంతో తల్లిదండ్రులు అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కళాశాలల యాజమాన్యాల నుంచి మామూళ్లు దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్వీనర్ కోటాకే పథకాల వర్తింపు కోర్సుల ఎంపికలో తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటున్నారు. అన్ని బ్రాంచులు ముఖ్యమైనవేనని, విద్యార్థుల అభీష్టం మేరకు కోర్సుల్లో చేరాలంటున్నారు. సీఎస్ఈ అంటున్నారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. అందులో ప్రభుత్వ 2, ప్రైవేటు 32 ఉన్నాయి. 15,222 మంది సెట్లో అర్హత సాధించారు. 17,250 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతానికి పైగా సీఎస్‌ఈనే ఎంచుకునే పరిస్థితి ఉందని విద్యా నిపుణులు అంటున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండటంతో సీఎస్ఈ గ్రూప్‌నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. కళాశాలల దోపిడీని అరికట్టాలి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో ప్రైవేటు కళాశాలలు దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా వర్శిటీ అధికారులు, ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు కళాశాలలకు సీట్ల కేటాయింపు విచ్ఛలవిడిగా పెంచడంతో ఇదే అదునుగా భావిస్తున్న కళాశాలలు.. విద్యార్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. డబ్బుల వసూలు చేస్తున్న స్థాయిలో విద్యలో నాణ్యత ఉండటం లేదు. – ఎంవీ బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంప్రదాయ బ్రాంచ్‌లకు భవిష్యత్తు సంప్రదాయ బ్రాంచ్‌లకు మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో నిపుణుల అవసరం ఉంది. దేశ నిర్మాణంలో వీరి భాగస్వామ్యం చాలా అవసరం. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ గ్రూప్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కానీ వీరిలో 12 శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన కోర్సుల్లోనూ ఉత్తమంగా రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. – డాక్టర్ కె.బాలాజీ, ప్రిన్సిపాల్, వీఎస్ఎం కళాశాల (ఇంజినీరింగ్), రామచంద్రపురం -
పై చదువులకు పగ్గాలు!
● డిగ్రీ ప్రవేశాలకు విడుదల కాని నోటిఫికేషన్ ● రెండు నెలలుగా విద్యార్థుల నిరీక్షణ ● జాప్యమైతే ఇతర కోర్సులకు తరలిపోయే అవకాశం ● ప్రవేశాలు తగ్గితే డిగ్రీ కళాశాలల ఉనికికే ముప్పు రాయవరం: డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్నత విద్యామండలి మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంటర్మీడియెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలైనా డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రాకపోవడంతో విద్యార్థులలో అయోమయం నెలకొంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరికకు కౌన్సెలింగ్ కూడా ప్రారంభించారు. అయినా డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ జాడ లేదు. అయినప్పటికీ అడ్మిషన్ల కోసం విద్యార్థులు కళాశాలలకు వెళ్లి సీట్లు, కోర్సులపై ఆరా తీస్తున్నారు. దీంతో కళాశాలల సిబ్బంది విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేసుకుని నోటిఫికేషన్ వచ్చాక కబురు చేస్తామని తిప్పి పంపుతున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ 50 కంటే తక్కువ అడ్మిషన్లు నమోదైన కళాశాలల్లో వాస్తవ పరిస్థితుల పరిశీలనకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కమిటీలను నియమిస్తోంది. రెండేళ్లుగా 25 శాతం కంటే తక్కువగా అడ్మిషన్లు ఉన్న కళాశాలలను క్షేత్రస్థాయిలో కమిటీ పరిశీలించి అడ్మిషన్లు తక్కువగా ఉండడానికి గల కారణాలపై ఆరా తీసి నివేదిక సమర్పించింది. ఆదికవి నన్నయ యూనివర్శిటీ పరిధిలోని 60 కళాశాలల్లో 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు నమోదైనట్లుగా గుర్తించారు. జాప్యమైతే కళాశాలలకు ఇబ్బందే 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది నిర్ణీత సమయంలో డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని భావించినా నోటిఫికేషన్ విడుదల కాక విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఈ జాప్యంతో విద్యార్థులు ఇతర కోర్సులు వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. దానివల్ల డిగ్రీ కళాశాలలు సీట్ల భర్తీలో వెనుకబడే అవకాశముంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నోటిఫికేషన్ త్వరగా వెలవరించాలని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. గతేడాది ఇదే పరిస్థితి కోవిడ్ ప్రభావంతో ఆలస్యమైన డిగ్రీ ప్రవేశాలు అదే ఒరవడిని కొనసాగిస్తూ 2020 నుంచీ అక్టోబర్ నెలలో తరగతులు ప్రారంభించారు. కాగా గత ఏడాది ఆగస్టులోనే తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలైలోనే తరగతులు మొదలవుతాయని ఆశ పడినా నేటి వరకు నోటిఫికేషన్ లేకపోవడం గమనార్హం. నన్నయ పరిధిలో కళాశాలలు ఇవీ.. నన్నయ వర్సిటీ పరిధిలో 171 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆరు, కాకినాడ జిల్లాలో ఐదు, కోనసీమ జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో రెండు ప్రభుత్వ యాజమాన్యంలో అటానమస్ కళాశాలలుండగా, ప్రైవేట్ యాజమాన్య పరిధిలో కాకినాడ జిల్లాలో ఒకటి, కోనసీమ జిల్లాలో ఒకటి అటానమస్ డిగ్రీ కళాశాలలున్నాయి. ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో రెండు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 39, కాకినాడ జిల్లాలో 44, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 45 అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలున్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో రెండు, ప్రైవేట్ యాజమాన్యంలో నాలుగు, కాకినాడ జిల్లాలో ప్రైవేట్ యాజమాన్యంలో ఏడు, కోనసీమ జిల్లాలో ప్రైవేట్ యాజమాన్య పరిధిలో నాలుగు మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో అక్నూ పరిధిలో 32 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆన్లైన్లో అభ్యర్థులు అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డీన్ ఆదికవి నన్నయ యూనివర్శిటీ, రాజానగరం. -
ఒప్పంద అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జోన్ 1, 2 పరిధిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను 2025 – 26 విద్యా సవత్సరానికి రెన్యువల్ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుల కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం జోన్ 1లో 139, జోన్ 2 లో 178 పోస్టులకు రెన్యువల్ జరుగనుంది. 2024 – 25 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఒప్పంద అధ్యాపకులుగా పనిచేసినవారు మాత్రమే దీనికి అర్హులు. 2025 జూన్ ఒకటో తేదీకి 60 సంవత్సరాలు వయస్సు నిండినవారు దీనికి అనర్హులు. ఈ నెల 18న రెన్యువల్‌పై దినపత్రికల్లో ప్రకటన, 19 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పణ, 21 నుంచి 23వ తేదీ వరకు కౌన్సెలింగ్, 25వ తేదీన అధ్యాపకుల రెన్యువల్ ఉంటుంది. ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకం రాజానగరం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు పెంచడం, వారిలో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని వక్తలు అన్నారు. స్కూల్ లీడర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు మండలంలోని మల్లంపూడి సాయిమాధవి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న శిక్షణ తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ శిక్షణకు ఉమ్మడి జిల్లా నుంచి 174 మంది ప్రధానోపాధ్యాయులు హాజరు కాగా, తొమ్మిది మంది డీఆర్పీలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి గౌరీ శంకరరావు, అనపర్తి ఎంఈఓ సత్తిరెడ్డి, శైలజ పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల వివక్ష ● ఇంగ్లిషులో మాట్లాడటం లేదని వారి యూనిఫాంకు డిఫాల్టర్ ట్యాగ్ ● నిడదవోలు ప్రైవేటు స్కూలులో ఘటన నిడదవోలు: ఇంగ్లిషులో మాట్లాడని కొందరు విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం వివక్ష చూపుతున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో 6, 7 తరగతుల విద్యార్థులు ఇంగ్లిషులో మాట్లాడటం లేదనే పేరుతో వారి యూనిఫామ్‌కు ఓ టీచర్ రెండు రోజులుగా ‘ఇంగ్లిషు డిఫాల్టర్’ అనే పేరుతో కార్డులు తగిలించి, అవమానిస్తున్నారు. దీంతో, ఆయా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈవిధంగా వివక్షకు గురైన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు బుధవారం చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను స్కూల్ యాజమాన్యం మందలించింది. అయినప్పటికీ ఆమె లెక్క చేయకుండా తిరిగి గురువారం కూడా విద్యార్థుల యూనిఫామ్‌కు ఇంగ్లిష్ డిఫాల్టర్ కార్డులు యూనిఫాంకు తగిలించి, స్కూల్ ఆవరణలో నిలబెట్టి పనిష్మెంట్ పేరుతో ఇబ్బందులకు గురి చేసింది. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిడదవోలు శాఖ నాయకులు గురువారం స్కూల్ వద్ద ఆందోళన చేశారు. విద్యార్థుల పట్ల ఇలాంటి వివక్షత చూపించడం సరికాదని, పిల్లలెవరైనా మనస్తాపానికి గురై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటువంటి స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామని కరస్పాడెంట్ పుష్ప చెప్పారు. విద్యార్థుల యూనిఫామ్‌కు ఇంగ్లిషు డిఫాల్టర్ కార్డులు తగిలించిన టీచర్‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
పెరుగుతున్న వర్జీనియా పొగాకు ధర
● కొనుగోలు దారుల మధ్య పోటీ ● కిలో గరిష్ట ధర రూ.390 ● ఇప్పటికి 32,01 మిలియన్ల కిలోల విక్రయం దేవరపల్లి: కొనుగోలు దారుల మధ్య పోటీ ఏర్పడడంతో 20 రోజులుగా మార్కెట్లో పొగాకు ధరలు పెరుగుతున్నాయి. జూన్ 24 వరకు కిలో ధర రూ.290 ఉండగా, అనంతరం అంచెలంచెలుగా ధర పెరుగుతూ రూ.390కి చేరుకుంది. దీంతో అధికారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు ఎందుకు పండించామా? అని రైతులు ఒక దశలో దిగాలు పడ్డారు. ఈ వారంలో రోజుకు కిలోకు రూ.10 నుంచి 20 చొప్పున పెరుగుతూ మంగళవారం మార్కెట్లో కిలో రూ.358, బుధవారం రూ.392కి లభించింది. గురువారం మార్కెట్లో రూ.400 పలుకుతుందని రైతులు ఆశించారు. అయితే కిలోకు రూ.2 తగ్గి రూ.390 పలకడంతో రైతులు ఒకింత నిరుత్సాహ పడ్డారు. 20 రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 ధర పెరిగింది. గత ఏడాది మార్కెట్లో కొనుగోళ్లు ముగిసే నాటికి కిలో గరిష్ట ధర రూ.410, సగటు ధర రూ.369 లభించింది. ఈ ఏడాది దాదాపు 80 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి కాగా ఇప్పటి వరకు 32.01 మిలియన్ల కిలోలు విక్రయాలు జరిగాయి. ముందు ముందు మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్‌కుమార్ ఇటీవల దేవరపల్లిలో చెప్పడంతో రైతులు మార్కెట్‌పై ఎంతో ఆశతో ఉన్నారు. జూన్ 25కి ముందు అమ్ముకున్న రైతులు కిలోకు రూ.80 నుంచి రూ.100 నష్టపోయారు. అక్టోబరు 15 వరకు ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు జరుగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. బుధవారం మార్కెట్‌కు 40 మంది కొనుగోలు దారులు వేలంలో పాల్గొనగా, గురువారం మార్కెట్‌కు 15 మంది హాజరయ్యారు. ధరలు ఈ విధంగా ఉంటే పెట్టుబడులు, కౌలు డబ్బు దక్కుతుందని కౌలుదారులు అంటున్నారు. రూ.756.15 కోట్ల పొగాకు విక్రయాలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో గురువారం నాటికి రూ.756.15 కోట్ల విలువ గల 31.01 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కొనుగోళ్లు ప్రారంభమై 117 రోజులు కాగా, 93 రోజులు వేలం జరిగింది. 2,50,532 బేళ్లు కొనుగోలు చేశారు. కిలో గరిష్ట ధర రూ.390, కనిష్ట ధర రూ.190, సగటు ధర రూ.177.52 పలికింది. గురువారం 7,156 బేళ్లు అమ్మకానికి రాగా 5,748 బేళ్లు అమ్ముడుపోయాయి. -
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాజమహేంద్రవరానికి అవార్డు
● రాష్ట్ర స్థాయిలో సెకండ్ ర్యాంక్ ● జాతీయ స్థాయిలో 19వ స్థానం ● ఢిల్లీలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ కట్టర్ చేతులమీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం సిటీ: పరిశుభ్రమైన నగరాల్లో రాజమహేంద్రవరం రాష్ట్రంలో సెకండ్ ర్యాంక్ సాధించగా జాతీయ స్థాయిలో 19వ స్థానం సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 అవార్డులలో 3–10 లక్షల్లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అవార్డులు సాధించడంతో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ చేతులమీదుగా కలెక్టర్, నగర పాలక సంస్థ ఇన్చార్జ్ కమిషనర్ పి.ప్రశాంతి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పురస్కారం రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఓ కీలక మైలురాయి అని పేర్కొన్నారు. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, డోర్ టూ డోర్ చెత్త సేకరణ, రీసైక్లింగ్ విధానం, పారిశుధ్య సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఇదంతా సాధ్యపడిందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 1,12,780 గృహాలు ఉండగా రోజుకి 160 టన్నుల చెత్త బయటకు వస్తుందన్నారు. ఇందులో తడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నామన్నారు. దాదాపు 1,400 మందికి పైగా పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా 182 వాహనాల ద్వారా డోర్ టూ డోర్ చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. గతంలో 54వ ర్యాంకు సాధించిన నగరం మెరుగైన స్థాయిలో నిలిచిందన్నారు. -
స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ధర్నా
నిడదవోలు : విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఽనిడదవోలు పట్టణ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక గణపతి జంక్షన్లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లపై చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారని తక్షణమే మీటర్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు కోరారు. పలువురు నాయకులు మాట్లాడుతూ టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించాయన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ నెల్లూరులో యువగళం సభలో స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ కంపెనీకి లాభం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. గాదె కృష్ణ, గెడ్డంకుమార్, చంద్ర, మురళి, శ్రీనివాసరావు, సుదాకర్, చంద్రశేఖర్, బాబ్జి, ఖదీర్గౌస్, నాని పాల్గొన్నారు. -
ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక కాలంలో రూపాయి నుంచి ఎంత పెద్ద మొత్తమైనా డిజిటల్ లావాదేవీలే సాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయి లబ్ధిదారు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఏదైనా తేడా జరిగినా తప్పు ఎక్కడ జరిగిందనేది సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఉదాహరణకు తల్లికి వందనం వంటి పథకాలు చాలా మందికి చేరలేదు. వీటిలో ఖాతా వినియోగంలో లేదంటూ సగటున ప్రతి సచివాలయానికి వంద నుంచి 150 వరకూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ–కేవైసీ లేకపోవడం వల్ల జిల్లాలో దాదాపు రూ.2 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాకు చేరలేదు. దీంతో వారంతా సచివాలయాల చూట్టు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేకపోవడంతో ఖాతాలు యాక్టివ్‌గా లేవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదికలో ఉంది. గత ఏడాది నవంబర్‌లో 2,74,488 ఖాతాలు యాక్టివ్‌గా లేవని సచివాలయాల వారీగా విభజించి ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను ప్రదర్శించారు. దీంతో పోస్టల్, బ్యాంకింగ్ రంగాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా దాదాపు లక్ష ఖాతాల వరకూ మాత్రమే యాక్టివేట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఖాతాదారులందరూ వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకునేలా ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది ప్రోత్సహించాల్సి ఉంది. ఖాతాలు లేకపోతే జాతీయ బ్యాంకుల్లోగాని, తపాలా కార్యాలయాల్లో కానీ పొదుపు ఖాతాలు తెరవాల్సి ఉంది. అనంతరం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యాప్‌లో ఆయా ఖాతాలను ఎన్పీసీఐ నిబందనల ప్రకారం అప్డేట్ చేస్తారు. ఖాతాలు బతికించాలి ప్రభుత్వం నుంచి మంజురయ్యే ఏ సంక్షేమ పథఽకమైన లబ్ధిదారులకు నేరుగా అందాలంటే బ్యాంక్ ఖాతా బతికి ఉండాలి. కొందరికి రెండుమూడు ఖాతాలు ఉండి వాటిలో వినియోగంలో లేకపోవడం సమస్యలకు దారి తీస్తొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని గుర్తించి అర్హులకు సంక్షేమ పథకాలు చేరవేయడానికి ప్రతి బ్యాంక్ ఖాతాను లైవ్‌లో ఉంచాలని భావిస్తోంది. వీలైనంత డిజిటల్ లావాదేవీలు జరిగేలా ప్రొత్సహించింది. దీంతో ప్రతిపైసాకు లెక్క ఉంటుందనే ప్రధాన ఉద్దేశం. అలా జరిగినప్పుడే 18 ఏళ్లు నిండిన లబ్ధిదారుల ఖాతాలకు నవశకం బెనిపిషరీ మేనేజ్మెంట్ పోర్టల్‌లో ప్రభుత్వం విడుదలచేసే సంక్షేమ నిధులు కచ్చితంగా అందుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది. తపాలాశాఖ ప్రత్యేక డ్రైవ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) మ్యాపింగ్‌లో ఆధార్ అనుసంధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని నేపథ్యంలో పోస్టల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కేవలం రూ.200 తో గ్రామ స్థాయిలో వారి ఇంటి వద్దే ఖాతా ప్రారంభిస్తుంది. నిరర్ధక ఖాతాలు ఎన్నున్నా నిరుపయోగమే జిల్లాలో నిర్జీవంగా ఉన్న ఖాతాలు 1,76,500 అవి పునరుద్ధరిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోస్టల్ శాఖ అధిక ఖాతాలతో ఇబ్బందులు కొందరికి రెండు, మూడు ఖాతాలు ఉండి వాటిలో ఏదో ఒక ఖాతా మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వినియోగంలో లేని ఖాతా నెంబర్ ఇవ్వడంతో సమస్యగా మారింది. ప్రతి లబ్ధిదారు ఖాతాను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మూసేసుకోవాలి. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. – చందాల శ్రీవెంకట ప్రసాద్, ఎల్‌డీఏం కాకినాడ జిల్లా ప్రతి తపాలా కార్యాలయం ద్వారా ఐపీపీబీ ఖాతాలు ప్రతి తపాలా కార్యాలయంలో ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించి ఆధార్ అనుసంధానం చేస్తున్నాం. కాకినాడ డివిజన్లో ఉన్న కాకినాడ, సామర్లకోట ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు 54 ఉప తపాలా కార్యాలయాలు, 283 శాఖలలో సేవలు సద్వినియోగం చేసుకోవాలి. – దాసరి నాగేశ్వరరెడ్డి, ఇన్చార్జి పోస్టల్ సూపరిండెంట్, కాకినాడ -
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): రాజమహేంద్రవరంలోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాఘవకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైనన్స్ , కామర్స్‌లో ఖాళీలున్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీ లోపు కళాశాల ఆఫీసుకు అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని రావాలన్నారు. వివరాలకు 9398677385, 9866131354 నంబర్లలో సంప్రదించాలన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ బాబూ? కూటమి ప్రభుత్వానికి ఆరిఫ్ సూటి ప్రశ్న సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి అత్యంత బాధాకరమని జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 50 ఏళ్లు దాటిన మైనారిటీలకు పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మార్గదర్శకాలు రూపొందించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరు నెలకొకసారి కొత్త పెన్షన్లు ప్రకటించేవారని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాది కాలంలో ఎంతమందికి నూతన పింఛన్లు అందించారో చెప్పాలన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పరిచే కార్యక్రమం చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని అన్నారు. వైద్య సిబ్బందికి ఆర్పీఎస్కే ట్రైనింగ్ రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రీయ బాల స్వాస్త కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కెవెంకటేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు, ఏఎన్ఎం,ఎమ్ఎల్ హెచ్పీలకు డీఈఐసీ పీడియాట్రిషన్ డాక్టర్ ఇంద్రజ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారన్నారు. ప్రతి విద్యార్థి వివరాలను హెల్త్ కార్డులో నమోదు చేసి, వారి అనారోగ్య సమస్యలకు అవసరమైన చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక లోపాలను గుర్తించి వారికి సరైన వైద్య సేవలను అందించేందుకు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం (డైస్) రాజమహేంద్రవరం నకు రిఫర్ చేస్తామని తెలిపారు. ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎరువుల దుకాణంలో తనిఖీలు శంఖవరం: మండలంలోని కత్తిపూడిలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎరువుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా స్థానిక భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా రూ.2,49,200 విలువైన వరి విత్తనాలు, రూ.2,05,347 విలువైన ఎరువుల విక్రయాలు నిలిపివేశారు. గొడౌన్లో ఉన్న స్టాకు రిజిస్టరులో స్టాకుకు వ్యత్యాసం, రికార్డులు సక్రమంగా లేకపోవటంతో వాటిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సంచాలకుడు షంషీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ పి.శివరామకృష్ణ, ఏఓ పి.గాంధీ, ఏఈఓ ఆర్.మౌళిప్రసాద్ పాల్గొన్నారు. -
వాడపల్లి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. క్యూలైన్లు పెంచడంతో పాటు ప్రవేశ ద్వారాల వద్ద వెడల్పాటి మార్గాలను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లకు అదనంగా మరికొన్ని కౌంటర్లు పెంచనున్నామన్నారు. వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తహశీల్దార్ రాజేశ్వరరావు, డీసీ చక్రధరరావు బుధవారం పరిశీలించారు. అన్న ప్రసాద భవనానికి రూ.50 వేల విరాళం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆకివీడుకు చెందిన కొల్లి వెంకటేశ్వరబాబు, వెంకటలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. దాతలకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందించారు. దరఖాస్తుల ఆహ్వానం వాడపల్లి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం దేవస్థానం ద్వారా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఈ శిబిరంలో సేవ చేయడానికి నర్సింగ్ క్వాలిఫైడ్ అయిన మహిళలు / పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
రోగులతో స్నేహంగా మెలగాలి
పెరవలి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించటంతో పాటు రోగుల పట్ల స్నేహంతో మెలగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి జి.వెంకటేశ్వరరావు తెలిపారు. పెరవలి, కానూరు ఆరోగ్య కేంద్రాలల్లో బుధవారం అకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోగి కండీషన్‌ను బట్టి ఇక్కడ ఉంచాలో లేక ఏరియా ఆసుపత్రికి తరలించాలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, ఈ విషయాన్ని ప్రచారం చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు రోగులకు, ప్రజలకు తెలిసేలా వైద్య సిబ్బంది వ్యవహరించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశీలించటంతో పాటు రోగుల దగ్గరకు వెళ్లి సిబ్బంది అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పెరవలి పీహెచ్సీ వైద్యులు ఆర్ఎస్ఎస్పి ప్రసాద్, తేజశ్రీ, కానూరు పీహెచ్సీ వైద్యులు హేమరాజు, తేజశ్రీ పాల్గొన్నారు. -
నూతన సాంకేతికతతో సాగు
అనపర్తి : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకుని పంటల్లో నాణ్యమైన దిగుబడి పొందాలని తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు. బుధవారం మండలంలోని పులగుర్త గ్రామంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మండలంలో సార్వా వరి పంట నాట్లు పూర్తయ్యాయని పంట ఆరోగ్యంగానే ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు మాట్లాడుతూ సార్వాలో చీడపీడలు తక్కువగా ఉన్నాయన్నారు. కాండం తొలిచే పురుగు అక్కడక్కడా కనిపిస్తోందని, దాని నివారణకు నారుమడిలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తొందరపడి పురుగు మందులు వాడరాదని పురుగులు, తెగుళ్లు ఉనికి గమనించాకే సస్యరక్షణ మందులు వాడాలన్నారు. కొత్త మినీకిట్ రకాలు సాగు చేసుకుని పరీక్ష చేసుకోవాలని, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలని సూచించారు. జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ ఎస్.జయరామలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి సురేష్, వీఏఏ రాకేష్, రైతులు జాస్తి రామచంద్రరావు, గొడితి వెంకటకృష్ణ, బలుసు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఈ–మ్యాగజైన్ ఆవిష్కరణ
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని డైట్లో విద్యాగౌతమి మంత్లీ ఈ–మ్యాగజైన్‌ను ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైట్లో జరిగిన కార్యక్రమాలు, ఛాత్రోపాధ్యాయుల కథలు, కవితలు, వ్యాసాలు, అధ్యాపకుల రచనలతో ఈ–మ్యాగజైన్‌ను నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని డైట్లకు ఆన్లైన్లో ఫ్లిప్ బుక్ రూపంలో పంపిస్తామని తెలిపారు. అడవుల సంరక్షణే ధ్యేయం రాజానగరం: అడవులు, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఏపీసీసీఎఫ్ డాక్టర్ శాంతిప్రియా పాండే అన్నారు. దివాన్ చెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్టు అకాడమీలో శిక్షణను పూర్తి చేసుకున్న 126వ బ్యాచ్ ఫారెస్టు బీట్ అధికారులకు బుధవారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విధంగా రాష్ట్రంలో శిక్షణ పొందాల్సిన ఉద్యోగులు 400 మంది వరకూ ఉన్నారన్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సీసీఎఫ్ బీఎన్ఎన్ మూర్తి, అకాడమీ డైరెక్టర్ బి.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్ విడుదల రాయవరం: ఏపీ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రాథమిక పాఠశాల స్థాయి కాంప్లెక్స్, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్, మార్గదర్శకాలు, అజెండా, సెషన్ వారీ అంశాలను వెల్లడించారు. ఉపాధ్యాయుల బోధనా తీరు మెరుగుదలకు, వారు బోధనలో ఎదుర్కొనే సవాళ్లు, వాటి పరిష్కారాల కోసం ఈ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తారు. గతంలో ఉమ్మడి జిల్లాలో 123 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండగా, ప్రస్తుతం వీటిని 87 క్లస్టర్ కాంప్లెక్స్‌లుగా మార్పు చేశారు. కాంప్లెక్స్ సమావేశాలను ప్రస్తుతం ఒక పూటకు కుదించారు. ఉదయం పాఠశాలను నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు మధ్యాహ్నం స్కూల్ కాంప్లెక్స్‌లకు హాజరై సమావేశాలను నిర్వహించాలి. వీటి ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. జూలై 19, ఆగస్టు 23, సెప్టెంబర్ 20, అక్టోబర్ 18, నవంబర్ 22, డిసెంబర్ 20, జనవరి 24, ఫిబ్రవరి 21 తేదీల్లో ఎనిమిది కాంపెక్స్ సమావేశాలు జరుగుతాయి. -
శతాధిక వృద్ధుడి మృతి
గోపాలపురం: వేళ్ల చింతలగూడెం గ్రామానికి చెందిన కొర్లపాటి వెంకట్రావు (101) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుమారుడు కొర్లపాటి శ్రీరామచంద్రరావు వేళ్ల చింతలగూడెం సర్పంచ్‌గా పనిచేశారు. కాగా.. వెంకట్రావు మృతదేహాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సందర్శించి నివాళులర్పించారు. మోటారు సైకిల్ ఢీకొని.. గండేపల్లి: జాతీయ రహదారిపై మల్లేపల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొర్రంపాలేనికి చెందిన శీలం రామకృష్ణ (64), అప్పారావు మోటారు సైకిల్‌పై తాగునీటి కోసం మల్లేపల్లి వస్తున్నారు. ఆ గ్రామంలో సంత మార్కెట్ సమీపంలోకి వచ్చేసరికి వెనక వస్తున్న మరో మోటారు సైకిల్ వీరిని డీకొంది. ఈ ప్రమాదంలో రామకృష్ణ తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మోటారు సైకిల్‌పై వస్తున్న వారికి గాయాలు కావడంతో చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాము కాటుకు.. అంబాజీపేట: కొబ్బరి బొండాలు విక్రయించే వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇరుసుమండకు చెందిన తోట శ్రీనివాసరావు (58) ముక్కామల గ్రామంలో కొబ్బరి బొండాలు విక్రయిస్తుంటాడు. రోజూ మాదిరిగానే మంగళవారం రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత ఖాళీ కొబ్బరి బొండాలను దూరంగా పారబోయడానికి ఒబ్బిడి చేస్తున్నాడు. ఆ సమయంలో ఖాళీ కొబ్బరి బొండాల్లో ఉన్న రక్త పింజరి కాటు వేయడంతో మృతి చెందాడు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రైతుపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి నల్లజర్ల: పోతవరం గ్రామానికి చెందిన రైతు కానూరి జనార్దనరావుపై మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటనలో ఆయన కాలుకు తీవ్ర గాయం కావడంతో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జనార్దనరావుకు జంగారెడ్డిగూడేనికి చెందిన కొందరితో భూవివాదాలు ఉన్నాయి. ఆ విషయంపై మంగళవారం తాడేపల్లిగూడెం కోర్టుకు హాజరై అనంతరం పోతవరంలో తన ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో సుమారు 8 మంది తనపై దాడి చేశారని, కోర్టు కేసు ఉపసంహరించుకోకుంటే చంపేస్తామంటూ బెదిరించారని, కర్రలతో తీవ్రంగా కొట్టారని రైతు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నల్లజర్ల పోలీసులను వివరణ కోరగా.. ఆసుపత్రి నుంచి ఎంఎల్సీ రిపోర్టు అందాల్సి ఉందన్నారు. -
విద్యా ప్రమాణాల మెరుగుకు ప్రాధాన్యం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో బుధవారం అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, సెక్రటరీలు, కరస్పాండెంట్లతో మీట్ గ్రీట్ విత్ వైస్ చాన్సలర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ అనుబంధ కళాశాలల్లో నైపుణ్యతా ప్రమాణాలను పెంచడానికి చేపట్టిన వినూత్న ఇన్నోయేటివ్స్ను వివరించారు. సిలబస్, రెగ్యులేషన్స్ నవీకరణ, పరిశోధనలకు పెద్దపీట వేయడం, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి విద్యా సంవత్సరం అకడమిక్ ఆడిట్ నిర్వహించాలని, స్టూడెంట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగాలన్నారు. యూనివర్సిటీలో ఓపెన్ లెర్నింగ్, ఓడీఎల్ కోర్సులు, మూక్స్ విద్యా విధానాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ ద్వారా బీటెక్, ఎంటెక్ ప్రోగ్రామ్‌లను నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీలో జరుగుతున్న పరిశోధనలు, నూతన సదుపాయాలను వివరించారు. కార్యక్రమంలో రెక్టార్ వీవీ సుబ్బారావు, ఓఎస్డీ ప్రొఫెసర్ డి.కోటేశ్వరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, అఫిలియేషన్స్, లీగల్ మ్యాటర్స్ డైరక్టర్ ఎ.బాలాజీ, డైరెక్టర్ అకడమిక్స్ ప్రొఫెసర్ ఎంహెచ్ఎం.కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ ఉత్సాహంగా మీట్గ్రీట్ విత్ వైస్ చాన్సలర్ కార్యక్రమం -
దేశ ప్రగతికి సాంకేతికతే వెన్నెముక
సాక్షిప్రతినిధి, కాకినాడ: దేశం ప్రగతి వైపు పయనించాలంటే సాంకేతిక వెన్నెముకగా ఉండాలని న్యూఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కేకే అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం బీటెక్ విద్య ఏఐతో ముడిపడి నూతన పుంతలు తొక్కుతోందన్నారు. ఏ ఐఐటీలోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు లేదన్నారు. కేవలం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కళాశాలలు మాత్రమే విద్యార్థులను ఎక్కువ చేర్చుకునేందుకు ఐటీ విభాగాన్ని ప్రారంభిస్తున్నాయన్నారు. కాకినాడలో 1946లో ఏర్పాటైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల 80వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఓక్ ఉత్సవాలను బుధవారం ఘనంగా ప్రారంభించారు. జేఎన్టీయూ కాకినాడ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అగర్వాల్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలన్నారు. ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొనేలా విద్యార్థులకు మెరుగైన పద్ధతులలో శిక్షణనివ్వాలని పిలుపు నిచ్చారు. ఓక్ వేడుకలలో భాగంగా ఏడాది పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, వర్క్‌షాప్‌లు, చర్చాగోష్టులు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి, క్యాలెండర్‌ను ప్రతినిధులు విడుదల చేశారు. రాజకీయ జోక్యం ఉండకూడదు గౌరవ అతిథి ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ మాట్లాడుతూ గత 50 ఏళ్లలో 47 యూనివర్సిటీను కొలమానంగా తీసుకోగా, వాటిలో మూడు విశ్వవిద్యాలయాలు మాత్రమే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో నూతన విధానాన్ని ప్రారంభించేందుకు విద్యార్థులకు అధిక సంఖ్యలో చేర్చుకోవాలన్నారు. రష్యా, చైనా దేశాల మాదిరిగా ప్రగతి సాధించాలంటే సైన్స్ బోధనలో ముందడుగు వేయాలన్నారు. విద్యలో రాజకీయవేత్తల జోక్యం ఉండకూడదన్నారు. నైపుణ్యాల కొరత ప్రొఫెసర్ డి.జానకిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం 2020ను తీసుకువచ్చారన్నారు. దేశంలో ఇంజినీరింగ్ పట్టభద్రులు నైపుణ్యాల కొరతతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దీన్ని సరిదిద్దడానికి విద్యావేత్తలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ ఎన్ఎంకే భట్టా మాట్లాడుతూ విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి కలిగేలా పాఠ్యాంశాలను రూపొందించాలన్నారు. జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ మాట్లాడుతూ ఏఐఆర్ఎఫ్లో మెరుగైన ర్యాంకు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ నెల 17, 18 తేదీలలో ‘రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 స్వర్ణాంధ్ర వికసిత్ భారత్’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు, ఓక్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ పి. ఉదయభాస్కర్, వైస్ ఛైర్మన్ ఎస్.శ్రీనివాస కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.పద్మరాజు పాల్గొన్నారు. సౌత్ ఏషియన్ వర్సిటీ ప్రెసిడెంట్ అగర్వాల్ ఓక్ ఉత్సవాలు ప్రారంభం -
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై గైట్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. అతడిని రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన పెనుమత్స హరీష్ (32)గా గుర్తించారు. రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీష్ తన ట్రాక్టరులో ఎరువుల లోడు చేసుకుని శంఖవరం వెళుతుండగా గైట్ కళాశాల వద్ద ప్రమాదానికి గురయ్యాడు. రహదారి నుంచి కళాశాల ప్రాంగణంలోకి వెళుతున్న కళాశాల బస్సును ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొనడంతో డివైడర్‌పై నుంచి దూసుకుపోయింది. ఈ క్రమంలో కింద పడిన హరీష్‌పై నుంచి ట్రాక్టరు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బావ ఇసుకపల్లి శివరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. -
అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్ మోసం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టర్ ఘరానా మోసం బయటపడింది. ఆలయంలో పారిశుధ్య పనులు చేసే సిబ్బందికి ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్నట్టు నకిలీ చలానాలు జమ చేసి, ఏకంగా రూ.1.77 కోట్ల బిల్లు రాయించుకున్నాడు. అయితే మూడు నెలలుగా తమ ఖాతాల్లో పీఎఫ్ జమకాక పోవడంతో పారిశుధ్య సిబ్బంది ఆందోళన చేశారు. దీంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్టును విజయవాడకు చెందిన కనకదుర్గ మేన్ పవర్ సర్వీసెస్ సంస్థ నిర్వహిస్తుంది. ఈ సంస్థ ప్రతి నెలా సుమారు 350 మంది సిబ్బందికి రూ.59 లక్షలను వేతనాలుగా చెల్లించాలి. ఈ మొత్తంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కింద 12 శాతం సిబ్బంది, 13 శాతాన్ని దేవస్థానం తరఫున కాంట్రాక్టర్ చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా కాంట్రాక్టర్ పీఎఫ్ డబ్బులు కట్టేస్తే, అతడికి దేవస్థానం చెల్లిస్తుంది. నకిలీ రశీదులు దేవస్థానం నుంచి సిబ్బంది పీఎఫ్ వాటా సొమ్ముల కోసం కాంట్రాక్టర్ మోసానికి తెర తీశాడు. ఆ డబ్బులు చెల్లించినట్టు నకిలీ రశీదులు సృష్టించాడు. వాటిని దేవస్థానానికి జమ చేశాడు. నిబంధనల ప్రకారం.. అతడు డబ్బులు కట్టిన తర్వాతే, దేవస్థానం తిరిగి చెల్లిస్తుంది. మార్చిలో రూ.10,09 లక్షలు, ఏప్రిల్‌లో రూ.10.64 లక్షలు, మేలో 10.45 లక్షలు చెల్లించినట్టు నకిలీ రశీదులు జమ చేశాడు. దీంతో దేవస్థానం ఆ మొత్తాలను కలిపి ఆ మూడు నెలలూ నెలకు రూ.59 లక్షలను పారిశుధ్య సిబ్బంది జీతాలుగా చెల్లించింది. వాస్తవానికి దేవస్థానం అధికారులు, ఆడిట్ అధికారులు ఈ చెల్లింపులు కరెక్టేనా అని తనిఖీ చేయాలి. కానీ అవేమీ లేకుండా బిల్లు చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోసం బయటపడిందిలా.. పారిశుధ్య సిబ్బందికి ప్రతి నెలా జీతం పడుతున్నప్పటికీ పీఎఫ్ అకౌంట్‌కు జమ కావడం లేదు. దీంతో పారిశుధ్య సిబ్బంది ఆందోళన చేశారు. దీనిపై కాంట్రాక్టర్‌ను దేవస్థానం అధికారులు వివరణ అడగడంతో అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతనిచ్చిన రశీదులను స్కాన్ చేస్తే అవి నకిలీవని తేలింది. కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి కేసు పెడతామని హెచ్చరించడంతో అతను మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జూలై 9, 14, 15 తేదీలలో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షలు చెల్లించి ఆ రశీదులను మంగళవారం జమ చేశాడు. కాగా.. కాంట్రాక్టర్ ముందుగా ఇచ్చిన రశీదులపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మూడు బిల్లులు డిసెంబర్లో కట్టినవిగా తేలింది. వాటిపై నంబర్లు, తేదీని ఫోర్జరీ చేసి దేవస్థానంలో పీఎఫ్‌కి చెల్లించినట్టుగా మార్చారు. అంతే కాకుండా కట్టిన మొత్తం కూడా ఒక్కోటి రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. రూ.30 లక్షల పీఎఫ్ చెల్లించినట్టు నకిలీ రశీదులు అందజేత వాటి ఆధారంగా రూ.1.77 కోట్ల బిల్లులు చెల్లించిన దేవస్థానం అధికారులు సిబ్బంది ఆందోళనతో వెలుగులోకి.. కాంట్రాక్టర్‌ను సంజాయిషీ కోరాం శానిటరీ టెండర్ దారుడు పీఎఫ్ చెల్లించనట్టుగా నకిలీ చలానాలు జమ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. దానిపై విచారణ చేయాలని సంబంధిత సెక్షన్ అధికారులను ఆదేశించాం. కాంట్రాక్టర్ తప్పు చేసినట్టు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఆగుతూ.. ఊగుతూ..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంతో కలిపి రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్‌తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ ప్రొక్యూర్ రీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి ఈ నెల రెండో తేదీన ఈ టెండర్ ఖరారు కావాలి. అయితే వివిధ కారణాలతో ఆ టెండర్ ఖరారు బాధ్యతను దేవదాయ, ధర్మాదాయశాఖ ప్రభుత్వానికి అప్పగించినట్టు సమాచారం. అన్ని దేవస్థానాలకు కలిపి సుమారు రూ.60 కోట్లకు పైబడిన టెండర్ అవడంతో దేవదాయశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు లేదా ఆగస్టులో ఖరారు చేయనున్నట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం తరఫున శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు పది నెలలు ఆలస్యం చేశారు. ఏడు ప్రముఖ దేవస్థానాలను ఒకే యూనిట్‌గా శానిటరీ టెండర్లు నిర్వహించాలని గత ఏడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టెండర్ ప్రక్రియ తొలిసారిగా ఏప్రిల్‌లో టెండర్ పిలిచారు. అయితే ఆ నోటిఫికేషన్‌పై టెండరుదారులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్‌ను జూన్ 12న విడుదల చేసింది. టెండరుదారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీగా జూన్ 26ను నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది పక్కకు తప్పుకున్నారు. జూన్ 30న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ జూలై మూడో తేదీన ఓపెన్ చేసి తక్కువ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో వాయిదా సాంకేతిక కారణాలతో టెండర్ ఖరారును ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వం వివిధ శాఖల అధికారులతో ఒక కమిటీని నియమించిందని, ఆ కమిటీ త్వరలో టెండరు దారును ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ టెండర్ పద్మావతి సంస్థకే దక్కినందున విమర్శలు రాకుండా ఉండేందుకే కాలయాపన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏడు దేవస్థానాలలో శానిటరీ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాలపరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలలో పారిశుధ్య పనులు, వివిధ సత్రాలలో హౌస్ కీపింగ్, రహదారులు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు చేయాలి. పెరగనున్న వ్యయం! అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సేవలకు కేఎల్‌టీసీ సంస్థకు నెలకు రూ.49 లక్షలు ఇచ్చేవారు. కనకదుర్గ ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలతో పాటు మరో రూ.12 లక్షలను మెటీరియల్‌కు కలిపి రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్లో పారిశుధ్య పనుల్లో అత్యాధునిక మెషినరీ ఉపయోగించాలనే షరతుతో బాటు ఏసీల నిర్వహణ, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్టు రూ.80 లక్షలకు పైమాటే. అంటే ఏడాదికి సుమారు రూ.పది కోట్లను పారిశుధ్యం కోసమే వెచ్చిస్తారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ‘పద్మావతి’దే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2014–19 మధ్య అన్నవరంతో పాటు పలు దేవస్థానాలలో శానిటరీ టెండర్‌ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్లు కాలపరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్టు పొడిగించింది. పద్మావతి సంస్థ యజమాని భాస్కర నాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే అందుకు కారణం. ఇప్పుడు మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేవాలయాల శానిటరీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం ప్రభుత్వానికే బాధ్యత అప్పగించిన వైనం ఏడాదికి రూ.60 కోట్లకు పెరగనున్న టెండర్ పద్మావతి సంస్థకే దక్కినట్టు ఊహాగానాలు గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఆ సంస్థకే కాంట్రాక్టు కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా... అన్నవరం దేవస్థానంలో శానిటరీ పనులు నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ కాంట్రాక్టు గత నవంబర్‌తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టు ముగియడానికి ఒక నెల ముందుగానే ఈ శానిటరీ టెండర్ ప్రకటన (గత అక్టోబర్‌లో) విడుదల కావాలి. టెండర్లు పిలవడం ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు 2025 ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. అనంతరం మార్చి ఒకటిన దేవస్థానంలో శానిటరీ పనుల నిర్వహణకు ఎటువంటి టెండరు లేకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గ శానిటరీ సర్వీసెస్‌కు తాత్కాలికంగా అప్పగించారు. కానీ శానిటరీ మెటీరియల్‌ను మాత్రం దేవస్థానమే అందజేస్తోంది. జూలైతో కలిపి ఆ సంస్థ ఐదు నెలలుగా దేవస్థానంలో పారిశుధ్య కాంట్రాక్టు నిర్వహిస్తోంది. ప్రతి నెలా సిబ్బందికి జీతాలు ఆలస్యంగా ఇస్తుండడం వివాదస్పదమవుతోంది. జూలై నెలలో కూడా 15 తేదీ దాటినా ఇంకా పారిశుద్య సిబ్బందికి జీతాలు ఇవ్వలేదు. -
కుమార్తె కోసం తల్లిడిల్లి..
● గోదావరిలోకి దూకి మహిళ ఆత్మహత్యా యత్నం ● నాలుగు నెలలుగా కూతురి ఆచూకీ లేకపోవడంతో మనస్తాపం ● రక్షించిన పట్టణపోలీసులు తాళ్లపూడి(కొవ్వూరు): తన కుమార్తె నాలుగు నెలలుగా కనిపించడం లేదన్న మనస్తాపంతో కొవ్వూరుకు చెందిన మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పట్టణ సీఐ విశ్వం తెలిపిన వివరాల మేరకు దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన చిలకలపూడి నాగమణి రోడ్ కం రైల్వే బ్రిడ్జి పైకి ఎక్కి గోదావరిలోకి దూకినట్టు తెలిపారు. ఆమెను వెంటనే సమీపంలోని మత్స్యకారులు రక్షించారు. అయితే అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు. 18 ఏళ్ల ఆమె కుమార్తె 4 నెలలుగా కనిపించడం లేదని మనస్తాపానికి గురైనట్టు ఆయన తెలిపారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల దగ్గర అన్నిచోట్లా వెతికినప్పటికీ కుమార్తె ఆచూకీ లభించకపోవడంతో ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని, ఆమెను రక్షించడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు తీవ్రంగా శ్రమించారని సీఐ తెలిపారు. ఆమెను పట్టణ పోలీసులు, ఆర్డీవో రాణి సుస్మిత, తహసీల్దార్ తదితరులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
భర్త అనుమానించాడని భార్య ఆత్మహత్యాయత్నం
అమలాపురం రూరల్: భర్త అవమానించాడని మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాలూకా ఎస్ఐ వై.శేఖరబాబు తెలిపిన వివరాల మేరకు స్థానిక హైస్కూల్ సెంటర్‌కు చెందిన దూనబోయిన రమేష్‌కు రూరల్ మండలం నల్ల మిల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన శ్యామలతో వివాహం జరిగింది. వివాహమైన కొద్దికాలానికే అతడు ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. ఎనిమిది నెలల క్రితం స్వగ్రామానికి తిరిగివచ్చి తనకు తెలిసిన సెంట్రింగ్ పని చేసుకుని జీవిస్తున్నాడు. గల్ఫ్‌లో ఉండగానే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఈ నెల 14న నేదునూరు పెదపాలెంలో పెద్దల సమక్షంలో తగువు పెట్టారు. కాపురానికి తీసుకువెళ్లనని గ్రామపెద్దల వద్ద రమేష్ చెప్పడంతో సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శ్యామల ఇంట్లో ఉన్న గడ్డిమందును తాగేసింది. వెంటనే గుర్తించిన తల్లి గడ్డి మందు సీసాను పక్కకు గెంటేసింది. అయితే అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న శ్యామలను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో మంగళవారం శ్యామల ఇచ్చిన సమాచారం ఆధారంగా భర్త రమేష్ కుటుంబసభ్యులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్‌బాబు తెలిపారు. -
అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు
సామర్లకోట: పట్టణంలో దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ప్రత్యేక నిఘాలో భాగంగా స్థానిక కొత్త వంతెన సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఇంటి దొంగతనాలు చేస్తున్న అంతర్ జిల్లా నేరస్తుడిగా అంగీకరించినట్లు చెప్పారు. నిందితుడు కంచర్ల మోహనరావు నుంచి ఇప్పటివరకు నాలుగు దొంగతనాలకు సంబంధించి సుమారు 50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండిని రివకరీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు అతడిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారన్నారు. ఇంటి యజమానులు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అదే విధంగా పోలీసు శాఖ అందిస్తున్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను వినియోగించుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో క్రైమ్ సీఐ అంకబాబు, ఎస్సై రమేష్‌బాబు పాల్గొన్నారు. -
గంజాయితో ఉన్న నలుగురి అరెస్టు
4 కేజీల సరకు స్వాధీనం పిఠాపురం: ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి పంచుకుంటున్న ఐదుగురు యువకులను మంగళవారం అరెస్టు చేసి 4 కేజీల సరకును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాకినాడ రేచర్లపేటకు చెందిన కడియపు ప్రేమ్‌కుమార్ మరో బాలుడు కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన గంజాయి సరఫరాదారు మడ్డు లోకేష్ నుంచి సరకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరితో పాటు పిఠాపురం మంగయ్యమ్మరావుపేటకు చెందిన దనాల మనోహర్, కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన రామివెట్టి దుర్గాప్రసాద్ గంజాయి విక్రయిస్తుంటారు. నక్కపల్లి నుంచి గంజాయి తీసుకురాగా గొల్లప్రోలు శివారు ప్రాంతంలో ఒక లే అవుట్ వద్ద ఐదురుగు కలిసి తెచ్చిన గంజాయిని పంచుకున్నారు. దానిలో కొంత తాము వాడుకుని మిగిలిన దానిని ఎక్కువ రేటుకు విక్రయించాలనుకున్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో ఎస్సై ఎన్ రామకృష్ణ తన సిబ్బందితో మాటు వేసి గంజాయితో మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ముగ్గురి వివరాలు తెలుసుకుని ఐదురురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి 4 కేజీల గంజాయితో పాటు ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు. -
పరిపాలనపై పట్టు ఉండాలి
● ఈటీసీ ప్రిన్సిపాల్ ప్రసాదరావు ● ఉమ్మడి జిల్లా మహిళా ఎంపీపీ, జెడ్పీటీసీల శిక్షణ సామర్లకోట: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావడం ద్వారా పరిపాలనా నైపుణ్యం ప్రదర్శించడానికి మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తున్నట్టు విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు అన్నారు. ఉమ్మడి జిల్లాలోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండో రోజు మంగళవారం గ్రూప్ డిస్కషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్పు ద్వారా విజేతలు, మహిళా సాధికారితతో స్వపరిపాలన సాధ్యం అనే అంశంపై శిక్షణ ఉంటుందని చెప్పారు. పదవీ కాలం పూర్తి అవుతున్న తరుణంలో ఇస్తున్న శిక్షణ జీవిత కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం చేస్తున్న పదవులలో మంచి సమర్ధతను చూపించడం ద్వారా మరింత ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణతో సమర్ధతను పెంచుకోవడం ద్వారా మంచి పదవులు లభించే అవకాశం ఉంటుందన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండటంతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయకత్వం ఏ ఓక్కరికో పరిమితం కాకూడదన్నారు. మహిళలు తమ సమర్ధతను పూర్తి స్థాయిలో ప్రదర్శించడం లేదనే ఆరోపణ ఉన్నాయన్నారు. దీనిలో భాగంగా మహిళ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే కేంద్ర ప్రభుత్వం భావిస్తొందని తెలిపారు. దీని కోసమే శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజల ముందు ఏ విధంగా మాట్లాడాలి, ఇతరుల నుంచి విషయాలు తెలుసుకోవడం, పంచాయతీ చట్టాలు, పరిపాలనపై అవగాహన ఉండాలన్నారు. స్వయంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. సమర్ధ నాయకత్వానికి చదువుతో సంబంధం లేదన్నారు. ఈ శిక్షణలో వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, కోర్సు డైరెక్టర్ కె.సుశీల, ఫ్యాకల్టీలు పి.శర్మ, డి.శ్రీనివాసరావు, ఎం.చక్రపాణిరావు, కేఆర్ నిహారిక, పి.రామకృష్ణ శిక్షణ ఇచ్చారు. -
ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది
దౌత్యవేత్త డాక్టర్ బాలభాస్కర్ రాజానగరం: సాంకేతిక విఘాతం, సోషల్, పొలిటికల్, డిప్లమేటిక్ చాలెంజెస్, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రముఖ దౌత్యవేత్త డాక్టర్ బి.బాలభాస్కర్ అన్నారు. నన్నయ యూనివర్సిటీలోని ఈసీ హాలులో శ్రీభారతీయ దృక్పథంలో విఘాతం కలిగించే సాంకేతిక పరిజ్ఞానాల భౌగోళిక శాస్త్రాన్ని నావిగేట్ చేయడంశ్రీ అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించారు. దౌత్యవేత్తగా 70 దేశాలతో సంబంధాలను కలిగివున్న బాలభాస్కర్ మాట్లాడుతూ ముఖ్యంగా టెక్నాలజీలో జరిగే తీవ్రమైన మార్పుల వల్ల సమాజంలో, పరిశ్రమలో ఆర్థిక మోడల్స్, ట్రెడ్ మోడల్స్, టారీఫ్ స్ట్రక్చర్‌లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. వాటిని ముందుగా గ్రహించకపోతే ప్రపంచ దేశాలు పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదన్నారు. సాంకేతికంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పులపై విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు దృష్టి సారించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. కోవిడ్ వంటి విపత్కరమైన పరిస్థితులలో భారత ధాన్యాగారం విలువ ప్రపంచానికి తెలిసిందన్నారు. అన్ని రంగాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రమంలో విద్యా వ్యవస్థలో ఉన్న అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా సంబంధిత సబ్జెక్టులలో అప్డేట్ కావాలన్నారు. ఎర్త్ నుండి స్పేస్ వరకు అన్ని రంగాలలో క్వాంటం టెక్నాలజీ ప్రభావం చూపిస్తోందని, దానిపై మంచి పట్టు సాధించాలన్నారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ దౌత్యవత్తగా దేశాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో డాక్టర్ బాలభాస్కర్ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, కోఆర్డినేటర్ డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, డాక్టర్ పి. సురేష్‌వర్మ, డాక్టర్ కె.రమణేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మహిళపై దాడి
8 మందిపై కేసు నమోదు ధవళేశ్వరం: ఇంటి తగాదాకు సంబంధించి మహిళపై దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ టి.గణేష్ తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ కాలనీలో తిరుకోటి పావని అనే మహిళ పేరుపై బిల్డింగ్ ఉంది. ఈ ఇల్లు తనదేనంటూ కొత్తూరు పార్వతి అనే మహిళ పేర్కొనడంతో కొంత కాలంగా వివాదం నడుస్తోంది. మంగళవారం కొందరు ఇనుప రాడ్లతో ఇంటికి వచ్చి తనపై దాడి చేయడంతో గాయపడినట్లు పావని ఫిర్యాదు చేసింది. పావని ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఐదుగురు మహిళలు, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేష్ తెలిపారు. మన్నించు మహాత్మా.. గాంధీజీ విగ్రహం చేయి ధ్వంసం రాజానగరం: గాంధీజీ విగ్రహాన్ని ఆకతాయిలు ధ్వంసం చేశారు. గాంధీ బొమ్మ కూడలిగా పేరొందిన ఈ ప్రాంతం నిత్యం రద్దీతో ఉంటుంది. అయితే రాత్రి వేళల్లో మాత్రం తాగుబోతులకు ఆలవాలంగా మారుతుంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు, ఎందుకు కారకులయ్యారో గానీ మహాత్ముని కుడి చేతిని విరగొట్టారు. ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆగస్టు 15కి, అక్టోబరు 2న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు పోటీపడుతుంటారు. రెండు నెలలుగా మొండి చేతితో ఉన్న మహాత్ముని విగ్రహం వారెవరి దృష్టిలో పడకపోవడం విచిత్రం. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు గండేపల్లి: మల్లేపల్లి హైవేపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన గుండు అమ్మాజీ గ్రామంలో సచివాలయం–2 వద్ద జరిగే వారపు సంతలోకి నిత్యావసర వస్తువుల కోసం రోడ్డు దాటుతోంది. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి సుమారు మూడేళ్ల పాపతో ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి మోటారుసైకిల్‌పై వెళ్తున్న ఆర్.దొరబాబు ఆమెను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో గాయపడి రోడ్డుకు మధ్యలో పడ్డ వీరిని స్థానికులు పక్కకు తీసుకువచ్చి సపర్యలు అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు అంటున్నారు. మూడేళ్ల పాపకి ఏమైందోనని పలువురు కలవరపాటుకు గురయ్యారు. ఆ చిన్నారి బయాందోళనకు గురికావడంతో గ్రామానికి చెందిన యువకుడిని మోటార్ సైకిలిస్టుకు తోడుగా వెంట పంపించారు. సంతకు వచ్చిన వాహనాలు రోడ్డుకు పక్కనే పార్కుచేయడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం వారపు సంత రోజైనా పోలీస్ సిబ్బందిని ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అన్నదాతకు అండ
● పంటల పరిరక్షణలో గుడ్ల ద్రావణం ● ప్రకృతి వ్యవసాయంలో ఎగ్ అమ్మోనియా యాసిడ్ తయారీ ● చీడపీడలకు, నాణ్యమైన ఉత్పత్తికీ ఎంతో ఉపయుక్తం పిఠాపురం: రోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండని వైద్యులు సూచిస్తుంటారు. మంచి బలవర్ధకమైన ఆహారంగా గుర్తించబడిన గుడ్డు ఇప్పుడు పంటలకు సైతం మంచి పోషకరంగా పని చేస్తోంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో అనేక ద్రావణాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం గుడ్ల ద్రావణం మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందించే ద్రావణంగా దీనికి గుర్తింపు రావడంతో గొల్లప్రోలు మండలం దుర్గాడ గో గాయత్రి ప్రకృతి వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో గుడ్ల ద్రావణం తయారీ చేపట్టారు. దీని తయారీ విధానాన్ని కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు. తయారీ విధానం ఇదీ.. ముందుగా గుడ్లను పగలకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని శుభ్రం చేసుకుని సిద్ధం చేసుకున్న ప్లాస్టిక్ జార్లో జాగ్రత్తగా పెట్టి అవి పూర్తిగా మునిగే వరకు నిమ్మరసంతో నింపాలి. దానికి మూతపెట్టి ఎండ తగలని చోట పెట్టుకోవాలి. దీనిని ప్రతీ రోజు గమనిస్తూ ప్లాస్టిక్ జార్ మూతను తీసి పెడుతుండాలి. లేకపోతే దానిలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ప్రభావంతో జార్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా 10 నుంచి 15 రోజులకు నిమ్మరసంలో మునిగి ఉన్న కోడిగుడ్లు కరిగిపోయి చిక్కటి ద్రవంగా మారిపోతుంది. దానిని జాగ్రత్తగా కలిపి ఆ ద్రావణంలో 250 నుంచి 500 గ్రాముల బెల్లాన్ని మెత్తని చూర్ణంగా చేసి కలుపు కోవాలి. అలా కలిపిన ద్రావణాన్ని మళ్లీ నీడగా ఉండే చోట భద్రపర్చుకోవాలి. ఇలా మరో 15 రోజుల వరకు ప్రతి రోజు ఉదయం సాయంత్రం గమనిస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా 20 నుంచి 30 రోజుల తరువాత తెల్లటి బాదం పాలు మాదిరిగా ఒక రకమైన ద్రావణం తయారవుతుంది. దీనినే గడ్లు ద్రావణం, ఎగ్ అమోనియా యాసిడ్ అంటారు. దీనిని మరో బాటిల్లోకి తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. దీనికి నీటి తడి ఎట్టి పరిస్థితుల్లోను తగలకుండా చూసుకోవాలి. దీనిలో అమ్మోనియా యాసిడ్స్, ప్రొటీన్లు, మైక్రో న్యూట్రియంట్స్, మేక్రో న్యూట్రియంట్స్‌తో పాటు పుష్కలంగా కాల్షియం ఉంటుంది. వినియోగం ఇలా.. గుడ్ల ద్రావణం తయారైన తరువాత పూత దశ దాటిన పంటకు ఒక లీటరు నీటికి 2 నుంచి 3 మిల్లీ లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే పూత దశకు వచ్చాక ఒక లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక ఎకరం పొలానికి 200 లీటర్ల నీటికి ఒక లీటరు ద్రావణం కలిపి పచికారీ చేసుకోవచ్చు. దీనిని నెలకు ఒక సారి పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయోజనాలు అనేకం ప్రతి పంటకు దీనిని పిచికారీ చేయడం వల్ల పూత ఆశాజనకంగా నాణ్యమైన ఆరోగ్యవంతంగా వస్తుంది. పిందె నిలబడడానికి, ఆరోగ్యవంతంగా తయారవ్వడానికి ఇది ఎంతో దోహద పుడుతుంది. పిందె రాలిపోకుండా కాపాడుతుంది. గుడ్డు ద్రావణంలో గుడ్డు తొక్కతో సహా కరిగించడం వల్ల అధికంగా కాల్షియం ఉత్పత్తి అయ్యి మొక్కలకు మంచి కాల్షియం అందిస్తాయి. మొక్కలకు అత్యంత అవసరమైన కాల్షియం అందడం వల్ల పంటలు నాణ్యమైన దిగుబడులు ఇస్తాయి. భూమి సారవంతమై మేలు చేసే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇది మొక్కలు వత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి, తద్వారా తెగుళ్లు పురుగులు అంత త్వరగా సోకే అవకాశం లేకుండా పోతుంది . దీనివల్ల క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది. తద్వారా పంటలలో ఆకులు పచ్చగా తయారై కిరణ జన్య సంయోగ క్రియ సక్రమంగా జరిగి పిండి పదార్థాలను మొక్కలు ఎక్కువగా తయారు చేసుకుంటాయి. దీనివల్ల మొక్కలు గుబురుగా పెరగడంతో పాటు కాయల పరిమాణం పెద్దవిగా ఉండి పంట దిగుబడులు పెరుగుతాయి. అదే పప్పు ధాన్యాలలో అయితే గింజలు నాణ్యంగా తయారవుతాయి. దీనిని నుంచి వచ్చే వాసన వల్ల కొన్ని రకాల పురుగులు పంటలకు సోకవు. ఇది మంచి పెస్ట్ కంట్రోలర్‌గా పని చేస్తుంది. రూ.వేలు ఖర్చు పెట్టి రసాయానాలు ఉపయోగించినా రాని ఫలితం కేవలం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. – గుండ్ర శివ చక్రం, గో గాయత్రి ప్రకృతి వనరుల తయారీ శిక్షణ కేంద్రం, దర్గాడ కావాల్సిన పదార్థాలు ఇవీ 2 లీటర్ల యాసిడ్ తయారీకి.. కోడిగుడ్లు – 12 నిమ్మకాయలు (బాగా మగ్గినవి) – 2 కేజీలు బెల్లం – 250 నుంచి 500 గ్రాములు మూడు లీటర్ల సామర్థ్యం గల ప్లాస్టిక్ మగ్ – 1 -
పంటకాలువలో పడి కౌలురైతు మృతి
కాజులూరు: మండలంలోని ఒంటితాడిలో పంటకాలువలో పడి తాళ్లరేవు మండలం కోరంగి శివారు బొడ్డువానిలంకకు చెందిన కౌలు రైతు నరాల నాగరాజు (38) మంగళవారం మృతిచెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు బొడ్డువానిలంకకు చెందిన నాగరాజు కాజులూరు మండలం ఒంటితాడి పంచాయతీ పరిధిలో ఒక రైతుకు చెందిన రెండు ఎకరాల భూమి సాగు చేస్తున్నాడు. మంగళవారం చేనుకు గడ్డి మందు పిచికారీ చేసేందుకు పొలానికి వచ్చాడు. పొలం పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు సాయంత్రం తిరిగి వస్తుండగా పంట కాలువలో నాగరాజు మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే హుటాహుటిన గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు పొలానికి వచ్చే సమయంలోనే తీవ్ర నీరసంగా ఉన్నాడని దాంతో పొలం పనులు చేస్తూ ప్రమాదవశాత్తు పంట చేలో పడి మృతి చెంది ఉంటాడని రైతులు అభిప్రాయపడుతున్నారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కాచెల్లెళ్ల అదృశ్యం
కడియం: స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వస్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు పి.వీరనాగవల్లి, పి.పద్మప్రియ అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ అల్లు వేంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 10, 9 తరగతులు చదువుకున్న వీరిద్దరు ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి గుడికని వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరి ఆచూకీ తెలిస్తే కడియం పోలీస్ స్టేషన్ 9440796587, 9347705890 నంబర్లకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. -
గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీ
ప్రీమియం చెల్లింపులు ఇలా..● పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు ● వరికి ఎకరానికి రూ.576, అరటికి రూ.3,000 చెల్లించాలని ఉత్తర్వులు ● గతంలో రైతుల తరఫున చెల్లించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● జిల్లావ్యాప్తంగా 88 వేల హెక్టార్లలో వివిధ పంటల సాగు సాక్షి, రాజమహేంద్రవరం: తాము అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటుపడతామని హామీలు గుప్పించిన కూటమి నేతలు గద్దెనెక్కిన అనంతరం విస్మరించారు. ఇప్పటికే పంటసాగుకు అవసరమైన ‘అన్నదాత సుఖీభవ’ పెట్టుబడి సాయం చేయకపోగా.. ఉచిత పంటల బీమా ప్రీమియం భారం రైతుల నెత్తిన వేశారు. రబీ ధాన్యం విక్రయాలకు సంబంధించి డబ్బు జమ అవ్వక.. ప్రకృతి విపత్తులతో అల్లాడుతున్న రైతులకు బీమా ప్రీమియం చెల్లింపు గుదిబండగా మారుతోంది. ఇదీ సంగతి.. ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా (పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో దిగుబడి ఆధారిత పీఎంఎఫ్‌బీవై కింద వరి, మిర్చి, మొక్కజొన్న, పెసర పంటలను, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద పత్తి పంటలను గుర్తించింది. వరికి గ్రామం యూనిట్‌గా.. మిర్చి, మొక్కజొన్న, పెసర పంటలను జిల్లా యూనిట్‌గా ఎంపిక చేసింది. ఇందుకుగాను ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక చేశారు. కౌలు రైతులు సైతం బీమాకు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. బీమా పొందాలంటే రైతువాటాగా నిర్ధారించిన ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంది. బీమా ప్రీమియంకు మంగళం ‘ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలన్న నిబంధన తెరపైకి తెచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్లో సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ పరిణామం రైతుల్లో ఆవేదన నింపుతోంది. అప్పులు చేసి సాగు చేస్తుంటే.. ప్రభుత్వం తమకు ఏ మాత్రం ప్రోత్సాహం అందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా.. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 83,068 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. ఇందులో అత్యధికంగా వరి 76,941 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416, అరటి 6,000 హెక్టార్లలో సాగవుతాయి. పంటల బీమా వర్తించాలంటే ప్రతి రైతు ప్రీమియం చెల్లించాలి. సహకార బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకులు రైతుకు ఇచ్చే రుణం నుంచి ప్రీమియం సొమ్ము మినహాయించుకుంటాయి. రుణాలు తీసుకోని రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ.14.80 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం మరో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన పంటలకు సాయంగా రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది. గతంలో రూపాయి కూడా వసూలు చేయని వైనంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను అమలు చేశారు. రైతులు సాగు చేసే మొత్తం విస్తీర్ణానికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా పథకం వర్తించడంతో పంటలకు నష్టం వాటిల్లిన ప్రతి సందర్భంలోనూ రైతులు పూర్తిగా నష్టపరిహారం అందుకునే వారు. కౌలు రైతులకు సైతం పరిహారం అందించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలకే సొమ్ము జమ అయ్యేది. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బీమా ప్రీమియంగా రూపాయి కూడా చెల్లించని రైతులు ఇప్పుడు ప్రీమియం చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల సాగుకు ఇప్పటికే పెట్టుబడులు అందక అప్పులు చేశారు. ఇలాంటి సమయంలో బీమా భారం తమపై మోపడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని నిట్టూరుస్తున్నారు. 2024–25 రబీ సీజన్‌కు ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువరించింది. జిల్లాలో వరికి ఆగస్టు 15వ తేదీ, మినుములు జూలై 31, అరటికి జూలై 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. వరి పంట హెక్టారు రూ.95,000 విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,425 ప్రీమియం చెల్లించాలని సూచించింది. మినుములు, పెసలు హెక్టారుకు రూ.50 వేలు విలువ కట్టి 1.5 శాతం వంతున హెక్టారుకు రూ.750 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. జీడితోటలకు హెక్టారుకు రూ.75 వేలుగా నిర్ధారించి 5 శాతం వంతున అంటే రూ.3,750 ప్రీమియం చెల్లించాలని తెలిపింది. అరటికి హెక్టారుకు రూ.7,500 చెల్లించాల్సి ఉంది. రైతులపై రూ.34.50 కోట్లకు పైగా భారం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా రైతులపై సుమారు రూ.34.50 కోట్లకుపైగా బీమా ప్రీమియం భారం పడనుంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి 76,941 హెక్టార్లలో సాగవుతుంది. ప్రతి హెక్టారుకు రూ.1,425 చొప్పున రైతులు ప్రీమియం చెల్లించాలంటే.. సుమారు రూ.10.96 కోట్లు, మినుములు రూ.19 లక్షలు, అరటి రూపంలో రూ.4.50 కోట్లు భారం పడనుంది. పంట వర్తింపజేసిన ఇన్పుట్ సబ్సిడీ (హెక్టారుకు) వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000 మొక్కజొన్న రూ.12,500 మినుములు, పెసలు, శనగలు, ప్రొద్దుతిరుగుడు, పొగాకు రూ.10,000 జొన్న రూ.8,500 -
3న జాతీయ చదరంగం పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ చదరంగం టోర్నమెంట్‌ను కాల్ ఫ్యూజన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆగస్టు 3న నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి తెలిపారు. మంగళవారం టోర్నమెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ లోరియల్ హై గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో రూ.1,23,456 నగదు బహుమతితో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి సుమారు 400 మంది వరకు చదరంగ క్రీడాకారులు హాజరవుతారన్నారు. విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేస్తామన్నారు. స్కూల్ డైరెక్టర్ సుంకర రవికుమార్, ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ డైరెక్టర్ హైమావతి, చెస్ అకాడమీ డైరెక్టర్ విత్తనాలకుమార్ పాల్గొన్నారు. -
జీజీహెచ్‌కు వైద్య పరికరాల అందజేత
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌కు ఓఎన్జీసీ, యూనివర్సిటీ ఆఫ్ బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెమిని ఎడిబుల్ ఆయిల్ సంస్థలు సంయుక్తంగా రూ.78.77 విలువైన వైద్య పరికరాలను అందించాయి. ఈ యంత్ర పరికరాలతో పాటు న్యూరో ఓపీ షెడ్‌ను మంగళవారం కలెక్టర్ షణ్మోహన్, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ సంస్థల వితరణతో ట్రామాకేర్ బ్లాక్, న్యూరాలజీ, పల్మనాలజీ, అనస్థీషియా, కార్డియాక్ విభాగాలకు చెందిన వైద్య పరికరాలు సమకూరాయన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, రంగరాయ వైద్య కళాశాల డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఓఎన్జీసీ జీఎంహెచ్ఆర్ కె.సునీల్ కుమార్, సీపీవో త్రినాథ్, ఏపిఎంఎస్ఐజీసీ ఈఈ సీహెచ్.రత్నరాజు పాల్గొన్నారు. -
వరుస పురస్కారాలపై హర్షం
కాకినాడ సిటీ: రెడ్‌క్రాస్ జిల్లా శాఖ మరొకసారి పురస్కారాలు పొందడం మనకు గర్వకారణమని రెడ్‌క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ షణ్మోహన్ సగిలి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ శాఖ అధ్యక్షుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరం వరకు వరుసగా మూడు సంవత్సరాలు అత్యుత్తమ జిల్లా శాఖగా కాకినాడ జిల్లా మొదటి స్థానాన్ని గెలుచుకోగా పురస్కారాలను సంస్థ చైర్మన్ వైడీ రామారావు, కోశాధికారి ఎన్‌వీవీఆర్‌కె ప్రసాద్‌బాబు, కార్యదర్శి కె శివకుమార్ మంగళవారం కలెక్టర్‌కు అందజేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ జిల్లా శాఖ అవార్డులు ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు మన జిల్లా శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని నూతన సేవా కార్యక్రమాల ద్వారా రెడ్‌క్రాస్ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల రెడ్‌క్రాస్‌కు సేవలు అందించి గవర్నర్ ద్వారా పురస్కారాలు అందుకున్న ఓఎన్జీసీ, కేఎస్పీఎల్ ప్రతినిధులకు, సాయిరామ ప్రోజెన్ ఫుడ్స్ అధినేత ఎల్ సత్యనారాయణ, ఫిలిం డైరెక్టర్ బి సుకుమార్‌లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. మెట్ట జలగలతో జాగ్రత్త పిఠాపురం: మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రారంభ దశలోనే నివారణకు చర్యలు తీసుకోవాలని పిఠాపురం ఉద్యాన శాఖాధికారి వై.సోమరాజశేఖర్ రైతులకు సూచించారు. ఆయన మంగళవారం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పర్యటించి మెట్ట జలగలు సోకిన పంటలను పరిశీలించారు. ఇటీవల గొల్లప్రోలు మండలంలో వివిధ పంటలకు మెట్ట జలగలు సోకి తీవ్ర నష్టాలను కలిగించిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘జల గండం’ శీర్షికన వెలువడిన కథనానికి ఉద్యాన శాఖాధికారులు స్పందించారు. ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటల్లో మెట్ట జలగలను గమనించామన్నారు. ఎక్కువగా మిరప, బొప్పాయి వంటి తోటల్లో కనిపించాయని, వీటిని తొలి దశలోనే నివారించక పోతే ఎక్కువ మొత్తంలో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. పొలంలో తడి తగ్గించడమే కాక సాయంత్రం నీరు పెట్ట కూడదన్నారు. మిరప తోటలో కలుపు, వాడిన ఆకులు పూర్తిగా తొలగించుకోవాలన్నారు. మెట్ట జలగలకు ఆశ్రయం కలిగించే చెట్లను తొలగించాలని, రాళ్లు, చెత్త లేకుండా చూసుకుంటూ పొదల కింద వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మెటాల్డిహైడ్ బైట్ 2.5 శాతం,1 నుంచి 2 కిలోలు ఎకరాకు ఇసుకలో కలిపి వేసుకోవాలన్నారు. ఐరన్ ఫాస్ఫేట్ బైట్ 2 నుంచి 4 కిలోలు ఎకరాకు సాయంత్రం వేళ పొలం చుట్టూ లేదా మిరప రద్దెల మధ్య చల్లుకోవాలన్నారు. దీనిని వర్షం వచ్చి పోయిన తర్వాత మళ్లీ వేయడం అవసరమన్నారు. పొగాకు పొడిని చేను అంతటా తడిగా ఉన్నప్పుడు చుట్టూ చల్లు కోవడం ద్వారా వీటిని నియంత్రివచ్చని తెలిపారు. వర్షం వచ్చి పోయిన తరువాత పొలం పరిశీలించడం ద్వారా వీటి ఉనికిని గమనించవచ్చన్నారు. పొలాల్లో మెట్ట జలగలు, నత్తలు కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రం ద్వారా ఉద్యాన శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారు నివారణ చర్యలు సూచిస్తారన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా రాంప్రసాద్, ఆనంద్ గోకవరం/పెదపూడి: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా గోకవరానికి చెందిన సీనియర్ నాయకుడు తోలేటి రాంప్రసాద్, అనపర్తి నియోజకవర్గానికి చెందిన పందిరి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రాంప్రసాద్ భార్య తోలేటి రమ్యశ్రీ గోకవరం ఎంపీటీసీ 1గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. -
యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) అంటే ముందుగా గుర్తుకువచ్చేది సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం. ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సేవలో కాకుండా నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ఆసక్తి గలవారికి హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. 2020వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువత భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు వీటిని ప్రారంభించారు. వాహన చట్టాలపై అవగాహన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆర్టీసీ హెవీ వెహికల్లో డ్రైవింగ్ పాఠశాలలు ప్రారంభించింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యాలయం ఏర్పాటు చేసి యువతీ యువకులను బ్యాచ్‌లుగా ఏర్పాటు చేసి డ్రైవింగ్‌లో శిక్షణ, వాహన చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీనికోసం నామమాత్రపు ఫీజు నిర్ణయించారు. శిక్షణ పూర్తి చేసేవారికి సర్టిఫికెట్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి వారి జీవితానికి భరోసా కల్పిస్తున్నారు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్న అభ్యర్థులు భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డ్రైవర్లుగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో అయితే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ 19 బ్యాచ్‌లలో 305 మంది శిక్షణ పొందారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్ కల్పించడం, డ్రైవింగ్‌లో మెళకువలు నేర్పించడం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.21వ బ్యాచ్‌కు దరఖాస్తుల ఆహ్వానం హెవీ వెహికల్ డ్రైవింగ్‌లో అభ్యర్థులకు సుశిక్షితులైన నిపుణులతో శిక్షణ అందిస్తున్నాం. రాత్రివేళ్లలో డ్రైవింగ్ నేర్పిస్తాం. సమయ పాలన ,క్రమశిక్షణ, అంకితభావంతో డ్రైవింగ్‌లో మెళుకువలు నేర్పుతూ రోజూ తరగతి గదిలో పాఠాలతో పాటు గ్యారేజీలో ఇంజిన్ భాగాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఘాట్‌రోడ్డు ఎత్తు, పల్లం వంటి ప్రాంతాలలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం 21వ బ్యాచ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. – కే.డీ.ఎం.రాజు డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నిరుద్యోగులకు అండగా ఏపీఎస్ ఆర్టీసీ ఐదేళ్ల కాలంలో 305 మందికి తర్ఫీదు సుశిక్షితులైన నిపుణులతో నిర్వహణ 21 బ్యాచ్‌కు దరఖాస్తుల ఆహ్వానం హెవీ లైసెన్స్‌కు శిక్షణ జేఎన్టీయూకేలో బీటెక్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నాను. భవిష్యత్‌లో కొన్ని ఉద్యోగాలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగే అవకాఽశం ఉంది. శిక్షణతో పాటు లైసెన్స్, డ్రైవింగ్‌కు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. – ఎం.జోష్, కాకినాడ డ్రైవింగ్‌పై అవగాహన వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి డిఫెన్స్ వంటి వాటికి హెవీ లైసెన్స్ తప్పనిసరిగా అడుగుతున్నారు. డ్రైవింగ్‌తో పాటు లైసెన్స్ జారీకు ఆర్టీసీ అందిస్తున్న సేవలు వినియోగించుకున్నాను. ఇటువంటి వాటి ద్వారా నేర్చుకుంటే అవగాహన పూర్తిగా వస్తుంది. – పి.బాలురెడ్డి, పీఆర్ డిగ్రీ కళాశాల -
శాకంబరిగా మరిడమ్మ
పెద్దాపురం : మరిడమ్మ అమ్మవారు మంగళవారం శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దర్గాసెంటర్ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం సహకారంతో మరిడమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో పండితులు అలంకరించగా అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక బందోబస్తు కల్పించారు. అనంతరం వీధి సంబరాల్లో భాగంగా కుమ్మరవీధి సంబారాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. -
ప్రజల్లోకి కూటమి మోసాలు
క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ‘రీకాలింగ్ మేనిఫెస్టో’ రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవ.విజయ సారథి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని ఓ ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ‘రీకాలింగ్ మేనిఫెస్టో’ సమావేశం నిర్వహించారు. ఏడు నియోజకవర్గాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు మోసాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై క్రైస్తవులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్, రాజనగరం అధ్యక్షులు రెవ జొనాతన్, అనపర్తి అధ్యక్షులు రెవ దావీదు, నాయకులు రెవ.సుధాకర్, రెవ. చిట్టి బాబు, బ్రదర్ శామ్యూల్, బ్రదర్ ఐజియా, పాస్టర్ జాన్ బాబు పాల్గొన్నారు. కొబ్బరిచెట్లను మింగేస్తున్న గోదావరి మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి. అప్పనపల్లి పాటు రేవు సమీపంలో కొబ్బరి చెట్లతో పాటు సారవంతమైన భూమి నదిలో కలిసిపోయింది. పెదపట్నం, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పాశర్లపూడి గ్రామాల్లో సైతం పరిస్థితి నెలకొంది. -
పప్పుతిప్పలు
గిట్టుబాటు కావడంలేదు రెండు నెలలుగా మార్కెట్లో పప్పునకు డిమాండ్ తగ్గింది. ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత ధర గిట్టుబాటుగా లేదు. మూఢానికి ముందు కిలో పప్పు రూ.800 పలకడంతో వ్యాపారం బాగుంది. – సుతాపల్లి వెంకన్నబాబు, అధ్యక్షుడు, శ్రీవేంకటేశ్వర, క్యాజూ మర్చంట్స్ అసోసియేషన్, దేవరపల్లి నాణ్యత తగ్గింది వర్షాలకు తడవడంతో జీడిగింజలు నల్లబడి పప్పు నాణ్యత తగ్గింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న గింజల పప్పు నాణ్యత బాగుంది. విదేశీ గింజలు బస్తాకు 21 కిలోలు పప్పు దిగుబడి వస్తుండగా, స్వదేశీ గింజలు దిగుబడి 24 నుంచి 25 కిలోలు వస్తోంది. గింజల ధర ఒకే విధంగా ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో సుమారు 90 పరిశ్రమలు ఉండగా, దాదాపు 500 మంది వ్యాపారులు ఉన్నారు. మూతబడిన పరిశ్రమలను తెరచి కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేస్తున్నాం. – పెంజర్ల గణేష్‌కుమార్, జీడిపప్పు వ్యాపారి, దేవరపల్లిజీడిపప్పును ప్యాకింగ్ చేస్తున్న మహిళలు● జీడిపప్పు పరిశ్రమకు ఆషాఢం ఎఫెక్ట్ ● రెండు వారాలుగా మూతబడిన వైనం ● మార్కెట్లో తగ్గిన డిమాండ్ ● గింజల బస్తా ధర రూ.12,500 ● పప్పు ధర కిలో రూ.700 ● గిట్టుబాటు కాదంటున్న రైతులు ● మెట్ట ప్రాంతంలో 90 పరిశ్రమలు దేవరపల్లి: జీడిపప్పు పరిశ్రమపై మూఢం, ఆషాఢం ఎఫెక్ట్ పడింది. ఆషాఢ మాసానికి ముందు నెల రోజులు మూఢం రావడంతో ముహూర్తాలు లేక జీడిపప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో వినియోగం తగ్గడంతో పప్పు ధర తగ్గింది. మూఢానికి ముందు కిలో పప్పు ధర రూ.800 ఉండగా, ఆషాఢం ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.700 నుంచి రూ.720 పలుకుతోంది. గింజల ధర బస్తా(80 కిలోలు) రూ.12,000 నుంచి 12,500 ఉండడంతో వ్యాపారులకు నష్టం వస్తోంది. బస్తా గింజలకు 24 నుంచి 25 కిలోల పప్పు తయారవుతుంది. కిలో పప్పు తయారు కావడానికి గింజల ధర రూ.690, ఖర్చులు రూ.20 అవుతాయి. అంటే కిలో పప్పు తయారు కావడానికి రూ.710 ఖర్చు అవుతుండగా, ఆదాయం రూ.700 వస్తోంది. దీనిని బట్టి కిలోకు రూ.10 నుంచి రూ.20 నష్టం వస్తోంది. మెట్ట ప్రాంతంలో విస్తరణ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు డివిజన్ పరిధిలోని నిడదవోలు మండలం తాడిమళ్ల, చాగల్లు మండలం చిక్కాల, దేవరపల్లి మండలం దేవరపల్లి, నల్లజర్ల మండలం దూబచర్ల, గోపాలపురం మండలం గోపాలపురంలో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. తాడిమళ్ల, దేవరపల్లి కేంద్రంగా జీడిపప్పు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది. తాడిమళ్లలో సుమారు 45 పరిశ్రమలు, దేవరపల్లిలో 15 పరిశ్రమలు, చిక్కాలలో 5 పరిశ్రమలు, దూబచర్లలో 15 పరిశ్రమలు , గోపాలపురంలో 10 పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ ఉత్పత్తి తాడిమళ్ల, దేవరపలి, దూబచర్ల నుంచి జరుగుతుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన యంత్రాలను తీసుకు వచ్చి వ్యాపారులు జీడిపప్పు తయారీ పరిశ్రమలను నెలకొల్పారు. కార్మికుల ఉపాధికి గండి మార్కెట్లో జీడిపప్పునకు డిమాండ్ లేకపోవడం, గింజల ధర పెరగడంతో జీడిపప్పు కొనేనాథుడు కరువయ్యాడని వ్యాపారులు వాపోతున్నారు. తయారు చేసిన పప్పు నిల్వలు మిల్లుల వద్ద పేరుకుపోవడంతో అమ్మకాలు లేక రెండు వారాల నుంచి దేవరపల్లిలోని పరిశ్రమలకు యజమానులు సెలవు ప్రకటించి మూసి వేశారు. మండలంలోని 15 పరిశ్రమలు మూతబడడంతో పప్పు తయారీ నిలిచిపోయింది. శ్రావణమాసంపైనే ఆశలు ఆషాఢం అనంతరం ఈ నెల 27 నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభముహూర్తాలు ఉండడంతో పప్పునకు డిమాండ్ పెరగవచ్చునని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఏటా ఆషాఢంలో పప్పు ధర తగ్గగా, శ్రావణంలో ధర పెరుగుతుంది. -
లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ విచారణ
ఆ నలుగురిని వదలం : చైర్పర్సన్ రాయపాటి శైలజకాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సోమవారం విచారించారు. ఆమె కాకినాడ రంగరాయ వైద్య కళాశాల, జీజీహెచ్‌లను సందర్శించి విద్యార్థులు, బోధకులతో సమావేశమయ్యారు. తొలుత రంగరాయ వైద్య కళాశాలకు వెళ్లి, నేరుగా బాధిత విద్యార్థినులతో సమావేశమయ్యారు. సమావేశం నిర్వహించిన ఆర్ఎంసీ డైనింగ్ హాల్లోకి ఎవరినీ అనుమతించకుండా తాను మాత్రమే విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జరిగిన అకృత్యాలను తెలియజేయడానికి విద్యార్థినులు తొలుత భయపడ్డా, తానిచ్చిన భరోసాతో ఒకొక్కరుగా నోరు విప్పారన్నారు. ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్‌ల వైఖరి తమను ఆవేదనతో పాటు భయానికి గురిచేసిందన్నారు. వారి దాష్టికాలు విద్యార్దులను మనో వేదనకు గురి చేశాయని వెల్లడించారు. ఏదో వంకతో తాకే ప్రయత్నం చేసేవారని, అసభ్య భంగిమల్లో ఫొటోలు తీసి వన్ టైం వ్యూ ద్వారా వాట్సాప్‌లో పంపేవారని బాధితులు వెల్లడించారన్నారు. వెకిలి చూపులు వెర్రి చేష్టలతో నరకాన్ని చూపారని, సింగిల్‌గా రూంకి రావాలంటూ ఒత్తిడి చేసేవారని చెబుతూ విద్యార్దులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. సహ ఎల్టీలు, నిందితుల అనుయాయుల వల్ల తమకు హాని జరిగే అవకాశం ఉందని విద్యార్దినులు తమ భయాన్ని వెల్లడించారన్నారు. వారికి కమిషన్ తరఫున, పోలీస్ శాఖ తరఫున భరోసా ఇచ్చామన్నారు. లైంగిక వేధింపుల నిందితులు ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్‌లను చట్ట ప్రకారం శిక్షిస్తామని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీరు విద్యార్థినులతోపాటు జీజీహెచ్‌కు వచ్చే పలువురు మహిళా రోగులపైనా ఈ తరహా అకృత్యాలకే పాల్పడ్డారని తమ విచారణలో వెలుగు చూసిందని అన్నారు. ఈ కీచకులపై చట్ట ప్రకారం తీసుకోవలసిన అన్ని చర్యలపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో చర్చించామన్నారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి దాష్టీకాలకు పూనుకోకుండా గుణపాఠం నేర్చేలా చర్యలుంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ దేవరాజ్ పాటిల్, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పాల్గొన్నారు. -
శాంతించిన గోదావరి
కాటన్ బ్యారేజీ నుంచి 3.58 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదలకాటన్ బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న మిగులు జలాలుదవళేశ్వరం: గోదావరి క్రమంగా శాంతించింది. ధవళేశ్వరం వద్ద వరద నీటి ఉధృతి తగ్గింది. దీంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. ధవళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 10.50 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి డెల్టా కాలువలకు సంబంధించి 14,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 6,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీలోని మొత్తం 175గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.34 మీటర్లు, పేరూరులో 9.61 మీటర్లు, దుమ్ముగూడెంలో 6.96 మీటర్లు, భద్రాచలంలో 23.30 అడుగులు, కూనవరంలో 11.34 మీటర్లు, కుంటలో 4.24 మీటర్లు, పోలవరంలో 8.68 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.33 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేనేత ప్రదర్శన
● పీజీఆర్ఎస్లో 238 అర్జీల స్వీకరణ ● కలెక్టర్ ప్రశాంతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ రంగ హస్తకళల అభివృద్ధి సంస్థ ‘‘ఆప్కో’’ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక వస్త్రాల స్టాల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రజలకు 30 శాతం రిబేట్‌పై ఆప్కో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచామన్నారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను వినియోగించటం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చని, ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. ప్రతి శనివారం ప్రభుత్వ ఉద్యోగులు ఆప్కో చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా ప్రజలు చేనేతను ప్రోత్సహిస్తూ ఆప్కో వస్త్రాల కొనుగోలును ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 238 అర్జీలను స్వీకరించామన్నారు. అర్జీదారునికి నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించాలన్నారు. ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: పదవ తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఐటీఐలలో ప్రవేశం కోసం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025– 26 సంవత్సరానికి రెండవ విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సీహెచ్ సునీల్‌కుమార్ తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో ‘ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా 20వ తేదీ రాత్రి 11.55 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్‌లతో హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. క్వాంటం టెక్నాలజీ ఎఫ్డీపీ ప్రారంభం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ – ఏటీఏఎల్ స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) సోమవారం ప్రారంభమైంది. క్వాంటం టెక్నాలజీల రంగాన్ని అన్వేషించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. సమకాలీన విద్య, పారిశ్రామిక దృశ్యంలో క్వాంటం టెక్నాలజీల ఔచిత్యాన్ని వివరించారు. ఎఫ్డీపీ కన్వీనర్ డాక్టర్ వి. పెర్సిస్ మాట్లాడుతూ 50 మంది వరకు ఫ్యాకల్డీ సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం ఈ నెల 19 వరకు జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, కో కన్వీనర్ డాక్టర్ జి. కీర్తి మరిట, సీఎస్ఈ హెచ్ఓడి డాక్టర్ బి.కెజియయారాణి పాల్గొన్నారు. పోలీసు పీజీఆర్ఎస్కు 36 ఫిర్యాదులు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’’(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి 36 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్. బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏ.వీ సుబ్బరాజు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. -
ఖరీఫ్‌కు నీటి కష్టం
జిల్లాలో నాట్లు పరిశీలిస్తే... వరి సాధారణ నాట్లు మండలం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) (హెక్టార్లలో) రాజమహేంద్రవరం 1,460 716కడియం 2,137 1,875రాజానగరం 4,687 1,286అనపర్తి 3,739 2,874బిక్కవోలు 6,113 2,430కోరుకొండ 5,755 230సీతానగరం 5,710 1,530రంగంపేట 2,815 240చాగల్లు 3,421 2,712దేవరపల్లి 3,657 2,310గోపాలపురం 4,216 595కొవ్వూరు 4,507 4,210నిడదవోలు 7,253 4,830తాళ్లపూడి 3,787 1,214ఉండ్రాజవరం 4,923 1,892నల్లజర్ల 4,247 2,180● రుతు పవనాల దాగుడుమూతలు ● కరుణించని వరుణుడు ● వర్షాభావ పరిస్థితులతో మెట్ట రైతులకు ఇబ్బందులు ● జిల్లాలో వరి నాట్లకు శ్రీకారం చుట్టిన రైతులు ● సకాలంలో వర్షం కురవకపోవడంతో ఆలస్యంగా సాగుతున్న ప్రక్రియ ● గతేడాది ఈ సమయానికి విస్తారంగా వర్షాలు, గోదావరికి వరదలు సాక్షి, రాజమహేంద్రవరం: రుతుపవనాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. వరుణుడు కరుణించడం లేదు. వెరసి ఖరీఫ్ రైతుకు కన్నీటి కష్టం తప్పడం లేదు. గోదావరి చెంతనే ఉన్నా.. మెట్ట గ్రామాల్లో మాత్రం సాగునీటి కొరత వేధిస్తోంది. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నెల మొదటి వారంలో పలకరించనున్నట్లు వాతావరణ శాఖ అప్పట్లో సంకేతాలు వెలువరించింది. జూలై 10వ తేదీ నాటికి రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు ఆ శాఖ అంచనా వేసింది. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా సాగింది. ఎండలు ఉండాల్సిన సమయంలో అకాల వర్షాలు కురవగా తొలకరి సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. వెరసి నాట్లు వేసిన రైతులకు నీటిపాట్లు తప్పడం లేదు. ఈ సమయానికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా.. 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఆగిన రుతుపవనాల కదలిక ఖరీఫ్ సాగుకు రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఒక్కసారిగా రుతుపవనాల కదలిక ఆగిపోయింది. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ నెల 19వ తేదీ వరకు తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచాయి. ఉక్కపోతతో ప్రజల అల్లాడిపోయారు. దీంతో సాగుకు కర్షకులు వెనకడుగు వేశారు. ప్రస్తుతం సాగుకు వర్షాల అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా.. ఇంకా సాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,848 హెక్టార్లలో నారుమళ్లకు అవకాశముండగా.. సోమవారం నాటికి వంద శాతం పూర్తయినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ నాట్ల ప్రక్రియ ఇంకా నడుస్తూనే ఉంది. వెదజల్లే పద్ధతి, యంత్రాలతో నాట్లు వేసే పద్ధతిలో ఇప్పటి వరకు 31,289 హెక్టార్లలో మాత్రమే పూర్తయింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు లేక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడారుతున్న నారుమళ్లు ● నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. వర్షం కురవకపోవడంతో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు కాలువల్లోని నీటిని ఇంజిన్ల సాయంతో తోడి నారుమళ్లు తడిపే పరిస్థితి తలెత్తింది. గతేడాది ఇదే సమయానికి వర్షాలు పుష్కలంగా కురిశాయి. నాట్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది మాత్రం నెల రోజులు ఆలస్యంగా సాగుతోంది. ● రాజానగరం నియోజకవర్గం దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం, గాదరాడ, కోటి, శ్రీరంగపట్నం, బొమ్మిల్లంక, మునగాల గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో నారుమడి దశలోనే ఉన్నాయి. ఆకు మడులు ఎండుతున్న నేపథ్యంలో ఇంజిన్ల ద్వారా తడి ఇస్తున్నారు. బోర్ల నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో తప్ప .. మిగిలిన ప్రాంతాల్లో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోరుకొండ మండలంలో సుమారు 5,000 హెక్టార్లలో ఈ పరిస్థితి తలెత్తింది. ● గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటికోసం నిరీక్షణ తప్పడం లేదు. నీటి కోసం బోరుబావులపై ఆధారపడుతుండటం, అవి సక్రమంగా పనిచేయపోవడంతో నారుమళ్లు తడారుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో నాట్లకు ఆటంకం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. నాట్లు వేసిన అనంతరం నీరు పుష్కలంగా ఉండాలి. అప్పుడే పంట దిగుబడి ఆశించిన మేర అందుతుంది. ‘తూర్పు’లో 83,918 హెక్టార్లలో సాగు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2025–ఖరీఫ్ సీజన్లో 83,918 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. అత్యధికంగా వరి 76,941 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, మొక్కజొన్న 181, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416 హెక్టార్లలో సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. సన్నరకాలైన ఎంటీయూ–1224, బీపీటీ–2841, 2270, 2846, ఎన్‌ఎల్‌ఆర్–3238 వంటి రకాలతో పాటు ఎంటీయూ–1318 వంటి నూతన రకాలను సాగు అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కరుణించని వరుణుడు జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచి వరుణడు కరుణించడం లేదు. ఈ నెల 8వ తేదీన చిరుజల్లులు కురిశాయి. నల్లజర్లలో 3.4 మిల్లీ మీటర్లు, గోకవరంలో 1.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో చినుకు జాడ లేదు. పంటసాగుకు అనువైన సమయంలో వర్షం కురవకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నాట్లు ఇలా.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 76,941 హెక్టార్లలో వరి సాగు అవుతుంది. జిల్లావ్యాప్తంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. గోకవరంలో 5,195 హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 117 హెక్టార్లలో మాత్రమే నాట్ల ప్రక్రియ పూర్తయింది. పెరవలిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,319 హెక్టార్లు కాగా.. నాట్లు కేవలం 48 హెక్టార్లలో మాత్రమే పడ్డాయి. కేవలం రెండు మండలాల్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. -
వైవిధ్య వరితం!
ప్రయోగాత్మకంగా చేపట్టాను నేను 11 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటి వరకూ అన్ని రకాల పంటలు వేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాను. ఇటీవల నీటి ఎద్దడిని అధిగమించేలా ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేసే విధానాన్ని నా వ్యవసాయ క్షేత్రంలో చేపట్టాను. దీంతో మా పొలంలో ఒక ఎకరంలో ఈ పద్ధతిలో వరి సాగు చేశాం. దుక్కి దున్నిన పొలంలో ఎటువంటి తడి లేకుండా పొడి విత్తనాలను సాగు చేశాం. – పాటి శ్రీనివాసు, ప్రకృతి వ్యవసాయ రైతు, వెల్దుర్తి, పిఠాపురం మండలం పిఠాపురం: నీటి వినియోగంతో సాగయ్యే పంట కావడంతో వరికి వాతావరణ పరిస్థితులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారు పోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. దీంతో ఆరుతడి పంటగా వరిని సాగు చేసే పద్ధతికి ప్రకృతి వ్యవసాయ శాఖాధికారులు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో నారు నీరు లేకుండా, కూలీలతో పని లేకుండా రైతులు నేరుగా వరి సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలు అంటే కేవలం వాణిజ్య పంటలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కాని మెట్ట ప్రాంతంలో నీరు అంతగా అందని పొలాల్లో వాణిజ్య పంటలకు బదులుగా వరి సాగు చేసే విధానాన్ని అధికారులు ప్రారంభించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆరుతడి పద్ధతిలో వరి సాగును ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం ఎలియాజరు నేతృత్వంలో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రారంభించారు. నష్టాల సాగుకు చెక్ పెట్టాలని.. వర్షాలు సరైన సమయంలో కురవక పోవడం తద్వారా కాలువల్లో సాగు నీరు ఆలస్యంగా విడుదల అవ్వడం వల్ల వరి సాగు కత్తిమీద సాముగా మారింది. దీంతో నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం నిర్ణీత సమయానికి వీలు పడడం లేదు. దీనివల్ల పంటలు ఆలస్యం అవ్వడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించినా రైతులు నష్టాల పాలవుతున్నారు. వ్యవసాయం చేయడం దండగ అనే నిరాశ రైతులను ఆవహిస్తోంది. చెరువులు, కాలువలు, నీటి వనరులపై ఆధారపడి పండించే పంటలు ఇప్పుడు భూగర్భ జలాల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అయితే కొన్నిచోట్ల భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం లేదు. దీనికి తోడు కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి సమస్యలకు చెక్ పెడుతూ తక్కువ పెట్టుబడితో తక్కువ నీటి వసతితో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి వరి సాగుకు రైతులను అధికారులు సంసిద్ధం చేశారు. ఆరుతడితో అన్నీ లాభాలే ఆరుతడి పద్ధతిలో సాగు చేసిన వరి.. మామూలు పంట కంటే 15 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. పంట దిగుబడి 15 శాతం పెరుగుతుంది. కూలీల ఖర్చులు అవసరం లేదు. సాగు నీటి వసతి అంతంత మాత్రమే సరిపోతుంది. దీంతోపాటు నారుమడి తయారు చేయాల్సిన అవసరం, నారు వేసే ఖర్చు లేదు. నారు తీసే ఖర్చు ఉండదు. దీనివల్ల ఎకరానికి సుమారు రూ.10 వేలు మిగులుతాయి. ఈ పంట సాగుకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. కేవలం వర్షం నీరు సరిపోతుంది. వేసవిలో దుక్కి అయిన తరువాత వర్షం పడినప్పుడు నేరుగా యంత్రాలతో ఎరువులు, విత్తనాలు పొడిగా ఉన్నప్పుడే చల్లుకోవచ్చు. అదే నారుమడి తయారీకి అయితే ఎకరానికి సుమారు 30 కేజీల విత్తనం అవసరం అవుతుంది. ఆరుతడి పంటకు అయితే కేవలం 15 కేజీల విత్తనంతో ఒక ఎకరం సాగు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 15 కేజీల విత్తనాలకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఆరుతడిలో వరుసల క్రమంలో దుబ్బుకు దుబ్బుకు మధ్య దూరం సమంగా ఉండడం వల్ల గాలి,వెలుతురు బాగా తగిలి పంట దిగుబడి మామూలు దాని కంటే ఎక్కువ వస్తుంది. తెగుళ్లు అంతగా సోకే ప్రమాదం కూడా ఉండదు. నారు, తడి లేని పంట! ఆరుతడి పంటగా వరి సాగు ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాత్మకంగా.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చేలా కృషి కాకినాడ జిల్లా వెల్దుర్తిలో సాగు ప్రారంభంప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి వరి సాగు ప్రారంభించాం. వీటికి దేశీయ వరి రకాలైన నవారా, మైసూర్ మల్లిక, నారాయణ కామిణి, చిట్టి ముత్యాలు మోడల్ వేయించాం. ప్రస్తుతం నీటి ఎద్దడి అధికంగా ఉండడంతో ఈ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చాం. ముందుగా ప్రధాన పొలంలో 400 కేజీల బయోచారు కలిపిన ఘనజీవామృతం వేయించాం. విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తనానికి విత్తనానికి మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉండేలా నాటించాం. నాలుగు వరుసలు వరి విత్తనాలు నాటిన తర్వాత ఒక వరుస ఆకుకూరలు, మళ్లీ నాలుగు వరుసలు వరి విత్తనాలు మళ్లీ కాయగూరలు 4:1 నిష్పత్తిలో నాట్లు వేయించాము. ఈ సాగు పద్ధతుల్లో ప్రధానంగా నీటిని ఆదా చేయవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిలో సాగు చేయవచ్చు. విభిన్న రకాల పంటలు వేయడం వలన పురుగులు, తెగుళ్ల ఉధృతిని అరికట్టవచ్చు. ప్రధాన పంట ఆదాయంతో పాటుగా అంతర పంటల వల్ల ఆదాయం పొందవచ్చు. రైతుకి పెట్టుబడి తగ్గడంతో పాటుగా ఆదాయం పెరుగుతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులకు బదులుగా, గో ఆధారతమైన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, వృక్ష సంబంధమైన కషాయాలు ఉపయోగించి పంటలు పండించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి తీసుకురావచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతుకు మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. జిల్లాలో పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాం. త్వరలో జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేసే విధంగా రైతులను సంసిద్ధం చేస్తున్నాం. – ఎలియాజరు, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా మేనేజర్, కాకినాడ -
కోట శ్రీనివాసరావుతో ఏరా ఏరా అనుకునే స్నేహం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కోట శ్రీనివాసరావు మరణం పట్ల నట గాయకుడు శ్రీపాద జిత్‌మోహన్‌మిత్రా తీవ్ర సంతాపం తెలిపారు. ‘కోట, నేను కలిసి దగ్గరగా 50 సినిమాలు చేశాం. ప్రాణం ఖరీదు, బాబాయి అబ్బాయి, అలీబాబా అరడజను దొంగలు, ఏవండీ ఆవిడ వచ్చింది, హై హై నాయక, చిన్నబ్బాయి, 420, కత్తి కాంతారావు తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఏరా ఏరా అనుకునేంత స్నేహం ఉంది. రాజమండ్రిలో నా ఆర్కెస్ట్రా 25వ వార్షికోత్సవానికి కోటశ్రీనివాసరావు హాజరై స్టేజ్‌పై మిమిక్రీ చేశాడు. చాలా గొప్ప కళాకారుడు, విలక్షణ నటుడు, మంచి వ్యక్తి. ఆయన చనిపోవటం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు సద్గతులు కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ఆయన పేర్కొన్నారు. అన్నపూర్ణ టాకీస్‌ను సందర్శించిన ‘కోట’ అమలాపురం రూరల్: అప్పట్లో కోట శ్రీనివాసరావు అమలాపురం మండలం సమనసలోని స్టేట్‌బ్యాంకుకు విచ్చేశారు. ఆయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో అమలాపురం మండలం సమనసలోని స్టేట్ బ్యాంకుకు విచ్చేశారు. అక్కడ బ్యాంకు మేనేజర్‌ను కలిసిన సందర్భంగా అప్పటి సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావును కలుసుకుని ఆయన నడుపుతున్న అన్నపూర్ణ టాకీస్‌ను సందర్శించారు. అన్నపూర్ణ టాకీస్ వద్ద కోటను సర్పంచ్ రాజారావు ఆధ్వర్యంలో సత్కరించారు. అప్పట్లో కోట శ్రీనివాసరావు ను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. 1987 లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో అన్నపూర్ణ టాకీస్‌లో ప్రతిఘటన సినిమా ఆడుతోంది. కోట శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాజీ సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావు గుర్తు చేసుకుని ఆయన మృతికి సంతాపం తెలిపారు. భలే ఖైదీలు షూటింగ్లో కోటతో శ్రీరామ వరప్రసాద్ రాంకీ నిరోషా హీరో హీరోయిన్లుగా బీవీఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన భలే ఖైదీలు సినిమా షూటింగ్ 1992లో కాకినాడలో జరిగింది. ఈ సినిమాలో కై కాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను కాకినాడలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రైవేట్ బస్సు కండక్టర్‌గా అమలాపురం మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన సత్తి శ్రీరామవరప్రసాద్ నటించారు. కోట శ్రీనివాసరావు, సత్యనారాయణతో కలిసి నటించిన సన్నివేశాలు ఇప్పటికీ మర్చిపోలేనని శ్రీరామ వర ప్రసాద్ తెలిపారు.నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా -
మాణిక్యాంబా అమ్మవారికి ఆషాఢం సారె
రామచంద్రపురం రూరల్: పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12 వ శక్తి పీఠంగా అలరారుతున్న ద్రాక్షారామలో మాణిక్యాంబా అమ్మవారికి భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢం సారెను అందజేశారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో శాకంబరిగా అలంకరించారు. ద్రాక్షారామకు చెందిన స్వీట్ స్టాల్ అధినేత కంచెర్ల చక్రధరరావు(చక్రి) సుమారు 150 కేజీల వివిధ రకాల స్వీట్లు అమ్మవారికి సారెగా సమర్పించారు. పలువురు మహిళా భక్తులు స్వీట్లు, పండ్లు అమ్మవారికి సారె తీసుకువచ్చారు. అమ్మవారి పుట్టిల్లు అయిన వేగాయమ్మపేట నుంచి శోభాయాత్రగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో సారెను తోడ్కొని వచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, వేగాయమ్మపేట జమీందార్ వాడ్రేవు సుందర రత్నాకరరావు, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ పాల్గొన్నారు. -
ఘనంగా కవలల సమ్మేళనం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కవల పిల్లల పెంపకం, వారి జీనవ విధాన శైలి తదితర అంశాలను తెలియజేయాలని వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 108 కవల పిల్లల జంటలను ఒకే చోట ఉంచి వారి ప్రతిభ పాటవాలను వెలికితీయడానికి కాకినాడ సూర్యకళా మందిరం ఆదివారం వేదికగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్, అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నాళం అండాళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ, జిల్లా గవర్నర్ బంగర్రాజు, వైస్ ప్రెసిడెంట్ సిద్దా వెంకటసూర్యప్రకాశరావులు హాజరై వాసవీ క్లబ్ ఆశయాలు, విశిష్టిత తెలియజేశారు. కవల పిల్లలకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు. అనంతరం ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా సుచిత్ర, చావలిసూర్యకుమారి, రాజ్యలక్ష్మి వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి గర్లపాటి శ్రీనివాసులు, బొడా సాయిసూర్యప్రకాష్, సూజాత, గ్రంధి బాబ్జి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.దక్షిణాది రాష్ట్రాల నుంచి 108 మంది హాజరు -
జైలుకు లైంగిక వేధింపుల నిందితులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీరాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్‌లకు ఆదివారం కాకినాడ సెకండ్ ఏజేఎఫ్సీఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం కాకినాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి థర్డ్ ఏజేఎఫ్సీఎం కోర్టు ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.20 వేలు వ్యక్తిగత పూచీకత్తుతో 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. రామకృష్ణారావుపేటకు చెందిన ఓ బాలిక ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పీఎస్‌లో కేసు నమోదు కాగా, ఈ కేసులో ఆదివారం మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులు కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మీరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను పోలీసులు కాకినాడ సబ్ జైలుకు తరలించారు. రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతిరాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్ – రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి ట్రాక్‌పై మృతి చెంది ఉన్నాడని రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్ఐ లోవరాజు ఆదివారం తెలిపారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామన్నారు. మృతుడి ఒంటిపై బ్రౌన్ కలర్ చొక్కా, బ్లాక్ ప్యాంట్ ఉన్నాయని, చెవికి పోగులు ఉన్నాయని చెప్పారు. పై వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఉంటే సీఐ 9440627551,ఎస్ఐ–9491444022, నంబర్లకు తెలియజేయాలన్నారు. ఇంటికి వెళుతూ వృద్ధుడి మృతిబిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని రాజానగరం వెళ్లే బస్సు స్టాప్ వద్ద వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం బలభద్రపురం గ్రామంలోని రాజానగరం బస్‌స్టాప్ వద్ద గుర్తు తెలియన వృద్ధుడు మృతి చెందినట్లు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందిందన్నారు. మృతుడు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి గంపల రాముడు (79)గా గుర్తించారు. అతను అనపర్తి మండలం పులగుర్త గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నట్లు, సైకిల్‌పై ఇంటికి వెళుతూ బలభద్రపురం వచ్చిన తరువాత ఒక్కసారిగా పడిపోయి మృతి చెందినట్టు తెలిపారు. అతని కుమారుడు నానాజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్‌సీ తరలించినట్లు తెలిపారు. ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై లైంగిక వేధింపుల కేసుఅమలాపురం టౌన్: అమలాపురం ఇరిగేషన్ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తనను ఉద్యోగ పరంగానూ, లైంగికంగానూ వేధిస్తున్నారని అదే కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ పట్టణ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి తనను డీఈఈ వేధిస్తున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ సీతానగరం: మండలంలోని రఘుదేవపురం రవీంద్ర కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగిందని ఎస్సై డి.రామ్ కుమార్ ఆదివారం తెలిపారు. సురవరపు మణికంఠ అక్క నిడదవోలులో ఉంటున్నారు. రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్లారు. శనివారం తిరిగి ఇంటికి రాగా తాళం బద్దలు కొట్టి ఉంది. లోపల సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన మణికంఠ పోలీసులకు సమాచారం అందించాడు. నాలుగు కాసుల బంగారు బిస్కట్, 90 తులాల వెండి, రూ.3.90 లక్షల నగదు పోయిందని గుర్తించారు. ఎస్సై ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీను సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆస్తి తగాదాలో ఒకరికి కత్తిపోట్లుకరప: గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో ఒకరు కత్తిపోట్లకు గురికాగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు. కరప గ్రామం మెరకవీధిలో బేరి రామకృష్ణ కింది పోర్షన్‌లోను, బేరి రాజ రాజేశ్వరి పైపోర్షన్లోను నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై వివాదం జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బేరి రామకృష్ణ వియ్యంకుడు అమజాల వీరరాఘవ బిక్కవోలు నుంచి భోజనం క్యారేజీ పట్టుకుని వచ్చారు. అదే సమయంలో రాజరాజేశ్వరి ఆస్తి తగాదా విషయంపై రామకృష్ణతో గొడవ పడుతుండగా రాఘవ కూడా ఆ గొడవలో కలగచేసుకున్నారు. రాజరాజేశ్వరి కుమారుడు చంద్రశేఖర్ అక్కడకు వచ్చి రామకృష్ణ, రాఘవలతో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరిని చంపాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొచ్చి రాఘవ ఎడమ చేతిపై రెండుచోట్ల నరికాడు. చుట్టుపక్కలవారు వచ్చి రాఘవను కాపాడి, చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంఎల్సీ స్టేట్మెంట్పై కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
తగ్గుతున్న గోదావడి
ఫ నేడు మరింత తగ్గే అవకాశం ఫ కడలిలోకి 6.14 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: వరద గోదావరి తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి ఉధృతి తగ్గడంతో ఆదివారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా ఉరవడి తగ్గింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద ఉదయం అత్యధికంగా 6,56,341 మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రికి నీటి ఉధృతి తగ్గడంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. రాత్రి 6,14,762 క్యూసెక్కుల నీటిని కడలిలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి సోమవారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 10.90 అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 30.60 అడుగులకు తగ్గింది. ఎగువన గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో..) కాళేశ్వరం 7.32 పేరూరు 11 దుమ్ముగూడెం 8.72 కూనవరం 14.78 కుంట 6.20 పోలవరం 10.59 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.09 అత్యవసర సహాయానికి సంప్రదించండి రాజమహేంద్రవరం సిటీ: గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, అయినప్పటికీ అత్యవసర సహాయం కావాల్సి వస్తే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 112, 1070, 1800 425 0101 నంబర్లలో సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేంత వరకూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్లరాదని, చేపలు పట్టడం, ప్రయాణించడం, స్నానాలకు వెళ్లడం వంటివి చేయరాదని ప్రఖర్ జైన్ సూచించారు. -
మడి.. తడారి..
కృష్ణాకు నీరు తీసుకెళ్లాలనే తహతహ పోలవరం కుడి కాలువ పొంగి ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కాలువలో నీటి ప్రవాహం ఉంది. కృష్ణాకు నీరు తీసుకు వెళ్లాలనే ప్రభుత్వం తహతహలాడుతోంది. వర్షాలకు రైతులు నాట్లు వేశారు. ప్రస్తుతం కాలువకు నీరు ఇవ్వక పోవడంతో చేలు దెబ్బ తింటున్నాయి. పోలవరం కాలువ పొంగుతుండగా, తాడిపూడి ఎండిపోయింది. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే పంటలు కోలుకుంటాయి.– సత్తి జగదీశ్వరరెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం, గోపాలపురం నియోజకవర్గం ఇదీ.. తాడిపూడి.. తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి తీరాన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మన జిల్లా మెట్ట ప్రాంతంలోని కొవ్వూరు, గోపాలపురంతో పాటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, నిరుపయోగంగా ఉన్న భూములను ఈ పథకం ద్వారా సాగులోకి తీసుకు రావాలని లక్ష్యంగా నిర్దేశించారు. సుమారు రూ.400 కోట్లతో ఈ పథకం పనులు పూర్తి చేశారు. ప్రధాన కాలువపై 4 సబ్ లిఫ్టులు ఏర్పాటు చేశారు. 2008లో పనులు పూర్తి కాగా, నాటి సీఎం వైఎస్సార్ నీటిని విడుదల చేశారు. 11 మండలాల్లో సుమారు 78 కిలోమీటర్ల పొడవున తాడిపూడి కాలువ విస్తరించి ఉంది. ప్రధాన పంపు హౌస్ వద్ద 8 మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో 6 మోటార్లను వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం కాగా, వైఎస్ తదనంతరం వచ్చిన ప్రభుత్వం కాలువ పనులు పూర్తి చేయలేదు. దీనికితోడు ప్రధాన కాలువ గట్లు బలహీనంగా ఉండటం వంటి కారణాలతో అధికారుల లెక్కల ప్రకారం 1.56 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేస్తున్నారు. దేవరపల్లి మండలం బందపురం వద్ద ఏర్పాటు చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకం 5వ సబ్ లిఫ్టు ఫ తాడిపూడి ఆయకట్టులో ఎండిపోతున్న చేలు ఫ ఈ నెల 3న హడావుడిగా నీరు విడుదల చేసిన మంత్రి ఫ ఆ వెంటనే మోటార్లు ఆఫ్ చేసిన అధికారులు ఫ దేవరపల్లి సబ్‌లిఫ్ట్ మరమ్మతుల పేరుతో కాలయాపన ఫ కాలువకు విడుదల కాని నీరు ఫ ఆయకట్టులో దెబ్బ తింటున్న వరి చేలు ఫ తగ్గిన భూగర్భ జలాలు ఫ రైతుల గగ్గోలు దేవరపల్లి: సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో వేసిన వరి చేలు ఎండిపోతున్నాయని, వెంటనే కాలువకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల గడచినా ఇంత వరకూ కాలువకు నీరు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి చెంతనే ఉన్న తమ భూములకు చుక్క నీరు ఇవ్వకపోగా, ఎక్కడో ఉన్న కృష్ణా, రాయలసీమ రైతులకు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కాలువకు నీరు విడుదల చేసినట్టే చేసి, నిలిపివేయడంతో తాడిపూడి ఆయకట్టు పొలాల్లో వరి చేలు ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంత వరకూ నాట్లు కూడా పడని దుస్థితి నెలకొంది. మరోవైపు బోర్ల కింద వేసిన చేలకు సైతం పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. భూగర్భ జలాలు 10 నుంచి 15 అడుగులకు పడిపోవడంతో బోర్ల నుంచి నీరు తక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు కాస్తూండటంతో చెరువులు, బోర్ల కింద వేసిన వరి ఆకుమడులు దెబ్బ తింటున్న పరిస్థితి నెలకొంది. మంత్రి స్వయంగా నీరు విడుదల చేసినా.. కాలువలో జలకళ కానరాకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. ఒకపక్క ఎండిపోతున్న చేలను, మరోవైపు నీరు లేక వెలవెలబోతున్న కాలువను చూచి ఆవేదన చెందుతున్నారు. చుక్క నీరు లేని తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ చుక్క నీరు లేక.. ఈ చిత్రం చూడండి. ఇది తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ. ఈ పథకం నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఈ నెల 3న ఆర్భాటంగా సాగునీరు విడుదల చేశారు. ‘రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుంది. రైతులకు సకాలంలో సాగునీటిని అందజేస్తాం’ అంటూ అప్పట్లో మంత్రి గొప్పగా చెప్పారు కూడా. ఇది జరిగి అప్పుడే పది రోజులు గడిచింది. ఈపాటికే ఈ కాలువ నిండుగా ప్రవహించాలి. కానీ, చుక్క నీరు కూడా రావడం లేదు. మంత్రి మోటార్లు ఆన్ చేసి అలా వెళ్లగానే అధికారులు వెంటనే మోటార్లు ఆఫ్ చేసి, నీటి విడుదలను నిలిపివేశారు. కాలువ, సబ్ లిఫ్టుల నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయించని ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం. దేవరపల్లి సబ్ లిఫ్టు మరమ్మతులు పూర్తయితే తప్ప నీరు విడుదల చేసేది లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరిలో 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. అయినప్పటికీ తాడిపూడి కాలువలో నీరు ప్రవహించకపోవడంతో ఆయకట్టులో చేలు ఎండిపోతున్నాయి. గోదావరి జలాలు కృష్ణార్పణం ఈ చిత్రం కూడా చూడండి. ఇది తాడిపూడి కాలువ గట్టును ఆనుకునే ఉన్న పోలవరం కుడి కాలువ. పక్కనే ఉన్న తాడిపూడి కాలువలో చుక్క నీరు లేకపోగా.. పోలవరం కుడి కాలువ మాత్రం గోదావరి జలాలతో నిండుకుండను తలపిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ కాలువ నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చిన తమకు నీరు ఇవ్వకుండా.. ఎక్కడో ఉన్న కృష్ణా జిల్లాకు పది రోజులుగా నీరు తరలించుకుపోతున్నారని స్థానిక రైతులు ఆక్షేపిస్తున్నారు. తమ పంటలను ఎండబెట్టి, అక్కడి రైతులు మాత్రమే పచ్చగా ఉండాలని ప్రభుత్వం తాపత్రయపడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ నీరు ఇవ్వకపోతే పంటలు ఏవిధంగా సాగు చేయగలమని ఆవేదన చెందుతున్నారు. -
నాలుగు రోజులు ఇలాగే ఉంటే..
తాడిపూడి కాలువ కింద వరి చేలు ఎండిపోతున్నాయి. కాలువకు నీరు విడుదల చేయడంతో నాట్లు వేశాం. మూడు మోటార్ల కింద 20 ఎకరాల్లో వరి పంట వేశాను. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పడిపోయి నీరు తక్కువగా వస్తోంది. ఇక్కడి రైతులకు నీరు ఇవ్వకుండా పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు తీసుకు వెళుతున్నారు. గోదావరి చెంతనే ఉన్న పంటలకు నీటి సమస్య ఏర్పడింది. పరిస్థితి మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటే ఊడ్చిన చేలు ఎందుకూ పని చేయవు. సమస్య చెబుదామంటే అధికారులు ఫోన్ తీయడం లేదు. – కలగర భూపతిరావు, రైతు, కరుకూరు, దేవరపల్లి మండలం భూగర్భ జలాలు తగ్గాయి ఇంత వరకూ తాడిపూడి కాలువకు నీరు విడుదల చేయలేదు. ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గాయి. బోర్లు సరిగా తోడటం లేదు. బోర్ల కింద వేసిన వరి నాట్లు నీరు లేక దెబ్బ తింటున్నాయి. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే అన్ని పంటలకూ మేలు జరుగుతుంది. ఆయకట్టుకు నీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి బోర్లు సమృద్ధిగా నీరు తోడతాయి. ప్రధాన కాలువ పనులు పూర్తి కావలసి ఉన్నాయి. పంట కాలువలు లేవు. కాలువ గట్లు వర్షాలకు గండ్లు పడి బలహీనంగా ఉన్నాయి. కాలువను ఆధునీకరించి, గట్టు పటిష్టం చేసి, పంట బోదెలు ఏర్పాటు చేయాల్సి ఉంది. – మల్లిన వెంకటేశ్వరరావు, రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం మరమ్మతులు జరుగుతున్నాయి తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద దేవరపల్లి వద్ద ఉన్న సబ్ లిఫ్టు మరమ్మతులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పంపు హౌస్‌లోకి వర్షపు నీరు వెళ్లి మోటార్లు మట్టితో పూడుకుపోయాయి. ఆ మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం వద్ద మూడు మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోస్తున్నాం. 26వ కిలోమీటరు వరకూ నీరు సరఫరా అవుతోంది. రెండు రోజుల్లో కాలువకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తాం. ఈ సీజన్లో 1.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. – రామేశ్వర నాయుడు, డీఈఈ, తాడిపూడి ఎత్తిపోతల పథకం -
కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌పై దాడి హేయం
రాజమహేంద్రవరం సిటీ: కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ అయిన ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడికి తెగబడడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తూంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తూంటే, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నా మా అనే అనుమానం కలుగుతోందన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఏడాదికి పైబడి వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. వేలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని, భవిష్యత్‌లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలని భరత్‌రామ్ హెచ్చరించారు. ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండబోరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉప్పాల హారికకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అండగా నిలబడతామని భరోసా కూడా ఇచ్చారని భరత్‌రామ్ అన్నారు. ఇకపై కఠినంగా ప్లాస్టిక్ నిషేధం రాజమహేంద్రవరం సిటీ: నగరంలో ఇకపై ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై ఉన్న నిషేధాన్ని ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 75 మైక్రాన్ల లోపు మందం ఉండే ప్లాస్టిక్ కవర్లతో పాటు ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పలుచని ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, అలంకరణకు వాడే థర్మకోల్ తదితర వస్తువులపై నిషేధం ఉందని వివరించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారు శిక్షార్హులని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా చేటు చేస్తోందన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన ప్రజలు ఎన్నో రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకందారులు, నిల్వ చేసేవారు, పంపిణీదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడమే కాకుండా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ఇకపై క్లాత్, జ్యూట్ బ్యాగ్‌లే వినియోగించాలన్నారు. ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. -
పరిమితికి లోబడి పొగాకు సాగు
ఫ రైతులకు టొబాకో బోర్డు ఆర్ఎం ప్రసాద్ సూచన ఫ 2025–26 పంట కాలానికి ఉత్పత్తి ఖరారు ఫ రాష్ట్రంలో 142 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి దేవరపల్లి: పొగాకు బోర్డు 2025–26 పంట కాలానికి ఉత్పత్తిని ఖరారు చేసినందున రైతులు పరిమితికి లోబడే పొగాకు సాగు చేయాలని బోర్డు రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ సూచించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రీజియన్ పరిధిలోని ఉత్తర తేలిక నేలలు (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో బ్యారన్‌కు 35.15 క్వింటాళ్ల చొప్పున 49.70 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. 2024–25 పంట కాలంలో బ్యారన్‌కు 41.25 క్వింటాళ్ల చొప్పున 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, సుమారు 80 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2023–24 పంట కాలంలో బ్యారన్‌కు 25 క్వింటాళ్ల చొప్పున ఉత్పత్తికి అనుమతి ఇచ్చారని చెప్పారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల పరిధిలో 148 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చినట్టు ప్రసాద్ తెలిపారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో బ్యారన్‌కు 3,512 కిలోల చొప్పున 49.70 క్వింటాళ్లు, దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్ఎల్ఎస్) ప్రాంతంలో బ్యారన్‌కు 3,656 కిలోల చొప్పున 48.10 మిలియన్ల కిలోలు, దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్) బ్యారన్‌కు 3,565 కిలోల చొప్పున 42.10 మిలియన్ల కిలోలు, ఉత్తర ప్రాంత నల్లరేగడి నేలలోల్ల (ఎన్బీఎస్) బ్యారన్‌కు 2,102 కిలోల చొప్పున 2.10 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను దృష్టిలో పెట్టుకుని 142 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి అనుమతించారని చెప్పారు. 2025–26 పంట కాలంలో రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యత పెంపుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది నుంచి మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు ప్రసాద్ తెలిపారు. బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు మాత్రమే పొగాకు సాగు చేయాలని స్పష్టం చేశారు. కేటాయించిన కోటా మేరకు మాత్రమే పండించాలని, అధిక విస్తీర్ణంలో పండించరాదని చెప్పారు. అనధికారికంగా బ్యారన్లు నిర్మించరాదని, రిజిస్టర్ అయిన రైతులు అనధికారికంగా బ్యారన్లు నిర్మిస్తే రిజిస్ట్రేషన్లు నిలుపు చేస్తామని హెచ్చరించారు. పొగాకుతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుని లాభాలు పొందాలని ఆయన సూచించారు. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తిలో మన దేశం 3, ఎగుమతుల్లో 2 స్థానాల్లో ఉందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో పొగాకు ఉత్పత్తి 3,762 మిలియన్ల కిలోల నుంచి 4,197 మిలియన్ల కిలోలకు పెరిగిందని చెప్పారు. బ్రెజిల్, జింబాబ్వే, చైనా దేశాల్లో పొగాకు ఉత్పత్తి అధికంగా జరిగినందున ప్రస్తుతం మన రైతులు పండించిన పొగాకును మంచి ధరకు అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా లో గ్రేడ్ పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయని ప్రసాద్ చెప్పారు. -
కూటమి పాలనలో దళితులకు రక్షణ కరవు
● బాధిత మహిళను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం దారుణం ● మాజీ హోం మంత్రి తానేటి వనిత అనపర్తి: కూటమి ప్రభుత్వ హయాంలో దళితులకు అందున మహిళలకు రక్షణ కరవైందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. దుప్పలపూడి గ్రామానికి చెందిన దళిత మహిళ కొమ్ము బుజ్జిపై పాశవిక దాడి జరిగి, వారం రోజులు కావస్తున్నా బాధితురాలిని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనీసంగా కూడా పరామర్శించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. గ్రామానికి చెందిన టీడీపీ నేత నల్లమిల్లి వెంకటరెడ్డి సెటిల్మెంట్ వ్యవహారంలో దాడికి గురై, అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ కొమ్ము బుజ్జిని వనిత శనివారం పరామర్శించారు. ఆమెతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కూడా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వనిత, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నాయకులు పెత్తందారీ పోకడలకు పోతున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇంటికి వస్తున్న తనపై.. తమ మాట వినలేదనే కక్షతో సుమారు 15 మంది దారి కాచి, వీధి లైట్లు ఆర్పివేసి, రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని బాధిత మహిళ కొమ్ము బుజ్జి చెబుతోందని అన్నారు. అయినప్పటికీ పోలీసులు ఆమె రోదనను పట్టించుకోకుండా.. సంబంధం లేని సెక్షన్లు పెట్టి, కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చూస్తూంటే తన అనుచరులను కాపాడుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ఒక పతకం ప్రకారమే ప్రజల్లో భయాందోళనలు సృష్టించి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ రెడ్‌బుక్ పట్టుకుని తిరుగుతూంటే.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా వారి బాటలోనే అమాయక ప్రజలపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో ఆందోళన చెందుతున్న బాధిత మహిళకు, ఆమె కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని, అలాగే కేసులోని సెక్షన్లు మార్చి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అస్మదీయులకే సంపద సృష్టి
● టీడీపీ నేతల చేతుల్లోకి ఎఫ్‌సీలు ● కాకినాడ, రాజానగరం ఏటీఎస్‌లు వారికే.. ● గతంలో రవాణా శాఖ పరిధిలోనే ఎఫ్సీల జారీ ● నేడు ప్రైవేటీకరించడంపై సర్వత్రా నిరసన సాక్షి, రాజమహేంద్రవరం: ఇప్పటికే మద్యం, ఇసుకను కట్టబెట్టడంతో కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఈ శాఖలో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల (ఎఫ్‌సీ) జారీ సేవలను టీడీపీ నేతలకు చెందిన ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఎఫ్సీల జారీలో రాష్ట్ర రవాణా శాఖను డమ్మీగా చేసేశారు. స్థానికంగా ఏ అధికారికీ తనిఖీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఇప్పటి వరకూ రవాణా శాఖ కార్యాలయంలో వాహనాలకు ఎఫ్‌సీలు జారీ చేసేవారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీ ప్రకారం చలానా కట్టించుకుని ఎఫ్‌సీ మంజూరు చేసేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లైట్, హెవీ మోటార్ వెహికల్స్‌కు ఎఫ్సీల జారీ చేసే పనిని తాజాగా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీనిపై ఎవ్వరికీ అజమాయిషీ ఉండదు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ఈ విధానాన్ని వాహన యజమానులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. చక్రం తిప్పిన కీలక మంత్రి! కొత్త విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) మంజూరు చేశారు. తొలి దశలో 15 ఏటీఎస్‌లు ప్రారంభించారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సింహభాగం సెంటర్లను కై వసం చేసుకున్నారు. అది కూడా యువగళం పాదయాత్ర చేసిన వారికే దక్కాయి. దీని వెనుక కీలక మంత్రి ఒకరు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ, రాజానగరం, అనకాపల్లి ప్రాంతాల్లో మాత్రం ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడిచినట్లు తెలిసింది. రూ.కోట్లు కొల్లగొట్టేలా.. ఒక ఏటీఎస్ ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం ఏకంగా రూ.3 కోట్ల సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన రూ.2 కోట్లు మాత్రమే ఆ ప్రైవేటు సంస్థ వెచ్చించాలి. ఎఫ్సీల జారీ ద్వారా ప్రతి జిల్లాలో రూ.కోట్లు వసూలవుతాయి. కేంద్ర ట్రాన్స్పోర్ట్ ఇండియా సలహా మేరకు ఫిట్నెస్ టెస్ట్‌ల ద్వారా రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్మును ఆ సంస్థ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక పైసా కూడా చెల్లించనవవసరం లేదు. అటువంటప్పుడు ఆ సంస్థకు సబ్సిడీ ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వాహనాలూ కలిపి సుమారు 1.80 కోట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 లక్షల వాహనాలు ఎఫ్‌సీ కోసం వస్తూంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎఫ్సీల జారీని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ప్రభుత్వ ఆదాయానికి ఆమేరకు గండి పడింది. మరోవైపు ఎఫ్సీల జారీని ప్రైవేటు సంస్థకు ఏకంగా 20 ఏళ్లకు రాసివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చేందుకే కూటమి ప్రభుత్వం ఇలా దీర్ఘకాలిక లీజులు ఇస్తోందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీమళ్లీ చలానాలు ఎఫ్‌సీ పొందేందుకు తొలుత సంస్థ నిర్దేశించిన మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం నిర్దేశించిన సమయంలోగా వాహనాన్ని తనిఖీ చేయించుకోవాలి. లేదంటే తిరిగి చలానా తీయాల్సి వస్తోంది. గతంలో చలానాకు వారం నుంచి 15 రోజుల వరకూ గడువుండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాహనదారులు వాపోతున్నారు. పైగా గతంలో కంటే చలానా మొత్తాన్ని భారీగా పెంచారని మండిపడుతున్నారు. గతంలో వాహనంలో చిన్నపాటి లోపాలుంటే సరిచేసుకుని వస్తే ఎఫ్‌సీ ఇచ్చేవారు. ప్రస్తుతం బ్రేక్ ఆయిల్ తక్కువగా ఉండటం చిన్నపాటి లోపాలున్నా అన్‌ఫిట్ చేసేస్తున్నారు. ఆ విషయం వారం తర్వాత మెసేజ్ ద్వారా తెలుస్తోంది. అప్పటికే చలాగా గడువు ముగిసిపోతూండటంతో మళ్లీ కట్టాల్సి వస్తోంది. ఇదే అదనుగా బ్రోకర్లు రంగంలోకి దిగి రూ.వేలు వసూలు చేస్తున్నారు. దూరాభారం ఏటీఎస్‌లను జిల్లా కేంద్రాలకు దూరంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి రాజానగరం వద్ద ఏటీఎస్ పెట్టారు. నల్లజర్ల నుంచి రాజానగరం వచ్చి వెళ్లాలంటే రాను పోను 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది దూరాభారమవుతోందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. దీనివలన పనులు మానుకుని రావాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు వాపోతున్నారు. ఎఫ్సీల జారీని ప్రైవేటీకరించడంపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యాన రవాణా కార్మికులు రాజానగరం ఏటీఎస్ వద్ద ఇటీవల నిరసన తెలిపారు. చలానాల పెంపు (రూ.లు) వాహనం పాత కొత్త బాదుడు చలానా చలానా లారీ 920 1,320 400 మినీ వ్యాన్ 920 1,320 400 ఎల్ఎంవీ 720 920 200 ఆటో 620 820 200 జిల్లాలో వాహనాలు వాహనం సంఖ్య ద్విచక్ర వాహనాలు 3,41,117 కార్లు 45,404 ఆటో 21,726 గూడ్స్ క్యారియర్లు 20,465 ట్రాక్టర్లు 7,807 ట్రాలీలు 4,896 త్రీ వీలర్ గూడ్స్ వాహనాలు 3,599 ట్రైలర్ (అగ్రికల్చర్) 2,306 స్కూల్, కాలేజీ బస్సులు 1,827 లగ్జరీ టూరిస్ట్ క్యాబ్‌లు 342 అంబులెన్స్‌లు 230 జీపులు 150 రోడ్ రోలర్లు 67పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత కేంద్రం తీసుకు వచ్చిన ఎఫ్సీల జారీ ప్రైవేటీకరణ విధానాన్ని తొలుత రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేశారు. వాహన కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు దీని అమలును నిలిపివేశాయి. పాత, కొత్త విధానాల్లో ఎఫ్‌సీలు చేయించుకునేలా గుజరాత్ వెసులుబాటు కల్పించింది. మిగిలిన రాష్ట్రాలు నూతన విధానం అమలు చేయడం లేదు. కానీ, మన రాష్ట్రంలో సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం అస్మదీయులకు సంపద సృష్టించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లుందనే విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ ప్రైవేటీకరణపై పోరాటం కార్మికులు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో ఫిట్నెస్ ప్రైవేటీకరణకు నాంది పలకడం దారుణం. దీనిని ఉపసంహరించుకునేంత వరకూ ఉధృతంగా పోరాడతాం. ఈ విషయంలో కార్మిక జేఏసీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం మంచి చేసిందో కార్మికులు గ్రహించాలి. – మార్గాని భరత్‌రామ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం ఉపసంహరించుకోవాలి ఫిట్నెస్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిని తక్షణమే ఉపసంహరించాలి. చలానా విధానంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు సామర్థ్య పరీక్షలు అప్పగిస్తే పారదర్శకత ఏం ఉంటుంది? ఒక వాహనానికి పరీక్ష చేయాలంటే 40 నిమిషాలు పడుతోంది. కొన్ని పాఠశాలలు, కళాశాలలకు చెందిన వాహనాలు సెంటర్ వద్దకు రాకపోయినా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. – వాసంశెట్టి గంగాధరరావు, కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్, రాజమహేంద్రవరం -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఏర్పడింది. రెండో శనివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు బీరకాయలతో విశేషంగా అలంకరించారు. సుమారు 7 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. -
సమన్వయంతో సత్వర న్యాయం
రాజమహేంద్రవరం రూరల్: సమన్వయంతో సత్వర న్యాయం లభించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన నగరంలో శనివారం కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది నమోదైన కేసులపై వివిధ శాఖలను సమన్వయపరిచేలా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈ అర్ధ సంవత్సర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించే న్యాయ, రెవెన్యూ, మెడికల్, మునిసిపల్, ఫోరెన్సిక్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ, ఎకై ్సజ్, జైళ్లు, రైల్వే, విద్య, ఏపీఎస్ ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసు శాఖ నిత్యం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయా శాఖల ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాఽధికారులను ఎస్పీ నరసింహ కిషోర్ సత్కరించారు. సబ్ డివిజన్ల వారీగా పనితీరు, డ్రోన్ కెమెరాల ప్రత్యేక స్టాల్స్ ఆహూతులను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ నమోదైన కేసులపై జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కూలంకషంగా చర్చించారు. వచ్చే అర్ధ సంవత్సర కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. గడచిన అర్ధ సంవత్సరంలో వివిధ కేసుల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ సత్కరించారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీలకు శిక్షణ
సామర్లకోట: ఉమ్మడి జిల్లాలోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందని ప్రిన్సిపాల్ కరుటూరి నాగ వరప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయకత్వ శిక్షణలో భాగంగా మార్పు ద్వారా విజేతలు పేరిట గత నెల 23 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాల సిబ్బంది శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 67 మందికి స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తామన్నారు. మహిళా ప్రతినిధులకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విధులు–బాధ్యతలు, భావవ్యక్తీకరణ వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణకు హాజరై సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుందన్నారు. -
వాడపల్లి క్షేత్రం జన సంద్రం
దేవస్థానం ఆదాయం రూ.62.53 లక్షలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం జనసంద్రమైంది. అంతకంతకూ భక్తజనం పెరుగుతుండడంతో కోనసీమ తిరుమలగా ఈ క్షేత్రం ప్రఖ్యాతమవుతోంది. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు. సాధారణ భక్తులతో పాటు శ్రీఏడు శనివారాలశ్రీ నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసిపోయింది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.62,52,971 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. లోవ భక్తులకు సత్యదేవుని ప్రసాదం సిద్ధం అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిక్కిరిసిన రత్నగిరిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. రెండో శనివారం, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచే స్వామివారి సన్నిధికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుడు, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. -
గోదావరి పరవళ్లు
● కడలిలోకి 5.29 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 10.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,29,209 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నది ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద శనివారం 41.10 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ 40.90 అడుగులకు తగ్గింది. దీంతో, ఆదివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 8.77 పేరూరు 13.87 దుమ్ముగూడెం 11.50 కూనవరం 16.14 కుంట 7.30 పోలవరం 10.78 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 14.94 రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి ఉధృతి -
శిష్యుడినని నమ్మించి శఠగోపం
● గురువు ఇంటికి సమీపంలోనే అద్దెకు దిగి అదను చూసి చోరీ ● రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ ● నాలుగు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ అమలాపురం టౌన్: నేను మీ వద్దే చదువుకున్నానని.. ఆ ఉపాధ్యాయుడి ఇంటి పక్కనే మరో ఇంటిలో అద్దెకు దిగిన పూర్వ విద్యార్థి గురువు ఇంటికే కన్నం వేసి విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు శనివారం విలేకరుల సమావేశంలో ఈ ఘటన వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం పట్టణం రామదుర్గా వీధిలో ఓ డాబా ఇంట్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు దొంతంశెట్టి శ్రీనివాస్ నివసిస్తున్నారు. దేవగుప్త వీరబ్రహ్మం అనే 30 ఏళ్ల యువకుడు ఆయన విద్యార్థినని పరిచయం చేసుకుని ఆయన ఇంటికి సమీపంలోనే మరో ఇంటిలో అద్దెకు దిగాడు. ఈనెల మూడున ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో విశాఖపట్నం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా వీరబ్రహ్మం ఇంటిలోని తలుపు బోల్టును పగలగొట్టి రూ.50 లక్షల విలువైన 463 గ్రాముల బంగారాన్ని దోచుకుని ఉడాయించాడు. ఈ నెల ఏడో తేదీన విశాఖ నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాస్ తన ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి, సీసీ కెమేరా ఫుటేజీల సాయంతో చోరీకి పాల్పడిన వీరబ్రహ్మంను అరెస్టు చేసి అతని నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులకు ఎస్పీ అభినందనలు కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసిన రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్, సీఐ ఎం.వెంకట నారాయణ, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, రామచంద్రపురం ఎస్సై నాగేశ్వరరావు, ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్, క్రైమ్ ఏఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ వీరబాబు, కానిస్టేబుళ్లు ఏసుకుమార్, సూరిబాబు, అనిల్ కుమార్, లోవరాజు, అర్జున్, ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్లను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. -
వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇది ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు పి.గిరప్రసాద్వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో కొన్ని వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల నుంచి సిబ్బంది ప్యాటర్న్ మారలేదని, దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందడం లేదని చెప్పారు. కేవలం కొద్దిమంది కాంట్రాక్టు నర్సులు మాత్రమే ఉన్నారని, పలువురు నర్సులు అవసరమని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అతి ముఖ్యమైన ధోబీ, బార్బర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పోస్టులు ఎత్తివేశారని చెప్పారు. అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఒకప్పుడు ఇరవై ముప్పై మంది మాత్రమే అవుట్ పేషెంట్లు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 300కు చేరిందని, కానీ అందుకు తగినట్టుగా సిబ్బంది పెరగలేదని చెప్పారు. -
కండక్టర్ కుటుంబానికి రూ.1.08 కోట్ల పరిహారం
రాజోలు: గత ఏడాది ఊడిమూడి శివారులో ధాన్యం ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కేఎస్ రావు కుటుంబానికి ఆర్టీసీ జోన్–2 ఈడీ విజయరత్నం రూ.1.08 కోట్లు చెక్కును శుక్రవారం అందజేశారు. కండక్టర్ భార్య కె.గంగాభవానికి ఈ చెక్కును అధికారులు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పబ్లిక్ లయబిలిటీ ఫండ్ (ఈడీపీఎల్ఈ) ద్వారా ఈ పరిహారం వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ అండగా నిలుస్తుందని ఈడీ అన్నారు. డీపీటీఓ ఎస్పీపీ రాఘవకుమార్, డిపో మేనేజర్ పి.ధనమ్మ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం
● భక్తుల సూచనలు పాటించి సమస్యలు పరిష్కరిస్తాం ● డయల్ యువర్ ఈవోలో డీసీ అండ్ ఈఓ చక్రధరరావు కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కలిగేలా భక్తుల సూచనలు పాటిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. భక్తుల సూచనలు, సలహాలు తీసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం శ్రీడయల్ యువర్ ఈవోశ్రీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సుమారు 40 ఫోన్ కాల్స్‌లో కొందరు భక్తులు ఆలయంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలిచ్చారు. హైదరాబాద్, తాడేపల్లిగూడెం నుంచి ఫోన్ చేసిన భక్తులు పార్కింగ్ సమస్యలను, శనివారం రోజు వచ్చే భక్తులకు అరిటాకులో భోజనం పెట్టాలని కోరారు. దీనికి డీసీ స్పందిస్తూ ప్రతి శనివారం 20 వేల నుంచి 25 వేల మందికి ప్లేట్లలో అన్నప్రసాదం అందిస్తున్నామని, వకుళమాత అన్నదాన భవన నిర్మాణం పూర్తి కాగానే టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి 3,500 మందికి వడ్డించేలా చర్యలు తీసుకుంటున్నామని, అప్పుడు అరటి ఆకులో భోజనం పెడతామని పేర్కొన్నారు. వచ్చే ప్రతి భక్తుడు స్వామివారిని కనులారా దర్శించి, సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ఫ్లైఓవర్ ఏర్పాటు, క్యూలైన్లో తాగునీరు సదుపాయం, చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయం లోపల సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంపై భక్తుల సలహాను పాటిస్తామన్నారు. -
అష్టదేవతల తీర్థయాత్ర స్పెషల్
రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢమాసాన్ని పురష్కరించుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అష్టదేవతల ఆలయాలు సందర్శనకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ డిపో నుంచి 50 మంది భక్తులతో బయలుదేరిన ప్రత్యేక బస్సు అష్ట దేవతల ఆలయాల దర్శనం అనంతరం రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకుంటుందన్నారు. ఒక్క రోజులో పూర్తయ్యే ఆ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహిమాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట ఆలయాల దర్శనం అనంతరం తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. 18వ తేదీ శుక్రవారం మరికొన్ని ఆషాఢ మాసం అష్ట దేవతల బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో టిక్కెట్లు అవసరమైన భక్తులు 95023 00189, 73829 12141 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓడలరేవు కేంద్రీయ విద్యాలయ భూసేకరణకు రూ.3.30 కోట్లు అల్లవరం: మండలం ఓడలరేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 7.50 ఎకరాల భూసేకరణకు రూ.3.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు.ఎన్నో ఏళ్లుగా కోనసీమ వాసులు ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయ కల సాకారం అవుతోందని తెలిపారు. మన ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు, వ్యవసాయ కార్మికులు తదితర రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు స్థానికంగా ఉన్నతమైన సీబీఎస్ఈ విద్యను అందించే అవకాశం కల్పిస్తుందని హరీష్ అన్నారు. మహిళపై బ్లేడుతో దాడి కాకినాడ క్రైం: కాకినాడ జగన్నాథపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉండగా కక్ష పెంచుకున్న మొహిద్దీన్ శుక్రవారం సాయంత్రం జగన్నాథపురం సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద ఆమైపె బ్లేడుతో దాడికి పాల్పడి ముఖంపై లోతైన గాయాలు చేశాడు. రక్తమోడుతున్న బాధితురాలు కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.