breaking news
East Godavari District News
-
జనసేన నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికలు
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం దొమ్మరులో బుధవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకులు కొమ్మన మణిబాబు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన జనసేన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. గ్రామానికి చెందిన కొల్లేపి మణి, సీతా నవీన్, ఇంటి వెంకటసాయి, సీతా అఖిల్, సీతా పోసి, పడాల వెంకటేష్, మావూడూరి తాతారావు, పడాల దిలీప్ తదితరులకు పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేతులమీదుగా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, తాళ్లపూడి, చాగల్లు మండలాల కన్వీనర్లు కొలిశెట్టి నాగేశ్వరరావు, మట్టా వెంకట్రావు, సర్పంచ్ తానేటి కుమారి, నాయకులు ముదునూరు నాగరాజు, వేంపాటి సురేష్, సుంకర సత్యనారాయణ, పోసిన దేవరాయలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ యువజన జోన్–2 అధ్యక్షుడిగా కారుమూరిఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సునీల్‌కుమార్‌ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. మంగళవారం వస్తే అప్పు కోసం పాకులాట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రకాశం నగర్: కూటమి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పు కోసం పాకులాడే పరిస్థితిలో ఉందని, ఏడాది పాలనలో రూ.1.75 లక్షల కోట్ల అప్పు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. బుధవారం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన సీపీఐ 26వ జిల్లా మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, వారు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఒక్క సెంట్ భూమి కూడా పేద ప్రజలకు ఇవ్వలేదన్నారు. విజయవాడలో 4 ఎకరాలు, విశాఖపట్నంలో 13 ఎకరాల రూ.వందల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు. అధిక దిగుబడే లక్ష్యం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మెరుగైన పద్ధతులకు ప్రోత్సాహం, కొత్త సాంకేతికత ద్వారా కొబ్బరి సాగులో దిగుబడి పెంచడమే తమ లక్ష్యమని కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(సీడీబీ) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మంజునాథరెడ్డి అన్నారు. స్థానిక జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసీఏఆర్–ని ర్కా) సమావేశ మందిరంలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, రాష్ట్ర ఉద్యానవన శాఖ సౌ జన్యంతో ఉద్యోగులకు సాంకేతిక సామర్థ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎన్.మల్లికార్జునరావు అధ్య క్షత వహించారు. సీడీబీ స్కీమ్స్, ఇంప్లిమెంటేషన్ రకాలు, ప్లాంట్ మెటీరియల్ వైరెటీస్, కోకోనట్ నారుమడుల తయారీ, బీమాపై డాక్టర్ మంజునాథరెడ్డి క్షుణ్ణంగా వివరించారు. కొబ్బరి సాగు, లోకల్, హైబ్రీడ్ రకాలు, తెగుళ్లు, పురుగులు తదితర అంశాలపై జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.దుర్గేష్, నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్, శాస్త్రవేత్తలు ఎ.కిరీటి, బి.నీరజ, కోకోనట్ డెవలప్మెంట్ ఆఫీసర్ శరత్ వివరించారు. -
పిఠాపురంలో లారీ చోరీ
పిఠాపురం: ఆయిల్ లోడు లారీ మాయమైన సంఘటన పిఠాపురంలో మంగళవారం రాత్రి కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆ లారీ తుని సమీపంలో దొరికినప్పటికీ లారీలో ఉండాల్సిన సుమారు రూ.30 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు మాయమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ యజమాని కథనం ప్రకారం.. పిఠాపురం కుంతీమాధవస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న డి.అప్పారావు రాజులుకు చెందిన లారీ మంగళవారం ఉదయం కాకినాడలోని ఒక ఆయిల్ కంపెనీలో ఆయిల్ ప్యాకెట్ల లోడుకు వెళ్లింది. సాయంత్రానికి లోడు వేసుకుని అన్లోడ్కు బయలు దేరాల్సి ఉండగా, లారీ డ్రైవర్‌కు అత్యవసర పని ఉండడంతో లారీ యజమాని మరో తాత్కాలిక డ్రైవర్‌ను మాట్లాడుతున్నారు. ఆ తాత్కాలిక డ్రైవర్ తాను బుధవారం తెల్లవారుజామున బయలు దేరుతానని చెప్పడంతో లారీని తెచ్చి పిఠాపురంలో కుంతీమాధవస్వామి ఆలయం వద్ద ఉన్న లారీ యజమాని ఇంటి దగ్గరలో సీసీ కెమెరాలు ఉన్నచోట పార్కింగ్ చేశారు. తెల్లవారు జామున తాత్కాలిక డ్రైవర్ వచ్చి తీసుకునే విధంగా లారీ తాళాలను లారీలోనే పెట్టి ఆ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పి యజమాని తన ఇంట్లో నిద్రించాడు. బుధవారం తెల్లవారు జామున తాత్కాలిక డ్రైవర్ వచ్చి చూడగా, లారీ కనిపించకపోవడంతో యజమానితో పాటు చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా లారీ గొల్లప్రోలు వైపునకు వెళ్లినట్టు గుర్తించారు. గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా, మాయమైన లారీ టోల్గేట్ వద్ద ఆగి టోల్ ఫీజు చెల్లించి వెళ్లినట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఇచ్చిన సమాచారంతో లోడుతో ఉన్న లారీని శంఖవరం దగ్గర మరో వ్యక్తికి అప్పగించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బృందాలుగా లారీ కోసం తుని, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో వెతకగా తుని సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన లారీ నిలిపి ఉండడం గమనించారు. అయితే లారీలో ఉండాల్సిన ఆయిల్ ప్యాకెట్టు మాత్రం ఖాళీ అవడాన్ని పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న ఆయిల్ లోడును మరో లారీలోకి ఎక్కించుకుని ఈ లారీని వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. బాధిత లారీ యజమాని ఫిర్యాదు మేరకు పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై మణికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రూ.30 లక్షల విలువైన ఆయిల్ ప్యాకెట్లు మాయం తుని వద్ద లారీని వదిలి వెళ్లిన అగంతకులు -
దళిత ఎమ్మెల్యే నియోజకవర్గంలో దళితులకు రక్షణ కరవు
దేవరపల్లి: ఓ దళిత ఎమ్మెల్యే ఉన్న గోపాలపురం నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదని రాష్ట్ర మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. నల్లజర్ల మండలం దూబచర్లలో వైఎస్సార్ సీపీ కార్యకర్త దొబ్బిడి పెద్దిరాజు బడ్డీకొట్టును తొలగించాలంటూ పంచాయతీ కార్యదర్శి ఆశా అలేఖ్యతో టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. బడ్డీ కొట్టు తమ జీవనాధారమని పెద్దిరాజు టీడీపీ నేతలను ప్రాధేయపపడినా విడిచిపెట్టలేదన్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ధిరాజును, అతని భార్యను పిలిపించి భయపెట్టి బడ్డీకొట్టును తొలగించాలని చూశారని తెలిపారు. టీడీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి వేధింపులను భరించలేక పెద్దిరాజు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పారు. పోలీసులు, అధికారులు అక్కడే ఉన్నప్పటికీ, కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లలేదని విమర్శించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల, ఏలూరు ఆస్పత్రుల్లో వారం రోజులు మృత్యువుతో పోరాడిన పెద్దిరాజు బుధవారం మృతి చెందినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు పోస్ట్‌మార్టం జరగనివ్వకుండా అడ్డుకున్నారని, కార్యకర్త ఇంటికి వెళదామన్నా 144 సెక్షన్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. జగన్ విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుకు లేదని వనిత అన్నారు. చంద్రబాబు మాజీ ఖైదీ కాదా? అని ప్రశ్నించారు. అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదనేది గుర్తుంచుకోవాలన్నారు. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే భద్రత లేకుంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పులివెందులలో జెడ్పీటీసీ స్థానంలో ఓటమి చెందితే ప్రజల్లో వ్యతిరేకత బయటపడి వైఎస్సార్ సీపీ బలపడుతుందని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పర్యటనలను తలుచుకుని కూటమి నేతలు భయపడుతున్నారన్నారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, మహిళా విభాగం అధ్యక్షులు వై.లక్ష్మి పాల్గొన్నారు. మాజీ హోం మంత్రి తానేటి వనిత -
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 8, 10 తేదీల్లో రెండు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. చర్లపల్లి – కాకినాడ టౌన్ (07031) ఈ నెల 8వ తేదీ శుక్రవారం బయలు దేరుతుందన్నారు. కాకినాడ టౌన్ – చర్లపల్లి (07032) ఈ నెల 10వ తేదీ ఆదివారం బయలు దేరుతుందని తెలిపారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయన్నారు. రేషన్ బియ్యం స్వాధీనం రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక ఆటోనగర్ సమీపంలో అనధికారికంగా తరలిస్తున్న 15,190 కిలోల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు లారీలో రవాణా చేస్తున్న వీటి విలువ రూ. 6,98,740గా ఎంఎస్ఓ బాపిరాజు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన లారీ డ్రైవర్ తంగిరాల ఏడుకొండలును అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నామని రాజానగరం పోలీసులు తెలిపారు. అతని వద్ద లభించిన ఫోన్ ఆధారంగా ఈ రవాణాకు సూత్రధారి మొహ్మద్ ఆలియాగా తెలుస్తుందన్నారు. 6ఏ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
‘రాష్ట్రీయ బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం
రాయవరం: కేంద్ర ప్రభుత్వం ఏటా ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ పేరుతో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాల బాలికలకు అవార్డులను అందజేస్తోంది. బాలల్లో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను ఇస్తోంది. ఈ మేరకు విభిన్న రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సామాజిక సేవ, అత్యంత ధైర్య సాహసాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, శాస్త్ర సాంకేతిక విద్య, పర్యావరణ పరిరక్షణ, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు తదితర రంగాల్లో రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ విజయాలు సాధించి ఉండాలి. భారత సంతతికి చెంది, దేశంలో నివసిస్తున్న బాలలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలిలా.. అవార్డ్. జీవీవీ. ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ప్రతినిధులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. అర్హత పొందిన దరఖాస్తుదారుల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన బాలలను ఎంపిక చేసి తుది జాబితాను కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటిస్తారు. ఈ ఏడాది జూలై 31వ తేదికి అభ్యర్థుల వయసు ఐదు నుంచి 18 ఏళ్లు ఉండాలి. అర్హత ఉండి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రయోజనాలు ఇలా.. ఎంపికై న వారికి 2026 జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జ్ఞాపిక, ధ్రువపత్రం, ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు ఎంపికై న వారిని ప్రధానమంత్రి అభినందిస్తారు. గణతంత్ర దినోత్సవ ర్యాలీలో భాగస్వాములను చేస్తారు. భవిష్యత్తులో విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో అవార్డు పొందిన వారికి ప్రాధాన్యమిస్తారు. ఈ నెల 15 తుది గడువు అసాధారణ ప్రతిభ కనబర్చిన చిన్నారులకు అవకాశం -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..
తరగతులు ప్రభుత్వ ప్రైవేట్ మొత్తం 1–5 30,180 76,657 1,06,837 6–10 62,572 72,855 1,35,427 మొత్తం విద్యార్థులు 2,42,26419 మండలాల్లో స్కూళ్ల వివరాలు మొత్తం ప్రభుత్వ స్కూళ్లు 956 ఒకటి నుంచి ఐదు తరగతులు 716 యూపీ స్కూళ్లు 34 ఆరు నుంచి పది హైస్కూళ్లు 206 మొత్తం ప్రైవేట్ స్కూళ్లు 588 ఒకటి నుంచి ఐదు వరకు 147 యూపీ స్కూళ్లు 232 ఆరు నుంచి పది వరకు 209కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. ఇదే విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 1–8 తరగతుల వరకూ సీబీఏ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 పరీక్షలను జరపనున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల 4 నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్‌కు సంబంధించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్‌తో పాటు, 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్‌పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అభ్యసన లోపాలను గుర్తించడంతో పాటు, పక్కా బోధనతో వారిలో సామర్థ్యాలను వెలికితీయడం సీబీఏ పరీక్షల ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్–1, 3, ఎస్ఏ 2కు ఫార్మేటివ్కు బదులుగా సీబీఏ విధానంలో నిర్వహిస్తుండగా, ఎఫ్ఏ 2, 4, ఎస్ఏ 1 పాత విధానంలోనే నిర్వహించనున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్‌ఏలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్‌లో ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రంలోని 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాత పూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మెకానికల్.. అండర్ స్టాండింగ్.. అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం జిల్లావ్యాప్తంగా జరగనున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఏడాది నుంచి పరీక్షలన్నింటికీ బుక్‌లెట్‌లో సమాధానాలు రాయాలి. 19 మండలాల్లో అన్ని స్కూళ్లకు బుక్లెట్లు అందించాం. దీనికి సంబంధించిన వివరాలన్నీ ప్రధానోపాధ్యాయులకు వివరించాం. ముందుగానే ఈ పరీక్షలపై అవగాహన కల్పించాం. – కె.వాసుదేవరావు, జిల్లా విద్యాశాఖాధికారి, తూర్పుగోదావరి జిల్లా ఈ నెల 11 నుంచి 14 వరకూ పరీక్షలు విద్యార్థి అభ్యసనం మదింపునకు నిర్వహణ జిల్లాలో 2.42 లక్షల మంది విద్యార్థులు -
జన యోధుడు జక్కంపూడి
రాజమహేంద్రవరం సిటీ: మాజీ మంత్రి, జన యోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహన్రావు రాజకీయల్లో చేసిన సేవలు, ప్రజలకు అందించిన సంక్షేమం నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని, మార్గదర్శకమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నివాళులర్పించారు. బుధవారం స్థానిక కంబాలచెరువు వద్దనున్న జక్కంపూడి రామ్మోహన్రావు విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, తమలాంటి వారెందరికో రాజకీయపరంగా జక్కంపూడి రామ్మోహన్రావు మార్గదర్శకులన్నారు. రాజకీయ వేదికపై ఎందరినో శిష్యులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహన్రావు ఓ సంచలనమన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, తామంతా జక్కంపూడి రామ్మోహన్రావు మార్గదర్శకత్వంలో ఈ స్థాయిలో ఉన్నామన్నారు. సమస్యలపై ఎవరెళ్లినా రాత్రీపగలూ తేడా లేకుండా రోడ్డెక్కిన పోరాడారని కొనియాడారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, తొలి నుంచీ తాను జక్కంపూడి అనుచరుడిగానే రాజకీయాల్లో కొనసాగినట్టు తెలిపారు. ఏపీహెచ్బీసీ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, జక్కంపూడి రామ్మోహన్రావు జీవనం యువతకు ఆదర్శప్రాయమన్నారు. ఆయన బాటలోనే పేదల సేవలో కొనసాగుతున్నామన్నారు. జక్కంపూడి రామ్మోహన్రావు తనయుడు, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ, తండ్రి తమకు అశేష అభిమాన గణాన్ని ఆస్తిగా ఇచ్చారన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా, అభిమానుల రూపంలో నిత్యం కళ్లముందే ఉంటున్నారన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు అనునిత్యం పాటుపడతామన్నారు. నేటికీ ప్రజల హృదయాల్లో ఆయన ముద్ర చెరగలేదన్నారు. రాష్ట్రంలో గడ్డుకాలం నడుస్తోందని, కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా భరించాలని, తర్వాత రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, నాయకులు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, పెద్దిరెడ్డి అభినవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ చోట్ల భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో పాటు, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. వృద్ధులకు దుస్తుల పంపిణీ, ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ, వృద్ధాశ్రమాల్లో అన్నదానం వంటి కార్యక్రమాలు చేపట్టారు. బుర్రిలంకలో రక్తదాన శిబిరాన్ని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సందర్శించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరంలో ఘనంగా జయంతి వేడుకలు -
ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ వేధింపులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రావద్దంటూ వేధింపులకు గురిచేస్తున్న భర్త, అత్తమామలను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చైర్ పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్రపురం గ్రామానికి చెందిన డేగల గంగాధర్, డేగల వరలక్ష్మిల కుమార్తె ప్రగడ వర్ధినిలక్ష్మికి గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామానికి చెందిన ప్రగడ నాగేంద్రబాబు, ప్రగడ మంగాదేవిల కుమారుడు ప్రగడ నాగ దుర్గారావుకు 2022లో వివాహం చేశారన్నారు. వివాహ సమయంలో కట్నంగా రెండెకరాల పొలం, రూ.30 లక్షలు, 30 కాసుల బంగారం, రూ.5 లక్షల ఆడపడుచు కట్నంగా ఇచ్చినట్లు వివరించారు. 18 నెలలు కాపురం సక్రమంగా జరిగిందని, తర్వాత ఆడపిల్ల పుట్టిందని కాపురానికి రావద్దంటూ భార్య ప్రగడ వర్ధినిలక్ష్మిని భర్త నాగ దుర్గారావుతోపాటు అత్తమామలు వేధింపులకు గురిచేస్తూ ఇంటి నుంచి బయటకు గెంటేశారని వివరించారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు. అయితే తన కుమార్తెకు తండ్రిని చూపించాలనే ఉద్దేశంతో ప్రగడ నాగ దుర్గాప్రసాద్ ఇంటికి కుమార్తెతో వెళ్లగా భర్త అత్తమామలు మరి కొంతమంది కలసి వర్ధిని లక్ష్మిపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి నాగ దుర్గాప్రసాద్ పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. పెళ్లయినప్పటి నుంచి ఏ పనీ లేకుండా ఇంట్లోనే ఉంటూ బెట్టింగ్ గేమ్‌లు ఆడుతూ నష్టపోయి తనకు మరింత అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేసేవాడని ఆరోపించారు. బాధిత మహిళ వర్ధిని లక్ష్మికి న్యాయం చేసి ఆమె కాపురం నిలబెట్టాలని ఖండవల్లి లక్ష్మి డిమాండ్ చేశారు. పసిపాపతో ఉన్న తన కుమార్తెకు న్యాయం చేయాలని వర్ధిని లక్ష్మి తల్లిదండ్రులు వేడుకున్నారు. న్యాయం జరగకపోతే హూమన్ రైట్స్, మహిళా సంఘాలతో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయండి హూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ లక్ష్మి డిమాండ్ -
వైద్యం.. పూజ్యం
అన్నవరం: నిత్యం మంత్రోచ్ఛారణలతో మార్మోగిన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల మూగబోయింది. ఇక్కడి విద్యార్థులు అనారోగ్యం బారిన పడడం, దేవస్థానం వైద్యశాలలో వైద్యుడు లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మధ్య పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది.. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, రూ.175 కోట్ల వార్షిక ఆదాయం ఉన్న అన్నవరం దేవస్థానం అధికారులు సరైన వైద్యం అందించలేక విద్యార్థులను ఇంటికి పంపిచేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం వైద్యశాలలో నెల రోజులుగా వైద్యుడు లేకపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం సమస్యకు కారణమైంది. గతమెంతో ఘనం అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాలను వ్రత మండపాల వద్ద చిన్న భవనంలో సుమారు ఐదేళ్లు నిర్వహించారు. ఆ తరువాత సత్యగిరిపై పదెకరాల విశాల ప్రాంగణంలో రూ. 4 కోట్లతో పాఠశాల నిర్మించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022 ఆగస్టు 13న శ్రీసత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల కొత్త భవనాలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ పాఠశాలను ప్రారంభించారు. ఐదేళ్లు చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలను ఆయన అందజేశారు. ఈ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు దేవస్థానంలో పరిచారకులు, అర్చకులు, వ్రత పురోహితులుగా నియమిస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు అస్తవ్యస్తం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ స్మార్త పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అనుభవం లేని అధికారులకు నిర్లక్ష్యం కూడా తోడైంది. గతేడాది విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే రత్నగిరిపై ప్రత్యేక క్యాంప్ నిర్వహించి వైద్యం అందించారు. అటువంటి ప్రయత్నం ఈసారి చేయలేదు. విద్యార్థులకు అనారోగ్యం సాకుతో సత్యగిరిపై నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించారు. ఎనిమిది మంది విద్యార్థులు గత గురువారం తీవ్ర అస్వస్థతతో తుని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందడం, వారిని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్‌తో సహా పలువురు ప్రముఖులు పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో ముగ్గురిని జ్వరం కారణంగా తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం కుదుటపడడంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. గత శనివారం మరో నలుగురికి తీవ్ర జ్వరం రావడంతో దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాంతో పాటు మరి కొంతమంది విద్యార్థులకు జ్వరంగా ఉండడంతో అందరికీ రక్తపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆగమ పాఠశాలకు సెలవు ఇచ్చి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించేశారు. అస్తవ్యస్తంగా స్మార్త ఆగమ పాఠశాల నిర్వహణ విద్యార్థులకు కనీస వైద్యం కరవు వైద్యుడు లేక వచ్చిన దుస్థితి తల్లిదండ్రుల ఆందోళనతో సెలవు ఇచ్చాం సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని చెప్పడంతో సెలవు ఇచ్చాం. దేవస్థానం వైద్యశాలలో వైద్యుడిని నియమించేందుకు డీఎంహెచ్ఓకు లేఖ రాశాం. వారు వైద్యుడిని నియమిస్తే నిబంధనలను అనుసరించి జీతభత్యాలు చెల్లిస్తాం. అంతవరకూ తాత్కాలికంగా వైద్యుడిని ఆసుపత్రిలో కనీసం ఉదయమైనా పనిచేసేలా నియమించాలని కలెక్టర్‌ను కోరతాం. –వి.సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం వైద్యాధికారి లేక.. దేవస్థానం ఆసుపత్రిలో వైద్యాధికారిగా పనిచేసిన శ్రీకాంత్‌కు రౌతులపూడి పీహెచ్సీలో వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో నెల రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారు. వెంటనే ఆయనను ఈఓ రిలీవ్ చేశారు. కొత్త వైద్యుడిని డీఎంహెచ్ఓ నియమించాల్సి ఉంది. ఆ వైద్యునికి జీతభత్యాలు దేవస్థానం చెల్లిస్తుంది. కొత్త వైద్యుడి నియామకం అయ్యేవరకూ తాత్కాలికంగా దగ్గరలోని పీహెచ్సీ నుంచి డాక్టర్ వచ్చి విధులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోక ఇటు ఆగమ పాఠశాల విద్యార్థులే కాకుండా, దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీ సూపర్వైజర్, ఇతర సిబ్బంది వారికి తెలిసిన వైద్యం చేస్తున్నారు. తక్షణం దేవస్థానం వైద్యశాలలో వైద్యాధికారిని నియమించాలి. కనీసం వారానికి ఒకసారి డీఎంహెచ్ఓ లేదా ఇతర పీహెచ్సీ వైద్యులు ఆగమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఎండమావుల్లో కష్టజీవులు
రాజమహేంద్రవరం రూరల్/సీతానగరం: చాలీచాలని జీతాలతో పని చేస్తూ.. ఓ నెల జీతం రాకపోతే అల్లాడిపోయే ఈ రోజుల్లో.. శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కాంట్రాక్టు ఉద్యోగులకు ఏకంగా 20 నెలలుగా వేతనాలు రాక వారి కుటుంబాలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ స్వయానా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆధీనంలోనే ఉంది. అయినప్పటికీ ఆ చిరుద్యోగులపై మాత్రం ఎవరూ కనికరం చూపడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో 2006లో శ్రీసత్యసాయి చారిటబుల్ ట్రస్టు శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లోని గోకవరం, సీతానగరం, కోరుకొండ, రాజానగరం, దేవీపట్నం మండలాల్లోని 85 గ్రామాల ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేలా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఆర్డబ్ల్యూఎస్ శాఖ స్వీకరించింది. ఈ ప్రాజెక్టును టెండర్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ ప్రతి నెలా కార్మికులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో 53 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై నెలకు రూ.15 వేల జీతానికి పనిచేస్తున్నారు. ఆ చిరుద్యోగులకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు, అనారోగ్యం కలిగితే ఆస్పత్రిలో చూపించుకునేందుకు కనీసం ఈఎస్ఐ, పీఎఫ్‌కు కట్టాల్సిన సొమ్మునూ చెల్లించడం లేదు. ఇప్పటి వరకు 20 నెలల వేతనాల బకాయితో పాటు, 26 నెలలు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాల్సి ఉంది. పెండింగ్ జీతాలు ఇవ్వాలని గతేడాది అక్టోబర్ 17, 18 తేదీల్లో సమ్మె చేపట్టగా, ఆ సమయంలో కాంట్రాక్టర్ రూ.50 వేల చొప్పున అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఈ ఏడాది మార్చి 17వ తేదీన లాలాచెరువులోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద సమ్మె బాట పట్టారు. స్వయంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలిసి కార్మికులతో చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో చర్చించి, వారి వేతనాల బకాయిలు ఇప్పిస్తామని నమ్మించారు. దీంతో కార్మికులు అప్పడు సమ్మె విరమించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే బలరామకృష్ణ కలిసి రూ.20 లక్షల చెక్కును కాంట్రాక్టర్ పేరున ఇవ్వగా, కార్మికులకు రెండు నెలలు వేతనాలు చెల్లించారు. అప్పటి నుంచి మరలా ఆ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ కార్మికులు వేతన బకాయిలను పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక గత నెల 8వ తేదీ నుంచి లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద కార్మికులు మరలా సమ్మెబాట పట్టారు. కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాల వారు, ఆయా గ్రామాల ప్రజలు సైతం మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వ పెద్దల్లోనూ, అధికారుల్లోనూ ఎటువంటి చలనం లేదు. బిల్లులు పెట్టాం.. వచ్చేస్తాయంటున్నారే మినహా తమ ఆకలిబాధలు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 85 గ్రామాలకు నిలిచిన సరఫరా శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కార్మికులు సమ్మె చేపట్టడంతో 85 గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరా నిలిచిపోయింది. రాజానగరం, సీతానగరం, కోరుకొండ, జగ్గంపేట, దేవీపట్నం మండలాల్లోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మంచినీటి కోసం డిమాండ్ చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం కలగడం లేదు.గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025 డిప్యూటీ సీఎం కనికరం చూపాలంటున్న చిరుద్యోగులు శ్రీసత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు కార్మికుల ఆకలికేకలు 20 నెలలుగా అందని వేతనాలు గతంలో సమ్మె చేస్తే, రెండు నెలలు ఇచ్చి చేతులు దులుపుకొన్న కూటమి ప్రభుత్వం 85 గ్రామాలకు నిలిచిన సురక్షిత నీటి సరఫరా వారు చెమట చిందిస్తేనే ఎన్నో గ్రామాలకు గొంతు తడుస్తుంది. కడుపు నిండక పస్తులున్నా.. కాయకష్టానికి ఏనాడూ వెనుకంజ వేయలేదు. తీరా నెలల తరబడి వేతనాలందక.. తమ కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో తుదకు రోడ్డెక్కారు. అదిగో.. ఇదిగో అంటూ కూటమి సర్కార్ కాలయాపన చేస్తోంది మినహా.. వారి సమస్యకు ఓ పరిష్కారం చూపడం లేదు. శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుల దీనగాథ ఇది.వేతనాల్లేక పస్తులు గత 20 నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులకు విన్నవించినా బిల్లులు పెట్టామని చెబుతున్నారు కానీ, వేతన బకాయిలు మాత్రం రావడం లేదు. 30 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం. – ఉందుర్తి ఇస్సాక్, జనరల్ సెక్రటరీ, శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు వర్కర్స్ యూనియన్ ఉద్యోగ భద్రత కల్పించాలి పెండింగ్‌లో ఉన్న 20 నెలలు జీతాలు, 26 నెలలుగా కట్టని ఈఎస్ఐ, పీఎఫ్‌లను వెంటనే చెల్లించాలి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నాం. ప్రాజెక్టులో పనిచేసే కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించాలి. ఇప్పటికై నా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాపై కనికరం చూపాలి. – పి.శ్రీను, అధ్యక్షుడు, శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు వర్కర్స్ యూనియన్ -
చంద్రబాబుది క్రిమినల్ మైండ్
ఫ ఆయన జీవితంలో ఎవ్వరికీ మంచి చేసింది లేదు ఫ పాలన గాలికి వదిలి, కేసులు పెట్టడంపైనే దృష్టి ఫ మాజీ సీఎంకు దగ్గరగా ఉన్న బలమైన నేతలను ఇబ్బందులు పెడుతున్నారు ఫ వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాసాక్షి, రాజమహేంద్రవరం: ‘సీఎం చంద్రబాబు జీవితం, రాజకీయ ప్రస్థానం మొత్తం క్రిమినల్ మైండ్‌తోనే సాగుతోంది. ఎంతసేపూ ఏదో ఒక రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి.. అధికారం ఏ రకంగా చేజిక్కించుకోవాలి.. ప్రతిపక్ష నేతలను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మినహా.. ప్రజలకు మంచి చేసింది లేదు’ అని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. మద్యం అక్రమ కేసులో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డితో ఆయన తండ్రి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జక్కంపూడి రాజా, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా జైలు వద్ద రాజా మీడియాతో మాట్లాడుతూ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తే.. చంద్రబాబు మళ్లీ మద్యం తీసుకొచ్చారన్నారు. సారా దగ్గర మొదలైన ఆయన నేడు రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, మద్యం డిస్టిలరీల యజమానులతో కుమ్మకై ్క అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వడం.. ఇలా పూర్తిగా అక్రమ సంపాదనంతా చంద్రబాబు వద్ద ఉంది తప్ప.. మాజీ సీఎం జగన్ దగ్గరో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాల వద్దనో లేవని అన్నారు. బాబు పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులను అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వంలోని అధికారులు, చంద్రబాబు, లోకేష్ నిమగ్నమయ్యారన్నారు. ఎన్నికల వాగ్దానాలను గాలికొదిలి, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టేందుకే సమయం కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వ్యక్తి అని, అనేక వ్యాపారాలతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. అలాంటి కుటుంబంపై బురద చల్లేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బలమైన నేతగా, వెన్నెముకగా ఉన్నారన్న ఉద్దేశంతో మిథున్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విధానపరమైన అంశాలతో ఎంపీకి సంబంధం లేకపోయినా.. ఉన్నట్టు కట్టుకథలు అల్లి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానం చెప్పినా, వాటిని పక్కన పెట్టి జైలు లోపల ఆయనను ట్రీట్ చేస్తున్న విధానం చూస్తూంటే రాష్ట్రంలో చట్టాలున్నాయా అనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు మాదిరిగా రెండెకరాల నుంచి రూ.లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర పెద్దిరెడ్డి కుటుంబానిది కాదన్నారు. కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అరెస్టులతో ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారన్నారు. అందుకు ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నారన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మండిపడ్డారు. చంద్రబాబు దమనకాండ రాష్ట్రంలో చంద్రబాబు దమనకాండ కొనసాగుతోందని పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు తీసుకురాలేని బాబు.. అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు స్వలాభం, చంద్రబాబు మెప్పు కోసం పాటు పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో వెంకటేష్ నాయుడు నడుస్తున్నాడని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో దొరికిన డబ్బంతా చంద్రబాబు దాచి పెట్టినదేనని చెప్పారు. పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్య చౌదరి, పార్టీ లీగల్ సెల్ ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జి సాదిక్, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గీత
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఈ నియామకం చేపట్టారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అపరిష్కృత సమస్యలపై జర్నలిస్టుల ప్రదర్శన ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు తమ సమస్యలపై మంగళవారం జర్నలిస్టులు రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎం.శ్రీరామమూర్తి నేతృత్వంలో జర్నలిస్ట్స్ డిమాండ్స్ డే పాటించారు. తొలుత రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అక్రిడిటేషన్లను తక్షణం మంజూరు చేయాలని. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని శ్రీరామమూర్తి మంత్రికి వివరించారు. క్యాబినెట్లో ఈ అంశం చర్చిస్తానని మంత్రి చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కె.పార్థసారథి. సంఘ నాయకులు అప్పలనాయుడు, ఫయాజ్, ఎన్ఎన్ఎన్ సత్యనారాయణ, కె.శ్రీనివాస్, జి.గోపి, గోపాలకృష్ణ, రమేష్‌రాజా, పాలపర్తి శ్రీనివాస్, విశ్వనాథ్, మధు, ఆకుల ఈశ్వర్, దుర్గాప్రసాద్, తిరుమల, ఆనంద్, వీరబాబు, బాబీ, ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కడియపులంక సర్పంచ్‌గా పద్మావతి ఏకగ్రీవంకడియం: మండలంలోని కడియపులంక గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో సర్పంచ్‌గా మారిశెట్టి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మణికుమార్ మంగళవారం ఆమెకు ధ్రువీకరణ పత్రం అందించారు. కడియపులంక సర్పంచ్‌గా ఎన్నికై న మార్గాని అమ్మాణీ ఏడుకొండలు మృతి చెందడంతో ఇక్కడ సర్పంచ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అన్ని రాజకీయ పార్టీలు అమ్మాణీ ఏడుకొండలు కుమార్తె మారిశెట్టి పద్మావతిని సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసేందుకు అంగీకరించాయి. దీంతో పద్మావతి నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. -
ఉద్యోగులూ ఐక్యంగా ముందుకు సాగుదాం
రామచంద్రపురం: రాష్ట్రంలో ప్రభుత్వం, కాంట్రాక్టు, ఔట్‌ర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు 13 లక్షల మంది ఉన్నారని వీరందరికీ 25 వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ ఆరోపించారు. ఉద్యోగుల హక్కులు బాధ్యతలు తెలియజేసేందుకు, వారిని పోరాటంలో కార్యోన్ముకులను చేసేందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామ సూర్యనారాయణ పిలుపు మేరకు ఉద్యోగులను ఐక్యం చేసేందుకు ఉద్యోగులారా రండి.!.. టీ... తాగుతూ... మాట్లాడకుందాం.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాపూజీ అన్నారు. అందులో భాగంగా రామచంద్రపురం తాలూకా కమిటీ అధ్యక్షుడు జి. శ్రీ మన్నారాయణ అధ్యక్షతన పట్టణంలో ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాపూజీ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ నాలుగు డీఏలు, బకాయిలు ఉన్నాయని, ఐఆర్ ప్రకటించలేదని, సరండర్ లీవుల బకాయిలు చెల్లించడం లేదని, ఐదు సంవత్సరాలు దాటిన నేటికీ పీఆర్సీ ఏర్పాటు చేయలేదని బాపూజీ వాపోయారు. ఉద్యోగుల సమస్యలపై ఇతర సంఘాలు పోరాడటం లేదని, అందుకే ఏపీజీఏ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగులలో చొచ్చుకుపోయేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత చెల్లించాలో నిర్ధారించాలని, బకాయి డబ్బులు ఎంత ఇవ్వాలో ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్)లో నమోదు చేయాలని, ఉద్యోగి కోరుకున్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే ఇండ్ల స్థలంగా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసోసియేట్ ప్రెసిడెంట్ కె.సుబ్బలక్ష్మి, కార్యదర్శి పైడిమల్ల సత్తిబాబు, పంపన విష్ణుమూర్తి, కరుణమ్మ, చీకట్ల వీరాంజనేయులు, సత్యవతి, దుర్గమ్మ, దుర్గ, శ్రీనివాస్, సత్తిబాబు పాల్గొన్నారు. -
కన్నుల పండువగా వెంకన్న పవిత్రోత్సవాలు
రెండోరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు కన్నుల పండువగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనము, ప్రోక్షణ, పవిత్ర ప్రతిష్ఠ ప్రధాన హోమాలు, అష్టకలశారాధన, మహాస్నపనము, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం స్వస్తివచనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. -
భక్తుల పాలిట భయంతులు!
భక్తి ముసుగులో భారీగా దోపిడీ శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి సుదూ ర ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీపాద వల్లభ ఆలయానికి వస్తుంటారు. ఆలయా నికి వచ్చే భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు నివాస గృహాలను అద్దె గృహాలు (లాడ్జిలు)గా మార్చివేసి భారీగా అద్దెలు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం పక్కకు వాలిపోయి కూలిపోయే స్థితికి చేరడంతో ఆ భవనం పక్కనే ఉన్న మరో భవన యజమాని అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో అధికారులు పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారని, ప్రస్తుత భవనం పక్కకు వాలిపోయినట్లు గుర్తించామని, ఆ భవనం పడిపోతే ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మూడవ అంతస్తును తొలగించి, భవన నిర్మాణ పటిష్టత విషయమై కాకినాడ జేఎన్టీయూ నుంచి నిర్మాణ పటిష్టత ధ్రువీకరణ పత్రాన్ని 15 రోజుల్లోగా అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. కానీ అధికారుల నోటీసులు పట్టించుకోకుండా ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి సలహా మేరకు కేవలం పై అంతస్తులు మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ● ప్రమాదం పునాదులపై కట్టడాలు ● ఇరుకు సందుల్లో బహుళ అంతస్తుల భవనాలు ● ఆటో కూడా వెళ్లలేని చోట అతి పెద్ద భవంతుల నిర్మాణం ● ఫైర్ ఇంజిన్, అంబులెన్సు కూడా వెళ్లలేని పరిస్థితి ● నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అనుమతులు పిఠాపురం: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది అంతస్తుల భవనాలు. 50కి పైగా గదులు. ఒకేసారి 250 నుంచి 300 మంది వరకు ఒకే భవనంలో నివసించే విధంగా నిర్మాణాలు. కాన్నీ భవనం చుట్టూ నిలబడడానికి కూడా స్థలాలు కరవు. నిబంధనలను తుంగలో తొక్కి అవినీతి అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చిన అనుమతులతో పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కనీసం ఆటో కూడా వెళ్లడానికి వీలు లేని ఇరుకు సందుల్లో అతి పెద్ద భవనాలు నిర్మించేశారు. దీంతో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే అంబులెన్సు గాని ఫైర్ ఇంజిన్ గాని వెళ్లలేని పరిస్థితి ఉన్నా ఏ ఒక్క అధికారి ఇటు వైపు చూడకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయాందోళనల నడుమ ఉంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతితో అనుమతులు అత్యంత ప్రసిద్ధిగాంచిన పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడం, అక్రమార్కులకు మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్‌లో గతంలో పని చేసిన ఒక అధికారి సహకరించడం భక్తులకు శాపంగా మారింది. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం గతంలో నిర్మాణంలో ఉండగానే పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల వ్యవహారంతో బయటపడింది. పిఠాపురం మున్సిపల్ పరిధిలో కేవలం జి ప్లస్ టు భవనాలను మాత్రమే నిర్మించాల్సి ఉంది. అంతకుమించి మరొక అంతస్తు నిర్మించాలంటే అనేక రకాల అనుమతి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ అవి ఏమీ లేకుండా అనుమతి పత్రాలకు బదులు శ్రీనోట్ల పత్రాల్ఙు సమర్పిస్తే నిబంధనలతో పని లేకుండా ఎన్ని అంతస్తులైనా ఎంచక్కా నిర్మించుకోవచ్చన్నది బహిరంగ రహస్యంగా మారింది. పిఠాపురం శ్రీపాద వల్లభ ఆలయం చుట్టుపక్కల కనీసం ఆటో కూడా వెళ్లలేని ఇరుకు వీధులలో ఐదంతస్తుల భవనాలను సైతం అవలీలగా నిర్మించడం వెనక భారీ ఎత్తున సొమ్ము చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో అవి ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగితే అంతే సంగతి ఇరుకు సందులు చిన్న వీధుల్లో ఇష్టారాజ్యంగా నిర్మించిన పెద్ద భవనాల్లో ఏ ప్రమాదం జరిగినా ఒక్కరు కూడా తప్పించుకునే పరిస్థితి కనిపించదు. క్షతగాత్రులను తరలించడానికి కనీసం అంబులెన్సు కూడా వెళ్లలేని అత్యంత ప్రమాదకర పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏ భవనానికి అనుమతి ఇవ్వాలన్నా సేప్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. అక్కడ నివాసాలకు తగ్గట్టుగా పార్కింగ్ స్థలం ఉండాలి. కాని ఇక్కడ ఏ భవనం చూసినా గదులు పదుల సంఖ్యలో ఉంటే ఒక్క కారు కూడా పెట్టుకునే వీలు ఉండదు. శాశ్వత నివాసాలు కాకపోవడంతో యాత్రీకులు కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్లి పోతుండడంతో పార్కింగ్ వేరే చోట పెట్టి భవనాలను లాడ్జిలుగా ఉపయోగిస్తు రూ.లక్షల్లో దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లానింగ్ విభాగపు అధికారుల చేతివాటం పట్టణ పరిధిలోని మరిన్ని భవనాల బహుళ అంతస్తులను పరిశీలిస్తే అవగతమవుతుంది. ఎవరు ఎలా పోతే మాకేంటి మా చేయి తడుస్తుంది అన్న రీతిలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుకోని సంఘటన జరిగినా ఫైర్ ఇంజిన్, పోలీస్, ఇతర శాఖల అధికారులు ప్రవేశించలేని ఇరుకు వీధులలో అక్రమ భవనాలకు లభించిన అనుమతులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కొంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు పాటించని వారిపై చర్యలు పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో నిబంధనలు పాటించకుండా చేపట్టిన నిర్మాణలపై దృష్టి సారిస్తున్నాం. అటువంటి భవనాలపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం. – ఎస్.వల్లీప్రియ, పట్టణ ప్రణాళికా విభాగం అధికారిణి, పిఠాపురం మున్సిపాలిటీ -
పెద్దిరెడ్డితో వైఎస్సార్ సీపీ నేతల ఆత్మీయ కలయిక
సాక్షి, రాజమహేంద్రవరం: మాజీ మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్సార్ సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ములాఖాత్ అనంతరం ఆయన పార్టీ యువజన విభాగం రీజనల్ కో–ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ ప్రముఖులు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్, వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, తలారి వెంకట్రావు, కొటారు అబ్యయ్య చౌదరి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, చెల్లుబోయిన శ్రీను, మేడపాటి షర్మిలారెడ్డి, సంకిన భవానీప్రియ ఉన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
మార్కెట్లోకి కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రికల్ కారు
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని కంటిపూడి కియా షోరూంలో మంగళవారం కియా కారెన్స్ క్లావిస్ ఇండియాలో మొట్టమొదటి 7 సీటర్ ఫ్యామిలీ ఈవీని కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వరాయుడు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కారు సింగిల్ చార్జ్‌తో 490 కిమీ రేంజ్ కలిగి ఉందన్నారు. అధిక సామర్థ్యంతో 10 శాతం నుంచి 80 శాతం కేవలం 39 నిమిషాల్లో ఫాస్ట్ చార్జింగ్, లాంగ్ డ్రైవ్‌లకు సరిపోతుందన్నారు. దేశవ్యాప్తంగా 11,000 ప్లస్ చార్జి పాయింట్ ఆపరేటర్స్నీ కే, చార్జ్‌తో లొకేట్ చేసుకోవచ్చునన్నారు. 51.4 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, ఐ–పెడల్ 4–లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్, ప్యాడల్ షిఫ్టర్, లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్లు, డ్యూయల్ పానారోమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 12.3 టచ్‌స్క్రీన్ కాక్‌పిట్, 8 బోస్ స్పీకర్లతో ప్రీమియం ఆడియో, స్మార్ట్ డాష్‌క్యామ్ డ్యూయల్ కెమెరాతో, ఎయిర్ ప్యూరిఫయర్ ఏక్యూఐ డిస్ప్లేతో, పర్యావరణ హితమైన ప్రయాణం, ఆధునిక సాంకేతికతతో అనుభూతిని మిళితం చేసే విధంగా ఉందన్నారు. కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్ బాబు, ఎం.జగన్, సీహెచ్. సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్‌రామ్, సి.ఈ.ఓ. సూర్య, ఎస్.ఎం కోమల పాల్గొన్నారు. -
యాప్‌లతో ఒత్తిడికి గురవుతున్నాం
పాత సెల్ఫోన్లలో యాప్‌ల వల్ల అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నెట్వర్క్ సరిగా పని చేయకపోవడంతో ఒక్కో నమోదు అర గంటకు పైగా పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5జీ సెల్ఫోన్లు లేదా ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు జీతాలు కూడా పెంచడం లేదు. చాలీచాలని జీతాలతోనే జీవనం సాగించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనియన్ నేతలతో ఒక్కసారీ మాట్లాడలేదు. అంగన్వాడీ కార్యకర్తలపై పని ఒత్తిడి పెరగడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ, కొత్త సెల్ఫోన్లు ఇచ్చే వరకూ సెల్ఫోన్లతో పనిచేయడం జరగదు. – యాళ్ల బేబీరాణి, జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, తూర్పు గోదావరి -
కుతుకులూరులో గుడిసెల కూల్చివేత
బడుగులపై గొరిల్లా తరహా దాడులా : మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అనపర్తి : నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి ఆస్తులను గృహాలను నేలమట్టం చేసి పైశాచికానందం పొందుతున్నారని మండలంలోని కుతుకులూరు ఎస్సీపేట నిర్వాసితులు వాపోతున్నారు. అనపర్తి మండలం కుతుకులూరు ఎస్సీ పేటలో నివసిస్తున్న పదిమందికి చెందిన గుడిసెలను సోమవారం మధ్యాహ్నం భారీగా పోలీసులను మోహరించి జేసీబీలతో కూల్చివేశారని వారు చెప్పారు. ఈ ఘటనపై బాధితులు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్నామని, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో గుడిసెలను, పశువుల పాకలను వేసుకున్నామన్నారు. సోమవారం మధ్యాహ్నం పోలీసులు వచ్చి చెప్పా పెట్టకుండా అప్పటికప్పుడు జేసీబీలతో గుడిసెలను, పశువుల పాకలను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవత్వం చూపకుండా తొలగించి తమను కావాలనే ఇబ్బందుల పాలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ సానుభూతిపరుల పక్కా భవనాల వైపు కనీసం కన్నెత్తి చూడలేదన్నారు. మారుమూల ఉండే ఆ ప్రదేశంలో విగ్రహాలు పెడతామని అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద బాతుకులపై గెరిల్లా దాడులా విషయం తెలుసుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మంగళవారం బాధితులను పరామర్శించారు. జరిగిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏదో ఒక మూల పేదలపై విరుచుకుపడి వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయడం పరిపాటిగా మారిందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో అయితే మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో నిస్సహాయులైన బడుగుల జీవితాలపై గొరిల్లా తరహా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి సమయాల్లోను, తెల్లవారుజామున, సెలవు రోజుల్లోను వందలాది మంది పోలీసులను మోహరించి వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వాటిలో దోమాడ తరహా అర్థిక పరమైన లాభాపేక్షతో చేసేవి కొన్నైతే బిక్కవోలు, కొమరిపాలెం, పందలపాక తదితర చోట్ల చేసినట్టు కక్షపూరితంగా కొన్ని చేస్తున్నారని ఆరోపించారు. దోమాడలో నిరుపేదల, కుతుకులూరులోని మారుమూల ఎస్సీపేటలో ప్రాణమున్న మనుషులను జీవచ్చవాలుగా మార్చి జీవం లేని విగ్రహాలు పెడతామని వింత వాదనను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ కూల్చివేతల్లో పోలీసులతో పాటు మహిళా విభాగం నాయకురాలు కూడా ఉండి వారిని ప్రోత్సహిస్తున్నారంటే వారి రాక్షస మనస్తత్వం బయటపడుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు పద్దతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తథ్యం అని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగిరెడ్డి ఉన్నారు. -
నెట్వర్క్ సమస్య కూడా..
జిల్లాలో చాలా వరకు గ్రామీణ ప్రాంతం కావడంతో మొబైల్ నెట్వర్క్ సమస్య అధికంగా ఉంది. ప్రభుత్వం అందించిన తక్కువ సామర్థ్యం(ర్యామ్) ఫోన్లలో యాప్‌ల పనితీరు దారుణంగా ఉంది. ఈ క్రమంలో యాప్‌లు మొరాయించడం సర్వసాధారణంగా మారింది. దీంతో పిల్లలకు ప్రీ స్కూల్ బోధన దాదాపు అటకెక్కుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌ల వల్ల ఫోన్లు పనిచేయడం లేదని, 5జీ ఫోన్లు లేదా ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ నేతలతో భేటీ కూడా కాలేదు. సెల్ఫోన్ల సమస్యతో పాటు, అంగన్వాడీ కార్యకర్తల జీతాలు సైతం పెంచకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. రాజమహేంద్రవరం రూరల్: టెన్త్ కనీస విద్యార్హతతో విధుల్లో చేరిన వారే అంగన్వాడీ కార్యకర్తలు. గ్రామీణ ప్రాంత కార్యకర్తల్లో అత్యధికులకు స్మార్ట్ ఫోన్ వినియోగం పూర్తి స్థాయిలో తెలియదు. అలాంటి వీరితో ఒకే పనిని పలుమార్లు యాప్‌ల్లో నమోదు చేయాలన్న సర్కార్ ఆదేశాలతో, వారి ప్రధాన విధి అయిన ప్రీ స్కూల్ బోధన పక్కదారి పడుతోంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన 2జీ సెల్ఫోన్లతోనే ఇప్పుడూ పలు యాప్‌ల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ఫోన్లలో యాప్‌ల వల్ల నెట్వర్క్ పనిచేయక పోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు వారి సొంత ఫోన్లలో యాప్‌లు డౌన్లోడ్ చేసి, నమోదు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త 5జీ సెల్ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో చేసేది లేక అంగవాడీ కార్యకర్తలు జిల్లాలో మూకుమ్మడిగా సెల్ఫోన్లను సీడీపీవో కార్యాలయాల్లో తిరిగిచ్చేశారు. కొత్త ఫోన్లు ఇచ్చేవరకూ శ్రీనో ఫోన్.. నో వర్క్శ్రీ విధానం పాటిస్తామని కుండ బద్దలు కొట్టారు. ప్రీ స్కూలు విధులు నిర్వహిస్తూ, రికార్డులు మాత్రమే రాస్తామని చెబుతున్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పోషకాహారం సరఫరా వివరాలను ప్రత్యేక యాప్‌ల్లో పలుమార్లు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోషణ్ ట్రాకర్ యాప్‌లో ముఖ గుర్తింపు వ్యవస్థ(ఎఫ్ఆర్ఎస్)/బయోమెట్రిక్ తప్పనిసరి. దీంతో నెట్వర్క్ సరిగా పని చేయకపోయినా, లబ్ధిదారుల మొబైల్స్‌కు మెసేజ్ బ్యాలన్స్ లేక ఓటీపీ రాకపోయినా సరకులు అందించలేని పరిస్థితి. దీంతో తమతో పాటు, లబ్ధిదారులు కూడా తిప్పలు పడాల్సి వస్తోందని కార్యకర్తలు వాపోతున్నారు. టీహెచ్ఆర్తో తిప్పలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు, ఆరు నెలల నుంచి మూడేళ్ల చిన్నారులకు ప్రతి నెలా పోషకాహారాన్ని ఇంటికే అందిస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాల వద్దే ఇచ్చేవారు. దీనిని గతంలోనే టేక్ హోమ్ రేషన్(టీహెచ్ఆర్)గా మార్చి, పాలు, కోడిగుడ్లు, నూనె, పప్పు దినుసులు, బియ్యం వంటివి ప్రతి నెలా రెండు సార్లు అందిస్తున్నారు. రెండు సార్లు పోషక్ ట్రాకర్ యాప్‌లో వివరాల నమోదుకే ఎక్కువ సమయం పడుతుంది. బయోమెట్రిక్ ఆధార్‌తో అనుసంధానించిన మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. చాలాసార్లు ఈ నమోదుకే ఒక్కో లబ్ధిదారుకు అరగంటకు పైనే పడుతోందని, దీంతో పిల్లలకు ప్రాథమిక విద్య, బోధన ఇబ్బందికరంగా మారిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులకు సెల్ఫోన్ల అప్పగింత! యాప్‌లతో పనిచేయని ఫోన్లను సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు శ్రీనో ఫోన్.. నో వర్క్శ్రీ పేరుతో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో సీడీపీవోలకు అప్పగించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ, కొత్త ఫోన్లు అందించే వరకూ సెల్ఫోన్లతో పని చేయబోమని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. త్వరలో కొత్త సెల్ఫోన్లను ప్రభుత్వం ఇస్తుందని అధికారులు చెప్పినప్పటికీ.. ఫోన్లు తీసుకెళ్లేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు భీష్మించారు. అసలు కంటే యాప్‌ల పనే ఎక్కువంటూ అంగన్వాడీ కార్యకర్తల ఆగ్రహం స్మార్ట్ఫోన్ల వినియోగంపై సంపూర్ణ అవగాహన లేని వైనం విధి నిర్వహణలో ఒత్తిడితో తీవ్ర అసహనం సీడీపీఓకు 2జీ సెల్ఫోన్లు అప్పగింత కొత్త ఫోన్లు ఇచ్చే వరకూ ‘నో ఫోన్.. నో వర్క్’ పని పెరిగి.. బోధన తగ్గి.. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కేంద్రాల్లో 15 వరకూ రికార్డులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం (ఎఫ్‌సీఆర్), పిల్లలు, బాలింతలు, గర్భిణుల నమోదు, ప్రీ స్కూల్ అడ్మిన్ రికార్డులను ప్రతి రోజూ విధిగా నమోదు చేయాలి. మరోవైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్–ఎ రికార్డు, రిఫరల్ సర్వీసెస్, గృహ సందర్శకుల రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్‌హోల్డ్ సర్వే రికార్డు, గ్రోత్ చార్ట్ తదితర వ్యవహారాలతో పాటు, ఇప్పుడు యాప్‌లు అదనం. ఈ యాప్‌ల్లో నమోదు ప్రక్రియ మరింత కష్టంగా మారింది. -
వెదుళ్లపల్లి సొసైటీకి తాళం
● రుణాలు చెల్లించిన రైతుల ఆగ్రహం ● తమకు పాస్‌బుక్‌లు ఇవ్వాలని డిమాండ్ ● సస్పెండైన సీఈవో లెటర్‌తో చైర్పర్సన్ ఎంపికపై అభ్యంతరం సీతానగరం: సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్‌తో చైర్ పర్సన్ పదవి ఇవ్వడమేంటని, రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ను బ్యాంక్ నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు వెదుళ్లపల్లి పీఏసీఎస్‌కు మంగళవారం తాళం వేశారు. వివరాల్లోకి వెళ్లితే పీఏసీఎస్‌లో రూ.64 లక్షలు గల్లంతయ్యాయని సాక్షి దినపత్రిక గత ఏడాది వెల్లడించింది. దాంతో సీఈవో సురేంద్ర, ఎరువుల సేల్స్ వుమెన్ భారతి, గుమస్తా పోశియ్యలను సస్పెండ్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించినా తప్పుడు రసీదులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు విచారణ పేరుతో అందించకుండా నిలిపివేశారు. తాజాగా పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఏర్పాటుపై రైతులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని ఓవర్ డ్యూలో ఉన్న కవల శ్రీనివాస్‌రావుకు సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్ ఇచ్చారని, అందులో శ్రీనివాస్ చెల్లించిన రుణ నగదు తానే వాడుకున్నానని, దానిని చెల్లిస్తానని లెటర్ ఇవ్వడంతో చైర్ పర్సన్ పదవి ఇవ్వడానికి విచారణాధికారి శివరామకృష్ణ సిద్ధపడ్డారని రైతులు మరిపిండి సోమరాజు, ఎ రుఘురామ్, మద్దుకూరి సత్యనారాయణ, బొల్లి సత్యనారాయణ, సానపల్లి సత్యనారాయణ, కొత్తపల్లి దోసాలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండైన సీఈవో తాము చెల్లించిన రుణాలకు ఇదే విదంగా లెటర్ ఇస్తానని విచారణాధికారుల ఎదుట చెప్పాడని, లెటర్ తీసుకుని మా పట్టాదారు పాస్‌బుక్‌లు బ్యాంక్ నుంచి తమకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం తేలే వరకు సొసైటీ తాళం తీయబోమని హెచ్చరించారు. రుణాలు చెల్లించిన రైతులకు న్యాయం చేయకుండా రుణాలు ఓవర్ డ్యూ అయిన వారికి లెటర్ ఆధారంగా సొసైటి చైర్ పర్సన్ పదవి ఇవ్వడం తగదని రైతులు అన్నారు. -
సారా విక్రేతపై పీడీ యాక్టు
సామర్లకోట: సారా విక్రయం చేస్తూ ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు కేసు నమోదు అయిన పండ్రవాడ గ్రామానికి చెందిన గెద్దాడ రాఘవకు పీడీ యాక్టు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశామని కాకినాడ, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.రామమోహనరావు మంగళవారం తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 2023 డిసెంబర్ నుంచి ఆమైపె నాటు సారా విక్రయం కేసులు నమోదు చేశామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమె సారా వ్యాపారం చేస్తున్న కారణంగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాకినాడ జిల్లా కలెక్టర్ రాఘవపై పీడీ యాక్టు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈ మేరకు ఆమెను మంగళవారం రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారానికి అప్పగించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయంలో భాగంగా ఈ పీడీ యాక్టు నమోదు చేశామని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సారా తయారీ, అమ్మకాలకు దూరంగా ఉండాలని సీఐ హెచ్చరించారు. పదిమందికి పదోన్నతులు కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లకు, ముగ్గురు టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఖాళీలు ఏర్పడగానే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతిపై నియామకపు ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహంతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజాసేవలో ముందుంటూ పంచాయతీరాజ్ సంస్థలను ప్రగతి పథంలో నడిపించడంలో భాగస్వామ్యం వహించాలని కోరారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఉపముఖ్య కార్యనిర్వహణాధికారి జీఎస్ రామ్‌గోపాల్, ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ రమేష్ పాల్గొన్నారు. నేడు జిల్లాస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ జట్ల ఎంపిక చాగల్లు: చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8,9 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును బుధవారం పాఠశాల ప్రాంగణంలో ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆధార్‌కార్డుతో హాజరుకావాలని ఆమె పేర్కొన్నారు. -
మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బంగారపు పూత ఉన్న కవచాన్ని సమర్పించారు. ముందుగా ఆలయంలో నంది మండపం వద్ద వేణు సతీమణి వరలక్ష్మి, కుమారుడు నరేన్, కోడలు స్రవంతి, మనుమలు సునిధి, విరాజ్‌తో కలసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బంగారపు చీరను సమర్పించగా, అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని, శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతి తాళ్ల సాంబశివరావు గురూజీ, రామచంద్రపురం జెడ్పీటీసీ సభ్యుడు మేర్నీడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ అంబటి భవాని, వైస్ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి, శాకా బాబీ, సర్పంచ్‌లు యల్లమిల్లి సతీష్‌కుమారి, అనిశెట్టి రామకృష్ణ, పెమ్మిరెడ్డి దొరబాబు, కట్టా గోవిందు, అంబటి తుకారం, ఎంపీటీసీ సభ్యురాలు తుమ్మూరి సుబ్బలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు సందీప్ ఎంపిక
పి.గన్నవరం: రామచంద్రపురంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి కలిగితి సందీప్ బాలుర అండర్–16 లాంగ్ జంప్‌లో ప్రథమ, 60 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానాలు సాధించాడు. దీంతో అతడిని ఈ నెల 9, 10, 11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు హెచ్ఎం కె.ఉమాదేవి తెలిపారు. ఆమెతో పాటు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్, కె.భీమేంద్ర తదితరులు సందీప్‌ను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక మలికిపురం: రామచంద్రపురంలో ఎస్‌కేపీజీఎన్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి వివిధ స్కూళ్లకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. కేశనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు 200 మీటర్ల రన్నింగ్‌లో ఎస్.సత్యసాయికృష్ణ, ప్రథమ, పి.అభిలాష్ తృతీయ, లాంగ్ జంప్‌లో ఎస్.సత్యసాయి కృష్ణ ద్వితీయ, పి.అభిలాష్ తృతీయ స్థానంలో నిలిచారు. సత్యసాయికృష్ణ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అలాగే బట్టేలంక ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.మోహన్, ఎ.గీతిక, జి.భార్గవి, పి.జ్యోతి, కె.ప్రసన్న, కె.శ్రీరామ్ వివిధ క్రీడాంశాల్లో ఎంపికయ్యారు. అంబాజీపేట: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు స్థాని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కె.లక్ష్మీ ప్రసన్న, డి.దోనేశ్వర్ వంద మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. -
ఆయన నిలువెత్తు బంగారం
● విద్యార్థుల ఆకలి తీరుస్తున్న బంగారు చిన్న శోభనాద్రి సత్రం ● రెండు పూటలా విద్యార్థులకు భోజన సదుపాయం ● నిరుపేద వర్గాలకు ప్రాధాన్యం ● ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం ● వందేళ్లు దాటిన దాతృత్వపు చరిత్ర బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అలనాడు బాటసారుల కోసం ఏర్పాటు చేసిన సత్రం నేడు నిరుపేద విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. కాకినాడ పెద్ద మార్కెట్ వద్దనున్న బంగారు చినశోభనాద్రి సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడ వచ్చి ఉంటున్న నిరుపేదల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రుచికరమైన భోజనం ఈ సత్రంలో అందిస్తున్నారు. గతంలో ఈ సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన వారికి ఉచితంగా వసతి కల్పించేవారు. వారి సంఖ్య తగ్గిపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. గతంలో వివిధ హోటళ్ల పాస్‌లను విద్యార్థులకు అందించేవారు. హోటళ్ల భోజనం సక్రమంగా ఉండకపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు 2017 సత్రం ఆవరణలో అన్నదాన భవనం నిర్మించారు. ఇక్కడ సిబ్బందిని నియమించి భోజన వసతి కల్పిస్తున్నారు. కాకినాడ నగరంలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ, వారి మెరిట్, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సమాజ సేవలు ప్రస్తుతం విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు, సత్రం ఆవరణలో ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి శనివారం 120 నుంచి 150 మంది రోగులు ఇక్కడ వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. ప్రతి వేసవిలో ఇక్కడ ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుంచి భోజనం సత్రంలో మంగళవారం నుంచి విద్యార్థులకు భోజన వసతి కల్పించేందుకు సత్రం ఈవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు 90కి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ఏ కళాశాలలో చదువుతున్నారో ధ్రువీకరణ సత్రం, నిరుపేద కుటుంబాలు వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం జత చేసి, సత్రం కార్యాలయంలో దరఖాస్తు అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి భోజన వసతి కల్పిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కళాశాలలు మూసివేసే వరకూ ఉదయం, సాయంత్రం విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అర్హులైన విద్యార్థులందరికీ భోజన వసతి దాత ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాం. నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా 150 మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ఇక్కడ భోజన వసతి కల్పిస్తున్నాం. మంగళవారం నుంచి భోజన సదుపాయం ప్రారంభం కానుంది. విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. – చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి, ఈవో, బంగారు చిన శోభనాద్రి సత్రం 101 ఏళ్ల చరిత్ర ఈ సత్రానికి 101 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సత్రాన్ని 1924లో బంగారు చినశోభనాద్రి నెలకొల్పారు. ఈ సత్రం కోసం ఆయన 65 ఎకరాల వ్యవసాయ భూమి, 2,800 చదరపు గజాల స్థలాన్ని ఈ సత్రానికి దానం చేశారు. అప్పట్లో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన రోగులకు, వ్యాపారుకు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండేవి కావు. దీంతో శోభనాద్రి ఇక్కడ ఈ సత్రం ఏర్పాటు చేసి, వారికి ఆసరాగా నిలిచారు. వ్యవసాయ భూములు, దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సత్రం నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యం కాకినాడలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువగా ఇక్కడ భోజన సదుపాయం కల్పిస్తున్నారు. విద్యార్థుల ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారికి సత్రంలో భోజనం అందిస్తున్నారు. -
ముగిసిన ఆలిండియా చదరంగం పోటీలు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఆలిండియా ఇండిపెండెన్స్ డే కప్ చదరంగం పోటీలు రాజమహేంద్రవరంలో విజయవంతంగా ముగిశాయి. ఈ జాతీయ స్థాయి పోటీలను స్థానిక లారెల్ హై గ్లోబల్ స్కూల్లో క్యాల్ఫ్యూషన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించారు. 309 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి సోమవారం తెలిపారు. విజేతగా రాఘవ శ్రీవాత్సవ్ (హైదరాబాద్), రన్నరప్‌గా జ్ఞానసాయి సంతోష్(కాకినాడ), మూడో స్థానంలో దివ్యతేజ (కాకినాడ) నిలిచారు. ఏడు రౌండ్ల పోటీలను స్విస్ పద్ధతిలో జరిగాయి. రాఘవ శ్రీవాత్సవ్ చాంపియన్‌షిప్ ట్రోఫీతో రూ.25 వేల నగదు, జ్ఞానసాయి సంతోష్ రూ.10 వేలు, దివ్యతేజ రూ.5 వేల నగదు బహుమతులను అందుకున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ చెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.సుమన్,, స్కూల్ ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ కన్వీనర్ పూర్ణచంద్ర శర్మ, విత్తనాలు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విషాదంలో సీతారామ కాలనీ
● పోలీసుల అదుపులో నిందితుడు? ● సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు సామర్లకోట: తల్లి, ఇద్దరు పిల్లల హత్య ఘటనతో పట్టణంలోని సీతారామ కాలనీలో సామవారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కూలీ పనులు చేసుకునే వారితో, పిల్లలు, పెద్దల అరుపులు, కేకలతో సీతారామ కాలనీ నిత్యం సందడిగా ఉంటుంది. ఇదే కాలనీలో నివసిస్తున్న ములపర్తి ధనుప్రసాద్ భార్య మాధురి(30), కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీలోన(6)ను హత్యకు గురైన విషయం విదితమే. తొలుత ధనుప్రసాద్పై అనుమానంతో పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. తన భార్య వద్ద ఉండాల్సిన బంగారు ఉంగరాలు, సెల్ఫోన్లు కనిపించలేదని అతడు పోలీసులకు తెలిపాడు. శనివారం రాత్రి ధనుప్రసాద్ ఏడీబీ రోడ్డు పనుల కాంట్రాక్టర్ వద్ద ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య కేసును వేగంగా ఛేదించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడ్డారు. కాగా ధనుప్రసాద్ సమాచారం మేరకు మాధురి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని ప్రకాశం జిల్లా కనిగిరిలో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్ అనే వ్యక్తి మాధురిని, పిల్లలను హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. మరో వ్యక్తితో కూడా మాధురి వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు తెలుసుకున్న ప్రియుడు సురేష్.. ఆమెతో శనివారం రాత్రి ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ నిద్ర లేచి వచ్చారు. ఘర్షణ సమయంలో మాధురి అందుబాటులో ఉన్న కర్రతో సురేష్‌ను కొట్టినట్టు తెలిసింది. అదే కర్రను అందిపుచ్చుకుని అతడు మాధురితో పాటు, పిల్లల తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు సమాచారం. సురేష్ సొంత లారీపై డ్రైవర్‌గా పని చేస్తూ, తన సంపాదనతో ప్రియురాలికి కోరినవన్నీ కొనిపెడుతుండగా, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇది వద్దని చెప్పినా వినకపోవడంతోనే సురేష్ ఈ హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. భార్యాబిడ్డలు హత్యకు గురి కావడంతో ధనుప్రసాద్ సోమవారం స్పృహతప్పి పడిపోయాడు. అతడిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో సీతారామ కాలనీ విషాదంలో మునిగిపోయింది. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్టు మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. టౌన్ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా, బైక్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడు. పోలీసులు ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఎస్సీ పేట దేవీచౌక్కు చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. గత మే 31న డోర్నకల్‌లో ఓ బైక్, మహబూబాబాద్‌లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారం, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలను అతడు తస్కరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్టు అతడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆటోను ఢీకొన్న కారు
విద్యార్థులు, డ్రైవర్ సహా 11 మందికి గాయాలు తుని రూరల్: తుని మండలం హంసవరం సమీపంలో పాదాలమ్మతల్లి గుడి మలుపులో విద్యార్థులతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు సహా ఆటో డ్రైవర్, మరో ప్రయాణికురాలు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలియడంతో ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కె.కోటేశ్వరరావు, వి.గోపాలకృష్ణ, వరప్రసాద్, రమేష్‌బాబు, ఆశ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం మరువాడకు చెందిన విద్యార్థులు హంసవరంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌కు ఆటోలో వస్తున్నారు. మార్గం మధ్యలో మరో ప్రయాణికురాలిని డ్రైవర్ ఆటో ఎక్కించుకున్నాడు. హంసవరం పాదాలమ్మతల్లి గుడి వద్ద మలుపు తిరుగుతున్న ఆటోను వెనుక కారు ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. కారు సహా డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి మినహా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం విద్యార్థులను వారి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
కువైట్‌లో మగ్గిపోతున్నా.. స్వదేశానికి తీసుకెళ్లండి
కోనసీమ మహిళ వేడుకోలు కొత్తపేట: కుటుంబ పోషణ కోసం విదేశానికి వెళ్తే, అక్కడ నిర్బంధించారని, పాలకులు దయతలచి స్వదేశానికి తీసుకువెళ్లాలని ఓ మహిళ వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన గుమ్మడి ధనలక్ష్మి ఈ వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించి వీడియో, ఆమె అక్క కుమారుడు కొత్తపేట మండలం బిల్లకుర్రు శివారు చిక్కాలవారిపేటకు చెందిన చిక్కాల రాజేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధనలక్ష్మి పుట్టిల్లు బిళ్లకుర్రు శివారు చిక్కాలవారిపేట కాగా, అత్తవారిల్లు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం. సుమారు 16 ఏళ్ల క్రితం గుమ్మడి రాంబాబుతో వివాహమైంది. భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి ఇద్దరు కుమారులు బీటెక్, ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఇలాఉండగా విదేశంలో కొన్నేళ్లు ఉపాధికి వెళితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ధనలక్ష్మి ఆశించింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం కువైట్‌లోని ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. రెండేళ్ల అనంతరం స్వదేశంలో భర్త, పిల్లలను చూసివస్తానని అడిగితే, అక్కడి వారు జాప్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం తాను వెళ్లిపోతానని పట్టుబడితే ధనలక్ష్మిని ఇంట్లో నిర్బంధించారు. తిండి కూడా పెట్టలేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరింది. కాగా ఆమె వాచ్ దొంగిలించి పారిపోయిందని షేక్ కేసు పెట్టడంతో, ప్రస్తుతం అక్కడే మగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ఉద్దేశించి తన దుస్థితిని వీడియో ద్వారా వెళ్లబోసుకుంది. ఆమె భర్త రాంబాబు, కుమారులు, బంధువులు అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథుర్, కలెక్టర్ ఆర్ మహేష్‌కుమార్‌ను కలిశారు. కువైట్‌లో మగ్గిపోతున్న ధనలక్ష్మిని ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్టు రాజేష్ తెలిపారు. -
యూరియా కోసం అగచాట్లు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విత్తు నుంచి విక్రయం వరకూ రైతులకు అన్నింటా భరోసా ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలిచింది. నేడు ఎరువులు, విత్తనాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అమ్ముకుందామంటే కొనేవారు లేక.. సరైన గిట్టుబాటు ధర దక్కక రైతులు పడుతున్న బాధలు చూస్తే కంట నీరు వస్తోంది. రాజానగరం నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో కావచ్చు.. చాలా చోట్ల యూరియా దొరకగా లైనులో నిలుచుని రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. లేకపోతే పోరుబాటు పడతాం. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
పీజీఆర్ఎస్కు 195 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 195 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 77, పంచాయతీరాజ్ 45, పోలీస్ 20, పాఠశాల విద్య 10, ఇతర శాఖలకు చెందినవి 43 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాల ప్రదర్శన ఉండాలని ఆదేశించారు. 18 నుంచి ‘సామవేదం’ ప్రవచనాలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): సరస్వతీ గానసభ ఆధ్వర్యాన ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. ‘సనాతన ధర్మం – శాశ్వత న్యాయం’ అనే అంశంపై స్థానిక సూర్య కళా మందిరంలో ఆయన ప్రవచనం చేస్తారని నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రవచనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
వ్యవసాయాన్ని నిజంగానే దండగ చేశారు
గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగన్నారు. ఇప్పుడు వ్యవసాయాన్ని నిజంగానే దండగగా మార్చేశారు. జగన్మోహన్రెడ్డి హయాంలో వ్యవసాయం పండగలా చేశారు. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి యూరియాకు కొరత ఐదెకరాలు కానీ.. పదెకరాలు కానీ పండించే రైతుకు ఒక బస్తా ఎరువు మాత్రమే ఇస్తామంటున్నారు. దానితో రైతు ఎలా పండించగరు? యూరియా కొరత లేదని అధికారులు, కూటమి నాయకులు చెబుతున్నారు. కానీ, యూరియా కొరత చాలా ఉంది. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే -
ఎరువులు పుష్కలంగా అందించాలి
● రైతులను ఆదుకోవాలి ● లేకుంటే పోరుబాట తప్పదు ● కలెక్టర్‌కు వైఎస్సార్ సీపీ నేతల వినతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కూటమి పాలనలో అన్ని వర్గాల వారూ మోసపోయారని, ముఖ్యంగా రైతన్నలు దగా పడ్డారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. యూరియా కొరత కారణంగా అన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ వద్ద రైతులతో కలసి సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సాగు అవసరాలకు అనుగుణంగా ఎరువులు పుష్కలంగా అందించాలని, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేకుంటే పోరుబాట తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగడి సత్యప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, జిల్లా కోశాధికారి వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా అధికారి ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఆచంట కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. దగా పడిన రైతన్నలు మనది వ్యవసాయాధారిత రాష్ట్రం. జిల్లాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు. విత్తు నుంచి ఉత్పత్తి విక్రయం వరకూ ఒక క్రమ పద్ధతిలో విధానాలు తీసుకుని వచ్చిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. నేడు రైతులను, వ్యవసాయాన్ని చంద్రబాబు విధ్వంసం చేశారు. రైతులు యూరియా, ఇన్పుట్ సబ్సిడీ వంటి వాటి గురించి అడగాల్సిన అగత్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర ఎత్తేశారు. రైతులు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. రైతులను అన్నివిధాలా దెబ్బ తీస్తున్న కూటమి సర్కారు.. వారి ఉసురు పోసుకుంటోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీడు భూమిని కూడా సాగు భూమిగా చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం సాగు భూమిని బీడు భూమిగా మార్చేసింది. అబ్బిరెడ్డి పుల్లయ్య అనే రైతు ఎరువులు అడగడానికి వెళ్తే మూడు బస్తాలు ఇస్తారన్నారు. అవి సరిపోవని రైతు అడిగితే అధికారులు కొట్టినంత పని చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకుని వెళ్లాం. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి -
పదవుల కోసం సిగపట్లు
సాక్షి, రాజమహేంద్రవరం: నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు చల్లారడం లేదు. ఇప్పటి వరకూ ఇసుక, మద్యం ఆదాయంలో వాటాల కోసం ముష్టియుద్ధాలకు దిగిన నేతలు.. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల కోసం సిగపట్లు పడుతున్నారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ నేతలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూండటం, జనసేన నేతలను పక్కన పెడుతూండటంతో విభేదాల అగ్గి మరింతగా రాజుకుంటోంది. పార్టీని నమ్ముకున్న నేతలను కాదని టీడీపీ నేతలకు కట్టబెట్టడంపై జనసేన కేడర్‌లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. జనసేన నేతలకు టీడీపీ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూండటం పరిపాటిగా మారుతోంది. నామినేటెడ్ రగడ నిడదవోలులో నామినేటెడ్ పోస్టుల భర్తీ జనసేన, టీడీపీ నేతల్లో విభేదాల మంట పుట్టిస్తోంది. నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టేందుకు పావులు కదుపుతూండటంపై జనసేన నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ● నిడదవోలు నియోజకవర్గంలో పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జుల విషయంలో జనసేన, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గ్రామ స్థాయి నేతలు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. నిడదవోలు నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి ధర్మం ప్రకారం జనసేనకి 70 శాతం, టీడీపీకి 30 శాతం పదవులివ్వాలి. దానికి అనుగుణంగా భర్తీ చేయాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, నియోజకవర్గంలో తమకే మెజార్టీ ఉందని, 50 శాతం పైగా పదవులు తమకే కావాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావుపై ఆ పార్టీ నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. పదవుల పంపకాల్లో సయోధ్య కుదరకపోవడంతో పీఏసీఎస్‌ల పదవుల భర్తీ స్తంభించిపోయింది. ప్రత్యేక అధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో, పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి చుక్కెదురైంది. ● నిడదవోలు మండలంలోని 12 సొసైటీ అధ్యక్ష పదవుల్లో 6 టీడీపీకి, 6 జనసేనకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఇరు పార్టీల నేతలూ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ‘సైకిల్’ దిగిపోయారు ● నిడదవోలు మండలం సింగవరంలో సొసైటీ పర్సన్ ఇన్చార్జ్ పదవిని జనసేనకు ఇస్తున్నారనే సమాచారం ముగ్గురు టీడీపీ నేతల్లో ఆగ్రహావేశాలు నింపింది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. పదవులు మాత్రం వారికిస్తారా అంటూ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు పెన్మెత్స సత్యనారాయణ రాజు, సింగవరం నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పెన్మెత్స ప్రవీణ్‌వర్మ, ఆ సంఘం మాజీ అధ్యక్షుడు పెన్మెత్స ఆంజనేయరాజులు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ● కాటకోటేశ్వరం సొసైటీ పర్సన్ ఇన్చార్జ్ పదవి జనసేనకు ఇస్తున్నారన్న సమాచారంతో గ్రామ టీడీపీ కార్యదర్శి ఈరిశెట్టి రాజగోపాలస్వామి, క్లస్టర్ ఇన్చార్జ్ తిరుమలశెట్టి బాబీ రాజీనామా చేశారు. ● నిడదవోలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించి భంగపడిన టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ అధికార ప్రతినిధి, సమిశ్రగూడెం గ్రామానికి చెందిన బుగ్గే శివరామకృష్ణశాస్త్రి కూడా టీడీపీకి టాటా చెప్పేశారు. తారస్థాయిలో విభేదాలు నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఇప్పటికే విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇటీవల గోపవరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మంత్రి కందుల దుర్గేష్‌ను ఆహ్వానించలేదు. మాజీ ఎమ్మెల్యే శేషారావును మాత్రమే పిలిచారు. ఫ్లెక్సీల్లో సైతం దుర్గేష్ ఫొటో పెట్టలేదు. దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత చర్చ జరిగింది. మంత్రిని పిలవాలంటూ జనసేన నేతలు ప్రసార మాధ్యమాల్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పదవుల పందేరం సైతం చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు అనుకూలమైన పవనాలు వీస్తాయని, తమ పార్టీకి చెందిన పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అవుతారంటూ టీడీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. అప్పటి వరకూ పదవులపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదనే ఆలోచనలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలిసింది. నిడదవోలులో గ్లాస్, సైకిల్ మధ్య విభేదాలు ఇరు వర్గాలుగా విడిపోయిన నేతలు కూటమిలో ప్రాధాన్యం లేదంటూ జనసేన నేతల గుర్రు నామినేటెడ్ పదవులన్నీ టీడీపీకే కట్టబెడుతున్నారని ఆగ్రహం నిరసనగా పీఏసీఎస్ పదవుల భర్తీని అడ్డుకున్న టీడీపీ నేతలు అన్ని నియోజకవర్గాల్లోనూ పాలకవర్గాల నియామకం ఇక్కడ మాత్రమే పెండింగ్ పడని ‘తొలి అడుగు’ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైన సందర్భంగా టీడీపీ అధిష్టానం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ పేరిట ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రజల అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిడదవోలు నియోజకవర్గంలో మాత్రం ఈ కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జి తూతూమంత్రంగా నాలుగిళ్లు తిరగడంతోనే సరిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. వెరసి ఈ కార్యక్రమం నిర్వహణలో నిడదవోలు జిల్లాలోనే చివరి స్థానంలో ఉన్నట్లు తెలిసింది. -
బడి పంతుళ్లకు పస్తుల పాఠం
● పొజిషన్ ఐడీ రాక.. రెండు నెలలుగా మంజూరు కాని వేతనం ● బదిలీ అయిన ఉపాధ్యాయులకు నేటికీ ఐడీల కేటాయింపు లేదు ● జీతాలకు ఎదురు చూస్తున్న టీచర్లు ● ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఒత్తిడిలో 1,500 మంది ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు. ఇప్పుడు కూటమి పాలనలో ఆ మాట నిజమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన బడి పంతుళ్లు కాలే కడుపుతో అలమటిస్తున్నారుు. పదోన్నతులు వచ్చాయని ఆనందపడాలో.. నెల జీతం చేతికందడం లేదని బాధ పడాలో తెలియని అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకటో తేదీ వస్తే కుటుంబ పోషణ, ఖర్చులు, అప్పులంటూ నెత్తిన గంపెడు కష్టాలు మోస్తూ కాలం వెళ్లదీస్తున్న వీరు.. సంపాదన ఆకస్మికంగా నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. చిన్న సాంకేతిక లోపాన్ని కూడా భూతద్దంతో చూపుతూ.. సర్కారు వీరిని కష్టాల కడలిలోకి నెట్టేసింది. రాయవరం: జీతాలు రాగానే వేతన జీవులు ప్రతి నెలా ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, పాలు, కిరాణా తదితర ఖర్చులు చెల్లించాల్సి ఉండడం సర్వసాధారణం. ఏదైనా కారణంతో ఓ నెల ఆదాయం రాకుంటే ఎంత కష్టంగా ఉంటుందో వేతన జీవులకే ఎరుక. అటువంటిది రెండు నెలలుగా వేతనాలు రాకుంటే వారి పరిస్థితి ఏమిటో అవగతమవుతుంది. గత వేసవిలో బదిలీలు పొందిన పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించడంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనతో అనేక మంది ఉపాధ్యాయుల నెల జీతానికి బ్రేక్ పడింది. గత నెల వేతనాలు రాకపోగా, ఈ నెల కూడా అడియాశే ఎదురైంది. సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉపాధ్యాయ సంఘాల్లో వ్యక్తమవుతోంది. పొజిషన్ ఐడీలు కేటాయించి, తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేసిన విషయం పాఠకులకు విదితమే. 1,500 మందికి పైగా.. ఈ ఏడాది మే 21న ప్రారంభించిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జూన్ 15తో ముగిసింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పొందిన వారిలో పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. వాటిని సకాలంలో కేటాయించకపోవడంతో జూన్, జూలై వేతనాలను వారు నేటికీ పొందలేకపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి పైగా ఉపాధ్యాయులు ఇలా జీతభత్యాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. పొజిషన్ ఐడీ అంటే.. సాధారణంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సంబంధిత ఉపాధ్యాయుడి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. బదిలీ కాక పూర్వం వరకు వారు రెగ్యులర్‌గా జీతభత్యాలు పొందుతున్నప్పటికీ, ప్రస్తుతం బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అప్పుడే సంబంధిత ఉద్యోగి/ఉపాధ్యాయుడి వివరాలు సీఎఫ్ఎంఎస్లో డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే డీడీఓలో బిల్లు సమర్పించడానికి వీలవుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు నూతనంగా ఏర్పడడంతో, ఇక్కడ కొత్తగా కేటాయించిన పోస్టులకు పొజిషన్ ఐడీలు కేటాయించాలి. అప్పుడు ఆ స్థానాల్లో బదిలీపై వచ్చిన వారి జీతభత్యాలకు అవకాశం ఉంటుంది. బదిలీలు, పదోన్నతులు పూర్తయి రెండు నెలలు కావస్తున్నా.. నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలై, ఆగస్టులో తీసుకోవాల్సిన జూన్, జూలై నెలల వేతనాలు వారికి మంజూరు కాలేదు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీలోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. గత నెల 25వ తేదీలోపు పొజిషన్ ఐడీలు రానందున రెండు నెలల వేతనాలను వీరు పొందలేకపోయారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో.. వేతనాలతో పాటు, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో పలు ఉపాధ్యా య సంఘాలు శనివారం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాయి. పలుమార్లు వినతిపత్రాలిచ్చినా పరిస్థితి లో మార్పు లేదని ఆయా సంఘాల నేతలు మండిప డ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పొజిషన్ ఐడీలకు చ ర్యలు తీసుకుని, రెండు నెలల వేతనాలను జూలై ఆరు న సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ చేసేలా జీవో జారీ చేసింది. ఈ జీవో ఎంతవరకు అమలవుతుంది, పొజిషన్ ఐడీలు సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ గడువు ముగిసే లోపు కేటాయిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్/ఒకేషనల్ ఉపా ధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. ప్రభుత్వ కక్షపూరిత ధోరణి ఆన్లైన్ సమాచారం కావాల్సినప్పుడు ప్రభుత్వం ఆగమేఘాలపై సెకండ్ల వ్యవధిలో సమాచారం సేకరిస్తుంది. ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించి సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి రెండు నెలలు సాగదీశారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణి వీడి వెంటనే ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించి, వేతనాలను తక్షణమే చెల్లించాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండు నెలలుగా ఇబ్బందులు నెల వేతనం రాకుంటేనే వేతన జీవులు ఇబ్బందులు పడే పరిస్థితి. నిత్యావసర వస్తువులు, ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీని అధికంగా వినియోగిస్తూ, క్షణాల్లో డేటా సేకరిస్తున్న ప్రభుత్వం.. పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. సప్లిమెంటరీ బిల్లులు ఈ నెల 15లోపు చేసుకునేలా చర్యలు చేపట్టాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రణాళిక లోపం కన్పిస్తోంది బదిలీలు, పదోన్నతుల సమయంలోనే పొజిషన్ ఐడీలు కేటాయించే చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రభుత్వ ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు నెలలుగా వేతనాలు రాక, బ్యాంకుల్లో ఈఎంఐలు చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వైద్య ఖర్చులకూ ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – దీపాటి సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కడియం: అండర్–14 డబుల్స్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు దాసరి నాగ వెంకట అర్జున్ (కడియం), ఎం.ప్రణీత్ (రాజమహేంద్రవరం) ఎంపికయ్యారు. కోచ్ నాగులకొండ వీరభద్రం సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ ఐసీఎస్ఈ ఆంధ్రా – తెలంగాణ రీజినల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో అర్జున్, ప్రణీత్ మొదటి స్థానంలో నిలిచారు. తమిళనాడులో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారు. అర్జున్‌కు అతడి తాతయ్య, నానమ్మ నాగభూషణం, సత్యకుమారి.. ప్రణీత్‌కు అతడి తల్లిదండ్రులు ఎం.దీప, చలపతి అభినందనలు తెలిపారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 35 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్(పీజీఆర్ఎస్)కు 35 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదీల నుంచి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, చీటింగ్, కొట్లాట, దొంగతనం కేసులతో పాటు కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. ‘నన్నయ’లో ఈడీసీ ఏర్పాటు చేస్తాం రాజానగరం: విద్యార్థులకు వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ – విద్యా సంబంధాలను పెంపొందించడంలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్ (ఈడీసీ) ఏర్పాటు చేస్తామని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఇండస్ట్రియల్ కన్సల్టెంట్ నందగోపాల్ సోమవారం వీసీతో సమావేశమై, వర్సిటీ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, యూనివర్సిటీకి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ నుంచి ఉపయోగకరమైన కొన్ని ప్రాజెక్టులు వచ్చాయని తెలిపారు. ఎంఎస్ఎంఈ ఏర్పాటు ద్వారా గోదావరి ప్రాంతంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో స్థానికులకు సాధికారత కల్పించడం ద్వారా గ్రామీణ వ్యాపార ఇంక్యుబేషన్ ఏర్పాటు అవసరంపై కూడా చర్చించారు. వర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని నందగోపాల్ తెలిపారు. సమావేశంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అధికారి బి.జగన్మోహన్రెడ్డి, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ఆచార్య ఉమామహేశ్వరిదేవి పాల్గొన్నారు. -
అన్ని దారులూ వాడపల్లికే..
● భక్తులతో కిక్కిరిసిన వెంకన్న క్షేత్రం ● ఒక్క రోజే రూ.6.70 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా ఆ జనంలో ప్రదక్షిణలు చేయలేని భక్తులు ఇతర వారాల్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకుని ఏడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలి రావడంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, మిగిలిన ఆరు రోజులూ అత్యధికంగా వస్తున్నారు. దానితో ఈ క్షేత్రం శనివారాలే కాకుండా వారంలో మిగిలిన రోజుల్లో కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంలా మారుతోంది. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు ఆదివారం అష్టోత్తర పూజ, స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్క రోజే దేవస్థానానికి రూ.6,70,313 ఆదాయం వచ్చిందని చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో విశాఖపట్నం కళారాధన నృత్య కళాశాలకు చెందిన కళాకారిణులతో కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. నేటి నుంచి పవిత్రోత్సవాలు వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. సోమవారం ఉదయం రుత్విక్కులు దీక్షాధారణ, అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ప్రతిష్ఠ పూజలు చేయనున్నారు. ఐదో తేదీ ఉదయం అష్ట కలశ స్థాపన, మహాశాంతి హోమం, ఆరో తేదీ ఉదయం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి నిర్వహిస్తారని ఈఓ వివరించారు. -
ఇదేం ప్రవేషాలు
● డిగ్రీ అడ్మిషన్లపై గందరగోళం ● ఇప్పటికీ విడుదల కాని ప్రభుత్వ నోటిఫికేషన్ ● ఆందోళన చెందుతున్న విద్యార్థులు రాయవరం: విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోంది.. సరైన ప్రణాళిక లేకుండా సాగుతున్న వైనం విద్యార్థులను ఇబ్బంది పాల్జేస్తోంది.. దీనికి ఉదాహరణే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ. ఈ కళాశాలల్లో చేరికలకు ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం విద్యా వ్యవస్థను అయోమయంలో పడేస్తోంది. ఇంటర్ ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలలు దాటినా నేటికీ డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా జూలై మాసానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై తరగతులు సైతం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంత వరకూ ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో వేలాది మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 2024–25 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 12,825 మందికిగాను 9,246 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరితో పాటు పలువురు సప్లిమెంటరీ రాసి పాసైన వారున్నారు. వీరంతా డిగ్రీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 53 కళాశాలలు జిల్లాలోని మొత్తం 53 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలు డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఆయా కళాశాలలు బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీబీఏ వంటి కోర్సులను వివిధ కాంబినేషన్లతో డిగ్రీ విద్యను అందిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో సుమారు 10 వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్యపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది కూడా అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యంగా చేపట్టడంతో చాలా కళాశాలల్లో 30 శాతం సీట్లు మిగిలిపోయాయి. వీడని సందిగ్ధత డిగ్రీ కోర్సులకు సంబంధించి సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే సింగిల్, డబుల్ మేజర్ సబ్జెక్టుతో నూతన డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. అయితే వీటిపై వస్తున్న సందిగ్ధతతో విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాలల యాజమాన్యాలు గందరగోళానికి గురవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిపై ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు కూడా ఆందోళనలో ఉన్నారు.తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇంటర్ ఫలితాలు విడుదలై మాసాలు గడుస్తున్నా ప్రవేశాలు చేపట్టకపోవడంపై గందరగోళం నెలకొంది. డిగ్రీ కళాశాలలు పునః ప్రారంభమై నెలన్నర దాటింది. ఇంకా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాకపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తక్షణమే డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలి. – బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి డిగ్రీ అడ్మిషన్లపై నేటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణం. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గతేడాది ఆలస్యంగా నోటిఫికేషన్ ఇచ్చారనుకుంటే, ఈ ఏడాది మరింత జాప్యం చేశారు. డిగ్రీ అడ్మిషన్లపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. ఇతర రాష్ట్రాల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్రంలో ప్రవేశాలు చేపట్టకపోవడం సరికాదు. – మిందిగుదిటి శిరీష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, అమలాపురం -
‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’
రాజమహేంద్రవరం సిటీ: ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 5న ‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా గిరిప్రసాద్‌వర్మ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలకు మూలాలను గుర్తించి, వాటి పరిష్కార మార్గాలను వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని అన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల సమస్యలపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామ సూర్యనారాయణ రూపొందించిన వీడియో, ఆడియో సందేశాలను ఉద్యోగులకు ప్రదర్శిస్తామన్నారు. ఆ సందేశాలపై ఉద్యోగులు టీ తాగుతూ చర్చించుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరు, అనపర్తి, కోరుకొండ, రాజమహేంద్రవరం రూరల్, ధవళేశ్వరం, గోపాలపురాల్లో ఈ నెల 5న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ఎస్ విల్సన్‌పాల్, సహాధ్యక్షుడు డీఎస్ చంబర్లీన్ తదితరులు పాల్గొన్నారు. కూటమివి కుట్రపూరిత రాజకీయాలు రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలతో వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో పాలనపై దృష్టి సారించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా ఆ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి మత్తులో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులపై వివక్ష చూపుతున్నారన్నారు. క్రైస్తవ సీ్త్రలని కూడా చూడకుండా ఇద్దరు నన్స్ను ఆధారం లేని కారణాలతో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. క్రైస్తవులకు మేలు చేసే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ సమన్వయకర్తల సహకారంతో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని విజయ సారథి వెల్లడించారు. రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం ఆదర్శనీయం కాకినాడ సిటీ: అష్టావధానులకు మార్గదర్శిగా, సాహితీ స్రష్టగా, సంస్కృత భాషాసాహిత్యాలకు విశేష సేవలందించిన రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నా రు. బాణుడు రచించిన కాదంబరి కావ్యంపై ఆయన సాహితీ ప్రసంగం చేశారు. రాణి సుబ్బ య్య దీక్షిత, సాహితీ కౌముది ఆధ్వర్యాన సూర్య కళా మందిరం ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. కాదంబరి కావ్యంలోని అనేక పాత్రల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. కావ్యంలో పరిపాలన చేసే రాజు, నాయికా నాయకులను వర్ణిస్తూ నేటి యువతకు ఆదర్శనీయంగా ఉండేలా ఆయన ప్రసంగం సాగింది. -
నిలకడగా పొగాకు ధర
● కిలోకు గరిష్టంగా రూ.370 ● 41.88 మిలియన్ కిలోల విక్రయాలు దేవరపల్లి: మార్కెట్లో వర్జీనియా పొగాకు ధర వారం రోజులుగా నిలకడగా కొనసాగుతోంది. గత నెల 26 వరకూ కిలో గరిష్ట ధర రూ.390 ఉండగా, 27వ తేదీ నుంచి రూ.370కి తగ్గింది. వారం రోజులుగా అదే స్థాయిలో కొనసాగుతుంది. గరిష్ట ధర తగ్గినప్పటికీ సగటు ధర రూ.291.98 లభించడంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి సుమారు రూ.1,231 కోట్ల విలువైన 41.88 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలోకు గరిష్టంగా రూ.370, కనిష్టంగా రూ.200, సగటున రూ.291.98 చొప్పున ధర లభించినట్టు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకూ 107 రోజులు వేలం నిర్వహించగా, 3,26,887 బేళ్ల విక్రయాలు జరిగాయి. ఐదు వేలం కేంద్రాలకూ ప్రతి రోజూ సుమారు 6 వేల బేళ్లు అమ్మకానికి వస్తున్నాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 7.10 మిలియన్ కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 9.31, జంగారెడ్డిగూడెం–2లో 8.91, కొయ్యలగూడెంలో 8.45, గోపాలపురంలో 8.10 మిలియన్ కిలోల చొప్పున పొగాకు విక్రయాలు జరిగాయని ప్రసాద్ వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో అత్యధికంగా కిలో సగటు ధర రూ.305 లభించింది. 2024–25 పంట కాలంలో సుమారు 80 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి జరిగిందన్నది అధికారుల అంచనా కాగా, ఇప్పటి వరకూ 50 శాతం పొగాకు కొనుగోళ్లు జరిగినట్లు ప్రసాద్ తెలిపారు.దేవరపల్లి వేలం కేంద్రానికి అమ్మకానికి వచ్చిన బేళ్లు -
అద్భుతం.. అభినయ విన్యాసం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నర్తన రుషి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ శిష్యులచే నవజనార్దన పారిజాతం ఆలయ నృత్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది. శ్రీ సద్గురు సన్నిధి నిర్వహణలో శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. తొలుత జి.రిషిక, శాన్విక, రూపాశ్రీలు వినాయక కౌతం, అన్నమయ్య కీర్తనలకు చూడముచ్చటగా నర్తించారు. ముగ్గురూ తొలి ప్రదర్శనలోనే ప్రేక్షకులను అలరించేలా నర్తించారు. గోదావరి తీరాన వెలసిన నవ జనార్దన స్వామి ఆలయంలో ప్రాచీన కాలంలో ఊపిరి పోసుకుని, ప్రపంచంలోనే అతి పెద్ద నాట్య ప్రక్రియగా ప్రసిద్ధి పొందిన నవజనార్దన పారిజాతం, భామాకలాపాన్ని అంకిత ఐశ్వర్య, ఆరుషి దుర్గాంబిక, భానుదుర్గ, నవ్యశ్రీ, నయనికలు చక్కగా ప్రదర్శించారు. ఈ ఐదుగురూ సత్యభామలనే తలపించారు. సత్యభామలోని ధీరత్వాన్ని, గర్వాన్ని, దుఃఖాన్ని ఇలా నవరసాలను అద్భుతంగా అభినయిస్తూ ఉత్తేజంగా నర్తించారు. సప్పా దుర్గాప్రసాద్ నవజనార్దన పారిజాత భామాకలాపంలో తన పాండిత్యాన్ని చూపించారు. ఈ అద్భుత అభినయాన్ని ప్రేక్షకులు తన్మయంతో తిలకించి కరతాళధ్వనులతో అభినందించారు. నర్తకిలను సద్గురు సన్నిధి వ్యవస్థాపకుడు శిష్టు మధుసూదనరావు తదితర ప్రముఖులు సత్కరించారు. సప్పా దుర్గా ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.నృత్యం చేస్తున్న నర్తకీమణులు -
గురువుల మధ్య.. కూటమి కుంపటి
ఉమ్మడి సర్వీస్ రూల్స్ పాటించాలి ఉపాధ్యాయులందరూ డీఎస్సీ ద్వారానే నియమితులవుతారు. అలాంటప్పుడు ఉమ్మడి సర్వీస్ రూల్స్ పాటించాలి. అలా కాదని జెడ్పీ టీచర్లపై వివక్ష చూపడం తగదు. సర్వీస్ రూల్స్ కారణంగా రెండు దశాబ్దాలుగా జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు వివక్షకు గురవుతున్నారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్లు కూడా ఎంఈఓలు అవుతారు. సీనియర్ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు పదోన్నతులు కోల్పోతారు. ఇది చాలా అన్యాయం. – కోలా సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం, రాష్ట్ర సహాధ్యక్షుడు సీనియారిటీ ప్రాతిపదికన భర్తీ చేయాలి ఉమ్మడి సీనియార్టీ ప్రాతిపదికన మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల వివరాలు మాత్రమే సేకరించడం తగదు. ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన జీఓ అమలు చేయాల్సి ఉన్నా.. పక్కన పెట్టడం తగదు. – కేవీ రమణారావు, ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం, జిల్లా అధ్యక్షుడు ● జెడ్పీ, ప్రభుత్వ టీచర్ల మధ్య గొడవలు పెడుతున్న సర్కారు ● ఎంఈఓ పోస్టుల భర్తీలో ప్రభుత్వ స్కూళ్ల హెచ్‌ఎంలకే ప్రాధాన్యం ● జెడ్పీ హెచ్ఎంలకు మొండిచేయి ● ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల మధ్య విభజన కుంపటి పెట్టింది. ఎంఈఓ పోస్టుల భర్తీని అడ్డం పెట్టుకుని గురువుల మధ్య తగాదాలు పెడుతోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్య స్కూళ్లలోని ప్రధానోపాధ్యాయులను పక్కన పెట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న అతి తక్కువ స్కూళ్లలో పని చేస్తున్న హెచ్ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓ–1గా నియమిస్తోంది. ఇందుకు సమ్మతి తెలపాలంటూ ప్రభుత్వ స్కూళ్ల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు పాఠశాల విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఉపాధ్యాయులకు ఆగ్రహం కలిగిస్తోంది. ప్రస్తుతం మండల విద్యా శాఖాధికారి–1(ఎంఈఓ–1)గా ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంలు పని చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే అవకాశం కల్పించడం దుర్మార్గమని మండిపడుతున్నారు. దీనిక వెనుక విభజించి.. పాలించు అనే విధానం దాగుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువుల మధ్య గొడవలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ విధానం అవలంబిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. పదోన్నతులు వారికేనా.. మాకివ్వరా? జిల్లావ్యాప్తంగా 203 జెడ్పీ, మున్సిపల్ హైస్కూళ్లలో 2,502 ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 11 ప్రభుత్వ పాఠశాలలుండగా.. వాటిలో కేవలం 173 మంది ఉపాధ్యాయులే ఉన్నారు. జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఉన్నా.. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 173 మంది టీచర్లకు మాత్రమే పదోన్నతులు దక్కేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై స్థానిక సంస్థల పాఠశాలల్లో పని చేస్తున్న పంచాయతీరాజ్ (పీఆర్) ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పదోన్నతులు తమకెందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. సీనియర్లను విస్మరించి.. మరోవైపు సీనియర్ ఉపాధ్యాయులను ప్రభుత్వం విస్మరిస్తోంది. వారిని ఎంఈఓ–2గా నియమించి సర్వీసులో జూనియర్లయిన ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈఓ–1గా ప్రాధాన్య పోస్టులు ఇవ్వడమేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తద్వారా మెజారిటీ పీఆర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. 90 శాతం ఉన్న పీఆర్ ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి అదే పోస్టులో ఉండిపోతున్నారు. దీనిపై వారు పోరాటాలు చేపట్టి, ప్రభుత్వం నుంచి సానుకూల ఉత్తర్వులు కూడా పొందారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించి ఈ ఉత్తర్వులకు బ్రేక్ వేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వవద్దని కోర్టు గత ఏడాది ఉత్తర్వులు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై స్టేటస్ కో అమలులో ఉంది. ప్రభుత్వ, పీఆర్ ఉపాధ్యాయులిద్దరికీ ప్రస్తుతానికి ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వరాదంటూ ఉత్తర్వులున్నాయి. కానీ, ప్రస్తుతం ఎంఈఓ, ఉప విద్యా శాఖాధికారి (డీవైఈఓ) పోస్టులను ప్రభుత్వ ఉపాధ్యాయులకే కట్టబెడుతున్నారు. కోర్టు తీర్పు ప్రకారం స్టేటస్కో అమలు చేయాలి. 90 శాతంగా ఉన్న పీఆర్ ఉపాధ్యాయులను కూడా ఎంఈఓ–1, డీవైఈఓ వంటి ఉన్నత పోస్టుల్లో నియమించాలి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులందరూ జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా నియమితులైన వారే. సీనియారిటీ ప్రకారం ఎంఈఓ పోస్టులకు హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు అర్హులు. అయినప్పటికీ ప్రభుత్వం కామన్ రూల్స్ పాటించకుండా, కేవలం ప్రభుత్వ పాఠశాలల వారికే అవకాశం ఇవ్వడం ద్వారా తమపై వివక్ష చూపుతోందని ఇతర యాజమాన్య ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో అందరికీ అవకాశం సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎం/ఎంఈఓ పోస్టు ఫీడర్ కేడర్ పోస్టుగా ఉంది. అయితే, వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ లేవు. దీని వల్ల ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులకే ఎంఈఓ పోస్టులు ఇస్తున్నారు. వీటిని తమకూ ఇవ్వాలని జెడ్పీ టీచర్లు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంఈఓ–2 పోస్టులను సృష్టించి జెడ్పీ హెచ్ఎంలను నియమించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంఈఓ–2 పోస్టులను రద్దు చేసేందుకు యత్నిస్తోంది. ఖాళీలను భర్తీ చేయడం లేదు. మరోవైపు ఎంఈఓ–1 పోస్టులను కేవలం ప్రభుత్వ యాజమాన్య హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఇస్తోంది. గత ఏడాది చాలా మంది ఎంఈఓ–1లు రిటైరయ్యారు. ఆ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం పక్క మండలాల వారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తోంది. ప్రభుత్వ చర్యలను అధిక సంఖ్యలో ఉన్న జెడ్పీ టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.చెప్తే వినరేం..! మీకు ఎంఈఓ–1 పోస్టు ఇవ్వడం కుదరదయ్యా! -
మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు దారుణం
రాజమహేంద్రవరం సిటీ: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దారుణమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఆదివారం రాజమహేంద్రవరంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను వారు కలసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల తరఫున వైఎస్సార్ ీసీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరిపే వరకూ పోరాటం ఆగదన్నారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. మిథున్‌రెడ్డి నిర్ధోషిగా త్వరలోనే బయటకు వస్తారన్నారు. వీరి వెంట రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాయవరం సత్తిబాబు ఉన్నారు.పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను కలసిన సుభాష్ చంద్రబోస్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
దారికి రాని దోపిడీ కేసు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చెందుర్తిలో కలకలం రేపిన దారి దోపిడీ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. రాజమహేంద్రవరం నల్లమందు సందుకు చెందిన సమీర్ ప్రజాపత్ భవాని సిల్వర్ ప్యాలెస్ అనే వెండి బంగారు నగల వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. రోజూ ఇతర ప్రాంతాల్లో ఉన్న వెండి, బంగారు వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్తువులు తయారు చేసి తీసుకెళ్లి ఇవ్వడం, తిరిగి వారి నుంచి ఆర్డర్లు తీసుకుని వారు ఇచ్చే నగదుతో పాటు వెండి, బంగారాన్ని తీసుకు వెళుతుంటాడు. గత నెల 28న మధ్యాహ్నం 12 గంటలకు యథావిధిగా అతని యజమాని చెప్పిన ఆర్డర్ల ప్రకారం వెండి వస్తువులను తీసుకుని, వాటిని డెలివరీ కోసం రాజమహేంద్రవరం నుంచి పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులో వస్తువులు ఇచ్చి సంబంధిత షాపుల నుంచి ముడి వెండిని, వెండి వస్తువులను, బంగారాన్ని తీసుకుని, గొల్లప్రోలులో పని ముగించుకుని చెందుర్తిలోని మరో బంగారు షాపు వద్దకు బయలు దేరాడు. మార్గ మధ్యంలో జాతీయ రహదారి 216 నుంచి చెందుర్తి గ్రామం వెళ్లే రోడ్డులో పామాయిల్ తోట వద్దకు వెళ్లేసరికి రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు వచ్చి భవానిని అటకాయించి, అతని వద్ద ఉన్న 12.50 కిలోల వెండి, 51 గ్రాముల బంగారం, రూ.60 వేలను బలవంతంగా లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విషయం తెలపడంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణలు తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా రెక్కీ చేసి.. ప్రతి నెలా ఏదొక సమయంలో భవాని ఇక్కడకు వస్తుంటాడన్న విషయం తెలుసుకున్న అగంతకులు అసలు బాధితుడు ఎప్పుడు వస్తున్నాడు.. ఎలా వెళుతున్నాడనే విషయాలపై రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో ఇటువంటి దోపిడీలకు పాల్పడే కేసుల్లో ఉన్న నిందితుల వివరాలు సేకరించి వారి ద్వారా కేసును ఛేదించే పనిలో ఉన్నట్లు సమాచారం. నిందితుల వివరాలు, వారు ఉపయోగించిన మోటారు సైకిళ్ల ఆనవాళ్లు, వారు ఎటు వెళ్లారనే విషయాలు గాని తెలిక పోలీసులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది. వ్యాపారిని కొట్టి సొత్తు దోచుకున్న అగంతకులు పోలీసులకు సవాల్‌గా మారిన కేసు ఆధారాల కోసం ముమ్మర దర్యాప్తు కానరాని ఆచూకీ.. రెండు మోటారు సైకిళ్లపై నలుగురు వ్యక్తులు వచ్చి తనను అటకాయించి దాడి చేసి, తన వద్ద ఉన్న వెండి బంగారు వస్తువులతో పాటు నగదును లాక్కెళ్లినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో నలుగురు అగంతకులు చెందుర్తి రోడ్డుకు ఏపక్క నుంచి వచ్చారు.. ఏ మోటారు సైకిళ్లు ఉపయోగించారనే దానిపై పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే సంఘటన జరిగిన సమయం రాత్రి కావడంతో సీసీ కెమెరాల్లో అటువంటి ఆనవాళ్లు ఉన్న వ్యక్తులు ఎవరూ కనిపించకపోవడంతో ఇతర ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. చెందుర్తి రోడ్డుకు గొల్లప్రోలు– కత్తిపూడి 216 జాతీయ రహదారి నుంచి దారి ఉండగా అటువైపు 16వ జాతీయ రహదారి ఉంది. అగంతకులు ఎటు నుంచి వచ్చారో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అసలు వారు ఏ మోటారు సైకిళ్లు ఉపయోగించారనే విషయం బాధితుడు చెప్పలేక పోతుండగా సీసీ కెమెరాల్లో దొరకకపోవడంతో పోలీసులు ఆధారాల కోసం తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ రోడ్డుకు రావడానికి తాటిపర్తి వన్నెపూడి రోడ్డు నుంచి కూడా మరో మార్గం ఉండడంతో అగంతకులు ఎవరికీ అనుమానం రాకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ఆ రోడ్డు ద్వారా వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోపిడీ రాత్రి సమయంలో జరగడంతో అగంతకుల పోలికలను కూడా బాధితుడు చెప్పలేకపోవడం కేసు దర్యాప్తునకు ఆటంకంగా మారిందంటున్నారు. -
ఫ్రెండ్షిప్ డే రోజున విషాదం
తాళ్లరేవు: స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు మరో స్నేహితుడితో కలసి బైక్‌పై వెళుతున్న యువకుడు ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలైన ఘటన ఆదివారం కోరంగిలో చోటు చేసుకుంది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. స్నేహితుల దినోత్సవం సందర్భంగా చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కొప్పాడి తాతాజీవర్మ (19) అలియాస్ తాతీలు అతని స్నేహితుడు అరదాడి శ్రీనివాస్‌తో కలసి కాకినాడ వెళ్లేందుకు బైక్‌పై బయలు దేరారు. జాతీయ రహదారి 216లోని కోరంగి దుర్గామల్లేశ్వర ఆలయం సమీపంలో అకస్మాత్తుగా గేదె అడ్డురావడంతో బలంగా గేదెను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తాతాజీ వర్మ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం అయ్యింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మరో యువకుడు శ్రీనివాస్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు. తాతాజీవర్మ హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడని, ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని గ్రామస్తులు అన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం స్నేహితుడితో కలసి వెళుతుండగా ఘటన -
గురుదేవా.. అందుకో పురస్కారం
రాయవరం: బోధకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, డైట్, సాంఘిక, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. సెల్ఫ్ నామినేషన్, రికమండెడ్ బై 5 ఫెలో టీచర్, పెర్ఫార్మెన్స్ బేస్డ్ అవార్డ్ త్రూ లీప్ యాప్ ఇలా మూడు కేటగిరీల్లో అవార్డులు అందజేయనున్నారు. వ్యక్తిగతంగా నామినేషన్ చేసుకునే వారితో పాటు, కొందరు ఉపాధ్యాయులు తమ పని తాము చేసుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోరు. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను ఐదుగురు ఉపాధ్యాయులు కలసి ఒకరిని ఎంపిక చేస్తారు. లీప్ యాప్ ద్వారా ఎంపిక చేసే ఉపాధ్యాయుల జాబితా రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకుంటుంది. జిల్లా నుంచి 16 మందిని ఎంపిక చేస్తారు. ఆ జాబితాలో ఉన్న ఉపాధ్యాయుల పనితీరును జిల్లా కమిటీ పరిశీలించి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సిఫార్సు చేయనుంది. జిల్లా స్థాయి అవార్డుల ఎంపికను డివిజన్, జిల్లా స్థాయి కమిటీలు చేయనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు వివిధ కేటగిరీ పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, క్రాఫ్ట్/మ్యూజిక్/డ్రాయింగ్ టీచర్లు, డైట్లో పనిచేసే సీనియర్ లెక్చరర్స్, తెలుగు/హిందీ/సంస్కృత పండిట్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు కనీసం పదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. అలాగే ఏ విధమైన క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ కేసులు లేనివారు మాత్రమే అర్హులు. వివిధ స్థాయిల్లో కమిటీలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు మండల స్థాయిలో ఎంఈఓ చైర్మన్‌గా, సభ్యులుగా స్థానిక హెచ్ఎం, డైట్ లెక్చరర్/మండలానికి చెందని మరో హెచ్ఎం సభ్యులుగా ఉంటారు. మండలంలోని ఎంఈఓ పరిధిలోని ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఒకరిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు వారు పనితీరు ఆధారంగా మార్కులను కేటాయిస్తారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయుల జాబితాను ఎంఈఓలు జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తారు. అలాగే డివిజనల్ స్థాయిలో డీవైఈఓ చైర్మన్‌గా, మరో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా, డైట్ ప్రిన్సిపాల్, ఎమినెంట్ ఎడ్యుకేషనలిస్ట్, జిల్లా కలెక్టర్‌చే ఎంపిక కాబడిన మరో జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు కూడా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఆహ్వానం ఈ నెల 8 వరకూ అవకాశం మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖపారదర్శకంగా ఎంపిక జిల్లా, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానించాం. వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేస్తాం. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుదారుల్లో అన్ని విభాగాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తిస్తాం. దీనికి గాను అన్ని చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి షెడ్యూల్ ఇలా.. ఈ నెల 8వ తేదీ వరకు డివిజనల్ స్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న వచ్చిన దరఖాస్తులను స్క్రూట్నీ చేస్తారు. 12న డివిజనల్ స్థాయిలో స్క్రూట్నీ చేసిన జాబితాను డీఈఓ కార్యాలయంలో అందజేస్తారు. 14న డివిజనల్ స్థాయి నుంచి వచ్చిన అన్ని కేటగిరీల దరఖాస్తులను స్క్రూట్నీ చేసి 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. 16న తుది జాబితాను జిల్లా విద్యాశాఖ నుంచి పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. 21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికై న వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 25న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న వారి తుది జాబితాను రూపొందిస్తారు. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేస్తారు. లీప్ యాప్ ఆధారంగా ఇచ్చే ఈ అవార్డులకు గాను ఈ నెల 4న జిల్లాల వారీగా జాబితాను ఎంపిక చేస్తారు. 8న జిల్లా స్థాయి కమిటీ ఎంపికై న వారి పనితీరును పరిశీలిస్తుంది. 14న జిల్లా స్థాయి కమిటీ పరిశీలన అనంతరం 1:1 నిష్పత్తిలో జాబితాను ఎంపిక చేసి, 16న రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. వీరికి కూడా ఈ నెల 21 నుంచి 23 వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. -
నిడదవోలులో భారీ చోరీ
నిడదవోలు: స్థానిక సంజీవయ్యనగర్ బుక్కాపేటలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని నలుబోను వెంకటేశ్వరరావు అనారోగ్యం కారణంగా గత నెల 15న మంగళగిరిలోని ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి నిడదవోలుకు తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే వెంకటేశ్వరరావు భార్యకు బ్రెయిన్‌స్టోక్ రావడంతో ఇద్దరూ అక్కడే చికిత్స పొందుతున్నారు. కుమార్తె గౌతమి తల్లిదండ్రులను చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. మంగళగిరి నుంచి గౌతమి శనివారం రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు బద్దలకొట్టి తలుపులు తీసి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. గదిలో బీరువా లాకర్‌ను గునపంతో పెకించారు. లాకర్లో ఉన్న 30 కాసుల బంగారం, 20 కాసుల వెండి, రూ.50 వేలను దొంగలు అపహరించుకుపోయారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, సీపీఎస్ క్రైం సీఐ శ్రీధర్‌కుమార్ సంఘటనా స్థలానికి వివరాలు సేకరించారు. గౌతమి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గజాననా రక్షమాం..
మామిడికుదురు: వినాయక చవితి వచ్చేస్తోంది.. పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ పీచుతో వినాయకుడి బొమ్మలను పాశర్లపూడిబాడవకు చెందిన మహిళలు తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకటిన్నర అడుగులు నుంచి రెండడుగుల సైజులో ఉన్న ఈ బొమ్మలు అబ్బుర పరుస్తున్నాయి. పీచుతో తయారైన ఈ బొమ్మల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉందని ఆక్సిజన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కటికిరెడ్డి గంగాధర్ తెలిపారు. పీచుతో తయారు చేస్తున్న ఈ బొమ్మలను ప్రతి ఒక్కరూ ఆదరించి మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. -
కొత్త జీఓల వెనుక రాజకీయ కుట్ర
జగ్గంపేట: పాఠశాలల్లోకి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించరాదని, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదివారం జగ్గంపేటలో పీడీఎస్‌యూ విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడితి సతీష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులతో పాఠశాలల్లో విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారన్నారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు బయటకు రాకుండా చేయడానికి పన్నిన కుట్ర ఈ కొత్త జీఓ అని అన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని అన్నారు. పాఠశాలలను రాజకీయాలకు తావులేకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారని, అయితే తల్లికి వందనం పథకం సందర్భంగా రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో రాజకీయ నాయకులు పబ్లిసిటీ చేశారన్నారు. అలాగే వైజాగ్‌లో జరిగిన జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులను బస్సులలో తీసుకెళ్లి కనీస వసతులు కల్పించలేదని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఈఓలు గురించి ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పుడు, పరిష్కరించక పోగా విద్యార్థి సంఘాలను కట్టడి చేసే జీఓలు తీసుకురావడం సరికాదని అన్నారు. ఈ జీఓలను తక్షణం రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
హోరాహోరీగా జాతీయ స్థాయి హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జాతీయ స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. తొలుత ఈ మ్యాచ్‌లను ముఖ్య అతిథులు డైరెక్టర్ ఆఫ్ మినిస్టరీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ జి.సతీష్ బాబు, విశాఖ పోర్టు ఫైనాన్స్ హెడ్ డి.రమణమూర్తి ప్రారంభించారు. మూడో రోజు మొదటి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్, అసోం జట్లు పోటీ పడగా 2–2తో మ్యాచ్ డ్రా అయ్యింది. రెండో మ్యాచ్‌లో బీహార్, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా నిర్వాహకులు ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన మ్యాచ్‌లను టోర్నీ కోఆర్డినేటర్ వి.రవిరాజు పర్యవేక్షించారు. షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక తాళ్లపూడి: మండలంలోని ప్రక్కిలంకకు చెందిన సుంకర సాకేత్ అండర్– 14 షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు బ్యాడ్మింటన్ కోచ్ నాగులుకొండ వీరభద్రరావు తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్‌లో ఐసీఎస్సీ స్కూల్ గేమ్స్ అండర్– 14లో సాకేత్ ఆంధ్ర, తెలంగాణ రీజనల్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండో స్థానంలో నిలిచారన్నారు. సెస్టెంబర్ 24, 25 తేదీల్లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికై నట్లు వీరభద్రం తెలిపారు. సాకేత్‌ను, అతని తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ సుంకర గంగరాజును పలువురు అభినందించారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకపిలేశ్వరపురం (మండపేట): కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం గుడ్డిగూడేనికి చెందిన గుత్తుల బాలకృష్ణ (26) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ద్వారపూడి రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ద్వారపూడి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వై.నాగేశ్వరరావు తెలిపారు. అవివాహితుడైన బాలకృష్ణ మండపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు హెచ్‌సీ నాగేశ్వరరావు తెలిపారు. వ్యక్తి దుర్మరణంకాజులూరు: తణుకువాడకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్న కళా సత్యనారాయణ (63) వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు నాలుగు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం గొల్లపాలెంలో బంధువులను కలుసుకునేందుకు వెళ్తుండగా సుబ్రహ్మణేశ్వస్వామి గుడి వద్ద కాకినాడ, కోటిపల్లి రహదారిలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వెళ్తూ వేగంగా ఢీకొని వెళ్లిపోయాడు. ఈ సంఘటనలో సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమివ్వగా ఎస్సై మోహన్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. పోలవరం కాలువలో పడి మహిళ ఆత్మహత్యజగ్గంపేట: మండలంలో రామవరం వద్ద పురుషోత్తపట్నం ఫేజ్– 2 పోలవరం కాలువలో పడి ఓ మహిళ మృతి చెందినట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పెద్దాపురం గ్రామానికి చెందిన వివాహిత జి.వరలక్ష్మి (48) కుటుంబ సభ్యులతో సమస్యల కారణంగా క్షణికావేశంలో పోలవరం కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరలక్ష్మి శనివారం ఉదయం పోలవరం కాలువలో దూకి ఉండవచ్చని, ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి స్థానికులు సమాచారం అందించారని ఎస్సై చెప్పారు. మృతురాలి భర్త సాయిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.శతాధిక వృద్ధురాలి మృతినల్లజర్ల: గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు కండెపు సోమమ్మ (100) ఆదివారం మృతి చెందింది. ముందురోజు వరకూ ఆమె పనులు ఆమే చేసుకునేదని సోమమ్మ కుమారుడు వెంకటరత్నం చెప్పారు. పలువురు ఆమె పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
పోలవరం గట్టుపై కాసుల వేట
కలవచర్లలో తవ్వకాలతో తరిగిపోతున్న పోలవరం కాలువగట్టు ● యథేచ్ఛగా చెలరేగిపోతున్న మట్టి మాఫియా ● కలవచర్లలో కాసులు కొట్టేస్తున్న కూటమి నేతలు ● రోజువారీ దందా రూ.25 లక్షల పైమాటే ● పేదల లే అవుట్ పేరుతో ముఖ్య నేత మేత! సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా గ్రావెల్ అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో టీడీపీ, జనసేన నేతలు మూడు టిప్పర్లు.. ఆరు లారీలు అంటూ అక్రమంగా రూ.లక్షలు మింగేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్న కూటమి నేతలు చివరకు పోలవరం కాలువను కూడా విడిచిపెట్టడం లేదు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి కాకినాడ జిల్లా తుని మీదుగా విశాఖకు వెళ్తున్న పోలవరం ఎడమ కాలువ గట్లు కూటమి నేతలు కాసులు కురిపిస్తున్నాయి. ఇటు రాజానగరం, అటు జగ్గంపేట, తుని నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ కీలక నేతలు తెర వెనుక ఉండి ద్వితీయ శ్రేణి నేతలతో ఆ కాలువ గట్టును గుల్ల చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం కలవచర్ల, గాదరాడ తదితర ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు స్థానిక జనసేన ముఖ్యనేతకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆ ముఖ్య నేత అండదండలతో అనుచరగణం అడ్డూ అదుపూ లేకుండా గడచిన నాలుగైదు నెలలుగా ఎర్రమట్టి, సుద్దమట్టి దందా నడుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు గోదావరిలో ఇసుకను తోడేళ్ల మాదిరిగా తోడేస్తున్నా వారి దాహం తీరడం లేదు. కలవచర్లలో పోలవరం, పుష్కర కాలువ గట్లను రాత్రీ, పగలు తేడా లేకుండా తవ్వేసి లక్షలు మింగేస్తున్నారు. ఈ రెండు ప్రధాన కాలువలకు ఇరువైపులా 30, 40 అడుగుల ఎత్తున ఉన్న గట్లను ఇష్టారాజ్యంగా తవ్వి, తరలించేసి ఆనక వాటాలు పంచుకుంటున్నారు. భారీ యంత్రాలను వినియోగించి ఎర్ర మట్టి, సుద్దమట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు, నర్సరీలకు విక్రయిస్తున్నారు. గ్రావెల్ రూపంలో ఉన్న ఎర్రమట్టిని నర్సరీలకు తరలిస్తున్నారు. వెలుగుబందలో పేదల కోసం సేకరించిన భూముల మెరక కోసమనే వంకతో పోలవరం కాలువ గట్టును తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. కలవచర్ల నుంచి నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతూ వస్తున్నారు. ఎటువంటి అనుమతీ లేకుండా పోలవరం గట్టు పొడవునా ఏడెనిమిది పొక్లెయిన్లు ఉపయోగించి 50 నుంచి 60 టిప్పర్లతో ఎర్ర గ్రావెల్‌ను అమ్మేసుకుంటున్నారు. ఒక టిప్పర్ రోజుకు ఆరేడు ట్రిప్పులు వేస్తోంది. ఇలా నిత్యం సుమారు 300 ట్రిప్పులు గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. టిప్పర్ గ్రావెల్ దూరాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.8 వేల వంతున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు సుమారు రూ.25 లక్షలు చేతులు మారుతున్నాయి. ఇలా వచ్చిన సొమ్ములో 40 శాతం నియోజకవర్గ జనసేన ముఖ్యనేతకు ముడుపుకట్టి ముట్టచెబుతున్నారని జిల్లా అంతటా కోడై కూస్తోంది. మిగిలిన 50 శాతంలో ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్న శ్రీరాంపురానికి చెందిన ముఖ్యనేత అనుచరుడు, స్థానిక అఽధికారులు సమానంగా వాటాలు వేసుకుంటున్నారని సమాచారం. ఇలా నాలుగైదు నెలలుగా సాగుతున్న దందా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లకుండా ఉంటుందా లేక, తెలిసినా పట్టించుకోలేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కలవచర్ల నుంచి ఎర్రమట్టిని నర్సరీలకు ఎక్కువగా తరలిస్తున్నారు. వేమగిరి, కడియం, కడియపులంక, చొప్పెల్ల తదితర ప్రాంతాలలో నర్సరీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నర్సరీలతో పాటు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లోని లే అవుట్లకు ఇక్కడి నుంచి సుద్దమట్టిని తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇన్ని నెలలుగా అనుమతి లేకుండా అక్రమంగా తవ్వేస్తున్న విషయం స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెడచెవిన పెడుతూ వచ్చారు. చివరకు శుక్రవారం రాత్రి కలవచర్ల గ్రామస్తులు ఎదురు తిరగడం, కలెక్టర్ ప్రశాంతి చొరవతో గ్రావెల్ తవ్వకాలు వద్ద టిప్పర్లను సీజ్ చేయడంతో ప్రస్తుతానికి బ్రేక్ పడింది. కానీ వెలుగుబందలో పేదల ఇళ్ల స్థలాలు మెరక చేసే పని ఆగిపోతుందనే సాకుతో తిరిగి తవ్వకాల కోసం ఉన్నత స్థాయి నుంచి నియోజకవర్గ ముఖ్యనేత ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా తామేమైనా తక్కువ తిన్నామా అంటూ జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో తమ్ముళ్లు కూడా ఇదే పోలవరం కాలువ గట్టును తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారిలో కూడా కలవచర్లలో మాదిరిగానే పోలవరం కాలువ గట్టును యథేచ్ఛగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. మురారికి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు గట్టు తవ్వే బాగోతాన్ని చక్కబెడుతున్నారు. మురారిలో కూడా ఆ పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోంది. తుని నియోజకవర్గం వెలమ కొత్తూరు, లోవకొత్తూరుల్లో సైతం పోలవరం ఎడమ కాలువ గట్టుపై ఇదే దందా చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఆ పచ్చనేతలు చక్కబెడుతున్నారు. ఆ పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. తమ స్వార్థం కోసం పోలవరం ఎడమ కాలువ గట్లు బలహీన పరుస్తుండటాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే తవ్వకాలు జరుపుతూ పోతే భవిషత్తులో కాలువలకు గండ్లు పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి అండతోనే దందా రాజానగరం నియోజకవర్గంలో కూటమి నేతల అండదండలతోనే మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఇదివరకు కొండుగుంటూరు, జి.యర్రంపాలెంలో కొండలు తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు పోలవవరం కాలువ గట్టును అడ్డంగా తవ్వేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలతో గట్లు బలహీన పడి ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అవుతుంది. ఇంత కాలం స్థానికులు ఫిర్యాదుచేసినా ఉపేక్షించారు. పర్యావరణానికి కూడా ఇది ముప్పుగా మారుతోంది. – అడబాల చినబాబు, సీతారామపురం రోడ్లు పాడవుతున్నాయి రోజు రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది లారీలలో మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుండటంతో రోడ్లు పాడైపోతున్నాయి. ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. కంకర రాళ్లు లే చిపోయి, దుమ్ము, ధూళి ఎగసిపడుతోంది. దీనివలన రోడ్లపై ప్రయాణం చేయలేకపోతున్నాం. గ్రామస్తులు ఊపిరితిత్తులు పాడై, అనారోగ్యాల పాలవుతున్నారు. – దాట్ల రఘు, కలవచర్ల -
చంద్రబాబు మోసాలను గ్రామస్థాయిలో వివరించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణరాజమహేంద్రవరం రూరల్: బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ, మండల స్థాయిల్లో నిర్వహించామని, ఇప్పుడు గ్రామస్థాయికి వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాసిచ్చిన బాండ్ల గురించి నిలదీయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ నిధులను గత ఏడాది ఎగవేసిందని తెలిపారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఉచిత బస్సు హామీలపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లపైనా మాట్లాడడం లేదని వివరించారు. జగన్మోహన్రెడ్డి హయాంలో భర్త చనిపోయిన వెంటనే వితంతు పింఛన్ ఇచ్చారని, రైతు భరోసా ఐదేళ్లు, పంటకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విత్తనాలు, అందుబాటులో ఎరువులు ఉంచారన్నారు. కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలేక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీల ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్నారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, జనసేన నేత కరాటం రాంబాబు ఆడియోలీక్లో పోలవరం జనసేన ఎమ్మెల్యే రూ.100 కోట్లు ఎలా దోచుకున్నాడో తేలిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులంతా నిత్యం ప్రజల్లో ఉంటూ తమకు ఇచ్చిన పదవులకు న్యాయం చేసేలా సమష్టి కృషితో జగన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, జిల్లా కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
లిక్కర్ వ్యాపారం చేయడం లేదని ప్రమాణం చేస్తావా బాబూ!
ఫ పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షపూరిత చర్యలు ఫ దావోస్, సింగపూర్‌కు వెళ్లి బాబు ఏం తెచ్చారు? ఫ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ కేసులు ఫ విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు ఫ ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ తోట, వైఎస్సార్ సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి ములాఖత్ సాక్షి, రాజమహేంద్రవరం: ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేటుపరం చేశారు.. ఆ పార్టీల ఎమ్మెల్యేలే లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. అలా చేయడం లేదని తిరుపతి కొండపై ప్రమాణం చేసే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా?’ అని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నించారు. మద్యం అక్రమ కేసులో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న రాజంపేట ఎంపీ పి.మిథున్‌రెడ్డితో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి శనివారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కారుమూరి మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయాల్సిన కూటమి సర్కారు వారిని హింసిస్తోందన్నారు. ఎవరిని జైల్లో పెడదామా అని మంత్రి లోకేష్ ఆలోచిస్తున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న జనాదరణను చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు. మద్యం అక్రమ కేసులో ప్రమేయం లేని మిథున్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ‘ఈ కేసులో తొలుత రూ.3,600 కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడేమో రూ.11 కోట్లు దొరికాయంటున్నారు. మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. ప్రజలను హింసించే కార్యక్రమాలు చేస్తున్నా.. పవన్ ప్రశ్నించడం లేదు’ అని కారుమూరి అన్నారు. ఈవీఎంల ద్వారానో.. ఎలాగోలా గెలిచిన మీరు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. ప్రతిపక్షాల గొంతునొక్కుతూ.. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందన్నారు. ఎప్పుడూ ఇదే విధానం ఉండదని, ప్రభుత్వాలు మారతాయనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. మిథున్‌రెడ్డికి ఏం సంబంధం ఉందని మద్యం అక్రమ కేసులో ఇరికించారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెస్తే.. చంద్రబాబు తిరిగి మద్యం తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందన్నారు. డోర్ డెలివరీ చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండానే ఏడాదిలో ప్రభుత్వం చేసిన రూ.1.70 లక్షల కోట్ల అప్పు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. న్యాయస్థానాలు చెప్పినా మిథున్‌రెడ్డికి జైలు అధికారులు వసతులు కల్పించడం లేదన్నారు. జగన్‌ను చూసి బాబుకు నిద్రపట్టడం లేదు వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్షపూరిత చర్యల్లో భాగంగానే మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. దావోస్, సింగపూర్ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం తెచ్చారని, పోలవరంలో 10 శాతం కమీషన్ దండుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వస్తూంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. అక్కసుతో రోడ్లు తవ్వేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి అరాచకాలను పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మద్యం వ్యాపారంలో బెల్ట్ తీస్తానన్న చంద్రబాబు ఇంత వరకూ ఎందుకు బెల్ట్ తీయడం లేదని ప్రశ్నించారు. బెల్ట్ కావాలంటే వైఎస్సార్ సీపీ కొనిస్తుందని చమత్కరించారు. సమావేశంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మిథున్‌రెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సుఖీభవ’లో ఎందుకీ కోత?
చాగల్లు: రాష్ట్రంలోని దాదాపు 7 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ సాయాన్ని కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు మండిపడ్డారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం కేవలం 46 లక్షల మంది రైతులకే ఈ పథకాన్ని ఇస్తోందన్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించిందని గుర్తు చేశారు. రైతులకు తమ ప్రభుత్వం రూ.1,70,845 కోట్ల మేర లబ్ధి అందించిందన్నారు. తమ ప్రభుత్వంలో 53 లక్షల మంది అర్హులైన రైతులను గుర్తించి, ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా నిధులు అందించామన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.10,716 కోట్లు ఎందుకు ఎగ్గొట్టిందో చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం రెండేళ్లకు కలిపి రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.40 వేల చొప్పున చెల్లించాలని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతి రైతుకూ వ్యవసాయ పెట్టుబడి సాయంగా కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, రాష్ట్ర ఖజానా నుంచి రూ.20 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చారని చెప్పారు. నేడు దానిని రూ.14 వేలకు ఎందుకు తగ్గించారో, మిగిలిన రూ.6 వేలు ఎందుకు ఎగ్గొడుతున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు. రైతులకు చేసిన మేలేమిటో చెప్పండి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ రైతులకు చేసిన మేలేమిటో చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగిన ప్రతి సందర్భంలోనూ కేవలం 30 రోజుల్లోనే పరిహారం చెల్లించామని గుర్తు చేశారు. రైతుల పక్షాన ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని భరించామన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేసిందని విమర్శించారు. ప్రీమియం చెల్లించిన రైతులకు సైతం పంటల బీమా చెల్లించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 నుంచి ఖరీఫ్, రబీ సీజన్లలో జరిగిన పంట నష్టాలకు పరిహారం, బీమా చెల్లించారా అని ప్రశ్నించారు. ‘విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించారా? వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించారా? వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సక్రమంగా నిర్వహిస్తున్నారా? రైతులు గిట్టుబాటు రేటు కోసం ఎందుకు రోడ్డెక్కుతున్నారు? ఎందుకు రాష్ట్రంలో మళ్లీ రైతు ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయో సీఎం సమాధానం చెప్పాలి’ అని వెంకట్రావు డిమాండ్ చేశారు.ఫ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల రైతులకు మొండిచెయ్యి ఫ గత ఏడాది ఇవ్వాల్సిన రూ.10,716 కోట్ల ఎగవేత ఫ రూ.20 వేలు ఎందుకు ఇవ్వటం లేదు? -
చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం
రూ.16 లక్షల ఆస్తి నష్టం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక శ్యామలా సెంటర్ వద్ద చెప్పుల దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేడియం రోడ్డు నుంచి కోటిపల్లి బస్టాండ్‌కు మలుపు తిరిగే ప్రాంతంలో ఆనుకుని ఫ్యాక్టరీ ఫుట్‌వేర్ సేల్ అనే పేరుతో హైదరాబాద్‌కు చెందిన షేక్ మొహియుద్దీన్, ఆర్ఎస్ దత్తు ఈ చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఉదయం 6.40 గంటలకు ఆ దుకాణంలోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేశారు. ప్రమాదానికి దగ్గరలోనే అగ్నిమాపక కార్యాలయం ఉండడంతో వెంటనే ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నగరంలోని ఆర్యాపురం, ఇన్నీసుపేట అగ్నిమాపక యంత్రాలతో పాటు కొవ్వూరు నుంచి మరో వాహనాన్ని రప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణానికి ఆనుకుని ఉన్న బాలాజీ అక్వేరియం, పెట్స్ దుకాణం అగ్ని ప్రమాదానికి గురైంది. సుమారు రూ.16 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అంచనా వేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి సీహెచ్ మార్టిన్రూథర్ కింగ్ సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మంటలను చాకచక్యంగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
ప్రభుత్వ విధానాలతో బడులకు నష్టం
ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో బడుల్లో విద్యార్థులు తగ్గిపోయి విద్యా వ్యవస్థ చతికిలబడుతోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) అధ్యక్షుడు డేనియల్ బాబు ధ్వజమెత్తారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ వింత పోకడలపై శనివారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన, ఆందోళన చేపట్టారు. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను భర్తీ చేసి, ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వం పి4 నుంచి ఉపాధ్యాయులను తప్పించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు అప్పగించి బోధనా సమయాన్ని హరించవద్దని, యాప్‌ల భారం తక్షణమే తగ్గించాలని తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యదర్శి జయకర్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు. సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు● డీఆర్ఎం మోహిత్ సోనాకియా ● రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు సెక్షన్ల తనిఖీ రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గోదావరి నదికి 2027వ సంవత్సరంలో జరగనున్న పుష్కరాల నేపథ్యంలో విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా శనివారం రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్లను సంబంధిత అధికారులతో కలసి తనిఖీలు చేశారు. పుష్కరాలకు సుమారు 40 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తారనే అంచనాతో రాజమండ్రి స్టేషన్‌లోని తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారాలు, స్టేషన్ యార్డులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించారు. జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించి యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ ద్వారాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాలు, ప్రజలకు అందించే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పుష్కర యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రద్దీని నియంత్రించేందుకు ఆయా స్టేషన్లలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 1.14 లక్షల మందికి ‘సుఖీభవ’ తాళ్లపూడి (కొవ్వూరు): రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ అందజేసినట్టు జిల్లా ఇన్చార్జి, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కొవ్వూరులో లిటరరీ క్లబ్ వద్ద జరిగిన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2025–26 మొదటి విడత నిధుల జమ కార్యక్రమంలో రామానాయుడు, కలెక్టర్ పి. ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో రూ.7 వేల చొప్పున జిల్లా వ్యాప్తంగా 1.14 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.79 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. కౌలు రైతులకు అక్టోబర్, జనవరిలో నిధులు జమ అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధవళేశ్వరం గేట్ల సమస్య పరిష్కారానికి, దారవరం ముంపు సమస్యకు లిఫ్ట్ స్కీమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుబ్బరాజు, ఆర్డీవో రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు. -
తవ్వకాలను అడ్డుకున్న
గ్రామస్తులు 17 లారీలు, 4 పొక్లెయిన్ల స్వాధీనం రాజానగరం: మండలం కలవచర్ల సమీపంలోని పోలవరం ఎడమ కాలువకు ఇరువైపులా ఉన్న మట్టి గుట్టలను అక్రమంగా తవ్వి తరలించడాన్ని కలవచర్ల గ్రామస్తుల సహకారంతో స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు శనివారం ఉదయం హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 17 లారీలను, అందుకు ఉపయోగించిన 4 పొక్లెయిన్లను స్వాధీనపర్చుకున్నామని జిల్లా గనుల శాఖ అధికారి డి.ఫణిభూషణ్‌రెడ్డి తెలిపారు. స్వాధీన పరచుకున్న వాహనాలను రాజానగరం పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. అలాగే మట్టి తవ్వకాలు జరుగుతున్న మరో మూడు ప్రదేశాలలోను తనిఖీలు చేశారు. జరిగిన మట్టి తవ్వకాలను కొలతలు తీసుకుని, చట్ట ప్రకారం తదుపరి చర్యల కోసం నివేదికలు తయారుచేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు జీఏఎస్ఎల్ దేవి, ఆర్ఐ రంభ, ఇరిగేషన్ డీఈ డి.మోహన్‌రావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నీరు లేక నెర్రెలు..
బోర్లు పని చేయడం లేదు ఆవ చెరువులో నీరు లేక బోర్లు పనిచేయడంలేదు. భూమిలో నీటిమట్టం తగ్గడంతో బోర్లు తక్కువ నీరు తోడుతున్నాయి. బోరు నీరు చేలకు సరిపోవడంలేదు. ఆయకట్టు రైతుల బాధలు వర్ణనాతీతం. చెరువు నిండితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు ఎక్కువ నీటిని తోడతాయి. నీరు లేక ఆవ చెరువు ఎండిపోయింది. వరి చేలకు తడి సరిపోవడంలేదు. చెరువు కింద 10 ఎకరాలలో వరి పంట వేశాను. నీరు లేక చేలు దెబ్బతింటున్నాయి. వాతావరణం ఇలాగే ఉంటే ఖరీఫ్ సాగు కష్టమే. – గంటా ఏడుకొండలు, రైతు, త్యాజంపూడి, దేవరపల్లి మండలం తాడిపూడి నీరు అవసరం తాడిపూడి కాలువ నీటి అవసరం ఉంది. యర్నగూడెం వద్ద కాలువకు గతంలో ఏర్పాటు చేసిన ప్రదేశంలో సిమెంట్ తూరలు ఏర్పాటు చేసి ఆవ చెరువకు నీటి సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలి. వాతావరణం ఇలానే ఉంటే వరి చేలు నెర్రెలు తీస్తాయి. మూనలు ఎండిపోతున్నాయి. త్యాజంపూడి, కురుకూరు గ్రామాలకు చెందిన భూములు సుమారు 1800 ఎకరాలు ఆయకట్టులో ఉన్నాయి. రైతుల ఇబ్బందులను అధికారులు గమనించి తక్షణం నీటి సరఫరాకు చర్యలు చేపట్టి పంటలను కాపాడాలి. – పల్లి రత్నారెడ్డి, అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ, మండల రైతు విభాగం దేవరపల్లి మండలం త్యాజంపూడిలోని ఆవ చెరువు● ఆవ చెరువులో నిండుకున్న నీరు ● అడుగంటిన భూగర్భ జలాలు ● 1,800 ఎకరాల ఆయకట్టుకు నీటి ఎద్దడి ● ఎండిపోతున్న వరి చేలు ● ఆందోళన చెందుతున్న రైతులు దేవరపల్లి: తగినన్ని వానలు లేవు.. చెరువులకు కావాల్సినంత నీరు చేరడం లేదు.. ఆవ చెరువు ఆయకట్టులోని పొలాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చెరువును నమ్ముకుని వేసిన వరి చేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణం గల ఆవ చెరువు గ్రామానికి ఎగువన ఉంది. ఆవ నీటి ద్వారా త్యాజంపూడి, కురుకూరు, యర్నగూడెం గ్రామాలకు చెందిన రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో వరి వేసిన రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఏటా వర్షాకాలంలో జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలకు ఆవ చెరువు నిండి సరస్సులుగా ఉంటుంది. ఆవ చెరువు నిండితే భూమిలో నీటి మట్టం పెరుగుతుంది. దీంతో బోర్లు సమృద్ధిగా నీరు తోడతాయని రైతులు అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవకపోవడంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమవుతోందని రైతులు వాపోతున్నారు. జూలై నెలలో కురిసిన అడపాదడపా వర్షాలకు కొద్దిపాటి నీరు చెరువులోకి చేరినప్పటికీ తూముల ద్వారా దిగువకు విడుదల కావడంలేదని రైతులు తెలిపారు. చెరువు గట్టుపై రైతులు ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి ఎండిపోతున్న వరి చేలను బతికించుకుంటున్నారు. రోజుకు రూ.వెయ్యి ఆయిల్ ఖర్చు అవుతోందని, అంత పెట్టుబడి ఎక్కడని నుంచి తెచ్చి పెట్టగలమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండిన పంట విక్రయించినా ఆయిల్ ఖర్చు వచ్చే పరిస్థితి లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. 1,800 ఎకరాల ఆయట్టు పొలాలు ఆవ చెరువు కింద సుమారు 1800 ఎకరాల ఆయకట్టు పొలాలు ఉన్నాయి. ఎక్కువ విస్తీర్ణం త్యాజంపూడి, కురుకూరు రెవెన్యూ భూములు ఉన్నాయి. చెరువులకు ఇరిగేషన్ అధికారులు తూములు ఏర్పాటు చేసి ఏటా ఖరీఫ్ సీజన్లో వరి చేలకు నీటిని విడుదల చేస్తారు. చెరువు నీటితో పాటు బోర్ల ద్వారా రైతులు పంటలు పండిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు 10 ఏళ్లుగా ఎప్పుడూ లేదని రైతులు అంటున్నారు. మరో పది రోజులు వాతావరణం ఇలాగే ఉంటే వేసిన వరి చేలు పనిచేయవని రైతులు వాపోతున్నారు. తాడిపూడి నీటితో చెరువు నింపాలి తాడిపూడి కాలువ నీటిని యర్నగూడెం గండి చెరువు ద్వారా ఆవ చెరువును నింపి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2016–17 సంవత్సరంలో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఎద్దడి ఏర్పడగా యర్నగూడెం వద్ద తాడిపూడి కాలువకు అధికారులు సిమెంట్ తూరలు ఏర్పాటు చేసి గండి చెరువు ద్వారా ఆవ చెరువుకు నీరు సరఫరా చేశారు. చెరువును నింపి తూముల ద్వారా ఆయకట్టు పంట పొలాలకు నీటిని సరఫరా చేసేవారు. దీనికి అవసరమైన తూరలను ఆయకట్టు రైతులు సమకూర్చుకున్నారు. కొంత కాలం తర్వాత తూరలు పెట్టిన ప్రదేశంలో కాలువకు గండి పడడంతో తూరలను తీసివేశారని రైతులు తెలిపారు. ఈ ఏడాది నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున కాలువకు తూరలు ఏర్పాటు చేసి ఆవ చెరువు నింపాలని రైతులు అధికారులను కోరుతున్నారు. అవసరమైన తూరలను ఏర్పాటు చేస్తామని ఆయకట్టు రైతులు చెపుతున్నారు. నది పక్కనే ఉన్నా నీటి కొరత ఆవ చెరువు గట్టు పక్కనే చేలు ఉన్నా నీరు లేక ఎండిపోతున్నాయి. చెరువును నమ్ముకుని నాలుగు ఎకరాల్లో వరి పంట వేశాను. నీరు లేక మూనలు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో ఆవ చెరువు ఎండిపోవడం ఎప్పుడూ లేదు. నాట్లు వేసి వారం దాటింది. నీరు లేక నెర్రెలు బారుతున్నాయి. ఇంజిన్ల ద్వారా చెరువులోని నీటిని తోడి చేలను బతికిస్తున్నాం. కూలి పనులకు వెళ్లి ఆయిల్ కొనుగోలు చేసి తెస్తున్నాం. ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. – నబిగిరి ముసలయ్య, రైతు, త్యాజంపూడి, దేవరపల్లి మండలం -
నాప్తాల్ ట్యాంకర్ బోల్తా
● తప్పిన పెను ప్రమాదం ● భారీ క్రేన్లతో ట్యాంకరును బయటకు తీసిన వైనం ముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక ఓఎన్జీసీ రిఫైనరీ నుంచి చైన్నె వెళుతున్న నాప్తాల్ ట్యాంకర్ గురవారం అర్ధరాతి గోతిలో బోల్తా పడింది. ఓఎన్జీసీ, ఫైర్ సిబ్బంది ట్యాంకర్‌ను సురక్షితంగా బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి దొమ్మెటివారిపాలెంలో 216 జాతీయ రహదారి పక్కన ఈ ట్యాంకర్ అదుపు తప్పి గోతిలో పడిపోయింది. పేలుడు స్వభావం ఉన్న 29వేల లీటర్ల నాప్తాల్ ఉన్న ఈ ట్యాంకర్ బోల్తా పడటంతో అధికారులు అప్రమత్తయయ్యారు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి 100 మీటర్ల పరిధిలో ఉన్న గ్రామస్తులను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓఎన్జీసీ అధికారులతో సంప్రదిస్తూ ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయం ఓఎన్జీసీ సెక్యూరిటీ అఫీసర్ బలరామ్ ఆధ్వర్యంలో పోలీసు, ఫైర్ సిబ్బంది రిస్క్యూ ఆపరేషన్ చేశారు. ఎటువంటి పేలుడు సంభవించకుండా ఫోమ్ ఉపయోగించారు. రెండు అంబులెన్స్‌లు, నాలుగు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచి నాలుగు క్రేన్లు, ఒక భారీ క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్‌కు మరమ్మతులు చేసి చైన్నె పంపించారు. -
గాయకుడి గొంతు మూగబోయింది
● గొంతు ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాము ● ఆపరేషన్ కోసం రూ.1.80 ఖర్చవుతుందని నిర్ధారించిన వైద్యులు ● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు నిడదవోలు : జూనియర్ గద్దర్‌గా పేరుగాంచిన దళిత సామాజిక జానపద కళాకారుడి గొంతు మూగబోయింది. వేలాది వేదికలపై తన గానంతో శ్రోతలను ఉత్తేజపరిచిన గాయకుడి గొంతు మూగపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన దళిత కళా మండలి వ్యవస్థాపకుడు, జానపద కళాకారుడు భావన రాము కొంతకాలంగా గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య కమలమ్మ, పుట్టుకతోనే మూగ అయిన కుమార్తె ఉన్నారు. రామును చాలామంది జూనియర్ గద్దర్ అని కూడా పిలుచుకుంటారు. గొంతు ఇన్ఫెక్షన్తో రాము రాజమహేంద్రవరంలోని అంజనా వైద్యాలయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గొంతులో కణితిలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రాము మాట కూడా పడిపోయింది. సకాలంలో గొంతు సర్జరీ చేయకపోతే అది గొంతు క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. గొంతు సర్జరీకి రూ.1.80 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో పూట గడవడం కష్టంగా ఉన్న రాము దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. గాయకుడు రాము ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అకౌంట్ నంబర్ 06420100 0043780కు సాయం అందించాలని కోరుతున్నారు. -
ఏపి కానిస్టేబుల్ ఫలితాల్లో డ్రైవర్‌కు స్టేట్స్లో 5వ ర్యాంకు
గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల ట్రాన్స్పోర్ట్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గుర్రం రాముడు ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించినట్టు ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. సూరంపాలెం ప్రగతి కళాశాలలో ఇంటర్, డిగ్రీ, కాకినాడ ఆండాళ్లమ్మ కళాశాలలో ఎంబీఏ పూర్తిచేసిన రాముడు ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే నాలుగు సంవత్సరాలుగా ఆదిత్యలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. తండ్రి రోజువారీ వేతనానికి పనిచేసుకుంటూ కొడుకుని చదివించినట్టు తెలియజేశారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, తదితరులు రాముడుకి అభినందనలు తెలిపారు. -
స్కూల్లో క్షుద్రపూజలు?
01పీటీపీ44: యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్ ● ఆకతాయిల పనిగా గుర్తింపు ● విద్యార్థులకు కౌన్సెలింగ్ సామర్లకోట: స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్లో క్షుద్రపూజలు జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయానికి పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసిన విషయాన్ని గుర్తించారు. దాంతో అప్పటికే పాఠశాలకు వచ్చిన కొంతమంది విద్యార్థులు ఈ రోజు పాఠశాల లేదు అంటూ ఇళ్లకు వెళ్లి పోవడం ప్రారంభించారు. దాంతో విషయాన్ని గమనించిన సైన్సు ఉపాధ్యాయురాలు ఏఎల్‌వీ కుమారి ఆవరణలో ఉన్న నిమ్మకాయలను తీసి వేసి ముగ్గులను చెరిపించారు. విద్యార్థులను క్లాసు రూములకు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. హెచ్ఎం కె.శ్రీదేవి వచ్చిన తరువాత విషయం తెలుసుకొని ఎదురుగా షాపులో ఉన్న సీసీ కెమెరాలో గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాలలో పాఠశాల ఆవరణలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించలేదు. దాంతో ఉపాధ్యాయులు ఉపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు పాఠశాల హెచ్ఎం శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలలోని ఆకతాయి విద్యార్థులు చేసిన పనిగా అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం సమయంలో విద్యార్థులు ఈ పని చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులకు సీఐ ఎ కృష్ణ భగవాన్‌తో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉండటానికి ఇటువంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హెచ్ఎం తెలిపారు. -
ముద్రగడ క్షేమంగా ఉన్నారు
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం క్షేమంగా ఉన్నారని ఆయన పెద్దకుమారుడు వీర్రాఘవరావు(బాలు) తెలిపారు. ముద్రగడ ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంతో క్షేమంగాని ఉన్నారని, కొద్దిరోజుల పాటు హైదాబాద్‌లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి ఎంతో అవసరమని వైద్యులు సూచించారన్నారు. ఆయనను చూసేందుకు హైదరాబాద్ ఎవరు వెళ్లొద్దని ఆయన కోరారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన జనం ముందుకు వస్తారని తెలిపారు. ఎంపీడీఓలు పీసా చట్టంపై కలిగి ఉండాలి సామర్లకోట: ఎంపీడీఓలు పంచాయతీల విస్తరణ చట్టం (పీసా)పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఈటీసీ సీనియర్ ఫ్యాకల్టీ ఎ.రవిశంకర్ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఐదవ రోజు పీసా చట్టంపై శిక్షణ నిర్వహించారు. రవిశంకర్ మాట్లాడుతూ ఈ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందినవారి కోసం 1996లో అమలులోకి తీసుకు వచ్చారన్నారు. ఈ చట్టం షెడ్యూల్డ్ తెగల ప్రజల సంప్రదాయ హక్కులను పరిరక్షించడం, స్వయం పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం ప్రవేశపెట్టారన్నారు. ఈ చట్టంపై అవగాహన కల్పించడానికి వారి గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జార్జాండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లో అమలు చేస్తున్నారని వివరించారు. పంచాయతీలకు సంబంధించి రాజ్యాంగంలోని కొన్ని హక్కులను షెడ్యూల్డు ప్రాంతాలకు విస్తరించారని చెప్పారు. గిరిజన జనాభాలో ఎక్కువ మందికి స్వయం పాలన కల్పించాలన్నారు. వారి ఆస్తులను పరిరక్షించవలసిన బాధ్యత ఎంపీడీఓలపై ఉంటుందని తెలిపారు. మరో ఫ్యాకల్టీ కేఆర్ నిహరిక పీసా చట్టం పై క్విజ్ పోటీలను నిర్వహించారు. -
కమ్యూనిటీ హాల్ అమ్మేశారంటూ జనసేన నేతపై ఫిర్యాదు
సఖినేటిపల్లి: జనసేన నాయకుడు ఒకరు కుటుంబ సభ్యులతో కలసి క్రైస్తవ కమ్యూనిటీ హాల్ అండ్ చర్చిని అమ్మేశారంటూ సంఘ సభ్యులు సఖినేటిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించి, కామన్ కమ్యూనల్ ప్రోపర్టీగా ఉన్న శాంతినగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ అండ్ చర్చిని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతున్న వారిపైన, ఇందుకు సహకరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఇచ్చిన పై ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. సంఘ అధ్యక్షుడు గొల్లమందల వసంతరావు, కార్యదర్శి గంటా రాజ్ కుమార్, కోశాధికారి పల్లికొండ వెంకటరమణ, క్రైస్తవ సమాజ సభ్యులైన గొలమందల వినయ్బాషా, సంఘ సభ్యులు కలిసి పై ఫిర్యాదు చేశారు. సఖినేటిపల్లి శాంతినగర్‌లో ఎనిమిది సెంట్ల భూమిలో కామన్ కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి ఉంది. చర్చికి సంబంధించి 500 మంది సభ్యులు ఉన్నారు. తొలుత 2017లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గ్రాంటుతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగింది. సభ్యులు దీనినే చర్చిగానూ ఉపయోగిస్తున్నారు. పలువురు దాతలు చర్చి అభివృద్ధికి విరాళాలు ఇచ్చారు. అప్పట్లో చర్చి అభివృద్ధి చేస్తున్న సమయంలో తాత్కాలిక అధ్యక్షుడిగా తాడి నారాయణమూర్తి పేరును చర్చి మీద రాసి హక్కుదారుడిగా పేర్కొన్నారు. కాగా కమ్యూనిటీ హాల్, చర్చికి సంబంధించిన విషయంలో రెండు నెలలుగా సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వివాదం ముదిరి పాకాన పడడంతో పంచాయతీ పోలీసుల వరకూ వెళ్లింది. సంఘ పాలక వర్గ సభ్యులు తమపై దాడులు చేశారంటూ జనసేనకు చెందిన సీనియర్ నాయకుడు, తన వ్యతిరేక వర్గంపై స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అధికారం అడ్డుపెట్టుకుని తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ జనసేన లీడర్‌పై ఇటీవల రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు సంఘ సభ్యులు ఫిర్యాదు చేశారు. వివాదం ఇలా ఉండగా జూలై 26న కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి భవనాన్ని జనసేన లీడర్, కుటుంబ సభ్యులు కలిసి, తమ తాతయ్య నారాయణమూర్తి, చర్చి స్థలదాత గెడ్డం సుందరమ్మ ద్వారా స్వీకరించిన దాన పట్టాపై తమ కుటుంబానికి హక్కులు ఉన్నాయని నారాయణమూర్తి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. నారాయణమూర్తి కుటుంబ సభ్యులు మా గ్రామంలోని కొంత మందితో కలిసి, కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి ఆస్తులను ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఫిర్యాదులో సంఘ సభ్యులు పేర్కొన్నారు. క్రీస్తు లూథరన్ చర్చి ప్రతినిధి బర్రే అబ్రహంకు అనుకూలంగా కుట్రపూరిత రిజిస్టర్ సెటిల్మెంట్ డీడ్‌ను అమలు చేశారని, రాజోలు సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మకై అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ సెటిల్మెంట్ డీడ్‌ను అమలు చేయడంలోను, కమ్యూనిటీ హాల్ అండ్ చర్చి ఆస్తులను ఆక్రమణలో భాగస్వాములైన, సహకరించిన మొత్తం 12 మందిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. -
మెరుగుపడిన ఆగమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం
పరామర్శించిన దేవదాయశాఖ కమిషనర్, ఆలయ చైర్మన్ అన్నవరం: తీవ్ర ఆస్వస్థతకు గురై తుని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నవరం దేవస్థానంలోని ఎనిమిది మంది సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ విద్యార్దులు గురువారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. తీవ్ర జ్వరంతో బాధడుతున్న మరో ముగ్గురు విద్యార్థులను శుక్రవారం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి కూడా చికిత్స అందించడంతో వారు కోలుకున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, త్వరలోనే 11 మంది విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని తుని ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ స్వప్న తెలిపారు. విద్యార్థులను పరామర్శించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ చికిత్స పొందుతున్న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులను దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా విద్యార్దుల ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు కారణమేంటని ఆయన అధికారులను ప్రశ్నించగా గత నాలుగు రోజులుగా కొండదిగువన ఆరెంపూడి సత్రంలో దత్తపీఠం ఆధ్వర్యంలో జరిగిన యాగంలో విద్యార్థులు పాల్గొన్నారని మంగళవారం వరకు అక్కడే భోజనాలు చేశారని తెలిపారు. బుధవారం ఉదయం వీరు ఆగమ పాఠశాలలో భోజనాలు చేశారని తెలిపారు. ఆ మధ్యాహ్నం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడడంతో స్థానిక దేవస్థానం ఆసుపత్రిలో వైద్యం అందించామని తెలిపారు. గురువారం పరిస్థితి విషమించడంతో వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అనంతరం ఆయన అన్నవరం దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాలను కూడా పరిశీలించారు. ఆయన వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఆర్జేసీ వి.త్రినాథరావు ఉన్నారు. -
జూనియర్ మహిళల హాకీ పోటీలు ప్రారంభం
ఈ నెల 10 వరకు నిర్వహణ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అని కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడామైదానంలో 12 రోజుల పాటు జరగనున్న 15 వ జాతీయ జూనియర్ బాలికల హాకీ పోటీలను శుక్రవారం రాత్రి కలెక్టర్ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో డబుల్ ఒలింపియన్, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత ఎస్.గీత జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించగా, ఇండియన్ హాకీ పతాకాన్ని ఎస్.గీత, ఇండియన్ హాకీ సెలెక్షన్ కమిటీ సభ్యులు ఆసుంటా లక్రా ఆవిష్కరించారు. ఈ పోటీలలో 30 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. 2026–27 సంవత్సరానికి మహిళా హకీ వరల్డ్ కప్‌లో పాల్గొనే భాతర జట్టును ఈ టోర్నీలో ఎంపిక చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో అతిథులుగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, రాజబాబు, కుడా చైర్మన్ టి.రామస్వామి, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ మీనా, ఎస్పీ బిందుమాధవ్, అడిషనల్ ఎస్పీ మానిష్; డీఎఫ్ఓ రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా క్రీడామైదానంలో ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులు అర్పించారు. 18 జట్ల క్రీడాకారులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ ఈ టోర్నీ క్రీడాకారులకు మధుర స్మృతిగా నిలుస్తుందన్నారు. టోర్నీ కోఆర్డినేటర్ రవిరాజు, డీఎస్డీఓ శ్రీనివాస్‌కుమార్, ఆర్డీఓ మల్లిబాబు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు కాకినాడ జిల్లా క్రీడామైదానంలో శుక్రవారం ప్రారంభమైన 15వ జాతీయ జూనియర్స్ మహిళల హాకీ పోటీలలో భాగంగా తొలిరోజు ఏ డివిజన్లో గోయన్స్ హాకీ, జమ్మూకాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గోయన్స్ హాకీ జట్టు 2–1 స్కోర్‌తోను, తెలంగాణ, గుజరాత్ మధ్య నిర్వహించిన మ్యాచ్‌లో గుజరాత్ 4–1 స్కోర్‌తోను, మిజోరామ్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిజోరాం12–0 స్కోర్‌తోను విజయం సాధించాయి. బి డివిజన్లో మణిపూర్, కేరళ మధ్య జరిగిన మ్యాచ్‌లో మణిపూర్ 5–0 స్కోర్‌తోను, అస్సాం, పాండుచ్చేరి మధ్య జరిగిన మ్యాచ్‌లో అస్సాం 5–0 స్కోర్‌తోను, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుణాచల్‌ప్రదేశ్ 6–2 స్కోర్‌తోను విజయం అందుకున్నాయి. ఢిల్లీ, హాకీ అసోసియేషన్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6–3 స్కోర్‌తోను విజయం సాధించాయి. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లను టోర్నీ కో–ఆర్డినేటర్ వి.రవిరాజు పర్యవేక్షించారు. -
గాజుల సింగారం
మామిడికుదురు: శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా నగరం గ్రామ దేవత శ్రీదొడ్డి గంగాలమ్మను స్థానికులు గాజులతో విశేషంగా అలంకరించారు. సౌభాగ్యానికి ప్రతీకగా భావించే గాజులను దండలుగా కూర్చి అమ్మవారి మెడలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు. గాజులతో అలంకార శోభితమైన దొడ్డి గంగాలమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ముడుపులు, మొక్కులు చెల్లించారు. నోట్ల తోరణం సీటిఆర్ఐ (రాజమహేంద్రవరం) : నగరంలోని దేవీచౌక్‌లో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో అమ్మవారిని రూ.45వేల కొత్త నోట్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరుదైన అలంకారం కొత్తపేట: మండల పరిధిలోని వానపల్లి గ్రామ దేవత పళ్లాలమ్మ అమ్మవారు గాజుల అలంకరణతో దర్శనమిచ్చారు. మహిళలు అందరూ పసుపు, కుంకుమలు, చలివిడి, పానకం, వడపప్పు, గాజులు, శ్రావణమాసం సారెతో వానపల్లి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నా రు. అక్కడి నుంచి మేళతాళాలతో బయలుదేరి తూము సెంటర్ వినాయకుడి గుడి, మెయిన్‌రోడ్డు మీదుగా పళ్లాలమ్మ వారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఆసాదులకు గాజులు, నైవేద్యాలు, సారె సమర్పించగా వారు అమ్మవారికి గాజులు అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహి క కుంకుమ పూజలు నిర్వహించారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో చోటు ˘
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నాయకులను రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా వాసంశెట్టి పావనీ కుమారి (గోపాలపురం), స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీగా వామిశెట్టి పరమేశ్వరరావు (గోపాలపురం), స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా ఎజ్జల రాజా(రాజానగరం)లను నియమించారు. నేడు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జిల్లా కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తామని వేణు తెలిపారు. డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా రాజు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా సీనియర్ లెక్చరర్ ఆర్జేడీ రాజు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ ఏఎం జయశ్రీ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఆమె స్థానంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు అభినందించారు. ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు సామర్లకోట: శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. మహిళలు బియ్యం, కలశం, జాకెట్టు ముక్క తీసుకుని రాగా.. వ్రతాలకు కావలసిన వరలక్ష్మీ రూపు, ఫొటో, తోరాలు, గాజులు, పువ్వులు, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, ప్లేటు, ప్రమిదలు, ఒత్తులు, నూనెను దాతలు ఏర్పాటు చేశారు. దేవస్థానం సహకారంతో భక్తులకు ప్రసాదం అందజేశారు. సామూహిక వ్రతాలకు వచ్చిన మహిళలతో ఆలయం మొదటి అంతస్తు, దిగువన ఉన్న ఉపాలయాల ప్రాకారాలు నిండిపోయాయి. అధికారులు ఊహించని విధంగా సుమారు వెయ్యి మంది మహిళలు సామూహిక వ్రతాలు ఆచరించారు. ఈఓ బళ్ల నీలకంఠం, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు లక్ష్మీదేవి చిత్రపటం వద్ద పూజలు చేసి వ్రతాలను ప్రారంభించారు. వ్రతాల్లో పాల్గొన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు. -
వినియోగదారుల అంగీకారంతోనే స్మార్ట్ మీటర్లు
రాజమహేంద్రవరం సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విద్యుత్ వినియోగదారుల అంగీకారం ఉంటేనే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) ఎస్ఈ కె.తిలక్ కుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకూ 44,646 కమర్షియల్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అమర్చామని తెలిపారు. ఎక్కడా వినియోగదారుల నుంచి నిరసనలు రాలేదన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ వినియోగం వివరాలు తెలుసుకోవచ్చని, పలు ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బిల్లు స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లించవచ్చన్నారు. జాప్యం జరిగినా చెల్లించిన వెంటనే సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉంటుందన్నారు. వినియోగ గణాంకాలను బట్టి గ్రిడ్‌ను మెరుగ్గా నిర్వహించవచ్చని చెప్పారు. స్మార్ట్ మీటర్లతో ట్రాన్స్ఫార్మర్ల వద్ద లోడ్ వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికతను అంగీకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఎటువంటి అపోహలూ పెట్టుకోకుండా స్మార్ట్ మీటర్ల ఏర్పాటకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రీపెయిడ్ మీటర్లు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తిలక్ అన్నారు. సమావేశంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, ఎ.రాజశేఖర్, ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి డీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ రాజమహేంద్రవరం రూరల్: డీసెట్–2025 రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 3న ప్రారంభమవుతుందని బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆ రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలని, ఈ నెల 5న సీటు ఎలాట్ చేస్తామని వివరించారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని డీఈఎల్ఈడీ కళాశాలలకు కేటాయించిన వారందరూ బొమ్మూరులోని డైట్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకుని, తుది అడ్మిషన్ లెటర్ పొందాలని సూచించారు. -
రాజధానికి లక్ష ఎకరాలు అవసరమా?
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర రాజధానిని లక్ష ఎకరాల్లో నిర్మిస్తామంటున్నారని, అంత భూమి అవసరమా అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్లలో వెయ్యి ఎకరాలతో రాజధాని నిర్మించారన్నారు. రైతుల భూములు లక్ష ఎకరాలు ఎందుకు సేకరించాలని, వారి పొట్ట ఎందుకు కొట్టాలని నిలదీశారు. 50 అంతస్తుల భవనాలు నిర్మించాలని చంద్రబాబు అంటున్నారని, కృష్ణా తీరంలో అన్ని అంతస్తులతో భవనాల నిర్మాణం సాధ్యమా అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టు కడతామంటున్నారని, వర్షం కురిస్తే ఆ ప్రాంతం ముంపునకు గురవుతోందని, అప్పుడు నీటిలో నడిపే విమానాలు తీసుకొస్తారా అని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం రాజధాని పూర్తి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి చాలా చిన్న వయస్సు నుంచే తనకు తెలుసన్నారు. ఆయన తల్లిదండ్రులు కూడా తనకు తెలుసని, మిథున్‌రెడ్డి అరెస్టు చాలా బాధాకరమని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డి చిన్న బిడ్డ అని, రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు పాలన గురించి ఎంతో ఊహించానని, కానీ, ఆయన పాలన వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఇప్పటి వరకూ అప్పులు చేయడానికే మాత్రమే చంద్రబాబు చూస్తున్నారు తప్ప రాష్ట్రానికి ఏ మేలూ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు పచ్చచొక్కా కనిపిస్తే సెల్యూట్ కొడుతున్నారని, మిగిలిన వారిని శత్రువులుగా చూస్తున్నారు ఇది సరికాదని మోహన్ అన్నారు. ఫ చంద్రబాబు పాలన ఈవిధంగా ఉంటుందని ఊహించలేదు ఫ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ -
కడియం నర్సరీ అందాలు అద్భుతం
కడియం: నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీ రైతు పుల్లా పెద సత్యనారాయణ మొక్కనిచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నర్సరీ రైతులకు ప్రభుత్వ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పాటిస్తూ నర్సరీలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్ హెచ్ ఓ డైరెక్టర్ బి.గోవిందరాజు, కొవ్వూరు పరిశోధన క్షేత్రం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.లలిత కుమారేశ్వరి, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ వి శివకుమార్, ఏపీఎంఐపి పిడి ఎ. దుర్గేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్. మల్లికార్జునరావు, కడియం ఉద్యాన శాఖ అధికారి పి.లావణ్య పాల్గొన్నారు. జర్మనీ భాషలో ఉచిత శిక్షణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల ఎస్సీ,ఎస్టీ కులాలకు చెందిన నర్సింగ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయి కోసం ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశం కల్పించటానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత శాఖ అధికారి ఎమ్.డి. గవాజుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయసు 35 సంవత్సరములు లోపు ఉండాలన్నారు. బీఎన్ఎం గాని, బీఎస్సీ నర్సింగ్ కోర్సు గాని చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఆగస్టు 6వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక అయిన విద్యార్ధులకు 8 నుంచి 10 నెలల వరకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. శిక్షణ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలలో మాత్రమే ఇస్తారన్నారు. పూర్తి వివరాల కోసం మొబైల్ నంబర్లు: 99488 68862, 83400 94688 లలో సంప్రదించాలన్నారు. రేపు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన నిధుల జమ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అన్నదాత సుఖీ భవ – పీఎం కిసాన్ పథకాల కింద మంజూరైన నిధులను శనివారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జ మ చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 చొప్పున, జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.79 కోట్లు జమ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రూ.2,000 పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా, రూ.5,000 అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.ఆరు వేలు , రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.20,000 లను మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 1,434 ఖాతాల ఎన్పీసీఐతో అనుసంధానం కాలేదని, మరో 1,072 ఖాతాలు అనుసంధానమైనా ‘ఇన్ యాక్టివ్‘గా ఉన్నాయనీ కలెక్టర్ పేర్కొన్నారు. కాల్ సెంటర్: 155251, వాట్సాప్ గవర్నెన్స్ నంబర్: 95523 00003, స్థానిక రైతు సేవా కేంద్రాలలో సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం రాజానగరం: విధులను నిర్వర్తించడంలో అలసత్వం చూపిస్తున్న నందరాడ, నరేంద్రపురం (ఇన్చార్జ్) వీఆర్వోలు ముని తిరుపతి, ఎం.సత్యనారాయణలపై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ తక్షణమే కలెక్టరేట్‌కి అటాచ్ చేయాలని తహాస్లీల్దారు జీఎఎస్‌ఎల్ దేవిని ఆదేశించారు. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకాల అమలు తీరును పర్యవేక్షించడంలో భాగంగా మండలంలోని నందరాడ, నరేంద్రపురంలోని రైతు సేవా కేంద్రాలను గురువారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీ, ఇతర అనుబంధ కార్యక్రమాలను పరిశీలించారు. విధులను నిర్వర్తించడంలో అలక్ష్యంగా వ్యవహరిస్తున్న పై ఇద్దరు వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అలక్ష్యం చూపడం సరికాదన్నారు. -
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రత
– ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశం రాజమహేంద్రవరం రూరల్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిర్దేశిత భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంకు అధికారులు, సెక్యూరిటీఅధికారులతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి పి.పి.టి. ద్వారా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వివరించి సూచనలు చేశారు. బ్యాంకు విధుల్లో నియమించుకునే తాత్కాలిక సిబ్బంది, అవుట్ సోర్సింగ్ భద్రతా సిబ్బందికి ముందుగా పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలన్నారు. ప్రతి బ్యాంకు, ఏటీఎం వద్ద 24 గంటలూ పనిచేసే నైట్ విజన్ ఏఈ సీసీటీవీలను అమర్చుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు కాల్ చేసే సౌకర్యంతో కూడిన భద్రతా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ, ఫైర్ సెక్యూరిటీ పరికరాల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. విడిగా ఉన్న ఏటీఎంలు, బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. బ్యాంకు సిబ్బంది పోలీసు సిబ్బందితో సంబంధాలు ఏర్పరుచుకోవాలని, అత్యవసర సమయాలలో సంప్రదించడానికి వీలుగా పోలీసు అధికారుల కాంటాక్ట్ డీటెయిల్స్ కలిగి ఉండాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సర్వెలెన్స్ రిపోర్టును సంబంధిత స్టేషన్‌కు విధిగా పంపాలన్నారు. బీట్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ, సెక్యూరిటీ గార్డులను, వాచ్మన్లను అలర్ట్ చేయాలని ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ (ఎస్పీ లా అండ్ ఆర్డర్) ఏవీ సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ ( క్రైమ్స్) ఎల్. అర్జున్, డి.ఎస్.పి.(ఎస్బీ) బి.రామకృష్ణ,, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ఆ సీటు యమ హాటు..!
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సీటు హాట్‌కేక్‌గా మారింది. గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. రూ.2 వేల కోట్ల నిధులు పుష్కరాలకు కేటాయించనున్నారు. అభివృద్ధి పనుల్లో సింహభాగం కార్పొరేషన్ కార్యాలయం కేంద్రంగా జరగనున్నాయి. పనులకు సంబంధించి బిల్లుల మంజూరు, వసతుల కల్పన, భక్తులకు సౌకర్యాలు, నిధులు ఖర్చుచేయడం తదితర ప్రక్రియంతా కమిషనర్ కనుసన్నల్లోనే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి కమిషనర్ సీటుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎలాగైనా కుర్చీ దక్కించుకునేందుకు కొందర అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైరవీలు ప్రారంభించారు.. తీరా రంగంలోకి దిగాక.. ‘ఆ సీటు యమ టఫ్’ అని గ్రహించి ప్రయత్నాలు విరమించుంటున్నారు. వెరసి కమిషనర్ నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు తమ అడుగులకు మడుగులొత్తే కమిషనర్‌ను తెచ్చుకుంటే రూ.కోట్ల విలువైన పనులు దక్కించుకోచ్చన్న ఉద్దేశంతో తమకు అనుకూలమైన అధికారిని తెచ్చుకునేందుకు రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఓ కమిషనర్ బలి! రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ నేతల మితిమీరిన రాజకీయ జోక్యానికి ఇప్పటికే ఓ కమిషనర్ బలయ్యారు. తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడవకముందే ఇక్కడ పనిచేయలేనంటూ విశాఖకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారంటే ఏ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం చూపాయన్న విషయం అర్ధమవుతోంది. ఏడాది పాలనలో తనదైన ముద్ర వేసుకున్న బదిలీ అయిన కమిషనర్ కేతన్‌గార్గ్... నగరాన్ని సుందరంగా, అక్రమణలు లేకుండా తీర్చిదిద్దాలని భావించారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించడంలో భేదాల్లేకుండా వ్యవహరించారు. దీనికి ఓ ప్రజాప్రతినిధి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు విమర్శలున్నాయి. ఏదైనా అక్రమ నిర్మాణం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు వెళ్లిన సందర్భంలో వెంటనే ఆ అధికారులకు ఓ ప్రజాప్రతినిధి నుంచి వెంటనే ఫోన్ వచ్చేది. అది తమ వారిదేనని, దాని జోలికి వెళ్లొద్దంటూ హుకుం జారీ చేసేవారు. చేసేది లేక వెనుదిరిగి వచ్చేవారు. ప్రధాన రహదార్ల ఆక్రమణలు తొలగించడంతో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రతి పనినీ స్వయంగా పరిశీలించి నాణ్యత విషయమై కఠినంగా వ్యవహరించే వారు. తను సంతృప్తి చెందితేనే బిల్లులు మంజూరు చేసేవారు. దీంతో ఎలాగైనా కమిషనర్‌ను బదిలీ చేయించాలని కూటమి నేతలు భావిస్తూ వచ్చారు. ప్రజా ప్రతినిధుల వద్ద పైరవీలకు తెర తీశారు. దీంతో విసుగెత్తిపోయిన కమిషనర్ తాను ఇక్కడ ప్రశాంతంగా పనిచేయలేనని భావించి స్వయంగా బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నం కార్పొరేషన్‌కు బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్ ప్రశాంతికి కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. బదిలీ అయి నెల కావస్తున్నా.. నేటీకీ పూర్తి స్థాయి కమిషనర్ నియామకం జరగలేదు. మితిమీరుతున్న రాజకీయ జోక్యం? రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ జోక్యం మితిమీరుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో మున్సిపల్ పాలన సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన అనుమతి లేనిదే చీమకూడా కదలకూడదన్న ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా తన వ్యక్తిగత సహాయకుణ్ణి ఉంచి మరీ పాలన సాగిస్తున్నట్లు సమాచారం. నగరంలో ఎన్ని అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారు? అందులో ఎన్ని కమర్షియల్.. ఎన్ని నాన్ కమర్షియల్..? అన్న లెక్కలు తీస్తున్నారు. కమర్షియల్ భవన యజమానుల జాబితా తీసుకుని వారిని సంప్రదించి తమకేంటంటూ..? టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామం మున్సిపల్ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. మున్సిపల్ అధికారులకు ప్రధాన ఆదాయ వనరు భవన నిర్మాణాల అనుమతులు. వాటిలో సైతం రాజకీయ జోక్యంతో అధికారులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. తమకు అందే ఆదాయాన్ని అడ్డుకుంటే తమ ప్రొటోకాల్ ఖర్చులు ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటున్న అధికారులు కమిషనర్‌గా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. పుష్కరాలు వస్తున్నాయి.. రూ.కోట్ల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉన్నా.. రాజకీయ నేతల జోక్యం తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉండటంతో వెనకడుగు వేస్తున్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌కు చెందిన విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఇరు వర్గాలపై సీఎం చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2027లో జరిగే పుష్కర పనుల్లో సైతం వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ కార్యకర్తలకు పనులు ఇవ్వాలంటూ ఇద్దరూ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య తాము నలిగిపోవడం ఎందుకులే..? అన్న అభిప్రాయంతో కమిషనర్‌గా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాట్‌కేక్‌గా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ స్థానం స్థానిక రాజకీయ పరిస్థితులు, పైరవీకారులతో వచ్చేందుకు హడలెత్తిపోతున్న అధికారులు తొలుత బాధ్యతలు చేపట్టేందుకు సుముఖం ఆపై ఎలా ఉంటుందో ఆరా తీశాక వెనకడుగు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేమన్న అసహనం ఇప్పటికే కమిషనర్‌గా పనిచేసిన కేతన్‌గార్గ్ విశాఖకు బదిలీ చేయించుకొని వెళ్లిన వైనం ఆయన స్థానంలోకి నలుగురు పోటీ.. ఆపై ఆగిన ప్రయత్నాలు ఇన్చార్జ్ కమిషనర్‌గా కలెక్టర్‌కు బాధ్యతలుపోటీ తీవ్రం.. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కుర్చీ కోసం నలుగురు అధికారులు పోటీ పడినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ అధికారి నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. సదరు అధికారి మంత్రి లోకేష్‌కు అత్యంత ఆప్తుడని ఇక నియామక ఉత్తర్వులు రావడమే తరువాయి అన్న విధంగా ప్రచారం సాగింది. ఇక్కడి అధికార పార్టీ నేతలు ఆయన తమకు వద్దని చెప్పడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగింది. అనంతరం రాజమండ్రిలో సబ్కల్టెర్గా విధులు నిర్వర్తించిన మరో అధికారిణి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా నెల్లూరులో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి పేరు విపరీతంగా చర్చకు వచ్చింది. ఇక రేపో మాపో నియామక ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉందనే సమాచారం అందింది. ఆ అధికారి వస్తే తమ పంట పండినట్లేనని అధికార పార్టీ నేతలు అనుకున్నారు. ఆ అధికారి సైతం రాజమహేంద్రవరం అనగానే ఓకే అనేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో.. సదరు అధికారి ఇక్కడకు వచ్చేందుకు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం
అమలాపురం టౌన్: ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు మద్దాల బాపూజీ అన్నారు. అమలాపురంలోని గొల్లగూడెంలో జిల్లా ప్రభుత్వ సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఎరియర్స్, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు.. ఇలా పలు రూపాల్లో రూ.వేల కోట్లలో ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. జిల్లాలో ఈ నెల 5 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ బకాయిలపై గణాంకాలతో వివరించే వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు పలు ఎరియర్స్ కింద ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్ల వరకూ బకాయిలు ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు వారి బాధ్యతలు తెలియజేసి, వారిని పోరాటంలో కార్యోణ్ముఖులను చేసేందుకు ‘ఉద్యోగులారా... రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరుతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎరెండ్స్ లీవులు బకాయిలు చెల్లించలేదని, పీఆర్సీ కమిటీ నియమించలేదని, నాలుగు డీఏలు నేటికీ ఇవ్వలేదన్నారు. ప్రతి ఉద్యోగికి ఎంత చెల్లించాలో ప్రభుత్వం నిర్ధారించాలని, బకాయిలు ఎంత ఇవ్వాలో ఉద్యోగి రిజిస్టర్ (ఎస్ఆర్)లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పలు ఎరియర్స్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో లిఖిత పూర్వకంగా రాసి ష్యూరిటీ బాండ్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ కె.వీరబాబు, జిల్లా కార్యదర్శి కె.మల్లిబాబు, ఉపాధ్యక్షుడు సీహెచ్ విజయ్‌కుమార్, కోశాధికారి జేఏ రాజ్‌కుమార్, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, మండపేట ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి శాఖల వారీగా సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాపూజీ -
బదిలీ భారం
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పనిచేస్తున్న 220 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రస్తుతం బదిలీల బాధలు, దూరాభారాలతో సతమతమవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల కిందట వీరికి ఎంటీఎస్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత ఏడాదికి జరిగిన బదిలీల ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలోని దగ్గర మండలాల్లో ఉన్న పాఠశాలల్లోనే పోస్టులు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గత జూన్ నెలలో జరిగిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల్లో అనేక లోపాలతో వీరిని 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించారు. 220 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో దాదాపు 75 మందిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీలు చేయడమే కాకుండా వారికి ప్రధానోపాధ్యాయ బాధ్యతలు అప్పగించారు. యాప్‌ల భారం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ఏడాదిలో 11 నెలల పాటు, అదీ నెలకు రూ.32,470 మాత్రమే జీతం వస్తుంది. మే నెలలో వీరికి జీతం ఉండదు. కూటమి ప్రభుత్వం ఈ ఎంటీఎస్ ఉపాధ్యాయులను 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాఠశాలకు బదిలీ చేసి, వారిలో కొందరికి ప్రధానోపాధ్యాయ బాధ్యతలు అప్పగించింది. వారిపై యాప్‌ల భారాన్ని బలవంతంగా మోపింది. గత ప్రభుత్వంలో ఈ తరహ ఉపాధ్యాయులను కేవలం సపోర్టింగ్ టీచర్లగానే భావించి, వారిని సమీప మండలాలకు బదిలీ చేసింది. గత జూన్ 23న కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయం వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. కేవలం బదిలీల్లో లోపాలతో తమను బలవంతంగా దూరంగా నియమిస్తున్నారని, కొందరికి ఏకోపాధ్యాయ పాఠశాలలకు హెచ్ఎంలను చేసి యాప్‌ల బాధ్యతలు అప్పగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధ బదిలీలు! ఉన్నతాధికారులు తమను నిర్బంధంగా బదిలీలు చేశారన్న ఆవేదన, ఆందోళన ఎంటీఎస్ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతోంది. ఉదాహరణకు తుని నుంచి ముమ్మిడివరానికి, సామర్లకోట నుంచి ఐ.పోలవరం మండలానికి, రాజమహేంద్రవరం నుంచి అడ్డతీగలకు ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేశారు. అసలే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, బదిలీల భారం ఒక ఎత్తు అయితే హెచ్ఎంగా బాధ్యతలు అప్పగించి యాప్‌ల భారాన్ని మోపడం మరో ఎత్తు. దీని ప్రభావం విద్యాబోధనపై తీవ్రంగా పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దూరాభార బదిలీల వల్ల అనారోగ్య ఉపాధ్యాయులు, దివ్యాంగులు, మహిళలు చాలా అవస్థలకు గురవుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నెలకు ఇచ్చే జీతం రూ.32,470తో అంత దూరం వెళ్లి ఎలా పనిచేయగలరని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా సగం జీతం రవాణా ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆవేదన ఏకోపాధ్యాయ పాఠశాలలకు హెచ్ఎంలుగా నియామకం దూర ప్రాంతాలకు బదిలీ యాప్‌లతో ఇబ్బంది కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా చాలీ చాలనీ జీతాలతో బతుకుతున్న మమ్మల్ని వంద కిలోమీటర్లకు పైబడి దూరంలో ఉన్న పాఠశాలలకు బదిలీలు చేయడం అన్యాయం. మాలో కొందరిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీలు చేసి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించారు. యాప్‌ల భారం పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. మాలో కొందరు ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. ఈ సమయంలో అంత దూరం బదిలీలు, ప్రధానోపాధ్యాయుడి బాధ్యతులు, యాప్‌ల భారం సరైన విధానాలు కాదు. మేము చేసిన అభ్యర్థనలు, నిరసనలను విద్యాశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. – ఎ.బాల గోపాలరావు, ఎంటీఎస్ ఉపాధ్యాయుడు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
విద్యార్థి దశ నుంచే క్రీడాసక్తి పెంచుకోవాలి
పెద్దాపురం: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడాసక్తి పెంపొందించుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ ఈడీ మట్టే ఆది శంకర్, ప్రముఖ డెర్మాలజిస్ట్ డాక్టర్ మట్టే స్రవంతి అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడా నైపుణ్యం ఎంతో అవసరమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పాండిచ్చేరికి చెందిన 458 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలు వీరే మూడు రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో 101 లీగ్ మ్యాచులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, పీఈటి సత్యనారాయణ తెలిపారు. అండర్–14 బాలికల విభాగంలో ఖమ్మం క్లస్టర్, అండర్–17 విభాగంలో పిమోగా క్లస్టర్, అండర్–19 విభాగంలో కృష్ణ క్లస్టర్ విజేతలుగా నిలిచాయన్నారు. అండర్–14 బాలుర విభాగంలో బీదర్ క్లస్టర్, అండర్–17 విభాగంలో కడప క్లస్టర్, అండర్–19 విభాగంలో పిమోగా క్లస్టర్ విజయం సాధించాయని తెలిపారు. రీజినల్ మీట్లో ఆల్‌రౌండ్ ఛాంపియన్‌గా పిమోగా క్లస్టర్ (కేరళలో కొన్ని జిల్లాలు), కర్ణాటకలో కొన్ని జిల్లాలు కలిసి ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాయన్నారు. పారిశ్రామిక వేత్త మట్టే ఆదిశంకర్ జేఎన్వీలో ముగిసిన కబడ్డీ మీట్ -
అదుపు తప్పి బస్సును ఢీకొన్న కారు
తాళ్లరేవు: అమలాపురం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓ కారును ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన మందపాటి శ్రీరామరాజు, సుభద్రమ్మ (67) దంపతులు ఐ.పోలవరం మండలం పెదమడి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. జాతీయ రహదారి 216లోని కోరంగి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో వారి కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న అమలాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సుభద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శ్రీరామరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయాణికులను వేరే బస్సులో వారి స్వస్థలాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాకినాడ–యానాం రహదారిలో గత వారం రోజుల్లో జరిగిన మూడు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కారులోని మహిళ మృతి కోరంగి వద్ద విషాదం -
మేమంటే ఎందుకు అంత వివక్ష?
● అభివృద్ధి పనులన్నీ జనసేన సభ్యుల వార్డులకే కేటాయిస్తారా? ● మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు నిడదవోలు : పురపాలక సంఘంలో జనసేన పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి తమ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వారు బహిష్కరించారు. 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వార్డుల్లో ఒక్క పనిని కూడా అజెండాలో చేర్చకపోవడంతో నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పురపాలక సంఘంలో జనసేనకు చెందిన 14 మంది కౌన్సిలర్ల వార్డుల్లో 16 పనులకు గాను మున్సిపల్ సాధారణ నిధులు రూ.78 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణానికి అంచనాలు తయారు చేసి అజెండాకు తీసుకువచ్చారన్నారు. పురపాలక సంఘంలో ఉన్న 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వార్డులో మాత్రం ఒక్క పని కూడా కేటాయించకుండా చైర్మన్ ఆదినారాయణ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులమని, మా వైఎస్సార్ సీపీ సభ్యుల వార్డుల్లో పనులు కేటాయించడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వివక్ష మేమున్నడూ చూడలేదన్నారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సమాధానమిస్తూ అత్యవసర పనులు కొన్ని వార్డులకు కేటాయించామన్నారు. త్వరలో పట్టణానికి ఎల్ఆర్ఎస్ నిధులు రూ.2 కోట్లు మంజూరు కాగానే అన్ని వార్డులకు అభివృద్ధి పనులు కేటాయిస్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు, 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. -
బియ్యం పంపిణీలో కూటమి నేతల కుమ్ములాట
కొత్తపల్లి: మత్సకారులకు బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో కూటమి నాయకులు కుమ్ములాడుకున్నారు. టీడీపీ, జనసేన నాయకులు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగారు. ఉప్పాడ సచివాలయం వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. వాతావరణంలో మార్పుల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతంలో ఇటీవల సముద్రం అలలు ఎగసి పడి గ్రామంలోకి నీరు చేరింది. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలోని మత్స్యకారులకు బియ్యం పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు గురువారం ఉప్పాడ గ్రామ సచివాలయం వద్ద తహసీల్దార్ చిన్నారావు ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి పిఠాపురం నియోజవర్గ జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే బియ్యం పంపిణీపై తమకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం ఏమిటంటూ టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కనీసం అధికారులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులకే చెప్పడమేమిటంటూ ప్రశ్నించారు. దీంతో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. మర్రెడ్డి శ్రీనివాస్ ఎదురుగానే కాలర్లు పట్టుకుని తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి, సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తమకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి, ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారంటూ మత్సకారులు మండిపడ్డారు. వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. టీడీపీ, జనసేన నాయకుల వాగ్వాదం ఉప్పాడ సచివాలయం వద్ద ఘటన పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం -
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అవగాహన
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం పరిధిలోని ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలలో పదోన్నతి పొందిన ఎంపీడీఓల శిక్షణ కొనసాగుతోంది. గత నెల 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 26 వరకూ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. చనిపొయిన వారితో పాటు గ్రామాన్ని విడిచి వెళ్లిన వారిని గుర్తించి తగిన ఆధారాలతో వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. దివ్యాంగులు పోలింగ్ బూత్‌లలోకి వచ్చేలా ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. 650 మంది ఓటర్లు మించిన సమయంలో మాత్రమే రెండవ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. -
రత్నగిరి విశ్రాంత ఈఓ పెన్షన్‌లో 25 శాతం కోత
● 1998–99లో అక్రమ కొనుగోళ్లపై అభియోగాలు ● విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించిన ఏసీబీ ● ట్రిబ్యునల్ తీర్పుతో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయంలో గతంలో ఈఓగా పని చేసిన ఎన్.సోమశేఖర్ అవినీతికి పాల్పడినట్టు వచ్చిన అభియోగాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ఆయన పెన్షన్‌లో 25 శాతం కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వి.వినయ్‌చంద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 1998–99 కాలంలో ఆయన ఈఓగా ఉన్న కాలంలో టెండర్ పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా సత్యదేవుని వెండి స్టాండ్లు, క్యాలెండర్లు, గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసినట్టు, మరో 17 అంశాలలో అవినీతికి పాల్పడినట్టు ఆయనపై, మరో 53 మంది సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి ఆయన చర్యల వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని, ఆయనపై చర్య తీసుకోవాలని 2018లో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ట్రిబ్యునల్ షోకాజ్ నోటీసు జారీ చేస్తూ ఆయన పెన్షన్‌లో 25 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలపై సోమశేఖర్ బదులిస్తూ దేవస్థానంలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న విధానం మేరకే తాను వాటిని కొనుగోలు చేశానని, వాటిని దేవదాయశాఖ కమిషనర్ సైతం ఆమోదించారని పేర్కొన్నారు. ఆ చర్యల వల్ల ఆలయానికి ఆర్థిక నష్టం జరగలేదని పేర్కొన్నారు. తాను 2013లో పదవీ విరమణ చేశానని, ఈ అభియోగాల వల్ల తన పెన్షన్ ప్రయోజనాలు అందడం లేదని, తనపై అభియోగాలు తొలగించి పూర్తి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పెన్షన్‌లో 25 శాతం కోత విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ అభియోగాలపై జరిగిన విచారణలో 31 మందికి క్లీన్చిట్ ఇవ్వగా, 22 మందిపై విచారణ కొనసాగుతున్నట్లు ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. -
వనదుర్గమ్మకు త్వరలో ఖడ్గమాల పూజ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో వన సంరక్షురాలిగా, రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో మరో పూజను ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో నిర్వహిస్తున్న చండీహోమం, ప్రతి పౌర్ణమి, అమావాస్యకు నిర్వహిస్తున్న ప్రత్యంగిర హోమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రతి శుక్రవారం ఖడ్గమాల పూజ ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ జరిగే ఈ పూజలో పాల్గొనడానికి టిక్కెట్ ధరను రూ.1.116గా నిర్ణయించారు. విజయవాడలో మాదిరిగానే.. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వనదుర్గ ఆలయ అర్చకుడు అమ్మవారికి ఈ పూజ నిర్వహిస్తారు. భార్యాభర్తలు అమ్మవారికి ఎదురుగా కూర్చుని అర్చకుడు చెప్పిన సూచనల ప్రకారం మంత్రాలు చదువుతూ శ్రీచక్రంపై పసుపు, కుంకుమ, ఇతర ద్రవ్యాలతో ఈ పూజ చేస్తారు. అనంతరం దంపతులకు అమ్మవారి కుంకుమ, రాగి ప్రతిమ, కండువా, రవికల వస్త్రం, 250 గ్రాముల పులిహోర ప్రసాదం అందజేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే ఖడ్గమాల పూజ మాదిరిగానే ఇక్కడ కూడా జరుగుతుంది. కాగా.. ఖడ్గమాల పూజపై సలహాలు, సూచనలు ఇవ్వాలని భక్తులు, గ్రామస్తులను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు ఈ నంబర్లకు (98484 81536, 98493 63217, 94907 12066)కు తెలియజేయాలని కోరారు. అలాగే కార్యనిర్వాహణాధికారి, వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం, శంఖవరం మండలం, కాకినాడ జిల్లా చిరునామాకు, e ndow-eoanna@gov.inకు మెయిల్ ద్వారా సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. ప్రతి శుక్రవారం నిర్వహించేందుకు దేవస్థానం సన్నాహాలు టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయం భక్తుల సలహాలు కోరిన అన్నవరం ఈవో -
పవిత్ర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పవిత్ర క్షేత్ర సందర్శనలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టినట్టు ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్, టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. యాత్ర సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం అవుతుందన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు. ఈ యాత్ర పదిహేను రోజులు సాగుతుందన్నారు. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ ‘టూర్ టైమ్స్’ ఈ యాత్రకు నడుం బిగించిందన్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిద్ధపూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి, గయ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శించుకునే వీలుంటుందన్నారు. గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకి విశేష స్పందన లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ యాత్రలో ఉన్న క్షేత్రాలు ఎంతో పేరుగాంచాయన్నారు. ఈ రైలు లోపల, బయట దక్షిణ భారత భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. లగేజీ భారం ఉండదన్నారు. దర్శనానికి అవసరమైన బ్యాగ్ మాత్రమే మోయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే 33 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. అనంతరం యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ యాత్ర టికెట్లను 93550 21516 నంబర్‌కు ఫోన్‌చేసి బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో టూర్ టైమ్స్ మేనేజర్ యాకేశ్ పాల్గొన్నారు. -
ఫార్మా – అకడమిక్లతో స్థిరమైన అభివృద్ధి
రాజానగరం: ఔషధ పరిశ్రమ ఆవిష్కరణలపై అభివృద్ధి చెందుతుందని, పరిశోధన సామాజిక అవసరాలను తీర్చినప్పుడు విద్యారంగం ఔచిత్యాన్ని పొందుతుందని, ఫార్మా – అకడమిక్ ఈ రెండు స్థిరమైన అభివృద్ధికి అవసరమని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ‘ఫార్మా – అకడమిక్ సినర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ అనే అంశంపై గురువారం వర్సిటీలో ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ జరిగింది. స్థిరమైన ఆవిష్కరణలను పెంపొందించడానికి ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, విద్యా పరిశోధన కలిసే అత్యాధునిక అవకాశాలు, సహకార మార్గాలను కనుగొనవచ్చన్నారు. ఇటువంటి వర్క్‌షాప్‌లను అంతరాలను తగ్గించడం, అర్థవంతమైన సంభాషణ లక్ష్యంగా నిర్వహించాలన్నారు. అమెరికా నుంచి ఫార్మాస్యూటికల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి ఆన్లైన్లో ‘ఫార్మా అకడమిక్ సినర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సదస్సుకు కన్వీనర్‌గా డాక్టర్ బి. జగన్మోహన్రెడ్డి, కోకన్వీనర్‌గా డాక్టర్ కె.దీప్తి వ్యవహరించారు. -
బాలికల హాకీ పోటీలకు సర్వం సిద్ధం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడలోని డీఎస్ఏ మైదానంలో జాతీయస్థాయి జూనియర్ బాలికల హాకీ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యియి. మైదానంలోని హాకీ టర్ఫ్‌పై శుక్రవారం నుంచి ఈ నెల పదో వరకూ ఈ పోటీలు జరుగుతాయి. 2022లో బాలికల విభాగంలో జూనియర్ నేషనల్ పోటీలను ఇక్కడ నిర్వహించారు. 2023లో సీనియర్ నేషనల్స్ బాలికల విభాగంలో జరిగాయి. ఇప్పుడు మూడోసారి జూనియర్ బాలికల జాతీయ స్థాయి హాకీ పోటీలకు రంగం సిద్ధమైంది. సుమారు రూ.20 లక్షల బడ్జెట్‌తో వీటిని నిర్వహిస్తున్నారు. 29 రాష్ట్రాల క్రీడాకారుల రాక ఈ పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన 522 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారితో పాటు 58 మంది కోచ్‌లు, మేనేజర్లు, స్థానిక అఫీషియల్స్‌తో కలిపి సుమారు 660 మంది హాజరవుతున్నారు. పోటీల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడిగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్య రాజ్, నిర్వహణ కార్యదర్శిగా జి.హర్షవర్ధన్, సంయుక్త నిర్వహణ కార్యదర్శిగా కాకినాడ జిల్లాకు చెందిన వి.రవిరాజు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ స్వీయ పర్యవేక్షణలో జేసీ రాహుల్ కుమార్.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. పూల్– ఎలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, పూల్ –బిలో మధ్యప్రదేశ్, పంజాబ్, చంఢీఘడ్, పూల్ –సిలో హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్, పూల్ –డిలో ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నేటి నుంచి పదో తేదీ వరకూ నిర్వహణ కాకినాడ డీఎస్ఏ మైదానంలోపూర్తయిన ఏర్పాట్లు -
అన్నవరం ఈఈకిఅదనపు బాధ్యతలు
అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) వి.రామకృష్ణకు సింహాచలం దేవస్థానం ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత మే నెలలో సింహాచలం దేవస్థానంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనలో అక్కడ ఈవోతో పాటు ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈఈ స్థానంలో అన్నవరం దేవస్థానం ఈఈ రామకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపై రెండు దేవస్థానాలలో ఆయన సేవలు అందిస్తారు. యువకుడిపై పోక్సో కేసు అల్లవరం: బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలంలోని టిడ్కో భవనాల్లో నివాసం ఉంటున్న బాలికను అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన నవుండ్రు రాకేష్ ప్రేమిస్తున్నానని వెంటపట్టాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని అడగ్గా నిరాకరించడంతో ఆ బాలిక అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై సంపత్ కుమార్ కేసు నమోదు చేశారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య రాజమహేంద్రవరం రూరల్: మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. హుకుంపేట డి బ్లాక్ రామాలయం వీధి తూర్పుపేటకు చెందిన బత్తిన అప్పాయమ్మ (42) కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు దోసకాయలపల్లికి చెందిన దుర్గారావు సంఘటనా స్థలానికి చేరుకుని అప్పాయమ్మను రాజమహేంద్రవరంప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దుర్గారావు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కె.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసీడీఎస్ పీడీగా లక్ష్మి
కాకినాడ క్రైం: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి(ఐసీడీఎస్ పీడీ)గా చెరుకూరి లక్ష్మి గురువారం కాకినాడ గాంధీనగర్‌లోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజానగరం సీడీపీవోగా పనిచేస్తూ రాజమహేంద్రవరం ఇన్చార్జి పీడీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న ఆమెకు తాజాగా పదోన్నతి లభించింది. ప్రభుత్వం ఆమెను కాకినాడ జిల్లా ఐసీడీఎస్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీడీ లక్ష్మిని మిషన్ వాత్సల్య డీసీపీవో వెంకట్ ఆధ్వర్యంలో బృందం కలిసి అభినందనలు తెలిపింది. అనంతరం శాఖ సిబ్బందితో పీడీ సమీక్ష నిర్వహించారు. -
ఫ్రీ జర్నీకి ప్రీ జర్క్‌లు!
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు సన్నద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఈ హామీ అమలుకు కాలయాపన చేస్తూనే వచ్చింది. సూపర్‌సిక్స్ అమలుపై ఎప్పటికప్పుడు వైఎస్సార్ సీపీ నిలదీస్తుండటంతో చేసేది లేక అమలుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే అంశం గుర్తుకొచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ మంత్రులు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అమలుపై పూర్తి స్థాయిలో స్పష్టత కరవైంది. జిల్లాలో ఇప్పటికే బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాటు 25 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాలకు సైతం సౌకర్యం ఉండటం లేదు. దీనికితోడు జిల్లా పరిధిలోనే ప్రయాణానికి అనుమతులు ఇస్తారా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా?. అన్న విషయమై మీమాంస నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు వెలువరిస్తామన్న ప్రభుత్వం, అధికారులు నేటికీ విడుదల చేయకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.జిల్లాలో మాత్రమే?ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కేవలం జిల్లాకు పరిమితం చేస్తారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం విభజిత జిల్లా పరిధిలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. జిల్లా దాటితే టిక్కెట్ తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ఒక మహిళ రోజుకు ఒకసారి మాత్రమే ప్రయాణించేలా నిబంధనలు తీసుకురానున్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తుంటే పథకం అమలులో ఆంక్షలు పెడతారన్న విషయం తేటతెల్లం అవుతోంది. మరోవైపు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగులో ఉచిత ప్రయాణానికి వీలుంటుందన్న మరో వాదన వినిపిస్తోంది.ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు కట్ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు బస్సులను నిలుపుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే 25 మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు నడవడం లేదు. ఉన్న పల్లె వెలుగు సర్వీసులు ఉచిత స్కీమ్‌కు వినియోగిస్తే జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తగ్గుతాయని భావిస్తున్నారు.కొన్ని బస్సుల్లోనే ఉచితంఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ హామీ ఇచ్చారు. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో సర్వీసులు, టౌన్ సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు.రాష్ట్రమంతా అన్నారు..సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న తలంపుతో కూటమి నేతలు ప్రతి ఇంటికీ తిరిగారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నారు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా బస్సుల్లో మాత్రమే ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. దీనిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా పల్లెవెలుగు, ఆల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే ఉచితమని చెప్పలేదు. తీరా అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు కుతంత్రం బహిర్గతమైందని మహిళలు ఆరోపిస్తున్నారు. చిరు వ్యాపారులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థినులు పట్టణాలకు వెళ్లాలంటే ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ప్రయాణ సదుపాయం ఇవ్వకపోతే ఉపయోగమేంటన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. ఇప్పుడున్న ఒకటి, అర పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించడం కష్టమని పెదవి విరుస్తున్నారు.రద్దీ ఇలా..సగటున తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మరో 10 నుంచి 20 శాతం మంది అధికంగా ప్రయాణించే అవకాశముందని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి నివేదికలను ఇప్పటికే పంపారు. అయితే ఆ దిశగా బస్సుల సంఖ్య పెంచకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.కండీషన్ అంతంతమాత్రంగ్రామీణ జనాభా అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ సేవలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. డిపోలలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న బస్సుల్లో చాలా వరకు కండీషన్లో లేవు. డ్రైవర్, కండక్టర్ల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదన్న విమర్శలున్నాయి.25 గ్రామాలకు చేరని బస్సుతూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 25 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రాజమహేంద్రవరం డిపో పరిధిలో 12, గోకవరం పరిధిలో 4, కొవ్వూరు 8, నిడదవోలు డిపో పరిధిలో 5 గ్రామాలకు బస్సు వెళ్లడం లేదు. ఆర్టీసీ బస్సు లేని గ్రామాల ప్రజల ఆటోలపై ఆధారపడుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంతో ఆటోలలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారు. లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే ఈ పథకం అమలుకు పరిమితం అయినట్టు అనుకోవాలి.10 లక్షల మందికి 283 బస్సులుతూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల పరిధిలో మొత్తం 283 బస్సులు ఉన్నాయి. అందులో పల్లెవెలుగు 167, ఆల్ట్రా 67, ఎక్స్‌ప్రెస్ 37 బస్సులు, 12 ఏసీ బస్సులు. ఇవి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో బస్సులు తక్కువగా ఉండటం, రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆర్టీసీ సర్వీసులపై ఏడాదిగా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణమంటే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 18,32,332 ఉండగా.. అందులో పురుషులు 9,11,520 ఉన్నారు. సీ్త్రలు అత్యధికంగా 9,20,812 మంది ఉన్నారు. ప్రసుత్తం ఈ సంఖ్య మరింతగా పెరిగి 10 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇంతమంది మహిళలున్న జిల్లాలో కేవలం 283 బస్సులకు మాత్రమే సదుపాయం కల్పించడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.జిల్లాలో బస్సుల వివరాలు ఇలా...డిపో పల్లె ఆల్ట్రా ఎక్స్ప్రెస్వెలుగు డీలక్స్రాజమహేంద్రవరం 64 15 22గోకవరం 30 12 14కొవ్వూరు 42 0 1నిడదవోలు 31 0 0ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణంజిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణాలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో 30,000 మందికి పైగా మహిళలు ఉంటున్నారు. వీళ్లందరికీ బస్సులు ఏర్పాటు చేయడంపై అధికారుల్లో ఆందోళన నెలకొంది. నేటికీ స్పష్టమైన విధి, విధానాలు వెలువరించకపోవడంతో పథకం అమలుపై గందరగోళం నెలకొంది. -
స్వేచ్ఛగా మాట్లాడనివ్వరా..?
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ మిథున్‌రెడ్డితో ములాఖత్‌లో సైతం స్వేచ్ఛగా మాట్లాడనివ్వడం లేదు. ములాఖత్‌లో మా పక్కనే పోలీసులు ఉంటున్నారు. కనీసం ప్రశాంతంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కేసులో అక్రమ అరెస్టుకు గురై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ద్వారకనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. న్యాయ స్థానం ఆదేశాలిచ్చినా.. ఆర్డర్ ఇచ్చినా అన్ని విషయాల్లో పోలీసులు వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులను టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హితవు పలికారు. ‘పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. చంద్రబాబు ఆయన కొడుకులా మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండే వాళ్లం. మాపై కక్ష సాధించే వాళ్లను కచ్చితంగా భగవంతుడు చూస్తాడు. ఇలాంటి కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. చార్జ్ షీట్లో కూడా మిథున్‌రెడ్డి పేరు లేదు. అయినా అరెస్టు చేశారు. చంద్రబాబు కంటే ముందు నుంచి మా కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీడియా ఎన్నో కథలు చెప్పింది. మిథున్‌రెడ్డిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పలేకపోతున్నారు. సాధారణ వ్యక్తులు సైతం జైల్లో ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మేము వెళ్లినప్పుడు మాత్రం నలుగురు పోలీసులు ఉంటున్నారు. వసతులపై కోర్టు ఉత్తర్వులిచ్చినా తమకు అందలేదంటూ ఇబ్బందులు పెడుతున్నారు. అరెస్టు చేసేందుకు ఒక్క ఆధారం దొరకలేదు. ఏదో ఒక కేసు పెట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.’ అని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల కష్టాలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం పాలన సాగిస్తోంది. నియంత పోకడ అమలవుతోందని మండిపడ్డారు. అధికారంతో అణచి వేస్తామనే ధోరణి ప్రభుత్వంలో కనిపించడం దారుణమన్నారు. నియంతృత్వ పోకడలతోనే మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు. ములాఖత్‌లో సైతం పోలీసులు పక్కనే ఉంటున్నారు టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్లు చూస్తున్నారు మా కుటుంబంపై ఎందుకింత కక్ష? ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డితో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ములాఖత్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 24,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పలువురు నియామకం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు తూర్పుగోదావరి జిల్లా పార్టీ కమిటీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా కడియాల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాసి వెంకటరావు, ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా ముప్పన శ్రీనివాస్, లక్కోజు ఓంకార్, యాక్టివిటీ సెక్రటరీలుగా తమ్మిశెట్టి శివప్రసాద్, దామదాసు శ్యాంసుందర్, ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా రొక్కం త్రినాథ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అందరికీ గృహం’ కార్యక్రమం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాల లక్ష్యంలో దిగువ స్ధానంలో ఉన్న ఐదు మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీతానగరం, నల్లజర్ల, దేవరపల్లి, రాజానగరం, కడియం మండలాల పరిధిలో అదనపు ఆర్థిక సహాయం పొందిన 704 మంది లబ్ధిదారుల్లో150 ఇళ్లు మాత్రమే రూఫ్ లెవెల్ దశను చేరుకున్నాయని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ
జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.చంద్రమౌళీశ్వరి విచారణ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలో ఏడు గురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం, వారికి ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా జడ్జి విచారణకు వచ్చి అస్వస్థతకు గురయినవిద్యార్థినులతోను, వైద్యం అందించిన డాక్టర్లతోనూ, విద్యార్థినులు తల్లిదండ్రు లతో ఆరోజు జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించాలని ఆమె మండల విద్యాశాఖాధికారికి సూచించారు. -
సహనానికి పరీక్ష
రాయవరం: పదో తరగతి అనేది విద్యార్థులకు అత్యంత కీలకమైన దశ. ఇక్కడ సాధించిన మార్కులే వారి ఉన్నత చదువులకు, మంచి ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడతాయి. పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో రాసుకోవచ్చా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే కొందరు విద్యార్థులకు ఇంగ్లిషులో రాయాలంటే బెరకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునే అవకాశాన్ని ఇస్తే బాగుంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. రెండు నెలలైనా.. నూతన విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇప్పటికి దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తోంది. అలాగే విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పుడు పది పరీక్షలు ఇంగ్లిషు మీడియంతో పాటు, తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తారా, లేదా అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా, తల్లిదండ్రులకు వచ్చిన ఈ ప్రశ్నకు సమాధానం కరవవుతోంది. గత విద్యా సంవత్సరంలో జరిగిన పది పబ్లిక్ పరీక్షల్లో తెలుగులో రాసుకునే వెసులుబాటును ప్రభుత్వ పరీక్షల విభాగం కల్పించింది. ఈ విధంగా గత విద్యా సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 211 మంది రెగ్యులర్ విద్యార్థులు, 15 మంది ప్రైవేటు విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. వీడని ఉత్కంఠ ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా పది పరీక్షలను తెలుగు మీడియంలో రాసుకునే వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాఠ్య పుస్తకాలను బైలింగ్విల్ విధానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బోధన రెండు భాషల్లోనూ వివరిస్తుండగా, పరీక్షలు మాత్రం ఇంగ్లిషు మీడియంలోనే రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థితిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తెలుగు మీడియంలో పరీక్షలకు అవకాశం కల్పిస్తారా, లేదా అనే ప్రశ్న వేధిస్తోంది. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులు ఈ విషయమై ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. జిల్లాల వారీగా.. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 19,850 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అక్టోబర్ చివరి వారంలో పరీక్ష ఫీజు కట్టించుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఈ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉంటుంది. వీటిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 12,923 మంది విద్యాభ్యాసం చేస్తుండగా, 6,927 మంది విద్యార్థులు ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 26,898 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 13,600 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 13,298 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 30,441 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో 18,463 మంది, ప్రైవేటు స్కూళ్లలో 11,978 మంది చదువుతున్నారు. స్పష్టత ఇస్తారా..గతేడాది చివరి క్షణంలో తెలుగు మీడియంలో పరీక్షలు రాసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గతంలో మాదిరిగా చివరి క్షణాల్లో చెప్పకుండా ముందుగానే స్పష్టత ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువస్తుండడంతో ఏమి చెప్పాలో వారికి కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ విషయంలో స్పష్టత ఇచ్చి ఉత్కంఠకు ముగింపు పలకాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పదో తరగతి విద్యార్థుల అయోమయం తెలుగు మీడియంలో పరీక్ష రాసే విషయంపై స్పష్టత కరవు గతేడాది అవకాశం ఈసారి ఇస్తారో, లేదో?రెండు మాధ్యమాల్లో అవకాశమివ్వాలి పదో తరగతి విద్యార్థులు తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో పబ్లిక్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశమివ్వాలి. ఇంగ్లిషు మీడియంలో రాయడానికి కొందరు విద్యార్థులు భయపడుతున్నారు. వారి ఇష్టానికి ప్రాధాన్యమివ్వాలి. – పి.సురేంద్రకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉత్తర్వులు రావాలి గత విద్యా సంవత్సరం మాదిరిగా రెండు మీడియాల్లో పదో తరగతి పరీక్షలు రాసుకునే వెసులుబాటుపై ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఉత్తర్వులు రావాలి. అవి వస్తేనే విద్యార్థులకు ఆ అవకాశం ఉంటుంది. – బి.హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముందుగానే ప్రకటించాలి ఆగస్టులో సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందుగానే పది పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించాలి. తెలుగు, ఇంగ్లీషు మీడియంలో విద్యార్థులుపరీక్షలు రాసుకునేలా అవకాశమివ్వాలి. – ఎస్ఎస్ పల్లంరాజు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
వానపల్లిలో క్షుద్ర పూజల కలకలం!
కొత్తపేట: వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వదంతులపై కలకలం రేగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్లో నలుగురు అన్నదమ్ములకు చెందిన ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో నలుగురిలో పెద్దాయన కుమారుడు ఒక్కడే ఉంటున్నాడు. అతడికి వివాహం కాలేదు. కాగా.. నాలుగు రోజులుగా ఆ ఇంట్లో రహస్యంగా పూజలు నిర్వహిస్తున్నట్టు సమీపంలోని ప్రజలు గమనించారు. ఆ నోటా ఈ నోటా గ్రామమంతా ప్రచారం జరిగింది. దీంతో బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ వీఆర్వో లంక వెంకట నాగరాజు, పోలీసు కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్న అనంతరం గ్రామస్తులు మూకుమ్మడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి లోపలకు ప్రవేశించారు. అక్కడ ఒక గదిలో సుమారు మీటరు నలుచదరంలో సుమారు 30 అడుగుల లోతు గొయ్యి తవ్వి ఉంది. దానిలో పూజా సామగ్రితో పాటు, దిగటానికి నిచ్చెన, తాడు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఇదేమిటని గ్రామస్తులు నిలదీశారు. దానితో ఆ ఇంటికి చెందిన వ్యక్తి మొదట బాత్రూమ్కు తవ్వుతున్నామని, తర్వాత ఎముకలు ఉన్నాయని, తవ్వి తీసేయమని సిద్ధాంతి చెప్పారని అన్నాడు. ఎముకలు ఎక్కడ అని ప్రశ్నించగా, బయట పారేశామన్నారు. రంపచోడవరం, రాజమహేంద్రవరం నుంచి నలుగురిని తీసుకువచ్చి, ఈ గొయ్యి తవ్వినట్టు తెలుస్తోంది. అమలాపురానికి చెందిన ఒక వ్యక్తితో అక్కడి పూజ చేయిస్తున్నట్టు సమాచారం. దీనితో ఆరుగురిని అదుపులోకి తీసుకుని కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఎస్సై జి.సురేంద్రను ‘సాక్షి’ వివరణ కోరగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారన్న స్థానికుల అనుమానంతో పిర్యాదు చేశారని, విచారణ చేయాల్సి ఉందన్నారు. ఒక ఇంట్లో 30 అడుగుల లోతు గొయ్యి గ్రామస్తుల భయాందోళన ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
భార్యను చంపిన భర్త అరెస్టు
రాజానగరం: కట్టుకున్న భార్యను నాపరాయితో కొట్టి హతమార్చిన భర్తను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించామని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు శివారు సంతోష్ నగర్లో నివాసం ఉంటున్న నల్లమాటి లక్ష్మి పెద్ద కుమార్తె ఉషారాణికి నర్సీపట్నం సమీపంలోని గిడుతూరుకు చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం అనంతరం ఉపాధి కోసం అత్తింటికి వచ్చిన మాణిక్యం సంతోష్ నగర్లోనే వేరొక ఇంటిలో ఉంటూ వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యపై అనుమానం పెంచుకుని, తరచూ గొడవ పడేవాడు. నెల రోజుల క్రితం ఇదే విషయమై రాజానగరం పోలీసులకు ఉషారాణి ఫిర్యాదు చేసింది. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 26 రాత్రి 11.30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మాణిక్యం తన భార్య తలపై నాపరాయితో కొట్టి పరారయ్యాడు. గమనించిన చుట్టుపక్కలవారు ఈ విషయాన్ని అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె తల్లి నల్లమాటి లక్ష్మికి సమాచారం ఇవ్వడంతో రక్తపు మడుగులో ఉన్న ఉషారాణిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12.40 గంటలకు చనిపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాణిక్యాన్ని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కి పంపించారని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కటకటాల్లోకి కీచక కరస్పాండెంట్
రాయవరం: మాచవరంలో బాలిక (విద్యార్థిని)ను గర్భవతిని చేసిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఆకుమర్తి జయరాజును బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాయవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి ఆ వివరాలు వెల్లడించారు. మాచవరంలో మార్గదర్శి ఇంగ్లిషు మీడియం పాఠశాలను ఆకుమర్తి జయరాజు కరస్పాండెంట్‌గా ఉంటూ నిర్వహిస్తున్నాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. ఈ ఏడాది మార్చి 26న ఆ బాలికను పాఠశాలలో తన ఆఫీసు రూమ్‌కు రప్పించుకుని అల్మరాలో ఉన్న ఫైల్స్ తీయాలని ఆదేశించాడు. బాలిక ఆ ఫైల్స్ తీస్తుండగా జయరాజు వెనుక నుంచి గట్టిగా పట్టుకోవడంతో బాలిక కేకలు వేసింది. దీంతో ఆమె నోరు నొక్కి, చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడు. కాగా.. బాలిక శరీరంలో వస్తున్న మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఈ నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జయరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని రామచంద్రపురం మండలం కొత్తూరు వద్ద అరెస్ట్ చేశారు. అలాగే నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్బాబులను ఆమె అభినందించారు. విలేకరుల సమావేశంలో మండపేట సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.సురేష్‌బాబు పాల్గొన్నారు. రామచంద్రపురం మండలం కొత్తూరులో అరెస్టు వివరాలు వెల్లడించిన ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి -
వాడపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అన్న ప్రసాదం, లడ్డూ, పులిహోర తయారీ, ఆర్వో వాటర్ ప్లాంట్లను బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అలాగే లడ్డూ, పులిహోర ప్రసాదాలను విక్రయిస్తున్నారు. వాటి నాణ్యతను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ, జిల్లా ఫుడ్స్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ వై.రామయ్య పరిశీలించారు. తయారీతో పాటు అక్కడ ఉన్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం వారికి వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు పాల్గొన్నారు. -
అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఆచార్యులు
కొత్తపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ అర్బన్ డెవలప్‌మెంట్స్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన హైకోర్టు న్యాయవాది రామోజు నాగ వెంకట సత్య కామాచార్యులు (ఆర్కే ఆచార్యులు) నియమితులయ్యారు. ఆ మేరకు సెక్రటరీ లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్ అండ్ జస్టిస్ జి.ప్రతిభాదేవి జారీ చేసిన నియామక ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అందజేశారని ఆచార్యులు బుధవారం విలేకరులకు తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తానని తెలిపారు. నకిలీ పీఎఫ్ చలానాలపై విచారణకు ఆదేశంఅన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఇటీవల శానిటరీ కాంట్రాక్టర్ నకిలీ పీఎఫ్ చలానాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావును విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఆగస్టు ఆరో తేదీన అన్నవరం దేవస్థానికి వచ్చి విచారణ చేయనున్నారు. ఐదుగురి అరెస్ట్ సీతానగరం: మండలంలోని నల్గొండ శివారున గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. సీతానగరం పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ శివారున ఉన్న మామిడి తోటల్లో అదే గ్రామానికి చెందిన చింతల గంగరాజు, బండారు అప్పన్న దొర, తొర్రేడుకు చెందిన తాటిపాక గణేష్, మురముండకు చెందిన నేరుమిల్లి అఖిల్, బొబ్బిల్లంకకు చెందిన పోలీన సాయి సతీష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో సమక్షంలో ఐదు ప్యాకెట్లులో ఉన్న గంజాయి, మోటారు సైకిల్, రూ.1,500 సీజ్ చేశారు. ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడకు తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. -
మందుబాబుల జేబుగుల్ల
చాగల్లు, సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో మందుబాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. మద్యం ధరలు తగ్గించినా ఆ విషయాన్ని దాచిపెట్టి మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు. చాగల్లు కేంద్రంగా జిల్లాలో పలు మండలాల్లోని మద్యం దుకాణాల్లో ఈ దందా జరుగుతోంది. అయినా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల డిస్టలరీ నుంచి హెచ్డీ బ్రాండ్‌తో విడుదల అవుతున్న విస్కీతో ఈ మోసం జరుగుతోంది. నంద్యాల డిస్టలరీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని చాగల్లు డిపోకు వస్తున్న ఈ హెచ్డీ విస్కీని డీలర్లు అయిన కాడికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందుకోసమే పెద్దగా ఆదరణ లేని హెచ్డీ విస్కీని ఒకే సారి కేసులకు కేసులు డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. రూ.130 ఉన్న హెచ్డీ బ్రాండ్ విస్కీ బాటిల్ ఇటీవల రూ.120కు తగ్గింది. తగ్గిన ధర ప్రకారం బాటిల్‌పై ఎంఆర్పీ రూ.120గా ముద్రించాలి. కానీ ధర తగ్గినప్పటికీ బాటిల్‌పై లేబుల్‌లో మాత్రం ఇప్పటికీ ఎంఆర్పీ రూ.130గా ఉంటోంది. తగ్గిన ఎంఆర్పీకి అనుగుణంగా డిపో నుంచి హెచ్డీ బ్రాండ్ విస్కీని రూ.100కే డీలర్లకు సరఫరా చేయాలి. దాన్ని డీలర్ రూ.120కి విక్రయించాలి. అయితే డిపో నుంచి డీలర్లకు రూ.100కే లభిస్తున్నా మందుబాబులకు మాత్రం రూ.130కు విక్రయిస్తున్నారు. పాత లేబుల్ రూ.130తోనే హెచ్డీ విస్కీ బాటిళ్లను విక్రయిస్తున్న విషయం తెలిసినా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈ బ్రాండ్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో అమ్మకాలు కూడా పెద్దగా ఉండవు. డిపో నుంచి రోజూ 30 నుంచి 40 కేసులు మాత్రమే వెళుతుంటాయి. ఇప్పుడు ఒకే రోజు 3,500 కేసులు మార్కెట్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. చాగల్లు డిపో పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లోని సుమారు 105 షాపులలో సగానికి పైగా షాపులకు హెచ్డీ బాటిళ్లు సరఫరా చేశారు. హెచ్డీ విస్కీ ధర తగ్గిన వైనం కానీ పాత రేటుకే అమ్మకాలు చాగల్లు కేంద్రంగా అక్రమార్కుల దందా -
బడ్డీకొట్టు తొలగించేందుకు టీడీపీ నేత కుట్ర
నల్లజర్ల: కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై మొదలైన వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని గ్రామాల్లో సైతం పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దూబచర్లలో బుధవారం జరిగిన ఈ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. డైట్ కళాశాలకు వెళ్లే దారిలో దొబ్బిడి పెద్దిరాజు సుమారు 15 ఏళ్లుగా పాన్‌షాపు పెట్టుకుని, అక్కడే కొబ్బరి బొండాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం పంచాయతీ కార్యదర్శి తమ సిబ్బంది, పోలీసులతో వచ్చి ఆ బడ్డీకొట్టు తొలగించాలంటూ హంగామా చేశారు. దీంతో తమ జీవనాధారం పోతుందనే మనస్తాపంతో పెద్దిరాజు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని తొలుత నల్లజర్ల తర్వాత మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పెద్దిరాజు భార్య రాణి మాట్లాడుతూ తాము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమని తమ కొట్టు ఖాళీ చేయించడానికి కూటమి నాయకులు కుట్ర పన్నారన్నారు. ఆరు నెలల క్రితం టీడీపీ నాయకుడు తమ బడ్డీ వెనుక షాపు పెట్టారని, దానికి తమ బడ్డీ అడ్డుగా ఉందని తొలగించడం కోసం పంచాయతీ, పోలీసు సిబ్బందితో ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రహదారి పక్కనే ఉన్న ఆక్రమణలను తొలగించాలనుకుంటే గ్రామంలో అన్ని దుకాణాలను తీసివేయాలన్నారు. అంతేగానీ తమపై కక్ష కట్టి, కేవలం తమ బడ్డీకొట్టునే టార్గెట్ చేశారని ఆరోపించారు. దీనిపై గ్రామ కార్యదర్శి ఆషాలేఖ్యను వివరణ కోరగా ఆ రహదారిలో వెళ్లే లారీలకు ఆ బడ్డీకొట్టుపై ఉన్న చెట్టు కొమ్మలు అడ్డంకిగా ఉన్నాయన్నారు. వాటిని తొలగించాలని పలుమార్లు వారికి చెప్పిన వినకపోవడంతో, ఆ కొమ్మలు తొలగించడానికి మాత్రమే వెళ్లామని వివరణ ఇచ్చారు. పంచాయతీ సిబ్బంది, పోలీసుల హడావుడి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితుడు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో టార్గెట్ -
బంగారం వ్యాపారిపై దొంగల దాడి
పిఠాపురం: బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే వ్యాపారిపై దొంగలు దాడి చేసి, అతడి వద్ద ఉన్న వస్తువులను దోపిడీ చేశారు. చెందుర్తిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని నల్లమందు సందుకు చెందిన సమీర్ ప్రజాపత్ భవాని అనే వ్యక్తి సిల్వర్ ప్యాలెస్ అనే వెండి, బంగారు నగల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ఇతర ప్రాంతాల్లోని వెండి, బంగారు వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్తువులు తయారు చేయడం, వాటిని తీసుకెళ్లి వారికి ఇవ్వడం, మళ్లీ వారి నుంచి ఆర్డర్లు తీసుకోవడం, వారిచ్చే నగదుతో పాటు వెండి, బంగారం రావడం ఆయన పని. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు యజమాని చెప్పిన ఆర్డర్ల ప్రకారం వెండి వస్తువులను తీసుకుని పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని షాపుల్లో ఇచ్చాడు. అక్కడి నుంచి ముడి వెండిని, వెండి వస్తువులను, బంగారాన్ని తీసుకుని గొల్లప్రోలులో పని ముగించుకుని చెందుర్తిలోని మరో బంగారు షాపు వద్దకు బయలుదేరాడు. మార్గం మధ్యలో జాతీయ రహదారి 216 నుంచి చెందుర్తి వెళ్లే రోడ్డులో పామాయిల్ తోట వద్దకు వచ్చే సరికి, రెండు మోటారు సైకిళ్ల మీద నలుగురు వ్యక్తులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. భయభ్రాంతులకు గురిచేసి అతడి వద్ద ఉన్న 12.50 కేజీల వెండి, 51 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విషయం తెలిపాడు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ, తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాలు, నగదు లాక్కుని పరారీ చెందుర్తిలో కలకలం రేపిన ఘటన -
వేతన యాతన
జీతాలివ్వకపోతే ఎలా బతుకుతారు? పారిశుధ్య కార్మికులకు సక్రమంగా జీతాలివ్వకపోతే ఎలా బతుకుతారో ప్రభుత్వం ఆలోచించాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాలకుల చేతుల్లో మోసపోవడం పరిపాటిగా మారుతోంది. ఏదో ఒక ఉద్యోగం దొరికిందని సంతోషపడాలో.. లేక సక్రమంగా జీతాలందక, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమై, అకాల మరణం పొందితే కనీస ఆర్థిక సహాయం కూడా అందక కుటుంబాలు రోడ్డున పడుతున్న దీనస్థితిని తలచుకొని బాధపడాలో తెలియని పరిస్థితి. వీరిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకిచ్చే వేతనాలను ప్రభుత్వం కాంట్రాక్టర్ ద్వారా ఇచ్చే విధానం వల్ల కొంత.. కాంట్రాక్టర్ వద్ద కొంత ఆలస్యం జరుగుతూండటంతో నెలల తరబడి జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికై నా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం నెలకు రూ.28 వేలు ఇవ్వాలి. పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే వారి పక్షాన ఉద్యమం చేపడతాం. – ఈమని గ్రీష్మకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి, ఐఎఫ్టీయూ ప్రతి నెలా చెల్లించాలి వేతనాల కోసం ప్రతి నెలా ఎదురు చూస్తూనే ఉంటున్నాం. నిడదవోలు ప్రభుత్వాస్పత్రిలో పదేళ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్నాను. సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటోంది. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా జీతాలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొడమంచిలి శారమ్మ, పారిశుధ్య కార్మికురాలు, నిడదవోలునిడదవోలు: ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం వస్తే కుటుంబ సభ్యులే సరిగ్గా చూడని రోజులివి. వారికి పరిచర్యలు చేయాల్సి వస్తే మరింత యాతన. అటువంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగు జీవులు వారు. జీవనోపాధి కోసం క్లిష్టమైన పరిస్థితులను సైతం సహిస్తూ ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులుగా కొనసాగుతున్నారు. బండెడు చాకిరీ చేస్తున్న వారికిస్తున్న వేతనాలు గంపెడు కూడా ఉండవు. అది కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో నానా ఇక్కట్లూ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కష్టం ఎక్కువ.. వేతనం తక్కువ ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆ ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాదు.. రోగులను అక్కున చేర్చుకుని పరిచర్యలు చేస్తూంటారు. రోగులు వాంతులు, మలమూత్ర విసర్జన చేసుకున్నా అసహ్యించుకోకుండా శుభ్రపరుస్తారు. దగ్గరుండి బాత్రూములకు కూడా తీసుకువెళ్తారు. వేకువజామునే విధులకు హాజరై ఓపీ ప్రారంభించక ముందే వార్డులు, పరిసరాలను చీపుర్లతో నిత్యం శుభ్రం చేస్తారు. వాడి పడేసిన సిరంజులు, ఇంజెక్షన్లు, ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ పదార్థాలను బయటకు తరలిస్తారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు కుట్లు వేస్తున్న సమయంలో ఆ వ్యర్థాలను తీసుకువెళ్లి బయట పడేస్తారు. నెలంతా ఇంత చాకిరీ చేస్తున్న వారికి ఇస్తున్న వేతనం కోతలు పోనూ రూ.11,800 మాత్రమే ఉంటోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో 129 మంది పారిశుధ్య కార్మికులున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో 89 మంది పని చేస్తూండగా వీరికి ఒక నెల జీతం బకాయి పెట్టారు. నిడదవోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో ఆరుగురు కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో 13 మందికి రెండు నెలలుగా.. గోపాలపురం ప్రభుత్వాస్పత్రిలో మూడు నెలలుగా అనపర్తి సీహెచ్‌సీలో 13 మందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఇస్తున్నదే అరకొర వేతనం కాగా.. అది కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఈ బడుగు జీవులు గగ్గోలు పెడుతున్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వారితో పోలిస్తే సగం జీతం కూడా వీరికి అందడం లేదు. ఒప్పందం ఉల్లంఘించి.. ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య కార్మికుల నియామకానికి 2021లో టెండర్లు పిలిచారు. ఆ సందర్భంగా ఈఎస్ఐ, పీఎఫ్ పోను ప్రతి నెలా రూ.16 వేల జీతం చెల్లించేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ, పీఎఫ్, ఈఎస్ఐ పేరిట రూ.4,200 కట్ చేస్తున్నామని చెప్పి కొన్నాళ్లుగా నెలకు రూ.11,800 జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. పీఎఫ్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. నిడద వోలు ప్రభుత్వాస్పత్రిలో కార్మికులకు ఆరు నెలల పీఎఫ్ బకాయి పెట్టారు. పీఎఫ్, ఈఎస్ఐకి కట్ చేసుకుంటున్న మొత్తాన్ని తమ పేరిట చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. 12 శాతం సిబ్బంది జీతం నుంచి, 12 శాతం కాంట్రాక్టర్ పీఎఫ్‌కు జమ చేయాలి. కానీ, మొత్తం 24 శాతం తమ జీతం నుంచే కట్ చేస్తున్నారని, అది కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. ఒకటో తారీకు వస్తోందంటే అల్ప వేతన జీవులకు భయం.. అరువు తెచ్చిన కిరాణా సరకులకు డబ్బులు కట్టాలి.. కూరగాయల పద్దు చెల్లించాలి.. పాల బకాయి ఇవ్వాలి.. ఇంకా పాత బాకీలుంటే తీర్చేయాలి.. అన్నీ పోనూ ఇంకా ఏవైనా మిగిలితే ఇతర చిల్లరమల్లర ఖర్చులకు కాస్త దాచుకోవాలి.. అనుకోని ఖర్చు మీద పడితే చేతిలో సొమ్ముంటే సరే.. లేకపోతే మళ్లీ అప్పోసొప్పో చేయాలి.. ఇదంతా ఎటువంటి ఆటంకమూ లేకుండా జరగాలంటే ప్రతి నెలా వచ్చే కొద్దిపాటి వేతనమైనా టైముకు రావాలి. అలా రాకపోతే వారి బతుకు బండి తలకిందులవక మానదు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు అటువంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. ఫ నెలల తరబడి అందని జీతాలు ఫ నెలకు రూ.16 వేలకు ఒప్పందం ఫ ఇస్తున్నది మాత్రం రూ.11,800 ఫ అది కూడా నెలల తరబడి పెండింగ్ ఫ ఆస్పత్రుల్లోని పారిశుధ్య కార్మికుల దుస్థితి -
ఫుల్ వసూల్
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలను అందించనప్పటికీ, మద్యాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా మద్యం షాపులు ఏర్పాటు చేసింది. దీనికి తోడు విచ్చలవిడిగా పెరిగిన బెల్టుషాపులతో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ఈ షాపుల్లో అమ్మకాల ద్వారా అక్రమార్జన ఎడాపెడా జరుగుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లైసెన్స్ మద్యం షాపులు 150 లోపు ఉంటే, బెల్ట్ షాపులు దానికి దాదాపు ఏడు రెట్లు పెరిగాయి. లైసెన్స్ దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌ల పేరుతో మద్యం అమ్మకాలు ఫుల్‌గా సాగుతున్నాయి. బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా సరకును అమ్మేస్తున్నారు. లైసెన్స్ మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు ఉండవని, ఒక వేళ బెల్ట్ షాపుల్లో మద్యం పట్టుబడితే, సంబంధిత లైసెన్స్ షాపునకు రూ.5 లక్షలు జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎకై ్సజ్ అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు కావడం లేదు. వెయ్యికి పైగా బెల్ట్ షాపులు జిల్లాలో అధికారికంగా 146 లైసెన్స్డ్ మద్యం షాపులు, 10 బార్లు ఉన్నాయి. ఈ 146 అధికారిక షాపులకు అనుసంధానంగా దాదాపు వెయ్యికి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. కలెక్టర్ ఇటీవల జిల్లా ఎకై ్సజ్ అధికారులతో ఓ సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా మద్యం షాపుల ద్వారానే విక్రయాలు జరగాలని ఆదేశించారు. అయితే ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణా వైఫల్యం, లైసెన్స్ మద్యం షాపుల వారితో లాలూచీ వంటి కారణాలతో జిల్లాలో బెల్ట్ షాపులకు కొదవ లేకుండా పోయింది. మామూళ్ల మత్తుతోనే పర్మిట్ రూమ్‌లను, బెల్ట్ షాపులను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో! ఎకై ్సజ్ అధికారులను బెల్ట్ షాపుల గురించి అడిగితే ఎక్కడ ఉన్నాయని ఎదురు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. బెల్ట్ షాపుల నిర్వహణలో ఆరి తేరిన వారుంటే, అలాంటి వారిపై లైసెన్స్ షాపుల యాజమానులతో మాట్లాడి పరస్పర అంగీకారం, అవగాహనతో కొందరిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం ఎకై ్సజ్ అధికారులకు పరిపాటైపోయింది. అయితే పొరుగున్న ఉన్న పాండిచ్చేరి, యానాం నుంచి అక్రమ మద్యాన్ని (నాన్ డ్యూటీ పెయిడ్) తరలిస్తుంటే అధికారులు మాత్రం అలాంటి మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కాట్రేనికోన తదితర మండలాల్లో రిమోట్ గ్రామాల్లో కొన్ని మద్యం షాపులు ప్రైవేటు వేలం పాట పరమవుతున్నా పట్టించుకోరు సరికదా, అసలు తమకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ షాపుల నుంచి సంబంధిత అధికారులకు ప్రతి నెలా అందుతున్న మామూళ్లతో ఇలా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా అమ్మకాలకు ప్రోత్సాహం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవుట్ లెట్ల ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం షాపులను నిర్వహిస్తే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల చేత మద్యాన్ని ఫుల్‌గా తాగించి అమ్మకాలను అయినకాడికి పెంచేసి, తద్వారా వచ్చే ఆదాయానికి ఆశపడి ఈ అడ్డదారులు తొక్కుతోంది. మద్యం విక్రయాలను అటు లైసెన్స్ షాపుల ద్వారా ఇటు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌ల ద్వారా అదనంగా అమ్మేసి అక్రమార్జనకు పాల్పడుతోంది. ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో పనిలేదన్నట్లుగా, మద్యం అమ్మకాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు పుట్ట గొడుగుల్లా బెల్ట్ షాపులు నిబంధనలు బేఖాతరు ఏరులై పారుతున్న మద్యం రూ.కోట్లలో అక్రమార్జన నకిలీ మద్యం కేసు గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులతో మద్యం అక్రమ అమ్మకాలు సాగితే, అల్లవరం మండలం కొమరిగిరపట్నంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టు కావడంతో కోనసీమ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను, ఈ అక్రమ వ్యాపారంలో పాత్రధారులను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో సూత్రధారులైన పెద్దలను వదిలేసి పాత్రధారులైన చిన్న వారిని మాత్రమే అరెస్ట్ చేశారన్న విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నకిలీ దందా ఇక్కడ నుంచి సాగుతూ కోనసీమలోని పలు బెల్ట్ షాపులకు నకిలీ మద్యాన్ని సరాఫరా చేశారన్న గుసగుసలు కూడా వినిపించాయి. కేవలం కేరామిల్ లిక్విడ్, స్పిరిట్‌తో నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ లేబుళ్లతో ఓ బాటిలింగ్ యూనిట్నే మెయింటెన్స్ చేస్తున్న ఈ నకిటీ ముఠా స్థావరాన్ని చూసి ప్రజలు అవాక్కయ్యారు. రూ.10 కోట్ల మేర ఈ నకిలీ మద్యం కేంద్రం నుంచి పక్కదారి పట్టిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ బాహటంగా స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపుల కల్చర్ గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. మందుబాబులకు పండగే జల్లా కేంద్రమైన అమలాపురంలోని ఎకై ్సజ్ కార్యాలయం సమీపంలోనే కొన్ని లైసెన్స్ షాపులకు పర్మిట్ రూమ్‌లు ఉన్నాయి. బారులతో సమాంతరంగా మద్యం షాపుల వద్ద కూడా మందుబాబులు ఫుల్‌గా తాగేస్తున్నారు. ఇక గుడి, బడి నిబంధనలను బెల్ట్ షాపుల నిర్వాహకులు అసలు పాటించడం లేదు. బెల్ట్ షాపు పెట్టడమే ఓ నేరమైతే గుడి, బడికి 200 మీటర్ల దూరంలో పెట్టడం మరో నేరం. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామంలో ఇలా బడి, గుడి నిబంధనలకు నీళ్లొదిలి బెల్ట్ షాపులు వెలిశాయి. అమలాపురం రూరల్, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్పం, కాట్రేనికోన మండలాలతో పాటు జిల్లాలో అసలు బెల్ట్ షాపుల లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. -
దేవుడి పేరుతో ఇసుక దోపిడీ!
కొత్తపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చివరకు దేవుడి పేరును వాడుకుని మరీ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆత్రేయపురం అధికారిక ఇసుక ర్యాంపు సమీపంలో ప్రజల అవసరాల కోసం స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఇసుక నిల్వలు పెట్టారు. ఆ పాయింట్ నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా ఇసుక రవాణాను ప్రారంభించారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం రాత్రి మాటు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఎందుకు ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు నిలదీస్తే, వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అభివృద్ధి పనులకు తీసుకువెళుతున్నామని అక్రమార్కులు సమాధానం చెప్పారు. ఆలయానికి అయితే అర్థరాత్రి దొంగతనంగా తరలించడమేమిటి, పగటి పూటే తోలుకోవచ్చు కదా అని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మాటామాటా పెరిగి వివాదం తలెత్తింది. ఈ లోపు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించాలని గ్రామస్తులు పట్టుపట్టగా, అది రెవెన్యూ అధికారుల పని అని చెప్పి, వాహనాలను అక్కడి నుంచి పంపించేశారని పలువురు స్థానికులు తెలిపారు. దీనిపై ఎస్సై రామును ‘సాక్షి’ వివరణ కోరగా అక్కడ గొడవపడుతున్నారనే సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపిచేశామని తెలిపారు. వాహనాలేమీ సీజ్ చేయలేదని స్పష్టం చేశారు. మండల స్థాయి నాయకుడి ఆగడాలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మండలంలో టీడీపీ నాయకులు ముఖ్యంగా ఒక మండల స్థాయి నాయకుడి ఆగడాలు, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆ నాయకుడి అక్రమ వ్యవహారాల్లో భాగంగానే గత నెల 16, 17 తేదీల్లో ఆత్రేయపురం చినపేట సమీపం నుంచి లంక భూముల్లోకి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి మట్టి తరలించే ప్రయత్నాలు చేయగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం, వారు స్పందించకపోవడంతో గ్రామస్తులే అడ్డుకున్నారు. అప్పట్లో వారి ప్రయత్నాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కూటమి నాయకుల అక్రమ దందా అడ్డుకున్న గ్రామస్తులు -
‘మాచవరం’ ఘటనపై కదిలిన యంత్రాంగం
రాయవరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు, అవసరమైన పక్షంలో మూసివేసేందుకు వెనుకాడబోమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా హెచ్చరించారు. మాచవరంలోని మార్గదర్శి పాఠశాలలో బాలికను ఆ స్కూల్ కరస్పాండెంట్ గర్భవతిని చేసిన ఘటనపై మంగళవారం ఆయన విచారణ చేపట్టారు. రాయవరం ఎంఈవో–1 పి.రామలక్ష్మణమూర్తి ద్వారా ప్రాథమిక సమాచారం తెలుసుకున్న ఆయన హుటాహుటిన మాచవరం గ్రామానికి చేరుకున్నారు. ఆ స్కూల్లో ఎటువంటి అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఒకటి నుంచి 7వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు చదువుతున్నారని పాఠశాల రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు ముఖ్యంగా మరుగుదొడ్లకు తలుపులు కూడా లేకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అలాగే బాలిక కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాల గుర్తింపును రద్దు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. విచారణ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు ఇటువంటి పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోకు విన్నవించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎన్.కీర్తి స్పందన, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, వై.సూర్యనారాయణ, సమగ్ర శిక్షా జీసీడీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ డి.రమేష్‌బాబు తదితరులు ఉన్నారు. ట్రైనీ డీఎస్పీ విచారణ మాచవరంలో బాలిక ఘటనపై ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, మండపేట సీఐ పి.దొరరాజుతో కలిసి విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పాఠశాలలో నేర స్థలాన్ని పరిశీలించారు. మాచవరంలో ప్రైవేట్ పాఠశాలను కరస్పాండెంట్ ఆకుమర్తి షాజీ జయరాజ్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. పాఠశాలలో చదువుకోవడానికి వచ్చిన బాలికను లోబర్చుకుని, ఆమెను భయపెట్టి గర్భవతిని చేసినట్లుగా ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. గతంలో కూడా పాఠశాలలో ఇలాంటి కొన్ని ఘటనలు జరగ్గా, పరువు పోతుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే తమ కూతురికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో బాలిక తండ్రి ఆ పాఠశాల కరస్పాండెంట్ షాజీ జయరాజుపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. డీఈవో సలీం బాషా విచారణ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన వైనం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ, సీఐ -
హజ్ కమిటీని రద్దు చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ముస్లింల ధార్మిక పవిత్రతను మంటగలిపేలా, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీని నియమించిందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ ఆరోపించారు. ధర్మపండితుల స్థానంలో పార్టీ కార్యకర్తలను నియమించడం హజ్ యాత్ర పవిత్రతను, యాత్రికుల ప్రయోజనాలను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ కమిటీలో ముగ్గురు ఇస్లామిక్ ధార్మిక పండితులను నియమించాల్సి ఉండగా టీడీపీ కార్యకర్తలైన పఠాన్ ఖాదర్ ఖాన్, షేక్ హాసన్ బాషాలను ముస్లిం థియాలాజిస్ట్లుగా పొందు పరుస్తూ అనర్హులను నియమించిందని ఆరోపించారు. నిజానికి వీరిద్దరూ ఎలాంటి ఇస్లామిక్ ధర్మశాస్త్రాన్నీ అధ్యయనం చేయలేదన్నారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు ఆరిఫ్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన హజ్ కమిటీని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మైనారిటీ మంత్రి, ప్రభుత్వ మైనారిటీ సలహాదారులవంటి వారున్నప్పటికీ పవిత్రమైన హజ్ కమిటీలో చట్ట ఉల్లంఘన జరుగుతూంటే నోరెత్తకుండా వ్యవహరించడం శోచనీయమన్నారు. వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘లులు’ భూముల జీఓ రద్దు చేయాలి నిడదవోలు: విశాఖలో 13.83 ఎకరాల ప్రభుత్వ భూములు, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళ జాతి సంస్థ లులుకు కట్టబెడుతూ ఇచ్చిన జీఓ నంబర్ 137ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిడదవోలు ఆర్టీసీ డిపో ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జీఓ కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత రాంబాబు మాట్లాడుతూ, లులును ప్రోత్సహించడం వలన వేలాది మంది చిన్న వ్యాపారులు, లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని నాశనం చేయడం తగదని అన్నారు. అన్నదాత సుఖీభవ ఫిర్యాదులపై గ్రీవెన్స్ సెల్స్రాజమహేంద్రవరం సిటీ: అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల పరిష్కారానికి మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అన్నదాత సుఖీభవకు అనర్హులైన రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరస్కరణ కారణాలను రైతులకు వివరించి, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లా స్థాయిలో 0883–2944455 నంబరుతో గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతి సాధించని ఎంపీడీఓలు, గృహ నిర్మాణ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల నుంచి అడ్వాన్స్ నిధులు తిరిగి తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలువల పూడికతీత పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో ముంపు నివారణపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు ప్రతి శనివారం వసతి గృహాలను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, హౌసింగ్ పీడీ ఎస్.భాస్కర్‌రెడ్డి, సీపీఓ ఎల్.అప్పలకొండ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
దళిత విద్యార్థులపై కూటమి ప్రభుత్వ కక్ష
ఫ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఫైర్ ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దళిత విద్యార్థులంటే కూటమి ప్రభుత్వానికి అలుసని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగడం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్‌ను యూనియన్ జి ల్లా అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీటి ఆనంద్ ఆధ్వర్యాన చైతన్య మంగళవారం సందర్శించారు. సమస్యలు స్వయంగా పరిశీలించి, విద్యార్థుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, వసతి గృహాలను పాడుబెడుతున్నారని, విద్యార్థులకు సరైన తిండి పెట్టకుండా ఆసుపత్రి పాలు చేస్తున్నారని ఫైరయ్యారు. జగన్ హయాంలో ఇచ్చిన మంచి భోజనం, మంచి దుస్తులు, పరిసరాల పరిశుభ్రత మాయమైపోయాయని మండిపడ్డారు. పేద విద్యార్థులు బా గా చదువుకుని, మంచి ఉద్యోగాలు పొందాల ని, తద్వారా రాష్ట్రంలో పేదరికం కనుమరుగైపోవాలని గత ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తే.. ప్రస్తు త సీఎం చంద్రబాబు దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చైతన్య డిమాండ్ చేశా రు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రీజినల్ కో ఆర్డినేటర్ రమేష్, విద్యార్థి నేతలు రేష్మ, కేపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి అవసరం
పెద్దాపురం: ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్ అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించే క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్‌ను మంగళవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కబడ్డీ మీట్‌నుద్దేశించి శ్రీనుబాబు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు క్రీడారంగానికి ప్రాధాన్యనివ్వడంలో నవోదయ విద్యాలయాల పాత్ర కీలకమన్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి కృష్ణా క్లస్టర్, తుంకుర్ క్లస్టర్ అండర్–19 బాలుర లీగ్ మ్యాచ్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతానికి చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త మట్టే శ్రీనివాస్ ‘నవోదయ’లో కబడ్డీ మీట్ ప్రారంభం -
‘నన్నయ’కు వుడ్ చిప్పర్
రాజానగరం: యూనివర్సిటీ ప్రాంగణాన్ని సుందరీకరించడంలో భాగంగా చెట్ల కొమ్మలు, పొదలు, వ్యర్థాలను చిప్స్‌గా మార్చే మైజో వీమా వుడ్ చిప్పర్ యంత్రాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కొనుగోలు చేసింది. దీనిని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఈ యంత్ర సాయంతో తయారయ్యే వుడ్ చిప్స్‌ను మొక్కలకు కంపోస్టు ఎరువుగా వాడవచ్చని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. వ్యర్థాలను కాల్చివేయడం వలన పర్యావరణం కలుషితమవుతుందని, ఆవిధంగా కాకుండా ఈ యంత్రం చక్కని ప్రత్యామ్నాయమని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీన్ డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, కె.దేవలాల్, కె.లక్ష్మీపతి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం
రాజమహేంద్రవరం సిటీ: దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, ఆ హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) వేయనున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమైన విషయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పథకాన్ని అమలు చేసి చూపించారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని అమలు చేయకుండా క్యాబినెట్లో ప్రకటించడం దారుణమన్నారు. తల్లికి వందనం అమలు జరగడం లేదన్నారు. జగన్ రూ.13 వేలు ఇస్తే విమర్శించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా రూ.13 వేలే ఇస్తోందని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పి, కార్పొరేట్ కంపెనీలకు భూములను కారుచౌకగా 99 పైసలకే కట్టబెడుతున్నారని, ఇందులో క్విడ్ ప్రో కో జరుగుతోందని హర్షకుమార్ ఆరోపించారు. ఎవరికో ఒకరికి భూములు కట్టబెట్టడానికే మంత్రి మండలి సమావేశం జరుగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రతి వారినీ జైలులో పెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడం గురించి ఆలోచించకుండా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. బిహార్‌లో జరిగిన ఎన్నికల అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం లోక్‌సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల్లో 8 లక్షల బోగస్ ఓట్లు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ఎన్నికల్లోనూ బోగస్ ఓట్లు సృష్టించి గెలుస్తున్నారని ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే లెక్క పెట్టిన ఓట్లే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఈవీఎంలను మేనిప్యులేట్ చేసి, ఎన్నికై న ప్రధాని దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపి విజయం సాధించాలని హర్షకుమార్ సవాల్ చేశారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఆర్ ప్రేమ్‌కుమార్, సీపీఓ ఎల్.అప్పలకొండ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, ఫిర్యాదుల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. మళ్లీ మళ్లీ వస్తున్న అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ 71, పోలీస్ 34, పంచాయతీరాజ్ 28, ఇతర శాఖలవి 58 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. పోలీసు పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 31 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీల్‌చైర్‌లో వచ్చిన దివ్యాంగ మహిళ వద్దకు నేరుగా ఆమె వెళ్లి అర్జీ స్వీకరించారు. ఆమె సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా చట్ట పరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా పోలీసు స్టేషన్ల అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ నియామ కానికి దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా సెక్రటరీగా రెండేళ్లు పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న అర్హులైన వ్యాయామోపాధ్యాయులు (పీడీ) తమ నామినేషన్లను తన కార్యాలయానికి ఆగస్టు 4వ తేదీ 12 గంటల్లోగా అందజేయాలని సూచించారు. గతంలో ఒకసారి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలుగా పని చేసిన వారు అనర్హులని తెలిపారు. ఇంటర్ సంస్కరణలపై శిక్షణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ విద్యా సంస్కరణలపై జిల్లాలోని ప్రిన్సిపాళ్లకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి (ఆర్ఐఓ) ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం మాట్లాడుతూ, కొత్త సంస్కరణల ప్రకారం సిలబస్ అప్డేట్, సౌకర్యవంతమైన సబ్జెక్టులను కలపడం తదితర మార్పులు చేశారని వివరించారు. విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తగ్గించి, నీట్, జేఈఈ వంటి ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సన్నద్ధ చేయడమే ఈ సంస్కరణల ఉద్దేశమన్నారు. కడలిలోకి 5.85 లక్షల క్యూసెక్కులుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 5,85,246 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులుగా ఉంది. తూర్పు డెల్టాకు 3,700, మధ్య డెల్టాకు 2,400, పశ్చిమ డెల్టాకు 6 వేలు కలిపి 12,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భద్రాచలంలో నీటిమట్టం 36.10 అడుగులకు చేరింది. -
అదిగో జాగా.. ఇదిగో పాగా!
చిన్న కాలువలను కూడా వదల్లేదు ఆలమూరు మండలం కోటిపల్లి ప్రధాన పంట కాలువ మీదనే కాదు... దీనికి అనుబంధంగా ఉండే చానల్స్‌ను కూడా అక్రమార్కులు వదల్లేదు. ప్రధాన పంట కాలువ పరిధిలో మూలస్థానం వద్ద ఏటిగట్లను ఆనుకుని నిర్మాణాలు చేశారు. ఆలమూరు సూర్యారావుపేట, వెదురుమూడి కాలువలు కూడా ఆక్రమణలకు చిక్కి శల్యమవుతున్నాయి. సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాకు జీవనాడులైన ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువలు, వీటికి అనుబంధంగా ఉండే చానల్స్, మీడియం, మైనర్ డ్రెయిన్లు పలుచోట్ల ఆక్రమణదారుల బారిన పడి చిక్కి శల్యమవుతున్నాయి. సహజ సిద్ధమైన ప్రవాహాలను కోల్పోతున్నాయి. దీనివల్ల ఆయకట్టు రైతులు సాగు సమయంలో పడరాని పాట్లు పడుతున్నారు. తూర్పు, మధ్య డెల్టా అనే తేడా లేదు, పంట కాలువ, మురుగునీటి కాలువ అనే భేదం లేదు, పెద్దా, చిన్నా అనే అంతరం లేదు, కాలువలకు – రోడ్లకు మధ్య కొద్దిపాటి స్థలం ఉంటే చాలు కబ్జాల బారిన పడుతున్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునే జాగాలో టింబర్ డిపోలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు జరిగిపోయాయి. పూరి గుడిసెల నుంచి రెండంతస్తుల పక్కా భవనాల వరకు నిర్మాణాలు చేసేశారు. చివరకు ఈ స్థలాలపై హక్కులున్న జలవనరుల శాఖకు చెందిన కార్యాలయాలను సైతం ఆక్రమించేశారు. ఇటీవల ఆ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4,800 వరకు ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. వీటి ని తమ శాఖతో పాటు రెవెన్యూ, పోలీసుల సహకారంతో తొలగిస్తామని ప్రకటించారు. ఇతర శాఖల వత్తాసు ఆక్రమణల తొలగింపు సాధ్యం కాదనేది పలువురి అభిప్రాయం. ఇటీవల కాలంలో పెరిగిన మితిమీరిన రాజకీయ జోక్యంతో పాటు పలు నిర్మాణాలకు సంబంధించి పక్కాగా దస్తావేజులు కూడా పుట్టుకురావడం వంటి కారణాలతో వీటి తొలగింపు కేవలం ప్రకటనలకే పరిమితమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవనరుల శాఖకు చెందిన ఈ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తుంటే వీటికి రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్ శాఖలు వంత పాడుతుండడం గమనార్హం. ఈ నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖలు పన్నులు వసూలు చేస్తుండగా, రెవెన్యూ శాఖ పట్టాలు మంజూరు చేస్తోంది. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నట్టుగా మారింది. హద్దూ పద్దూ లేదు జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరొందిన రావులపాలెం మండలం మీదుగా మధ్య డెల్టాలోని మూడు ప్రధాన పంట కాలువలు ప్రవహిస్తాయి. ఈ మూడు కాలువల మీద ఈ మండలంలో ఆక్రమణలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ మీద ఊబలంక, రావులపాలెంలో ఇరువైపులా అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇళ్లు, వాణిజ్య దుకాణాలు, ప్రార్థనా స్థలాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ కాలువలపై ఊబలంక నుంచి రావులపాలెం, కొమరాజులంక, వెదిరేశ్వరం ఇరువైపులా ఆక్రమణలతో నిండిపోయింది. అమలాపురం కాలువపై ఈతకోట– ర్యాలీ రహదారి వెంబడి కూడా ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. రావులపాలెం వద్ద ముక్తేశ్వరం కాలువ గట్లపై ఆక్రమణలు కొత్తపేట కౌశిక డ్రెయిన్ ఇరువైపులా నిర్మాణాలు గోదావరి డెల్టాలో కాలువల వెంబడి ఆక్రమణలు ఉమ్మడి జిల్లాలో 4,800 ఆక్రమణల గుర్తింపు రెవెన్యూ, పోలీసుల సహకారంతో తొలగిస్తామంటున్న ఇరిగేషన్ అధికారులు రాజకీయ జోక్యంతో అసాధ్యమంటున్న రైతులు పలు ప్రాంతాల్లో పక్కాగా భవన నిర్మాణాలు చిరు దుకాణాల నుంచి షాపింగ్ కాంప్లెక్స్‌ల వరకు మురుగునీటి కాలువను వదల్లేదు కొత్తపేట నడిబొడ్డున ఉండే కౌశిక ఇది. ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. మురుగునీటి కాలువకు ఇరువైపులా ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి. కాలువల్లో పిల్లర్లు వేసి డాబాలు, మేడలు, రేకుల షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాడకం నీరంతా దీనికిలోకి వదిలేస్తున్నారు. మురుగునీరు దిగేందుకు మరో మార్గం లేకపోవడంతో దీనిని అమలాపురం పంట కాలువలోకి నేరుగా వదిలేస్తున్నారు. కొత్తపేట దిగువున ఉన్న అమలాపురం మున్సిపాలిటీతోపాటు అంబాజీపేట, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాల్లోని ప్రధాన రక్షిత మంచినీటి పథకాలకు ఈ నీరే వెళుతోంది. మండపేట కాలువ గట్టుపై.. తూర్పు డెల్టా పరిధిలో కీలకమైన మండపేట కాలువ గట్టుపై అక్రమ నిర్మాణాలు లెక్కలేనన్ని. రాయవరం మండలం పసలపూడిలో కాలువ గర్భంలోకి వచ్చి మరీ నిర్మాణాలు చేశారు. ఈ కాలువపై మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీతో పాటు రామచంద్రపురం రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగాయి. దీనివల్ల కీలక రబీ సమయంలో శివారుకు నీరందక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అందుకేనా.. పూనకాలు లోడింగ్!
గత అవమానాలు మరిచారా? సీనియర్ నేతయిన బుచ్చయ్య చౌదరి టీడీపీలో ఆది నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. దివంగత ఎన్టీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు వెన్నుపోటు ఉదంతంలో గోరంట్ల.. ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. పార్టీలోనే ఉన్నా తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఆయన వ్యవహార శైలి ఇష్టం లేకపోయినా పార్టీలో సీనియర్ అనే కారణంతో చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసేవారు. పార్టీపై ఉన్న అభిమానంతో గోరంట్ల కూడా అలాగే కొనసాగేవారు. మంత్రి పదవి రాని సమయంలో పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్వపక్షంపై ఆయన చేసిన వ్యాఖ్యలను గమనించిన చంద్రబాబు అప్పటి నుంచీ బుచ్చయ్యను పెద్దగా నమ్మరనే ప్రచారం ఉంది. యువగళం పాదయాత్ర, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన తనయుడు లోకేష్ టీడీపీ రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా మారారు. దీంతో, గోరంట్ల ప్రాబల్యం మరింత తగ్గింది. చంద్రబాబు జైలులో ఉన్న 52 రోజులూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా.. లోకేష్ పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా, బాబుతో ఒక్కసారి కూడా ములాఖత్ ఏర్పాటు చేయలేదంటే టీడీపీలో బుచ్చయ్య పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మంత్రి పదవి ఇవ్వకపోయినా, తరచుగా అవమానిస్తున్నా గోరంట్ల ఇప్పటికీ వారినే పొగుడుతూంటారు. వారి దృష్టిలో పడేందుకే మాజీ సీఎంను విమర్శిస్తున్నారని, మంత్రి పదవి కోసమే ఆయన స్వరం పెంచారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల తన వయసు, అనుభవాన్ని పక్కన పెట్టేసి మరీ తరచుగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఆయన తరచుగా దుర్భాషలాడుతున్నారు. కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనుంది. అందులో స్థానం దక్కించుకునే కాంక్షతోనే ఆయన ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలకు దిగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హద్దు మీరి మరీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ నాయకులు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ నేతలపై తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగాకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎంతో హుందాగా.. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. కానీ, ఆయనే సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, అవి కూడా హద్దులో ఉండటమే సమాజానికి హితం. కానీ, బుచ్చయ్య వ్యాఖ్యలు మాత్రం ఆ హద్దు దాటేస్తున్నాయి. మాజీ సీఎం అనే కనీస గౌరవం కూడా లేకుండా మీడియా సమావేశాలు, టీవీ డిబేట్లలో ఇష్టమొచ్చినట్లు అన్‌స్టాపబుల్‌గా తప్పుడు వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతోంది. ‘నువ్వు ఓ సైకో. నీకు ఉరి వేయక సన్మానాలు చేయాలా? నీ తల ఎందుకు తీయకూడదు? నిన్ను చంపితే తప్పేముంది? ఉరి తీసినా తప్పులేదు?’ అంటూ జగన్‌నుద్దేశించి ఆయన ఊగిపోతూ మాట్లాడుతున్నారు. గోరంట్ల ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నా పార్టీ అధిష్టానం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా చూస్తూంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే భావన కలుగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి పదవి కోసమేనా? కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిగా విఫలమైంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కూటమి సర్కారు ప్రజలకు చేస్తున్న అన్యాయం, దగాను ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. దీంతో, ఆత్మరక్షణలో పడిన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు చేస్తోంది. ఆ సందర్భంగా సీనియర్లకు మంత్రి పదవులిచ్చి మాజీ సీఎం జగన్‌ను, వైఎస్సార్ సీపీపై విమర్శల దాడిని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈసారైనా తనకు మంత్రి పదవి దక్కకపోతుందా అనే ఆశతోనే గోరంట్ల స్వరం మార్చినట్లు తెలుస్తోంది. జగన్‌ను, వైఎస్సార్ సీపీని గట్టిగా విమర్శిస్తే తనకు బెర్త్ ఖాయమవుతుందని భావించారో ఏమో కానీ ఎన్నడూ లేని విధంగా ఆయన కొన్ని రోజులుగా నిందా వ్యాఖ్యలకు దిగుతున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టిలో పడేందుకు పాట్లు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూండటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే, బుచ్చయ్య ఎంత ట్రై చేసినా మంత్రి పదవి దక్కదని టీడీపీ నేతలే అంటున్నారు. మాజీ సీఎం జగన్, గత ప్రభుత్వంపై తరచుగా గోరంట్ల విమర్శలు వయసు, అనుభవం పక్కనపెట్టి మరీ దిగజారుడు వ్యాఖ్యలు మంత్రి పదవి కోసమే ఈ తాపత్రయం అంటున్న రాజకీయ విశ్లేషకులు -
వైఎస్సార్ సీపీ నేత షర్మిలా రెడ్డి ఇంట్లో అగ్నిప్రమాదం
రూ.10 లక్షల వరకు నష్టం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైఎస్సార్ సీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సోమవారం ఆ వివరాలను తెలిపారు. షర్మిలారెడ్డి, ఆమె భర్త అనిల్‌రెడ్డితో కలిసి కొద్దిరోజుల క్రితం లండన్‌లో ఉంటున్న వారి కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఇంటిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఇంటిలోని ఫర్నిచర్‌కు మంటలు అంటుకుని ఇల్లంతా పొగ కమ్మేసింది. ఇల్లు లాక్ చేసి ఉండడంతో ఆ పొగలు భవనం పైకి వచ్చాయి. దీన్ని చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. వారు వచ్చి తలుపులను పగులకొట్టి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఇంటిలో సుమారు రూ.10లక్షల విలువైన ఫర్నిఛర్ ధ్వంసమైంది. అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే వచ్చి సహాయం అందించిన ఫైర్ సిబ్బంది, తన అభిమానులకు షర్మిలారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
తాడిని తలదన్నే రుచి!
సామర్లకోట: ప్రస్తుత సీజన్లో దొరికేది తాటి పండు. ఈ తాటిపండులో అనేక పోషకాలు ఉంటాయి. ముంజెలు, పండ్లు, తేగలు అందిస్తూ అనేక విధాలుగా మనకు తాటి చెట్లు ఉపయోగపడుతున్నాయి. పూర్వం తాటిచెట్టు, ఆకులతో ఇళ్ల నిర్మాణం జరిగేది. క్రమేపీ పెంకుటిళ్లు, ప్రస్తుతం డాబాలు వచ్చాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన పండ్లను తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. తాటి పండుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. వాటి రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. తాటిచెట్టుకు కాసిన ముంజెకాయలు ముదిరిపోవడంతో తాటి పండ్లుగా మారుతాయి. ఆ పండ్ల గుంజుతో బూరెలతో పాటు అనేక రకాల పిండి వంటలు తయారు చేస్తారు. రసాయనాలు లేని ఏకై క పండు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు 20 ఏళ్ల క్రితం వరకు ప్రస్తుత సీజన్లో తాటిపండ్లతోనే కడుపు నింపుకునే వారు. చెట్టు నుంచి పడిన పండును నేరుగా కొందరు, నిప్పులపై కాల్చుకొని మరి కొందరు ఈ పండ్లను తొక్కలు తీసి నేరుగా తినేవారు. అయితే ప్రస్తుతం ఈ పండ్లను దూరం పెడుతున్నారు. తాటిపండులో అనేక పోషకాలు ఉన్నాయి. ఎటువంటి పురుగు మందులు, రసాయనాలు వాడని తాటి పండ్లు వినియోగం ఆరోగ్యదాయకం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వంటకాలకు డిమాండ్ పెరిగింది. దాంతో పండ్లను రోడ్డు మార్జిన్లో విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. తాటిపండులో విటమిన్ ఎ,సీలు ఉంటాయి. బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తుంది. ఎక్కువగా పీచు పదార్థాలు ఉండటం వలన జీర్ణకోశ వ్యాధులు, మలబద్ధకం దూరం అవుతుంది. రక్త శుద్ధికి, మెదడుకు గ్లూకోజ్ అందించడంలో ఈ పండు దోహదపడుతుంది. నేటి తరం వారికి ఈ తాటిపండు విలువ తెలియడం లేదు. దీనికితోడు తాటి చెట్లను నరికి వేయడంతో ఇవి రానురాను కనుమరుగైపోతున్నాయి. అనేక వంటకాలు తాటి పండ్లతో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. వీటితో చేసే బూరెలు, గారెలు, రొట్టెలు, అప్పాలు ఎంతో రుచిగా ఉంటాయి. తాటికాయ గుంజు తీసి దానిలో వరి నూక, బెల్లం కలిపి బూరెలు, గారెలు, రొట్టెలు తయారు చేస్తారు. కొన్ని మిఠాయి దుకాణాల్లో ఆంధ్రా పిండి వంటకాల పేరుతో తాటి బూరెల విక్రయాలు సాగుతున్నాయి. వీటి ధర కూడా అధికంగానే ఉంటుంది. తాటి పండ్లతో అనేక ప్రయోజనాలు వాటితో చేసే వంటకాలు అద్భుతం నోరూరించేలా గారెలు, బూరెలు అధిక శ్రమతో కూడిన పని తాటి పండ్లతో పిండి వంటలు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. శుభకార్యాలలో వేసే బూరెలను సులభంగా తయారు చేయవచ్చు. తాటి పండ్లతో బూరెలు చేయడానికి కనీసం ఇద్దరు ఉండాలి. తాటి పండ్లను నిప్పులపై మగ్గ బెట్టాలి. వాటి తొక్క తీసి గుంజును పీచు లేకుండా తీయాలి. పండ్ల తీపిని బట్టి తగిన మోతాదులో బెల్లం కలపాలి. అప్పటికే నీటిలో నానబెట్టిన నూకను తాటిపండ్ల గుంజులో బాగా కలపాలి. సుమారు 30 నిమిషాలు ఉంచిన తరువాత నూనెలో కావలసిన పరిమాణంలో తాటి బూరెలు, అప్పాలు, గారెలు తయారు చేసుకోవచ్చు. వీటిని ఒకసారి రుచి చూస్తూ వదలిపెట్టే ప్రసక్తి ఉండదు! – మచ్చా బిందు, వీకే రాయపురం, సామర్లకోట మండలం అనేక పోషకాలు తాటిచెట్ల నుంచి వచ్చే పండ్లలో మంచి పోషకాలు ఉంటాయి. తాటిపండులో విటమిన్లు ఏ,బీ,సీ.. జింక్, పోటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. తాటిపండులో పోషకాలు క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచటంలో తాటిపండు దోహదపడుతుంది. తాటిపండు వికారం తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. తాటి పండ్లతో పిండి వంటలు తయారు చేసేవారు కనిపిం చడం లేదు. ఆ పిండి వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. చిన్నతనంలో స్నేహితులతో కలిసి తినే వారం. – పసల సత్యానందరావు, డాక్టర్, సామర్లకోట -
నేటి నుంచి ఆటల పండగ
జవహర్ నవోదయలో మూడురోజుల పాటు కబడ్డీ పోటీలు పెద్దాపురం: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఆటల పండగ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యాయల ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలిపారు. దీనిలో భాగంగా సొమవారం తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సుమారు 450 మంది క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారు. 29వ తేదీ ఉదయం 9 గంటలకు క్రీడాజ్వాల, క్రీడార్యాలీ, శాంతికపోతం ఎగురవేత తదితర కార్యక్రమాలతో కబడ్డీ మీట్ ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి తెలిపారు. ఈ పోటీలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మట్టే శ్రీనివాస్, మట్టే ప్రసాద్‌బాబు ప్రారంభిస్తారన్నారు. కృష్ణ, ఖమ్మం, బీదర్, వయనాడు , కడప, షిమోగా, తుముకురు క్లస్టర్ల నుంచి అండర్–14, అండర్–17 బాలుర, బాలికల విభాగంలో పోటీలు ఉంటాయని ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, పీఈటీలు ఆర్.సత్యనారాయణ, అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు. -
మొరాయించిన ప్రైవేటు ట్రావెల్ బస్సు
గండేపల్లి: జాతీయ రహదారిపై సోమవారం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు ప్రయాణికులతో కావేరి ట్రావెల్ బస్సు బయలుదేరింది. మండలంలోని మల్లేపల్లి శివారు హోటల్ వద్ద భోజనాలు చేసేందుకు బస్సును డ్రైవర్ నిలిపాడు. భోజనాలు అనంతరం బస్సును స్టార్ట్ చేయగా మొరాయించింది. స్థానికంగా ఉన్న మెకానిక్ మరమతులు చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలను బస్సు యాజమాన్యానికి వివరించినా సరిగా స్పందించలేదని ప్రయాణికులు తెలిపారు. మరో బస్సులో గమ్యానికి పంపించాలని కోరామని, కనీసం టికెట్ సొమ్ములైన ఇస్తే మరో బస్సులో వెళతామని చెప్పినప్పటికి పట్టించుకోలేదన్నారు. దీనిపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండేపల్లి పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. దీంతో యాజమాన్యం స్పందించి ప్రయాణికులకు భోజన సదుపాయం, ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు పోలీసులు తెలిపారు. తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు పట్టించుకోని యాజమాన్యం -
జనసేన నేతలపై చార్జిషీట్ వేయాలి
ఎస్పీకి ఫీల్డు అసిస్టెంట్ ఫిర్యాదు కరప: జనసేన పార్టీ నాయకులు తనను కులంపేరుతో దూషించడమే కాకుండా వేధింపులకు గురిచేశారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు చార్జిషీట్ ఫైల్ చేయలేదని ఫీల్డు అసిస్టెంట్ పులపకూర సునీత సోమవారం ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. తన చావుతో న్యాయం జరుగుతుందని పోలీసులు భావిస్తే దానికై నా సిద్ధంగా ఉన్నానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు సునీత జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌కు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి... కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పులపకూర వీరబాబు భార్య సునీత ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బండారు మురళి ఫీల్డు అసిస్టెంట్ సునీతను కులంపేరుతో దూషించడమే కాకుండా, కోరిక తీర్చాలని లేదా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. ఆ వేధింపులు తాళ లేక గతేడాది అక్టోబర్ నెల 22వ తేదీన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేధింపులకు గురిచేసిన జనసేన నాయకులు బండారు మురళి, ఘంటా నానిబాబు, గుబ్బల భవానీలపై అదే నెల 28వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఐదునెలలు అవుతున్నా చార్జిషీట్ ఫైల్ చేయకపోవడంపై ఈ ఏడాది మార్చి 10న, ఏప్రిల్ 7న కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 21న కరప పోలీసులు తన వద్దకు వచ్చి బండారు మురళి, మరో ఇద్దరిపై పెట్టిన కేసు కొట్టివేశారు.. కాగితాలపై సంతకం చేయమని అడిగారని, సంతకం చేయనని చెప్పడంతో పోలీసులు వెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధింపులకు గురి చేసినవారిపై చార్జిషీట్ వేసి, వారిని అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్టు సునీత తెలిపారు. తన చావుతో న్యాయం జరుగుతుందని పోలీసులు భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. -
శ్రీరస్తు.. శుభమస్తు..
● వివాహ సందడి మళ్లీ ప్రారంభం ● నవంబర్ 26 వరకూ ముహూర్తాలే ● ఫంక్షన్ హాల్స్, టెంట్‌హౌస్‌లు, బ్యాండ్ మేళాలకు డిమాండ్ కాకినాడ సిటీ: సుమారు 80 రోజుల విరామం తర్వాత శుభకార్యాలకు మళ్లీ మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే 25 నుంచి జూలై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం శుభకార్యాలకు శ్రేష్టం కావడం.. ఈ నెల 27 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ 35 మంచి ముహూర్తాలు ఉండటంతో లగ్గాలు, వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జోరుగా జరగనున్నాయి. ఈ నెల 30, 31; ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20; సెప్టెంబర్ 24, 26, 27, 28; అక్టోబర్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31; నవంబర్ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈ నాలుగు నెలల్లో మొత్తం 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్కకు మిక్కిలిగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీరికి డిమాండ్ వివాహాల సీజన్ మొదలవడంతో పురోహితులు, బ్యాండ్ మేళాలు, టెంట్‌హౌస్‌లు, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీరిని ముందుగానే మాట్లాడుకున్నారు. పెళ్లివారు ముందుగానే అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారు. మరోవైపు ఫంక్షన్ హాళ్లకు కూడా ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు 2 నెలల ముందే ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,500కు పైగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, మరో వెయ్యి వరకూ టీటీడీ, ప్రభుత్వ కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. చాలా మంది ఫంక్షన్ హాల్స్ దొరక్కపోవడంతో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాల్లో సైతం వివాహాలు జరపడానికి సిద్ధపడుతున్నారు. ప్రారంభమైన వివాహాలు శ్రావణ మాసం ప్రారంభం కావడం.. నవంబర్ 26 వరకూ వివాహ ముహూర్తాలు ఉండటంతో జిల్లాలో అధిక సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే 150కి పైగా పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. – సుబ్రహ్మణ్యశాస్త్రి, పండితుడు, కాకినాడ టెంట్ హౌస్‌లకు ఫుల్ గిరాకీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్‌హౌస్ సామగ్రిని బుక్ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 80 రోజులుగా శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం టెంట్‌హౌస్‌లకు గిరాకీ పెరిగింది. – కొండబాబు, టెంట్‌హౌస్ నిర్వాహకుడు, కాకినాడ -
జాబ్‌చార్టుపై అవగాహన అవసరం
ఎంపీడీఓల శిక్షణలో రాష్ట్ర అదనపు కార్యదర్శి వెంకటకృష్ణ సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్‌చార్టుపై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీల సొంత వనరుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అదనపు కార్యదర్శి కె.వెంకటకృష్ణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు నిర్వహించే శిక్షణకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పదోన్నతి పొందిన 46 మందికి మొదటి బ్యాచ్‌లో శిక్షణను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు సొంత వనరులు సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీలు సమగ్రాభివృద్దికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సామాజిక న్యాయంతో కూడిన ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు, బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలులో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలనే పాటించవలసిన పనిలేదన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు మాట్లాడుతూ ఎంపీడీఓ విధి నిర్వహణలో మండల ప్రజా పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. డ్వామా ఏపీడీ భానుప్రకాష్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఎంపీడీవో డి.శ్రీలలిత, ఫ్యాకల్టీలు శర్మ, డి.శ్రీనివాసరావు, కె సుశీల మొదటి రోజు శిక్షణ నిర్వహించారు. -
భర్తపై భార్య కత్తి పీటతో దాడి
అమలాపురం టౌన్: తల్లికి వందనం డబ్బు ఏమి చేశావని అడిగినండుకు భర్తపై భార్య కత్తి పీటతో దాడి చేసి గాయపరిచింది. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం...అమలాపురం పట్టణం సావరం రోడ్డులో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సావరం రోడ్డులో నివాసం ఉంటున్న పెనుమాల దుర్గాప్రసాద్, దుర్గ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారికి ఇటీవల తల్లికి వందనం పతకం కింద వచ్చిన డబ్బు ఏమి చేశావని భర్త దుర్గాప్రసాద్ భార్య దుర్గను అడిగాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య దుర్గ భర్తపై కత్తి పీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో భర్త చికిత్స పొందుతున్నాడు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్‌బాబు చెప్పారు. -
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వయసు, అనుభవాన్ని పక్కన పెట్టి మరీ మంత్రి పదవి కోసం ‘నరుకుతాను, ఉరి తీయాలి’ అని మాట్లాడటం సబబేనా? తన నియోజకవర్గంలో రైతులు పడుతున్న కష్టాలపై చంద్రబాబును నిలదీయాలి. గోదావరి నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలించి బుచ్చయ్య చౌదరి సాగిస్తున్న దందా గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయి అమ్మకాల్లో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అయినప్పటికీ వాటిని తయారు చేస్తున్న డిస్టిలరీలను ఈ ప్రభుత్వం ఎందుకు సీజ్ చేయడం లేదు? బుచ్చయ్య చౌదరి చెప్పినట్లు ఉరి తీయాలనుకుంటే ఈ ప్రభుత్వంలో అక్రమంగా మద్యం, గంజాయి, ఇసుక తరలించే వారిని ఉరి తీయాలి. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజల్ని వంచించిన కూటమి నాయకులే బుచ్చయ్య చౌదరి చెప్పిన ఉరి శిక్షకు అర్హులు. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
ధవళేశ్వరం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మత్స్యకారుడు మృతి చెందాడు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జలారుపేటకు చెందిన సావదాల సత్యారావు (43) సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో గోదావరిలో చేపలు పట్టేందుకు కాటన్ బ్యారేజీ వద్దకు వెళ్లాడు. బ్యారేజ్ స్కవర్ స్లూయిజ్ వద్ద ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారులో శిశువు జననం ప్రత్తిపాడు రూరల్: కారులో పండంటి పాపకు ఓ మహిళ సోమవారం జన్మనిచ్చింది. మండలంలోని రాచపల్లికి చెందిన మడికి సారికకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గీత సెలవులో ఉండడంతో సిబ్బంది వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకువెళ్లాని సిబ్బంది సూచించారు. దీంతో గర్భిణి భర్త మడికి చిన్నిబాబు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీనుకు విషయం తెలిపారు. దీంతో వైస్ ఎంపీపీ శ్రీను తన కారు రాచపల్లి పీహెచ్‌సీకి పంపి గర్భిణిని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. రాచపల్లి దాటిన వెంటనే పోలవరం కాలువ వద్ద పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కారులో ఉన్న ఆశా వర్కర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పురుడు పోసింది. తిరిగి రాచపల్లి పీహెచ్‌సీకి తల్లీబిడ్డను తరలించి వైద్య సేవలు అందించారు. -
పశువుల అక్రమ తరలింపుపై కేసు
గండేపల్లి: పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని గండేపల్లి జాతీయ రహదారిపై ఎస్సై యు.వి.శివనాగబాబు, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో తుని నుంచి చిలకలూరిపేటకు అక్రమంగా తరలిస్తున్న 4 ఆవు దూడలు, 12 ఎద్దులను గుర్తించి వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలియజేశారు వ్యక్తి మృతికి కారణమైన యువకుడి అరెస్ట్రామచంద్రపురం రూరల్: ఈ నెల 22వ తేదీ రాత్రి సుమారు 11.45 గంటలకు జగన్నాయకులపాలెం గ్రామంలో ప్రధాన రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న తాళ్లపొలం గ్రామానికి చెందిన వనుం కృష్ణను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోగా అతడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ప్రమాద సంఘటన జరిగిన తరువాత ఆ స్థలంలో లభించిన కారు సైడ్ మిర్రర్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కారు మండపేటలోని దుర్గా మల్లేశ్వరి మెకానికల్ షెడ్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు, తనకు అందిన సమాచారం మేరకు రామచంద్రపురానికి చెందిన కారు డ్రైవర్ దామిశెట్టి వెంకట వర్షిత్‌ను జగన్నాయకులపాలెం గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు దాటిన తరువాత గున్నయ్య తూము వద్ద ఆదివారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
ధర ఢమాల్
మంచి మార్కెట్ కొనసాగుతోంది ప్రస్తుతం మంచి మార్కెట్ కొనసాగుతోంది. కిలో సగటు ధర రూ.287 లభిస్తోంది. కంపెనీలు సిండికేట్ కావడంతో మార్కెట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దీంతో, మార్కెట్లో ధర పెరిగి, తగ్గింది. సగటు ధర కిలో రూ.300 ఉంటే గిట్టుబాటు అవుతంది. కిలోకు రూ.22 వరకూ తగ్గింది. నాణ్యతను బట్టి ధర పలుకుతుంది. మంచి గ్రేడులకు ధర బాగుంది. ముందు ముందు మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేం. కౌలు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ ధరకు భూముల కౌలు, బ్యారన్లు తీసుకుంటే నష్టపోతారు. – కరుటూరి శ్రీనివాస్, అధ్యక్షుడు, పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం, దేవరపల్లి నిబంధనలు కఠినతరం పొగాకు బోర్డు నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2025–26 పంట కాలానికి సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించారు. బ్యారన్‌కు 3,512 కిలోల చొప్పున ఎన్ఎల్ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో 49.70 మిలియన్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఉంది. దీనికి మించి పంట ఉత్పత్తి చేస్తే రైతులు నష్టపోతారు. పంట నియంత్రణ రైతుల చేతుల్లోనే ఉంటుంది. 2024–25 పంట కాలంలో 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, వచ్చే పంట కాలానికి సుమారు 9 మిలియన్ల కిలోలు తగ్గించారు. పంట సాగుకు, నర్సరీల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మార్కెట్ హెచ్చుతగ్గుల్లో నడుస్తోంది. – జీఓల్కే ప్రసాద్, రీజినల్ మేనేజర్, పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం ● పడిపోయిన వర్జీనియా పొగాకు రేటు ● కిలోకు రూ.20 తగ్గుదల ● రెండు వారాలుగా కిలో గరిష్ట ధర రూ.390 ● నేడు రూ.370 ● దిగులు చెందుతున్న రైతులు దేవరపల్లి: ఊహించని విధంగా వర్జీనియా పొగాకు ధర పడిపోయింది. మార్కెట్లో దాదాపు రెండు వారాలుగా కిలో గరిష్ట ధర రూ.390 పలుకుతూండగా.. శనివారం అది ఏకంగా రూ.20 తగ్గి రూ.370కి పడిపోయింది. దీంతో, రైతులు దిగులు చెందుతున్నారు. ఈ నెల 9న రూ.290 ధర పలకగా 10న రూ.336, 11న రూ.348, 16న ఏకంగా రూ.392కు పెరిగింది. ఒకే రోజు కిలోకు రూ.44 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్కెట్లో ఇదే గరిష్ట ధర. ఈ ధర ఈ నెల 17న రూ.390కి తగ్గి, శుక్రవారం వరకూ దాదాపు పది రోజుల పాటు అదే స్థాయిలో కొనసాగింది. దీంతో, తమ పంట పండిందనే రైతులు భావించారు. ఈ ధర ఇలాగే పెరుగుతూ రూ.400కు చేరుతుందని ఆశ పడ్డారు. పెట్టుబడులు, కౌలు డబ్బులు చేతికి వచ్చి, అప్పులు తీరడంతో పాటు కాస్త మిగులుతాయని ఆనందపడ్డారు. అయితే, వారి ఆశలపై నీళ్లు జల్లేలా ఒక్క రోజులోనే ధర కిలోకు రూ.20 తగ్గిపోయింది. దీంతో, ముందుముందు మార్కెట్ ఎలా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు. రూ.1,077 కోట్ల పొగాకు విక్రయాలు పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.1,077 కోట్ల విలువైన 37.53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పండిచే పొగాకు 35.87 మిలియన్ల కిలోలు, బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు 1.65 మిలియన్ల కిలోల మేర విక్రయాలు జరిగాయి. ఐదు వేలం కేంద్రాల్లో కిలో సగటు ధర ఎన్ఎల్ఎస్ పొగాకుకు రూ.289.19, బీఎస్ పొగాకుకు రూ.239.96 మేర లభించింది. ఎన్ఎఎల్ఎస్ పొగాకు ధర కిలోకు గరిష్టంగా రూ.370, కనిష్టంగా రూ.190 చొప్పున రైతులకు లభించింది. దాదాపు 45 మిలియన్ల కిలోల పొగాకు రైతుల వద్ద అమ్మకానికి ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ గ్రేడ్, మిడిల్ గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని రైతులు చెప్పారు. లీఫ్ గ్రేడ్ బేళ్లను నిల్వ చేసి ఉంచారు. దీనికి చివరిలో మంచి మార్కెట్ ఉంటుందని వారు భావిస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు విక్రయాలు జరగాల్సి ఉంది. అదనపు కోటా కోసం నిరీక్షణ పొగాకు బోర్డు నిర్దేశించిన విధంగా బ్యారన్‌కు 45 క్వింటాళ్ల పొగాకు విక్రయాలు పూర్తయిన రైతులు అదనంగాా పండించిన పొగాకును మార్కెట్లో అమ్ముకోవడానికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఏటా వేలం ముగింపు సమయంలో అదనంగా పండిన పొగాకును అమ్ముకోవడానికి బోర్డు అనుమతిస్తుంది. దీనికి కిలోకు రూ.5 శాతం అపరాధ రుసుంతో పాటు 2 శాతం కమీషన్‌ను రైతుల నుంచి వసూలు చేస్తోంది. గత ఏడాది రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో అదనంగా పండించిన పొగాకు అమ్మకాలపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అపరాధ రుసుం రద్దు చేసింది. దీని ద్వారా రైతులకు సుమారు రూ.184 కోట్ల లాభం చేకూరింది. అయితే 2025–26 పంట కాలంలో అదనంగా పండించిన పొగాకుకు పెనాల్టీ తప్పదని అప్పట్లోనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరింది. మార్కెట్లో ధర బాగున్నందున ఈ సమయంలో అదనపు పంట అమ్ముకోవడానికి అనుమతిస్తే తమకు లాభసాటిగా ఉంటుందని రైతులు అంటున్నారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్ కిలోలు) దేవరపల్లి 6.29 జంగారెడ్డిగూడెం–1 8.43 జంగారెడ్డిగూడెం–2 8.04 కొయ్యలగూడెం 7.53 గోపాలపురం 7.21 -
గంజాయి పట్టివేత?
సీతానగరం: మండలంలోని నల్గొండ దగ్గరలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆదివారం గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని నల్గొండ – సీతానగరం మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రాజమహేంద్రవరానికి విచారణ నిమిత్తం తరలించారు. విచారణ అనంతరం రెండు రోజుల్లో పూర్తి వివరాలను తెలియజేస్తామని పోలీసులు వివరించారు. మహిళకు తప్పిన ప్రాణాపాయం ● ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా కాపాడిన పోలీసులు ధవళేశ్వరం: కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళను ధవళేశ్వరం పోలీసులు రక్షించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ధవళేశ్వరం టిడ్కో గృహ సముదాయానికి చెందిన 28 ఏళ్ల మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఆమె తన బావకు ఫోన్‌చేసి విషయం చెప్పింది. దీంతో ఆయన 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ టి.గణేష్ కానిస్టేబుల్ వెంకటేష్‌ను నాలుగు నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలానికి పంపగా ఆయన వెంటనే తలుపులు పగులగొట్టి ఉరివేసుకోబోతున్న మహిళను కిందకు దించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ ప్రాణాలు కాపాడిన పీసీ వెంకటేష్, ఇన్స్పెక్టర్ గణేష్, కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఎస్పీ డి.నరసింహకిశోర్ అభినందించారు. -
వాడపల్లి స్వామికి దండిగా ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఆదివారం దండిగా ఆదాయం లభించింది. స్వా మివారిని విశేషంగా భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వే దాశీర్వచనం, అన్న ప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి ఈ ఒక్కరోజే రూ.6,73,949 ఆ దాయం వచ్చిందని దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం చక్రధరరావు వివరించారు. ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిత్య కల్యాణంతో పాటు ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులు అష్టోత్తర నామార్చనలు నిర్వహించారు. -
కూటమి పాలనలో దళితులపై వివక్ష
వైఎస్సార్ సీపీ పాలనలో దళితులకు పెద్దపీట వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని సుధాకర్‌బాబు గుర్తు చేశారు. దళితుల సంక్షేమ పథకాలకు రూ.2.75 లక్షల కోట్లు అందించారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో ఉన్న పేదల కోసం తానున్నానని భరోసా ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. ‘నీకోసం, నాకోసం, ఊరు, వాడ కోసం, దగాపడ్ట అక్కచెల్లెమ్మల కోసం, సమాజం, అణగారిన వర్గాల కోసం వైఎస్ జగన్‌ను తిరిగి సీఎంను చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. జగన్‌ను గద్దె దింపడం కోసం ఈవీఎంలే పని చేశాయో.. ఢిల్లీ పెద్దలే పని చేశారో.. కుతంత్ర రాజకీయాలే పని చేశాయో తెలియదు. కానీ, ఈ సమయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు దళితులందరూ నడుం బిగించి ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు. దళిత వర్గాల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుకోవాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా, అంబేడ్కర్ ఆశయాలు కొనసాగాలన్నా జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, అందుకు దళితులందరూ కలసికట్టుగా కృషి చేసి, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్ సీపీని గెలిపించాలని అన్నారు. అన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి, అన్ననే వంచించాడని పవన్‌కు పరోక్షంగా చురకలు వేశారు. సాక్షి, రాజమహేంద్రవరం/సీటీఆర్ఐ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దళితులపై వివక్ష పెరిగిందని, దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. రాజమహేంద్రవరం సంహిత డిగ్రీ కళాశాల ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన జిల్లా దళిత నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై వివక్ష పేట్రేగిపోతోందన్నారు. దళిత జాతి తలెత్తుకుని జీవించాలన్నా, సంక్షేమ పథకాలు మళ్లీ అందాలన్నా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి సీఎంగా రావాలని అన్నారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అలుపెరగని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూంటే వేధింపులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా బరితెగించి వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలను ఎదుర్కొనేందుకు దళిత జాతి అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మన దగ్గర డబ్బు లేకపోవచ్చు. కార్లు, బంగ్లాలు లేకపోవచ్చు. కానీ, గుండెల నిండా సత్తా ఉంది’ అని అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. నమ్మిన వారి కోసం ప్రాణాలర్పించే సత్తా దళితులకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత గ్రామాల్లో చిట్టచివరి గ్రామం వరకూ కూటమి ప్రభుత్వ అరాచకాలను తీసుకెళ్లేందుకు దళితులందరూ సంసిద్ధంగా ఉండాలని సుధాకర్‌బాబు సూచించారు. కూటమి కుట్రలపై ‘దళిత ఫోర్స్’ కూటమి ప్రభుత్వం దళితులు, ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా దళిత ఫోర్స్‌ను నియమించనున్నట్లు సుధాకర్‌బాబు వెల్లడించారు. దీనికోసం 82,987 మందిని ఎంపిక చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17 నగరాలున్నాయని, ఒక్కో నగరంలో 30 మంది చొప్పున 510 మందిని నియమిస్తామని చెప్పారు. అలాగే, 660 మండలాలకు గాను ఒక్కో మండలానికి 18 మంది చొప్పున 11,888 మందిని 104 పట్టణాలకు గాను ఒక్కోచోట 18 మంది చొప్పున 18,072 మందిని, 13,500 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి ఐదుగురు చొప్పున 67,500 మందిని దళిత ఫోర్స్‌లో భాగస్వాముల్ని చేస్తామని వివరించారు. మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అమ్మ ఒడి అనగానే జగనన్న గుర్తుకొస్తే.. ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకొచ్చేది వైఎస్సార్ అని అన్నారు. ఎన్నో పథకాల సృష్టికర్త జగన్ అని చెప్పారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, జగన్ నాయకత్వం మరింత బలపడేందుకు ప్రధాన కారణం దళితులేనని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కీలకమైన దళిత వర్గాలు ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని, వైఎస్ జగన్‌ను సీఎంను చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, చంద్రబాబు దళిత ద్రోహి అని, అబద్ధాల్లో ఘనుడని ఆరోపించారు. వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచిన నేత వైఎస్ జగన్ అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మంత్రి, నామినేటెడ్ పదవుల్లో దళితులకు పెద్దపీట వేసిందన్నారు. అనంతరం దళిత ప్రజాప్రతినిధులు, నేతలను సుధాకర్‌బాబు ఘనంగా సన్మానించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు అటకెక్కిన సంక్షేమం వైఎస్ జగన్‌తోనే అంబేడ్కర్ ఆశయ సాధన ఆయనను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా సాగుదాం వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు పిలుపు రాజమహేంద్రవరంలో దళితుల ఆత్మీయ సమావేశం -
మూగజీవాలకూ హక్కులున్నాయ్..
ఫ పశువులు, వన్యప్రాణులను చంపడం నేరం ఫ జంతు రవాణాలో జాగ్రత్తలు అవసరం రాయవరం: శారీరకంగా ఎక్కువగా బాధిస్తే, గొడ్డును బాదినట్లు బాదారు అంటారు. పశువుకన్నా హీనంగా ప్రవర్తించాడంటారు. అంటే పశువులను ఇష్టం వచ్చినట్లు దండించవచ్చని, అవమానించవచ్చని చాలా మంది ఉద్దేశం. వాటికి నోరు లేదు కాబట్టి ఎవరికీ తమ బాధ చెప్పుకోలేవు. అలాంటి మూగజీవాల రక్షణకు చట్టాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియని విషయం. అయితే మనుషులకే కాదు జంతువులకూ హక్కులుంటాయని మాచవరం పశు వైద్యురాలు ఎం.బిందు వివరించారు. అకారణంగా జంతువులను హింసిస్తే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జంతువుల రవాణా, పెంపకంలోనూ వాటికి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో మూగజీవాలు, పశువులను విచక్షణా రహితంగా వాహనాల్లో తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో పశువులను చిన్న చిన్న వాహనాల్లో కుక్కి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మూగజీవాల రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. వాటిని అమలు పరిచేందుకు వివిధ విభాగాల అధికారులతో కమిటీలు వేసింది. అయినప్పటికీ పశువుల హక్కుల ఊసెక్కడా కన్పించడం లేదు. జంతువులను క్రూరంగా హింసిస్తూ ఆటోలు, లారీల్లో రవాణా చేస్తుంటారు. పశువుల మార్కెట్ నుంచి పశు సంపదను ఒకచోట నుంచి మరోచోటకు తరలించే క్రమంలో తీవ్ర హింసకు గురిచేస్తున్నారు. అలాగే పంట చేను మేసిందనే కోపంతో కొందరు పశువులను ఇష్టం వచ్చినట్లు బాదినా, నోరులేని పశువులు ఆ దెబ్బలను మౌనంగా భరిస్తూ ఉంటాయి. మానవ మనుగడకు సహాయపడుతూ జీవించే జంతుజాలం కోసం చట్టం ఏం చెబుతుందంటే.. చట్టం... జరిమానాలు ఫ జంతువులపై క్రూరత్వ నివారణ/ నిరోధక చట్టం 1960లో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం వాహనాల్లో ఓవర్ లోడింగ్, తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం, నొప్పిని కలిగించే చర్యలను క్రూరత్వంగా పరిగణిస్తారు. ఫ పది రూపాయలకు పైన విలువ చేసే ఏ జీవినైనా హింసిస్తే భారత శిక్షాస్మృతి కింద నేరమవుతుంది. ఫ చిన్న వయసులో ఉన్న పశువులను, వ్యాధి బారిన పడిన వాటిని గానీ ఎలాంటి పనులకూ ఉపయోగించరాదు. ఫ అవసరం కోసం లేదా కావాలని పశువుల శరీరానికి హాని కలిగించే మందులు, పదార్థాలను ఇవ్వకూడదు. కొందరు పశువుల యజమానులు పాల దిగుబడిని పెంచేందుకు అనవసరంగా మందులను ఇచ్చి బాధిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. ఫ పశువులను ఒకచోట నుంచి మరోచోటకు తరలిస్తున్నప్పుడు వ్యాన్లు, ఆటోల్లో కిక్కిరిసేలా ఉంచరాదు. వాటికి బాధ కలిగించకుండా తరలించే ఏర్పాటు చేయాలి. ఒక వాహనంలో పరిమితికి మించి పశువులను తరలించడం నేరం. ఫ అలాగే పశువులు, జంతువులను ఎక్కువ సేపు కట్టేసి ఉంచడం కూడా నేరమే. ఫ జంతువులు, పక్షులను పందెం కోసం వాడడం, చిత్రహింసకు గురిచేయడం, చంపడాన్ని చట్టం నిషేధించింది. ఫ వధశాలలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. చూడితో ఉన్న, మూడు నెలల కంటే తక్కువ వయసున్న జంతువులను వధించరాదు. పశు వైద్యాధికారి పరీక్షించిన తర్వాతే జంతువును వధించాలి. లేదంటే నేరంగా పరిగణిస్తారు. వన్యప్రాణులకూ రక్షణ వన్య ప్రాణులను వేటాడడం, వాటిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలు శిక్షార్హం. ఇలాంటి నేరాలకు పాల్పడితే సెక్షన్–1 (ఏ) ప్రకారం జరిమానా విధిస్తారు. మూడేళ్లలో మరోసారి ఇలాంటి తప్పు చేసినట్లు రుజువైతే జరిమానాతో పాటు మూడు నెలల శిక్ష కూడా విధిస్తారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు మూగజీవాలను హింసిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వాటి హక్కుల రక్షణకు చట్టాలున్నాయి. వాటిని అక్రమంగా తరలించడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేసి, మూగజీవాలను రక్షిస్తాం. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం పరిశీలించిన తర్వాతే రవాణా పశువులు, జంతువులను రవాణా చేసేటప్పుడు స్థానిక పశువైద్యాధికారి వాటిని పరిశీలించి, అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే తరలించాలి. అప్పుడే ఈనిన పశువు లేదా అనారోగ్యంతో ఉన్న పశువును తరలించడం నేరం. చూడితో ఉన్న పశువు, లేగదూడలను వేరే పశువులతో కలిపి రవాణా చేయడం నేరం. – ఎం.బిందు, పశు వైద్యాధికారి, మాచవరం -
డైరెక్టర్ల అసమర్థత వల్లే అన్యాయం
అమలాపురం టౌన్: జయలక్ష్మి ఎంఏఎం కోపరేటివ్ సొసైటీ ప్రస్తుత బోర్డు డైరెక్టర్ల అసమర్థత వల్లే బాధితులకు నేటికీ అన్యాయం జరుగుతోందని బాధితుల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ యీరంకి రఘు భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు డైరెక్టర్లు తక్షణం రాజీనామా చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని ఏఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్టా జిల్లాలకు చెందిన సొసైటీ బాధితులు ఆదివారం సమావేశమై బోర్డులో జరుగుతున్న అవకతవకలపై చర్చించారు. సొసైటీ బోర్డు తిప్పేసి ఏళ్లు గడుస్తున్నా బాధితులకు ఒక్క రూపాయి కూడా న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ అమలాపురం బ్రాంచి బాధితుడు టీవీడీఎన్ ప్రసాదరావు మాట్లాడుతూ సొసైటీలో ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలను సమావేశానికి వివరించారు. సొసైటీ బాధితుడు, విశ్రాంత బ్యాంక్ అధికారి గుళ్లపల్లి వెంకటరామ్ మాట్లాడుతూ పారదర్శకత లేని ప్రస్తుత బోర్డు వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు 80 మంది డిపాజిటర్లు మరణించారని, బాధితులకు న్యాయం చేయలేని అమలాపురానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క అమలాపురం శాఖ పరిధిలోనే దాదాపు రూ.50 కోట్ల వరకూ డిపాజిట్లు చేసి నష్టపోయారని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన అమలాపురానికి చెందిన బోర్డు డైరెక్టర్లు స్వామి ప్రసాద్, గవర్రాజు కుమార్‌లను బాధితులు తమ డిపాజిట్ల కోసం నిలదీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. సొసైటీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి డైరెక్టర్ల చేత రాజీనామాలు చేయించి తాజాగా కొత్త బోర్డును నియమించాలని సమావేశం నిర్ణయిస్తూ ఓ కార్యచరణ ప్రకటించింది. సొసైటీలో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులంతా ఒక తాటిపై ఉండి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించింది. సమావేశంలో మహిళా బాధితులు కూడా వచ్చి తమ నిరసన తెలియజేశారు. సమావేశంలో సొసైటీ బాధితులు పుత్సా కృష్ణ కామేశ్వర్, వి.సుబ్బారావు, కస్తూరి రవికుమార్, పిల్లి గణేష్, చక్రవర్తి, బదరీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. జయలక్ష్మి సొసైటీ బాధితుల ఆవేదన పాతవారి స్థానంలో కొత్త డైరెక్టర్లను ఎన్నుకోవాలని కార్యాచరణ ప్రణాళిక అమలాపురం సమావేశంలో నిర్ణయం -
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● రూ.30 లక్షల ఆదాయంఅన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం చేసి, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామి, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథపై ఊరేగించారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, చిట్టి శివ, ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తాత్రేయశర్మ, పరిచారకుడు గణేష్ తదితరులు నిర్వహించారు. సత్యదేవుడిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
వరద గోదారి
● సముద్రంలోకి 6 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న ఉధృతి ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,01,884 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతూండటంతో మిగులు జలాల విడుదలను పెంచారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద కూడా సోమవారం నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 34.60 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా నమోదైంది. మరిడమ్మ సన్నిధిలో భక్తుల సందడి పెద్దాపురం: మరిడమ్మ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి, క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కొత్తపేట, పాశిలి వీధి సంబరాలు ఘనంగా నిర్వహించారు. లోవకు కొనసాగుతున్న భక్తుల రద్దీ తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలు ముగిసి, శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ లోవ దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, తలుపులమ్మ అమ్మవారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మె త్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,265, పూజా టికెట్లకు రూ.2,62,031, తలనీలాలకు రూ.19,150, వాహన పూజలకు రూ.7,550, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.87,576, విరాళాలు రూ.66,375 కలిపి మొత్తం రూ.6,90,947 ఆదాయం లభించిందని వివరించా రు. తలుపులమ్మ అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదును సోమవారం లెక్కిస్తామని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ, బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరచి, నగ దు లెక్కిస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొంటారన్నారు. -
● చెత్తలో చిత్తై..
అందమైన లోకమనీ.. రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా.. అంత అందమైంది కానేకాదని ఓ కవి వాక్యం. నిజమే కదా. కొందరి జీవితాలు నిర్వచనాలకు అందనివి. వివర్ణమైన జీవనాన్ని ఎవరు ఆశిస్తారు? బరువైన బతుకుదెరువు ఎవరైనా ఎంచుకుంటారా? విధిరాతగా ఎంచి ఓ నిట్టూర్పు విడవడం తప్ప. ఈ శ్రమజీవిని కన్న తల్లి తన బిడ్డ ఇలా జీవించాలని కోరుకుంటుందా? ఎంత అగత్యమో కదా..? పూట గడవడానికి ముక్కుపుటాలు అదిరే మురుగునీటిలో తేలియాడే ప్లాస్టిక్, గాజు సీసాల సేకరణే జీవనాధారం కావాలా? చెత్తలో చిత్తైన జీవనపోరాటం ఎన్నాళ్లో..! రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ వీరభద్రపురం ప్రధాన డ్రైనేజీలో ఓ శ్రామికుని జీవనమిది. – ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) -
కోటసత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.2,01,266 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. కోటసత్తెమ్మ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు నిడదవోలుకు చెందిన అయితం కనకయ్య, లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు సత్యనారాయణ, గంగాధర్, శివయ్య కుటుంబ సభ్యులు ఆదివారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పరీక్ష ప్రశాంతం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎయిడెడ్ ఉపాధ్యాయ పరీక్ష రాజమహేంద్రవరం, కాకినాడలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని ఎస్తేర్ ఆగ్జిన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఎయిడెడ్ పోస్ట్‌లకు విద్యా శాఖ ఈ పరీక్షలు నిర్వహించింది. దీనికి మొత్తం 1,249 మంది అభ్యర్థులకు హాజరు కావాల్సి ఉండగా 426 మంది పరీక్షలు రాశారు. కాకినాడలోని అచ్యుతాపురం సెంటర్లో 181 మంది, రాజమహేంద్రవరం లూథరిగిరి సెంటర్లో 245 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ వాసుదేవరావు తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనపర్తి: మండలంలోని లక్ష్మీనరసాపురంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం వరకూ ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా ఎస్టీ విద్యార్థులకు 6, 7, 8, 9 తరగతుల్లో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28న నేరుగా పాఠశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
కక్ష పూరితంగానే మిథున్ రెడ్డి అరెస్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కక్షపూరితంగానే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయనకు సౌకర్యాలు కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడాన్ని బట్టి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టు అర్ధం అవుతోందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అయితే 40 ఏళ్లుగా చంద్రబాబుకి వైరం ఉండొచ్చని, అది అడ్డం పెట్టుకుని ఆయన కొడుకుని ఇలా ఇబ్బంది పెట్టి ఆనందం పొందడం ఎంతవరకు సబబన్నారు. చివరకు మిథున్ రెడ్డిని భార్య, పిల్లలు కలవడానికి వస్తే కూడా ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేస్తూ వచ్చారన్నారు. అసలు ప్రభుత్వ మద్యం పాలసీలో నష్టం ఎక్కడ వచ్చిందని, ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సరికి రూ.18 వేల కోట్ల మేర మద్యం ద్వారా ఆదాయం ఉండేదని, అదే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.25 వేల కోట్లకు పెరిగిందన్నారు. మరి రూ 3,200 కోట్లు అవినీతి ఎలా నిరూపిస్తారని ప్రశ్నించారు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించడం వలన ప్రభుత్వ ఖజానాకు రూ.3 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. అది కదా స్కామ్, క్విడ్ ప్రోకో అంటే అన్నారు. ఇవన్నీ ప్రజలు అంతా గమనిస్తున్నారని భరత్ అన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ -
సంక్షామ గృహాలు!
సాక్షి, రాజమహేంద్రవరం/నెట్వర్క్: అపరిశుభ్రతతో కూడిన పరిసరాలు, చాలీచాలని గదులు.. దోమలతో సహజీవనం.. నేలపై భోజనాలు.. వెరసి సంక్షేమ, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పేద విద్యార్థుల సంక్షేమం, వసతితో కూడిన విద్య అందించేందుకు నెలకొల్పిన గృహాల నిర్వహణ లోపం, అపరిశుభ్ర వాతావరణం కంపరం కలిగిస్తున్నాయి. నాణ్యమైన ఆహారం లేకపోవడం మరో సమస్య. సీసీ కెమేరాలు, ప్రహరీలకు విద్యుత్ ఫెన్సింగ్ లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పనిచేయని పరిస్థితి. వసతిగృహాల్లో వసతులపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన చెందింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భావితరాలపై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అభిప్రాయపడింది. విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా విద్య, వసతి పొందేలా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేసింది. జిల్లాలోని వసతిగృహాల్లో ‘సాక్షి’ చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో అనేక సమస్యలు తేటతెల్లమయ్యాయి. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 36 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. సుమారు 2,600 మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. బీసీ హాస్టళ్లు 24 ఉండగా 1,657 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక గురుకుల పాఠశాల ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల, కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. అన్నిచోట్లా ఇబ్బందులే.. ● రాజమహేంద్రవరం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ముగ్గురు వార్డెన్లు మూడు విభాగాలుగా పనిచేస్తున్నారు. వీరిలో 310 మంది విద్యార్థులున్నారు. వారిని ముగ్గురు వార్డెన్లకు సమానంగా విభజించారు. ● ఎస్సీ బాలుర హాస్టల్లో 90 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తాగేందుకు రక్షిత నీరు లేదు. మున్సిపల్ నీటినే తాగుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంగా ఉంది. ● ఎస్సీ బాలుర కళాశాల హాస్టల్లో వార్డెన్ లేరు. సమీప ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ ఇన్‌చార్జ్జిగా వ్యవహరిస్తున్నారు. ● ఎస్టీ బాలుర హాస్టల్లో వంట గది, చుట్టూ ప్రహరీ లేవు. ఆ ఆవరణలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ హాస్టళ్లకు స్కావెంజర్లు లేకపోవడంతో వార్డెన్లు సొంత డబ్బులతో ఏర్పాటు చేసి పనులు కానిస్తున్నారు. ● కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 3 నుంచి పదో తరగతి వరకు 29 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.12 లక్షలతో చేపట్టిన హాస్టల్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా ఫ్లోరింగ్, శ్లాబ్ లీకేజీ పనులు చేయాలి. కిటికీలకు మెష్‌లు లేవు. విద్యార్థులు దోమల బెడదతో బాధపడుతున్నారు. చుట్టుపక్కల వారు చెత్త వేయడంతో అపరిశుభ్రంగా ఉంది. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మూడు హాస్టళ్లు ఉన్నాయి. ధవళేశ్వరంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్, కడియంలో బీసీ బాలుర వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో గతంలో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఫ్యాన్లు, కిటికీలకు, తలుపుల బాగుచేయించి దోమల మెష్‌లు వేశారు. మరుగుదొడ్లు బాగుచేయించారు. భవనానికి పెయింటింగ్ వేయాల్సి ఉంది. ● కడియం బీసీ బాలుర వసతి గృహంలో 13 మంది, ఎస్సీ బాలికల వసతి గృహంలో 25 మంది ఉంటున్నారు. వీరికి పాఠశాల దూరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఇక్కడ చేర్చేంచేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు వసతి గృహాలకు రెండేసి మరుగుదొడ్ల అవసరం ఉన్నప్పటికీ విద్యార్థులు తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. సబ్ మెర్సిబుల్ మోటారు సరిగా పని చేయక గోదావరి రక్షిత నీటిని వినియోగిస్తున్నారు. లైట్లు, ఫ్యాన్లు, వంట సామగ్రి, మిక్సీ, గ్రైండర్ ఇటీవలే ఇచ్చారు. రెండు భవనాలకు పెయింటింగ్స్ వేయాల్సి ఉంది. ● అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో అనపర్తి శివారు లక్ష్మీ నరసాపురంలో గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ జూనియర్ కాలేజీ ఉంది. ఇందులో సుమారు 483 మంది చదువుతున్నారు. హాస్టల్లో డైనింగ్ హాలు, బయట పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. తినేసి వదిలేసిన ఆహార పదార్థాలు, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం అపరిశుభ్రంగా ఉన్నాయి. డైనింగ్ హాల్ ద్వారం వద్ద టైల్స్ శిథిలమయ్యాయి. ఈ హాస్టల్లో ఒకటి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుతున్నారు.హైకోర్టు మార్గదర్శకాలు ఇలా.. వసతి గృహం భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్‌తో ప్రహారీ నిర్మించాలి. గేటు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థుల రాకపోకలు ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. హాస్టల్ ప్రవేశ మార్గం, కామర్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మురగుదొడ్లు శుభ్రంగా ఉండాలి. నీటి సదుపాయం కల్పించాలి. హాస్టళ్ల సిబ్బందికి ప్రవర్తనా నియమావళిని నిర్దేశించాలి. విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా హాస్టళ్లు ఉండాలి. ఇలా అనేక మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క వసతి గృహంలోనూ ఈ మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు. వసతి గృహాల్లో సమస్యల తాండవం అపరిశుభ్రత, తాగునీటికి ఇబ్బందులు నేలపైనే భోజనాలు నిరుపయోగంగా సీసీ కెమెరాలు హైకోర్టు ఆదేశాలు పట్టని ప్రభుత్వం -
నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు
డీఆర్ఓ సీతారామ మూర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మే 2025 డిపార్ట్మెంటల్ పరీక్షలు ఆదివారం నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించనున్నట్టు డీఆర్ఓ సీతారామమూర్తి తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్థానిక రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లో ఈ పరీక్షలకు సుమారు 3,771 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతాయన్నారు. కన్వెన్షనల్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ సూచించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచి కేంద్రంలోకి అనుమతించాలని, కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయాలని అర్బన్ తహసీల్దార్‌ను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంప్ తదితర చర్యలు చేపట్టాలని, పోలీసు భద్రత పటిష్టంగా పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎం.బాబర్, సెక్షన్ ఆఫీసర్ సీహెచ్ యోగేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సీబీటీ హెల్ప్‌లైన్ ఏర్పాటు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఎయిడెడ్ స్కూలుకు సంబంధించి ఆదివారం జరగనున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు హెల్ప్‌లైన్ కేటాయించినట్లు డీఈఓ కె.వాసుదేవరావు శనివారం తెలిపారు. అభ్యర్థులు సమాచారం కోసం హెల్ప్‌లైన్ 83091 77952 నంబర్లో సంప్రదించి ఉదయం 8.00 గంటలోపు సమాచారం తెలుసుకుని పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలలో విద్యుత్ బిల్లుల వసూలు కౌంటర్లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ పనిచేస్తాయని ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్‌కుమార్ శనివారం తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిల్లులు చెల్లించాలన్నారు. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలతో పాటు, ఏపీ ఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్ లలో కూడా బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు. -
లిటిల్ బడ్స్ బర్త్‌డే.. ట్రెండీగా!
నెలకో పండగ.. ఏడాదికో ఉత్సవంఒక మధుర జ్ఞాపకం ప్రస్తుతం పిల్లల పుట్టిన రోజులు నెలవారీగా చేస్తూ ఫొటోలు తీయడం సంప్రదాయంగా మారింది. ఈ ఫోటోలు వారి శారీరక వృద్ధి, హావభావాలు, వ్యక్తిత్వ వికాసాలను నెలనెలా చిత్రీకరిస్తూ.. వా ప్రగతిని కళ్లకు కడతాయి. ఇది కేవలం వయసు పెరిగిన రోజు కాదని, వారి బాల్యంలో అమూల్యమైన క్షణాలను పదిలం చేస్తాయి. – బి.హేమ, సైంటిస్ట్, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్: ఏ ఇంట అయినా క్యార్మని శబ్దం ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురుచూడని దంపతులు ఉండరు. ఆ రోజు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ. అది ఫలించిన నాడు ఆ ఇంట అంతకు మించిన పండగ ఏముంటుంది. ఆ బిడ్డ పెరుగుదలలో ప్రతి అంకం ఆ ఇంట ఓ ఉత్సవమై అలరారుతుంది. గత తరాల అమ్మమ్మల సంప్రదాయం.. నేటి అమ్మల ట్రెండీనెస్ కలగలసి బుజ్జాయిల పుట్టిన రోజులు థీమ్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి. గత తరాల అమ్మమ్మలు శిశువు రెండో నెలలో నవ్వితే నువ్వుండలు చేసి పంచడం.. మూడో నెలలో బోర్లా పడితే బొబ్బట్లు చేసి సందడి చేయడం.. ఆరో నెలలో పాకడం మొదలుపెట్టగానే పరమాన్నం వండి నోరు తీపిచేయడం.. ఏడో నెల గడప దాటితే గారెలు వంటి సరదాగా దండ వేసి పంచడం.. పదో నెలలో అడుగులేస్తుంటే అరిసెలు వండడం.. అందరికీ తెలిసిందే. నేటికీ చాలా ఇళ్లలో ఈ సందడి కనిపిస్తున్నా వీటికి అదనంగా ప్రతి నెలా పుట్టినరోజు చేస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అదికూడా ట్రెండీగా. ఏడాది పాటు ప్రతి నెలా ఒక్కో థీమ్‌తో పుట్టిన రోజును చేస్తున్నారు. ఆ పన్నెండు నెలల జ్ఞాపకాలను ఫొటో ఫ్రేమ్‌లు, వీడియోల రూపంలో క్రోడీకరించి మొదటి ఏడాది పుట్టినరోజును వైభవంగా నిర్వహిస్తూ బంధుమిత్రులకు చూపి, సోషల్ మీడియాలో పోస్టుచేసి లైక్‌లకు, కామెంట్లకు మురిసిపోతున్నారు. నయా బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. సరికొత్తగా అలంకరణ విభిన్న థీమ్‌లతో నిర్వహణ ఏడాది పొడవునా సంబరాలు అదో మధురానుభూతి ఏడాదికి ఓ బర్త్‌డే నుంచి నెలనెలా వేడుకలు జరుపుకోవడం కొత్త ట్రెండ్. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు అభిరామ్‌కు నెలనెలా కొత్త బట్టలతో అలంకరించి పండ్లు, స్వీట్లు, చాక్లెట్స్‌తో అలంకరించాం. ఇప్పుడు చిన్నవాడు అనిరుథ్‌కు కూడా అలాగే చేస్తున్నాం. ఇది వారి జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రతి నెల ఫొటోలను భద్రంగా ఉంచి, ఏడాది పూర్తయిన తరువాత అన్నీ కలిపి ఫ్రేమ్ చేయించి ఇంటిలో పెట్టుకుంటాం. – అడ్డాల ఇందుమాధురి, గృహిణి, బొమ్మూరు కలకాలం గుర్తుండాలని... బర్త్‌డేకి ఏడాది వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెలనెలా ఒక్కో థీమ్‌తో మా పాపను రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే తను కూడా సంబరపడుతుంది. ఒకప్పుడంటే కెమెరామన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే చాలా లైక్‌లు, కామెంటు వస్తున్నాయి. – వలవల దేదీప్య, గృహిణి, మోరంపూడి ప్రతి నెలా పండగే మా గారాలపట్టి యశశ్వి పుట్టినరోజును ప్రతి నెలా ఓ వేడుకలా చేసుకుంటున్నాం. కుటుంబసభ్యులంతా కలిసి సందడి చేస్తాం. పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. ప్రతినెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు తీసుకుంటాం. ఏడాది పాటు ఈ ఫొటోలను భద్రపరచి ప్రదర్శిస్తాం. – సుకీర్తి, సచివాలయ ఉద్యోగి, నగరం -
వేతన సవరణకు సానుకూలం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్ర పేపర్‌మిల్లులో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు వేతన సవరణపై మిల్లు యాజమాన్యం సానుకూలంగా స్పందించడం కార్మికుల విజయమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ మిల్లు యాజమాన్య వైఖరి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను చేపట్టిన ఆందోళన వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ.. పూర్తిగా కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. శాశ్వత ఉద్యోగులకు మంచి చేస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్ల సాధనలో పోరాటం కొనసాగుతుందన్నారు. కార్మికుల పక్షాన పోరాడేందుకు జక్కంపూడి కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వాస్తవానికి గతంలో జరిగిన వేతన ఒప్పందాల కంటే ఇది గొప్పగా లేకపోయినా, పరిశ్రమ మేలు కోరుకునే వారిగా కార్మికులే కొంతమేర రాజీపడి యాజమాన్యంతో జరిగిన వేతన సవరణ చర్చలలో తమ అంగీకారాన్ని తెలిపారన్నారు. కేవలం తాము పని చేస్తున్న పరిశ్రమ బాగుండాలనే ఏకై క లక్ష్యంతో యాజమాన్యం మొండి వైఖరిని భరించి సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలని వేచి చూసి తమ విజ్ఞత చాటుకున్నారని అభినందించారు. వేతన సవరణ విషయంలో సహకరించిన కార్మిక నేతలకు, అధికారులకు, భాగస్వాములైన వారికి రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఇది పేపర్ మిల్లు కార్మికుల విజయం వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా -
పీ–ఫోర్.. శ్రీమంతులు పరార్
మార్గదర్శకులు ముందుకు రావాలి పి–4 కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించే దిశగా సమష్టి కృషి జరుగుతోంది. జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారు, విద్యా వంతులు, పారిశ్రామిక వేత్తలు మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకురావాలి. ఒక వ్యక్తి అనేక కుటుంబాలకు దరఖాస్తు చేస్తే ఆ కుటుంబాలకు దీర్ఘకాలిక మద్దతుదారుగా నిలుస్తారు. ఉపాధి, విద్య, ఆరోగ్య పరిస్థితులపై స్వావలంబన దిశగా అడుగులు పడతాయి. జిల్లాలో 489 గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వే ద్వారా గుర్తించాం. ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి, సమాజంలో మెరుగైన ఆర్థికస్థితిలో ఉన్న వ్యక్తులు ఒకరిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. సామాజిక చైతన్యం, స్పృహ కలిగి ఉండే కార్యక్రమం ఇది. – పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు సంపన్నుల వెంట పడుతున్నారు. జీరో పేదరికమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తామని కూటమి సర్కార్ గొప్ప గా ప్రకటించింది. ఇందుకోసం విజయవాడలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల నుంచి బంగారు కుటుంబాల పేరుతో పెద్ద ఎత్తున జనాన్ని బస్సుల్లో తరలించి హడావిడి చేసింది. అలా అని ఆ బాధ్యతను ప్రభుత్వం మీద వేసుకోవడం లేదు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువచ్చే బాధ్యతను సంపన్నులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారికి మార్గదర్శులనే నామకరణం చేసింది. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగి ఎన్జీఓలకు అప్పగించడమేనని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ముందుకురాని మార్గదర్శకులు పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కార్ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాల ఎంపిక చేశారు. తీరా చూస్తే ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతటితో ఆగకుండా సంపన్నుల్లో స్ఫూర్తి నింపేందుకు జిల్లా కలెక్టర్లు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అయినా ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ తప్పడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 ‘ఆదిలోనే హంసపాదు’ అన్న సామెత చందంగా తయారై ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం లేకనో మరేమిటో కారణం తెలియదు కానీ చంద్రబాబు చెబుతున్నట్టుగా ఆశించిన స్థాయిలో సంపన్నులు (మార్గదర్శులు) ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల అన్వేషణలో పడ్డారు. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తుది జాబితా కోసం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సర్వేలలో తలమునకలై ఉన్నారు. ఉదాహరణకు కాకినాడ జిల్లా యంత్రాంగం పారిశ్రామిక సంస్థలు, విభిన్న సంపన్న వర్గాలను మార్గదర్శకులుగా అభ్యర్థిస్తూ 80 లేఖలు రాశారని సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లోను కొద్ది అటు, ఇటుగా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఈ సరికే చారిటీలతో పేదలకు సేవలందిస్తున్నామని కొందరు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌తో సేవలు చేస్తున్నామని మరి కొందరు, నిరుపేదలను ఆదుకుంటున్నామని ఇంకొందరు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులకు గుదిబండ పేదల్లో నిరుపేదల ఎంపిక పేరుతో బంగారు కుటుంబాల సంఖ్య కుదించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రవాస భారతీయులు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్.. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ పథకాల నుంచి పేదలు లబ్ధి పొందితే ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉండదు. పీ–4లో సంపన్నుల నుంచి సాయం అందితే పేదలను వారి చెప్పుచేతల్లో పెట్టడమేనని అ భిప్రాయపడుతున్నారు. పీ–4 కోసం సంపన్నుల గుర్తింపు పెద్ద ప్రహసనంగా తయారై మండల స్థాయిలో అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది. 57 వేల బంగారు కుటుంబాల గుర్తింపు తూర్పుగోదావరి జిల్లాలో 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వేలో గుర్తించారు. ఇందులో 1,226 మార్గదర్శకులకు 12,500 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం రాత్రి సీఎం నిర్వహించిన వీడియోకాన్ఫ్రెన్స్లో నివేదించారు. కలెక్టర్ మలకపల్లి గ్రామానికి చెందిన సనమండ్ర పోసిబాబు కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు వీసీలో వివరించారు. -
నైతిక స్థైర్యంపై దాడులు
బదిలీ చేశారు సరే... కారణం ఏదైనా నార్త్,సౌత్ స్టేషన్ల సిబ్బందిని బదిలీ అయితే చేసేశారు. కొత్తగా ఇక్కడకు సిబ్బందిని తీసుకురానున్నారు. అయితే పూర్తిస్థాయిలో సిబ్బందిని తీసుకువస్తారా..ఇప్పుడున్న అరకొర సిబ్బందితోనే ఎకై ్సజ్ స్టేషన్లను నడిపిస్తారా అన్నది వేచి చూడాలి.● కూటమి నేతల మాట కాదన్నందుకు బదిలీలు ● రెండు ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బంది ఒకేసారి మార్పు రాజమహేంద్రవరం రూరల్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోమని ఆదేశించేది వారే...తీరా చట్టాన్ని అమలు చేస్తే కక్ష సాధింపు చర్యలకు దిగేది వారే అన్నట్టుగా తయారైంది కూటమి నాయకుల తీరు. రాజ్యాంగ వ్యవస్థలు, పాలనా పరిస్థితులు, ప్రజాప్రయోజనాలు వంటివి పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అన్నరీతిలో అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఉద్యోగులు నైతిక స్థైరాన్ని దెబ్బతీసే రీతిలో వీరు పేట్రేగుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రెండు ఎకై ్సజ్ స్టేషన్లలో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేసి తాము అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్నే పాటించాలని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కూటమి నాయకుల అధికార దుర్వినియోగానికి బలైన రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సౌత్, నార్త్ స్టేషన్ల సిబ్బంది మౌనంగా ఇబ్బంది పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కఠినంగా వ్యవహరించినందుకేనా? రాజమహేంద్రవరం ఎకై ్సజ్ నార్త్, సౌత్ స్టేషన్లలో సిబ్బంది మొత్తాన్ని గురువారం బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. నవోదయ 2.0 కింద సారాను అరికట్టడంలో రెండు స్టేషన్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ బదిలీకి కారణంగా చూపారు. అయితే వాస్తవ కారణం ఈ సిబ్బంది టీడీపీ, జనసేన నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించడమేనని చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల నార్ట్ స్టేషన్ పరిధిలో ఒక టీడీపీ నాయకుడి సోదరుడిని అరెస్టు చేయడంతో అతను స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. దీనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సౌత్ స్టేషన్ పరిధిలో శ్రీరామపురం గ్రామానికి చెందిన జనసేన నాయకుడిని సారా కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు స్టేషన్ల సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయించినట్లుగా ఉద్యోగ వర్గాల్లో ముమ్మరంగా చర్చ నడుస్తోంది. నిజాయితీగా పనిచేసినా.. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం నార్త్, సౌత్స్టేషన్ల పరిధిలో 52 మద్యం షాపులు ఉన్నాయి. రెండు స్టేషన్ల పరిధిలో 400 మందికి పైగా విఽవిధ కేసులలో ముద్దాయిలు ఉన్నారు. ఈ రెండు స్టేషన్లలోనూ కలిపి 15 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. మద్యం షాపులపై పర్యవేక్షణ, కోర్టు పనులు, సారా నియంత్రణ చర్యలు, మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం తదితర విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా సర్వీసు రిజిస్టరు నిబంధనల ప్రకారం రెండు స్టేషన్లలో 30మందికి పైగా సిబ్బంది ఉండాలి. కానీ ఏళ్ల తరబడి సగం మందితోనే ఇక్కడ కథ నడిపిస్తున్నారు. ఇవి కాకుండా గోదావరిలంకలు, రాజానగరం తదితర ప్రాంతాల్లో రెండువందలకు పైగా సారాబట్టీలు ఉన్నట్లు సమాచారం. ప్రతిరోజూ చేయాల్సిన పనులు చేస్తూనే అటు సారా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. వాస్తవంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా చిట్టడవులను తలపించే తోటల మధ్యలోకి వెళ్లి సారాబట్టీలను నిర్మూలించడం ఈ అరకొర సిబ్బందితో సాధ్యం కాదన్నది ఉద్యోగ వర్గాల మాట. అందుకే సారా తయారీ నియంత్రణలో విఫలమయ్యారనే కారణంతో వీరిపై బదిలీ వేటు వేయడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. అయితే ఏళ్లతరబడి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడే బదిలీ వేటు చేయడం వెనుక టీడీపీ, జనసేన నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. -
అతివృష్టి.. వరికి నష్టి
ఆక్రమణలు తొలగించాలి కొవ్వాడ కాలువ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైంది. దీనికితోడు క్లోజర్ పనులు సక్రమంగా చేపట్టలేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. కాలువల్లో గుర్రపుడెక్క తొలగించకపోవడం, పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కాలువ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు ముంపునకు గురువుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి పంట పొలాలు కాపాడండి దారవరం స్లూయిజ్ నుంచి నీటి ప్రవాహం ముందుకు సాగకపోవడంతో పేమల కాలువ, దారవరం మడుగు పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. పంట పొలాలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – మద్దుకూరి రవిప్రసాద్, దారవరం సర్పంచ్సాక్షి, రాజమహేంద్రవరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వ్యవసాయాన్ని కకావికలం చేస్తోంది. వర్షం నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. స్వేదం చిందించి చేపట్టిన నాట్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో కాలువలు పొంగిపొర్లుతుండగా.. పలు ప్రాంతాల్లో వరి పొలాలు నీటి మునుగుతున్నాయి. మరోవైపు కొవ్వాడ, అప్పారావు చానల్ నీరు దిగువకు వెళ్లకపోవడంతో ఆ కాలువల పరిధిలో పంట పొలాల్లోకి నీరు చేసి వరినాట్లు నేలకొరుగుతున్నాయి. వెరసి రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇప్పటికే పంట సాగుకు అప్పులు చేశామని.. పొలాలను నీరు ముంచెత్తుతుండటంతో మరోమారు నాట్లు వేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 2వేల ఎకరాల్లో నీట మునిగిన వరి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,941 హెక్టార్లు కాగా.. ఈ నెల 21వ తేదీ నాటికి 55,021 హెక్టార్లలో నాట్లు పడ్డాయి. మిగిలిన విస్తీర్ణంలో నాట్ల వేయడానికి వర్షం కాస్త తెరపిస్తే అనువుగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 1,236 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుమారు 2 వేల ఎకరాలకు పైగా నీట మునిగినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 28వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉంది. ఎకరానికి రూ.15 వేల చొప్పున నష్టం రైతులు అప్పులు చేసి మరీ వరి సాగు చేపట్టారు. నారుమళ్ల దశ దాటి నాట్ల వరకు వచ్చింది. ఎకరం పొలానికి నాట్లు వేయాలంటే సుమారు రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రెండు వేల ఎకరాల్లో నాట్లు మునిగిపోవడంతో రైతులకు ఇప్పటికే సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాట్లు దెబ్బతిన్న స్థానంలో తిరిగి వేయాలంటే మరో రూ.5 వేలు వెచ్చించాల్సి ఉంది. దీనికిగాను మరో రూ.కోటి వెచ్చించాలి. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక.. అన్నదాత సుఖీభవ నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ముంపు పరిణామం ఆర్థిక అవస్థలు తెచ్చిపెడుతోంది. నామమాత్రపు పూడికతీతతో ముంపు విజ్జేశ్వరం బ్యారేజీ నుంచి నీరు రిజర్వ్ చేసి అప్పారావు చానల్ ద్వారా ఏలూరు కెనాల్‌కు పంపుతారు. 5,000 క్యూసెక్కుల నీటి సరఫరా సామర్థ్యం ఉన్న కెనాల్ నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని పంపడంతో తమ పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏలూరు కెనాల్ గట్లు 5వేల క్యూసెక్కుల నీటిని పంపేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 8 వేల క్యూసెక్కులు పంపాలంటే గట్లకు మరమ్మతులు చేపట్టాలి. కాలువలో పూడికతీత, గుర్రపు డెక్క తొలగించాలి. క్లోజర్ పనులు దక్కించుకున్న ఓ టీడీపీ నేత తూతూ మంత్రంగా పనులు కానిచ్చేసి చేతులు దులుపుకున్నారు. గుర్రపుడెక్క అలాగే ఉండిపోయింది. పూడికతీత పనులు సైతం నామమాత్రంగా చేపట్టడంతో ముంపు సమస్య తలెత్తిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డెక్కిన రైతులు ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ ఇటీవల కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం దారవరం, బ్రాహ్మణగూడెం, గరప్పాడు, మార్కొండపాడు, సమిశ్రగూడెం, ఎస్.ముప్పవరం గ్రామ రైతులు శెట్టిపేట ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అప్పారావు చానల్‌ను ఆనుకొని ఉన్న భూములు నారుమడి దశ నుంచి ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు తమ పంట పొలాల్లో ఉండిపోవడంతో తాము పంట నష్టపోతున్నామని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు అంటున్నారు. దారవరం మడుగు నుంచి నేరుగా నీటి ప్రవాహం తూరలు లేదా, ప్రత్యేక డ్రెయిన్ ఏర్పాటు చేసి నిడదవోలు మండలం శెట్టిపేట లాకుల వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో కలిసేలా ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభ్యమవుతుందని రైతులు అంటున్నారు. లేకపోతే దారవరం లాకుల వద్ద లిఫ్ట్ పద్ధతిలో నీటిని అప్పారావు చానెల్‌కు తరలించాలని కోరుతున్నారు. పంట పొలాలను ముంచెత్తిన వరద కొవ్వాడ, అప్పారావు చానల్ నుంచి నీటి విడుదల తూర్పుగోదావరి జిల్లాలో 2వేలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన వరి ఎకరానికి రూ.15 వేల వరకు నష్టం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రభావం లబోదిబోమంటున్న రైతులు.. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళనముంపులోనే పంట పొలాలు కొవ్వాడ, అప్పారావు కాలువల వరద నీరు పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో కలవాల్సి ఉంది. డెల్టా కాలువకు నీరు విడుదల చేస్తుండటంతో ఈ రెండు కాలువల నుంచి వచ్చే నీరు పశ్చిమ డెల్టా కాలువలో కలవడం లేదు. దీంతో వరద నీరు వెనక్కి పోటెత్తి వందలాది ఎకరాలను ముంచెత్తుతోంది. ఈ ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల రైతులపై పడుతోంది. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. పంట పొలాలు ముంపులో ఉండటంతో కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. దారవరం, బ్రాహ్మణగూడెం, మార్కొండపాడు, మల్లవరం, గౌరిపల్లి, చంద్రవరం గ్రామాల పరిధిలో పొలాలకు నీటి ముప్పు తప్పడం లేదు. నిడదవోలు మండలం శెట్టిపేట, సింగవరం ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల భూముల్లోకి నీరు చేరింది. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పంటలు నీట మునిగాయి. కొవ్వూరు మండలం ఆరికరేవుల, నందమూరు, దొమ్మేరు, పసివేదల, ధర్మవరం తదితర లోతట్టు ప్రాంత భూములు ముంపు బారిన పడ్డాయి. అధికారుల లెక్కల ప్రకారం కొవ్వూరు మండలంలో 113 ఎకరాలు, నిడదవోలు మండలంలో 197 ఎకరాలు, పెరవలిలో 25 ఎకరాలు ముంపు బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇదిలా ఉంటే.. కానూరు అగ్రహారంలో 150, ఊసులుమర్రు 150 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు రైతులు వెల్లడిస్తున్నారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
● సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ ● రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాపూజీ ముమ్మిడివరం: ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. ముమ్మిడివరం డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన జిల్లా ఉద్యోగుల సంఘ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఉద్యోగులను ఐక్యం చేసి ముందుకు సాగుతామన్నారు. జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాలలో సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని బాపూజీ వాపోయారు. సెలవు దినాలలో కూడా ఉద్యోగులతో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. ఫీల్డ్ వర్కు పేరుతో నిర్బంధించి పని చేయించడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మల్లిబాబు మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలో జరిగే ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి పిలుపు ఇస్తామన్నారు. జిల్లా అఽసోసియేట్ అధ్యక్షుడు కె.వీరబాబు, జిల్లా కోశాధికారి ఎస్.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముమ్మిడివరం తాలూకా కమిటీ నియామకం జరిగింది. తాలూకా అధ్యక్షుడిగా జీఎస్వీడీ ప్రసాద్, కార్యదర్శిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.నూకరత్నం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పూజ, టి.సుజాత, డి.సువర్ణరాజు, ఎం.స్టీవెన్, కోశాధికారి డి.మహేష్, సహయ కార్యదర్శులుగా ఎం.రమేష్, సీహెచ్ లలిత, నియమితులయ్యారు. -
28 నుంచి ఎంపీడీఓలకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 28 నుంచి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన 89 మందికి శిక్షణ ఇస్తున్నట్లు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మొదటి బ్యాచ్‌లో 46 మంది ఎంపీడీఓలు హాజరవుతారన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తియిన తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ఉంటుందన్నారు. -
మహిళను రక్షించిన పోలీసులు
తాళ్లపూడి (కొవ్వూరు): స్థానిక రోడ్ కం రైల్వే వంతెన పైనుండి గోదావరిలో దూకబోయిన మహిళను పట్టణ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే. కొయ్యలగూడెం మండలానికి చెందిన సుమారు 30 ఏళ్ల మహిళ తన కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం కొవ్వూరులోని రోడ్ కం రైల్వే వంతెన పైకి వచ్చింది. అటుగా ఆటోలో వెళ్తున్న శ్రీనివాస్ అను వ్యక్తి ఆ మహిళను గమనించి, 112 ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం వెంటనే కొవ్వూరు టౌన్ సిబ్బంది ఎంవీవీ సత్యనారాయణను స్థలానికి పంపారు. దీంతో ఆ మహిళను గుర్తించి, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని, పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె బంధువులకు అప్పగించారు.