టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావుపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఎర్రబెల్లి స్వల్పంగా గాయపడ్డారు.
వరంగల్ : టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావుపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఎర్రబెల్లి స్వల్పంగా గాయపడ్డారు. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం రాయపర్తి మండలం రాగన్నగూడెంలో పర్యటించారు. అయితే ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయటంతో ప్రచారంలో ఉన్న నేతలు పరుగు అందుకున్నారు. ఈ సందర్భంగా కొందరు తేనెటీగల బారిన పడ్డారు.