తారలు దిగివచ్చే వేళ.. | elections campaign in film stars | Sakshi
Sakshi News home page

తారలు దిగివచ్చే వేళ..

Published Mon, Apr 21 2014 7:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

జయప్రద, జయసుధ,విజయశాంతి - Sakshi

జయప్రద, జయసుధ,విజయశాంతి

విజయశాంతి, జయసుధ, జయప్రద రాక
పొన్నాల ఇలాకాలో ప్రచారం
22, 23, 28వ తేదీల్లో పర్యటన

 

జనగామ, న్యూస్‌లైన్ :జనగామ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కనువిందుగా మారనుంది. కాంగ్రెస్‌లో జనాకర్షణ నేత లేకపోవడంతో సినీ తారలను రంగంలోకి దింపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సైతం ప్రచారంలో పాల్గొననున్నారు.

 ఇదీ షెడ్యూల్
 ఈనెల 22న మద్దూరు మండలంలో పర్యటన కు పొన్నాల వెంట కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ ఎం.కోదండరెడ్డితోపాటు, మాజీ ఎంపీ, సినీతా ర విజయశాంతి రానున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 10.45 గంటల వరకు మద్దూ రు చేరుకుంటారు. బహిరంగసభ, రోడ్ షోల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.

ఈనెల 23న పొన్నాలతో పార్టీ స్టార్ క్యాంపైనర్ ఎం.కోదండరెడ్డి, సినీతార, మాజీ ఎమ్మెల్యే జయసుధ రానున్నారు. ఉదయం 10 గంటలకు బేగంపేట లో బయలుదేరి 10.40 గంటల వరకు బచ్చన్నపేట పట్టణానికి చేరుకుంటారు. అక్కడ ప్రచా రం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి ఒంటిగంట వరకు నర్మెట చేరుకుంటారు. ఇక్కడ ప్రచారం ముగియగానే సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు.

తదుపరి ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఈనెల 28న పొన్నాల వెంట మాజీ ఎంపీ జయప్రద కూడా రానున్నా రు. ఉదయం 10.40 వరకు జనగామకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభ ప్రచార కార్యక్రమాలు చేపడుతారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారులకు సమాచారం అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement