'తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే' | Congress party form Government in Telangana, says Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే'

Published Sat, May 3 2014 1:50 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే' - Sakshi

'తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే'

తెలంగాణలో తమ పార్టీ గెలుపు తథ్యమని, అందులో ఎటువంటి సందేహం లేదని టీ.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్సష్టం చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదే అని బల్లగుద్దీ మరి చెప్పారు. శనివారం హైదరాబాద్లో మాజీ మంత్రి దానం నాగేందర్తో కలసి పొన్నాల విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన ఆరోపించారు. సొంత అభ్యర్థులు లేని పార్టీ గెలుస్తుందా అంటూ పొన్నాల ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే మొత్తం 16 సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని నాగేందర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉందనేది అవాస్తవమని అన్నారు. ఇతర పార్టీల ప్రకటనలు మాటల వరకే పరిమిత మంటూ ఆ పార్టీ నాయకులను ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement