గట్టి పోటీ ఇచ్చాం
ఓడినా బెదిరేది లేదు: పొన్నాల
హైదరాబాద్: ఉపఎన్నికల్లో కాం గ్రెస్ ఓడిపోయినం త మాత్రాన భయపడేది లేదని, ప్రభు త్వ వైఫల్యాలపై పోరాడేందుకు వెనుకాడబోమని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం గాంధీభవన్‌లో పొన్నాల మీడియాతో మాట్లాడుతూ ప్రజలతీర్పును గౌరవిస్తున్నామని చెప్పా రు. ‘సాధారణ ఎన్నికలప్పుడు రాష్ట్రపతి పాలన ఉంది. పైగా అప్పుడు ఒం టరిగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు మాత్రం ఎంఐఎం, సీపీఐ, సీపీఎంలు సహకరించాయి. దీనికితోడు అధికార, అంగ, అర్థబలంతో ముందుకు వెళ్లారు. బీజేపీకి టీడీపీ, మాదిగదండోరా మద్దతు ఇచ్చా యి.
కాంగ్రెస్ మాత్రమే ఈసారి ఒంటరిగా పోటీ చేసింది. అయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చామనే సంతృప్తి ఉంది’ అని పేర్కొన్నారు. ఉపఎన్నికల ఫలితాలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగితే ‘నేనే బాధ్యత వహిస్తున్నా. నా పదవి విషయంలో హైకమాండ్ ఏ విధంగా ఆదేశిస్తే అందుకు అనుగుణంగా నడుచుకుంటా’ అని చెప్పారు. పొన్నాల అతిగా వ్యవహరించినా జనం నమ్మలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావించగా కేసీఆర్ నియంత లా మాట్లాడుతున్నారని, ఆయన యాస, భాష ఇంకా మారలేదని ఆరోపించారు.