T.PCC Chief
-
'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం'
హైదరాబాద్: మెదక్ లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నిలలో అభ్యర్థిగా బరిలోకి దిగాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఆశించినప్పటికీ... బలమైన అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపుతున్నామని టీ.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో సునీత లక్ష్మారెడ్డికి పార్టీ భీ ఫారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో సునీత తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ద్వారా టీఆర్ఎస్కు ప్రజలే గుణపాఠం చెబుతారని చెప్పారు. -
ప్రజల ఆశలు ఆకాశంలో... టీఆర్ఎస్ ఆలోచనలు ...
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటులో ఆమె ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం ప్రారంభమైన టి. కాంగ్రెస్ భవిష్యత్తు కార్యాచరణ సదస్సులో పొన్నాల ప్రసంగించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. బంగారు తెలంగాణకు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు. దాన్ని కొనసాగించాలనే కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. అయితే ఎన్నికల్ల నేపథ్యంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఆ పార్టీని గెలిపించారన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాశంలో ఉండగా... టీఆర్ఎస్ ఆలోచనలు పాతాళంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమని ఆయన గుర్తు చేశారు. త్వరలో జరగనున్న మెదక్ ఉప ఎన్నికలతోపాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలకు పొన్నాల విజ్ఞప్తి చేశారు. -
'పీసీసీ చీఫ్ పదవి ఆశించడం లేదు'
-
'పీసీసీ చీఫ్ పదవి ఆశించడం లేదు'
న్యూఢిల్లీ: తాను పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడం లేదని తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... పీసీసీ అధ్యక్షుణ్ని అధిష్టానం మార్చాలనుకుంటే సలహాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల సందర్భాను సారంగా మాట్లాడలేకపోతున్నారని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మేధోమథనం సదస్సు ఎప్పుడనేది పొన్నాల తనతో చెప్పలేదని అన్నారు. అలాగే నిన్న ప్రకటించిన సీఎల్పీ కమిటీ ఏర్పాటుపై కూడా తాను పొన్నాలతో చర్చించలేదని తెలిపారు. పీఏసీ ఛైర్మన్ ఎవరనేది తానే నిర్ణయిస్తానని జానారెడ్డి వెల్లడించారు. -
పొన్నాల వెంటనే రాజీనామా చేయాలి: కోమటిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పార్టీని సమీక్షించే అర్హత లేదని అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన పార్టీని ఎలా సమీక్షిస్తారని ప్రశ్నించారు. పీసీసీ సమీక్షా సమావేశాలతో ఒరిగేదేమీ లేదని తెలిపారు. పొన్నాల వెంటనే రాజీనామా చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్బంగా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని తాము తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. -
'తెలంగాణలో తొలి ప్రభుత్వం మాదే'
తెలంగాణలో తమ పార్టీ గెలుపు తథ్యమని, అందులో ఎటువంటి సందేహం లేదని టీ.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్సష్టం చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదే అని బల్లగుద్దీ మరి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి దానం నాగేందర్‌తో కలసి పొన్నాల విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆయన ఆరోపించారు. సొంత అభ్యర్థులు లేని పార్టీ గెలుస్తుందా అంటూ పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే మొత్తం 16 సీట్లు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని నాగేందర్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉందనేది అవాస్తవమని అన్నారు. ఇతర పార్టీల ప్రకటనలు మాటల వరకే పరిమిత మంటూ ఆ పార్టీ నాయకులను ఎద్దేవా చేశారు.