ప్రజల ఆశలు ఆకాశంలో... టీఆర్ఎస్ ఆలోచనలు ... | Telangana dream come true with sonia gandhi, says Ponnala Lakshmaiah | Sakshi
Sakshi News home page

ప్రజల ఆశలు ఆకాశంలో... టీఆర్ఎస్ ఆలోచనలు ...

Published Sun, Aug 24 2014 12:41 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ప్రజల ఆశలు ఆకాశంలో... టీఆర్ఎస్ ఆలోచనలు ... - Sakshi

ప్రజల ఆశలు ఆకాశంలో... టీఆర్ఎస్ ఆలోచనలు ...

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటులో ఆమె ఎన్నో కష్టాలు పడ్డారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో ఆదివారం ప్రారంభమైన టి. కాంగ్రెస్ భవిష్యత్తు కార్యాచరణ సదస్సులో పొన్నాల ప్రసంగించారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. బంగారు తెలంగాణకు పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు. దాన్ని కొనసాగించాలనే కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు.

అయితే ఎన్నికల్ల నేపథ్యంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఆ పార్టీని గెలిపించారన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆకాశంలో ఉండగా... టీఆర్ఎస్ ఆలోచనలు పాతాళంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమని ఆయన గుర్తు చేశారు. త్వరలో జరగనున్న మెదక్ ఉప ఎన్నికలతోపాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలతోపాటు కార్యకర్తలకు పొన్నాల విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement