- ‘తెలంగాణ తల్లి’ అన్న నినాదంతో కార్యక్రమాలు
- 9న రైతు సదస్సు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల ఆకాం క్షను తీర్చినందుకు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఈ నెల 9న వాడవాడలా, ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయిం చింది.
‘తెలంగాణ తల్లి సోనియా’ అన్న నినాదంతో కృతజ్ఞత సభలు జరపాలని బుధవారం గాంధీభవన్‌లో జరి గిన టీపీసీసీ కార్యవర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశ వివరాలను టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విలేకరులకు వివరించారు. గాంధీభవన్‌లో 9న రైతు సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7.50 లక్షల సభ్యత్వాలను పూర్తి చేశామన్నారు.
అత్యవసర సమావేశాలంటూ హడావుడి ఎందుకు..: టీపీసీసీ కార్యవర్గానికి తెలియజేయకుండా ముఖ్యమైన సమావేశాలంటూ హడావుడిగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని పొన్నాలను ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ ప్రశ్నిం చినట్లు సమాచారం. మరో నేత ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభిప్రాయం మేరకు ఇక ముందు అలా జరగకుండా చూసుకుందామన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది.